కరోనా మహమ్మారి చాలా మంది జీవితాలను మార్చేసింది. ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కోవడంతోపాటు, వాటిని ఎలా అధిగమించాల్లో కూడా నేర్పింది. ఆ సమయంలో బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడటంతో.. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన కొంతమందిలో వచ్చింది. ఆ ఆలోచనే ఓ వ్యాపారి జీవతంలో ఇప్పుడింతటి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది.
బీహార్‌లోని దర్భాంగ జిల్లాకు చెందిన రాహుల్ భగత్ అనే యువకుడు చదువు పూర్తయ్యాక సొంత వ్యాపారం వైపుగా ఆలోచించాడు. తన దగ్గరలో ఉన్న మార్కెట్ వైపు దృష్టి సారించగా, తనకెదురైన ఓ వ్యాపారమే ప్రస్తుతం ఏడాదికి లక్షల్లో ఆదాయాన‍్ని తెచ్చిపెడుతుంది. అదే చీపుర్ల తయారీ. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తీసుకుని.. చిన్న తరహా పరిశ్రమల సూచన దిశగా, తక్కువ పెట్టుబడితో.. రాహుల్ కేవలం రూ.4 వేలకే చీపుర‍్ల వ్యాపారం ప్రారంభించాడు. ప్రస్తుతం అది లక్షల్లో ఆదాయంగా మారింది.
ఆరోజు తీసుకున్న నిర్ణయమే..
"కరోనా సమయంలో వచ్చిన ఆలోచనే ఆఖరి నిర్ణయంగా మార్చుకుని ఇటువైపుగా అడుగేశాను. ఈ చూట్టూరా కొన్ని ప్రాంతాలలో చీపుర్ల తయారీదారునిగా ఎదిగాను. ప్రతీ ఇంట్లో చీపురు ఉండటం, ఇంటిని శుభ్రంగా మార్చడంలో ఈ వ్యాపారం కీలకంగా ముడిపడి ఉంది గనుకే మంచి ఆదాయం వస్తోంది.
ఇక్కడ మూడు రకాల చీపుర్లను తయారు చేస్తాను. ఒక్కోరకమైన చీపురుకి ఒక్కో ధర ఉంటుంది. నెలలో 300 నుంచి 400ల చీపుర్లను విక్రయిస్తాను. ఖర్జూరం, కొబ్బరి చీపురు, పూల చీపురు వంటి మూడు రకాలను తయారుచేయడమే నా వ్యాపారానికి మెట్టు. వీటన్నింటికీ ముడిసరుకుని దర్భాంగ సమితి మార్కెట్ నుంచి తీసుకురావాలి. ఖర్జూరం ఒక్కో చీపురు రూ.20, కొబ్బరి చీపురు రూ. 50 కాగా, పూల చీపురు 60. నెలవారీ ఆదాయం రూ.40 నుంచి 45వేలు వస్తుందని" రాహుల్ భగత్ చెప్పుకొచ్చాడు.
ఇవి చదవండి: అంబానీ ఇంట సెలబ్రేషన్స్.. జాన్వీ ధరించిన నెక్లెస్ అంత ఖరీదా?
Comments
Please login to add a commentAdd a comment