చూస్తుండగానే మరో ఏడాది ముగిసిపోయింది. ఎన్నో కొత్త ఆశలతో నూతన ఏడాదికి ప్రపంచమంతా స్వాగతం పలికింది. ఈ కొత్త సంవత్సరాన్ని ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు. సెలబ్రిటీలు సైతం తమ ఫ్యామిలీస్‌తో కలిసి న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్నారు. బాలీవుడ్ తారలంతా కొత్త ఏడాది గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు.
అయితే బాలీవుడ్ బుల్లితెర నటి మౌనీరాయ్ న్యూ ఇయర్ వేళ పార్టీకి హాజరైంది. ఆమె తన భర్తతో కలిసి కొత్త ఏడాదిని సెలబ్రేట్ చేసుకుంది. వీరిద్దరికి సంబంధంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ జంటతో పాటు కల్కి భామ దిశాపటానీ కూడా న్యూ ఇయర్ పార్టీలో సందడి చేశారు.
అయితే ఈ వీడియోలో మౌనీ రాయ్ ఫుల్‌గా ఆల్కహాల్ సేవించినట్లు కనిపించింది. తన భర్త సాయంతో కారు దగ్గరికి చేరుకుంది. బార్ నుంచి బయటికి వస్తూ నడవలేక కింద పడిపోయింది. దీంతో మౌనీ రాయ్‌ను ఆమె భర్తనే స్వయంగా ఇంటికి తీసుకెళ్లారు. ఎవరూ ఫోటోలు తీయవద్దంటూ ఆమె భర్త కెమెరాలకు తన చేతిని అడ్డు పెట్టడం వీడియోలో కనిపించింది. వీరి వెనకాలే కల్కి మూవీ హీరోయిన్ దిశా పటానీ కూడా కనిపించింది. ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విటర్‌లో షేర్ చేయడంతో నెట్టింట వైరలవుతోంది.
కాగా.. మౌనీ రాయ్ నాగిని సీరియల్‌తో ఫేమస్ అయింది. బాలీవుడ్‌లో పలు సీరియల్స్‌లో ఆమె నటించింది.
#MouniRoy fell while exciting the bar and then husband took her in his arm till the car #DishaPatani pic.twitter.com/N0uau0IInf
— $@M (@SAMTHEBESTEST_) January 2, 2025
Comments
Please login to add a commentAdd a comment