ఈషా, అనుష్క, నిత్యామీనన్, కీరవాణి. ప్రశాంతి, రాజమౌళి, ప్రశాంత్ వర్మ, నాని, కాజల్, ప్రియదర్శి, రెజీనా
‘‘అ’ ట్రైలర్ చూశా. చాలా బాగుంది ప్రశాంత్. ట్రైలర్ చూడగానే సినిమా చూడాలనిపించింది’’ అని దర్శకుడు రాజమౌళి అన్నారు. కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా, అవసరాల ముఖ్య తారలుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరో నాని సమర్పణలో టి. ప్రశాంతి నిర్మించిన చిత్రం ‘అ!’. ఫిబ్రవరి 16న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుకలో రాజమౌళి మాట్లాడుతూ– ‘‘రిలీజ్‌కు ఓ రోజు ముందుగానే షో వేయించుకుని చూడాలనిపిస్తోంది. ట్రైలర్ చూశాక ఈ సినిమా సూపర్‌హిట్ అనే ఫీలింగ్ వచ్చింది.
నాని హిట్స్ మీద హిట్స్ సాధిస్తున్నాడు. ఓ భారీ హిట్ తర్వాత తనకి ‘వరుసగా హిట్స్ అందుకుంటున్నావ్.. దాన్ని దాటి నువ్వింకా ఓ మెట్టు పైకి ఎదగాలి’ అని మెసేజ్ పెట్టా. ట్రై చేస్తా సార్ అన్నాడు. సడెన్‌గా చేపకి వాయిస్ ఓవర్ ఇస్తూ కనిపించాడు. నాని సినిమా చేస్తున్నాడంటే అది హిట్టే అని అందరికీ గ్యారెంటీ వచ్చేసింది. ఈ చిత్రంలో నేను చూసిన ఫస్ట్ లుక్ రెజీనాది. మెండ్ బ్లోయింగ్. ఇంతమంది నటులు ఈ సినిమా చేస్తున్నారంటే కథలో ఏదో ఉందనే ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా ట్రెంyŠ సెట్టర్ అవుతుంది’’ అన్నారు. నాని మాట్లాడుతూ– ‘‘మనందరి లోనూ ఓ తిక్క ఉంటుంది.
ఆ తిక్కను సంతృప్తిపరిచే సినిమా ఇది. హీరోగా బాగా సంపాదిస్తున్నాడు? ఎందుకు ప్రొడక్షన్ చేస్తున్నాడని చాలామంది అనుకున్నారు. డబ్బుల కోసం నిర్మాతగా మారలేదు. ఈ సినిమా తీశాక నిర్మాతలపై గౌరవం పెరిగింది. చేప వాయిస్ ఓవర్ కోసం వచ్చిన ప్రశాంత్ కథ చెప్పాడు. కానీ తనకు ప్రొడ్యూసర్స్ లేరు. నేను నిర్మాతలను సెట్ చేస్తానన్నాను. కానీ, ఎవరికీ చెప్పలేకపోయా. ఫైనల్లీ నేనే నిర్మిస్తానని చెప్పా. ఇప్పటివరకూ నేను సంపాదించినదంతా సినిమాలతోనే. కాబట్టి సినిమాపై ఇన్వెస్ట్ చే యడానికి ఆలోచించను. ఈ చిత్రకథ విన్న రవితేజ అన్న వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు.
అయితే మనమిద్దరం ప్రొడ్యూస్ చేద్దామా? అన్నారు. కథపై అంత కాన్ఫిడెన్స్ ఆయనకి. ‘అ!’ సినిమా చూశాక గర్వంగా అనిపించింది. ట్రేడ్ విశ్లేషకులు ఒకరు.. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే రిలీజ్ చేయండి. లేవు.. రిస్క్ అనుకుంటే అమ్మేయండన్నారు. వాణిజ్య అంశాలు లేవు. రిస్క్ అనిపించింది. అందుకే నేనే రిలీజ్ చేస్తున్నా’’ అన్నారు. ‘‘కొత్తవాళ్లతో చిన్న సినిమాగా నేనే తీద్దామను కున్నా. బట్ నానీగారు వచ్చాక ఈ సినిమా పెద్దది అయింది. రోహిణీగారికి కథ చెబితే తెలుగులో ఇలాంటి సినిమా తీస్తున్నారా? అన్నారు.
కాజల్‌గారు హిందీలో తీద్దామన్నారు. నానీతో సినిమా అంటే ఆయన ఇన్‌వాల్వ్ అవుతారని, మార్పులు చేర్పులు చేస్తారని కొందరు భయపెట్టారు. ఆయన ఎటువంటి మార్పులు అడగలేదు’’ అన్నారు ప్రశాంత్ వర్మ. ‘‘అ!’ సినిమా ఫస్ట్ లుక్ నుంచి మంచి ఇంట్రెస్ట్ ఉంది. కచ్చితంగా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను’’ అన్నారు అనుష్క. ‘‘ఇప్పటివరకూ ఇలాంటి పాత్ర చేయలేదు’’ అన్నారు కాజల్ అగర్వాల్. ‘‘తెలుగులో ఇలాంటి మూవీ వస్తుందనుకోలేదు’’ అన్నారు నిత్యామీనన్. ‘‘ప్రశాంత్ కథ చెప్పినప్పుడే నా పాత్ర బాగా నచ్చింది’’ అన్నారు రెజీనా. సంగీత దర్శకుడు కీరవాణి, చిత్రసంగీతదర్శకుడు మార్క్ కె.రాబిన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment