'నాగిని' సీరియల్ ఫేం, బుల్లితెర నటి మౌనీరాయ్ ప్రియుడు, వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను పెళ్లాడింది. గురువారం(జనవరి 27న) ఉదయం మలయాళీ సాంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో మౌనీరాయ్ తెలుపు రంగు పట్టుచీరలో మెరిసిపోతుండగా సూరజ్ గోధుమరంగు షేర్వాణీలో పెళ్లికొడుకుగా ముస్తాబయ్యాడు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
నిజానికి మౌనీరాయ్ తన పెళ్లిని దుబాయ్‌లో జరుపుకోవాలని అనుకున్నట్లు సమాచారం. కానీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో తన పెళ్లి వేడుకకు గోవా సరైన వేదికగా భావించింది. గత రెండు రోజులుగా వీరి పెళ్లి పనులకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్‌చల్ చేయగా తాజాగా పెళ్లి ఫొటోలు బయటకు వచ్చాయి. ఇక వీరు పెళ్లికి వచ్చే అతిథులందరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలనే నిబంధన పెట్టినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment