సాధారణంగా ఫుడ్ కంపెనీ అనగానే చాలా మందికి డామినోస్, మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ వంటివి గుర్తుకు వస్తాయి. కానీ అలాంటి కంపెనీలకు సైతం గట్టి పోటీ ఇచ్చిన ఇండియన్ బ్రాండ్ 'హల్దీరామ్' (Haldiram) గురించి బహుశా తెలియకపోవచ్చు. ప్రపంచంలో దాదాపు 80 దేశాలలో ప్రసిద్ధి చెందిన ఈ సంస్థ గురించి.. దీనికి మూల కారకుడైన వ్యక్తి గురించి ఈ కథనంలో క్షుణ్ణంగా తెలుసుకుందాం.
'గంగ బిషన్ అగర్వాల్' (Ganga Bishan Agarwal) 1937లో బికనీర్‌లో చిన్న స్నాక్స్ వ్యాపారంగా మొదలు పెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ రోజు కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని స్నాక్స్ ఫుడ్స్ వ్యాపారంలో రెండవ స్థానానికి చేరుకునేలా చేసాడు, అంటే దీని వెనుక ఉన్న అతని కృషి పట్టుదల స్పష్టంగా తెలుస్తాయి.
నిజానికి ఒక చిన్న భుజియా దుకాణంతో ప్రారంభమైన ఆయన వ్యాపారం, కుటుంబ కలహాలు, అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఈ రోజు ప్రపంచమే గుర్తించే స్థాయికి ఎదిగింది. గంగ బిషన్ ఉరఫ్ అగర్వాల్‌ని తన తల్లి ముద్దుగా 'హల్దీరామ్' అని పిలుచుకునేది. ఆ పేరే తరువాత కంపెనీ బ్రాండ్‌గా మారింది. వీరి కుటుంబానికి చెందిన ఒక మహిళ తరచుగా బికనీరీ భుజియా తయారు చేసేదని, దాన్ని తన తల్లి ద్వారా బిషాన్ నేర్చుకున్నట్లు సమాచారం.
భుజియాతో విజయం..
గంగా బిషన్ అగర్వాల్ 1919లో కేవలం 11 ఏళ్ల వయసులోనే కంపెనీ స్థాపించాలని కలలు కనేవాడు. చిన్న తనం నుంచి భుజియా తయారు చేయడం మీద ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. ఎందుకంటే ఆ సమయంలో భుజియా బాగా ప్రసిద్ధి చెందింది. అయితే వ్యాపారులు డబ్బు మీద పెట్టే ద్రుష్టి.. రుచి మీద పెట్టేవారు కాదు. కావున బిషన్ మార్కెట్లో మంచి రుచిని అందించే చిరుతిండి వ్యాపారాలను సృష్టించడానికి కంకణం కట్టుకున్నాడు. దీంతో అనేక ప్రయత్నాలు చేసి బికనీర్ ప్రజలు మునుపెన్నడూ రుచి చూడని కొత్త రకం భుజియాను రూపొందించడంలో అతను విజయం సాధించాడు.
(ఇదీ చదవండి: ఒకప్పుడు రూ. 10 వేల జీతానికి ఉద్యోగం.. ఇప్పుడు కోట్ల సామ్రాజ్యం - ఒక టీచర్ కొడుకు సక్సెస్ స్టోరీ..)
కలకత్తాలో దుకాణం..
మార్కెట్లో మంచి పేరు సంపాదించిన తరువాత అమ్మకాల పరంగా వేగంగా ముందుకు దూసుకెళ్లాడు. అతడు ఏడు పదుల వయసులోనూ ఊరంతా సైకిల్ మీదే తిరిగేవారట, అంతే కాకుండా ఆయన ఒకసారి కోల్‌కతాలో పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక దుకాణం ఏర్పాటు చేయాలనుకుని, అక్కడ షాప్ ప్రారంభించారు. బికనీర్‌లో కాకుండా బయట ప్రారంభించిన మొట్టమొదటి దుకాణం అదే. ఈ విధంగా క్రమక్రమంగా వృద్ధి చెందుతూ ఆయన మనవళ్లు కూడా దీని అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు.
(ఇదీ చదవండి: ఏసీ రైలు.. ఇండియన్స్‌ను ఎక్కనించేవారే కాదు.. తొలి ఏసీ కోచ్ ఎప్పుడు? ఎక్కడ? ఎలా మొదలైందంటే..)
80 దేశాల్లో విక్రయాలు..
భారతదేశంలో నాగపూర్, ఢిల్లీ ప్రాంతాల్లో వీరికి బ్రాంచీలు ఉన్నాయి. విదేశాల్లో కూడా దీనికి మంచి డిమాండ్ ఉంది. వీరి ఉత్పత్తులు ప్రపంచంలోని దాదాపు 80 దేశాల్లో విక్రయానికి ఉన్నట్లు సమాచారం. హల్దీరామ్ బ్రాండ్‌లో వెజ్ షమీ కెబాబ్, సోయా షమీ కెబాబ్, దహీ కెబాబ్, హరాభరా కెబాబ్‌లను తయారు చేసేవారు. ఆ తరువాత రసగుల్లా, సోమ్ పాపిడీ, పానీపురీ వంటివి కూడా ప్రారంభించారు. హల్దీరామ్ ప్రస్తుత చైర్మన్ మనోహర్ లాల్ అగర్వాల్. ప్రస్తుతం వీరు రూ. వేల కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment