ఈగ సీక్వెల్‌.. నానితో పనిలేదన్న రాజమౌళి! | Nani Interesting Comments On Eega Movie Sequel | Sakshi
Sakshi News home page

ఈగ 2 గురించి రాజమౌళిని అడిగితే..నా అవసరం లేదన్నారు: నాని

Published Wed, Aug 28 2024 8:05 AM | Last Updated on Wed, Aug 28 2024 10:01 AM

Nani Interesting Comments On Eega Movie Sequel

రాజమౌళి దర్శకత్వంలో నాని, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఈగ’. 2012లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టడంతో పాటు పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌ రావాలని సినీ ప్రియులతో పాటు హీరో నాని కూడా కోరుకుంటున్నాడు. తాజాగా ఈ మూవీ సీక్వెల్‌ గురించి నాని మాట్లాడారు. రాజమౌళి ఫిక్స్‌ అయితే ఈ సీక్వెల్‌ కచ్చితంగా వస్తుందని.. చిన్న ఈగతో మరోసారి బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని అన్నారు. అయితే ఇప్పట్లో ఈ సీక్వెల్‌ ఆలోచన రాజమౌళికి లేదని చెబుతూ.. వారిద్దరి మధ్య ఈగ2పై జరిగిన సరదా సంభాషణను పంచుకున్నాడు.

ఓ సారి రాజమౌళితో ఈగ సీక్వెల్‌ గురించి మాట్లాడాను. సీక్వెల్‌ పనులు ఎప్పుడు మొదలుపెడదామని అడిగాను. అప్పుడు దానికి ఆయన ‘మేము ఈగ 2 చేసినా..నీతో పనిలేదు.మాకు ఈగ ఉంటే చాలు. అదే సీక్వెల్‌లో తిరిగి వస్తుంది’ అని చెప్పారు. ఒక చిన్న ఈగతో సినిమా తీయాలని ఆలోచన రావడమే గొప్ప విషయం. రాజమౌళి ధైర్యాన్ని ప్రతి ఒక్కరు మెచ్చుకోవాల్సిందే. 

ఒకవేళ ఆయన ఈగ 2 చేస్తే.. అది కచ్చితంగా మరో అద్భుతమైన విజయం సాధిస్తుంది. ప్రస్తుతం ఆయనకు అయితే సీక్వెల్‌ చేయాలని ఆలోచన లేదు. కానీ ఏదో ఒకరోజు కచ్చితంగా ఈగ 2 గురించి ఆలోచించి..మంచి కథతో సీక్వెల్‌ తీస్తాడని అనుకుంటున్నాను’ అన్నారు. నాని ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement