
ఓటీటీలో 'మిస్ మ్యాచ్డ్' సిరీస్ తో గుర్తింపు తెచ్చుకున్న నటి కమ్ యూట్యూబర్ పెళ్లి చేసుకుంది. దాదాపు పదకొండేళ్లుగా ప్రేమలో ఉన్న వాడితోనే ఏడడుగులు వేసింది. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధువులు సమక్షంలో మంగళవారం ఈ పెళ్లి వేడుక జరిగింది.
(ఇదీ చదవండి: ఆ ఊరి పేరు 'ప్రభాస్'.. ఎక్కడో తెలుసా?)
2015లో యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన ప్రజక్త కోలీ.. మోస్ట్లీ సేన్ పేరుతో అందరికీ పరిచయమే. యూట్యూబ్ లో ఎంతో పేరు తెచ్చుకున్న ఈమె.. జగ్ జగ్ జీవో, నియాత్ సినిమాల్లో నటించింది. కానీ నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన 'మిస్ మ్యాచ్ డ్' వెబ్ సిరీస్ తో హీరోయిన్ అయిపోయింది. రీసెంట్ గా ఈ సిరీస్ నుంచి మూడో సీజన్ కూడా రిలీజైంది.

మరోవైపు యూట్యూబర్ కాకముందే వృషాంక్ అనే కుర్రాడితో ప్రేమలో ఉంది. దాదాపు 11 ఏళ్లపాటు వీళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమ బంధంలో ఎన్ని ఇబ్బందులొచ్చినా సరే నిలబడుతూ వచ్చాయని ప్రజక్త చెప్పుకొచ్చింది. ఇప్పుడు మహారాష్ట్రలోని కర్తాజ్ లోని ఓ ఫామ్ హౌసులో గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది. ప్రియుడితో పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఈమెకు అందరూ విషెస్ చెబుతున్నారు.
(ఇదీ చదవండి: శివరాత్రికి జాగారమా? ఈ సినిమాలు చూస్తూ భక్తి పారవశ్యం)
Comments
Please login to add a commentAdd a comment