
సాక్షి, గుంటూరు/మంగళగిరి: గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఓ వివాహానికి హాజరైన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) గాయపడ్డారు. వధూవరులను ఆశీర్వదించేందుకు స్టేజీపైకి వెళ్లిన ఆర్కేతో కరచాలనం కోసం స్థానికులు కూడా వేదికపైకి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా వేదిక కూలిపోయింది. ఘటనలో ఎమ్మెల్యే కాలికి గాయమైంది. వెంటనే గుంటూరు అరండల్‌పేటలోని సాయిభాస్కర్ ఆస్పత్రికి తరలించారు. మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆర్కేను కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి తదితరులు పరామర్శించారు. (జగన్ ప్రభుత్వం నిర్ణయాన్ని అభినందిస్తున్నా: పవన్ కళ్యాణ్)
Comments
Please login to add a commentAdd a comment