
మనలో చాలామంది నిద్రలేమి సమస్యలతో సతమతమవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కానీ కొందరు మాత్రం తక్కువ సమయమే పడుకున్నా..ఆరోగ్యంగానే ఉంటారు. పైగా ఎలాంటి చికాకు, ఆందోళనలు కనిపించవు. చాలా చురగ్గా తమ పనులు చేసుకుంటుంటారు. వాళ్లను చూసి అసూయ కూడా కలుగుతుంది. అబ్బా మనలానే కదా వాళ్లు తక్కువ సమయమే పడుకున్నా..ఇంతలా హెల్దీగా ఉంటున్నారు అనే బాధ కలుగుతుంది. అలాగే శాస్త్రవేత్తలు కూడా నిద్ర పనితీరు అందిరిలోనూ ఒకేలాంటి ప్రభావం ఉండదని చెబుతుంటారు కూడా. అయితే అందుకు కారణాలు గురించి మాత్రం నిర్థారించలేకపోయారు. కానీ ఇప్పుడు దానికి సమాధానం దొరికిందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
రాత్రిపూట నాలుగు నుంచి ఆరు గంటలే నిద్రపోయినప్పటికీ..ఉదయం చురుగ్గా పనిచేయడానికి రీజన్ అరుదైన జన్యు పరివర్తనమే(Genetic mutation) కారణమని పరిశోధకుల తాజా అధ్యయనాలు పేర్కొన్నాయి. ఈ జన్యు పరివర్తనం నిద్ర-మేల్కొనే చక్రాన్ని ప్రభావితం చేస్తుందట. అంటే దీనికారణంగా ఆయా వ్యక్తులు ..తక్కువ గంటల్లోనే డీప్ స్లీప్‌లోకి వెళ్లిపోతారట.
వాస్తవానికి వైద్యులు ప్రతి వ్యక్తి రాత్రి కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవాలని సూచిస్తుంటారు. అలా నిద్రపోనట్లయితే..నిద్ర లేమి అల్జీమర్స్, గుండెజబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం బారినపడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని హెచ్చరిస్తుంటారు. కానీ ఇక్కడ తక్కువ నిద్ర చక్రం ఉన్న ప్రతిఒక్కరికి ఇలాంటి ఆరోగ్యసమస్యలు ఉండవని అధ్యయనం వెల్లడించింది. చెప్పాలంటే ఈ వ్యక్తులను అదృష్టవంతులనే చెప్పాలి. తక్కువసేపే పడుకున్నా..హెల్దీగా ఉండగల సామర్థ్యం వీరి సొంతం.
ఇక సాధారణంగా అందరికీ పడుకునేటప్పుడు శరీరం పనిచేస్తూనే ఉంటందనే విషయం తెలిసిందే. అయితే ఇలాంటి అరుదైన జన్యుపరిస్థితి ఉన్న వ్యక్తులకు మాత్రం నిద్రపోతున్నపుడు వారి శరీరం విధులు మనకంటే ఎక్కువ స్థాయిలో ఉంటాయని కాలిఫోర్నియా న్యూరోసైంటిస్ట్ చెబుతున్నారు. అంతేగాదు ఆయా వ్యక్తుల్లో మానవ సూపర్-స్లీపర్ SIK3-N783Y అనే జన్యు మ్యుటేషన్ ఉండటాన్ని గుర్తించింది.
దీవిల్ల తక్కువ గంటల్లోనే గాఢనిద్రను పొందుతారట. పరిశోధకులు ఈ మ్యూటేషన్‌ని ఎలుకలలో ప్రవేశపెట్టగా అవి కూడా తక్కువ గంటలే నిద్రపోతున్నట్లు గుర్తించారు నిపుణులు. అంతేగాదు ఈ మ్యుటేషన్ ఉన్న ఎలుకలు 31 నిమిషాలే నిద్రపోతే..ఈ మ్యుటేషన్ లేని ఎలుకలు 54 నిమిషాలుపైగా నిద్రపోవడాన్ని గమనించారు.
అంతేగాదు ఎలుకలో NSS hSIK3-N783Y మ్యుటేషన్ ఉండటం వల్ల నిద్ర సమయం తగ్గుతుందని, EEG డెల్టా శక్తి పెరుగుతుందని తెలిపారు. ఈ మ్యుటేషన్ నిర్మాణాత్మక మార్పులకు కారణమవుతుందని అన్నారు. ముఖ్యంగా ఇది ప్రోటీన్ కీ ఫాస్ఫేట్ అణువులను ఇతర ప్రోటీన్లకు బదిలీ చేసే సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందన్నారు. చివరగా శాస్త్రవేత్తలు ఈ అధ్యయన ఫలితాలు నిద్ర రుగ్మతలకు కొత్త చికిత్సలను అందించి, నిద్ర నాణ్యతను మెరుగుపరిచగల ఆశను రేకెత్తించిందన్నారు.
(చదవండి: National Technology Day 2025: నైపుణ్యాలున్న యువతకు స్వర్గధామం భాగ్యనగరం)