'తాగుబోతుల తాట తీస్తాం' | Punish tipplers with brooms, says Bihar women's panchayat | Sakshi
Sakshi News home page

'తాగుబోతుల తాట తీస్తాం'

Published Fri, Jul 31 2015 2:14 PM | Last Updated on Thu, Jul 18 2019 2:28 PM

'తాగుబోతుల తాట తీస్తాం' - Sakshi

'తాగుబోతుల తాట తీస్తాం'

పాట్నా: చీపురుకట్టలతో తాగుబోతుల తాట తీస్తామంటున్నారు బిహార్ మహిళలు. మద్యం సేవించినా, అమ్మినా చీపురుకట్టతో చితక్కొట్టాలని పిలుపు ఇచ్చారు. షేక్ పూరా జిల్లాలోని రంజాన్ పూర్ గ్రామ మహిళలు మద్యం రక్కసిపై పోరుకు నడుంబిగించారు. ఇందులో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. మద్యం సేవించినా, అమ్మినా చీపురుకట్టతో సన్మానించడంతో పాటు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

బిహార్ గ్రామీణ ప్రాంతంలో విచ్చలవిడిగా సాగుతున్న మద్యం అమ్మకాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ చర్యలు చేపట్టామని రంజాన్ పూర్ పంచాయతీ నాయకురాలు శమాదేవి తెలిపారు. దీనిపై ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు గ్రామంలో పోస్టర్లు అతికించామని చెప్పారు. తమ పాలిట శాపంగా మారిన మద్యం మహమ్మారిని తరిమి కొట్టేందుకు పోరాటం మొదలు పెట్టామన్నారు. మద్యం సేవిస్తే రూ.25 వేలు,  అమ్మితే రూ.19 వేల జరిమానా వేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement