'సక్సెస్'.. ఈ పదం రాసుకోవడానికి చిన్నగా ఉన్నా.. సాధించడానికి చాలా సమయం పడుతుంది. అహర్నిశలు అంకిత భావంతో పనిచేస్తేనే విజయం వరిస్తుంది. ఈ కోవకు చెందిన ఒక వ్యక్తి గురించి మనం ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
బెంగుళూరుకు చెందిన బిలియనీర్ బార్బర్ 'రమేష్ బాబు' అంటే ఈ రోజు అందరికి తెలుసు. ముఖేష్ అంబానీ కంటే కూడా ఎక్కువ కార్లను కలిగి ఉన్న ఈయన ప్రస్తుతం ధనవంతుల జాబితాలో ఒకరు. అయితే ఈయన బాల్యం కడలిలో మునిగిన నావలాంటిదని బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు.
చిన్నప్పుడే తండ్రి మరణం..
చిన్న తనంలోనే తండ్రిని కోల్పోవడంతో క్వారికున్న బార్బర్ షాప్ అక్కడితో ఆగింది. తల్లి పనిమనిషిగా చేరింది, రమేష్ బాబు తల్లికి సహాయంగా ఉండాలని కూలిపనులు చేసేవాడు. తండ్రి మరణంతో ఒక్కసారిగా కటిక పేదరికంలో పడిపోయారు. మూడు పూటల ఆహరం కోసం కూడా చాలా ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఆ తరువాత తండ్రి మార్గంలో నడవాలని నిర్ణయించుకుని మళ్ళీ బార్బర్ షాప్ ప్రారంభించాడు.
తండ్రి బార్బర్ షాప్ ప్రారభించిన అతి తక్కువ కాలంలో వృద్ధిలోకి రావడం ప్రారంభమైంది. బార్బర్‌షాప్‌ను స్టైలిష్ హెయిర్ సెలూన్‌గా మార్చాడు. రమేష్ బాబుకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. అంతే కాకుండా తన వ్యాపారాన్ని వివిధ మార్గాల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుని కార్లను అద్దెకివ్వాలని నిర్ణయించుకుని మొదటి మారుతి ఓమ్ని వ్యాన్ కొనుగోలు చేశారు.
ట్రావెల్ కంపెనీ..
1994లో ప్రారంభమైన ఈ బిజినెస్ ఆ తరువాత ట్రావెల్ కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం ఈయన వద్ద సుమారు 400కంటే ఎక్కువ కార్లు ఉన్నట్లు సమాచారం. ఇందులో మెర్సిడెస్ ఈ క్లాస్ సెడాన్, బీఎండబ్ల్యూ, రోల్స్ రాయిస్ ఘోస్ట్, జాగ్వార్, మెర్సిడెస్ మేబ్యాక్ వంటి అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. రమేష్ బాబు కార్ రెంటల్ కంపెనీలో 300 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం.. వందలాది ఉద్యోగులపై ఎఫెక్ట్!
రమేష్ బాబు బిలినీయర్ అయినప్పటికీ తన మూలలను మాత్రం మరచిపోలేదు, దీంతో ఈయన అప్పుడప్పుడు సెలూన్‌కి చాలా సమయం వెచ్చిస్తాడు. మొత్తం మీద భారతదేశంలో బిలియనీర్లైన ముఖేష్ అంబానీ (సుమారు 168 కార్లు), గౌతమ్ అదానీ (10అల్ట్రా లగ్జరీ కార్లు) కంటే ఎక్కువ కార్లను కలిగిన సంపన్నుడిగా రికార్డ్ సృష్టించాడు. కాగా ప్రస్తుతం రమేష్ బాబు నికర ఆస్తుల విలువ రూ. 1200కోట్లు అని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment