World Famous Motivational Speaker Nick Vujicic Meet CM Jagan, Details Inside - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్‌ స్పీకర్‌ నిక్‌ వుజిసిక్‌

Published Wed, Feb 1 2023 5:48 PM | Last Updated on Wed, Feb 1 2023 7:08 PM

World Famous Motivational Speaker Nick Vujicic Meet CM Jagan - Sakshi

సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్‌ స్పీకర్‌ నిక్‌ వుజిసిక్‌ కలిశారు. సీఎం జగన్‌ను కలవడం గౌరవంగా భావిస్తున్నానని  నిక్‌ వుజిసిక్‌ అన్నారు.

ఈ సందర్భంగా నిక్‌ ఏమన్నారంటే...:
‘‘దాదాపు ఏడెనిమిది దేశాల్లో నేను పర్యటించాను. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ లాంటి వ్యక్తిని నేను ఇంతవరకూ చూడలేదు. ఆయన అత్యున్నతమైన లక్ష్యం కోసం ఉన్నతమైన ఆశయంతో పనిచేస్తున్నారు. ఏపీలో సుమారు 45వేల ప్రభుత్వ స్కూళ్లను ఏ ప్రయివేటు స్కూళ్లకు తీసిపోనిరీతిలో అభివృద్ధి చేశారు. అందరికీ సమాన ఆవకాశాలు కల్పించాలన్న గొప్ప లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఈ రంగాల్లో ఇప్పటికే గణనీయమైన ప్రగతి కనిపిస్తోంది. ఇది అందరికీ తెలియాల్సి ఉంది’’ అని నిక్‌  అన్నారు.

‘‘ఇవాళ ఆయన్ను కలవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. నా పట్ల, నా జీవితం పట్ల మంచి అవగాహనతో స్పూర్తిదాయక వ్యక్తుల కింద నా జీవిత కథను ఆటిట్యూడ్‌ ఈజ్ ఆల్టిట్యూడ్‌ పేరుతో పదోతరగతి ఇంగ్లిషులో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు. ఇది నాకు చాలా ఆనందం కలిగించే విషయం. విద్యారంగంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించే దిశగా, మరింత మెరుగైన ఫలితాల కోసం దీర్ఘకాలిక లక్ష్యంతో పనిచేస్తున్నాను. ఇక్కడ(ఏపీలో) విద్యారంగంలో పిల్లల ఎదుగుదలకు మంచి అవకాశాలున్నాయి’’ అని ఆయన అన్నారు.

‘‘ప్రభుత్వ స్కూళ్లలో ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రపంచ స్ధాయి ప్రమాణాలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్‌ గురించి చెప్పాలంటే ఆయన హీరో. ఇంతవరకూ ఇలా ఎక్కడా జరగలేదు. సీఎం చాలా నిబద్ధత, క్రమశిక్షణ గల మనిషి’’ అని నిక్‌ వుజిసిక్‌ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌, గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు ఆర్‌.ధనుంజయ్‌రెడ్డి, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు.

చదవండి: రైతు భరోసాపై మడతలు కాదు.. చంద్రబాబుకు రామోజీ చిడతలు!! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement