
టీమ్‌ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) పెళ్లి వార్తలపై స్పందించాడు. గత రెండు రోజులుగా బాలీవుడ్ మీడియాతో పాటు నెట్టింట కూడా సిరాజ్ పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి. లెజండరీ సింగర్ ఆశా భోస్లే మనవరాలు.. సింగర్ జనై భోస్లే (Zanai Bhosle)తో కొంత కాలంగా ఆయన ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ముంబయిలోని ఆమె నివాసంలో తన 23వ పుట్టినరోజు వేడుకులను చాలా ఘనంగా జరుపుకుంది.
ఈ కార్యక్రమంలో సిరాజ్ కూడా పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట భారీగా వైరల్ అయ్యాయి. ఫొటోలో వారిద్దరూ కాస్త సన్నిహితంగా ఉన్నట్లు కనిపించడంతో ఈ పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. చాలా కాలంగా వారు డేటింగ్‌లో ఉన్నారని కూడా పలు హిందీ, తెలుగు వెబ్‌సైట్‌లు పేర్కొన్నాయి. మరింత స్పీడ్‌గా ఈ వార్తలు వ్యాప్తి చెందుతుండటంతో సిరాజ్ తాజాగా రియాక్ట్ అయ్యాడు.

సోషల్‌మీడియా వేదికగా మహ్మద్ సిరాజ్ రియాక్ట్ అయ్యాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఇలా పేర్కొన్నాడు. దయచేసి ఎవరూ తప్పుడు ప్రచారాలు చేయకండి అంటూ రిక్వెస్ట్ చేశాడు. జనై తనకు చెల్లెలు లాంటిదని తన ఇన్‌స్టా స్టోరీలో తెలిపాడు. ఈ క్రమంలో ఆయన ఒక ఫోటోను కూడా పంచుకున్నాడు. జనై లాంటి చెల్లెలు నాకు ఎవరూ లేరు. ఆమె లేకుండా నా జీవితం ఉండదు. ఆకాశంలో ఎన్నో నక్షత్రాల మధ్య చంద్రుడు ఒక్కడే ఉన్నట్లుగా ఆమె వెయ్యి మందిలో ఒకరు' అని సిరాజ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఇదే సమయంలో జనై కూడా ఈ రూమర్స్‌పై రియాక్ట్ అయింది. సిరాజ్ అంటూ తనకు చాలా ఇష్టమైన సోదరుడు అంటూ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment