మమ్మల్ని చిత్రవధ చేసింది.. నటిపై సవతి కూతురి ఆరోపణలు | Rupali Ganguly Stepdaughter Esha Claims Actor Used Bad Words On Her Mother, Know What She Says | Sakshi
Sakshi News home page

పెళ్లయ్యాక ఎఫైర్స్‌ చాలా తప్పు.. ఆ నటి మా నాన్నను ఎగరేసుకుపోయింది..

Published Wed, Nov 6 2024 5:32 PM | Last Updated on Wed, Nov 6 2024 6:13 PM

Rupali Ganguly Stepdaughter Esha Claims Actor Used Bad Words On Her Mother

ప్రముఖ బుల్లితెర నటి రూపాలీ గంగూలీ తనను ఎంతో వేధించిందంటోంది ఆమె సవతి కూతురు ఈషా. తన తండ్రిని తమకు దూరం చేసిందని, మా పేరెంట్స్‌ను విడగొట్టిందని ఆరోపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నాలుగేళ్ల కిందట నేను పెట్టిన పోస్ట్‌ ఒకటి ఇప్పుడు వైరలవుతోంది. దీన్ని రూపాలి, నాన్న (అశ్విన్‌) ఎలా సమర్థించుకుంటారో అర్థం కావట్లేదు.

పేరెంట్స్‌ బెడ్‌రూమ్‌లో తిష్ట
అప్పటికీ మా నాన్న ఎక్స్‌(ట్విటర్‌)లో ఈ గొడవకు, రూపాలీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చేశాడు. అది అన్నింటికంటే పెద్ద అబద్ధం. ఎందుకంటే అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న మా ఇంటికి రూపాలీ తరచూ వచ్చేది. మా అమ్మ నాన్నతో షేర్‌ చేసుకున్న బెడ్‌పైనే తనూ నిద్రించేది. ఆమె నన్ను, మా అమ్మను శారీరకంగా, మానసికంగా వేధించింది. మాటలతో చిత్రవధ చేసింది. ఆమె వల్ల ఎంతో నరకం అనుభవించాం.

సీరియల్‌లో హీరోయిన్‌.. బయట విలన్‌
నాన్న-రూపాలీ ఎఫైర్‌ వ్యవహారంలో ఇద్దరి తప్పు ఉంది. రూపాలీ ప్రధాన పాత్రలో నటించే అనుపమ సీరియల్‌లో.. ఆమె భర్త మరొకరితో ఎఫైర్‌ పెట్టుకుని తనను మోసం చేస్తాడు. ఆమె తనకోసమే కాకుండా మహిళలందరి పక్షాన నిలబడి పోరాడుతున్నట్లు ప్రవర్తిస్తుంటుంది. మరి నిజ జీవితంలో ఏం జరిగింది? ఎంతో ప్రశాంతంగా సాగిపోతున్న మా జీవితాల్లో అడుగుపెట్టింది. మా అమ్మను, నాన్నను విడదీసింది. 

శాశ్వతంగా విడగొట్టాలని ప్రయత్నాలు
బలవంతంగా మా నాన్నతో రెండుసార్లు విడాకుల పత్రాలు పంపించింది. రూపాలీ కోసం మా నాన్న మమ్మల్ని వదిలేసి ఇండియాకు వెళ్లిపోయాడు. పెళ్లి అయిన తర్వాత కూడా ఎఫైర్‌ పెట్టుకోవడమనేది చాలా పెద్ద తప్పు అని ఈషా చెప్పుకొచ్చింది. కాగా అశ్విక్‌ కె వర్మ.. 1997లో సప్నను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఈషాతో పాటు మరో కూతురు సంతానం. 2013లో అశ్విన్‌.. నటి రూపాలీ గంగూలీని పెళ్లి చేసుకున్నాడు. వీరికి రుద్రాన్ష్‌ అనే కుమారుడు జన్మించాడు.

 

 

చదవండి:  రానా, తేజ సజ్జా సారీ చెప్పాల్సిందే.. మహేశ్‌ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement