రెండో పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరో.. హింట్ ఇచ్చేశాడా? | Hrithik Roshan Wedding Rumours With Saba Azad Latest | Sakshi
Sakshi News home page

Hrithik Roshan: పెళ్లి గురించి చెప్పకనే చెబుతున్నారా?

Published Thu, Jul 18 2024 9:17 AM | Last Updated on Thu, Jul 18 2024 10:19 AM

Hrithik Roshan Wedding Rumours With Saba Azad Latest

స్టార్ హీరో హృతిక్ రోషన్ రెండో పెళ్లికి రెడీ అయిపోయాడా? అంటే అవుననే అనిపిస్తోంది. మొదటి భార్య నుంచి ఇదివరకే విడాకులు తీసుకున్న ఈ హీరో.. యంగ్ బ్యూటీ షబా ఆజాద్‌తో ప్రేమలో ఉన్నాడు. ఈ విషయం అందరికీ తెలుసు కూడా. మాజీ భార్య, ప్రియురాలితో కలిసి హృతిక్ పలుమార్లు కనిపించాడు. అలాంటిది త్వరలో హృతిక్.. పెళ్లి విషయంలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన డిఫరెంట్ తెలుగు సినిమా)

'క్రిష్', 'కోయి మిల్ గయా' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా కాస్త పరిచయమున్న హృతిక్ రోషన్.. ఆ తర్వాత కాలంలోనూ పలు చిత్రాలతో మనకు అలావాటయ్యాడు. 2000లో ఇంటీరియర్ డిజైనర్ సుస్సానే ఖాన్‌ని పెళ్లి చేసుకున్న ఇతడు.. 2014లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. దీని తర్వాత సుస్సానే మరో వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉండగా, హృతిక్ కూడా షబా అనే యువ నటితో ప్రేమలో పడ్డారు. వీళ్లిద్దరూ బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.

కొన్నేళ్లుగా హృతిక్-షబా బంధం గురించి అందరికీ తెలుసు. కాకపోతే పెళ్లెప్పుడు చేసుకుంటారనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉంచేశారు. తాజాగా షబా ఇన్ స్టాలో 'రివీలింగ్ సూన్' (త్వరలో బయటపెడతా) అని ఓ పోస్ట్ పెట్టగా.. 'ఆగలేకపోతున్నాను' అని హృతిక్ కామెంట్ పెట్టాడు. ఇది పెళ్లి విషయమేనా అనే సందేహం వస్తోంది. మరోవైపు ఏదైనా మూవీ ప్రమోషనా అని డౌట్ కూడా వస్తోంది. ఇది ఏంటనేది కొన్నిరోజులు ఆగితే క్లారిటీ వచ్చేస్తుంది.

(ఇదీ చదవండి: వెకేషన్‌లో ఐకాన్‌ స్టార్.. బన్నీ- సుకుమార్‌ మధ్య అసలేం జరుగుతోంది?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement