
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఇటీవల ఇంట్లో వ్యాయామం చేస్తున్న సమయంలో ఆయన కుడికాలుకు గాయం అయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మళ్లీ వాపు రావటంతో వైద్యుల సలహా మేరకు ఆస్పత్రికి వెళ్లారు.
ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యనిపుణులు డాక్టర్ అనిల్‌కుమార్, మణిపాల్ ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో సీఎం జగన్‌కు సాధారణ వైద్యపరీక్షలు, స్కానింగ్ నిర్వహించారు. అనంతరం ఆయన తాడేపల్లిలోని ఇంటికి చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment