success stories
-
రూ.25 వేలతో మూడేళ్లలో రూ.33 కోట్ల వ్యాపారం!
కాలేజీ డ్రాపవుట్ అయిన ఓ యువకుడు తన స్నేహితుడి సాయంతో రూ.25,000 పెట్టుబడితో వ్యాపారం సాగించి మూడేళ్లలో ఏకంగా రూ.33.61 కోట్ల వ్యాపారాన్ని విస్తరించాడు. అసలు కాలేజీ డ్రాపవుట్ అయ్యాక తాను ఏ బిజినెస్ ఎంచుకున్నాడు.. తన వ్యాపారాన్ని ఎలా విస్తరించాడో ఈ కథనంలో తెలుసుకుందాం.డారియన్ క్రెయిగ్(31) కొన్ని కారణాల వల్ల కాలేజ్ డ్రాపవుట్ అవ్వాల్సి వచ్చింది. ఇళ్లు గడవడం ఇబ్బందిగా ఉండడంతో చిన్న ఉద్యోగం చేరాడు. ఒకరోజు ఆఫీస్‌కు వచ్చిన క్రెయిగ్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. తాను ఉద్యోగం కోల్పోయే నాటికి తన బ్యాంకు అకౌంట్లో కేవలం 7 డాలర్లు(రూ.600) ఉన్నాయి. తాను ఎలాగై జీవితంలో ఎదగాలని నిర్ణయించుకున్నాడు. డబ్బు సంపాదించాలనుకున్నాడు. అందుకోసం తన చిన్ననాటి స్నేహితుడు బ్రాండన్ ఎకోల్స్ సాయంతో 300 డాలర్లు(రూ.25,000) అప్పుచేసి వ్యాపారం మొదలు పెట్టాడు. ‘వైఆల్ స్వీట్ టీ’ పేరుతో టీ బిజినెస్ ప్రారంభించాడు. 2021లో మొదలుపెట్టిన ఈ వ్యాపారం అభివృద్ధి చెంది మూడేళ్లలో ఏటా రూ.33.61 కోట్ల ఆదాయం సమకూర్చే స్థాయికి ఎదిగింది.వెంచర్ క్యాపిటలిస్ట్‌ల నుంచి విశేష ఆదరణయునైటెడ్ స్టేట్స్లో కార్యకలాపాలు సాగించే ఈ సంస్థ ద్వారా నేరుగా వినియోగదారులకు తమ టీ ఉత్పత్తులను అందిస్తున్నారు. సుమారు 600 రిటైల్ అవుట్లెట్లతో వ్యాపారం సాగిస్తున్నారు. విభిన్న ఫ్లేవర్లలో టీను అందిస్తున్నారు. ఇటీవల క్రెయిగ్, ఎకోల్స్ తమ కంపెనీ విస్తరణకు వెంచర్ క్యాపిటలిస్ట్‌ల సాయం కోరగా విశేష ఆదరణ లభించిందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: రిలయన్స్ బ్రాండ్స్ ఎండీగా వైదొలిగిన మెహతాకష్టాలు సహజం.. సరైన నిర్ణయాలు ముఖ్యంఉద్యోగం రాలేదనో, డబ్బు లేదనో, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయనో చాలా మంది కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ క్రెయిన్, ఎకోల్స్లాగా జీవితంలో కష్టపడి ఎదుగుతున్నవారు కోట్లల్లో ఉన్నారు. కాబట్టి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు వాటిని సమర్థంగా ఎలా ఎదుర్కోవాలో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ఇంటర్లో 39% మార్కులు! కట్ చేస్తే కంపెనీకి సీఈఓ
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో’లో పాల్గొన్నారు. దీపిందర్ తన బాల్యంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు.. ఇంటర్ ఫస్ట్‌ఇయర్‌లో 39 మార్కులు సాధించిన గోయల్ ఐఐటీ ఢిల్లీలో సీటు సంపాదించి జొమాటోను ఎలా స్థాపించారో వివరించారు. జీవితం తనకు ఎన్నో పాఠాలు నేర్పిందన్నారు.‘స్కూల్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు చాలా భయపడుతూ ఉండేవాడిని. దానికి కారణం నేను చదువులో టాప్ స్టూడెంట్ను కాదు. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు పరీక్షలో నేను సరైన సమాధానాలు రాయకపోయినా మా టీచర్ కావాలనే నాకు మంచి గ్రేడ్ ఇచ్చారు. దాంతో కుటుంబం, స్నేహితుల నుంచి ప్రశంసలు అందుకున్నాను. అది నాకు చాలా సంతోషాన్నిచ్చింది. కొంతకాలం తర్వాత చివరి సెమిస్టర్ పరీక్షలు వచ్చాయి. అంతకుముందు వచ్చిన మార్కులు ఫేక్ అనే విషయం నాకు తెలుసు. ఈసారి ఎలాగైనా కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి మళ్లీ ప్రశంసలు పొందాలనుకున్నాను. (నవ్వుతూ)మా ప్రశ్నపత్రాలు ప్రింట్ చేసే ప్రింటింగ్ ప్రెస్ వ్యక్తి వద్దకు వెళ్లి ముందస్తుగా ప్రశ్న పత్రాలను పొందడానికి ప్రయత్నించాను. కానీ అది సాధ్యం కాలేదు. దాంతో విజయానికి షార్ట్కట్లు లేవని అర్థం చేసుకున్నాను. నేను కష్టపడి చదవడం ప్రారంభించాను. చివరి సెమిస్టర్లో క్లాస్‌లో ఐదో స్థానానికి చేరుకున్నాను. ఈ విజయం నాకు జీవితంలో ఏదైనా చేయగలననే విశ్వాసాన్ని కలిగించింది’ఇంటర్ ఫస్టియర్‌లో 39 శాతం మార్కులే..‘కొన్ని కారణాల వల్ల నేను ఇంటర్ ఫస్టియర్(11వ తరగతి)లో 39 శాతం మార్కులే వచ్చాయి. ప్రీ-యూనివర్శిటీ ఎడ్యుకేషన్ కోసం చండీగఢ్‌కు వెళ్లాను. కష్టపడి చదివి ఐఐటీ-జేఈఈ క్లియర్ చేసి ఐఐటీ ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. ఇక్కడ జీవితం ఎన్నో పాఠాలు నేర్పించింది. మన ఆలోచనలు ఉన్నతంగా ఉంటే ఉన్నత వ్యక్తులను కలుస్తాం. మనం ఎంచుకున్న విభాగంలో ఎప్పుడూ మొదటిస్థానంలో ఉండేందుకు కష్టపడి పని చేయాలి. ఇది నిత్య పోరాటంగా సాగాలి’ అన్నారు.డిప్రెషన్‌ను అధిగమించాలంటే..‘నేను కొన్ని కారణాల వల్ల చాలాసార్లు డిప్రెషన్‌గా ఫీల్ అవుతుంటాను. ఈ డిప్రెషన్ సైకిల్ మూడేళ్లుంటుంది. డిప్రెషన్ సైకిల్స్ నిజానికి మంచివని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అవి నన్ను ఒక పాయింట్‌కి మించి మరింత ఉన్నతంగా ఆలోచించేలా చేస్తాయి. మానసిక సవాళ్లను ఎదుర్కోవడమే డిప్రెషన్‌కు సరైన చికిత్స. అందుకే మనం చేస్తున్న పనిలోనే డిప్రెషన్ తొలగించుకునేందుకు పరిష్కారాలు వెతకాలి. ప్రతి సైకిల్‌ను అధిగమించేందుకు గతంలో కంటే మరింత మెరుగ్గా ఆలోచిస్తూ పని చేస్తున్నాను’ అని అన్నారు.ముందు టొమాటో!‘ఐఐటీలో చదువు పూర్తి చేసుకున్నాక కెరియర్ ప్రారంభంలో బైన్ & కో. అనే కన్సల్టింగ్ సంస్థలో పని చేశాను. కమ్యూనికేషన్ నైపుణ్యాలు నేర్పించడంలో, వ్యూహాత్మకంగా ఆలోచించేందుకు ఇది ఎంతో తోడ్పడింది. ఎలా ఆలోచించాలో, ఏం మాట్లాడాలో ఈ సంస్థ నాకు నేర్పింది. నేను ఎప్పటికీ బైన్ అండ్ కో సంస్థకు కృతజ్ఞతతో ఉంటాను. బైన్లో పని చేస్తున్న సమయంలోనే జొమాటో ఆలోచన వచ్చింది. కంపెనీ స్థాపించాలనే ఉద్దేశంతో పేరును ఖరారు చేయాలనే సందర్భంలో ‘టొమోటో’అని అనుకున్నాం. దానికి సంబంధించిన డొమైన్ పేరు ‘టొమోటో డాట్ కామ్’ను కూడా ఏర్పాటు చేశాం. కానీ చివరకు దాన్ని జొమాటోగా నిర్ణయించాం’ అన్నారు.ఇదీ చదవండి: 6:15 గంటల్లో రూ.5 లక్షల కోట్లు ఆవిరి!అంతిమంగా, కొన్ని ఎదురుదెబ్బలు, తను నేర్చుకున్న జీవిత పాఠాలే జొమాటోను ఏర్పాటు చేయడానికి గోయల్‌కు ధైర్యాన్ని అందించాయి. తను కోరుకుంటే ఏదైనా చేయగలననే విశ్వాసాన్ని ఇచ్చాయి. తాత్కాలిక విజయాలకు పొంగిపోవడం, అపజయాలకు కుంగిపోకుండా జీవితంలో దీర్ఘకాల లక్ష్యాలను ఏర్పరుచుకుని దాన్ని సాధించాలనే గట్టి తపనతో ముందుకెళ్లాలి. -
Elnaaz Norouzi: పర్షయన్ ప్రజ్ఞ!
ఎల్నాజ్ నౌరోజీ.. గ్లామర్, టాలెంట్ రెండూ ఉన్న నటి. ఇరాన్లో పుట్టింది. జర్మనీలో పెరిగింది. కెరీర్ వెదుక్కుంటూ భారత్‌కు చేరింది. సినిమా, సిరీస్‌లతో తగిన గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది! జర్మన్, ఇంగ్లిష్, ఫ్రెంచ్, ఉర్దూ, పంజాబీ, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతుంది.మోడలింగ్ అన్నా, యాక్టింగ్ అన్నా ఎల్నాజ్కు చిన్నప్పటి నుంచీ ఆసక్తి. అందుకే తన పద్నాలుగో ఏటనే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. ట్వల్త్ క్లాస్ పాస్ అయ్యాక, ఓ ఏడాది పాటు థియేటర్లో ట్రెయినింగ్ తీసుకుంది. పర్షియన్ డాన్స్, హిప్ హాప్, కథక్‌లోనూ శిక్షణ పొందింది.మోడలింగ్‌లో కొనసాగుతూనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. మోడలింగ్‌లో భాగంగా ఆసియా, యూరప్ దేశాలు చుట్టొచ్చింది. ఇండియాలో జరిగిన ఎన్నో యాక్టింగ్ వర్క్‌షాప్స్‌కి హాజరైంది. తనకు ఈ దేశం నచ్చడంతో ఇక్కడే స్థిరపడింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్గన్ లాంటి బాలీవుడ్ ఉద్దండులతో కలసి ఎన్నో టీవీ కమర్షియల్స్‌లో నటించింది.‘మాన్ జావో నా’ అనే పాకిస్తానీ మూవీలో, ‘ఖిదో ఖుండీ’ అనే పంజాబీ చిత్రంలో, పంజాబీ మ్యూజిక్ సెన్సేషన్ గురు రంధావా ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే మ్యూజిక్ వీడియోలో నటించింది. కానీ ఎల్నాజ్ను దేశమంతటికీ పరిచయం చేసింది మాత్రం నెట్‌ఫ్లిక్స్ ‘సేక్రడ్ గేమ్స్’ సిరీసే! తర్వాత జీ5లో స్ట్రీమ్ అయిన ‘అభయ్’సిరీస్‌లోనూ నటించింది. ఆమె ప్రధాన పాత్ర పోషించిన తాజా సిరీస్ ‘రణ్నీతి: బాలాకోట్ అండ్ బియాండ్’ జియోసినిమాలో స్ట్రీమ్ అవుతోంది.‘జన గణ మన’ అనే చిత్రంతో కోలీవుడ్‌లోకీ అడుగుపెట్టింది ఎల్నాజ్. ఇరానియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచీ ఆమెకు ఆఫర్లు వచ్చాయి. కానీ అక్కడున్న ఆంక్షల వల్ల వాటిని తిరస్కరించినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. "నాకు కొత్తకొత్త విషయాలను నేర్చుకోవడం చాలా ఇష్టం. అలా ఎప్పటికప్పుడు ఏదో ఒకటి నేర్చుకొనే అవకాశం దొరుకుతూనే ఉంది ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో!" – ఎల్నాజ్ నౌరోజీఇవి చదవండి: పరివర్తనం: ‘దేవరపాలెం.. దేవరపాలెం..’ -
Sanam Saeed: ప్రైడ్ ఆఫ్ పాకిస్తాన్.. ఫ్యాన్ ఆఫ్ ఇండియా!
సనమ్ సయీద్.. బ్రిటిష్ పాకిస్తానీ మోడల్, నటి, గాయని కూడా! ఉర్దూ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ప్రసిద్ధురాలు. మన దగ్గరా ఆమెకు ఘనమైన అభిమానగణం ఉంది. జీ5, హమ్ చానళ్ల వీక్షకులకు ఆమె సుపరిచితం.సనమ్ పుట్టింది లండన్‌లో. తన ఆరేళ్ల వయసులో ఆమె కుటుంబం పాకిస్తాన్‌లోని కరాచీకి వెళ్లి, స్థిరపడింది. ప్రాథమిక విద్యాభ్యాసం కరాచీలో, ఉన్నత విద్యాభ్యాసం లాహోర్‌లో గడిచింది. ఫిల్మ్ అండ్ థియేటర్ స్టడీస్‌లో డిగ్రీ చేసింది.ఆమె తన పదహారవయేట నుంచి మోడలింగ్ మొదలుపెట్టింది. పదిహేడేళ్లప్పుడు ఎమ్‌టీవీ (పాకిస్తాన్)లో వీజేగా కనిపించింది.‘షికాగో’ అనే నాటకంతో రంగస్థల ప్రవేశం చేసింది. అందులోని ఆమె నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. దాంతో ఆమెకు టీవీ సీరియల్స్‌లోనూ అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. ‘దామ్’ అనే సీరియల్‌తో బుల్లితెర ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇటు నాటకాలు, అటు సీరియళ్లతో బిజీగా ఉన్న సమయంలో కోక్ స్టూడియో పాకిస్తాన్లో తన గళాన్ని వినిపించి.. తనలోని గాన ప్రతిభనూ చాటుకుంది.సనమ్ మల్టీటాలెంట్ ఆమెను వెండితెరకూ పరిచయం చేసింది ‘బచానా’ అనే ఉర్దూ సినిమాతో! ‘మాహ్ ఎ మీర్’, ‘దొబారా ఫిర్ సే’, ‘ఇశ్రత్ మేడ్ ఇన్ చైనా’ వంటి సినిమాలు ఆమెకు మంచి పేరుతెచ్చిపెట్టాయి.సనమ్‌ను మనకు ఇంట్రడ్యూస్ చేసి.. ఇక్కడ ఆమెకు పాపులారిటీ తెచ్చిపెట్టిన సీరియల్ ‘జిందగీ గుల్జార్ హై’. ఇది హమ్ టీవీలో ప్రసారం అయింది. ఈ సీరియల్ ఆమెకు ఇండియన్ ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచింది.ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఆమెకున్న ఫేమ్‌ను చూసి ఓటీటీ కూడా ఆమెకు ప్లేస్ ఇచ్చింది.. ‘కాతిల్ హసీనాఓం కే నామ్’తో! ఇది జీ5లో స్ట్రీమ్ అవుతోంది.మోడలింగ్, థియేటర్, టీవీ, సినిమా, ఓటీటీ, సింగింగ్.. ఇలా అడుగిడిన ప్రతి రంగంలో ఆమెకు ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలు దక్కాయి. అందులో ఒకటి ‘ప్రైడ్ ఆఫ్ పాకిస్తాన్’.'ఇండియాలో నాకు ఫ్యాన్స్ ఉండటం అనిర్వచనీయమైన ఆనందం. ఇండియన్స్ పరాయివాళ్లన్న భావన నాకెన్నడూ లేదు. ఎప్పుడో.. ఎక్కడో తప్పిపోయి.. వేరువేరు ఇళ్లల్లో పెరిగిన తోబుట్టువుల్లా తోస్తారు. ఇప్పుడు నా సీరియల్స్, సిరీస్‌తో వాళ్లను కలుసుకుంటున్నట్టనిపిస్తోంది.'ఇవి చదవండి: ఊహించని వేగంతో.. అంతర్జాతీయ స్థాయిలో.. ఆఫ్రికా బోల్ట్! -
ఎస్.ఐ యామ్ ఆన్ డ్యూటీ
ఎంతోమంది కలలను తమ భుజాలపై మోశారు.. ఎందరో ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచారు. సమాజ భద్రతకు తామున్నామంటూ ప్రతినబూనారు. తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందానికి కారణమయ్యారు. జీవిత భాగస్వాములు సగర్వంగా తలలు ఎత్తుకునేలా చేశారు. సొంతవారి కళ్లల్లో ఆనందబాష్పాలయ్యారు. చిట్టి పాపాయిల సంతోషానికి అవధుల్లేకుండా చేశారు. పాసింగ్ ఔట్ పరేడ్ పూర్తి చేసుకుని ఎస్సైలుగా నియమితులైన ఎందరో విజయగాథలు బుధవారం తెలంగాణ పోలీస్ అకాడమీలో ఆవిష్కృతమయ్యాయి. వారిలో కొందరిని ’సాక్షి’ పలకరించింది..32 ఏళ్ల వయసులో...ఒడిలో పాపాయికి చనుబాలు మాన్పించి.. 32ఏళ్ల వయసులో గ్రౌండ్ బాటపట్టారు. అనుక్షణం తనను తాను నిరూపించుకోవాలని వందకు రెండొందల రెట్లు కష్టపడ్డారు. మైదానంలో శివంగిలా దూకారు. మెదడుకు పదును పెట్టారు. పోలీసు శిక్షణలో భాగంగా ఇండోర్, ఔట్‌డోర్ విభాగాల్లో ఔరా అనిపించి టాపర్‌గా నిలిచి పాసింగ్ ఔట్ పరేడ్ కమాండెంట్‌గా నిలిచారు భాగ్యశ్రీ పల్లి. భద్రాచలంలోని సార΄ాక గ్రామానికి చెందిన భాగ్యశ్రీ చాలా పేదరికం నుంచి వచ్చారు. తండ్రి నాగేశ్వరరావు ఇప్పటికీ పెళ్లిళ్లకు వంటలు చేస్తుంటారు. తల్లి దుర్గ. భర్త పవన్ కుమార్ ప్రైవేటు ఉద్యోగి. చదువు మాత్రమే పేదరికాన్ని దూరం చేస్తుందని నమ్మి చదువుపై శ్రద్ధ పెట్టారు. గతంలో గ్రూప్–4 ఉద్యోగం చేస్తూ సమాజానికి నేరుగా ఏదైనా సాయం చేయాలన్న తలంపుతో ఎస్సై కోసం సన్నద్ధమయ్యారు. ఆ సమయంలో ఎన్నో కష్టాలకు ఎదురొడ్డారు. భర్త ప్రోద్బలంతో ఇదంతా సాధ్యమైందని చెబుతున్నారు. శిక్షణలో ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నానని, ఫీల్డ్‌లో ఎంతో కష్టపడతానని పేర్కొన్నారు.ఇద్దరు పిల్లల తల్లిగా..ఇంట్లో ఏడు నెలల చిన్నారి.. మరో పాపకు రెండున్నర సంవత్సరాలు.. వారి ఆలనా పాలనా చూసుకోవడం చాలా కష్టం. అలాంటిది ఆ తల్లి వారిని అమ్మమ్మ వద్ద వద్ద వదిలి తన కలలను నెరవేర్చుకునేందుకు అడుగు బయటపెట్టింది. ఆమే మణిమాల. సివిల్ సర్వీసెస్ సాధించాలనేది తన కోరిక. కానీ ఇంతలో ఎస్సై నోటిఫికేషన్ రావడంతో ఎలాగైనా ఆ జాబ్ కొట్టాలనే ఆకాంక్షతో బయల్దేరారు. ఎట్టకేలకు తన గమ్యాన్ని చేరుకుని, హౌరా అనిపించుకుంటున్నారు. ఈవెంట్స్ కోసం కష్టనష్టాలకోర్చి నిరూపించుకున్నారు. నాన్న పేరు నాగళ్ల శ్రీనివాసరావు. అంబర్‌పేటలోని సీపీఎల్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. భర్త డి.వెంకటనాగేశ్వరరావు కూడా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. తమ్ముడు అశోక్ ఇటీవల ఏఈఈగా ఎంపికయ్యాడు. అక్కా తమ్ముళ్లు కలిసే చదువుకునేవారు. శిక్షణ పూర్తి చేసుకుని పీవోపీలో పాల్గొని తల్లిదండ్రులు, భర్త కళ్లల్లో ఆనందం చూశారు. తండ్రి శ్రీనివాసరావు, స్నేహితురాలు సృజన తనకు స్ఫూర్తి అని ఆమె చెప్పుకొచ్చారు. ఒక మహిళగా ఆర్థిక స్వావలంబన ఉండటం చాలా ముఖ్యమని, తన విధి నిర్వహణలో భాగంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు కృషి చేస్తానని వివరించారామె.27 సార్లు ప్రయత్నించి..! నవీ¯Œ కుమార్ మానుపూరి.. సూర్యాపేట జిల్లా తాళ్లసింగారం గ్రామం. తల్లిదండ్రులు సంగయ్య, ఉపేంద్ర. తండ్రి చేనేత కార్మికుడు. ముగ్గురు కుమారుల్లో రెండో వ్యక్తి నవీన్ . చిన్నప్పటి నుంచి యూనిఫాం వేసుకొని ఆఫీసర్ హోదాలో గౌరవం పోందాలనేది అతడి కోరిక. ఆర్మీలో చేరేందుకు పట్టుదలతో ఎంతో కృషి చేశాడు. కమాండెంట్ అధికారి హోదా కోసం 27 సార్లు విఫలప్రయత్నం చేశాడు. ప్రతిసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లి రిజెక్ట్ అవుతుండేవాడు. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాడు. చివరకు ఎస్సైగా ఎంపికై.. బుధవారం జరిగిన ΄ాసింగ్ పరేడ్‌లో పాల్గొన్నాడు. పీవోపీ సమయంలో తల్లిదండ్రుల కళ్లల్లో కన్నీళ్లు చూసినప్పుడు నా ఆనందం మాటల్లో చెప్పలేనిదంటూ సంతోషం వ్యక్తం చేశాడు. – వివేకానంద తంగెళ్లపల్లి, సాక్షి, హైదరాబాద్ -
కోరికలు – ఆత్మ సాధన! కొన్ని మనం ఏ ప్రయత్నం చేయకుండానే..
మనస్సు నుండి అనేక కోరికలు జనిస్తూ ఉంటాయి. అటువంటివాటిలో కొన్ని మనం ఏ ప్రయత్నం చేయకుండానే పూర్తి అవుతాయి. అందువలన మనం సంతోషాన్ని పొందుతాం. మరికొన్ని కోరికలు మనం ఎంతగా ప్రయత్నం చేసినా పూర్తి కావు. కోరికలు ఫలించని పరి స్థితిలో రెండు రకాల ప్రశ్నలు మనముందు ఉంటాయి. అవి: ఒకటి ‘నా కోరికలు ఏ విధంగా నెరవేరతాయి?’రెండు ‘ఏ కోరికలు నెరవేరతాయో అటువంటి కోరికలనే నేను కోరుకోవాలా?’ అయితే ఈ రెండూ మన చేతిలో లేవు. మనస్సు వస్తువులతో అంటిపెట్టుకొని ఉండడం వలన కోరికలు జనిస్తాయి. ఇటువంటి కోరికల వల్ల మనకు వస్తువులతో సంబంధం ఉన్నట్లు ఆలోచనలు కలుగుతాయి. ఏదో ఒక కోరిక నెరవేరితే... దానివలన కొంత అనుభవం వస్తుంది. ఒకవేళ కోరిక నెరవేర కపోతే అది ఒత్తిడికి లేక కలవరపాటుకు దారితీస్తుంది. అందువలన వేరొక రక మైన అనుభవం వస్తుంది. కోరి కలు నెరవేరినా లేక నెరవేర కున్నా, వాటిని గూర్చి మన స్సులో ఎక్కువ ఆలోచనలు కలుగుతాయి. ఎవరైతే ఇటు వంటి పరిస్థితిలో చిక్కుకొంటారో అటువంటివారి విధిని ఊబిలో చిక్కిన మనిషితో పోల్చవచ్చు. ఈ విధంగా చిక్కుకొని ఉన్నప్పుడు పరిష్కారం ఎక్కడ లభిస్తుంది?మనస్సును నెమ్మదిగా, క్రమంగా, ఆలోచనారహిత స్థితికి తీసుకొని రావాలి. మనస్సులో ఆలోచనలు పుట్టక పోతే, అసలు ఆలోచనలనేవి ఉండనే ఉండవు. అలాగే కోరికలు కూడా ఉండవు. ఎవరైనా తన మనస్సును విచారించకుండా ఆపగలరా? ఎందుకంటే... ఎల్లప్పుడూ ఆలోచించడం మనస్సు సహజ లక్షణం. కాబట్టి (ఆత్మ) సాధకుడు తన సాధనల ద్వారా... ఆలోచనల వలన కలిగే ఒత్తిడిని దూరం చేసుకోవాలి. ఇందుకోసమై సాధకుడు తన దృష్టిని మళ్ళించకుండా, ఆధ్యాత్మిక లక్ష్యంపైనే మనస్సును కేంద్రీకరింప జేయాలి. దేవుని అనుగ్రహం వలన సాధకుడు కాస్త ముందుగానో లేక ఆలస్యంగానో తన సాధన ఫలితాలను పొందగలుగుతాడు. – శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
Anvesha Vij: 'OMG'.. ఫీచర్ ఫిల్మ్‌తో సిల్వర్ స్క్రీన్ మీద మెరిసి..
అన్వేషా విజ్.. ఓటీటీ వీక్షకులను ఆకట్టుకుంటున్న నటి. గ్లామర్ ఫీల్డ్‌లోకి రాకముందే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. డాన్స్ వీడియోలతో సోషల్ మీడియాలో ఫేమస్. అందుకే ఆమెను డాన్సర్, ఇన్ఫ్లుయెన్సర్ అండ్ యాక్ట్రెస్ అని పరిచయం చేయాలి!అన్వేషా పుట్టిపెరిగింది ఢిల్లీలో. తండ్రి.. అమిత్ విజ్, ఆర్కిటెక్చరల్ డిజైనర్. తల్లి.. మధు విజ్, గృహిణి. ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ అయిన అన్వేషాకు డాన్స్ అంటే ప్రాణం. చిన్నప్పుడే డాన్స్‌లో ట్రైనింగ్ మొదలుపెట్టింది.2014లోనే సోషల్ మీడియాలోకి ఎంటర్ అయింది తన పేరు మీదే ఓ యూట్యూబ్ చానెల్ పెట్టి. కాని పెద్దగా యాక్టివ్‌గా లేకుండింది. 2020లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ స్టార్ట్ చేసింది. అందులో చాలా యాక్టివ్‌గా ఉంది తన డాన్స్ వీడియోలు, ఫొటోస్‌తో! ఆ పోస్ట్‌లకు అనతికాలంలో లక్షల సంఖ్యలో ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ పెరిగి అన్వేషాను ఇన్ఫ్లుయెన్సర్ స్థాయికి చేర్చారు. స్ట్రాంగ్ ఫ్యాన్బేస్గా ఏర్పడ్డారు.ఆ పాపులారిటినే ఆమెకు లాక్మే, బీ రియల్ లాంటి బ్రాండ్స్‌కి మోడలింగ్ చేసిపెట్టే చాన్స్‌నిచ్చింది. మోడలింగేమో ఓటీటీ ప్లాట్‌ఫామ్ మీద అడుగుపెట్టే అవకాశాన్నిచ్చింది.ఓటీటీలో ఆమె నటించిన తొలి వెబ్ సిరీస్ ‘క్రాష్ కోర్స్’. అందులో నిక్కీ కపూర్ పాత్రతో ఓటీటీ వీక్షకులను మెప్పించింది. ఆ మరుసటి ఏడు అంటే 2013లో OMG 2 (ఓహ్ మై గాడ్ 2) ఫీచర్ ఫిల్మ్‌తో సిల్వర్ స్క్రీన్ మీద మెరిసి సినీ అభిమానులను మురిపించింది. పరేశ్ రావల్ నటించిన OMG (ఓహ్ మై గాడ్)కి సీక్వెల్ అయిన ఈ సినిమాలో ఆమె పంకజ్ త్రిపాఠీకి కూతురు ‘దమయంతి’గా నటించింది. అది ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.ప్రముఖ స్టాండప్ కమేడియన్ మునవ్వర్ ఫారూకీతో కలసి ‘కాజల్’ అనే మ్యూజిక్ వీడియోలోనూ నటించింది. తాజాగా అన్వేషా ‘సిస్టర్హుడ్’ అనే సిరీస్‌తో అలరిస్తోంది. ఇది మినీ టీవీలో స్ట్రీమ్ అవుతోంది."ఓటీటీ అండ్ సినిమా రెండూ దేనికవే డిఫరెంట్. ఈ రెండిటితో చాలా నేర్చుకుంటున్నాను. ముఖ్యంగా 'OMG2’ సినిమాలో నా సీనియర్ కోస్టార్స్ పంకజ్ సర్, యామీ గౌతమ్ మామ్ దగ్గర చాలా నేర్చుకున్నాను. వాళ్లు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు". – అన్వేషా విజ్ఇవి చదవండి: రాగాలాపనలో... -
ఆనాడు 4 వేలతో ప్రారంభించి.. ప్రస్తుతం లక్షల్లో...
కరోనా మహమ్మారి చాలా మంది జీవితాలను మార్చేసింది. ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కోవడంతోపాటు, వాటిని ఎలా అధిగమించాల్లో కూడా నేర్పింది. ఆ సమయంలో బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడటంతో.. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన కొంతమందిలో వచ్చింది. ఆ ఆలోచనే ఓ వ్యాపారి జీవతంలో ఇప్పుడింతటి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది.బీహార్‌లోని దర్భాంగ జిల్లాకు చెందిన రాహుల్ భగత్ అనే యువకుడు చదువు పూర్తయ్యాక సొంత వ్యాపారం వైపుగా ఆలోచించాడు. తన దగ్గరలో ఉన్న మార్కెట్ వైపు దృష్టి సారించగా, తనకెదురైన ఓ వ్యాపారమే ప్రస్తుతం ఏడాదికి లక్షల్లో ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. అదే చీపుర్ల తయారీ. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తీసుకుని.. చిన్న తరహా పరిశ్రమల సూచన దిశగా, తక్కువ పెట్టుబడితో.. రాహుల్ కేవలం రూ.4 వేలకే చీపుర్ల వ్యాపారం ప్రారంభించాడు. ప్రస్తుతం అది లక్షల్లో ఆదాయంగా మారింది.ఆరోజు తీసుకున్న నిర్ణయమే.."కరోనా సమయంలో వచ్చిన ఆలోచనే ఆఖరి నిర్ణయంగా మార్చుకుని ఇటువైపుగా అడుగేశాను. ఈ చూట్టూరా కొన్ని ప్రాంతాలలో చీపుర్ల తయారీదారునిగా ఎదిగాను. ప్రతీ ఇంట్లో చీపురు ఉండటం, ఇంటిని శుభ్రంగా మార్చడంలో ఈ వ్యాపారం కీలకంగా ముడిపడి ఉంది గనుకే మంచి ఆదాయం వస్తోంది.ఇక్కడ మూడు రకాల చీపుర్లను తయారు చేస్తాను. ఒక్కోరకమైన చీపురుకి ఒక్కో ధర ఉంటుంది. నెలలో 300 నుంచి 400ల చీపుర్లను విక్రయిస్తాను. ఖర్జూరం, కొబ్బరి చీపురు, పూల చీపురు వంటి మూడు రకాలను తయారుచేయడమే నా వ్యాపారానికి మెట్టు. వీటన్నింటికీ ముడిసరుకుని దర్భాంగ సమితి మార్కెట్ నుంచి తీసుకురావాలి. ఖర్జూరం ఒక్కో చీపురు రూ.20, కొబ్బరి చీపురు రూ. 50 కాగా, పూల చీపురు 60. నెలవారీ ఆదాయం రూ.40 నుంచి 45వేలు వస్తుందని" రాహుల్ భగత్ చెప్పుకొచ్చాడు.ఇవి చదవండి: అంబానీ ఇంట సెలబ్రేషన్స్.. జాన్వీ ధరించిన నెక్లెస్ అంత ఖరీదా? -
టేస్ట్ 'బ్లాగుం'ది..! హాబీగా ఫుడ్ బ్లాగింగ్..
నగరంలో ఫుడ్ బ్లాగింగ్ హాబీ మారుతోంది.. చెప్పుకోదగ్గ సంఖ్యలో సభ్యులు పూర్తిస్థాయి ప్రొఫెషన్స్గా స్థిరపడుతున్నారు. చారిత్రక నేపథ్యం, ఆధునిక వైవిధ్యం.. కలగలిసిన మన నగరం వైవిధ్యమైన అభిరుచులను కలిసి ఆస్వాదించడానికి బ్లాగర్లకు అనేక అవకాశాలను అందిస్తోంది. వీటిని అందిపుచ్చుకుని నగరవ్యాప్తంగా విభిన్న రుచుల విశిష్టతలను వెలుగులోకి తెస్తున్న బ్లాగర్స్..పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్‌ను దక్కించుకుంటూ అటు భోజన ప్రియులకు, ఇటు ఆహార ఉత్పత్తుల విక్రయదారులకు ఆప్తులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్ బ్లాగర్స్‌కు సంబంధించి నగరంలో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి తెలుసుకుందాం. – సాక్షి, సిటీబ్యూరోనిన్న మొన్నటి వరకూ ఫుడ్ బ్లాగింగ్ అంటే ఏంటో ఎవరికీ తెలీదు. కానీ కొంతకాలంగా నగరంలో ఫుడ్ బ్లాగింగ్ సంప్రదాయంగా మారుతోంది. ప్రస్తుతం ఫుల్–టైమ్ ఫుడ్ బ్లాగర్స్ చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. ఈ విషయంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నయ్లు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఆ నగరాల స్థాయిలోనే మన నగరం నుంచీ బ్లాగర్లు పెరుగుతున్నారు. నిజామ్ల నగరంలో ఫుడ్ బ్లాగింగ్ కల్చర్‌తో మమేకమౌతున్నారు.బ్లాగర్స్ మీట్స్..నగరంలోని ఫుడ్ బ్లాగర్స్ సోషల్ మీడియా వేదికల వారీగా వేర్వేరు టీమ్స్‌గా ఏర్పడుతున్నారు. ఇటీవల వార్షిక ఇన్‌స్టాగ్రావ్‌ు ఫుడ్ బ్లాగర్ల సమావేశం జూబ్లీహిల్స్‌లోని ఫ్రోత్ ఆన్ టాప్‌లో జరిగింది. దీంట్లో 70 మందికి పైగా ఫుడ్ బ్లాగర్లు ఒకే చోట సమావేశమయ్యారు. సరదా సంగీతం, ఆట పాటలతో ఉల్లాసంగా గడిపారు. ‘ఈ ఈవెంట్ ద్వారా, ఇన్ఫ్లుయెన్సర్లు, బ్లాగర్లు ఒకరినొకరు కలుసుకోవడానికీ, పలకరించుకోవడానికీ, కొత్త స్నేహితులను ఏర్పర్చుకోవడానికి వేదిక నిలుస్తుందని’ నిర్వాహకులు గత ఏడేళ్లుగా ఫుడ్ బ్లాగర్‌గా పేరొందిన కిరణ్ సాహూ తెలిపారు.బ్లాగర్లు వ్లాగర్లుగా, ఆ తర్వాత ఇన్‌స్టా రీల్స్ ద్వారా కంటెంట్ డెవలపర్స్‌గా.. ఇటీవల కాలంలో ఇన్ఫ్లుయెన్సర్లుగా రూపాంతరం చెందుతున్నారు. ప్రస్తుతం పలు ప్రముఖ బ్రాండ్లకు ప్రచారం, ప్రమోషన్లను అందించడానికి వీరు ఖరీదైన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.ఫుడీ నుంచి ఇన్ఫ్లుయన్సర్గా... వ్యక్తిగతంగా ఫుడ్ లవర్ అయిన కిరణ్ సాహూ.. సిటీలో దినదిన ప్రవర్ధమానమవుతున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్లకు కేరాఫ్‌లా మారారు. గత ఏడేళ్లుగా నగరంలో రుచుల జర్నీ సాగించిన ఆమె.. ఇప్పుడు రోజూ కనీసం ఒకటి నుంచి మూడు వరకూ బ్రాండ్ ప్రచార కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటారు.‘మేం బ్లాగింగ్లోకి ప్రవేశించినప్పుడు మొత్తం లెక్కేస్తే 10మంది బ్లాగర్లు కూడా లేరు. ఇప్పుడు అన్ని స్థాయిల్లో కలిపి 1000 నుంచి 2000 మంది ఉంటారు’ అని సాక్షితో అన్నారు. ఓ వైపు కార్పొరేట్ ఉద్యోగం.. మరోవైపు చిన్న బిజినెస్ నిర్వహిస్తూనే ఫుడ్ బ్లాగర్‌గా రాణిస్తున్న ఈ మాదాపూర్ నివాసి... ఇష్టమైన వ్యాపకాలు ఎన్ని చేసినా కష్టం అనిపించవు అంటూ స్పష్టం చేస్తున్నారు.పురస్కారాల వంట...సిటీ ఫుడ్ బ్లాగర్స్ లక్షల సంఖ్యలో ఫాలోవర్స్‌కు, మిలియన్ల సంఖ్యలో వీక్షకులకు చేరువవుతున్నారు. అంతే కాదు చెప్పుకోదగ్గ సంఖ్యలో పురస్కారాలను కూడా అందుకుంటున్నారు. మెట్రో నగరాల్లోని ఫుడ్ బ్లాగర్స్‌కు థీటుగా బ్రాండ్స్‌కు ప్రచారం చేస్తూ తగినంత రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఓ చేత్తో సంపాదిస్తూనే.. మరో చేత్తో అవార్డులను కూడా సొంతం చేసుకుంటున్నారు.బిర్యానీ ఒక్కటే కాదు...వంటగది నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి నగరంలో అత్యంత ప్రముఖ ఫుడ్ ఇన్ఫ్లుయన్సర్స్లో ఒకరిగా మారారు హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్, ఫుడ్ ఇన్ఫ్లుయన్సర్, మార్కెటర్ మొహమ్మద్ జుబైర్ అలీ. సమగ్ర రుచుల సమీక్షల నుంచి ఆకట్టుకునే ఫొటోగ్రఫీ వరకూ ఆయన నిర్వహించే ‘హైదరాబాద్ ఫుడ్ డైరీస్’ పేజీ అనేక ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తోంది.రెస్టారెంట్లు లాంజ్‌ల నుంచి ఆకట్టుకునే వీధి తినుబండారాల వరకూ పసిగట్టి.. వాటికి బ్లాగ్‌లో పట్టం గట్టడమే జుబైర్ పని. హైదరాబాద్ అంటే కేవలం బిర్యానీలకు మాత్రమే కాదని, అరుదైన రుచులను అందించే వంటకాలను కలిగిన గొప్ప నగరం అంటారాయన. గత దశాబ్ద కాలంగా జుబైర్, అర డజను అవార్డులను తన బ్యాగ్‌లో ఉంచుకుని, జుబైర్ అనేక ప్రసిద్ధ బ్రాండ్లకు ఇన్ఫ్లుయెన్సర్గా మారాడు.ఇవి చదవండి: 'ఐసైపోతారు'..! సహజ రుచులకు ఆహారప్రియులు ఫిదా.. -
Umamani: సముద్రం ఘోషిస్తోంది..
సముద్రం నిత్యం ఘోషిస్తూ ఉంటుంది. ఆ ఘోషకు భావకవులు రకరకాల అర్థాలు చెప్తుంటారు. కానీ సముద్రం లోపల ఏముంది? సముద్రం లోపల మరో ప్రపంచం ఉంది. పగడపు దీవులమయమైన ఆ అందమైన ప్రపంచాన్ని చందమామ కథల్లో చదివాం. మన ఊహల్లో అద్భుతమైన దృ«శ్యాన్ని ఊహించుకున్నాం. ఇప్పటికీ అదే ఊహలో ఉన్నాం. కానీ ఆ ఊహలో నుంచి వాస్తవంలోకి రమ్మని చెబుతున్నారు ఉమామణి. ఒకప్పుడు అందమైన పగడపు దీవులను చిత్రించిన ఆమె కుంచె ఇప్పుడు అంతరించిపోయిన పగడపు దీవులకు అద్దం పడుతోంది. బొమ్మలేయని బాల్యం..‘‘మాది తమిళనాడులోని దిండిగల్. నాకు బొమ్మలేయడం చాలా ఇష్టం. చిన్నప్పుడు ఎప్పుడు చూసినా రంగు పెన్సిళ్లతో బొమ్మలు గీస్తూ కనిపించేదాన్ని. అది చూసి నానమ్మ ‘పిచ్చి బొమ్మల కోసం కాగితాలన్నీ వృథా చేస్తున్నావు. చక్కగా చదువుకోవచ్చు కదా’ అనేది. అలా ఆగిపోయిన నా చిత్రలేఖనం తిరిగి నలభై దాటిన తర్వాత మొదలైంది. ఈ మధ్యలో నాకు ఓ డాక్టర్‌తో పెళ్లి, వారి ఉద్యోగరీత్యా మాల్దీవులకు వెళ్లడం, ఓ కొడుకు పుట్టడం, ఆ కొడుకుకి కాలేజ్ వయసు రావడం జరిగిపోయాయి.ఇంతకాలం గృహిణిగా ఉన్న నాకు కొడుకు కాలేజ్కెళ్లిపోయిన తర్వాత ఆ ఖాళీ సమయాన్ని చిన్నప్పుడు తీరని కోరిక కోసం కేటాయించాను. గులాబీల నుంచి టులిప్స్ వరకు రకరకాల పూలబొమ్మలు వేసిన తర్వాత నా చుట్టూ ఉన్న సముద్రం మీదకు దృష్టి మళ్లింది. పగడపు దీవులు నా చిత్రాల్లో ప్రధాన భూమిక అయ్యాయి. తొలి చిత్ర ప్రదర్శన మాల్దీవులలోని మెరైన్ సెంటర్లో పెట్టాను. ఆ తర్వాత అనేక ప్రదర్శనల్లో నా చిత్రాలను ప్రదర్శించాను. వివాంత మాల్దీవ్స్ ప్రదర్శన సమయంలో ఒక భారతీయ మహిళ వేసిన ప్రశ్న నా దిశను మార్చింది.‘సముద్ర గర్భం ఎలా ఉంటుందో ఏమేమి ఉంటాయో స్వయంగా చూడకుండా బొమ్మలేయడం ఏమిటి’ అన్నదామె. ఆమె వ్యాఖ్య నాకు మొదట్లో అసమంజసంగా అనిపించింది. అనేక పరిశోధకుల డాక్యుమెంటరీలను చూసిన అనుభవంతోనే కదా చిత్రించాను. నేను స్వయంగా చూస్తే కొత్తగా కనిపించేది ఏముంటుంది... అని కూడా అనుకున్నాను. ఇంత సందిగ్ధం ఎందుకు... ఒకసారి సముద్రగర్భంలోకి వెళ్లి చూద్దాం అని కూడా అనుకున్నాను. అప్పుడు మా అబ్బాయి మా ΄ాతికేళ్ల వివాహ వార్షికోత్సవం బహుమతిగా నన్ను స్కూబా డైవింగ్ కోర్సులో చేర్చాడు.డైవింగ్కంటే ముందు ఈత రావాలి కదా అని చెన్నైకి వచ్చి రెండు వారాల స్విమ్మింగ్ కోర్సులో చేరాను. తిరిగి మాల్దీవులకెళ్లి స్కూబా డైవింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాను. తొలి రోజు అంతా అగమ్యంగా అనిపించింది. రెండవ రోజు కూడా అదే పరిస్థితి. మానేద్దామనే నిర్ణయానికి వచ్చేశాను. కోచ్ నా మాటలు పట్టించుకోలేదు. ప్రయత్నాన్ని కొనసాగించమని మాత్రం చె΄్పారు. నాకు నేను నెల రోజుల గడువు పెట్టుకున్నాను. ఆ నెలలో నావల్ల కాకపోతే మానేద్దామని నా ఆలోచన. ఆ నెల రోజుల్లో డైవింగ్‌కి అనుగుణంగా మానసికంగా ట్యూన్ అయిపోయాను.సముద్రగర్భాన్ని చిత్రించాను.. సముద్రం అడుగున దృశ్యాలు నన్ను వేరేలోకంలోకి తీసుకెళ్లిపోయాయి. పగడపు చెట్లు నిండిన దిబ్బలు, రకరకాల చేపలు, ΄ాములు ఒక మాయా ప్రపంచాన్ని చూశాను. ఆ ప్రపంచాన్ని కాన్వాస్ మీద చిత్రించడం మొదలుపెట్టాను. ఒక చిత్రానికి మరో చిత్రానికి మధ్య మాటల్లో వర్ణించలేనంత వైవిధ్యత వచ్చేసింది. ఆ చిత్రాలన్నింటినీ మాల్దీవుల మెరైన్ సింపోజియమ్ 2016లో ప్రదర్శించాను. ఆ చిత్రాలు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్లా ఓషన్ రీసెర్చర్లు, అంతరించిపోతున్న పగడపు దిబ్బల పరిశోధకులకు ఉపయోగపడ్డాయి. కొంతకాలం తర్వాత సముద్రగర్భంలోని సన్నివేశాలను కెమెరాలో బంధించాలనుకున్నాను. ఫొటోగ్రఫీలో అనుభవం లేకపోవడంతో శబ్దరహితంగా పేలవంగా వచ్చింది ఫిల్మ్. అప్పటి నుంచి ఫిల్మ్ మేకింగ్, డాక్యుమెంటరీలు తీసే వారి దగ్గర మెళకువలు నేర్చుకునే ప్రయత్నం చేశాను. చాలామంది స్పందించలేదు. ఫిల్మ్ మేకర్ ప్రియా తువాస్సెరీ మాత్రం నాతో కలిసి ఫిల్మ్ తీయడానికి సిద్ధమయ్యారు.చిత్రీకరణ కోసం 2018లో మనదేశంలోని రామేశ్వరం, రామనాథపురం, టూటికోరన్ తీరాల్లో డైవ్ చేశాను. ఆశ్చర్యంగా సముద్రం అడుగుకి వెళ్లే కొద్దీ పగడపు దిబ్బలు కాదు కదా జలచరాలు కూడా కనిపించలేదు. ΄్లాస్టిక్ వ్యర్థాలు దిబ్బలుగా పేరుకుపోయి ఉన్నాయి. రసాయనాలు, పురుగుమందులు, ఎరువుల వ్యర్థాలను సముద్రపు నీటిలోకి వదలడంతో జలచరాలు అంతరించిపోయాయి. సునామీ విలయంలో పగడపు దీవులు అతలాకుతలం అయిపోయాయి. శిథిలమైన ఆనవాళ్లు తప్ప పగడపు చెట్ల సమూహాలు లేవు. చెట్లు చనిపోయిన దిబ్బలనే వీడియో, ఫొటోలు తీశాను.మనిషి తన సౌకర్యం కోసం చేసే అరాచకానికి సముద్రం ఎలా తల్లడిల్లిపోతోందో తెలియచేస్తూ ఆ ఫొటోలతో ప్రదర్శన పెట్టాను. మా సొంతూరు తమిళనాడులోని దిండిగల్‌తో మొదలు పెట్టి అనేక స్కూళ్లు, కాలేజ్‌లకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కలిగిస్తున్నాను. సముద్రం ఘోషిస్తోంది. ఆ ఘోషను విందాం. ప్రకృతి సమతుల్యతను కా΄ాడుకుందాం. ఓషన్ కన్జర్వేషన్, క్లైమేట్ చేంజ్ మీద పరిశోధన చేసే వాళ్లకు నేను తీసిన ఫొటోలు, చిత్రలేఖనాలు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్లా ఉపయోగపడుతున్నాయి.ఒక సాధారణ గృహిణిగా నేను 43 ఏళ్ల వయసులో కుంచె పట్టి పెయింటింగ్స్ మొదలుపెట్టాను. 49 ఏళ్లకు స్కూబా డైవింగ్ నేర్చుకుని సాగర సత్యాలను అన్వేషించాను. సమాజానికి ఉపయోగపడే సమాచారాన్ని సేకరించగలిగాననే సంతృప్తి కలుగుతోంది. మొత్తంగా నేను చెప్పేదేమిటంటే ‘వయసు ఒక అంకె మాత్రమే. మన ఆసక్తి మనల్ని చోదకశక్తిగా నడిపిస్తుంది’. అంటారు ఉమామణి.ఇవి చదవండి: Fathers Day 2024: తండ్రి కళ్లలో కోటి వెలుగులు తెచ్చింది -
ఒక్క ఆలోచనతో రూ.15780 కోట్ల బిజినెస్.. ఎవరీ 'ప్రతీక్ సూరి'?
చదువు పూర్తయిన తరువాత ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకునే వారు చాలామంది ఉన్నారు. అయితే బిజినెస్ చేసి ఎదగాలని చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. అలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'ప్రతీక్ సూరి'. ఇంతకీ ఈయన ఎవరు? ఈయన చేస్తున్న బిజినెస్ ఏంటి? వ్యాపారంలో ఎలా సక్సెస్ సాధించారు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఢిల్లీకి చెందిన ప్రతీక్ సూరి తన పాఠశాల విద్యను బరాఖంబా రోడ్‌లోని మోడరన్ స్కూల్లో పూర్తి చేశారు. ఆ తరువాత 2006లో అతను దుబాయ్‌లోని బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదవడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి వెళ్లాడు.దుబాయ్‌లో చదువుకునే రోజుల్లోనే.. సుమారు 200 విభిన్న దేశాలకు చెందిన వ్యక్తులతో కూడిన యూఏఈ జనాభాలోని అపారమైన వైవిధ్యం అతనిని ఎంతగానో ఆకర్షించింది. ఆ సమయంలోనే గ్లోబల్ కమ్యూనిటీలో లీనమవ్వడం కావలసిన అపరిమితమైన అవకాశాల గురించి కూడా తెలుసుకున్నారు.చదువు పూర్తయిన తరువాత.. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచించి.. అనుకున్న విధంగానే 2012 ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను ఉత్పత్తి చేసే 'మాసర్' (Maser) సంస్థను స్థాపించారు. ఈ సంస్థ అతి తక్కువ కాలంలోనే ఆఫ్రికన్ మార్కెట్లో కూడా విస్తరించింది.కంపెనీ ఉత్పత్తి అయిన స్మార్ట్ టీవీ.. ఆఫ్రికన్ మార్కెట్లో అనూహ్యమైన ఆదరణ పొందగలిగింది. ఆ సమయంలో కంపెనీ ఏకంగా 8,00,000 యూనిట్ల బ్రాండ్ స్మార్ట్ టీవీలను విక్రయించగలిగింది. ఆ తరువాత ఆఫ్రికన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడులు పెట్టడంతో మాసర్ కంపెనీ మరింత గణనీయమైన పురోగతిని సాధించగలిగింది.ప్రతీక్ సూరి అచంచలమైన కృషి వల్ల కంపెనీ రోజు రోజుకి అభివృద్ధి వైపు అడుగులు వేసింది. వ్యాపార రంగంలో విజయవంతమైన బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేసింది. 2023లో మాసర్ నికర విలువ ఏకంగా 1.9 బిలియన్ డాలర్లకు చేరింది. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.15,780 కోట్లు. పోటీ వ్యాపార ప్రపంచంలో తనదైన ముద్ర వేయడానికి ఎదురయ్యే అడ్డంకులను ధిక్కరించి సెల్ఫ్ మేడ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన ప్రతీక్ సూరి కథ నేడు వ్యాపార ప్రపంచంలో ఎంతోమందికి ఆదర్శప్రాయం. -
Aditya Srivastava: యువతలో ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్న పేరు.. 'ఆదిత్య శ్రీవాస్తవ'?
యువతలో ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్న పేరు.. ఆదిత్య శ్రీవాస్తవ. యూపీఎస్సీ పరీక్షలో టాప్ 1లో నిలిచిన ఆదిత్యకు తొలి ప్రయత్నంలో ‘ఫెయిల్యూర్’ ఎదురైంది. మరింత కష్టపడి రెండో ప్రయత్నంలో 236 ర్యాంకు సాధించాడు. ‘ఇది చాలదు’ అనుకొని తప్పులను సరిద్దుకొని మరో ప్రయత్నంలో నెంబర్ వన్‌గా నిలిచాడు లక్నోకు చెంది ఆదిత్య. ‘కష్టపడడం అవసరమేగానీ ఒక పద్ధతి ప్రకారం పడాలి’ అని స్మార్ట్ స్ట్రాటజీతో అపూర్వ విజయం సాధించాడు ఆదిత్య శ్రీవాస్తవ.. ప్రపంచంలోని లీడింగ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులలో ఒకటైన ‘గోల్డ్‌మాన్ శాక్స్’తో ప్రొఫెషనల్ జర్నీ ప్రారంభించాడు ఆదిత్య. ‘బెంగళూరులో పెద్ద బ్యాంకులో పని చేస్తాడు’ అని చుట్టాలు, మిత్రుల తన గురించి కొత్త వారికి పరిచయం చేసేవారు. తన గురించి గొప్పగా పరిచయం చేస్తున్న సంతోషంలో ఉండి, అక్కడికే పరిమితమై ఉంటే ఆదిత్య సివిల్ సర్వీసెస్‌లోకి అడుగు పెట్టేవాడు కాదేమో. పెద్ద కంపెనీలో పనిచేస్తున్నా సరే ఆదిత్య హృదయంలో సివిల్ సర్వీసులలోకి వెళ్లాలి అనే కోరిక బలంగా ఉండేది. సివిల్స్ విజేతల మాటలు తనకు ఇన్స్పైరింగ్గా అనిపించేవి. ఒక ప్రయత్నం చేసి చూడాలనిపించేది. పదిహేను నెలల తరువాత.. ఉద్యోగాన్ని, బెంగళూరును వదిలి హోమ్ టౌన్ లక్నోకు వచ్చాడు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేర్ కావడంప్రారంభించాడు. ‘ఎందుకొచ్చిన రిస్క్’ అని కొద్దిమంది అన్నా ఆ మాటను పట్టించుకోలేదు. 2021.. పరీక్ష సమయం రానే వచ్చింది. అయితే ప్రిలిమినరీ స్టేజిలోనే ఫెయిల్యూర్ పలకరించింది. మామూలుగానైతే రథాన్ని వెనక్కి మళ్లించి వేరే కంపెనీలో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. అయితే ఆదిత్య నిరాశపడలేదు. వెనకడుగు వేయలేదు. ఎలాగైనా సరే తన కలను నిజం చేసుకోవాలి అని గట్టిగా అనుకున్నాడు. గత సంవత్సర ప్రశ్నపత్రాల ఆధారంగా ఇన్–డెప్త్ ఎనాలసిస్‌తో ప్రిపరేషన్ విధానాన్ని రూపొందించుకున్నాడు. ప్రశ్నల సరళి, సెంటెన్స్ ఫార్మేషన్‌పై దృష్టి పెట్టాడు. మాక్ టెస్ట్‌లు, ఇంటర్వ్యూలకు హాజరయ్యేవాడు. స్ట్రాటజిక్ ప్రిపరేషన్కుప్రాధాన్యత ఇచ్చాడు. 2022 యూపీఎస్సీ ఎగ్జామ్‌లో 236 ర్యాంకు సాధించాడు. ఇండియన్ పోలిస్ సర్వీస్(ఐపీఎస్)కు ఎంపికయ్యాడు. ట్రైనింగ్‌కు కూడా వెళ్లాడు. అయినా సరే, ఇంకా ఏదో సాధించాలనే తపన. టాపర్లతో పోల్చితే తాను ఎందుకు వెనకబడిపోయాననే కోణంలో లోతైన విశ్లేషణప్రారంభించాడు. చేసిన తప్పులు ఏమిటి, వాటిని ఎలా సరిద్దుకోవాలి అనేదానిపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. యూపీఎస్సీ తాజా ఫలితాల్లో అపూర్వమైన విజయాన్ని సాధించాడు. నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. రిజల్ట్ ప్రకటించడానికి ముందు మనసులో.. ‘టాప్ 70లో ఉండాలి’ అనుకున్నాడు ఆదిత్య. అయితే ఏకంగా మొదటి ర్యాంకు దక్కింది. అది అదృష్టం కాదు. కష్టానికి దొరికిన అసలు సిసలు ఫలితం. ‘సివిల్స్‌లో విజయం సాధించడానికి సెల్ఫ్–మోటివేషన్ అనేది ముఖ్యం’ అంటాడు ఆదిత్య శ్రీవాస్తవ. పక్కా ప్రణాళిక.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవకు పరీక్షలలో బోలెడు మార్కులు సొంతం చేసుకోవడం కొత్తేమీ కాదు. ఐఐటీ, కాన్పూర్‌లో బీటెక్, ఎంటెక్ చేశాడు. బంగారు పతకాన్ని అందుకున్నాడు. ఐఐటీలో డెవలప్ చేసుకున్న ఎనాలటికల్ స్కిల్స్ యూపీఎస్సీ ప్రిపేరేషన్‌కు ఉపయోగపడ్డాయి. ‘కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్’లాంటి వాటితో ప్రిపరేషన్ మెథడ్‌ను రూపొందించుకున్నాడు. ‘కష్టానికి పక్కా ప్రణాళిక తోడైతేనే విజయం సాధ్యం’ అనేది ఆదిత్య నమ్మే సిద్ధాంతం. పాఠ్యపుస్తకాలకు ఆవల ఆదిత్యకు నచ్చిన సబ్జెక్ట్...రాక్షస బల్లులు. వాటికి సంబంధించిన కొత్త విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటాడు. ఆదిత్య శ్రీవాస్తవ నోటి నుంచి తరచుగా వినిపించే మాట ‘మన దేశంలోనే ఉంటాను. దేశం కోసమే పనిచేస్తాను’ ఇవి చదవండి: యూట్యూబర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే షాక్! -
Dipraj Jadhav: సరదాగా చేసిన ఒక వీడియో స్థాయినే మార్చేసింది..
‘అనుకోలేదని ఆగవు కొన్ని’ అంటాడు కవి. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ కావాలని దిప్రజ్ జాదవ్ ఎప్పుడూ అనుకోలేదు. డిజిటల్ కంటెంట్ క్రియేషన్ అంటే ఏమిటో కూడా తెలియదు. సరదాగా చేసిన ఒక వీడియో అతడి స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లింది. ప్రముఖ డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా డిజిటల్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చింది... ఒక వైరల్ వీడియోతో మహారాష్ట్రలోని షిర్పూర్ అనే చిన్న పట్టణానికి చెందిన దిప్రజ్ జాదవ్ జీవితం ఊహించని మలుపు తిరిగింది. మరాఠీ సినిమా ‘లై బారి’లోని ఒక డైలాగ్ మీమ్ మాషప్ చేశాడు జాదవ్. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ దృష్టిని కూడా ఆ వీడియో ఆకట్టుకుంది. వైరల్ అయింది. ‘ఫేస్బుక్లో నేను పేజీ స్టార్ట్ చేసినప్పుడు కంటెంట్ క్రియేషన్ అనేది పెద్ద విషయం కాదు. దానికి అంత ్ర΄ాముఖ్యత కూడా లేదు. అలాంటి సమయంలోనే కొత్త కొత్త వీడియోలు చేసేవాడిని’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు దిప్రజ్ జాదవ్. జాదవ్‌కు సినిమాలు అంటే చాలా ఇష్టం. అందులోని ΄ాపులర్ సీన్లకు తనదైన స్టైల్ జోడించి అనుకరించే వాడు. పుణెలో యానిమేషన్ కోర్సు చేస్తున్నప్పుడు వీడియో ఎడిటింగ్‌పై ఇష్టం పెరిగింది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను పర్ఫెక్ట్గా మిక్స్ చేయడంలో గట్టి పట్టు సం΄ాదించాడు. ఆ విద్య అతడికి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్‌లలో ఎంతోమంది ఫాలోవర్స్‌ను తెచ్చి పెట్టింది. సెకండ్ టర్నింగ్ ΄ాయింట్ విషయానికి వస్తే,.,.. రామానంద్‌సాగర్ ‘రామాయణం’లోని రాముడు, రావణుడికి మధ్య జరిగిన యుద్ధానికి సంబంధించిన వీడియోకు ర్యాపర్ డివైన్ ΄ాడిన ‘సీన్ క్యా హై’ ΄ాటను జోడించాడు. ఇది చూసి మ్యూజిక్ ్ర΄÷డ్యూసర్ న్యూక్లియ(ఉద్యాన్ సాగర్) జాదవ్‌ను సంప్రదించి సబ్ సినిమా సిరీస్‌లో భాగంగా ఇలాంటి ఫిల్మీ మాషప్స్ మరిన్ని కావాలని, వాటిని మ్యూజిక్ ్ర΄ోగ్రాంలలో ఉపయోగించుకుంటానని చె΄్పాడు. జాదవ్ క్రియేటివిటీకి న్యూక్లియ బాగా ఇంప్రెస్ అయ్యాడు. ‘ఊహకు అందనిది ఆలోచించే సామర్థ్యమే అరుదైన సృజనాత్మకత. ఇలాంటి అరుదైన సృజనకారులలో జాదవ్ ఒకరు. రెండు పరస్పర విరుద్ధ అంశాలను మిళితం చేసి అందరినీ ఆకట్టుకుంటాడు’ అంటాడు న్యూక్లియ. చిత్రపరిశ్రమలో పనిచేయాలనేది జాదవ్ కోరిక. బాలీవుడ్‌లోని కొన్ని సినిమాలు, బాట్లా హౌజ్, రాకెట్ బాయ్స్లాంటి వెబ్‌సిరీస్‌లకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశం వచ్చింది. ‘నేను చేస్తున్న పని గురించి నా తల్లిదండ్రులకు అవగాహన లేదు. ఏదైన స్థిరమైన ఉద్యోగం చేయాలని కోరుకునేవారు. అయితే నాకు వచ్చిన గుర్తింపు చూసిన తరువాత వారి ఆలోచన మారింది. నాపై నమ్మకం పెరిగింది’ అంటాడు దిప్రజ్ జాదవ్. 28 సంవత్సరాల జాదవ్ ‘ఫోర్బ్స్ 30 అండర్ 30–2024’ జాబితాలో చోటు సాధించాడు. కొత్త ద్వారాలు ‘పదిమందిలో ఒకరు’ అని కాకుండా పదిమందికి భిన్నంగా ఆలోచించినప్పుడే మంచి ఫలితం సాధించగలం. ఒక టాపిక్ గురించి మనకు ఇష్టం ఏర్పడినప్పుడు దానికి సంబంధించి అన్ని కోణాల గురించి తెలుసుకోవాలి. అప్పుడే ఆ టాపిక్‌పై పట్టు వస్తుంది. కొత్తగా ఆలోచించడానికి ద్వారాలు తెరుచుకుంటాయి. – దిప్రజ్ యాదవ్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్ దిప్రజ్ జాదవ్ -
Muthu Nandini: పర్యావరణహిత భవనం! ఈ ముత్తు నందిని ప్యాలెస్..
రాజ్ చందర్ పద్మనాభన్, నాగ జయలక్ష్మి దంపతులు తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారిలో నివసించేవారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకునే క్రమంలో వీరు అనుసరించిన విధానం ఇప్పుడు దేశమంతటినీ ఆకర్షిస్తోంది. పర్యావరణ ప్రేమికులనైతే మరీ ఎక్కువగా ఆకట్టుకుంటోంది. రెండేళ్ల కిందట గృహప్రవేశం చేసుకున్న కొత్త ఇల్లది. అయితే ఆ ఇంట్లో అడుగుపెడితే కాలం గిర్రున సినిమా రీల్‌లాగ వందేళ్ల వెనక్కి తిరిగిపోయిందా అనిపిస్తుంది. ఇంటిని చూడడానికి వచ్చిన వాళ్లను అతిథి మర్యాదలతో ముంచెత్తుతారు ఈ దంపతులు. సేంద్రియ పద్ధతిలో పండించిన దినుసులు, కాయగూరలతో సంప్రదాయ తమిళ, చెట్టినాడు వంటలను వడ్డిస్తారు. ఎర్రమట్టి, సున్నపు రాయితో నిర్మించిన ఇంట్లో భూగర్భ జలాలను పరిరక్షించే ఏర్పాటు ఉంది. బంకమట్టి నిర్మాణం కావడంతో ఎండాకాలం చల్లగా ఉంటుంది. నేచర్ ఫ్రెండ్లీ ట్రావెల్‌ను ఇష్టపడే వాళ్లు ఇక్కడ బస చేస్తుంటారు. బస చేయకపోయినా చూసి పోవడానికి వచ్చేవాళ్లు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈ కాలంలో ఇంటిని ఇలా ఎందుకు కట్టుకున్నారనే ప్రశ్న దాదాపుగా ప్రతి ఒక్కరి నుంచి ఎదురవుతుంటుంది. జయలక్ష్మి ప్రతి ఒక్కరికీ పూసగుచి్చనట్లు వివరిస్తుంటుంది. బాల్యంలోకి వెళ్లారాయన! ‘‘రాజ్‌చందర్ వృత్తిరీత్యా జియో డాటా అనలిస్ట్. ఆయనకు ఇష్టమైన రోజులంటే చిన్నప్పుడు వాళ్ల అమ్మమ్మ గారింట్లో గడిపిన బాల్యమే. పైగా రాజ్ అభిరుచి, విధి నిర్వహణ కూడా పర్యావరణవేత్తలతో కలిసి పని చేయడమే. ఈ రెండు ఇష్టాలను కలుపుతూ చక్కటి ఇల్లు కట్టుకోవాలని ఎప్పుడూ చెప్పేవారు. నాక్కూడా మా సంప్రదాయ నిర్మాణంలో ఉండే సౌందర్యం చాలా ఇష్టం. ఇద్దరి అభిరుచులూ కలవడంతో ఇంటిని ఇలా కట్టుకున్నాం. మా ఇద్దరి ఇష్టాల మేరకు ఎలా కట్టుకోవాలో ఒక ఐడియా వచ్చేసింది. ఎక్కడ కట్టాలనే విషయంలో ఒక అభి్రపాయానికి రావడం కొంచెం కష్టమే అయింది. లొకేషన్ సెర్చింగ్ మొదలు పెట్టాం. సంజీవని శకలం.. కన్యాకుమారికి సమీపంలో పోథయాడి గ్రామాన్ని చూసినప్పుడు కొండలు, పచ్చటి చెట్లతో ప్రదేశం బాగుందనిపించింది. ఆశ్చర్యంగా మరో విషయం తెలిసింది. అదేంటంటే... రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు వైద్యం కోసం హనుమంతుడు ఏకంగా సంజీవని మొక్క ఉన్న పర్వతం అంతటినీ ఎత్తుకొచ్చాడని విన్నాం. వైద్యం చేసిన తర్వాత ఆ పర్వతాన్ని తిరిగి తీసుకెళ్లే క్రమంలో పర్వతంలోని ఒక శకలం విరిగి కింద పడి పోయిందని, ఆ శకలమే ఈ కొండ అని చెప్పారు స్థానికులు. వాళ్ల విశ్వాసాన్ని పక్కన పెడితే ఆ కొండమీద చుట్టు పక్కల ఉన్న మొక్కలన్నీ ఔషధ మొక్కలే. ప్రకృతితో మమేకమై నివసించడానికి మాకు ఇంతకంటే సౌకర్యవంతమైన ప్రదేశం మరోటి ఉండదేమో అనిపించింది. అంతే... 2021లో నిర్మాణం మొదలు పెట్టాం. ఒక ఏడాదిలో తమిళ, వేనాడు, చెట్టినాడు సంస్కృతుల సమ్మేళనమైన మా ఇంటి నిర్మాణం పూర్తయింది. సంప్రదాయ కళాకృతుల సేకరణ నా హాబీ. ఇంటిని తమిళ సంప్రదాయ సంస్కృతికి ప్రతీకగా మలిచాను. ఇంటి ముఖద్వారం నుంచి నేల, గోడ, మెట్లు, పై కప్పు, అలంకరణ వస్తువులు ప్రతి ఒక్కటీ తమ వైభవాన్ని తామే చెప్పుకుంటాయి. పర్యావరణ హితమైన సున్నపు పొడి ఇటుకలు, ఎర్ర మట్టి, ఆవుపేడ, ధాన్యం పొట్టు, కోడిగుడ్లు, బెల్లంతోపాటు అత్తంగుడి నది తీరాన దొరికే ఇసుకతో తయారు చేసే అత్తంగుడి టైల్స్‌ను వాడాం. పై కప్పుకి కాంక్రీట్ వాడకాన్ని తగ్గించి ఫిల్లర్ స్లాబ్ టెక్నిక్ ఉపయోగించాం. వర్షపు నీటిని నిల్వ చేయడానికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్, కరెంటుకోసం సోలార్ ప్యానెల్స్ పెట్టాం. ఈ మట్టి సౌధంలో 5బెడ్ రూమ్‌లు, మూడు బాల్కనీలు, మూడు లివింగ్ స్పేస్‌లు ఉన్నాయి. ఇప్పటివరకు రెండు వందల మందికి పైగా పర్యాటకులు ఈ హోమ్ స్టేలో బస చేశారు. ఆహారం కూడా తమిళనాట ప్రాంతాల వారీగా విలసిల్లిన విభిన్నమైన రుచులుంటాయి. ఇంటి ఆవరణలో అన్ని రకాల కూరగాయలనూ పండిస్తాం. వంటగదిలో వచ్చే వ్యర్థాలనే ఎరువుగా వేస్తాం’’ అని తమ పర్యావరణ హిత భవనం ముత్తు నందిని ప్యాలెస్ గురించి వివరించింది జయలక్ష్మి. ఇవి చదవండి: Afshan Ashiq: 'ఆ రోజు నేను పోలీసుల మీద రాళ్లు రువ్వాను' -
Womens Day: 'జనతనయ బస్తర్..' చరిత్ర ఒక భద్రత.. భరోసా..!
"బస్తర్.. కొండకోనల్లో.. వాగువంకల్లో ఒదిగిన ఈ ప్రాంతానికి లోకం పోకడలతో పెద్దగా పరిచయం లేదు! కాని దానికి సంబంధించిన ఏదో ఒక వార్తను ఈ ప్రపంచం నిత్యం వింటూనే ఉంటుంది! బస్తర్‌ను కమ్యూన్స్కి నమూనాగా మలచాలని మావోయిస్ట్‌లు.. మోడర్న్ వరల్డ్‌కి అనుసంధించాలని ప్రభుత్వాలు.. ఏ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిస్తోందో.. ఏ ప్రయోజనాన్ని చేకూరుస్తోందో.. అక్కడి జనమే చెప్పాలి! కానీ రెండు పరస్పర విరుద్ధమైన తీరులు.. తరీఖాల మధ్యనున్న బస్తర్ వాసులు గుంభనంగానే ఉంటారు.. ఇంకా చెప్పాలంటే భయంగా ఉంటారు! ఆ భయాన్ని పోగొట్టి.. వారి మంచిచెడులను అడిగే దళం ఒకటి అక్కడి గూడేల తలుపులు తడుతుంది! ఆ దళంలో ఉన్నవాళ్లంతా ఆదీవాసీల కూతుళ్లు.. అక్కాచెల్లెళ్లే! వాళ్లకు శిక్షణనిచ్చి సాయుధులుగా పంపిస్తోంది ప్రభుత్వమే! అయినా ఆ బిడ్డలను చూస్తే ఆ గిరిజనులకు ఒక భరోసా.. భద్రత! ఆ విశ్వాసం పొందడానికి ఈ బిడ్డలు సర్కారు నమూనాను అనుసరించట్లేదు.. ఆత్మీయతను పంచుతున్నారు! అనునయిస్తున్నారు. తమ జనానికి ఏం కావాలో.. ఏం అవసరమో తెలుసు కాబట్టి ఆ దిశలో నడుస్తున్నారు.. నడిపిస్తున్నారు! ఇది జనతన సర్కార్‌కి.. సర్కార్‌కి మధ్య పోరును వివరించే వ్యాసం కాదు! ఆ రెండిటి నడుమ ఘర్షణకు గురై.. తలుపులు మూసేసుకున్న జనాలను అక్కున చేర్చుకుని సర్కారు అభివృద్ధిలో తమ వాటాను వారు అందుకునేలా చేస్తున్న ఆ కూతుళ్లు.. అక్కాచెల్లెళ్ల గురించి! మార్చి 8 విమెన్స్ డే సందర్భంగా ఈ విమెన్ పవర్ గురించి! వివరాల్లోకి వెళ్లేముందు బస్తర్ చరిత్రనూ తెలుసుకుందాం క్లుప్తంగా.." రామాయణంలో దండకారణ్యంగా చెప్పుకునే దట్టమైన అటవీ ప్రాంతం తెలంగాణకు ఆవల ఛత్తీస్‌గఢ్‌లో గోదావరి, ఇంద్రావతి, శబరి నదుల నడుమ విస్తరించి ఉంది. ఈ అడవుల్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎంత జనాభా ఉన్నారనే అంశాలపై రెండు దశాబ్దాల కిందటి వరకు స్పష్టమైన లెక్కలు లేవు. అక్బర్ కాలంలో తొలిసారి, ఆ తర్వాత బ్రిటిష్ హయాంలో మరోసారి ఇక్కడి ప్రజలు, వారి సంస్కృతి, ఆహారపు అలవాట్లు తదితర వివరాలను తెలుసుకునేందుకు కొంత ప్రయత్నం జరిగింది. అయితే దట్టమైన అడవుల కారణంగా ఈ ప్రయత్నాలు తుదివరకు సాగలేదు. ఇక్కడి ఆదివాసీ తెగ ప్రజలకు అడవే లోకం. బయటి ప్రపంచంతో సంబంధం లేదు. వీళ్లకు దేవుడైనా, దయ్యమైనా ప్రకృతే! ఆ తర్వాత బ్రిటిష్ వారి రాక, వారు రూపొందించిన కఠినమైన చట్టాల ఆసరాతో అటవీశాఖ సిబ్బంది అడవుల్లోకి అడుగు పెట్టారు. దీంతో ఆదివాసీలపై అటవీశాఖ ఆగడాలు శ్రుతి మించాయి. అటవీశాఖ సిబ్బంది అంటే అడవుల్లో ఆదివాసీల జీవనానికి అడ్డుతగిలే వారుగా ముద్ర పడిపోయారు. జనతన సర్కార్.. తెలంగాణలో 1980వ దశకంలో మావోయిస్ట్ ఉద్యమం తీవ్రమైంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ పల్లెలు అన్నలకు అడ్డాలుగా మారాయి. ఇదే క్రమంలో 1982లో కొందరు మావోయిస్ట్‌లు ఏటూరునాగారం వద్ద గోదావరి తీరం దాటి బస్తర్ అడవుల్లోకి చొచ్చుకుపోయారు. అటవీశాఖ సిబ్బంది అణచివేతతో ఇబ్బంది పడుతున్న ఆదివాసీలకు అండగా నిలిచారు. వారు మాట్లాడే భాష నేర్చుకున్నారు. వారి తిండికి అలవాటు పడ్డారు. క్రమంగా ఆదివాసీలను ఐక్యం చేసి, అటవీశాఖ సిబ్బంది ఆగడాలను నిలదీయడం నేర్పారు. ఫలితంగా ఈ శతాబ్దం ఆరంభానికి వచ్చేసరికి ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 92 వేల చదరపు కిలోమీటర్లు విస్తరించిన బస్తర్ ఏరియా అన్నల నీడలోకి వెళ్లింది. గ్రామాల వారీగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన విద్య, వైద్య, రక్షణ కమిటీలు పరిపాలనలో చురుగ్గా వ్యవహరించసాగాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి యాభై ఏళ్లు పూర్తయ్యేటప్పటికి బస్తర్ అడవుల్లో మావోయిస్టులు అనధికారిక పాలకులుగా మారారు. బస్తర్‌తో బంధం.. 'ఢిల్లీ సుల్తానుల దండయాత్ర తర్వాత 13వ శతాబ్దంలో కాకతీయులు తమ రాజధాని ఏకశిలా నగరాన్ని వీడాల్సి వచ్చింది. ఈ క్రమంలో గోదావరి తీరం దాటి ఇంద్రావతి ఒడ్డున విస్తరించిన అడవుల్లోకి వెళ్లి, బస్తర్ కేంద్రంగా మరో రాజ్యాన్ని స్థాపించారు. రాచరిక పాలన అంతమైనా నేటికీ అక్కడ మన కాకతీయుల ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. తెలంగాణలో మావోయిస్ట్ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడే భావజాల వ్యాప్తిలో భాగంగా ఆనాటి అన్నలు గోదావరి తీరం దాటి బస్తర్లోకి వెళ్లారు. అక్కడి ప్రజలతో మమేకమై, వారి సహకారంతో జనతన సర్కార్‌ను నడిపించడం ప్రారంభించారు. కాలాలు మారినా అలా బస్తర్‌తో తెలుగువారికి బంధం కొనసాగుతూనే ఉంది.' సల్వాజుడుం.. ఆరంభంలో బాగున్నా, బస్తర్ అడవులు అభివృద్ధికి దూరంగానే ఉండిపోయాయి. అడవుల్లోని గ్రామాలకు సరైన రోడ్లు లేవు, కరెంటు లేదు. ఆధునాతన విద్య, వైద్యం, కమ్యూనికేషన్ ్స అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. అడవుల్లోకి అభివృద్ధిని తెస్తామంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించాయి. అడవుల్లోని సహాజ సంపదను కార్పొరేట్ వర్గాలకు కట్టబెట్టేందుకే ప్రభుత్వాలు అడవుల్లో అభివృద్ధి మంత్రం జపిస్తున్నాయంటూ మావోయిస్ట్‌లు ఎదురుతిరిగారు. దీంతో మావోయిస్ట్‌ల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు తొలిదశలో 2005లో స్థానిక ఆదివాసీలతో సల్వాజుడుం పేరుతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది అప్పటి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం. అయితే అది వికటించి, అడవుల్లో అన్నలకు మరింత పట్టు పెరిగింది. దాంతో అటవీశాఖ సిబ్బంది అడుగు పెట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రీన్‌హంట్.. 2012లో బస్తర్ ప్రాంతంలో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో మెజారిటీ గిరిజనులు మావోయిస్ట్‌లనే తమ పాలకులుగా భావిస్తున్నారని తేలింది. ఈ ఫలితం సంచలనం రేపింది. దాంతో మావోయిస్ట్‌లను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2012లో ఆపరేషన్ గ్రీన్ హంట్‌ను ప్రారంభించింది. అందులో భాగంగా సీఆర్పీఎఫ్ బలగాలను తరలించింది. కేవలం మావోయిస్ట్‌ల కోసమే కోబ్రా దళాలను ఏర్పాటు చేసింది. మరోవైపు రాష్ట్రప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్ (సీఏఎఫ్), డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్జీ)ని ఏర్పాటు చేసింది. బస్తర్ పరిధిలో ఉన్న సుక్మా, బీజాపూర్, నారాయణ్‌పూర్, కాంకేర్, దంతేవాడ, బస్తర్, కొండగావ్ జిల్లాల్లోని అటవీ గ్రామాల ప్రజలకు ఎలాగైనా అభివృద్ధి ఫలాలను అందించాలనే లక్ష్యంగా ఉక్కుపాదాలతో ముందుకు సాగింది ప్రభుత్వ యంత్రాంగం. ఫలితంగా గత పదిహేనేళ్లుగా గోదావరి, ఇంద్రావతి, శబరి నదులు సరిహద్దులుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని పచ్చని అడవులు మరింతగా రక్తసిక్తమయ్యాయి. ఇబ్బంది లేదు.. 'చిన్నప్పుడే మావోయిస్టుల్లో కలసిపోయాను. ఏళ్ల తరబడి అడవుల్లోనే జీవితం గడచింది. అక్కడ అనారోగ్యం పాలయ్యాను. నేనక్కడ ఉద్యమంలో ఉన్న సమయంలో ఇక్కడ నా కుటుంబానికి అండగా ఎవరూ లేరు. దాంతో అడవుల్లోంచి బయటకు వచ్చాను. ప్రస్తుతం డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గార్డ్స్‌లో మహిళా కమెండోగా పని చేస్తున్నాను. నా కుటుంబానికి అండగా ఉంటున్నాను. అలవాటైన పని కావడంతో ఆయు«ధంతో అడవుల్లో పని చేయడం ఇబ్బందిగా ఏమీ అనిపించడం లేదు.' – సబిత (పేరు మార్చాం) మహిళా కమెండో భయం నీడన.. మైదానప్రాంత గిరిజనులు సైతం ఇతరులతో అంత సులువుగా కలసిపోరు. ఇక కొండ ప్రాంతాల్లో, అడవుల్లో నివసించే గిరిజన, ఆదివాసీలైతే తమ గ్రామాల దగ్గరికి ఎవరైనా కొత్తవారు వస్తే వెంటనే ముడుచుకుపోతారు. అలాంటిది ఆలివ్‌గ్రీన్ యూనిఫామ్ ధరించి ఆయుధాలతో వచ్చిన భద్రతా దళాలను చూసేసరికి మరింతగా కుంచించుకుపోయారు. ఈ క్రమంలో భద్రతా దళాలకు గిరిజనుల నుంచి కనీస సమాచారం అందడం కూడా దుర్లభమైంది. అడవుల్లో తమను చూసి బెదిరిపోయే ఆదివాసీలు.. మావోయిస్ట్‌లకు అండగా ఉంటున్నారనే అపోహ భద్రతా దళాల్లో పెరిగిపోయింది. బలవంతంగా తమ నోరు విప్పించేందుకు భద్రతా దళాలు చేసే ప్రయత్నాలు ఆదివాసీలను మరింతగా బెదరగొట్టాయి. దాంతో ఇటు భద్రతా దళాలు, అటు ఆదీవాసీలు ఒకనొకరు విశ్వసించుకోని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఎదురు కాల్పులు, కోవర్టుల ఘాతుకాలు, ఇన్ ఫార్మర్ల హత్యలతో హింసాకాండ పెరిగింది. హక్కుల ఉల్లంఘన దట్టమైన అడవుల్లోకి వెళ్లినప్పుడు సెర్చింగ్ పేరుతో ఆదివాసీ గూడేలపై అకృత్యాలకు, అమానవీయ చర్యలకు పాల్పాడుతున్నారనే ఆరోపణలు భద్రతా దళాలను చుట్టుముట్టాయి. ముఖ్యంగా ఆదివాసీ మహిళలకు ఇబ్బంది కలిగే విధంగా కమెండోల (మగవాళ్లు) చర్యలు ఉంటున్నాయనే విమర్శలు పెల్లుబికాయి. భద్రతా దళాలను చూస్తేనే ఆదివాసీ గూడేలు గడగడలాడిపోతున్నాయంటూ మానవ హక్కుల సంఘాలు గొంతెత్తాయి. అప్పటికే చెలరేగుతున్న హింసకు మానవ హక్కుల హననం అనే ఆరోపణలు తోడవడంతో ప్రభుత్వాలు ఇరకాటంలో పడ్డాయి. మానవీయ కోణం.. భద్రతా దళాల సంఖ్యను పెంచినా, అధునాతన ఆయుధాలు అందించినా.. సరికొత్త వ్యూహాలను అమలు చేసినా అడవుల్లోకి చొచ్చుకుపోవడం సాధ్యపడలేదు ప్రభుత్వాలకు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టుగా మారింది. ఆయుధాలతో ఆదివాసీల మనసులను గెలుచుకోవడం కష్టమని భావించారు అధికారులు. దాంతో తమ పట్ల, తాము వినిపిస్తున్న అభివృద్ధి నినాదం పట్ల గిరిజనానికి విశ్వాసం కలగాలంటే వారిపట్ల సహానుభూతి అవసరమని గ్రహించారు. మానవీయకోణం లేని ప్రయత్నాలు వ్యర్థమని అర్థం చేసుకున్నారు. అభివృద్ధి ఫలాలు అనే నినాదానికి మానవీయ కోణం జత చేయాలనే వ్యూహానికి రూపకల్పన చేశారు. ఆ బాధ్యతను మహిళలు సమర్థంగా నిర్వహించగలరనే నిర్ణయానికి వచ్చారు. దంతేవాడలో తొలి అడుగు! పారా మిలటరీ దళాల్లో మహిళలకు స్థానం కల్పించాలని నిర్ణయం తీసుకున్నంత ఈజీగా అమలు సాగలేదు. రిక్రూట్మెంట్ ప్రక్రియ కష్ట సాధ్యమైంది. అప్పటికే మావోయిస్ట్‌లు, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో వందల మంది చనిపోయారు. దాంతో ఆలివ్‌గ్రీన్ దుస్తులు ధరించి, భుజాన తుపాకి మోసేందుకు ముందుకొచ్చిన మహిళలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంతే మిగిలారు. ఆ వచ్చిన కొద్దిమంది కూడా అప్పటికే అక్కడ చెలరేగుతున్న హింసలో పెద్దదిక్కును కోల్పోయిన వారు, లొంగిపోయిన మావోయిస్టులే! అలా 2019లో దంతెవాడ జిల్లాలో తొలి విమెన్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ దళం ఏర్పడింది. మూడు నెలల శిక్షణ ఫ్రంట్ లైన్ యాంటీ మావోయిస్ట్ ఫోర్స్‌లో భాగంగా ప్రారంభమైన తొలి దళంలో పదిమంది లొంగిపోయిన మహిళా మావోయిస్టులు, పదిమంది సల్వాజుడుం పూర్వసభ్యులు ఉండగా మిగిలిన పదిమంది రిక్రూట్మెంట్ సెల్ ద్వారా నియమితులయ్యారు. అలా మొత్తం ముపై ్ప మందిని తీసుకున్నారు. మావోయిస్ట్‌లకు వ్యతిరేకంగా చేపట్టే జంగిల్ వార్ఫేర్లో వారికి మూడు నెలల కఠిన శిక్షణ ఇచ్చారు. దాంతోపాటుగా దట్టమైన అడవుల్లో సురక్షితంగా వాహనాలు నడపడం, మ్యాప్ రీడింగ్, కౌంటర్ ఆంబుష్ స్ట్రాటజీ, ఆ ప్రాంతంలో ఉన్న మావోయిస్ట్ నేతల ప్రొఫైల్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. మారువేషాల్లో మెరుపుదాడులు చేయడంలోనూ మెలకువలు నేర్పించి, కార్యక్షేత్రంలోకి దింపారు. అర్థం చేసుకోవడం తేలిక.. 'నేను ఛత్తీస్‌గఢ్ ఆదివాసీ మహిళను. గతంలో మా గ్రామంలోకి పోలీసులు, భద్రతా బలగాలు వస్తే గ్రామమంతా వణికిపోయేది. ఆ భయం నుంచే వారికి వ్యతిరేకంగా పోరాడాలని అడవిబాట పట్టాం. ఇప్పుడు భద్రతాదళంలో మహిళా కమెండోగా పని చేస్తున్నా. భద్రతా దళాలు గ్రామాల్లోకి వచ్చినప్పుడు అక్కడి ప్రజల మానసిక స్థితి ముఖ్యంగా మహిళలు ఎలా భయపడతారో నాకు బాగా తెలుసు. కాబట్టి వాళ్లలో ఉన్న భయాన్ని పోగొట్టి భరోసా కల్పించడం ఎలాగో మాకు తెలిసినంతగా ఇతరులకు తెలియదు. అందువల్లే మహిళా కమెండోలు వచ్చిన తర్వాత స్థానిక ప్రజలు, భద్రతా దళాలకు మధ్య సంబంధాలు∙మెరుగవుతున్నాయి గతంతో పోలిస్తే!' – జయంతి (పేరు మార్చాం) మహిళా కమెండో మహిళా కమెండోలు.. ఈ మహిళా దళ సభ్యులను బృందాలుగా వేరు చేస్తారు. వీరు మెన్ స్క్వాడ్ కూంబింగ్‌కు వెళ్లినప్పుడు వారి వెంట అడవుల్లోకి వెళ్తారు. ఉదాహరణకు పాతిక మంది కమెండోల బృందం అడవుల్లోకి వెళితే అందులో నలుగురైదురుగు మహిళా కమెండోలు ఉండేలా కూర్పు చేశారు. వీరు అటవీ మార్గంలో వెళ్తున్నప్పుడు, దారిలో ఏదైనా గూడెం వస్తే మహిళా కమెండోలు గూడెం లోపలికి వెళ్తారు. అక్కడున్న వారితో మాట్లాడతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. తీర్చగలిగే సమస్య అయితే అక్కడిక్కడే తమ సామర్థ్యం మేరకు పరిష్కారం చూపుతారు. అక్కడికి రావడం వెనుక తమ ఉద్దేశం ఏంటో చెబుతారు, సహకరించాలని కోరుతారు. స్త్రీల సమస్యలు.. మహిళా కమెండోలు స్త్రీల సమస్యలను అర్థం చేసుకుని వాటికి పరిష్కారం చూపించడంలో సఫలం అవుతున్నారు. ముఖ్యంగా చిన్న వయస్సులో పెళ్లిళ్లు, పిల్లలు, పోషకాహార లోపంతో బాధపడే ఛత్తీస్‌గఢ్ మహిళలు తరచుగా అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. వ్యక్తిగత పరిశుభ్రత, గైనిక్ సమస్యలపై తమకున్న అవగాహన మేరకు వారికి తోడ్పాటును అందిస్తున్నారు. అవసరాన్ని బట్టి తమ కిట్లలో ఉండే మాత్రలు, టానిక్స్‌ను వారికి అందిస్తుంటారు. దీంతో బస్తర్ ప్రాంతంలోని ప్రజలకు భద్రతా దళాలపై ఉండే అపారమైన భయం స్థానంలో క్రమంగా నమ్మకం చిగురించసాగింది. మార్పు మొదలైంది.. మహిళా కమెండోలు వచ్చాక మార్పు మొదలైందంటున్నారు ఛత్తీస్‌గఢ్ గ్రామీణులు. ‘ఇంతకుముందు భద్రతా దళాలు మా ఊళ్లవైపు వస్తున్నాయని తెలిస్తే చాలు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరం అడవుల్లోకి పరుగెట్టేవాళ్లం. ఆరోగ్యం బాగాలేని వారు, ముసలి వాళ్లు మాత్రమే ఊళ్లల్లో ఉండేవారు. భద్రతా దళాలు మా ఊళ్లను విడిచిపెట్టాయని నిర్ధారించుకున్న తర్వాతే తిరిగి ఇళ్లకు చేరుకునేవాళ్లం. అయితే వాళ్లు వస్తున్నారని తెలిసి ఉన్నపళంగా ఊరంతా ఖాళీ అయ్యేసరికి ఏదో జరగబోతోందనే అనుమానంతో జవాన్లు ఊళ్లల్లోనే తిష్టవేసే వాళ్లు. వాళ్లంతా ఎక్కడికి వెళ్లారంటూ ఊళ్లల్లో ఉన్న వారిని గదమాయించే వారు. దాంతో మా పల్లెల్లో ఘర్షణ వాతావరణం ఉండేది. కానీ మహిళా కమెండోలు వచ్చిన తర్వాత భద్రతా దళాల మాటతీరులో మార్పు వచ్చింది. మా మీద భద్రతా దళాలకు చెందిన మగ కమెండోలు దాష్టీకాలు చేయకుండా అడ్డుకునే మహిళా కమెండోలు ఉన్నారనే నమ్మకం కలిగింది. మా బాధలు చెబితే అర్థం చేసుకునే మనుషులకు భద్రతా దళాల్లో స్థానం ఉందనే భరోసా వచ్చింది. రోజులు గడిచే కొద్దీ, నెలలు ముగిసే కొద్దీ భద్రతా దళాలను చూసి అడవుల్లోకి పారిపోయే పరిస్థితి తగ్గిపోయింది. సర్కారుకు, మాకు మధ్య వారధిగా నిలుస్తున్నారు మహిళా జవాన్లు’ అని చెప్పుకొచ్చారు స్థానిక జనం. పట్టాలపైకి అభివృద్ధి! చత్తీస్‌గఢ్ గ్రామీణ ప్రాంతాలు, అక్కడి ప్రజలతో భద్రతా దళాలు మమేకం అవడం మొదలైన తర్వాత అభివృద్ధి పనుల్లో వేగం పెరిగింది. ముందుగా మహిళా జవాన్లతో కూడిన భద్రతా దళాలు అడవుల్లోకి వెళ్లి, వాళ్లు అక్కడి ప్రజలతో కలసిపోతారు. ఆ తర్వాత అక్కడ భద్రతా దళాల క్యాంప్ ఏర్పడుతుంది. ఆ వెంటనే ఆ గ్రామానికి కరెంటు వస్తుంది. అనంతరం రోడ్డు నిర్మాణ పనులు మొదలవుతాయి. వీటికి సమాంతరంగా మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఈ పనులన్నీ శరవేగంగా జరిగిపోతాయి. ఆ తర్వాత అక్కడ కొంతమంది సభ్యులను ఉంచేసి మిగిలిన దళ సభ్యులు ముందుకు సాగుతారు. రోడ్డు, కరెంటు సౌకర్యాలు వచ్చిన గ్రామాల్లోకి దశల వారీగా స్కూళ్లు, ఆస్పత్రులు తదితర వసతులూ అందుబాటులోకి వస్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో.. మానవ హక్కుల సంఘాల ఆరోపణలూ అంతగా వినిపించడంలేదని పరిశీలకుల అభిప్రాయం. ఎన్నికల విధుల్లో.. బస్తర్ ప్రాంతంగా చెప్పుకునే ఏడు జిల్లాల పరిధిలో మహిళా కమెండోలను ఏర్పాటు చేశాయి ప్రభుత్వాలు. ఇప్పుడు మహిళా దళాల్లో చేరే వారికి పద్దెనిమిది నెలల శిక్షణ కాలాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం 450 మందికి పైగా మహిళా కమెండోలు ఛత్తీస్‌గఢ్‌లో పని చేస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. దట్టమైన అడవుల్లో ఉన్న 35 పోలింగ్ బూత్‌ల రక్షణ బాధ్యతను మహిళా కమెండోలకే అప్పగించింది ఎన్నికల సంఘం. ఎలాంటి హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా ఆ 35 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు సాఫీగా సాగాయి. ఆదివాసీలంతా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఘనత మహిళా కమెండోలదే! మహారాష్ట్రలో.. ఛత్తీస్‌గఢ్‌లో మహిళా కమెండోలు తెచ్చిన మార్పు ఇతర రాష్ట్రాలనూ ఆలోచింపచేసింది. దండకారణ్యంలో భాగంగా ఉండే మçహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలోనూ మహిళా కమెండో దళాన్ని నెలకొల్పారు. పదకొండు మంది సభ్యులతో కూడిన ఈ దళం గడ్చిరోలి జిల్లా వంగేటూరి పోలీస్ స్టేషన్ పరిధిలో తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్, దేశ సైనికదళంలోనూ మహిళా కమెండోలు తమ సత్తా చూపిస్తున్నారు. మొత్తానికి.. కరకుదనం ఖాకీ సొత్తు. కరడుగట్టిన కాఠిన్యానికి సైన్యం చిరునామా! ఈ రెండిటితో పరిచయమేలేనిది మహిళ! తోటి వాళ్లను వినగలిగే ఓర్పు, అవతలి వాళ్ల కోణంలోంచి ఆలోచించగలిగే నేర్పు, ఎదుటి వాళ్ల బాధను అర్థం చేసుకోగలిగే దయ, వీటన్నిటినీ మించి ఏటికి ఎదురీదగల ధైర్యంతోనే ఆయుధాలకు సాధ్యం కాని మార్పును తీసుకురాగలిగింది. తూటాలతో దద్దరిల్లిన ప్రాంతంలో సంతోషాల సవ్వళ్లు వినిపించేలా చేస్తోంది. ల్యాండ్ మైన్స్ నాటుకున్న ప్రదేశాల్లో శాంతిని పండించగలుగుతోంది. – కృష్ణగోవింద్ ఇవి చదవండి: అందమైన జీవితం కోసం ఐన్ స్టీన్ సూత్రాలు -
కోట్లు సంపాదిస్తున్న 'అనమ్ మీర్జా'.. ఆస్తి ఎంతంటే?
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి తెలిసిన చాలా మందికి ఈమె సోదరి 'అనమ్ మీర్జా' గురించి తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఈమె 330 కోట్ల రూపాయల సామ్రాజ్యానికి అధినేత!.. ఆనం మీర్జా గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. సానియా మీర్జా మాదిరిగా కాకుండా భిన్నమైన మార్గాన్ని ఎంచుకుని వ్యాపార రంగంలో ముందుకు సాగుతున్న అనమ్ మీర్జా మాస్ కమ్యూనికేషన్ అండ్ మీడియా స్టడీస్ పూర్తి చేసి వివిధ జాతీయ ఛానెల్‌లలో ఇంటర్న్‌గా జర్నలిజంలో తన వృత్తిని ప్రారంభించింది. ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే ఈమెకు సొంతంగా ఏదైనా ప్రారభించాలనే ఆకాంక్ష ఎక్కువగా ఉండేది. ఈ కారణంగానే 2013లో ఔత్సాహిక జర్నలిస్టుల కోసం 'ఇంక్ టు చేంజ్' అనే వెబ్సైట్ ప్రారంభించింది. 2014లో అక్బర్ రషీద్‌తో వివాహం జరిగిన తరువాత ఆమె తన ఫ్యాషన్ లేబుల్ 'ది లేబుల్ బజార్'ని ప్రారంభించింది. 2022లో అనమ్ మీర్జా భారతదేశపు అతిపెద్ద రంజాన్ ఎక్స్పో, దావత్-ఎ-రంజాన్‌ను స్థాపించింది. అనమ్ మీర్జా తన భర్త అక్బర్ రషీద్‌తో విడిపోయిన తరువాత భారత మాజీ కెప్టెన్ & రాజకీయ నాయకుడు మహ్మద్ అజారుద్దీన్ కుమారుడు 'మహ్మద్ అసదుద్దీన్'ను వివాహం చేసుకుంది. వీరికి 'దువా' అనే పాప కూడా ఉంది. ఈ పాప పేరు మీద అనమ్ మీర్జా 2023లో మరో ఫ్యాషన్ లేబుల్ ప్రారంభించింది. మహ్మద్ అసదుద్దీన్ తండ్రి బాటలోనే నడిచి బ్యాటర్‌గా మారారు, కానీ అయన క్రికెట్ కెరీర్ సజావుగా ముందుకు సాగలేదు. దీంతో క్రికెట్ వదిలిపెట్టారు. అసదుద్దీన్ క్రికెటర్ కాక ముందే న్యాయవాది. ఇదీ చదవండి: జూన్ 4 నుంచి 'గూగుల్ పే' బంద్!.. మరో యాప్‌లోనే అన్నీ.. అనమ్ మీర్జా వ్యాపారాలు మాత్రమే కాకుండా 1,25,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్లతో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దీని ద్వారా కూడా బాటుగా సంపాదిస్తోంది. వ్యాపార రంగంలో తనదైన రీతిలో దూసుకెళ్తున్న అనమ్ మీర్జా నికర విలువ 40 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని సమాచారం. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం ఈమె ఆస్తుల విలువ రూ.331 కోట్లకంటే ఎక్కువ. -
బౌద్ధవాణి: సత్యం పలకడం చాలా అవసరం!
సిద్ధార్థుడు శాక్య యువరాజు. కానీ, సన్యసించి రాజ్యాన్ని వదిలాడు. భిక్షువుగా మారాడు. ఆ తర్వాత తన బిడ్డ రాహులుణ్ణి కూడా భిక్షువుగా మార్చాడు. ఒకరోజున రాహులుడు అంబలట్ఠిక అనే చోట ఒక వనంలోని ఆరామంలో ఉన్నాడు. బుద్ధుడు రాజగృహంలోని వేణువనం నుండి అక్కడికి వచ్చాడు. బుద్ధుని రాకను గమనించిన రాహులుడు లేచి వచ్చి, నమస్కరించాడు. ఒక చెట్టుకింద బుద్ధునికి తగిన ఆసనాన్ని ఏర్పాటు చేశాడు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు. బుద్ధుడు కాళ్ళు కడుక్కుని, ఆ పాత్రలో కొంచెం నీటిని ఉంచాడు. బుద్ధుడు ఎంత కష్టమైన విషయాన్నైనా ఉపమానంతో తేలికగా అర్థం అయ్యేలా చెప్పడంలో నేర్పరి. ఆయన వచ్చి ఆసనం మీద కూర్చొని.. ‘‘రాహులా! ఈ పాత్రలో మిగిలిన నీటిని చూశావా?’’అని అడిగాడు. ‘‘భంతే! చూశాను. అడుగున కొద్దిగా ఉన్నాయి’’ ‘‘అవును కదా! తెలిసి తెలిసీ ఎవరు అబద్ధాలు ఆడతారో, మోసపు మాటలు చెప్తారో, అలా చెప్పడానికి సిగ్గుపడరో.. అలాంటి వారికి దక్కే శ్రామణ్య ఫలం చాలా చాలా కొద్దిదే’’ అన్నాడు. రాహులుడు నిండు వదనంతో నింపాదిగా ఆ నీటి పాత్రవైపు చూశాడు. బుద్ధుడు ఆ పాత్రలో ఉన్న నీటిని అంతా పారబోశాడు. 'శ్రామణ్యం అంటే ధ్యాన సాధన ద్వారా పొందే ఫలం. తమకు తాము స్వీయ సాధన ద్వారా ఈ ధ్యానఫలాన్ని పొందుతారు. అందుకే ఈ సాధకుల్ని ‘శ్రమణులు’ అంటారు. తమకు తాము ఎంతో శ్రమించి ఎన్నో కఠోర శ్రమలకోర్చి సాధించే యోగ సాధన ఇది. బౌద్ధ భిక్షువుల్ని శ్రమణులు అనీ, బుద్ధుణ్ణి శ్రమణ గౌతముడని ఇందుకే పిలుస్తారు.' ‘‘రాహులా! నీరు పారబోయడం చూశావా?’’ ‘‘చూశాను భగవాన్’’ ‘‘తెలిసి తెలిసీ అసత్యాలు పలికే వారి మోసపు మాటలు చెప్పే వారి శ్రామణ్యం కూడా ఇలా పారబోసిన నీటిలాంటిదే’’ బుద్ధుడు ఆ పాత్రను తీసుకుని తన పక్కనే ఉన్న రాతిపలక మీద బోర్లించాడు. రాహులుడు ఆ పాత్రవైపు కన్నార్పకుండా చూస్తూనే ఉన్నాడు. అప్పుడు బుద్ధుడు.. ‘‘రాహులా! అలాంటి అబద్ధాలకోరు మోసపు మాటల కోరుకు దక్కే ధ్యానఫలం కూడా బోర్లించిన పాత్ర లాంటిదే’’ అన్నాడు. రాహులుడు తదేకంగా ఆ పాత్ర మీదే దృష్టి నిలిపాడు. బుద్ధుడు మరలా ఆ పాత్రని తీసి నేల మీద ఉంచాడు. పాత్రలోకి చూపుతూ.. ‘‘రాహులా! ఇప్పుడు ఈ పాత్ర నిలబడి ఉంది. కానీ ఎలా ఉంది?’’ ‘‘ఖాళీగా ఉంది భగవాన్’’ ‘‘అబద్ధాల కోరుకు దక్కే సాధనాఫలం కూడా ఖాళీ పాత్ర లాంటిదే’’ అన్నాడు. అలా ఆ ఒక్క పాత్రని నాలుగు రకాలుగా ఉపమానంగా చూపుతూ అబద్ధాల కోరులు ఎంత సాధన చేసినా ధ్యానఫలాన్ని పొందలేరు. కాబట్టి సత్యభాషణం చాలా అవసరం అనే విషయాన్ని తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పాడు బుద్ధుడు. అందుకే ఆయనను ‘మహా గురువు’గా భావిస్తారు, గౌరవిస్తారు. – డా. బొర్రా గోవర్ధన్ ఇవి చదవండి: ముఖ స్తుతి -
50 రూపాయలతో రూ.350 కోట్ల సామ్రాజ్యం - చూపు లేకున్నా.. సక్సెస్ కొట్టాడిలా..
Bhavesh Bhatia Success Story: బలమైన సంకల్పం నీకుంటే సమస్తం నీకు దాసోహమంటుంది.. జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా వెనుకడుగు వేయకుండా నీ గమ్యం చేరుకునే దిశలో అడుగులు వేస్తే.. తప్పకుండా సక్సెస్ నీకు సలాం చేస్తుంది. ఇలాంటి కోవకు చెందిన అతి తక్కువమందిలో ఒకరు 'భవేష్ భాటియా'. చూపు లేకపోయినా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచి రూ.350 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. మహారాష్ట్రలోని ఒక చిన్న పట్టణంలో జన్మించిన 'భవేష్ భాటియా'కు చిన్నప్పటి నుంచి టెక్నాలజీ, సృజనాత్మకత వంటి వాటి మీద ఎక్కువ ఆసక్తి ఉండేది. కానీ అతనికి రెంటీనా కండరాల సంబంధిత వ్యాధి వల్ల, దానిని నయం చేసుకోవడానికి డబ్బు లేకపోవడం వల్ల చూపును కోల్పోయాడు. ఉద్యోగం లభించలేదు డిగ్రీ పూర్తి చేసినప్పటికీ.. చూపులేకపోవడం వల్ల ఎవరూ ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరించలేదు. తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతున్న భాటియా తల్లి కూడా క్యాన్సర్ వ్యాధిలో మరణించింది. భాటియా తండ్రి పొదుపు చేసుకున్న మొత్తం డబ్బుని భార్య వైద్య ఖర్చుల కోసం ఖర్చు చేసేసాడు. రూ. 50 అప్పుగా కంటికి రెప్పలా చూసుకునే తల్లి కోల్పోయిన తరువాత ఎదో ఒకటి చేయాలని నిరాంయించుకుని నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ స్కూల్లో చేరి క్యాండిల్స్ (కొవ్వొత్తులు) తాయారు చేయడం నేర్చుకున్నాడు. క్యాండిల్స్ తయారు చేయడంలో కొంత నైపుణ్యం వచ్చిన తరువాత స్నేహితుడి నుంచి రూ.50 అప్పుగా తీసుకుని బండిని అద్దెకు తీసుకుని, మహాబలేశ్వర్‌లోని స్థానిక మార్కెట్లో కొవ్వొత్తులను అమ్మడం ప్రారంభించారు. వ్యాపారం కొంత పెరగడం మొదలు పెట్టింది. ఆ తరువాత 'నీతా' అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తరువాత భాటియా జీవితంలో కొత్త వెలుగు రావడం మొదలైంది. కొవ్వొత్తులను మార్కెటింగ్ చేయడంలో నీతా చాలా సహాయపడింది. భాటియా బలమైన సంకల్పంతో ముందడుగులు వేస్తున్న సమయంలో కొన్ని ఆర్థికపరమైన సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది. 'సన్‌రైజ్ క్యాండిల్స్'కు పునాది వ్యాపారం చేస్తున్న క్రమంలో ఒక బ్యాంక్ నుంచి రూ.15000 లోన్ తీసుకుని కొత్త పద్దతులతో క్యాండిల్స్ తయారు చేయడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో తనలాంటి అంధులకు కొంత మద్దతుగా నిలిచి వారికి ఉపాధి కల్పించాడు. ఆ సమయంలోనే 'సన్‌రైజ్ క్యాండిల్స్'కు పునాది వేసాడు. ఈ సంస్థ నేడు వేలకోట్లు ఆర్జిస్తూ ఉంది. ప్రస్తుతం సన్‌రైజ్ క్యాండిల్స్ సంస్థ ఏకంగా సంవత్సరానికి రూ.350 కోట్ల రూపాయలు ఆర్జిస్తోంది. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది ఈ కంపెనీ క్యాండిల్స్ ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తున్నారు. సాధారణ క్యాండిల్స్ మాత్రమే కాకుండా.. సువాసనలు వెదజల్లేవి, మంచి డిజైన్ కలిగిన క్యాండిల్స్ తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. 9000 మందికి ఉపాధి కేవలం రూ. 50తో మొదలై రూ. 350 కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగి, ఏకంగా 9000మంది అంధులకు అందమైన జీవితాన్ని భాటియా ప్రసాదించారు. సుమారు 52 ఏళ్ల భాటియా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 1000 కంపెనీలకు 12,000 రకాల డిజైన్ చేసిన క్యాండిల్స్ విక్రయిస్తున్నారు. ఇదీ చదవండి: సందడి చేయడానికి సిద్ధంగా ఉండండి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్ ఆనంద్ మహీంద్రా లాంటి పారిశ్రామిక దిగ్గజాలు కూడా భవేష్ భాటియా అకుంఠిత దీక్షను ప్రశంసించారు, అతని జీవితం ఎంతోమందికి ఆదర్శమని వెల్లడించారు. ఒకప్పుడు చూపు లేకపోవడం వల్ల ఉద్యోగం ఇవ్వని వారు సైత శభాష్ భాటియా అని పొగుడుతున్నారు. 'నువ్వు ఈ లోకాన్ని చూడకపోతేనేం, ఒక విజయం సాధిస్తే ఈ లోకమే నిన్ను చూస్తుంది’ అనే మాట ఖచ్చితంగా భాటియాకు సరిపోతుంది. -
చదువుకునే రోజుల్లోనే పునాది.. తాత పేరుతో కంపెనీ - పునీత్ గోయల్ సక్సెస్ స్టోరీ
క్యాబ్ సర్వీస్ అనగానే అందరికి ఓలా, ఉబర్ వంటివి మాత్రమే గుర్తొస్తాయి. ఈ కంపెనీలకు ధీటుగా పోటీ ఇస్తున్న బ్లూస్మార్ట్.. ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు, గురుగ్రామ్ ప్రాంతాల్లో మంచి సక్సెస్ చవి చూస్తోంది. ప్రారంభంలో ఒడిదుడుకులను ఎదుర్కొని కంపెనీని ఈ రోజు ఈ స్థాయికి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిన వారిలో ఒకరు, కంపెనీ కో-ఫౌండర్ 'పునీత్ గోయల్' గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. బ్లూస్మార్ట్ కో-ఫౌండర్ 'పునీత్ గోయల్' బ్లూస్మార్ట్ ప్రారంభించడానికి ముందే సొంత వెంచర్లను ప్రారంభించి, ఒకదాంట్లో విజయం పొందలేకపోయినట్లు గతంలోనే వెల్లడించారు. ప్రారంభంలో గుజరాత్లో 20 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను నెలకొల్పి, దానిని సౌదీ ప్లేయర్‌కు 68 మిలియన్ డాలర్లకు, మహారాష్ట్రలోని మరో 70 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను 55 మిలియన్ డాలర్లకు విక్రయించినట్లు గోయల్ తెలిపారు. పునీత్ గోయల్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, బర్మింగ్‌హామ్‌లోని ఆస్టన్ బిజినెస్ స్కూల్ నుంచి డబుల్ మాస్టర్స్ పూర్తి చేసి ఆ తరువాత గ్రీన్ ఎనర్జిలోకి ప్రవేశించారు. క్లీన్ ఎనర్జీ ఆలోచన తన జీవితాన్ని మార్చేసినట్లు గోయల్ ఒక సందర్భంలో వెల్లడించారు. బర్మింగ్‌హామ్‌లో చదువుకునే రోజుల్లో గోయల్ క్లీన్ ఎనర్జీ గురించి చదివినట్లు, ఇది తప్పకుండా భవిష్యత్తులో ఉపయోగపడుతుందని భావించి.. భారతదేశంలో సోలార్ ఫ్యానెల్ తయారీదారులను కలుసుకుని కొన్ని మెళుకువలు తెలుసుకున్నారు. ఆ సమయంలో భారతదేశంలో సోలార్ ఫ్యానెల్స్ తయారు చేసి, ఐరోపాకు ఎగుమతి చేయడానికి మంచి అవకాశం ఉన్నట్లు తెలుసుకున్నారు. గోయల్ చదువు పూర్తయ్యే సమయానికి సోలార్ ఎనర్జీ అనేది అతి పెద్ద మార్కెట్. దీనిని అదనుగా తీసుకుని, సోలార్ ప్యానెల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావించి.. అతని తాత 'పురుషోత్తమ్ లాల్ గోయల్' పేరు మీదుగా PLG పవర్ ఏర్పాటు చేసాడు. 2008లో ప్రారంభమైన కంపెనీ 2012 వరకు సజావుగా ముందుకు సాగింది. ఆ తరువాత యూరప్‌లో సోలార్ ప్యానెల్ మార్కెట్ పడిపోవడంతో నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. దీంతో మొదటి వెంచర్ మూసివేయాల్సి వచ్చింది. మొదటి వెంచర్ మూసివేసిన తరువాత, గుజరాత్ ప్రభుత్వం సోలార్ పాలసీని తీసుకురావడంతో మరో సువర్ణావకాశం లభించింది. ఆ సమయంలో 2 MW పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి.. దానిని రెండు సంవత్సరాలు నిర్వహించి, ఆ తరువాత ఒక పెద్ద సౌదీ కంపెనీకి విక్రయించేశారు. బ్లూస్మార్ట్ ఆలోచన.. రెండు వెంచర్లు ప్రారంభించి విక్రయించిన తరువాత.. హైపర్‌లూప్ వన్ సీఈఓ షెర్విన్ పిషెవార్.. వర్జిన్ హైపర్‌లూప్ సీఈఓ బ్రెంట్ కల్లినికోస్ను లాస్ వెగాస్‌లో కలిసిన తరువాత ఈ బ్లూస్మార్ట్ ఆలోచన వచ్చినట్లు గోయల్ తెలిపాడు. 2019లో ప్రారంభమైన బ్లూస్మార్ట్ భారతదేశంలోని మొదటి ఆల్ ఎలక్ట్రిక్ షేర్డ్ స్మార్ట్ మొబిలిటీ ప్లాట్‌ఫారమ్. ఇందులో ఎంజి జెడ్ఎస్ ఈవీ, హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్, టాటా ఎలక్ట్రిక్ కాలు, మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను బ్లూస్మార్ట్‌లో ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: అనిల్ అంబానీ ఆస్తులు అమ్మకానికి గ్రీన్ సిగ్నల్.. జాబితాలో ఉన్నవేంటో తెలుసా? క్లీన్ మొబిలిటీ, క్లీన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్‌లో పునీత్ గోయల్ చేసిన కృషికి జనవరి 2023లో UK ప్రభుత్వం, బ్రిటిష్ కౌన్సిల్, NISAU UK 'ఇండియా-UK 75 ఎట్ 75 అచీవర్స్' అవార్డును, జూలై 2022లో UKలోని ఆస్టన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అందించింది. -
రూ.1000 కోట్ల కంపెనీకి తిరుగులేని అధినేత్రి.. చిన్నప్పుడే..
ఉన్నత చదువులు చదివి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ.. చాలా మంది సొంతంగా ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో ప్రయత్నాలు చేస్తారు, సక్సెస్ సాధిస్తారు. కొందరికి వ్యాపారాలు వారసత్వంగా వస్తే.. మరి కొందరు జీరో నుంచి ప్రారంభమవుతారు. ఈ కోవకు చెందిన వారిలో ఒకరు 'దేవిత సరఫ్' (Devita Saraf). ఇంతకీ ఈమె ఎవరు? ఈమె బిజినెస్ బ్యాగ్రౌండ్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 1981 జూన్ 25న ముంబైలో జన్మించిన 'దేవిత సరఫ్' క్వీన్ మేరీ స్కూల్లో చదివింది, ఆ తరువాత హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్, యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బీఏ పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచే బిజినెస్ మీద పట్టు సాధించిన దేవిత చదువు పూర్తయిన తరువాత కేవలం 24 సంవత్సరాల వయసులోనే.. టీవీలను తయారు చేయడానికి ఒక కంపెనీని ప్రారంభించింది. దేవిత సరఫ్ తండ్రి రాజ్‌కుమార్ సరఫ్.. జెనిత్ కంప్యూటర్స్ బిజినెస్ ప్రారంభించారు. తండ్రి వ్యాపారంలో చిన్నప్పటి నుంచి సహాయం చేయడం అలవాటు చేసుకున్న దేవితా.. టెక్నాలజీ వ్యాపారంలో కొంత నైపుణ్యం సంపాదించింది. అంతే కాకుండా ఈమె తన అన్నయ్యతో కలిసి ఆఫీసులు, ఫ్యాక్టరీలు, ఇతర సమావేశాలకు వెళ్లడం వల్ల వ్యాపారంలోని చిక్కులను గురించి తెలుసుకుంది. కాలిఫోర్నియాలో చదువు పూర్తి చేసిన తరువాత ఇండియాకు తిరిగి వచ్చి.. 'వియు' (VU) గ్రూప్ పేరుతో టీవీలను తయారు చేసే కంపెనీ ప్రారంభించింది. ప్రారంభంలో వ్యాపారం కొంత నెమ్మదిగా ఉన్నప్పటికీ, అతి తక్కువ కాలంలోనే బాగా పుంజుకుంది. నేడు ఈ సంస్థ విలువ ఏకంగా రూ. 1000 కోట్లకు చేరింది. ఇదీ చదవండి: రూ.760 జీతం నుంచి.. లక్షల కోట్ల కంపెనీ సారధిగా - ఎవరీ నాయక్ వియు కంపెనీ టీవీలను కంపెనీ కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని దాదాపు 60 దేశాల్లో విక్రయిస్తోంది. అయితే మనదేశంలో ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో అత్యధికంగా అమ్ముడవుతున్న టీవీ బ్రాండ్‌గా వియు అవతరించింది. కంపెనీ అభివృద్ధి విశేషమైన కృషి చేసిన దేవితను ఫార్చ్యూన్ ఇండియా (2019) భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళల జాబితాలో ఒకరుగా ప్రకటించింది. -
చిన్న గదిలో మొదలైన వ్యాపారం.. నేడు రూ.4000 కోట్ల సామ్రాజ్యంగా..!!
ఓ వ్యక్తి జీవితంలో ఎంత పెద్ద సక్సెస్ సాధించిందంటే.. దాని వెనుక అంత పెద్ద సాహసం చేసి ఉంటాడని అర్థం. జీవితంలో ఎన్నెన్నో కష్టాలను, నష్టాలను ఎదుర్కొని నిలబడగలిగితే విజయం వాడి సొంతమవుతుంది. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'చందూభాయ్ విరానీ' (Chandubhai Virani). క్యాంటిన్లో పనిచేసే స్థాయి నుంచి వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించాడు? దాని వెనుక అతని కృషి ఎలా ఉందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గుజరాత్‌లోని జామ్‌నగర్ రైతు కుటుంబంలో జన్మించిన 'చందూభాయ్' కేవలం 10వ తరగతి మాత్రమే చదువుకున్నాడు. ఆ తరువాత సొంతంగా ఏదైనా చేయాలనే తపనతో తన సోదరులతో కలిసి తండ్రి వద్ద రూ. 20000 తీసుకుని ఉన్న ఊరు వదిలి రాజ్‌కోట్‌కు వెళ్లారు. అక్కడ వ్యవసాయ సామాగ్రిని విక్రయించే వ్యాపారం మొదలుపెట్టి, సక్సెస్ కాలేకపోయారు. వ్యాపారం దివాళాతీసింది. దీంతో ఆ వ్యాపారం వదిలేయాల్సి వచ్చింది. క్యాంటీన్లో ఉద్యోగం.. వ్యాపారంలో నష్టపోయామని దిగులు చెందక ఇంకా ఏదో చేయాలనే తపనతో ఒక సినిమా క్యాంటీన్లో ఉద్యోగం సంపాదించాడు. అక్కడ అతని జీతం రూ. 90 మాత్రమే. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ.. ఎదగాలన్న ఆశను మాత్రం కోల్పోలేదు. దీంతో క్యాంటీన్లో ఉద్యోగం చేస్తూనే పార్ట్ టైమ్ జాబ్స్ చేసేవాడు. ఆ సమయంలో చందూభాయ్, అతని కుటుంబ సభ్యులు తమ అవసరాలను తీర్చుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడేవారు. తాను ఉంటున్న రూమ్ రెంట్ రూ.50 చెల్లించలేక గది ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇది అతని జీవితాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పింది. బాలాజీ వేఫర్స్.. క్యాంటీన్లో పనిచేసుకుంటున్న సమయంలో చందూభాయ్, అతని సోదరులకు నెలకు రూ. 1000 విలువ చేసే కాంట్రాక్ట్ ఒకటి లభించింది. దీంతో వారు ఒక చిన్న షెడ్ నిర్మించి, అక్కడ నుంచే చిప్స్ తయారు చేయడం ప్రారంభించి 'బాలాజీ వేఫర్స్' అనే పేరుతో విక్రయించడం స్టార్ట్ చేశారు. సినిమా థియేటర్, చుట్టుపక్కల వేఫర్లను విక్రయించడం ప్రారంభించారు. ప్రారంభంలో అనుకున్నంత ఆదరణ పొందలేకపోయినా.. క్రమంగా బాగా పాపులర్ అయింది. ఆ తరువాత ఈ బాలాజీ వేఫర్స్ విస్తరణ ప్రారంభమైంది. 1995లో ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా అవతరించింది. ఇదీ చదవండి: యూపీఐ ఐడీలు డీయాక్టివేట్ అవుతాయ్ - చెక్ చేసుకోండి! ఓ చిన్న గదిలో ప్రారంభమైన వ్యాపారం గుజరాత్ , రాజస్థాన్ , మహారాష్ట్ర , మధ్యప్రదేశ్‌లలో అతి పెద్ద స్నాక్స్ మ్యానుఫ్యాక్చరర్‌గా అవతరించి భారతదేశంలో అతిపెద్ద వేఫర్ బ్రాండ్‌గా నిలిచింది. 2021 ఆర్ధిక సంవత్సరం కంపెనీ విలువ ఏకంగా రూ. 4000 కోట్లు అని సమాచారం. -
ఏడుసార్లు రిజెక్ట్.. విరక్తితో ఆత్మహత్యాయత్నం.. ఇప్పుడు లక్ష కోట్ల కంపెనీకి బాస్
ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ 'రాధికా గుప్తా' షార్క్ ట్యాంక్ ఇండియా 3 (Shark Tank India 3) ప్యానెల్లో నమితా థాపర్, వినీతా సింగ్, పీయూష్ బన్సాల్, అమన్ గుప్తా, అనుపమ్ మిట్టల్‌లతో కలిసి కనిపించనున్నారు. షార్క్ ట్యాంక్ ఇండియా 3 లో కనిపిస్తున్న రాధికా గుప్తా ఎవరు? ఆమె బ్రాగ్రౌండ్ ఏంటి? ప్రముఖ వ్యాపారవేత్తగా ఎలా ఎదిగిందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో అతి తక్కువ వయసులోనే ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎదిగిన రాధికా.. ఒకానొక సమయంలో ఉద్యోగం రాక చనిపోదామని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది.స్నేహితురాలు కాపాడటంతో బ్రతికి ఈ రోజు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. పాకిస్తాన్లో జన్మించిన రాధికా ఆమె కుటుంబంతో కలిసి ఖండాంతరాలు దాటింది. పుట్టుకతోనే సమస్యలున్న ఆమె మెడ విరిగిపోవడంతో తలా కొంత వంగిపోయింది. చదువుకునే రోజుల్లో చాలామంది ఎగతాళి చేసేవారు. ఆమె యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్స్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, 2005లో పెన్సిల్వేనియా యూనివర్సిటీ - ది వార్టన్ స్కూల్ నుంచి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పూర్తి చేసింది. చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం కోసం ప్రయత్నించే క్రమంలో ఏడు ఉద్యోగాలకు అప్లై చేసింది, కానీ ఒక్క ఉద్యోగానికి ఎంపిక కాలేదు. ఉద్యోగం రాకపోవడంతో నిరాశ చెంది ఆత్మహత్యా ప్రయత్నం చేసింది, స్నేహితురాలు కాపాడింది. ఆ తరువాత చాలా రోజులు నాలుగు చక్రాల కుర్చీకే పరిమితమైంది. 25 సంవత్సరాల వయసులో భారతదేశానికి వచ్చిన రాధికా తన భర్త, ఫ్రెండ్‌తో సొంతంగా అసెట్ మేనేజ్మెంట్ సంస్థను ఏర్పాటు చేసి.. కొన్నేళ్ల తర్వాత ఆ కంపెనీని ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేసింది. ఇదీ చదవండి: పండుగ సీజన్లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే.. ఇవి బెస్ట్ ఆప్షన్స్! ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్‌కి కొత్త సీఈవో ఎంపిక సమయంలో కొంత భయపడినప్పటికీ భర్త ప్రోత్సాహంతో 33 ఏళ్లలోనే దేశంలోనే అతి పిన్న వయస్కులైన సీఈవోలలో ఒకరిగా బాధ్యతలు చేపట్టింది. ఒకప్పుడు లోపాన్ని చూసి ఎగతాళి చేసిన వారు ఎందరో ఆదర్శంగా తీసుకోవడం మొదలుపెట్టారు. #SharkReveal ⚡🥁Drumrolls & Trumpets 🎺⚡ Presenting the new Shark Radhika Gupta, MD & CEO, Edelweiss Mutual Fund. ✨ Stay tuned for more exciting updates!#SharkTankIndia Season 3 streaming this January on Sony LIV#SharkTankIndiaOnSonyLIV pic.twitter.com/kAcM7Rt6cx — Shark Tank India (@sharktankindia) November 4, 2023 -
రూ.1200 సంపాదనతో మొదలై.. రూ.9800 కోట్ల కంపెనీ నడిపిస్తోంది! ఎవరీ గజల్ అలఘ్..
ఒకప్పుడు వంటింటికి మాత్రమే పరిమితమైన ఆడవాళ్లు ఈ రోజు అంతరిక్షానికి కూడా వెళ్లి వచ్చేస్తున్నారు. దీన్ని బట్టి మహిళలు ఎంతగా ఎదిగారనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ఎంతోమంది స్త్రీలు తమ ఆలోచనలతో గొప్ప వ్యాపారవేత్తలుగా ఎదిగారు. ఈ కోవకు చెందినవారిలో ఒకరు మామా ఎర్త్ కో ఫౌండర్ 'గజల్ అలఘ్' (Ghazal Alagh). ఈ కథనంలో గజల్ ఎవరు? ఆమె సాధించిన సక్సెస్ ఏంటి? నెట్ వర్త్ ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హర్యానాలో జన్మించిన ఈమె 2010లో పంజాబ్ యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ అప్లికేషన్లో డిగ్రీ, 2013లో న్యూయార్క్ అకాడమీ ఆఫ్ ఆర్ట్‌లో డిజైన్ అండ్ అప్లైడ్ ఆర్ట్స్‌లో సమ్మర్ ఇంటెన్సివ్, మోడరన్ ఆర్ట్‌లో ఫిగరేటివ్ ఆర్ట్‌లో ఇంటెన్సివ్ కోర్సును పూర్తి చేసింది. మామా ఎర్త్ ప్రారంభం నిజానికి 2008 నుంచి 2010 వరకు ఎన్ఐఐటీ లిమిటెడ్‌లో కార్పొరేట్ ట్రైనర్‌గా పనిచేస్తూ.. కొందరికి సాఫ్ట్వేర్ అండ్ కోడింగ్ లాంగ్వేజ్‌లో ట్రైనింగ్ అందించింది. చదువు పూర్తయ్యి పెళ్లయిన తరువాత 2016లో తన భర్త 'వరుణ్ అలఘ్'తో కలిసి 'మామా ఎర్త్' ప్రారంభించింది. మామా ఎర్త్ ద్వారా గజల్ అలఘ్ చిన్న పిల్లలకు పర్యావరణ అనుకూలమైన వ్యక్తిగత పరిశుభ్రత ఉత్పత్తులను రూపొందించడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే రాష్ క్రీమ్‌లు, లోషన్లు, షాంపులు, మసాజ్ ఆయిల్లు, బాడీ వాష్‌లు, డైపర్లను తయారు చేసి విక్రయించడం ప్రారంభించారు. ఈ ఉత్పత్తులు ఆనతి కాలంలోనే ప్రజాదరణ పొందగలిగాయి. రూ. 9800 కోట్లు గజల్ అలఘ్ ప్రస్తుతం మామా ఎర్త్ సంస్థ ద్వారా పిల్లల సంరక్షణలో ఉపయోగించే దాదాపు 500 వస్తువులను విక్రయిస్తూ.. ఆసియాలో సేఫ్ సర్టిఫైడ్ బ్రాండ్‌గా అవతరించింది. రూ. 25 లక్షలతో ప్రారంభమైన మామా ఎర్త్ సంపద రూ. 9,800 కోట్లకు పెరిగినట్లు సమాచారం. ఇదీ చదవండి: వేతనాల్లో ఇంత తేడానా? పదేళ్లలో పెరిగిన సీఈఓ, ఫ్రెషర్స్ శాలరీ రిపోర్ట్ వీకెండ్ కార్పోరేట్ ట్రైనర్‌గా మొదట సంపాదించిన డబ్బు కేవలం 1,200 రూపాయలు మాత్రమే, దాంతో మా అమ్మను షాపింగ్‌కి తీసుకెళ్ళడం ఎప్పటికి మరచిపోలేని అనుభూతిని మిగిల్చిందని ఎక్స్‌లో ఇటీవలి పోస్ట్ చేసింది. ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగిన గజల్ అలఘ్ 'షార్క్ ట్యాంక్ ఇండియా' రియాలిటీ షో ద్వారా ప్రసిద్ధి చెందింది. ఈమె మొత్తం ఆస్థి విలువ వంద కోట్లు కంటే ఎక్కువ ఉంటుంది. My first income was modest, earning Rs 1200/day as a weekend corporate trainer. I recall the joy of taking my mom shopping and sharing a memorable dinner. What about you? How did you use your first earnings? — Ghazal Alagh (@GhazalAlagh) October 16, 2023 -
మెకానిక్ నుంచి వేలకోట్లు.. బుర్జ్ ఖలీఫాలో 22 అపార్ట్మెంట్స్..!!
మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని ఎంతోమంది నిరూపించారు. ఇప్పటికి కూడా చాలామంది సాధారణ పౌరుల నుంచి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదిగారు. ఈ కోవకు చెందిన వారిలో ఒకరు కేరళలో జన్మించి ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగిన 'జార్జ్ వి నేరేపరంబిల్' (George V Nereamparambil). ఇంతకీ ఈయనెవరు, సాధించిన సక్సెస్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన జార్జ్ తన 11 ఏళ్ల వయసు నుంచి తన తండ్రికి వాణిజ్య పంటల వ్యాపారంలో సహాయం చేశాడు. అంతే కాకుండా మార్కెట్‌కు వస్తువులను రవాణా చేయడం.. బేరం చేయడం వంటివి చేసేవాడు. దీంతో అతి తక్కువ కాలంలోనే వ్యాపారంలో మెళుకువలు తెలుసుకున్నాడు. జీఈఓ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఈయన కొంత కాలం మెకానిక్‌గా కూడా పనిచేశాడు. ఆ తరువాత 1976లో షార్జాకు రావడంతో అతని జీవితం మలుపు తిరిగింది. అప్పట్లో అభివృద్ధి చెందుతున్న ఆ ప్రాంతంలో ఎడారి వేడికి తప్పకుండా ఎయిర్ కండిషనింగ్ రంగం పురోగతి సాధిస్తుందని గ్రహించాడు. ఈ ఆలోచనే నేడు జీఈఓ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని పిలిచే ఒక భారీ సామ్రాజ్యంగా ఏర్పడింది. ఈ రోజు గల్ఫ్ ప్రాంతంలో ప్రముఖ భారతీయ వ్యాపార దిగ్గజాలలో 'జార్జ్ వి నేరేపరంబిల్' ఒకరుగా పాపులర్ అయ్యాడు. ఈ రోజు బుర్జ్ ఖలీఫాలో ఏకంగా 22 లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతే కాకుండా జార్జ్ అపార్ట్మెంట్ల గోడలు, సీలింగ్‌లు, అంతస్తులు బంగారంతో చేసిన డెకర్‌తో కప్పబడి ఉన్నట్లు నివేదించారు. మొత్తం సంపద నిజానికి ఒకప్పుడు తన బంధువుల్లో ఒకరు నువ్వు బుర్జ్ ఖలీఫాలో ప్రవేశించలేవని ఆటపట్టించాడు, కానీ 2010లో జార్జ్ ఆ భవనంలో ఒక అపార్ట్‌మెంట్‌ని అద్దెకు తీసుకోగలిగాడు. ప్రస్తుతం ఏకంగా 22 అపార్ట్మెంట్లను కొన్నట్లు చెబుతారు. భవిష్యత్తులో మరిన్ని సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నట్లు, ఈయన మొత్తం ఆస్తి రూ. 4800 కోట్లు అని సమాచారం. ఇదీ చదవండి: ముకేశ్ అంబానీకి కాబోయే కోడలు ఆస్తి ఎన్ని కోట్లంటే? ప్రస్తుతం బుర్జ్ ఖలీఫా అందించే 900 అపార్ట్మెంట్లలో దాదాపు 150 అపార్ట్మెంట్లలో భారతీయులే ఉన్నారని చెబుతారు. అందులో కూడా ఎక్కువ అపార్ట్మెంట్లను కలిగిన వ్యక్తి నేరేపరంబిల్ కావడం విశేషం. ఒకప్పుడు మెకానిక్‌గా పనిచేసి నేడు ఎంతోమందికి స్ఫూర్తిదాయకమయ్యాడంటే దీని వెనుక అతని కృషి ఎంత ఉందో ఇట్టే అర్థమవుతోంది. -
నేటి తరానికి ఆదర్శం.. బిల్ కమ్మింగ్స్ సక్సెస్ స్టోరీ!
Bill Cummings Success Story: మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు ధనవంతులు కావాలని కలలు కంటారు. ఆ కలలు నిజం కావాలంటే అహర్నిశలు కష్టపడాల్సి ఉంటుంది. అలా కష్టపడి పైకొచ్చినవారిలో ఒకరు 'బిల్ కమ్మింగ్స్' (Bill Cummings). ఈ కథనంలో ఈయన ఎలా సక్సెస్ సాధించాడు, ప్రారంభంలో ఏమి చేసేవాడు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అమెరికాలో నివసిస్తున్న బిల్ కమ్మింగ్స్ ప్రస్తుతం బిలినీయర్స్ జాబితాలో ఒకరు. ఈయన 50 సంవత్సరాల క్రితమే బిలియన్ డాలర్స్ కంపెనీ ప్రారంభించి బోస్టన్ రియల్ ఎస్టేట్ రాజుగా నిలిచాడు. ఇదంతా ఒక్క రోజులో వచ్చిన సక్సెస్ కాదు. చిన్న ఇంట్లో.. బిల్ కమ్మింగ్స్ పుట్టుకతోనే కుబేరుడు కాదు, ఒకప్పుడు తల్లిదండ్రులు, సోదరితో ఒక చిన్న ఇంట్లో ఉండేవాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ వ్యాపారంలో మెళుకువలు తెలుసుకున్నాడు. ఆ తరువాత వ్యాపార రంగంలో అడుగు పెట్టి దినదినాభివృద్ధి చెందిన బిలినీయర్స్ జాబితాలోకి చేరిపోయాడు. బిల్ కమ్మింగ్స్ జీవితం నేటికీ ఎంతోమందికి ఆదర్శం. నేడు కుబేరుడైనప్పటికీ డబ్బును ఊరికే వృధాకానివ్వడు, అతని భార్య కూడా పెద్దగా విలాసవంతమైన జీవితం ఆశించదు. ఇప్పటికి కూడా వారు తమ ఖర్చును తగ్గించుకోవడానే చూస్తారు. దీనికి ప్రధాన కారణం చిన్నప్పుడు తల్లిదండ్రులు తక్కువ ఖర్చుపెట్టాలని అతని నేర్పిన పాఠమే అని తెలుస్తోంది. ఇదీ చదవండి: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం & వెండి ధరలు ఇప్పటికి కూడా విజయం సాధించడానికి ప్రయత్నించాలి, కష్టపడి పనిచేయడానికి వెనుకాడకూడదని విశ్వసిస్తాడు. అంతే కాకుండా హార్డ్ వర్క్, సాధించాలనే కోరిక, అంకిత భావం చాలా ముఖ్యమని చెబుతాడు. ఒక రంగంలో అడుగుపెట్టిన తరువాత ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించాలి, వాటిని పరిష్కరించుకోవాలి. ఇది సక్సెస్ సాధించడానికి చాలా ముఖ్యమైన అంశం. ఇదీ చదవండి: వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో వెనుక పడిన భారత్ ఎనిమిది పదుల వయసు దాటిన తరువాత కూడా ఇప్పటికీ బిల్ కమ్మింగ్స్ తన సమయాన్ని వృధా చేయడానికి ఇష్టపడడు. తన రంగంలో విజయాన్ని కొనసాగిస్తూ ఒక బుక్ కూడా రాసారు. ఇది నేటి తరం యువతకు తప్పకుండా ఉపయోగపడుతుంది.