world famous
-
మస్కా మజాకా!
తన ‘తప్పట్టం’ సినిమా పోస్టర్‌ను ‘వరల్డ్–ఫేమస్’ చేసినందుకు ఎలాన్ మస్క్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు తమిళ చిత్ర నిర్మాత ఆదమ్ భవా. ‘హౌ ఇంటెలిజెన్స్ వర్క్స్’ కాప్షన్‌తో డిజైన్ చేసిన మీమ్ పోస్టర్‌ను ‘ఎక్స్’లో షేర్ చేశాడు మస్క్. ఈ పోస్టర్లో ఇద్దరు నటులు కొబ్బరి నీటిని షేర్ చేసుకుంటూ కనిపిస్తారు. ఈ కొబ్బరినీటి షేరింగ్‌ను యాపిల్, ఓపెన్ ఏఐల మ«ధ్య డేటా షేరింగ్ డైనమిక్స్‌తో పోల్చుతుంది ఈ మీమ్. అంత పెద్ద ఎలాన్ మస్క్ ‘ఎక్స్’లో పోస్ట్ చేయడంతో ‘తపట్టం’ సినిమా పోస్టర్ రాత్రికి రాత్రే వైరల్ అయింది. లక్షల వ్యూస్‌తో దూసుకు పోతుంది. ఈ పోస్టర్ పుణ్యమాని యాపిల్–ఓపెన్ ఏఐ భాగస్వామ్యం గురించి చర్చ కూడా జరుగుతుంది. -
Interesting World Facts: ఆశ్చర్యం కలిగించే ప్రపంచ నిజాలు
-
11 ఏళ్లకే హల్దిరామ్స్ ఆలోచన.. ప్రపంచ స్నాక్స్ రంగాన్నే షేక్ చేసిన ఇండియన్!
సాధారణంగా ఫుడ్ కంపెనీ అనగానే చాలా మందికి డామినోస్, మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ వంటివి గుర్తుకు వస్తాయి. కానీ అలాంటి కంపెనీలకు సైతం గట్టి పోటీ ఇచ్చిన ఇండియన్ బ్రాండ్ 'హల్దీరామ్' (Haldiram) గురించి బహుశా తెలియకపోవచ్చు. ప్రపంచంలో దాదాపు 80 దేశాలలో ప్రసిద్ధి చెందిన ఈ సంస్థ గురించి.. దీనికి మూల కారకుడైన వ్యక్తి గురించి ఈ కథనంలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. 'గంగ బిషన్ అగర్వాల్' (Ganga Bishan Agarwal) 1937లో బికనీర్‌లో చిన్న స్నాక్స్ వ్యాపారంగా మొదలు పెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ రోజు కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని స్నాక్స్ ఫుడ్స్ వ్యాపారంలో రెండవ స్థానానికి చేరుకునేలా చేసాడు, అంటే దీని వెనుక ఉన్న అతని కృషి పట్టుదల స్పష్టంగా తెలుస్తాయి. నిజానికి ఒక చిన్న భుజియా దుకాణంతో ప్రారంభమైన ఆయన వ్యాపారం, కుటుంబ కలహాలు, అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఈ రోజు ప్రపంచమే గుర్తించే స్థాయికి ఎదిగింది. గంగ బిషన్ ఉరఫ్ అగర్వాల్‌ని తన తల్లి ముద్దుగా 'హల్దీరామ్' అని పిలుచుకునేది. ఆ పేరే తరువాత కంపెనీ బ్రాండ్‌గా మారింది. వీరి కుటుంబానికి చెందిన ఒక మహిళ తరచుగా బికనీరీ భుజియా తయారు చేసేదని, దాన్ని తన తల్లి ద్వారా బిషాన్ నేర్చుకున్నట్లు సమాచారం. భుజియాతో విజయం.. గంగా బిషన్ అగర్వాల్ 1919లో కేవలం 11 ఏళ్ల వయసులోనే కంపెనీ స్థాపించాలని కలలు కనేవాడు. చిన్న తనం నుంచి భుజియా తయారు చేయడం మీద ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. ఎందుకంటే ఆ సమయంలో భుజియా బాగా ప్రసిద్ధి చెందింది. అయితే వ్యాపారులు డబ్బు మీద పెట్టే ద్రుష్టి.. రుచి మీద పెట్టేవారు కాదు. కావున బిషన్ మార్కెట్లో మంచి రుచిని అందించే చిరుతిండి వ్యాపారాలను సృష్టించడానికి కంకణం కట్టుకున్నాడు. దీంతో అనేక ప్రయత్నాలు చేసి బికనీర్ ప్రజలు మునుపెన్నడూ రుచి చూడని కొత్త రకం భుజియాను రూపొందించడంలో అతను విజయం సాధించాడు. (ఇదీ చదవండి: ఒకప్పుడు రూ. 10 వేల జీతానికి ఉద్యోగం.. ఇప్పుడు కోట్ల సామ్రాజ్యం - ఒక టీచర్ కొడుకు సక్సెస్ స్టోరీ..) కలకత్తాలో దుకాణం.. మార్కెట్లో మంచి పేరు సంపాదించిన తరువాత అమ్మకాల పరంగా వేగంగా ముందుకు దూసుకెళ్లాడు. అతడు ఏడు పదుల వయసులోనూ ఊరంతా సైకిల్ మీదే తిరిగేవారట, అంతే కాకుండా ఆయన ఒకసారి కోల్‌కతాలో పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక దుకాణం ఏర్పాటు చేయాలనుకుని, అక్కడ షాప్ ప్రారంభించారు. బికనీర్‌లో కాకుండా బయట ప్రారంభించిన మొట్టమొదటి దుకాణం అదే. ఈ విధంగా క్రమక్రమంగా వృద్ధి చెందుతూ ఆయన మనవళ్లు కూడా దీని అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. (ఇదీ చదవండి: ఏసీ రైలు.. ఇండియన్స్‌ను ఎక్కనించేవారే కాదు.. తొలి ఏసీ కోచ్ ఎప్పుడు? ఎక్కడ? ఎలా మొదలైందంటే..) 80 దేశాల్లో విక్రయాలు.. భారతదేశంలో నాగపూర్, ఢిల్లీ ప్రాంతాల్లో వీరికి బ్రాంచీలు ఉన్నాయి. విదేశాల్లో కూడా దీనికి మంచి డిమాండ్ ఉంది. వీరి ఉత్పత్తులు ప్రపంచంలోని దాదాపు 80 దేశాల్లో విక్రయానికి ఉన్నట్లు సమాచారం. హల్దీరామ్ బ్రాండ్‌లో వెజ్ షమీ కెబాబ్, సోయా షమీ కెబాబ్, దహీ కెబాబ్, హరాభరా కెబాబ్లను తయారు చేసేవారు. ఆ తరువాత రసగుల్లా, సోమ్ పాపిడీ, పానీపురీ వంటివి కూడా ప్రారంభించారు. హల్దీరామ్ ప్రస్తుత చైర్మన్ మనోహర్ లాల్ అగర్వాల్. ప్రస్తుతం వీరు రూ. వేల కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ చేస్తున్నట్లు సమాచారం. -
సీఎం జగన్‌ను కలిసిన ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ కలిశారు. సీఎం జగన్‌ను కలవడం గౌరవంగా భావిస్తున్నానని నిక్ వుజిసిక్ అన్నారు. ఈ సందర్భంగా నిక్ ఏమన్నారంటే...: ‘‘దాదాపు ఏడెనిమిది దేశాల్లో నేను పర్యటించాను. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ లాంటి వ్యక్తిని నేను ఇంతవరకూ చూడలేదు. ఆయన అత్యున్నతమైన లక్ష్యం కోసం ఉన్నతమైన ఆశయంతో పనిచేస్తున్నారు. ఏపీలో సుమారు 45వేల ప్రభుత్వ స్కూళ్లను ఏ ప్రయివేటు స్కూళ్లకు తీసిపోనిరీతిలో అభివృద్ధి చేశారు. అందరికీ సమాన ఆవకాశాలు కల్పించాలన్న గొప్ప లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఈ రంగాల్లో ఇప్పటికే గణనీయమైన ప్రగతి కనిపిస్తోంది. ఇది అందరికీ తెలియాల్సి ఉంది’’ అని నిక్ అన్నారు. ‘‘ఇవాళ ఆయన్ను కలవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. నా పట్ల, నా జీవితం పట్ల మంచి అవగాహనతో స్పూర్తిదాయక వ్యక్తుల కింద నా జీవిత కథను ఆటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ పేరుతో పదోతరగతి ఇంగ్లిషులో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు. ఇది నాకు చాలా ఆనందం కలిగించే విషయం. విద్యారంగంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించే దిశగా, మరింత మెరుగైన ఫలితాల కోసం దీర్ఘకాలిక లక్ష్యంతో పనిచేస్తున్నాను. ఇక్కడ(ఏపీలో) విద్యారంగంలో పిల్లల ఎదుగుదలకు మంచి అవకాశాలున్నాయి’’ అని ఆయన అన్నారు. ‘‘ప్రభుత్వ స్కూళ్లలో ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రపంచ స్ధాయి ప్రమాణాలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ గురించి చెప్పాలంటే ఆయన హీరో. ఇంతవరకూ ఇలా ఎక్కడా జరగలేదు. సీఎం చాలా నిబద్ధత, క్రమశిక్షణ గల మనిషి’’ అని నిక్ వుజిసిక్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు ఆర్.ధనుంజయ్‌రెడ్డి, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు. చదవండి: రైతు భరోసాపై మడతలు కాదు.. చంద్రబాబుకు రామోజీ చిడతలు!! -
ప్రపంచ అతి పొడవైన వేలాడే బ్రిడ్జి ఎక్కడుందో తెలుసా?
మీకు భయమంటే ఎంటో తెలియదా? సాహసాలు చేయడమంటే ఇష్టమా? అయితే ఈ రెండింటినీ పరిచయం చేస్తానంటోంది పోర్చుగల్‌లోని అరౌకా బ్రిడ్జి. ప్రపంచంలోనే అతి పొడవైన వేలాడే బ్రిడ్జిని ఇటీవల పోర్చుగల్ ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ‘బ్రీత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్’ లేదా ‘అరౌకా 516’గా దీన్ని పిలుస్తారు. ఉత్తర పోర్చుగల్‌లోని పావియ నదిపై 175 మీటర్ల ఎత్తు (574 అడుగులు) లో నిర్మించిన అరౌకా బ్రిడ్జి పొడవు 516 మీటర్లు (1693 అడుగులు). అరకిలోమీటరు పొడువు ఉన్న అరౌకా.. వేళాడుతూ అగ్యిరాస్ జలపాతం నుంచి పావియా జార్జ్‌ను కలుపుతూ.. ‘అరౌకా జియోపార్క్’లో మంచి అడ్వెంచర్ స్పాట్‌గా మారింది. 2017లో స్విట్జర్లాండ్‌లో ప్రారంభించిన ‘చార్లెస్ కుయోనెన్ సస్పెన్షన్’ బ్రిడ్జిను అరౌకా వెనక్కు నెట్టేసింది. ఇది పరుచుకోనంత వరకు 494 మీటర్ల(1621 అడుగుల) పొడవుతో ‘చార్లెస్ కుయోనెన్ సస్పెన్షన్’ బ్రిడ్జే ప్రపంచలోని అతి పొడవైన వేలాడే వంతెనగా నడకసాగించింది. ప్రస్తుతం ఆ ప్రస్థానాన్ని 516 మీటర్ల పొడవుతో అరౌకా కొనసాగిస్తోంది. VIDEO: Portugal opens the longest suspended pedestrian bridge in the world in Arouca. The bridge hangs on heavy steel cables strung between V-shaped concrete towers and runs 516 metres (1700 feet) across a canyon, at a height of 175 metres pic.twitter.com/bOL5CrNCJZ — AFP News Agency (@AFP) April 30, 2021 అందుకే అరౌకా.. యునెస్కో గుర్తింపు పొందిన అరౌకా జియోపార్క్ సమీపంలో ఈ బ్రిడ్జిను నిర్మించడంతో దీనికి అరౌకా అని పేరు పెట్టారు. 2018లో నిర్మాణం ప్రారంభించి 2020లో పూర్తి చేశారు. ఇది ప్రపంచంలోనే పొడవైన బ్రిడ్జి అయినప్పటికీ కాస్త ఇరుకుగా ఉంటుంది. పోర్చుగీస్ స్టూడియో ఇటెకాన్స్ టిబేటన్ శైలీలో ఈ బ్రిడ్జి డిజైన్‌ను రూపొందించింది. ఈ వారధికి ఇరువైపులా ‘వి’ ఆకారంలో ఉన్న మూల స్థంబాల్లాంటి రెండు టవర్లు ఉన్నాయి. వాటి మధ్య స్టీల్ కేబుల్స్‌తో ఉంటుంది వంతెన వేళాడుతూ. నాలుగు మీటర్ల పొడవున్న 127 మాడ్యూల్స్‌ను ఉపయోగించి బ్రిడ్జి డెక్‌ను నిర్మించారు. డెక్కు రెండువైపులా నెట్‌తో రెయిలింగ్‌ను పటిష్ఠంగా అమర్చారు. అరౌకా నిర్మాణానికి మొత్తం 2.8 మిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. అంటే మన రూపాయాల్లో అక్షరాల 20.68 కోట్లు. గుండె గుబేలే.. ఈ వారధి నిర్మించక ముందు పర్యాటకులు అరౌకా జియోపార్క్ చూట్టు ఉన్న ప్రకృతి అందాలను చూసేందుకు వాహానాల మీద వెళ్లేవారు. ట్రెకింగ్ చేసేవారు. ప్రస్తుతం ఈ బ్రిడ్జి ప్రారంభించడంతో పెద్దగా శ్రమపడకుండా హాయిగా నడకసాగించొచ్చు. అయితే నడిచేటప్పుడు కిందకు చూస్తే మాత్రం గుండె గుబేలుమంటోందని స్థానికులు చెబుతున్నారు. అరౌకా బ్రిడ్జి మొదలైన తరువాత నడిచిన తొలి వ్యక్తి హ్యూగో జేవియర్. వంతెన ఇవతలి నుంచి అవతలికి దాటిన తరువాత జేవియర్ మాట్లాడుతూ..‘‘ బ్రిడ్జిపై ఈ చివరి నుంచి ఆ చివరకు నడవడానికి కనీసం పదినిముషాలు పట్టింది. బ్రిడ్జి మీద నడిచేటప్పుడు చాలా భయమేసింది.అయినా జీవితంలో మర్చిపోలేని అసాధారణమైన, ప్రత్యేకమైన అనుభూతి అది’’ అని చెప్పాడు. ఏంటీ మీరూ అక్కడకు వెళ్లాలనుకుంటు న్నారా! అయితే కరోనా తగ్గిన తరువాతే కుదురుతుంది! అప్పుడు కూడా ఆరేళ్ల లోపు పిల్లలను బ్రిడ్జిమీదకు అనుమతించరు. పెద్దవాళ్లైనా సరే గైడ్‌ను వెంటబెట్టుకుని వెళ్లాల్సిందే. సందర్శనకు 12 – 14 డాలర్ల రుసుము చెల్లించాల్సిందే!! – పి. విజయా దిలీప్ -
వరల్డ్ ఫేమస్ క్రిస్మస్ సాంగ్స్
-
పురుషుల దినోత్సవం గుర్తుందా?
మెన్‌టోన్ మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సంగతి కొత్తగా చెప్పాలేంటి? మాకు తెలీదూ! అని విసుక్కోకండి. మహిళా దినోత్సవం మొదలైన అచిరకాలంలోనే ప్రపంచ ప్రఖ్యాతి సాధించింది. అది మహిళల ఘనతకు నిదర్శనం. కాదనలేం. ఆకాశంలో సగమైన వారికి ప్రత్యేకించి ఒక రోజు ఉండటం సమంజసమే! మరి జనాభాలో మిగిలిన సగమైన మగాళ్ల సంగతేమిటి? వాళ్లకూ ప్రత్యేకంగా ఒక రోజు ఉండాలి కదా! ఔను! ఉండాలి కూడా! అందుకే, ‘మగా’నుభావులకూ ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం నవంబర్ 19న వస్తుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏ రోజు వస్తుందో ఆడా మగా అందరికీ తెలుసు గానీ, అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఎప్పుడొస్తుందనేది చాలామంది పురుషులకు కూడా తెలీదు. పురుషాధముల జనరల్ నాలెడ్జి ఈ స్థాయిలో తగలడిందని విసుక్కోకండి. కారణాలను తరచి చూసేందుకు ప్రయత్నించండి. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం గురించి పురుషులకు కూడా పెద్దగా తెలియకపోవడానికి పెద్దపెద్ద కారణాలేవీ లేవు. అవన్నీ చాలా చిన్నవే. వాటిలో ప్రచారలోపం ముఖ్య కారణం. పురుషులలో సంఘటిత శక్తి లోపించడం, చట్టాలు, ప్రభుత్వాలకు అనాదిగా గల మహిళా పక్షపాతం కూడా ఇందుకు కారణాలే! అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోనున్న సందర్భంగా మహిళలందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేయడం విజ్ఞత గల జంటిల్మన్ లక్షణం. వారిదైన ప్రత్యేక దినోత్సవాన్ని ఎంత సంబరంగా, అర్థవంతంగా జరుపుకొంటున్నారో చూసైనా పురుషపుంగవులు ఎంతో కొంత నేర్చుకుంటే మంచిది. అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని కూడా అదే రీతిలో జరుపుకొనేలా చిత్తశుద్ధితో ప్రయత్నాలు మొదలుపెడితే ఇంకా మంచిది. మన దేశంలో ఇలాంటిదేదీ తలపెట్టే ఉద్దేశం మన ప్రభుత్వాలకు ఉంటుందనుకోవడం భ్రమే గానీ, కొన్నింటిని పోరాటంతోనైనా సాధించుకోవాల్సి ఉంటుంది. పురుషుల పట్ల సానుకూలంగా ఉండటంలో మనవాళ్లు రుమేనియా ప్రభుత్వాన్ని చూసైనా నేర్చుకోవాలి. అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని కూడా ఇక నుంచి అధికారికంగా నిర్వహించాలని రుమేనియా పార్లమెంటు ఇటీవలే తీర్మానాన్ని ఆమోదించింది. అయినా, మన పార్లమెంటులో ఇలాంటి చిన్నా చితకా అంశాలపై చర్చలెందుకు జరుగుతాయిలెండి?