Esha
-
మమ్మల్ని చిత్రవధ చేసింది.. నటిపై సవతి కూతురి ఆరోపణలు
ప్రముఖ బుల్లితెర నటి రూపాలీ గంగూలీ తనను ఎంతో వేధించిందంటోంది ఆమె సవతి కూతురు ఈషా. తన తండ్రిని తమకు దూరం చేసిందని, మా పేరెంట్స్‌ను విడగొట్టిందని ఆరోపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నాలుగేళ్ల కిందట నేను పెట్టిన పోస్ట్ ఒకటి ఇప్పుడు వైరలవుతోంది. దీన్ని రూపాలి, నాన్న (అశ్విన్) ఎలా సమర్థించుకుంటారో అర్థం కావట్లేదు.పేరెంట్స్ బెడ్రూమ్లో తిష్టఅప్పటికీ మా నాన్న ఎక్స్(ట్విటర్)లో ఈ గొడవకు, రూపాలీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చేశాడు. అది అన్నింటికంటే పెద్ద అబద్ధం. ఎందుకంటే అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న మా ఇంటికి రూపాలీ తరచూ వచ్చేది. మా అమ్మ నాన్నతో షేర్ చేసుకున్న బెడ్‌పైనే తనూ నిద్రించేది. ఆమె నన్ను, మా అమ్మను శారీరకంగా, మానసికంగా వేధించింది. మాటలతో చిత్రవధ చేసింది. ఆమె వల్ల ఎంతో నరకం అనుభవించాం.సీరియల్లో హీరోయిన్.. బయట విలన్నాన్న-రూపాలీ ఎఫైర్ వ్యవహారంలో ఇద్దరి తప్పు ఉంది. రూపాలీ ప్రధాన పాత్రలో నటించే అనుపమ సీరియల్లో.. ఆమె భర్త మరొకరితో ఎఫైర్ పెట్టుకుని తనను మోసం చేస్తాడు. ఆమె తనకోసమే కాకుండా మహిళలందరి పక్షాన నిలబడి పోరాడుతున్నట్లు ప్రవర్తిస్తుంటుంది. మరి నిజ జీవితంలో ఏం జరిగింది? ఎంతో ప్రశాంతంగా సాగిపోతున్న మా జీవితాల్లో అడుగుపెట్టింది. మా అమ్మను, నాన్నను విడదీసింది. శాశ్వతంగా విడగొట్టాలని ప్రయత్నాలుబలవంతంగా మా నాన్నతో రెండుసార్లు విడాకుల పత్రాలు పంపించింది. రూపాలీ కోసం మా నాన్న మమ్మల్ని వదిలేసి ఇండియాకు వెళ్లిపోయాడు. పెళ్లి అయిన తర్వాత కూడా ఎఫైర్ పెట్టుకోవడమనేది చాలా పెద్ద తప్పు అని ఈషా చెప్పుకొచ్చింది. కాగా అశ్విక్ కె వర్మ.. 1997లో సప్నను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఈషాతో పాటు మరో కూతురు సంతానం. 2013లో అశ్విన్.. నటి రూపాలీ గంగూలీని పెళ్లి చేసుకున్నాడు. వీరికి రుద్రాన్ష్ అనే కుమారుడు జన్మించాడు. View this post on Instagram A post shared by Esha Verma (@eshav.official) చదవండి: రానా, తేజ సజ్జా సారీ చెప్పాల్సిందే.. మహేశ్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం -
Ishaa Vinod Chopra: నీకు నువ్వే సాయం చేసుకో
‘లెట్ ఈషా హెల్ప్ ఈషా’ అనుకుందామె. 16 ఏళ్ల వయసులో తనకు ‘బైపోలార్ డిజార్డర్’ ఉందని డాక్టర్లు చెప్పాక ఈషా వినోద్ చోప్రా తనకు తనే సాయం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ డిజార్డర్‌తో పోరాటం చేస్తూనే స్త్రీల మానసిక సమస్యల పై చైతన్యం కలిగిస్తోంది. దర్శకుడు విధు వినోద్ చోప్రా కుమార్తె అయిన ఈషా మానసిక సమస్యతో తన పోరాటంపై తాజాగా ‘ఫైండింగ్ ఆర్డర్ ఇన్ డిజార్డర్’ పుస్తకాన్ని వెలువరించింది. అందరూ తెలుసుకోవాల్సిన సంగతులు ఇందులో ఉన్నాయి.భారతదేశంలో 2023 సంవత్సరంలో జరిగిన అంచనా ప్రకారం 7 కోట్ల మంది మానసిక ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. వీరిలో స్త్రీల శాతం తక్కువ కాదు. మానసిక సమస్యలు 14 ఏళ్ల వయసు నుంచి కనిపిస్తాయి. 25 ఏళ్ల వయసుకు పూర్తిగా వ్యక్తమవుతాయి. కాబట్టి 14 నుంచి 25 ఏళ్ల మధ్య వయసులో పిల్లల్ని పరిశీలిస్తూ వారి సమస్యను తల్లిదండ్రులు గుర్తించగలిగితే చాలా వరకూ ఆ పిల్లలకు తమ సమస్య అర్థమయ్యి దానిని ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది. కాని దురదృష్టవశాత్తు ఈ ఎరుక ఉన్న తల్లిదండ్రులు తక్కువ. స్కూల్ టీచర్లు తక్కువ. ‘అందుకే నేను ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేటర్‌గా నా జీవితాన్ని గడపదలుచుకున్నాను. అందుకు అవసరమైన కోర్సును కెనడాలో పూర్తి చేసే దశలో ఉన్నాను. పిల్లల మానసిక సమస్యలనే కాదు... పిల్లలు నార్మల్‌గా ఉండి తల్లిదండ్రులు మానసిక సమస్యలతో బాధ పడుతున్నా పిల్లల జీవితం పెను ఒత్తిడికి లోనవుతుంది. స్కూల్ టీచర్లు ఇలాంటి సమయంలో పిల్లలకు అండగా ఉండాలి. అయితే స్కూల్ టీచర్లకు అలాంటి ట్రయినింగ్ ఉండటం లేదు’ అంటుంది ఈషా వినోద్ చోప్రా.సుప్రసిద్ధ దర్శకుడు విధు వినోద్ చో్ప్రా, అతని రెండవ భార్య షబ్నమ్ సుఖదేవ్‌ల సంతానం ఈషా. వారు తర్వాతి కాలంలో విడాకులు తీసుకున్నారు. ‘మా తాతగారు (అమ్మ తండ్రి) ఎస్.సుఖదేవ్ గొప్ప డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్. ఆయనకు మానసిక సమస్యలు ఉండేవని తర్వాత తెలిసింది. నా సమస్యకు మూలం అక్కడే ఉండొచ్చు’ అంటుంది ఈషా.➡️బైపోలార్ డిజార్డర్ఉన్నట్టుండి బోలెడంత ఉత్సాహం రావడం, భారీ పనులు సంకల్పించడం, అతిగా మాట్లాడటం, నిద్ర పోలేక పోవడం, అయినప్పటికీ ముఖం తాజాగా ఉండటం... ఇది బైపోలార్ డిజార్డర్‌లో ‘మేనియా’ దశ. మరి కొన్నాళ్లకు హటాత్తుగా దేనిమీదా ఆసక్తి లేకపోవడం, నిర్లిప్తత, నిద్ర లేమి, ఏ పనీ సరిగా చేయలేకపోవడం.. ఇది ‘డిప్రెషన్’ దశ. ఈ రెండు దశల మధ్య ఊగిసలాడుతూ మధ్యలో నార్మల్‌గా ఉంటూ మానసికంగా అవస్థ పడే స్థితే ‘బైపోలార్ డిజార్డర్’. ‘నా పదహారవ ఏట డాక్టర్లు దీనిని గుర్తించారు. దీనిని ఎదుర్కొనడానికి సిద్ధమవమన్నారు’ అని తెలిపింది ఈషా.➡️నీకు నువ్వే సాయం చేసుకో‘మానసిక సమస్యలు వచ్చినప్పుడు ఎవరైనా సరే మొదట తమ మీద తాము విశ్వాసం నిలుపుకోవాలి. పెద్ద కొంపలేం మునగలేదు.. నేనూ అందరిలాంటి వ్యక్తినే... ఇది ఉన్నట్టుగానే గుర్తించక నీ పనిలో పడు అని ధైర్యం చెప్పుకోవాలి. ఆ తర్వాత వైద్య చికిత్సను పూర్తిగా విశ్వసించి డాక్టర్లు చెప్పినట్టు వినాలి. ఇవేవి సరిగా చేయకపోయినా ఇబ్బందిలో పడతాం’ అంటుంది ఈషా. ‘నాకు డిజార్డర్ ఉందని తెలిశాక దాన్ని ఆర్డర్లో పెట్టడానికి నాలోని సృజనాత్మక శక్తులన్నీ వెలికి తీశాను. కథక్ నేర్చుకున్నాను. పెయింటింగ్ నేర్చుకున్నాను. మానసిక సమస్యలకు సంబంధించిన రీసెర్చ్ చేశాను. మానసిక సమస్యల చైతన్యానికై ప్రచార కర్తగా మారాను. ఈ పనులన్నీ నా సమస్యను అదుపు చేయగలిగాయి. ఒక రకంగా చెప్పాలంటే బైపోలార్ డిజార్డర్ నా జీవితాన్ని ఆర్డర్లో పెట్టుకునే శక్తి నాకు ఇచ్చింది. అందుకే నా అనుభవాల గురించి రాసిన పుస్తకానికి ‘ఫైడింగ్ ఆర్డర్ ఇన్ డిజార్డర్’ అనే పేరు పెట్టాను’ అంటోంది ఈషా.➡️గట్టి బంధాలు‘హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఒక పరిశోధన ప్రకారం గట్టి మానవ సంబంధాలు ఉన్నవారు ఎక్కువ ఆయుష్షుతో ఉంటున్నారట. మానసిక సమస్యలు ఉన్న పేషెంట్లను చూసుకునే తల్లిదండ్రులు, కేర్గివర్లు ఎంత ప్రేమగా ఉంటే పేషంట్లకు అంత ధైర్యం దక్కుతుంది. సాధారణ జీవితంలో కూడా ఆరోగ్యకరమైన మానవ సంబంధాలే మానసిక ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. దురదృష్టవశాత్తు ఇవాళ గట్టి బంధాలు ఉండటం లేదు. ఒక మనిషి ఉన్నాడనే ధైర్యమే నేడు కావలసింది. నేను నా మానసిక సమస్యను దాదాపుగా జయించడంలో నా భర్త, నా తోబుట్టువుల మద్దతు చాలా ఉంది’ అని ముగించింది ఈషా. -
ముకేశ్ అంబానీ బాటలోనే..
న్యూఢిల్లీ: బిలియనీర్ ముకేశ్ అంబానీ బాటలోనే ఆయన ఇద్దరు కుమారులు, కుమార్తె జీతాలు తీసుకోకుండా బాధ్యతలు నిర్వహించనున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు, కమిటీ సమావేశాలలో పాలుపంచుకుంటున్నందుకు ఆకాశ్, ఈషా, అనంత్ ఫీజులు మాత్రమే పొందనున్నారు. అంతేకాకుండా నికర లాభాల నుంచి కమీషన్ అందుకోను న్నారు.ముకేశ్ సంతానాన్ని బోర్డులో నియమించేందుకు వాటాదారుల అనుమతి కోరుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ఈ అంశాలను వెల్లడించింది. 66ఏళ్ల అంబానీ 2020–21 ఏడాది నుంచి ఎలాంటి జీతాన్ని అందుకోవడంలేదు. అయితే అంబానీ బంధువులు నిఖిల్, హిటల్ వేతనాలతోపాటు.. ఇతర అలవెన్సులు తదితరాలను పొందుతున్నారు. (వాహన స్క్రాపేజీ పాలసీ: కంపెనీలకు నితిన్ గడ్కరీ కీలక సూచనలు) నీతా అంబానీ తరహాలో 2014లో ముకేశ్ భార్య నీతా అంబానీ ఎంపిక తరహాలోనే కవలలు 31ఏళ్ల ఆకాశ్, ఈషా సహా 28ఏళ్ల అనంత్‌ను ఆర్ఐఎల్ బోర్డులో నియమించనున్నారు. 2022–23లో నీతా అంబానీ రూ. 6 లక్షల సిటింగ్ ఫీజు, రూ. 2 కోట్ల కమీషన్ అందుకున్నట్లు ఆర్ఐఎల్ తాజా వార్షిక నివేదికలో పేర్కొంది. గత నెలలో నిర్వహించిన కంపెనీ వార్షిక సమావేశంలో ఆర్ఐఎల్ బోర్డులోకి ముగ్గురునీ ఎంపిక చేశారు. అయితే ముకేశ్ ఆర్ఐఎల్ చైర్మన్, సీఈవోగా మరో ఐదేళ్లు బాధ్యతలు నిర్వహించనున్నారు. తద్వారా తదుపరితరం నాయకులకు మార్గదర్శకత్వం వహించనున్నారు. కాగా.. ముకేశ్ సంతానాన్ని బోర్డులో నియమించేందుకు వీలుగా ఆర్ఐఎల్ పోస్టల్ బ్యాలట్ ద్వారా వాటాదారుల అనుమతి కోరుతోంది. (సీఈవో సంచలన వ్యాఖ్యలు: ఉద్యోగుల నెత్తిన పిడుగు) -
అ! ట్రెండ్‌సెట్టర్ అవుతుంది – రాజమౌళి
‘‘అ’ ట్రైలర్ చూశా. చాలా బాగుంది ప్రశాంత్. ట్రైలర్ చూడగానే సినిమా చూడాలనిపించింది’’ అని దర్శకుడు రాజమౌళి అన్నారు. కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా, అవసరాల ముఖ్య తారలుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరో నాని సమర్పణలో టి. ప్రశాంతి నిర్మించిన చిత్రం ‘అ!’. ఫిబ్రవరి 16న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుకలో రాజమౌళి మాట్లాడుతూ– ‘‘రిలీజ్‌కు ఓ రోజు ముందుగానే షో వేయించుకుని చూడాలనిపిస్తోంది. ట్రైలర్ చూశాక ఈ సినిమా సూపర్‌హిట్ అనే ఫీలింగ్ వచ్చింది. నాని హిట్స్ మీద హిట్స్ సాధిస్తున్నాడు. ఓ భారీ హిట్ తర్వాత తనకి ‘వరుసగా హిట్స్ అందుకుంటున్నావ్.. దాన్ని దాటి నువ్వింకా ఓ మెట్టు పైకి ఎదగాలి’ అని మెసేజ్ పెట్టా. ట్రై చేస్తా సార్ అన్నాడు. సడెన్‌గా చేపకి వాయిస్ ఓవర్ ఇస్తూ కనిపించాడు. నాని సినిమా చేస్తున్నాడంటే అది హిట్టే అని అందరికీ గ్యారెంటీ వచ్చేసింది. ఈ చిత్రంలో నేను చూసిన ఫస్ట్ లుక్ రెజీనాది. మెండ్ బ్లోయింగ్. ఇంతమంది నటులు ఈ సినిమా చేస్తున్నారంటే కథలో ఏదో ఉందనే ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా ట్రెంyŠ సెట్టర్ అవుతుంది’’ అన్నారు. నాని మాట్లాడుతూ– ‘‘మనందరి లోనూ ఓ తిక్క ఉంటుంది. ఆ తిక్కను సంతృప్తిపరిచే సినిమా ఇది. హీరోగా బాగా సంపాదిస్తున్నాడు? ఎందుకు ప్రొడక్షన్ చేస్తున్నాడని చాలామంది అనుకున్నారు. డబ్బుల కోసం నిర్మాతగా మారలేదు. ఈ సినిమా తీశాక నిర్మాతలపై గౌరవం పెరిగింది. చేప వాయిస్ ఓవర్ కోసం వచ్చిన ప్రశాంత్ కథ చెప్పాడు. కానీ తనకు ప్రొడ్యూసర్స్ లేరు. నేను నిర్మాతలను సెట్ చేస్తానన్నాను. కానీ, ఎవరికీ చెప్పలేకపోయా. ఫైనల్లీ నేనే నిర్మిస్తానని చెప్పా. ఇప్పటివరకూ నేను సంపాదించినదంతా సినిమాలతోనే. కాబట్టి సినిమాపై ఇన్వెస్ట్ చే యడానికి ఆలోచించను. ఈ చిత్రకథ విన్న రవితేజ అన్న వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అయితే మనమిద్దరం ప్రొడ్యూస్ చేద్దామా? అన్నారు. కథపై అంత కాన్ఫిడెన్స్ ఆయనకి. ‘అ!’ సినిమా చూశాక గర్వంగా అనిపించింది. ట్రేడ్ విశ్లేషకులు ఒకరు.. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే రిలీజ్ చేయండి. లేవు.. రిస్క్ అనుకుంటే అమ్మేయండన్నారు. వాణిజ్య అంశాలు లేవు. రిస్క్ అనిపించింది. అందుకే నేనే రిలీజ్ చేస్తున్నా’’ అన్నారు. ‘‘కొత్తవాళ్లతో చిన్న సినిమాగా నేనే తీద్దామను కున్నా. బట్ నానీగారు వచ్చాక ఈ సినిమా పెద్దది అయింది. రోహిణీగారికి కథ చెబితే తెలుగులో ఇలాంటి సినిమా తీస్తున్నారా? అన్నారు. కాజల్గారు హిందీలో తీద్దామన్నారు. నానీతో సినిమా అంటే ఆయన ఇన్వాల్వ్ అవుతారని, మార్పులు చేర్పులు చేస్తారని కొందరు భయపెట్టారు. ఆయన ఎటువంటి మార్పులు అడగలేదు’’ అన్నారు ప్రశాంత్ వర్మ. ‘‘అ!’ సినిమా ఫస్ట్ లుక్ నుంచి మంచి ఇంట్రెస్ట్ ఉంది. కచ్చితంగా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను’’ అన్నారు అనుష్క. ‘‘ఇప్పటివరకూ ఇలాంటి పాత్ర చేయలేదు’’ అన్నారు కాజల్ అగర్వాల్. ‘‘తెలుగులో ఇలాంటి మూవీ వస్తుందనుకోలేదు’’ అన్నారు నిత్యామీనన్. ‘‘ప్రశాంత్ కథ చెప్పినప్పుడే నా పాత్ర బాగా నచ్చింది’’ అన్నారు రెజీనా. సంగీత దర్శకుడు కీరవాణి, చిత్రసంగీతదర్శకుడు మార్క్ కె.రాబిన్ తదితరులు పాల్గొన్నారు. -
అప్పుడు ఈగ... ఇప్పుడు చేప..!
వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని, ఇటీవల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ‘అ!’ అనే సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ కాన్పెప్ట్ తో ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నిత్యామీనన్. రెజీనా, ఈషా రెబ్బా, అవసరాల శ్రీనివాస్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో నాని నిర్మాతగానే కాక మరో కీలక పాత్ర పోషించనున్నాడు. అయితే ఆ పాత్ర కూడా తెర వెనుకకే పరిమితం కానుంది. ఈ సినిమాలో కనిపించే ఓ చేప పాత్రకు నాని డబ్బింగ్ చెపుతున్నాడు. తాజాగా ఆ చేప క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే మేజర్ పార్ట్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్నారు. Playing an interesting role in my next .. been learning swimming coz the script demands ;))#AWE https://t.co/VDmOAuUPHK — Nani (@NameisNani) 23 December 2017 -
దర్శకుడికి తొలి ప్రేక్షకుడు చిరంజీవే!
‘‘నాకిది చాలా కొత్తగానూ, ఆశ్చర్యంగానూ ఉంది. ఫస్ట్ టికెట్‌ను నాకు అందించి, ‘దర్శకుడు’ సినిమాకు నన్ను తొలి ప్రేక్షకుణ్ణి చేసిన ఈ యూనిట్ సభ్యులకు, ముఖ్యంగా సుకుమార్‌కు ధన్యవాదాలు’’ అన్నారు చిరంజీవి. అశోక్, ఈషా జంటగా హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలసి సుకుమార్ నిర్మించిన ‘దర్శకుడు’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఫస్ట్ టికెట్‌ను చిత్రబృందం చిరంజీవికి అందించగా, ఆయన కొనుక్కున్నారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా ఉన్నత స్థాయిలో ఉన్న సుకుమార్ తనకున్న టైమ్‌లో మంచి కథలు రాసుకుని డబ్బు, పేరు సంపాదించుకోవచ్చు. కానీ, అతను అలా ఆలోచించకుండా సుకుమార్ రైటింగ్స్ సంస్థను స్థాపించి... ప్రతిభ గల రచయితలు, దర్శకులు, ఆర్టిస్టులను ప్రోత్సహించడం అభినందనీయం. దీన్ని చిత్రపరిశ్రమకు తను చేస్తున్న కాంట్రిబ్యూషన్‌గా ఫీలవుతున్నా. ‘కుమారి 21ఎఫ్’ కంటే ఈ ‘దర్శకుడు’ పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. -
దర్శకుడు అందరికీ లైఫ్ ఇస్తాడు
అల్లు అర్జున్ ‘‘ఫైట్ మాస్టర్ ఫైట్ తీస్తాడు, డ్యాన్స్ మాస్టర్ డ్యాన్స్ చేస్తాడు, యాక్టర్స్ యాక్ట్ చేస్తాడు. మరి, దర్శకుడు ఏం చేస్తాడు? నన్నడిగితే.. అందరికీ లైఫ్ ఇస్తాడు’’ అన్నారు అల్లు అర్జున్. అశోక్, ఈషా జంటగా హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలసి సుకుమార్ నిర్మించిన ‘దర్శకుడు’ ప్రీ–రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆగస్టు 4న ఈ సిన్మా రిలీజవుతుందని ప్రకటించిన అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘మామూలుగా 24 క్రాఫ్ట్స్ అంటారు. నేను 25 అంటుంటా. మొదటిది ఈగో మేనేజ్మెంట్. అందరి ఈగోనూ దర్శకుడు మేనేజ్ చేస్తుంటాడు. దర్శకుల్లోనే నాకిష్టమైన డైరెక్టర్ సుకుమార్. వ్యక్తిగానూ ఇష్టమే. నేను ‘ఐ లవ్యూ’ చెప్పే ఇద్దరు ముగ్గురు మగాళ్లలో సుకుమార్ ఒకడు. ఏడెనిమిదేళ్ల క్రితం సుకుమార్ బోలెడు కథలు చెప్పేవాడు. ‘నువ్వెలాగూ ఏడాదికి ఒకటో, రెండో సినిమాలు తీస్తావ్. అన్నీ తీయ లేవ్’ అంటే... ‘ఇలాంటి కథలతో సినిమాలు నిర్మిస్తా’ అన్నాడు. ‘అనుకుంటాం గానీ... తీయగలమా?’ అన్నా. ‘నేను తీయగలను’ అన్నాడు సుకుమార్. తీస్తున్నాడు. ఈ సినిమా మంచి హిట్టవ్వాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమా ట్రైలర్లు చూస్తుంటే సుకుమారే గుర్తొస్తున్నాడు. అందులో హీరో ప్యాకప్ అని చెప్పి లేచే యాటిట్యూడ్ అతనిదే’’ అన్నారు ‘దిల్’ రాజు. సుకుమార్ మాట్లాడుతూ– ‘‘‘1 నేనొక్కడినే’ టైమ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరతానని అశోక్ వచ్చాడు. బాగా రాస్తే, జాయిన్ చేసుకున్నా. హ్యాపీగా దర్శకుడు కావల్సినోణ్ణి, ఈ దర్శకుడు (హరిప్రసాద్) తను దర్శకుడు కావడం కోసం హీరోని చేసేశాడు. ఇద్దరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు. హరిప్రసాద్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. నా వల్లే బన్నీ హీరో అయ్యాడు! ‘‘ఆర్య’ షూటింగు అప్పుడు బోటు రివర్స్ కావడంతో నీళ్లలో పడ్డా. నాకు ఈత రాదు. షాక్‌తో చూస్తున్నారంతా. ఇంకో క్షణమైతే పోయేవాణ్ణే. అప్పుడు ప్రాణాలకు తెగించి నీళ్లలో దూకి బన్నీ కాపాడాడు. సో, నేను నీళ్లలో పడి ఛాన్స్ ఇవ్వబట్టే బన్నీ నా రియల్ లైఫ్‌లో హీరో అయ్యాడు. లేదంటే హీరో ఎలా అవుతాడు? ‘డార్లింగ్... థ్యాంక్స్. సేవ్ చేశావ్’ అంటే... ‘ఏడు కథలివ్వు చాలు’ అని ప్రామిస్ చేయించుకున్నా డు. అప్పుడు నా ఈగో హరై్టంది. బన్నీతో చేస్తే కల్ట్ సినిమాలే చేయాలి. అలాంటి కథ దొరికినప్పుడు చేస్తా’’ -
సుకుమార్ మాట నిలబెట్టుకున్నాడు
‘‘హీరోల యాటిట్యూడ్, ఆలోచనలు, క్యారెక్టరైజేషన్ వల్ల సుకుమార్ సినిమాలకు కొత్తదనం వస్తుంది. ‘ఆర్య’లో ఆర్య, ‘100% లవ్’లో బాలు, ‘1 నేనొక్కడినే’లో గౌతమ్, ‘నాన్నకు ప్రేమతో’లో అభిరామ్... ప్రతి పాత్ర కొత్తగా, డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ సినిమాలో హీరో పాత్ర కూడా అంతే కొత్తగా ఉంటుంది’’ అన్నారు నిర్మాత థామస్‌రెడ్డి ఆదూరి. అశోక్, ఈషా జంటగా హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలసి సుకుమార్ నిర్మించిన ‘దర్శకుడు’ ఆగస్టు 4న విడుదల కానుంది. బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘సుకుమార్ నా తమ్ముడే. చిన్నప్పట్నుంచి దర్శకుడు కావాలనుకున్నాడు. ఓ రోజు ‘నేను దర్శకుడు అయితే నిన్ను నిర్మాతను చేస్తా’ అన్నాడు. ‘దర్శకుడు’తో తన మాట నిలబెట్టుకున్నాడు. హరిప్రసాద్ మాకు పదిహేనేళ్లుగా తెలుసు. ఓ దర్శకుడి ప్రేమకథే ఈ సిన్మా. నాకు తెలిసి ప్రపంచంలో 18 ప్రేమకథలే ఉన్నాయి. తెరపై వాటిని వైవిధ్యంగా ఆవిష్కరించిన వారు విజయాలు అందుకుంటున్నారు. ఆ జాబితాలో మా సినిమా ఉంటుంది. కుటుంబమంతా కలసి చూసే చిత్రమిది’’ అన్నారు. ‘‘కొత్త పాయింట్‌తో, ప్రేక్షకుల్ని టచ్ చేసే సినిమాలు తీయాలని సుకుమార్‌గారు ‘సుకుమార్ రైటింగ్స్’ సంస్థ స్థాపించారు. ఆయన ఆలోచనలకు తగ్గ చిత్రమిది. భారీ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఆయన మాకు అవసరమైన సలహాలు ఇస్తున్నారు. ఇందులో దర్శకులు, చిత్రపరిశ్రమపై సెటైర్స్ లేవు. కొన్ని సీన్లను నిజజీవిత సంఘటనల స్ఫూర్తిగా రాశారు’’ అన్నారు థామస్‌రెడ్డి. -
ఆ రాత్రి ఏం జరిగింది?
దిలీప్, ఈషా జంటగా తెరకెక్కిన చిత్రం ‘మాయామాల్’. గోవింద్ దర్శకత్వంలో హరికృష్ణ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. సాయికార్తీక్ స్వరపరచిన ఈ సినిమా పాటలను హీరో నారా రోహిత్ రిలీజ్ చేశారు. ‘‘ఒక రాత్రి మొత్తం జరిగే హారర్ కామెడీ చిత్రమిది. ఆ రాత్రి ఏం జరిగింది? అన్నది ఆసక్తికరం. నా మిత్రుడు సాయికార్తీక్ వల్లే ఈ సినిమా చేయగలిగా. సాయికార్తీక్, జీవన్ కుమార్ల ప్రోత్సాహంతో రిలీజ్ వరకూ వచ్చాం’’ అన్నారు హరికృష్ణ. ‘‘సినిమా బాగా వచ్చింది’’ అన్నారు గోపాల్. ‘‘హైదరాబాద్‌లోని ప్రతి మాల్లో నైట్ షూట్ చేశాం. అవుట్‌పుట్ బాగా వచ్చింది’’ అన్నారు దిలీప్. -
దర్శకుడంటే వాళ్లిద్దరే గుర్తొస్తారు
– రామ్‌చరణ్ ‘‘దర్శకుడు అనే మాట వినగానే నాకిద్దరు గుర్తొస్తారు. ఒకరు... లెజెండ్ దాసరిగారు. ఇంకొకరు... రాఘవేంద్రరావుగారు. వీళ్లిద్దరి బ్లెస్సింగ్స్ లేకుండా ఏ దర్శకుడూ పైకి రాలేరు. వీరిని చూసి దర్శకులంతా స్ఫూర్తి పొందుతుంటారు. నా మాటలతో దర్శకులందరూ ఏకీభవిస్తారనుకుంటున్నా’’ అన్నారు రామ్‌చరణ్. అశోక్, ఈషా జంటగా హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తి నిర్మించిన సినిమా ‘దర్శకుడు’. సాయికార్తీక్ సంగీతమందించిన ఈ సినిమా పాటల సీడీలను విడుదల చేసిన అనంతరం రామ్‌చరణ్ మాట్లాడు తూ – ‘‘తక్కువ రోజుల్లో నాకు నచ్చేసిన వ్యక్తి సుకుమార్. నా అభిమాన దర్శకుడు. ఆయన బ్రెయిన్ వెళ్లే స్పీడు, ఐడియాలు వచ్చే తీరు సూపర్బ్. ఆ ఐడియాలన్నిటినీ డైరెక్ట్ చేయాలంటే... ఒక్క లైఫ్ టైమ్ చాలదు. మంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేసి కొత్త దర్శకులను, నటులను పరిచయం చేస్తున్నారు. ‘ఖైదీ నంబర్ 150’తో నేను నిర్మాతనయ్యా. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చేస్తు న్నా. నిర్మాత టెన్షన్లు నాకు తెలుసు. వాటిని పక్కనపెట్టి మా ‘రంగస్థలం’ను ఎంతో బాగా చేస్తున్నారు. సుకుమార్ రాస్తే అందులో లవ్ లేకుండా ఉండదు. ఆయన తొలి సినిమా నుంచి ఇప్పటివరకు... ఈకాలం సినిమా రాసినా, 1980 నేపథ్యంలో ‘రంగస్థలం’ లాంటి సినిమా రాసినా స్ట్రాంగ్ లవ్ పాయింట్ ఉంటుంది. ‘దర్శకుడు’కు ఆ లవ్ పాయింట్ ప్లస్ అవుతుంది. సాయికార్తీక్ పాటలు బాగున్నాయి. అతనితో పని చేయాలనుంది’’ అన్నారు. చిత్రసమర్పకులు సుకుమార్ మాట్లాడుతూ– ‘‘సిల్వర్‌స్పూన్‌తో పుట్టిన చిరంజీవిగారబ్బాయి. తనతో ఎలా మాట్లాడాలి? ఎలా డీల్ చేయాలి? షూటింగ్లో ప్రాబ్లమ్ అవుతుందేమోన నుకున్నా. ఐశ్వర్యంతో పుట్టినా... తను మట్టి మనిషి. డౌన్ టు ఎర్త్. నేను మ్యాథ్స్ లెక్చరర్ అయితే... హరిప్రసాద్ ఫిజిక్స్ లెక్చరర్. మానసికంగా నేను డౌన్లో ఉన్నప్పుడు నన్నెంతో సపోర్ట్ చేశాడు. నా కథల వెనక తన సపోర్ట్ ఉంది. ఒక్క సినిమాకు కూడా అసిస్టెంట్‌గా వర్క్ చేయకుండా ఈ సినిమాను బాగా తీశాడు. దేవిశ్రీప్రసాద్ కాకుండా మరో సంగీత దర్శకుడితో పని చేయడం ఇదే మొదటిసారి. దేవి లేకుండా సినిమా చేయడం సాహసమే. అటువంటి టైమ్‌లో సాయికార్తీక్ కనిపించాడు.ఈ పాటలు విన్న చరణ్ ‘ఎవరీ మ్యూజిక్ డైరెక్టర్’ అనడిగాడు. సాయికార్తీక్ అంత మంచి పాటలు ఇచ్చాడు. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే... చరణ్ ఎనిమిదేళ్లు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాడు’’ అన్నారు. ‘‘సరదాగా ఓ కథ రెడీ చేసి సుకుమార్‌కి చెప్పా. ‘నువ్వే డైరెక్ట్ చేసేయ్’ అన్నారు’’ అన్నారు హరిప్రసాద్ జక్కా. ‘‘నేను నటుడు కావాలని, హరిప్రసాద్‌గారు దర్శకుడు కావాలని అనుకోలేదు. మూడేళ్ల క్రితం ఏం కుట్టిందో తెలీదు. ఆయన నన్ను నటుణ్ణి చేయాలనుకున్నారు’’ అన్నారు అశోక్. పలువురు సినీప్రముఖులతో పాటు చిత్రబృందం పాల్గొన్నారు. ‘‘మనకు నచ్చిన వ్యక్తుల గురించి మనం రోజు మాట్లాడుకోం. మన అమ్మ గురించి మనం రోజూ మాట్లాడుకోం. ఆవిడ పక్కనుంటే, మనసులో ఉంటే చాలు. మాటల్లో కాదు. నా ఫ్యామిలీ అనేది నా మనసులో ఎక్కువుంటుంది. నా మాటల్లో తక్కువుంటుంది. ప్లీజ్... అర్థం చేసుకోండి’’ – ‘దర్శకుడు’ ఆడియో వేడుకలో ‘బాబాయ్’ అని అరుస్తున్న అభిమానులను ఉద్దేశించి రామ్‌చరణ్. -
"దర్శకుడు" పాట విడుదల
అశోక్, ఈషా జంటగా హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో ప్రముఖ దర్శకుడు సుకుమార్, బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తి నిర్మించిన సినిమా ‘దర్శకుడు’. ఇందులోని ‘సండే టు సాటర్డే లవ్..’ అనే పాటను సమంత విడుదల చేశారు. సాయికార్తీక్ స్వరపరిచిన పాటల్ని ఈ నెల 15న రిలీజ్ చేయనున్నట్టు నిర్మాతలు తెలిపారు. -
దర్శకుడి ప్రేమకథ
‘కుమారి 21ఎఫ్’ వంటి హిట్ చిత్రం తర్వాత దర్శకుడు సుకుమార్ నిర్మించిన చిత్రం ‘దర్శకుడు’. అశోక్, ఈషా జంటగా హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి సుకుమార్ నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ప్రేమకు, లక్ష్యానికి మధ్య నలిగిపోయే ఓ దర్శకుడి ప్రేమకథ ఇది. స్వార్థపరుడైన దర్శకుడు ప్రేమలో పడితే ఏం జరుగుతుందన్నది ఆసక్తి రేకెత్తిస్తుంది. సాయికార్తీక్ అందించిన పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేసి, పూర్తి ఆడియోను ఈ నెల 15న ఓ ప్రముఖ హీరో చేతుల మీదగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అశోక్ నటన, హరిప్రసాద్ జక్కా దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాకు హైలైట్. ఆగస్టు 4న సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ అనుమోలు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేష్ కోలా. -
దమ్ముందా?
అదొక మహల్. అందులో ఏముందో చూడాలనే ఆసక్తి కలిగితే మాత్రం గుండె నిండా దమ్మూ ధైర్యం కావాలి. ఎందుకంటే అదొక మాయా మహల్. దాని గురించి తెలిసినవాళ్లు ఆమడ దూరం ఉంటారు. కానీ, కొందరు ధైర్యం చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అనే అంశంతో రూపొందిన చిత్రం ‘మాయామాల్’. డేర్ టు ఎంటర్... అనేది ఉపశీర్షిక. దిలీప్, ఈషా, దీక్షా పంత్ ముఖ్య తారలుగా గోవింద్ లాలం దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. కేవీ హరికృష్ణ, చందు ముప్పాళ్ళ, నల్లం శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. గోవింద్ లాలం మాట్లాడుతూ– ‘‘హారర్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ఇది. మా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకంగా చెప్పగలను’’ అన్నారు. ‘‘అవుట్‌పుట్ బాగా వచ్చింది. సినిమాలో విలన్ ఎవరు అనేది ఇంట్రెస్టింగ్’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్, యాక్షన్: విజయ్. 7 -
దర్శకుడి ప్రేమ
వెండితెరపై మాంచి ప్రేమకథను ప్రేక్షకులకు చూపించాలనుకున్న ఓ సెల్ఫిష్ దర్శకుడు తెర వెనక ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. అప్పుడేం జరిగింది? ప్రేమకు, తపనకు మధ్య ఆ దర్శకుడు ఎలా నలిగాడు? అనే కథతో రూపొందుతోన్న చిత్రం ‘దర్శకుడు’. ‘కుమారి 21 ఎఫ్’ హిట్ తర్వాత సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలసి ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మిస్తున్న చిత్రమిది. హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో అశోక్, ఈషా జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ఇటీవల ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదలైన టీజర్‌కు చక్కటి స్పందన లభిస్తోంది. అశోక్ నటన, హరిప్రసాద్ జక్కా దర్శకత్వం చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ స్పీడుగా జరుగుతున్నాయి’’ అన్నారు. పూజిత, నోయల్, నవీన్, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ అనుమోలు, కూర్పు: నవీన్ నూలి, సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేశ్ కోలా. -
సుకుమార్‌పై ప్రేమతో...
– ఎన్టీఆర్ ‘‘సుకుమార్‌గారు బయటి వ్యక్తి కాదు. నా గుండెకు దగ్గరైన వ్యక్తి. ఆయన ఎప్పుడు ఏ సినిమా నిర్మించినా నేను వస్తున్నానంటే... అది నా బాధ్యత, ప్రేమ తప్ప మరొకటి కాదు’’ అన్నారు ఎన్టీఆర్. అశోక్, ఈషా జంటగా హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో సుకుమార్ సమర్పణలో బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తి నిర్మించిన ‘దర్శకుడు’ టీజర్‌ను ఎన్టీఆర్ రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ – ‘‘సినిమా అంటే సుకుమార్‌కు ప్యాషన్. కథకు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే, ప్రతి ఒక్క నటుడూ ఆయనతో పని చేయాలనుకుంటారు. సుకుమార్ రైటింగ్స్పైన ప్రతిభావంతులైన కొత్తవారిని పరిచయం చేస్తున్నందుకు ఆయనకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘కుమారి 21ఎఫ్’ టీజర్‌ను ఎన్టీఆరే రిలీజ్ చేశారు. ఆ సినిమా చూసి బాగుందంటూ ఒక్క ట్వీట్‌తో సూపర్ హిట్ చేశారు. తనతో మాట్లాడితే నేరుగా ఆత్మతో మాట్లాడినట్టే ఉంటుంది. తన చిరునవ్వు వెనుక సముద్రమంత ప్రేమ ఉంటుంది. కోపం వెనుక చినుకంత ఆవేశం ఉంటుంది’’ అన్నారు సుకుమార్. చిత్రదర్శకుడు హరిప్రసాద్, నిర్మాతలు విజయ్‌కుమార్, థామస్ రెడ్డి, రవిచంద్ర, హీరోయిన్ ఈషా, నటి పూజిత తదితరులు పాల్గొన్నారు. -
రాజధాని నిర్మాణం కోసం.. స్కేటింగ్ చేస్తున్న పదేళ్ల చిన్నారి
ప్రకాశం (ఒంగోలు): ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం స్కేటింగ్ చేస్తూ నిధులు సేకరిస్తుందో ఓ చిన్నారి. అందులో భాగంగా తిరుపతి నుంచి బయలుదేరిన చిన్నారి అకుల ఏషా(10) గురువారం ఒంగోలు పట్టణానికి చేరుకుంది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. -
నేను తెలుగమ్మాయినే..
కొవ్వూరు రూరల్: ‘అచ్చ తెలుగు అమ్మాయిని.. ఎంబీఏ చదువుతుండగా మోడలింగ్‌లో అవకాశమొచ్చింది..’ అని అంటున్నారు బందిపోటు చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న ఈషా. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అంతకుముందు ఆ తరువాత’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హైదరాబాదీ అమ్మాయి కొవ్వూరు మండలం కుమారదేవంలో సందడి చేశారు. బందిపోటు చిత్ర షూటింగ్లో భాగంగా ఇక్కడకు వచ్చిన ఈషా విలేకరులతో ముచ్చటించారు. సినీ పరిశ్రమకు ఎలా పరిచయమయ్యారు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ప్రోత్సాహంతో సినీ పరిశ్రమకు వచ్చాను. స్వతహాగా నాకు మోడలింగ్ అంటే ఇష్టం. చదువుకుంటూనే అంబికా దర్బార్బత్తి, అపర్ణ కనస్ట్రక్షన్స్, చెన్నై జ్యూయలరీస్ వంటి యాడ్స్‌లో నటించాను. తొలిసారిగా నటించినప్పుడు మీకు ఎలా అనిపించింది ‘అంతకుముందు ఆ తరువాత’ సినిమాలో కెమెరా ముందుకు వచ్చినప్పుడు చాలా భయం వేసింది. అయితే దర్శకుడు మోహనకృష్ణ, కో-ఆర్టిస్ట్ సుమం త్ అశ్విన్ ప్రోత్సాహంతో భయం పోయింది. ఏ సినిమాల్లో నటిస్తున్నారు బందిపోటుతో పాటు కేరింత లో హీరోయిన్గా నటిస్తున్నా. ఏ పాత్రలంటే ఇష్టం యాక్షన్, సెంటిమెంట్‌తోపాటు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. పాత హీరోయిన్లంతా నాకు రోల్ మోడల్సే. శ్రీదేవి అంటే చాలా ఇష్టం. మీ కుటుంబ నేపథ్యం నాన్న శంకర్‌లాల్ బీహెచ్ఈఎల్లో ఉద్యోగి. అమ్మ నాగేశ్వరి గృహిణి. అక్క, చెల్లి ఉన్నారు. గోదావరి ప్రాంతం మీకెలా ఉంది ఇక్కడి పరిసర ప్రాంతాలు, వాటి అందాలు, ఆహ్లాదకర వాతావరణం కట్టిపడేస్తున్నాయి. అమ్మ నాగేశ్వరి స్వగ్రామం రాజ మండ్రి కావడంతో తరచూ వస్తుండేదాన్ని. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. -
గ్లామర్ ఫీల్డ్ అంటే చిన్నప్పట్నుంచీ క్రేజ్ - ఇషా
సడన్‌గా చూస్తే... ‘మావిచిగురు’ ఫేం రంజితలా అనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు ఇషా. అసలు సిసలైన తెలుగమ్మాయి. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో కె. దామోదరప్రసాద్ నిర్మించిన ‘అంతకు ముందు-ఆ తరువాత’ చిత్రం ద్వారా కథనాయికగా పరిచయం అవుతున్నారీ ముద్దుగుమ్మ. ఈ నెల 23న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు ఈ హైదరాబాదీ భామ. ఫేస్బుక్లో నన్ను చూశారు పుట్టిందీ పెరిగిందీ అంతా హైదరాబాద్‌లోనే. ఎంబీఏ పూర్తి చేశాను. గ్లామర్ ఫీల్డ్ అంటే చిన్నప్పట్నుంచీ క్రేజే. అందుకే చదువు పూర్తవ్వగానే మోడలింగ్‌లోకి వెళ్లా. పలు ప్రముఖ సంస్థలకు సంబంధించిన యాడ్స్‌లో కూడా నటించాను. సినిమాల్లో అవకాశం వస్తే బావుణ్ణు అనుకుంటున్న టైమ్‌లో ఇంద్రగంటి మోహన్కృష్ణగారు నా ఫొటోని ఫేస్బుక్లో చూశారట. వెంటనే ఆడిషన్స్‌కి పిలిపించారు. రెండు వారాలు టెస్ట్ షూట్ చేశారు కూడా. రెండు నెలలు వర్క్‌షాప్ కూడా నిర్వహించారు. తర్వాతే నన్ను ఈ సినిమాకు హీరోయిన్గా సెలక్ట్ చేశారు. అదే నా ఆకాంక్ష మోహన్‌కృష్ణ ఏం చెబితే అది చేశాను. సెట్లో సుమంత్ అశ్విన్ కూడా ఎంతో కోపరేట్ చేశాడు. మధుబాల, రవిబాబు, రోహిణి, రావురమేష్ వంటి సీనియర్ ఆర్టిస్టులతో నటించడం వల్ల వారి నుంచి చాలా నేర్చుకున్నాను. తొలి సినిమాలో నటనకు అవకాశం ఉన్న పాత్ర లభించింది. అందరి సహకారంతో ఎమోషనల్ సీన్స్‌లో రక్తి కట్టించాను. తెలుగమ్మాయిగా మరిన్ని మంచి పాత్రలు చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలనేదే నా ఆకాంక్ష.