brooms
-
ఆనాడు 4 వేలతో ప్రారంభించి.. ప్రస్తుతం లక్షల్లో...
కరోనా మహమ్మారి చాలా మంది జీవితాలను మార్చేసింది. ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కోవడంతోపాటు, వాటిని ఎలా అధిగమించాల్లో కూడా నేర్పింది. ఆ సమయంలో బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడటంతో.. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన కొంతమందిలో వచ్చింది. ఆ ఆలోచనే ఓ వ్యాపారి జీవతంలో ఇప్పుడింతటి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది.బీహార్‌లోని దర్భాంగ జిల్లాకు చెందిన రాహుల్ భగత్ అనే యువకుడు చదువు పూర్తయ్యాక సొంత వ్యాపారం వైపుగా ఆలోచించాడు. తన దగ్గరలో ఉన్న మార్కెట్ వైపు దృష్టి సారించగా, తనకెదురైన ఓ వ్యాపారమే ప్రస్తుతం ఏడాదికి లక్షల్లో ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. అదే చీపుర్ల తయారీ. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తీసుకుని.. చిన్న తరహా పరిశ్రమల సూచన దిశగా, తక్కువ పెట్టుబడితో.. రాహుల్ కేవలం రూ.4 వేలకే చీపుర్ల వ్యాపారం ప్రారంభించాడు. ప్రస్తుతం అది లక్షల్లో ఆదాయంగా మారింది.ఆరోజు తీసుకున్న నిర్ణయమే.."కరోనా సమయంలో వచ్చిన ఆలోచనే ఆఖరి నిర్ణయంగా మార్చుకుని ఇటువైపుగా అడుగేశాను. ఈ చూట్టూరా కొన్ని ప్రాంతాలలో చీపుర్ల తయారీదారునిగా ఎదిగాను. ప్రతీ ఇంట్లో చీపురు ఉండటం, ఇంటిని శుభ్రంగా మార్చడంలో ఈ వ్యాపారం కీలకంగా ముడిపడి ఉంది గనుకే మంచి ఆదాయం వస్తోంది.ఇక్కడ మూడు రకాల చీపుర్లను తయారు చేస్తాను. ఒక్కోరకమైన చీపురుకి ఒక్కో ధర ఉంటుంది. నెలలో 300 నుంచి 400ల చీపుర్లను విక్రయిస్తాను. ఖర్జూరం, కొబ్బరి చీపురు, పూల చీపురు వంటి మూడు రకాలను తయారుచేయడమే నా వ్యాపారానికి మెట్టు. వీటన్నింటికీ ముడిసరుకుని దర్భాంగ సమితి మార్కెట్ నుంచి తీసుకురావాలి. ఖర్జూరం ఒక్కో చీపురు రూ.20, కొబ్బరి చీపురు రూ. 50 కాగా, పూల చీపురు 60. నెలవారీ ఆదాయం రూ.40 నుంచి 45వేలు వస్తుందని" రాహుల్ భగత్ చెప్పుకొచ్చాడు.ఇవి చదవండి: అంబానీ ఇంట సెలబ్రేషన్స్.. జాన్వీ ధరించిన నెక్లెస్ అంత ఖరీదా? -
నగరిలో లోకేష్ కి ఘోర అవమానం
-
భార్య చీపురుతో కొట్టిందన్న అవమానంతో..
కోల్కత్తా : భార్య చీపురు కట్టతో కట్టిందన్న అవమానంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమ బెంగాల్లో శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. స్థానిక పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌమిత్ర (45) అనే వ్యక్తికి, అతని భార్యకు ఓ విషయంపై వాగ్వాదం చోటుచేసుకుంది. మాటమాట పెరిగి ఇరువురి మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో అతని అత్త (భార్య తల్లి) కూడా రంగం ప్రవేశం చేసింది. ఇద్దరూ కలిసి అతనిపై దాడికి దిగారు. చీపురు కట్టతో కొట్టి తీవ్రంగా అవమానించారు. దీంతో మానస్తాపం చెందిన సౌమిత్ర ఇంటి సీలింగ్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం అతని తల్లికి తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అలీపుర్దూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని స్టేషన్ అధికారి తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం అతని మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. (పరువు కోసం కూతుర్ని హతమార్చిన తండ్రి) -
'తాగుబోతుల తాట తీస్తాం'
పాట్నా: చీపురుకట్టలతో తాగుబోతుల తాట తీస్తామంటున్నారు బిహార్ మహిళలు. మద్యం సేవించినా, అమ్మినా చీపురుకట్టతో చితక్కొట్టాలని పిలుపు ఇచ్చారు. షేక్ పూరా జిల్లాలోని రంజాన్ పూర్ గ్రామ మహిళలు మద్యం రక్కసిపై పోరుకు నడుంబిగించారు. ఇందులో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. మద్యం సేవించినా, అమ్మినా చీపురుకట్టతో సన్మానించడంతో పాటు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. బిహార్ గ్రామీణ ప్రాంతంలో విచ్చలవిడిగా సాగుతున్న మద్యం అమ్మకాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ చర్యలు చేపట్టామని రంజాన్ పూర్ పంచాయతీ నాయకురాలు శమాదేవి తెలిపారు. దీనిపై ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు గ్రామంలో పోస్టర్లు అతికించామని చెప్పారు. తమ పాలిట శాపంగా మారిన మద్యం మహమ్మారిని తరిమి కొట్టేందుకు పోరాటం మొదలు పెట్టామన్నారు. మద్యం సేవిస్తే రూ.25 వేలు, అమ్మితే రూ.19 వేల జరిమానా వేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.