Mouni Roy And Hubby Suraj Nambiar At The Post Wedding Pool Party: బుల్లితెరపై నటి మౌనీరాయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోయిన్ రేంజ్‌లో ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఆమె నటించిన నాగిని సీరియల్ ఎంతో పాపులర్ అయ్యింది. ఇదిలా ఉంటే దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త, ప్రియుడు సూరజ్ నంబియార్‌ను గురువారం ఆమె డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న సంగతి తెలిసిందే. గురువారం(జనవరి 27న) ఉదయం గోవాలో మలయాళీ, బెంగాలీ పద్ధతిలో వీరి వివాహం జరిగింది.
చదవండి: ‘లైగర్’ బ్యూటీ అనన్యపై దీపికా ఆసక్తికర వ్యాఖ్యలు, హీరోయిన్ ఫ్యాన్స్ షాక్
ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువురు టీవీ సెలబ్రిటీలు సైతం హాజరయ్యారు. ఇక మౌనీ తన వెడ్డింగ్‌ను గ్రాండ్‌గా జరుపుకుంది. పెళ్లికి ముందు హల్ది, మహెందీ ఫంక్షన్స్‌తో పాటు పూల్ పార్టీ అరెంజ్‌మెంట్స్ కూడా చేశారు. ఇక పెళ్లి అనంతరం మౌనీ వరసగా తన పెళ్లి ఫొటోలతో పాటు, వీడియోలు షేర్ చేస్తుంది. ఈ క్రమంలో వెడ్డింగ్ పూల్ పార్టీ వీడియోను కూడా షేరింది. ఈ వీడియోలో నటి కిరణ్ బేడీతో పాటు టీవీ, సినీ నటీనటులు కనిపించారు.
చదవండి: ‘పుష్ప’ మూవీపై విరుచుకుపడ్డ గరికపాటి.. కడిగిపారేస్తా..
అందరూ హుషారుగా డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. అయితే ఈ వీడియో మౌనీ తన కాబోయే భర్తతో కలిసి డ్యాన్స్ చేస్తూ రొమాంటిగా కనిపించింది. అంతేకాదు చివరిలో సూరజ్‌కు మౌనీ లిప్‌లాక్ ఇచ్చిన సీన్ ఈ వీడియోలో హైలెట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కొత్త జంటను ఇలా చూసి మౌనీ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఈ సందర్భంగా వారికి పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment