TV Actress Shritama Mukherjee Marriage With Boyfriend Akash Sahni, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Shritama Mukherjee Marriage: మొన్నే కలిసి బిజినెస్‌ స్టార్‌ చేశారు, ఇప్పుడు లైఫ్‌ను..

Published Sun, Jun 26 2022 3:33 PM | Last Updated on Sun, Jun 26 2022 3:58 PM

TV Actress Shritama Mukherjee Ties the Knot To Boyfriend Akash Sahni - Sakshi

హిందీ సీరియల్‌ నటి శ్రీతమ ముఖర్జీ పెళ్లి పీటలెక్కింది. తన ప్రియుడు ఆకాశ్‌ సాహ్నితో ఏడడుగులు వేసింది. ముంబైలోని స్టార్‌ హోటల్‌లో జూన్‌ 23న వీరి వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబాలు సహా అతి దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యారు. తన స్పెషల్‌ డేను మరింత స్పెషల్‌గా మార్చేందుకు ఎంతో అందంగా ముస్తాబైంది శ్రీతమ. ఎరుపు రంగు చీర కట్టి, బంగారు నగలు ధరించి, నుదుటన ఎర్రటి బొట్టు పెట్టి, జడ కొప్పు వేసుకుని పెళ్లి కూతురిగా సింగారించుకుంది. వరుడు పేస్టల్‌ కలర్‌ షేర్వానీలో వధువకు పోటీనిచ్చేలా రెడీ అయ్యాడు. ఈ నూతన వధూవరులకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా శ్రీతమ ముఖర్జీ.. 'దేఖా ఎక్‌ క్వాబ్‌', 'కుచ్‌ తో హై తేరీ మేరే డర్మియాన్‌' సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన పెళ్లి గురించి ఆమె మాట్లాడుతూ.. 'మేము ఓ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా కలిశాం. ఓసారి బెంగళూరులో షూటింగ్‌ పూర్తి చేసుకుని ముంబై తిరిగి పయనమయ్యాను. కానీ నా డ్రైవర్‌కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో నన్ను పిక్‌ చేసుకోవడానికి నా ఫ్రెండ్‌ ఓ హ్యాండ్‌సమ్‌ అబ్బాయిని పంపించింది. అలా ఇద్దరం స్నేహితులమయ్యాం, తర్వాత ప్రేమించుకున్నాం. ఏడేళ్లు డేటింగ్‌ చేశాక ఇద్దరం కలిసి ఈ నెల 9న టీజీఎమ్‌ బ్యూటీ బ్రాండ్‌ను ప్రారంభించాం. బిజినెస్‌లోనే కాదు ఇప్పుడు జీవితంలో కూడా భాగస్వాములమయ్యాం' అని చెప్పుకొచ్చింది.

చదవండి: అత్యాశ..అవకాశాల్లేవు.. కేజీయఫ్‌ బ్యూటీ పరిస్థితి ఇలా అయిందేంటి?
‘7 డేస్‌ 6 నైట్స్‌’ వసూళ్లు పెరుగుతున్నా చిన్న వెలితి: ఎంఎస్‌ రాజు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement