Nithya Menen
-
నెల రోజుల్లోపే ఓటీటీకి సంక్రాంతి చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ స్టార్ జయం రవి, నిత్యామీనన్ జంటగా నటించిన చిత్రం కాదలిక్కా నేరమిల్లై(Kadhalikka Neramillai). ఈ సినిమాను కృతిక ఉదయనిధి తెరకెక్కించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైంది. కోలీవుడ్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. జనవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తాజాగా ఓటీటీకి(OTT) వచ్చేందుకు సిద్ధమైంది.పొంగల్ కానుకగా థియేటర్లలో ఫ్యాన్స్‌ను అలరించిన కాదలిక్కా నేరమిల్లై ఈ నెల 11 నుంచే ఓటీటీలో సందడి చేయనుంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. దీంతో నెల రోజుల్లోపే ఓటీటీ ప్రియులను అలరించనుంది కాదలిక్కా నేరమిల్లై మూవీ.(ఇది చదవండి: వారికేమో ముద్దులు, హగ్గులు.. అభిమానితో అలాగేనా?.. హీరోయిన్‌పై నెటిజన్స్ ఫైర్!)కాగా.. ఈ చిత్రానికి తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ నిర్మాతగా వ్యవహరించారు. ఆయన సతీమణి కృతిక ఉదయనిధి దర్శకత్వం వహించారు. దర్శకురాలిగా ఆమెకు ఇది మూడో సినిమా కావడం మరో విశేషం. ఈ చిత్రంలో జయం రవి, నిత్యతో పాటు యోగి బాబు, వినయ్, లాల్, లక్ష్మీ రామకృష్ణన్, వినోదిని, గాయకుడు మనో, టీజే బాను, జాన్ కోగన్ ప్రధాన పాత్రలు పోషించారు. రెడ్ జెయింట్ మూవీస్ నిర్మించనున్న ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రఘుమాన్ సంగీతం అందించారు.తెలుగులో నిత్యా మీనన్ కెరీర్..అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నిత్యా మీనన్. అలా మొదటి చిత్రంతోనే జనాలకు బాగా నచ్చేసింది. 180, ఇష్క్, జబర్దస్త్, గుండె జారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, ఒక అమ్మాయి తప్ప, జనతా గ్యారేజ్, అ, నిన్నిలా నిన్నిలా, భీమ్లా నాయక్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తమిళంలో ఇడ్లీ కడాయ్, డియర్ ఎక్సెస్ సహా మరో సినిమా చేస్తోంది. Kadhalargal gavanathirkku 👀💕… kadhalikka neram odhikkirunga, yaena…Kadhalikka Neramillai is coming soon to Netflix on 11 February, in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi!#KadhalikkaNeramillaiOnNetflix pic.twitter.com/nuAQsDsjy9— Netflix India South (@Netflix_INSouth) February 6, 2025 -
చిత్ర పరిశ్రమలో ఉండటం ఇష్టం లేదు.. కారణం ఇదే: నిత్య మేనన్
మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో నటించిన నిత్య మేనన్‌కు(Nithya Menen) భారీగానే అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఆమె ఎంచుకున్న పాత్రలు కూడా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయి. సినిమా రంగం వల్ల తనకు పేరు, ప్రఖ్యాతలు ,ఆస్తులు, అంతస్తులు అన్ని వచ్చాయి. అయినప్పటికీ తనకు చిత్ర పరిశ్రమలో ఉండటం ఏమాత్రం ఇష్టం లేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పేర్కొంది. అందుకే ఈమెను సంచలన నటి అంటారు. ఇటీవల జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా అందుకున్న ఈ మలయాళ భామ తాజాగా రవి మోహన్‌తో (జయం రవి) కలిసి నటించిన చిత్రం కాదలిక్క నెరమిల్లై (Kadhalikka Neramillai). ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న నిత్య మేనన్ ఒక భేటీలో పేర్కొంటూ తనకు నచ్చని రంగం సినిమా అని డైరెక్ట్‌గానే చెప్పింది. తనకు ఏదైనా రంగంలో ఇప్పుడు అవకాశం వస్తే వెళ్లిపోతానని పేర్కొంది. సెలబ్రిటీలా కాకుండా తనకు సాధారణ జీవితాన్ని అనుభవించడమే ఇష్టమని పేర్కొంది. అదేవిధంగా తనకు ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టం అని అందుకే పైలెట్ కావాలని చిన్నప్పుడు కోరుకున్నానని గుర్తు చేసుకుంది. కానీ, ఫైనల్‌గా నటిని అయ్యానని చెప్పింది. నటిగా స్వేచ్ఛగా జీవించడం మరిచిపోయానని తెలిపింది. అదేవిధంగా పార్కుల్లో నడవటం అంటే ఎంతో ఇష్టమని అయితే అది ఇప్పుడు జరగదని పేర్కొంది. ఒక్కొక్కసారి ఇదంతా నాకు అవసరమా అని అనిపిస్తుందని చెప్పింది. జాతీయ అవార్డు రాకముందు సైలెంట్ గా ఎక్కడికై నా వెళ్లిపోతామని భావించానంది అలాంటి సమయంలోనే జాతీయ ఉత్తమ నటి అవార్డు వచ్చిందనే వార్త తెలిసిందని నటి నిత్యా మీనన్ చెప్పింది. కాగా ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నిత్యామీనన్ ప్రస్తుతం ధనుష్ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఇడ్లీ కడై చిత్రంలో కథానాయికిగా నటిస్తుంది. -
నిత్య మేనన్ పేరు తర్వాత నా నేమ్ వేశారు: జయం రవి
కోలీవుడ్ నటుడు జయం రవి(Jayam Ravi) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రాలలో 'కాదలిక్క నేరమిల్లె' (ప్రేమకు సమయం లేదు) ఒకటి. నటి నిత్యామీనన్ (Nithya Menen) నాయకిగా నటించిన ఇందులో వినయ్, టీజే భాను తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కృతిక ఉదయనిధి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించింది. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పొంగల్ సందర్భంగా ఈ నెల 14వ తేదీన తెరపైకి రానుంది. శుక్రవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నటి నిత్యామీనన్ మాట్లాడుతూ ఎవరు ఎలాంటి ఈగో లేకుండా పనిచేసిన చిత్రం ఇదని, ఇది రోమ్ కామ్ కథ కాదని, చాలా డ్రామాతో కూడిన చిత్రమని, దీన్ని దర్శకురాలు కృతిక చాలా అందంగా తెరపై ఆవిష్కరించారని చెప్పారు. ఈ చిత్రంలో నటించడం ఘనతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నటుడు జయం రవి మాట్లాడుతూ ఈ చిత్రానికి అట్టహాసమైన టైటిల్ లభించడం సంతోషకరమని తెలిపారు. 'కాదలిక్క నేరమిల్లె' (Kadhalikka Neramillai) చిత్రంలో నటి నిత్య మేనన్ పేరు తర్వాత తన పేరు వేయడం గురించి అడుగుతున్నారని, అందుకు తన కాన్ఫిడెన్సే కారణమని అన్నారు. సినీ జీవితంలో తాను చాలా విషయాలను బ్రేక్ చేశానని, ఇది మాత్రం ఎందుకు చేయకూడదు అని భావించానన్నారు. నటుడు షారుక్ ఖాన్‌ను చూసిన తర్వాత తానీ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మహిళలు లేకుంటే ఈ ప్రపంచమే లేదన్నారు. వారు లేకపోతే మనం లేమన్నారు ఇకపై మహిళ దర్శకుల చిత్రాల్లో ఇలానే నటిస్తానని పేర్కొన్నారు. తనకు ఇంతకుముందు చాలా గడ్డు కాలం వచ్చిందని, నటించిన చిత్రాలు ఏవీ బాగా ఆడలేదని, దీంతో తాను చేసిన తప్పేమిటి అని ఆలోచించానన్నారు. ఎలాంటి తప్పు చేయని తాను ఎందుకు కుంగిపోవాలని అనిపించిందన్నారు. ఆ తర్వాతే తాను నటించిన మూడు చిత్రాలు వరుసగా హిట్ అయ్యాయన్నారు. కింద పడినా నిలబడక పోవడమే అపజయం అని, ఈ ఏడాది మళ్లీ ఇదే బాట పడతాననే నమ్మకాన్ని జయం రవి వ్యక్తం చేశారు. దర్శకుడు కె.బాలచందర్ పలు సాధారణ విషయాలను బ్రేక్ చేశారని, అదేవిధంగా ఈ జనరేషన్లో దర్శకురాలు కృతిక ఉదయనిధి చేస్తున్నారని అన్నారు. -
వారికేమో ముద్దులు, హగ్గులు.. అభిమానితో అలాగేనా?.. హీరోయిన్‌పై నెటిజన్స్ ఫైర్!
టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్ ప్రస్తుతం ఇడ్లీ కడై అనే కోలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో ధనుశ్ హీరోగా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరు జంటగా రుచిత్రంబలం (తెలుగులో ‘తిరు’) మూవీలో నటించారు. ఈ సినిమాలో నటనకు గానూ నిత్యాకు జాతీయ ఉత్తమ నటి అవార్డ్‌ను దక్కించుకుంది. అంతేకాకుండా జయం రవి సరసన కాదలిక్క నెరమిళ్లై అనే సినిమాలో కనిపించనుంది. ఈ మూవీ సంక్రాంతి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది.కాగా.. ఈ చిత్రానికి తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆయన సతీమణి కిరుతిగ ఉదయనిధి దర్శకత్వంలో తెరకెక్కించారు. దర్శకురాలిగా ఆమెకు ఇది మూడో సినిమా కావడం మరో విశేషం. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. తాజాగా చెన్నైలో ఓ ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిర్వహించిన ఓ ఈవెంట్‌కు హీరోయిన్ నిత్యామీనన్ కూడా హాజరైంది. అయితే ఈవెంట్లో నిత్యామీనన్ వ్యవహరించిన తీరుపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. ఆమె మాట్లాడుతుంగా అక్కడే ఉన్న ఓ వ్యక్తి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. కానీ నిత్యా అతన్ని సున్నితంగా తిరస్కరించింది. దీంతో నిత్యామీనన్ తీరుపై నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. ఆమెది చెత్త బిహేవియర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కానీ అంతకుముందు ఇదే ఈవెంట్లో నిత్యా వ్యవహరించిన తీరు అందరిని షాకింగ్‌కు గురి చేస్తోంది. ఇదే ఈవెంట్లో నిత్యా మీనన్ దర్శకుడు మిష్కిన్‌ను ముద్దుపెట్టుకుంది. అంతేకాకుండా మూవీ హీరో జయం రవిని కూడా హగ్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే ఆమె చేసిన దాంట్లో తప్పేమీ లేకపోయినా.. ఓ అభిమాని షేక్ హ్యాండ్ ఇస్తే ఇవ్వరా? అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. ఫ్యాన్స్‌తో నిత్యా మీనన్ తీరు సరికాదంటూ పోస్టులు పెడుతున్నారు. (ఇది చదవండి: ప్రేమకు వ్యతిరేకం కాదు.. అలాంటి వ్యక్తికే నా లైఫ్‌లో చోటు: నిత్యా మీనన్)కాగా.. ఈ చిత్రంలో జయం రవి, నిత్యతో పాటు యోగి బాబు, వినయ్, లాల్, లక్ష్మీ రామకృష్ణన్, వినోదిని, గాయకుడు మనో, టీజే బాను, జాన్ కోగన్ ప్రధాన పాత్రలు పోషించారు. రెడ్ జెయింట్ మూవీస్ నిర్మించనున్న ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రఘుమాన్ సంగీతం అందించారు.జాతీయ అవార్డుకాగా తిరు సినిమాకుగానూ నిత్యామీనన్‌కు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు లభించింది. ఈ మూవీలో ధనుష్ హీరోగా నటించగా రాశీ ఖన్నా హీరోయిన్గా యాక్ట్ చేసింది. హీరో స్నేహితురాలిగా నిత్య ఆకట్టుకుంది. మిత్రన్ జవహర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇది 2022లో విడుదలైంది. నిత్య లేటెస్ట్ మూవీ కాదలిక్క నెరమిళ్లై విషయానికి వస్తే.. ఇందులో జయం రవి, వినయ్, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. రెడ్ జియాంట్ సినిమా నిర్మిస్తున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది.తెలుగులో సినీ కెరీర్.. అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నిత్యా మీనన్. అలా మొదటి చిత్రంతోనే జనాలకు బాగా నచ్చేసింది. 180, ఇష్క్, జబర్దస్త్, గుండె జారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, ఒక అమ్మాయి తప్ప, జనతా గ్యారేజ్, అ, నిన్నిలా నిన్నిలా, భీమ్లా నాయక్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తమిళంలో ఇడ్లీ కడాయ్, డియర్ ఎక్సెస్ సహా మరో సినిమా చేస్తోంది. Worst behaviour from #Nithyamenon !pic.twitter.com/8mmHTcYg4a— Kolly Censor (@KollyCensor) January 9, 2025 -
సినిమాలు మానేయాలనుంది, గతేడాదే ఈ పని చేయాలనుకున్నా!
మసాలా సినిమాల్లో నటించేదే లేదన్న నిత్యామీనన్ (Nithya Menen) ఇకమీదట అసలు సినిమాలే చేయనంటోంది. మొన్నటివరకు మంచి పాత్ర అయితే చాలు చిన్న సినిమా అయినా అంగీకరిస్తాన్న ఆమె ప్రస్తుతం తాను ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేశాక సినీ ఇండస్ట్రీని శాశ్వతంగా వదిలేస్తానంటోంది.అమ్మ వల్లే ఇదంతా..ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం కాదలిక్క నెరమిళ్లై (Kadhalikka Neramillai Movie) సంక్రాంతికి విడుదలవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిత్యామీనన్ ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాడటం, డ్యాన్స్ చేయడం, యాక్ట్ చేయడం.. ఇవన్నీ కూడా మా అమ్మే చిన్నప్పటి నుంచి నాతో చేయించింది. నిజం చెప్పాలంటే నాకు సినిమా అంటే ఇష్టం లేదు. అయినా ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూనే ఉన్నాను.సినిమా నన్ను వదిలేలా లేదు!సినిమాలు మానేయాలని ఆలోచించిన ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతూ ఉండేది. ఈసారి గప్‌చుప్‌గా పక్కకు వెళ్లిపోదామని ఆలోచిస్తున్నప్పుడే తిరుచిత్రంపళం మూవీకి జాతీయ అవార్డు వచ్చింది. అప్పుడు నాకో విషయం అర్థమైంది. నేను సినిమాలు మానేసినా.. సినిమా నన్ను వదిలేలా లేదు అని! ఇప్పటికిప్పుడు నాకు వేరే ఇండస్ట్రీలో ఏదైనా అవకాశం వస్తే కచ్చితంగా దాంట్లోకి వెళ్లిపోతాను.(చదవండి: తెలంగాణలో 'గేమ్ ఛేంజర్' టికెట్ల పెంపుపై విమర్శలు )అలాంటి జీవితం కావాలినాకు సాధారణ జీవితం గడపాలని ఉంది. నటిగా ఉన్నప్పుడు బయట స్వేచ్ఛగా జీవించలేం. నాకు పార్క్‌కు వెళ్లి వాకింగ్ చేయాలనుంటుంది. కానీ అది సాధ్యపడదు. నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. పైలట్ అవ్వాలని కోరిక.. ఇలా ఎన్నో ఉంటాయి అని చెప్పుకొచ్చింది. నిత్య సినిమాలు మానేయాలనుకోవడం కొత్తేమీ కాదు..ఉత్తమ నటిగా జాతీయ అవార్డుకాగా తిరు సినిమాకుగానూ నిత్యామీనన్‌కు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు లభించింది. ఈ మూవీలో ధనుష్ హీరోగా నటించగా రాశీ ఖన్నా హీరోయిన్గా యాక్ట్ చేసింది. హీరో స్నేహితురాలిగా నిత్య ఆకట్టుకుంది. మిత్రన్ జవహర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇది 2022లో విడుదలైంది. నిత్య లేటెస్ట్ మూవీ కాదలిక్క నెరమిళ్లై విషయానికి వస్తే.. ఇందులో జయం రవి, వినయ్, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. రెడ్ జియాంట్ సినిమా నిర్మిస్తున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది.తెలుగులో..అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నిత్యా మీనన్. అలా మొదటి చిత్రంతోనే జనాలకు బాగా నచ్చేసింది. 180, ఇష్క్, జబర్దస్త్, గుండె జారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, ఒక అమ్మాయి తప్ప, జనతా గ్యారేజ్, అ, నిన్నిలా నిన్నిలా, భీమ్లా నాయక్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తమిళంలో ఇడ్లీ కడాయ్, డియర్ ఎక్సెస్ సహా మరో సినిమా చేస్తోంది.చదవండి: తిరుపతి తొక్కిసలాట: హృదయాన్ని కలిచివేసిందన్న మోహన్‌బాబు -
ఇడ్లీ కొట్టులో ఏం జరిగింది?
ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తాజా తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’ (తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ అని అర్థం). ఈ చిత్రంలో నిత్యా మీనన్, షాలినీపాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. బుధవారం (జనవరి 1) న్యూ ఇయర్ సందర్భంగా ‘ఇడ్లీ కడై’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను విడుదల చేశారు. ‘మా సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశాం. మీ మూలాలకు కట్టుబడి ఉండండి’ అంటూ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను ‘ఎక్స్’లో షేర్ చేశారు ధనుష్. ఇక ఈ సినిమాలో ధనుష్ యంగ్ లుక్‌లో కనిపిస్తుండటం ఆయన ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. మరి... ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’లో ఏం జరిగింది? అనేది చూడాలంటే ఈ వేసవి వరకు వెయిట్ చేయాల్సిందే. ధనుష్, ఆకాశ్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆల్రెడీ ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. -
ఏడ్చే సన్నివేశాల్లో సులభంగా నటించేదాన్ని
‘‘కెరీర్ తొలి రోజుల్లో నేను ఎప్పుడూ విచారంగా ఉండేదాన్ని. అందుకేనేమో ఏడ్చే సన్నివేశాలు, భావోద్వేగ సన్నివేశాల్లో సులభంగా నటించేదాన్ని. ఇప్పుడు అలాంటి సన్నివేశాలు చేయడం కొంచెం కష్టంగా మారింది. బహుశా నేనిప్పుడు చాలా ఆనందంగా ఉంటున్నానేమో’’ అన్నారు హీరోయిన్ నిత్యా మీనన్. అందం, అభినయంతో నటనకుప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు మలయాళ బ్యూటీ నిత్యా మీనన్ . తమిళ చిత్రం ‘తిరుచిత్రంబళం’(తెలుగులో తిరు) సినిమాలో తన అద్భుతమైన నటనకుగాను ఇటీవల జరిగిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు నిత్యా మీనన్.కాగా ప్రస్తుతం గోవాలో జరుగుతున ్న ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’(ఇఫీ)లో పాల్గొన్న నిత్యామీనన్ .. సినిమాల్లో తన పాత్రల ఎంపిక గురించి మాట్లాడారు. ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నటనకు అంతప్రాధాన్యం లేని పాత్రలు ఎంచుకున్నాను. ఆ సమయంలో చాలా మంది నన్ను విమర్శించారు. ఆ తర్వాత కథలను ఎంపిక చేసుకునే విధానాన్ని మార్చుకున్నా. నటనకిప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లే ఎంచుకున్నాను. నటన అనేది భావోద్వేగానికి సంబంధించినది.దానికి వ్యక్తిగత అనుభవం అవసరం లేదు. సినిమాలో తల్లి పాత్ర పోషించడానికి అనుభవం అవసరం లేదు.. అందులో ఉండే భావోద్వేగాన్ని తెరపై చూపగలిగితే చాలు. మనం చేసే పాత్రలపై మనకు పూర్తి విశ్వాసం ఉండాలి. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే వాటిని ఎంచుకుంటే మంచి ఆదరణ లభిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే ఆ ప్రభావం చేసే పాత్రపై పడుతుంది’’ అని పేర్కొన్నారు నిత్యా మీనన్. ప్రస్తుతం ఆమె ధనుష్‌తో ‘ఇడ్లీ కడై’, విజయ్ సేతుపతితో ఓ సినిమా, ‘గోల్డెన్ వీసా’ చిత్రంలోనూ నటిస్తున్నారు. -
రింగుల జుట్టు, చిక్కని చిరునవ్వు, చక్కనమ్మ అందం (ఫోటోలు)
-
హీరోయిన్ నిత్యా మీనన్ ఎవర్ గ్రీన్ నవ్వు (ఫొటోలు)
-
ప్రేమకు వ్యతిరేకం కాదు.. అలాంటి వ్యక్తికే నా లైఫ్‌లో చోటు: నిత్యా మీనన్
టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్ ప్రస్తుతం ఇడ్లీ కడై అనే కోలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో ధనుశ్ హీరోగా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరు జంటగా రుచిత్రంబలం (తెలుగులో ‘తిరు’) మూవీలో నటించారు. ఈ సినిమాలో నటనకు గానూ నిత్యాకు జాతీయ ఉత్తమ నటి అవార్డ్‌ను దక్కించుకుంది. ఇటీవల తనకు అవార్డ్ రావడం పట్ల నిత్యామీనన్ స్పందించింది. జాతీయ అవార్డ్ వస్తుందని తానెప్పుడూ ఊహించలేదని తెలిపింది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నిత్యామీనన్ వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన జీవితంలో ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడింది. ప్రేమ పట్ల నాకు ఎలాంటి వ్యతిరేక అభిప్రాయాలు లేవని తెలిపింది. అయితే తనకిప్పుడు ప్రేమ, పెళ్లి ఇంపార్టెంట్ కాదని.. ప్రస్తుతం తన కెరీర్‌తో సంతోషంగా ఉన్నానని చెబుతోంది. వాటికి కూడా టైమ్ వస్తుందని.. అది ఎప్పుడైనా కావొచ్చు అంటోంది నిత్యామీనన్.నిత్యా మీనన్ మాట్లాడుతూ..'నా జీవితంలో ప్రేమకు అవకాశం లేదని కాదు. అలాగని ప్రేమకు వ్యతిరేకం కాదు. నా జీవితంలోనూ ఎవరైనా రావాల్సిందే. కానీ అది ఇప్పుడే పెళ్లి చేసుకో అనే మాటలు నేను నమ్మను. ప్రేమ, పెళ్లి విషయంలో చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉన్నా. ఆ సందర్భం ఎప్పుడైనా రావొచ్చు. అది 50 ఏళ్ల వయసులో వచ్చినా సరే నేను సంతోషిస్తా. లైఫ్‌లో ఒక వ్యక్తిగా చాలా ఎదుగుతున్నప్పటికీ మరింత నేర్చుకుంటూనే ఉంటా. అర్హత ఉన్న వ్యక్తి మాత్రమే నా జీవితంలోకి వస్తాడు. ప్రస్తుతం నేను దాని కోసం వెతకడం లేదు. జీవితం అనేది చాలా విషయాలతో ముడిపడి ఉంది. ' అని తమ మనసులో మాట చెప్పుకొచ్చింది. -
అవార్డుల కోసం నటించను: నిత్యామీనన్
‘‘అవార్డులు, రివార్డుల కోసం సినిమాల్లో నటించను. నాపాత్రకి ప్రాధాన్యత ఉంటేనే చేస్తాను’’ అంటున్నారు హీరోయిన్ నిత్యామీనన్. కెరీర్ ప్రారంభం నుంచి నటనకు ప్రాధాన్యం ఉన్నపాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు ఈ మలయాళ బ్యూటీ. ఇక ధనుష్ హీరోగా, నిత్యామీనన్ హీరోయిన్గా నటించిన తమిళ చిత్రం ‘తిరుచిత్రంబళం’ (తెలుగులో ‘తిరు’). మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తన అద్భుతమైన నటనకుగాను ఇటీవల జరిగిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు నిత్యామీనన్.తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన సినిమాల ఎంపిక గురించి మాట్లాడుతూ– ‘‘తిరు’కి జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంటానని ఊహించలేదు. అవార్డులు, రివార్డుల కోసం సినిమాల్లో నటించను. నేనుపోషించిన ప్రతిపాత్రకు గుర్తింపు రావాలనుకోను. ఆపాత్ర నాకు సంతోషాన్నిస్తే చాలనుకునే ఎంపిక చేసుకుంటాను. భారీ బడ్జెట్‌తో తీసే మసాలా సినిమాల్లో చాన్స్ వచ్చినా మొహమాటం లేకుండా చేయనని చెబుతాను. అలాంటిపాత్రలపై నాకు ఆసక్తి లేదు. మంచిపాత్ర అయితే చిన్న సినిమా అయినా అంగీకరిస్తాను. అందరూ అనుసరిస్తున్న మార్గంలోనే నేను కూడా వెళ్లాలనే రూల్ లేదు కదా?’’ అని పేర్కొన్నారు. -
ప్రేక్షకుల కళ్లు నా కలర్ మీద నుంచి కాళ్లవైపు మళ్లాయి: నటుడు మిథున్ చక్రవర్తి
‘‘నా చర్మపు రంగు నలుపుగా ఉండటం అనేది నా కెరీర్ ఆరంభంలో పెద్ద సవాల్‌లా అనిపించింది. నల్లగా ఉన్నవారు నటులుగా ఇండస్ట్రీలో నెగ్గుకురావడం కష్టమన్నట్లు కొందరు మాట్లాడారు. ఇండస్ట్రీ నుంచి వెనక్కి వెళ్లమని కూడా సలహా ఇచ్చారు. ఒకానొక దశలో నా చర్మపు రంగును మార్చమని ఆ దేవుణ్ణి ప్రార్థించాను. ఆ తర్వాత అసలు నేనేం చేయగలను? నా బలం ఏంటి? అని ఆలోచించాను. నేను బాగా డ్యాన్స్ చేయగలనని నా బలం తెలుసుకున్నాను.మంచి డ్యాన్సర్ కావాలనుకున్నాను. అప్పుడు ప్రేక్షకుల కళ్లు నా కలర్ మీద నుంచి కాళ్ల వైపు మళ్లుతాయని అనుకున్నాను. ప్రేక్షకులు నా డ్యాన్స్‌ను అభిమానించడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారు నా కలర్‌ను మర్చిపోయారు. నేనో సెక్సీ డ్యాన్సర్‌గా, డస్కీ బెంగాలీ బాబుగా పేరు సంపాదించుకున్నాను’’ అని ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం స్వీకరించిన అనంతరం ఒకింత ఉద్వేగంగా మాట్లాడారు ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి. దేశ రాజధాని ఢిల్లీలో 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం జరిగింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేశారు. 2022 సంవత్సరానికిగాను ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉత్తమ చిత్రం ‘ఆట్టమ్’ (మలయాళం), ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి (కాంతార–కన్నడ), ఉత్తమ నటీమణులుగా నిత్యా మీనన్ (తిరుచిత్రంబలం–తమిళ్), మానసీ పరేఖ్ (కచ్ఎక్స్ప్రెస్–గుజరాతీ) అవార్డు అందుకున్నారు. తెలుగు నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు ‘కార్తికేయ 2’కు దక్కింది. నిర్మాత అభిషేక్ అగర్వాల్ అవార్డు స్వీకరించగా, చిత్రదర్శకుడు చందు మొండేటి, హీరో నిఖిల్ కూడా హాజరయ్యారు. ‘΄పొన్నియిన్ సెల్వన్– 1’కు గానూ ఉత్తమ సంగీతం (నేపథ్య సంగీతం) విభాగంలో ఏఆర్ రెహమాన్ అవార్డు అందుకున్నారు. ఈ వేడుకకు వివిధ భాషల నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఈ వేదికపై ఇంకా మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ – ‘‘ఇప్పటికి మూడు జాతీయ అవార్డులు అందుకున్నాను. తొలి అవార్డు (‘మృగయా’) అందుకున్నప్పుడే నేను చాలా సాధించాననుకున్నాను. ‘మృగయా’ సినిమా స్క్రీనింగ్‌కి వెళ్లినప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్... అతను ఈ లోకంలో లేడు కాబట్టి పేరు చెప్పను. అతను ‘ఈ సినిమా చాలా బాగుంది. నువ్వు అద్భుతమైన నటుడివి. కానీ ఇలాంటి బట్టలతో నువ్వు ఎలా కనిపిస్తున్నావో తెలుసా?’ అంటే నేను నిర్ఘాంతపోయాను.నేను ఆయన ముందు నగ్నంగా నిలబడ్డానా? అనిపించింది. వెంటనే ఆయన ‘మృగయా’లో నేను చేసిన ఆదివాసీ పాత్ర గురించి చెప్పినట్లు పేర్కొన్నారు. నేను నా తొలి జాతీయ అవార్డు అందుకున్న తర్వాత హాలీవుడ్ యాక్టర్ అల్ పచీనో అంతటి ప్రతిభ నాలోనూ ఉందనుకున్నాను. అకస్మాత్తుగా నా తీరు మారిపోయింది. కొందరు నిర్మాతలతో దురుసుగా ప్రవర్తించాను. నన్ను నేను అల్ పచీనో అనుకుం టున్నానని నిర్మాతలు గ్రహించలేకపోయారు. ఓ సందర్భంలో ఒక నిర్మాతకు కథను నా ఇంటికి పంపాలన్నాను. అతను వెంటనే లేచి నా చెంప చెళ్లుమనిపించాడు. అప్పట్నుంచి నన్ను నేను ఓ అల్ పచీనోలా ఊహించుకోవడం మానేశాను. నాదే తప్పని గ్రహించాను. నా తీరు మార్చుకున్నాను’’ అన్నారు.మంచి మార్పు తీసుకురావాలన్నదే...: రిషబ్ శెట్టిప్రతి సినిమా ప్రభావం ప్రేక్షకుల పై ఉంటుంది. అందుకే ప్రజల్లో, సమాజంలో మంచి మార్పును తీసుకువచ్చే సినిమాలు తీయాలన్నది నా ఉద్దేశం.కష్టానికి ప్రతిఫలం దక్కింది: నిత్యా మీనన్ చిత్రపరిశ్రమలో దాదాపు 15 ఏళ్ల కష్టం నాది. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ అవార్డు. చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతానికి దీన్ని బాధ్యతగా చూడకుండా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇది. ‘తిరుచిత్రంబలం’ బృందానికి, నా సహ నటులకు ఈ అవార్డుని అంకితం ఇస్తున్నాను. ఇదే ఉత్సాహంతో మంచి దర్శకులు, రచయితలతో కలిసి పని చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాను. సినిమాకి సరిహద్దులు లేవు: ఏఆర్ రెహమాన్ సినిమాకి ప్రాంతం, భాష అంటూ ఎలాంటి సరిహద్దులు లేవు. నేను అందుకున్న ఏడో జాతీయ అవార్డు ఇది. సంతోషంగా ఉంది. ఈ అవార్డు నాకు వచ్చేందుకు కారకులైన ఫిల్మ్ మేకర్స్‌కి, ముఖ్యంగా డైరెక్టర్ మణిరత్నంగారికి ధన్యవాదాలు. -
నేను మలయాళీ కాదు.. నా పేరు కూడా తప్పే
-
నిత్యా మీనన్ ఎమోషనల్.. ఈ నేషనల్ అవార్డ్ మా నలుగురిది (ఫొటోలు)
-
టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది!
అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన నటి నిత్యామీనన్. ఆ తర్వాత నితిన్ సరసన ఇష్క్ సినిమాతో గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు, కన్నడ, తమిళం, మలయాళంలో దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో గుండెజారి గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్, 100 డేస్ ఆఫ్ లవ్, ఒక్క అమ్మాయి తప్ప, ఇంకొక్కడు లాంటి చిత్రాల్లో నటించింది. ఇటీవల వెబ్ సిరీస్‌లతో అలరించిన మలయాళీ భామ 36వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఇవాళ నిత్యా మీనన్ బర్త్ డే కావడంతో మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా నిత్యా నటిస్తోన్న 'డియర్ ఎక్సెస్' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం ద్వారా కామిని డైరెక్టర్‌గా పరిచయవుతున్నారు. రిలీజైన పోస్టర్లో నిత్యా ఒక చేతిలో మొబైల్.. మరో చేతిలో గ్లాస్ పట్టుకుని కనిపించింది. ఈ సినిమాను బాస్క్ టైమ్ థియేటర్, పోప్టర్ మీడియా నెట్వర్క్ బ్యానర్లపై బీజీఎన్, ఆదిత్య అజయ్ సింగ్, రామ్‌కి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పోస్టర్ చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో వినయ్ రాయ్, నవదీప్, ప్రతీక్ బబ్బర్, దీపక్ పరంబోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) -
ముద్దుగా ఉండే బొద్దుగుమ్మ బర్త్‌డే స్పెషల్ (ఫోటోలు)
-
ఫాంటసీ చిత్రంలో నిత్యమీనన్
తమిళసినిమా: దక్షిణాది భాషా నటీమణుల్లో తనకంటూ ప్రత్యేకత కలిగిన నటి నిత్యామీనన్. ఈమె ఏ చిత్రంలో ఎలాంటి పాత్రను పోషించినా అందులో తన ముద్ర ఉండేలా చూసుకుంటారు. అలా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తున్న నిత్యామీనన్ ఇటీవల తమిళంలో నటించిన చిత్రం తిరుచిట్రంఫలం. ధనుష్ కథా నాయకుడిగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇందులో నిత్యామీనన్ తన నటనకుగానూ విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. ఇకపోతే నిత్యామీనన్‌ను తాజాగా మరో హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రంలో నటించే అవకాశం వరించింది. వినోదంతో కూడిన ఫాంటసీ కథా చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని బాస్క్ టైమ్ థియేటర్స్, పాప్టర్ మీడియా సంస్థ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇందులో వినయ్‌రాయ్, నవదీప్, ప్రతీక్ బబ్బర్, దీపక్ పరంబోల్ ముఖ్యపాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రం ద్వారా కామిని దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఆమె దర్శకుడు విష్ణువర్ధన్ శిష్యురాలు కావడం గమనార్హం. త్వరలో సెట్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి ప్రీతా జయరా మన్ చాయాగ్రహణం, కళా దర్శకత్వం బాధ్యతలను షణ్ముగరాజా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వర లో వెల్లడించనున్నట్లు నిర్మాతలు శుక్రవారం మీడియా కు విడుదల చేసిన మీడియా ప్రకటనలో పేర్కొన్నారు. -
అలాంటి కథతో వస్తోన్న నిత్యా మీనన్.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్!
అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన నటి నిత్యామీనన్. ఆ తర్వాత నితిన్ సరసన ఇష్క్ సినిమాతో గుర్తింపు దక్కించుకుంది. ఆమె తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళంలో దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో గుండెజారి గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్, 100 డేస్ ఆఫ్ లవ్, ఒక్క అమ్మాయి తప్ప, ఇంకొక్కడు లాంటి చిత్రాల్లో నటించింది. నిత్యా మీనన్ ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా మరో ఆసక్తికర స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాలో పంచుకుంది. ఓ యువతి ప్రేమకథా ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రంలో ఆమె నటిస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో సత్యజిత్ రే.. ఠాగూర్ చిన్న కథ ఆధారంగా తెరకెక్కించిన సమాప్తి పేరుతో సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో మృణ్మోయి అనే యువతి పాత్రను చూపించారు. తాజాగా నిత్యా మీనన్ పోస్టర్ చూస్తే అదే కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) -
పెళ్లి చేస్కో బాగుంటుందని దుల్కర్ చెప్తూ ఉంటాడు..!
-
ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా మారాలి: నిత్యా మీనన్
-
ఆ ఆత్మహత్యతో పెళ్లికి దూరంగా నిత్యా మేనన్.. నటుడి కామెంట్లు
సౌత్ సినిమా ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ బ్యూటీగా గుర్తింపు ఉన్న మలయాళ కుట్టి నిత్యా మేనన్ సింగర్‌గా, హీరోయిన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కానీ నిత్యామీనన్ పెళ్లి గురించి ఏడాది నుంచి పలు రూమర్లు వస్తూనే ఉన్నాయి. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ స్టార్ హీరోను నిత్యా మేనన్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ పలు వెబ్సైట్లు, సోషల్ మీడియాలో కొన్ని రోజుల క్రితం వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. వాటిలో ఏలాంటి నిజం లేదని చెప్పింది ఈ బ్యూటీ. (ఇదీ చదవండి: ఫోన్ ఇచ్చేస్తా అంటూ హీరోయిన్‌కు కండీషన్ పెట్టిన అజ్ఞాతవాసి) సౌత్ ఇండియాలో విభిన్నమైన నటిగా గుర్తింపు తెచ్చుకున్న నిత్యా పెళ్లి గురించి తమిళ నటుడు, సినీ విమర్శకుడు బైల్వాన్ రంగనాథన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఓ ప్రముఖ మలయాళ నటి పెళ్లి చేసుకున్న తర్వాత వరకట్నం, గృహహింస వంటి కారణాలతో ఆత్మహత్య చేసుకుందని.. ఈ భయమే నిత్యా మేనన్‌ను వెంటాడుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆమె ఇంట్లోని వారందరూ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నప్పటికీ ఈ బలమైన కారణం వల్ల ఆమె పెళ్లికి నో చెబుతుందని ఆయన వ్యాఖ్యానించారు. పెళ్లి చేసుకుంటే తాను కూడా గృహహింస భారిన పడాల్సి వస్తుందని ఆమె భావిస్తోందని చెప్పాడు. ఆమె అధిక బరువు కారణంగా కూడా పెళ్లికి దూరంగా ఉంటున్నట్లు రంగనాథన్ తెలిపాడు. కానీ ఇందులో ఎంత వరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. తాజాగా నిత్యా మీనన్ 'కుమారి శ్రీమతి' అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను మెప్పించారు. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ మంచి టాక్‌తో దూసుకుపోతుంది. -
సడన్‌గా ఓటీటీ మారిన హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ధనుష్, నిత్యా మీనన్ జంటగా నటించన రొమాంటిక్ కామెడీ మూవీ 'తిరుచిత్రం బలం'( తెలుగులో తిరు). 2022లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకి మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాశి ఖన్నా, ప్రియా భవానీ శంకర్ కూడా హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్, భారతీరాజా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతమందించగా.. గతేడాది ఆగస్ట్ 18న థియేటర్లలో విడుదలైంది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. (ఇది చదవండి: స్టార్ హీరో సినిమాలో ఏలియన్.. టీజర్ అదిరిపోయింది!) సన్ నెక్ట్స్తో నిర్మాతలకు విభేదాలు తిరుచిత్రంబలం మూవీ స్ట్రీమింగ్ హక్కులపై నిర్మాతలు, సన్ నెక్ట్స్ యాజమాన్యానికి అంతర్గతంగా విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో మార్చారు. అక్టోబర్ 6వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల కోసం తమిళం, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం భాషలలో అందుబాటులో ఉంది. అయితే ఈ నిర్ణయంపై ధనుశ్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. Well it’s been a while isn’t ? Thiruchitrambalam from august 18th. See you all in theatres. pic.twitter.com/foFZmqronV — Dhanush (@dhanushkraja) June 15, 2022 -
ఆ హీరోతో తొలిసారి జోడీ కడుతున్న నిత్యామీనన్..
దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రముఖ కథానాయికల్లో నిత్యామీనన్ ఒకరు. అయితే ఈ మలయాళ భామ రూటే సెపరేటు. పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే నటించడానికి సమ్మతిస్తారు. అలా తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇటీవల వెబ్ ప్రపంచంలోకి ఎంటర్ అయిన నిత్యామీనన్ తాజాగా తమిళంలో జయం రవితో జత కట్టడానికి సిద్ధం అవుతున్నారు. రెడ్ జెయింట్ మూవీస్ సంస్ధ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృతిక ఉదయనిధి దర్శకత్వం వహించనున్నారు. ఈచిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుంది. దీని గురించి నిత్యామీనన్ తెలుపుతూ ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం.. గ్రామీణ నేపథ్యంలో రూపొందనున్న రొమాంటిక్ కామెడీ మూవీగా ఉంటుందన్నారు. తాను ఇంతకు ముందు ధనుష్ సరసన నటించిన తిరుచిట్రంఫలంలో పోషించిన శోభన పాత్ర తరహాలో ఇందులోనూ తన పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని చెప్పారు. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కాగా పొన్నియిన్ సెల్వన్ చిత్రం తరువాత జయం రవి నటించిన చిత్రాలేవీ ఆశించిన విజయాలను సాధించలేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సైరస్, జీనీ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా కృతిక ఉదయనిధి దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈయనతో నిత్యామీనన్ నటిస్తున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. చదవండి: సినిమాల కోసం రాజీనామా చేసిన IAS.. గతంలో ఈ కలెక్టర్ చరిత్ర ఇదే -
దొంగ దొరికాడు అంటూ నిత్యామీనన్ పోస్ట్
సౌత్ ఇండియాలో నిత్యా మీనన్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పటి వరకు తను కూడా మంచి కథతో పాటు నటనకు స్కోప్ ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ వచ్చింది. అంతేకాకుండా వివాదాలకు కూడా దూరంగా ఉంటుంది. కానీ గత కొన్ని రోజులుగా ఆమెపై పలు వార్తలు వైరల్ అయ్యాయి. తమిళ సినీ ఇండస్ట్రీపై ఆమె వివాదస్పద వ్యాఖ్యలు చేశారంటూ కొన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పుకార్లు సోషల్ మీడియాలో దుమారాన్ని రేపుతున్నాయి. అయితే, నిత్య ఆ వ్యాఖ్యలు చేయలేదని తెలుస్తోంది. ఆ రూమర్స్ ఎంటి..? 'ఓ తమిళ హీరో నన్ను చాలా వేధించాడు.. షూటింగ్లో నన్ను ఇబ్బంది పెట్టాడు.. తమిళ ఇండస్ట్రీలో నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనలేదు.' అంటూ నిత్యా మీనన్ చెప్పినట్టుగా కొన్ని తమిళ మీడియా సంస్థలు ప్రచురించాయి. అవి ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని నిత్యా మీనన్ కూడా ఖండించింది. ఇది అవాస్తవం.. జర్నలిజంలోని కొన్ని వర్గాలు ఇలా దిగజారడం చాలా బాధాకరం. ఇలాంటి చెత్తపనులు ఎలా చేస్తారు. 'నేను ఇప్పటి వరకు ఎక్కడా ఇంటర్వ్యూనే ఇవ్వలేదు. ఇలాంటి తప్పుడు వార్తలు ఇవ్వకండి. దీని కంటే మెరుగ్గా ఉండండి. ఇలాంటివి పక్కన పెట్టి కాస్త మంచి పనులు చేయండి.' అని నిత్యా మీనన్ పోస్ట్ వేసింది. దొంగ దొరికాడు అంటూ నిత్యామీనన్ మరోక పోస్ట్ చేసింది. కొన్ని సోషల్ మీడియా ఖాతాలను స్క్రీన్ షాట్ తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 'మిమ్మల్ని చూస్తే సిగ్గేస్తోంది.. మనం అందరం ఈ భూమ్మీద తక్కువ సమయమే ఉంటాం. ఒకరికొకరం ఇలాంటి ఎంత పెద్ద తప్పులు చేస్తున్నామో అనుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. నేను దీనిని ఎందుకు ఎత్తి చూపుతున్నాననంటే.. జవాబుదారీతనం మాత్రమే చెడు ప్రవర్తనను ఆపుతుంది. ఈ తప్పుడు ప్రచారం చేసిన వారు ఇప్పటికైన మారండి. ఇలాంటి వారిని అనుసరించిన వారు కూడా తప్పును తెలుసుకోండి.' అని నిత్యా మీనన్ చెప్పింది. (ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ సినిమా నుంచి శ్రీలీల ఔట్.. క్రేజీ హీరోయిన్‌కు ఛాన్స్) ప్రస్తుతం నిత్యా మీనన్.. తన తరువాతి ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు వెబ్ సిరీస్‌లు చేయడానికి కూడా నిత్యా వెనకాడడం లేదు. అందుకే ‘కుమారి శ్రీమతి’ అనే వెబ్ సిరీస్‌తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 28న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) -
నిత్యామేనన్‌ని వేధించిన ఆ హీరో.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు వేధింపులు.. ఇదీ ఎంతకు తెగని టాపిక్. ఎందుకంటే అవకాశాల కోసం ప్రయత్నించే లేడీ యాక్టర్స్‌ని పలువురు దర్శకనిర్మాతలు ఇబ్బంది పెడుతుంటారనేది చాలామందికి తెలుసు. అయితే స్టార్ హీరోయిన్ల విషయానికొస్తే.. ఇలా జరగడం చాలా అంటే చాలా తక్కువ. కానీ నిత్యామేనన్‌ని ఓ తమిళ హీరో వేధించడనేది ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇప్పుడు దీనిపై సదరు బ్యూటీనే క్లారిటీ ఇచ్చింది. ఏం జరిగింది? మలయాళ ముద్దుగుమ్మ నిత్యామేనన్.. 'అలా మొదలైంది' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. దీనికి కొన్నాళ్ల మునందే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే తెలుగు, తమిళ, మలయాళంలో పలు సినిమాలు చేసిన నిత్యామేనన్.. మన దగ్గర చివరగా 'భీమ్లా నాయక్' చేసింది. అయితే ఈ ఏడాది జూన్‌లో నిత్యామేనన్ షాకింగ్ కామెంట్స్ చేసినట్లు వార్తలొచ్చాయి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 37 సినిమాలు) ఏం చెప్పింది? 'నేను చాలా తెలుగు సినిమాలు చేశాను కానీ ఎలాంటి ఇబ్బంది ఎదురవలేదు. తమిళంలో ఓ సినిమా చేస్తున్నప్పుడు మాత్రం షూటింగ్ సమయంలో ఓ హీరో నన్ను పదేపదే తాకుతూ వేధించాడు' అని హీరోయిన్ నిత్యామేనన్ చెప్పినట్లు పలు వెబ్‌సైట్స్ రాసుకొచ్చాయి. జూన్‌లో తొలుత ఈ కామెంట్స్ సెన్సేషన్ కాగా, ఇప్పుడు మరోసారి అవి తెరపైకి వచ్చాయి. అసలు నిజమేంటి? అయితే నిత్యామేనన్ పేరు చెప్పి వైరల్ అయిన ఈ కామెంట్స్ పూర్తిగా అబద్ధం. స్వయంగా ఈ బ్యూటీనే ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. తాను ఎవరికీ ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదని, అసలు ఇలాంటి రూమర్స్ ఎందుకు సృష్టిస్తారంటూ సీరియస్ అయింది. ఇదిలా ఉండగా 'కుమారి శ్రీమతి' అనే వెబ్ సిరీస్‌తో నిత్యా.. తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనుంది. సెప్టెంబరు 28న అమెజాన్ ప్రైమ్‌లో ఇది రిలీజ్ కానుంది. (ఇదీ చదవండి: సాయితేజ్-స్వాతి.. ఆ విషయం ఇప్పుడు బయటపెట్టారు!) View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) -
ఓటీటీల్లోకి ఆ రెండు మూవీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
జనాలకు ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. థియేటర్లలో కంటే వీటినే ఎక్కువగా ఆదరిస్తున్నారు. అయితే ఒకప్పుడు చోటామోటా యాక్టర్స్ ఓటీటీల కోసం మూవీస్ చేసేవారు. ఇప్పుడు ఏకంగా స్టార్స్ నటించిన సినిమాలు కావొచ్చు, వెబ్ సిరీసులు కావొచ్చు నేరుగా ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అలా స్టార్ హీరోయిన్స్ నటించిన ఓ మూవీ, ఓ వెబ్ సిరీస్ ఇప్పుడు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. (ఇదీ చదవండి: తెలుగు యువ హీరో తల్లిపై పోలీస్ కేసు.. ఏం జరిగింది?) మలయాళ బ్యూటీ నిత్యామేనన్ ఎవరో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్ కమ్ సింగర్ అయిన ఈమె.. క్యూట్ యాక్టింగ్‌తో పలు సినిమాలు చేసింది. స్టార్ హీరోలతోనూ కలిసి పనిచేసింది. అయితే ఈమెకు రానురాను తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఓటీటీల్లోనూ నటిస్తూ బిజీ అయిపోయింది. అలా ఈమె ప్రధాన పాత్రలో నటించి 'కుమారి శ్రీమతి'.. ఈ సెప్టెంబరు 28 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. Get ready to laugh, cry and cheer as Srimathi takes on life’s challenges head-on. 🏡#KumariSrimathiOnPrime streaming from September 28th on @PrimeVideoIN.#KumariSrimathi @MenenNithya @Sri_Avasarala @gomtesh_upadhye @iamThiruveer @PatnaikPraneeta @ItsActorNaresh… pic.twitter.com/EzHzY648rE — Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 18, 2023 తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి చాలామందికి తెలుసు. ఒకప్పుడు హీరోయిన్గా చేసింది కానీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీగా ఉంది. ఈమె ప్రధాన పాత్రలో, ప్రముఖ యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్ తీసిన హారర్ వెబ్ సిరీస్ 'మ్యాన్షన్ 24'. దీన్ని త్వరలో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. వినాయక చవితి సందర్భంగా ప్రకటించిన ఈ రెండూ లేడీ ఓరియెంటెడ్ మూవీ/వెబ్ సిరీస్ కావడం విశేషం. (ఇదీ చదవండి: పెళ్లికి ముందే అత్తారింట్లో మెగా కోడలు సందడి) So excited for this one..My next release#Mansion24 Watch at your own risk ⚠️#Mansion24OnHotstar coming soon..!!#DisneyPlusHotstar. @avika_n_joy @thebindumadhavi @vidyuraman @ActorNandu #MeenaKumari @ActorMaanas @actor_amardeep @shraddhadangara @jois_archie @mgabhinaya… pic.twitter.com/uWRdqFwbRo — 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) September 18, 2023 -
ఓటీటీ హీరోయిన్గా మారిపోతున్న బ్యూటీ.. మరో కొత్త మూవీ
ఆమె స్టార్ హీరోయిన్.. దక్షిణాదిలో కన్నడ తప్పించి అన్ని భాషల్లోనూ సినిమాలు చేసింది. కానీ గత కొన్నాళ్ల నుంచి రూట్ మార్చేసింది. ఓటీటీల్లో దాదాపుగా మూవీస్, వెబ్ సిరీసులు చేస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా తను ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకీ ఏంటి సంగతి? (ఇదీ చదవండి: నాగ్ ఇచ్చిపడేశాడు.. రైతుబిడ్డ ముఖం మాడిపోయింది!) పైన చెప్పిందంతా కూడా నిత్యామేనన్ గురించి. 'అలా మొదలైంది' మూవీతో హీరోయిన్ అయిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటించింది. కొన్ని హిట్స్, కొన్ని ఫ్లాప్స్ పడ్డాయి. మరోవైపు ఈమె బరువు కూడా పెరగడంతో ఛాన్సులు క్రమంగా తగ్గిపోయాయి. మరోవైపు ఓటీటీ అవకాశాలు తలుపుతట్టాయి. 'బ్రీత్' అనే థ్రిల్లర్ వెబ్ సిరీసులో నటించిన నిత్యామేనన్.. ఆ తర్వాత అప్పుడప్పుడు సినిమాలు చేస్తోంది. మరోవైపు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. అలా 'మాస్టర్ పీస్' అనే డబ్బింగ్ సిరీస్ తో త్వరలో రాబోతున్న ఈమె నుంచి మరో స్ట్రెయిట్ ఓటీటీ మూవీ కూడా రెడీ అయిపోయింది. 'శ్రీమతి కుమారి' పేరుతో తీస్తున్న ఈ తెలుగు చిత్రాన్ని త్వరలో అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. దీన్నిబట్టి చూస్తుంటే నిత్యామేనన్.. బిగ్ స్క్రీన్ కంటే ఓటీటీలకే ఓటేస్తుందని అనిపిస్తుంది. (ఇదీ చదవండి: Bigg Boss 7 : చిల్లర మాటలు.. అతి చేష్టలు.. ‘ఛీ’వాజీ) -
స్టార్ హీరోతో నిత్యామీనన్ పెళ్లి.!
బాలనటిగానే సినీ రంగప్రవేశం చేసిన నిత్యామీనన్ హీరోయిన్గా మాత్రం 2006లో కథానాయకిగా కన్నడ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా నిత్యామీనన్‌కు మంచి గుర్తింపు ఉంది. చిత్రపరిశ్రమలో హీరోయిన్గా మాత్రమే కాకుండా సింగర్‌గా కూడా తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. కానీ ఇప్పుడు ఆమెకు అంతగా సినిమా అవకాశాలు లేవనే చెప్పవచ్చు. దీంతో ఇక పెళ్లి చేసుకోమని తన కుటుంబ సభ్యులు తెలుపుతున్నారట. (ఇదీ చదవండి; బిగ్ బాస్‌లోకి ఆ స్టార్ హీరో, హీరోయిన్.. ఆఖరి క్షణంలో అదిరిపోయే ట్విస్ట్) అంతేకాకుండా తనకు 35 ఏళ్లు వచ్చాయని ఇక పెళ్లి చేసుకోవడం మంచిదని వారు సలహా ఇచ్చారట. దీంతో ఆమె తన చిన్ననాటి స్నేహితుడు అయిన ఓ మలయాళ స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతుందని శాండిల్‌వుడ్‌లో ప్రచారం జరుగుతుంది. గతంలో కూడా నిత్యామీనన్ పెళ్లి విషయంపై చాలా వార్తలే వచ్చాయి. కానీ వాటిని ఆమె వెంటనే కొట్టిపారేసేది కూడా. కానీ ఈసారి మలయాళీ ఇండస్ట్రీలో మాత్రం నిత్యామీనన్ పెళ్లి వార్త బాగానే వైరల్ అవుతుంది. అంతే కాకుండా అక్కడి సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ఇది నిజమేనని తెలుపుతున్నారట. (ఇదీ చదవండి: అనుష్కతో హగ్స్.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన నవీన్) ఆమె పెళ్లి మాత్రం ప్రముఖ హీరోతోనే జరుగుతుందంటూనే పేరు మాత్రం వారు రివీల్ చేయడం లేదట. గతంలో తన పెళ్లి విషయంపై ఎక్కడైనా చిన్న కామెంట్ వచ్చినా వెంటనే రియాక్ట్ అయ్యే నిత్యా ఈసారి ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకపోవడంతో తన పెళ్లి వార్త నిజమేనని, త్వరలో ఆమె అధికారికంగా ప్రకటిస్తారని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా నిత్యామీనన్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో మరోసారి భారీగా ట్రెండ్ అవుతుంది. -
నిత్యా మీనన్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక మిమ్మల్ని చూడలేనంటూ!
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తాను ఎంతగానో ప్రేమించే అమ్మమ్మ చనిపోయారు. ఈ విషయాన్ని నిత్యా తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. అమ్మమ్మ, తాతయ్యతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన నిత్యా అభిమానులు ధైర్యంగా ఉండాలంటూ పోస్టులు పెడుతున్నారు. (ఇది చదవండి: నాన్న బాటలోనే రాణిస్తా.. సేవలు కొనసాగిస్తా..ఘట్టమనేని సితార) నిత్యా ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఒక శకం ముగిసింది. మిమ్మల్ని చాలా మిస్సవుతున్నా. గుడ్ బై అమ్మమ్మ అండ్ మై చెర్రీమ్యాన్. ఇప్పటి నుంచి మరో కోణంలో చూసుకుంటా.' అంటూ ఎమోషనలైంది. కాగా.. అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన నటి నిత్యామీనన్. నితిన్ సరసన ఇష్క్ సినిమాతో గుర్తింపు దక్కించుకుంది. ఆమె తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళంలో దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో గుండెజారి గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్, 100 డేస్ ఆఫ్ లవ్, ఒక్క అమ్మాయి తప్ప, ఇంకొక్కడు లాంటి చిత్రాల్లో నటించింది. (ఇది చదవండి: జబర్దస్త్ అవినాష్ తల్లికి గుండెపోటు! స్టంట్స్ వేసిన వైద్యులు) View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) -
Valentine's Day: ప్రేమకు చిహ్నమైన ‘రెడ్’ కలర్ దుస్తుల్లో మతిపోగొడుతున్న భామలు (ఫోటోలు)
-
టీచర్‌గా మారిపోయిన నిత్యామీనన్.. వీడియో వైరల్
హీరోయిన్ నిత్యామీనన్ ఇప్పుడు టీచర్‌గా మారిపోయింది. ఇదేదో సినిమా షూటింగ్ కోసం కాదండోయ్. నిజంగానే పంతులమ్మగా మారిపోయి పిల్లలకు పాఠాలు చెప్పిందీ అందాల తార. ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్న నిత్యామీనన్ షూటింగ్ అనంతరం దగ్గర్లోని గవర్నమెంట్ స్కూల్‌కి వెళ్లింది. అక్కడి పిల్లలతో కాసేపు సరదాగా మాట్లాడిన ఆమె ఆ తర్వాత వారికి పాఠాలు చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. కృష్ణాపురం గ్రామంలోని ఈ పిల్లలతో న్యూ ఇయర్ డే ఆనందంగా గడిచిందంటూ నిత్యామీనన్ తన పోస్టులో రాసుకొచ్చింది. పల్లెటూర్లలో ఉండే చిన్నారులు బాల్యాన్ని ఎంతో ఆనందంతో గడుపుతారని, వాళ్ల చుట్టూ ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటానంటూ పేర్కొంది. ఇక నిత్యామీనన్ టీచింగ్ క్లాసులు చూసి ఫిదా అయ్యామంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) -
'అలా ఆలోచించే వాళ్లయితే ఓకే'.. పెళ్లిపై నిత్యామీనన్ ఆసక్తికర కామెంట్స్..!
దక్షిణాది సినిమాల్లో నటి నిత్యామీనన్‌కు ఫేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆమె ఏ పాత్ర పోషించినా అందులో సహజత్వం ఉట్టి పడుతుంది. అలాగే ఏది పడితే ఆ పాత్ర ఒప్పుకోదు. అదే ఆమెలో ప్లస్, మైనస్ కూడా. నటనకు అవకాశం ఉన్న పాత్రలే అంగీకరించి పేరు తెచ్చుకుంటోంది. స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో 'ఒకే బంగారం' సినిమాలో కూడా నటించింది భామ. ప్రస్తుతం ఆమె 'వండర్ ఉమెన్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సమాజంలో ఉన్న సంప్రదాయాలను మనం గౌరవించాలంటూ చెప్పుకొచ్చింది. నిత్యామీనన్ మాట్లాడుతూ.. 'నేను పక్కా ట్రేడిషనల్. నేను మన సంస్కృతిని గౌరవిస్తా. ఇండియా వేదిక్ కల్చర్‌ను గట్టిగా నమ్ముతా. పెళ్లంటే అది ఒక సోషల్ సెటప్. అంటే ఫైనాన్షియల్‌గా ముడిపడి ఉన్న సెటప్. నాకు అలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. అంతకు మించి ఏదైనా ఉంటే ఆలోచిస్తా. ఎవరైనా దానికి మించి ఆలోచించేవాళ్లు దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటా.' అంటూ నవ్వుతూ చెప్పింది. నిత్యా మీనన్ నటించిన పాపులర్ వెబ్ సిరీస్ బ్రీత్: ఇన్టు ది షాడోస్. ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్లో అభా పాత్రలో కనిపించనుంది. ఈ డ్రామాలో అభిషేక్ బచ్చన్, డా. అవినాష్ సబర్వాల్ కూడా ఉన్నారు. -
నిత్యామీనన్‌కు ప్రెగ్నెన్సీ.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..?
దక్షిణాదిలో నటి నిత్యామీనన్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఆమె ఏ పాత్ర పోషించినా అందులో సహజత్వం తొణికిసలాడుతుంది. కేవలం నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఆమె ఒప్పకుంటుంది. అయితే ఆమె ఇటీవల పెద్దగా చిత్రాల్లో నటించడం లేదు. ఈ భామ ధనుష్‌కు జంటగా తిరుచ్చిట్రంఫలం చిత్రంలో నటించింది. కానీ తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. తాజాగా నిత్యా మీనన్ ప్రెగ్నెన్సీ కిట్ ఫోటోను షేర్ చేయడంతో అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో నిత్యా మీనన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. (చదవండి: అవకాశాలు ఇస్తామన్నా.. నిత్యామీనన్ ఎందుకిలా చేస్తుంది?) నిత్యా మీనన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రెగ్నెన్సీ కిట్ ఫోటోను పోస్ట్ చేస్తూ..'"అండ్ ది వండర్ బిగిన్స్" అంటూ శీర్షిక పెట్టింది. ఆ పోస్ట్‌కు మహిళ ఏమోజీని కూడా ట్యాగ్ చేసింది. కానీ ఆమె నటించబోయే తదుపరి చిత్రానికి వండర్ విమెన్ అనే టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోటో చూసిన ఆమె అభిమానులు నటి గర్భం దాల్చిందని మొదట భావించారు. కానీ ఆమె తాజా చిత్రం ప్రమోషన్లలో భాగంగానే ఇలా చేసి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. నిత్యా మీనన్ నటించిన పాపులర్ వెబ్ సిరీస్ బ్రీత్: ఇన్టు ది షాడోస్. ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్లో అభా పాత్రలో మళ్లీ నటించనుంది. ఆకట్టుకునే ట్రైలర్‌ను అభిమానులతో పంచుకుంది. ఈ సిరీస్ వచ్చేనెల నవంబర్ 9న ఓటీటీలో విడుదలవుతోంది. ఈ డ్రామాలో అభిషేక్ బచ్చన్, డా. అవినాష్ సబర్వాల్ కూడా ఉన్నారు. View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) -
అవకాశాలు ఇస్తామన్నా.. నిత్యామీనన్ ఎందుకిలా చేస్తుంది?
తమిళసినిమా: దక్షిణాది సినిమాల్లో నటి నిత్యామీనన్‌కు నేమ్, ఫేమ్ ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. నిత్యామీనన్ ఏ పాత్ర పోషించినా అందులో సహజత్వం ఉట్టి పడుతుంది. అలాగే ఏది పడితే ఆ పాత్ర ఒప్పుకోదు. అదే ఆమెలో ప్లస్, మైనస్ కూడా. నటనకు అవకాశం ఉన్న పాత్రలే అంగీకరించి పేరు తెచ్చుకుంటోంది. అలాగే కొన్ని మంచి ప్రాతలను కూడా నిరాకరించడం వల్ల అవకాశాలను కోల్పోతోంది. అందుకే అన్ని భాషల్లో కలిపి 6 నెలలకో, ఏడాదికో ఈమె నటించిన చిత్రాలు విడుదల అవుతుంటాయి. అంతెందుకు ఇటీవల ఈ భామ ధనుష్‌కు జంటగా తిరుచ్చిట్రంఫలం చిత్రంలో నటింంది. ఇందులో నటి రాశీఖన్నా, ప్రియాభవాని శంకర్ ఉన్నా, ఇలా మెరిసి అలా వెళ్లిపోతారు. ఇంకా చెప్పాలంటే ఆ చిత్ర కథకు నిత్యామీనన్ పాత్రే ప్రధాన బలం, చిత్రం విడుదలైన తరువాత ఆమెకు అంత మంచి పేరు వచ్చింది కూడా. దీంతో అవకాశాలు నిత్యామీనన్ తలుపులను తడుముతున్నాయి. అయితే ఆమె దర్శక నిర్మాతలకు కలిసే అవకాశం కూడా ఇవ్వడం లేదనే టాక్ కోలీవుడ్‌లో వైరల్ అవుతోంది. అసలు కారణం ఏమిటని ఆరా తీస్తే నిత్యామీనన్ తన కాల్షీట్స్ అన్ని ఒక ప్రముఖ బాలీవుడ్ సంస్థ చేతిలో పెట్టిందని తెలిసింది. నిత్యామీనన్ కాల్షీట్స్ కోసం ఆ సంస్థను కలవడం అంత సులభం కాదనే మాట వినిపిస్తోంది. దీంతో నిత్యామీనన్ అసలు ఎందుకిలా చేసింది అనే ప్రశ్న తలెత్తుతోంది. నిత్య ఎందుకిలా చేసింది? -
ఓటీటీలోకి ధనుష్ తిరు మూవీ! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘తిరుచిట్రంపళం’(తెలుగులో తిరు). నిత్యామీనన్, రాశిఖన్నా, ప్రియా భవానీ శంకర్ హీరోయన్లుగా నటించిన ఈ సినిమాలో దర్శకుడు భారతీరాజా, ప్రకాష్‌రాజ్, నటి రేవతి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం, ఓం ప్రకాష్ ఛాయాగ్రహణం అందించారు. మిత్రన్ ఆర్.జవహర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 18న విడుదలై హిట్‌టాక్ అందుకుంది. ఇప్పటికీ థియేటర్లో సందడి చేస్తున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. చదవండి: కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న తారక్ భార్య, ఫొటోలు వైరల్ కేవలం తమిళంలోనే కాదు తెలుగులో ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌తో పాటు సన్‌నెక్ట్స్ వారు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో మంచి కలెక్షన్స్ రాబడుతున్న తరుణంలో ఓటీటీలోకి నెల రోజుల్లోనే రాబోతుందని వినికిడి. అంటే ఈ తాజా బజ్ ప్రకారం.. తిరుచిట్రంపళం(తిరు) సెప్టెంబర్ 17 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చదవండి: ‘జల్సా’ రీ-రిలీజ్, థియేటర్లో మెగా హీరో రచ్చ.. వీడియో వైరల్ Box Office Alert!#Dhanush, #NithyaMenen's film #Thiruchitrabalam zooms past Rs 100 crore mark Worldwide 🌐 🔥🔥 pic.twitter.com/McOAWvxxRJ — Hello South (@Hellosouth_in) September 1, 2022 -
ఇండస్ట్రీలో నాకు చాలామంది శత్రువులు ఉన్నారు: నిత్యామీనన్
తమిళసినిమా: తనకు శత్రువులు ఉన్నారు.. అని అంటున్నారు నటి నిత్యామీనన్. ఈ మాలీవుడ్ నటి టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తూ తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను అందుకోలేకపోయినా, ఎలాంటి పాత్రనైనా చేయగల సత్తా ఉన్న నటి అని పేరు తెచ్చుకున్నారు. అదే విధంగా పొగరుబోతు అనే ముద్ర కూడా వేసుకున్నారు. మణిరత్నం దర్శకత్వంలో నటించిన ఓకే కణ్మణి చిత్రం సక్సెస్ తరువాత ఆయన దర్శకత్వంలోనే మరో చిత్రంలో నటించే అవకాశం వస్తే దాన్ని తిరస్కరించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అదే విధంగా ఒక మలయాళ చిత్ర షూటింగ్లో ఉన్న నిత్యామీనన్‌ను కలవడానికి ఒక నిర్మాత రాగా ఆయన్ని కలవడానికి నిరాకరించిందనే ఘటన అప్పట్లో కలకలం రేకెత్తించింది. ఇక ఈ మధ్య నటి నిత్యామీనన్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఒక వ్యక్తి రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. అంతే కాదు మలయాళ చిత్ర పరిశ్రమ ఒక దశలో నిత్యామీనన్‌పై రెడ్ కార్డు విధించాలనే వరకూ వచ్చింది. ఇలాంటి వివాదాస్పద ఘటనలు నిత్యామీనన్ జీవితంలో చాలానే ఉన్నాయి. కాగా చాలా కాలం తరువాత ఈ సంచలన నటి కోలీవుడ్‌లో ధనుష్‌కు జంటగా నటించిన తిరుచిట్రంఫలం చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా సాగుతోంది. ఈ సందర్భంగా ఒక భేటీలో నటి నిత్యామీనన్ పలు విషయాల గురించి మనసు విప్పి చెప్పారు. అందులో ముఖ్యంగా తనపై జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ తనకు చాలా మంది శత్రువులు ఉన్నారని అన్నారు. మనం ఎదుగుతున్నప్పుడు గిట్టని వాళ్లు చాలా మంది కాళ్లు పట్టుకుని కిందకు లాగాలని భావిస్తారని అన్నారు. వాళ్ల మాట వినకపోతే వదంతులు ప్రచారం చేయడానికీ వెనుకాడరన్నారు. నిత్యామీనన్‌తో పని చేయడం చాలా కష్టం అంటారని, అయితే తాను చాలా మందితో కలిసి పని చేశానని, ఎవరూ అలా భావించలేదని అన్నారు. కారణం తాను ఎలాంటి వ్యక్తినో వారందరికీ తెలుసని స్పష్టం చేశారు. -
ఇండస్ట్రీలో అలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నా : నిత్యామీనన్
హీరోయిన్ నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ పెళ్లి వార్తలపై గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీటిపై ఆమె క్లారిటీ ఇచ్చినా రూమర్స్ మాత్రం ఆగడం లేదు. తాజాగా దీనిపై స్పందించిన నిత్యామీనన్ తన పెళ్లి గురించి వస్తోన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చేసింది. చదవండి: కవల పిల్లలకు జన్మనిచ్చిన హీరోయిన్ నమిత.. 'కాలు బాలేక రెస్ట్ తీసుకుంటే.. పెళ్లి చేసుకుంటుంది కాబట్టే కథలు వినట్లేదు అని రూమర్స్ పుట్టించారు' అని తెలిపింది. మరి పెళ్లి చేసుకోమని దుల్కర్ మీకు సూచించారట కదా అని అడగ్గా..'తను నాకు మంచి ఫ్రెండ్. అందుకే పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో సంతోషంగా ఉండమని నాకు చెబుతుంటాడు. ప్రస్తుతానికి నాకు పెళ్లి ఆలోచన లేదు కానీ భవిష్యత్తులో చేసుకుంటానేమో తెలీదు' అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇటీవలి కాలంలో తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందిస్తూ..నేను ఇండస్ట్రీలో ఎప్పుడూ ఎదుర్కొనే ఇబ్బంది ఏంటంటే..''నన్ను ఇండస్ట్రీ బ్యాన్ చేసిందనే వార్తలు పుట్టించారు. కావాలనే తప్పుగా ప్రచారం చేశారు. మనం మంచి స్థాయిలో ఉన్నప్పుడు మనల్ని కిందకి లాగాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. అందరి గురించి నేను ఆలోచిస్తూ పోతే నా పనులు చేసుకోవడానికి సమయం దొరకదు’’ అన్నారు.చదవండి: అందుకే నిత్యామీనన్‌ను వద్దనుకున్నారా? రివీల్ చేసిన నిర్మాత -
Thiru Review: ‘తిరు’మూవీ రివ్యూ
టైటిల్ : తిరు నటీనటులు : ధనుష్, నిత్యామీనన్, ప్రియా భవానీ శంకర్, రాశీఖన్నా, ప్రకాశ్ రాజ్, భారతీ రాజా తదితరులు నిర్మాణ సంస్థ : సన్ పిక్చర్స్ నిర్మాతలు: కళానిధి మారన్ దర్శకత్వం: మిత్రన్ ఆర్. జవహర్ సంగీతం : అనిరుధ్ రవిచందర్ సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాశ్ విడుదల తేది: ఆగస్ట్ 18, 2022 తమిళ స్టార్ హీరో ధనుష్‌కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఆయన నటించిన తమిళ సినిమాలు చాలా వరకు తెలుగులో డబ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా ధనుష్ లేటెస్ట్ తమిళ్ మూవీ ‘తిరు చిత్రాంబళం’ కూడా తెలుగులో ‘తిరు’ పేరుతో విడుదలైంది. ఎలాంటి ప్రచారం లేకుండా ఈ గురువారం(ఆగస్ట్ 18) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘తిరు’ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. తిరు ఏకాంబరం అలియాస్ పండు(ధనుష్) ఓ మధ్య తరగతి యువకుడు. ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ తండ్రి(ప్రకాశ్ రాజ్), తాత సినియర్ తిరు(భారతీ రాజా)లతో కలిసి జీవిస్తుంటాడు. తన జీవితంలో జరిగిన ఓ సంఘటన కారణంగా తండ్రిపై ద్వేషం పెంచుకొని, అతనితో మాట్లాడడమే మానేస్తాడు. అంతేకాదు ఆ సంఘటన కారణంగానే చదువుని మధ్యలో ఆపేసి, భయస్తుడిగా మారిపోతాడు. అతని క్లోజ్ ఫ్రెండ్ శోభన(నిత్యామీనన్). తిరు ఉండే అపార్ట్మెంట్ కిందే శోభన ఫ్యామిలీ ఉంటుంది. ఆమెతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటాడు. శోభన కూడా అని విషయాల్లోనూ తిరుకు తోడుగా ఉంటుంది. తిరు మనసుపడ్డ అమ్మాయిలు అనూష(రాశీఖన్నా), రంజని(ప్రియా భవానీ శంకర్) విషయంలోనూ శోభన సాయం చేస్తుంది. చివరకు తిరు ప్రేమని ఎవరు అంగీకరించారు? ఆయన జీవితంలో జరిగిన సంఘటన ఏంటి? ఎందుకు తండ్రితో మాట్లాడకుండా ఉన్నాడు? తిరులో ఉన్న భయాన్ని ఎలా అధిగమిస్తాడు? తదితర విషయాలు తెలియాలంటే థియేటర్స్‌లో ‘తిరు’సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే... కుటుంబ అనుభంధాలు, స్నేహం, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘తిరు’. ఈ తరహా కథలు తెలుగు, తమిళ ప్రేక్షకులకు కొత్తేమి కాదు. కానీ కథనాన్నే నేచురల్ సీన్స్‌తో ఆసక్తికరంగా నడిపించడం ‘తిరు’ స్పెషల్. కథ ప్రారంభం, తిరు నేపథ్యం ధనుష్ గతంలో నటించిన ‘రఘువరన్ బి.టెక్’సినిమాను గుర్తు చేస్తుంది. నేపథ్య సంగీతం కూడా అలానే ఉంటుంది. ఇక తిరు, శోభన మధ్య సాగే స్నేహం, ప్రేమ తదితర సీన్స్ ‘నువ్వే కావాలి’సినిమా తరహాలో ఉంటాయి. పండు, శోభన పాత్రలు మాత్రం మనలో ఒకరిగా వ్యవహరిస్తాయి. అంత సహజంగా ఆ పాత్రలను తీర్చి దిద్దాడు దర్శకుడు మిత్రన్ ఆర్. జవహర్. తిరు, శోభనల మధ్య వచ్చే కొన్ని సీన్స్ నవ్వులు పూయిస్తాయి. తిరు అనూషని ప్రేమించడం, ఆ విషయంలో శోభన సాయం చేడయం తదితర రొటీన్ సీన్స్‌తో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ఫ్యామిలీ డ్రామా సీన్స్ ఆకట్టుకుంటాయి. అయితే ఆ సన్నివేశాలు మాత్రం సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేవు. అంతేకాదు సెకండాఫ్‌లో కథ ఎలా సాగుతుందనేది కూడా ప్రేక్షకుడు ఊహించవచ్చు. అయితే పల్లెటూరి నేపథ్యంలో వచ్చే కొన్ని సీన్స్ కామెడీని పండిస్తాయి. ఇక హీరో తండ్రిని ఎందుకు ద్వేషిస్తున్నాడో చెప్పే ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోవు. క్లైమాక్స్ కూడా సింపుల్ ఉంటుంది. మనం చేసే ఒక చిన్న తప్పు జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది తెరపై చూపించిన తీరు బాగుంది. తెలుగులో ధనుష్‌కి మంచి మార్కెట్ ఉన్నప్పటికీ.. ఇక్కడ ఈ సినిమా ప్రమోషన్స్ చేయపోవడం పెద్ద మైనస్. చాలా మందికి తెలుగులో ‘తిరు’సినిమా విడుదలైన విషయమే తెలియదు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమా మొత్తం ధనుష్, నితామీనన్ పాత్రల చుట్టే తిరుగుతుంది. ఈ సినిమాకు వారే ప్రధాన బలం. తమదైన సహజ నటనతో ఇద్దరు ఆకట్టుకున్నారు. ప్రతి సీన్లో ఇద్దరు పోటాపోటీగా నటించారు. ఒకనొక దశలో ధనుష్‌ని డామినేట్ చేసేలా నిత్యా యాక్టింగ్ ఉంటుంది. ఇద్దరు కూడా తమ తమ పాత్రల్లో నటించడం కంటే జీవించేశారని చెప్పొచ్చు. ప్రకాశ్ రాజ్ తన పాత్రకు న్యాయం చేశాడు. కానీ ఆయన పాత్రకు వేరే వ్యక్తితో డబ్బింగ్ చెప్పించడం పెద్ద మైనస్. ఇక ఇక్కడ భారతీ రాజా పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సీనయర్ పండు పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. రాశీఖన్నా,ప్రియా భవానీ శంకర్ తదితరులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. అనిరుధ్ సంగీతం జస్ట్ ఓకే. గత సినిమాలో పోలిస్తే..ఇందులో పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా సింపుల్‌గా ఉంటుంది. ఓంప్రకాశ్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
అందుకే నిత్యామీనన్‌ను వద్దనుకున్నారా? రివీల్ చేసిన నిర్మాత
దివంగత నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమానే కీర్తికి స్టార్ హీరోయిన్ అన్న ఇమేజ్ను తీసుకొచ్చింది. ఓవర్ నైట్ స్టార్డమ్తో కీర్తి కెరీర్లో ది బెస్ట్ మూవీగా నిలిచిందీ సినిమా. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ అవార్డు కూడా దక్కింది. అయితే ఈ ప్రాజెక్ట్ కీర్తి సురేష్‌కి ముందు వేరే హీరోయిన్ దగ్గరికి వెళ్లిందట. ఈ విషయాన్ని స్వయంగా వైజయంతీ మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ వెల్లడించారు. ఓ ప్రముఖ షోలో పాల్గొన్న ఆయన మహానటి ప్రాజెక్టుకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ సినిమాకు కీర్తికి ముందు ఓ మలయాళ నటిని అనుకున్నాం. కానీ కథ చెప్పాక అందులో మద్యం తాగే సన్నివేశాలు ఉంటే నేను చేయను అంటూ కండిషన్స్ పెట్టింది. దీంతో ఆమెను తీసుకోవడానికి వీల్లేదు అని నేనే డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కు చెప్పాను. కట్ చేస్తే కీర్తి సురేష్ చేతుల్లోకి ఈ సినిమా వెళ్లింది అంటూ చెప్పుకొచ్చారు. ఆ హీరోయిన్ పేరు చెప్పడానికి మాత్రం ఆయన ఇష్టపడలేదు.అయితే మహానటి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడే మలయాళ హీరోయిన్ నిత్యామీనన్ పేరు తెరపైకి వచ్చింది. అంతేకాకుండా సావిత్రి పాత్రలో ఆమె ఫోటోలు కూడా కొన్ని బయటికొచ్చాయి. ఏది ఏమైనా నిత్యామీనన్ ఓ మంచి సినిమాను దూరం చేసుకుందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. -
నిత్యామీనన్‌ను చచ్చినా పెళ్లి చేసుకోను : సంతోష్ వర్కీ
ప్రేమిస్తున్నానంటూ సంతోష్ వర్కీ అనే వ్యక్తి తనను ఆరేళ్ల నుంచి వేధిస్తున్నాడని హీరోయిన్ నిత్యామీనన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన పెళ్లిపై జరిగిన ప్రచారంపై ఆమె స్పందించింది. సంతోష్ వర్కీ తనకు 30కి పైగా నంబర్స్ నుంచి కాల్ చేస్తూ విసిగించేవాడని పేర్కొంది. తాజాగా తనపై నిత్యామీనన్ చేస్తున్న ఆరోపణలపై సంతోష్ వర్కీ స్పందించాడు. ఇందులో వాస్తవం లేదని, ఒకే వ్యక్తి పేరు మీద ఎన్ని సిమ్‌కార్డులు కొనగలడో జనాలకే వదిలేస్తున్నాడని చెప్పాడు. నిత్యామీనన్‌కు వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందని వాళ్ల తల్లి చెబితే, జరగలేదని తండ్రి చెప్పారు. అంతేకాకుండా వాళ్లు నాపై లైంగిక వేధింపుల కేసు కూడా పెట్టాలని చూస్తున్నారు. 'గతంలో నిత్యామీనన్ అంటే తనకు ఇష్టం ఉండేది. తనను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా. కానీ ఇప్పుడు చచ్చినా ఆమెను పెళ్లిచేసుకోను. అసలు నిత్యామీనన్ గురించి ఇవన్నీ ముందే తెలిస్తే ప్రేమించి ఉండే వాడినే కాదు'. అంటూ కామెంట్స్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు అసలు నువ్వు నిత్యామీనన్‌ను రిజెక్ట్ చేయడమేంటి?నీకంత సీన్ ఉందా? అంటూ హీరోయిన్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఎవరీ సంతోష్ వర్కీ? నిత్యామీనన్ పెళ్లి వార్తలతో ఒక్కసారిగా పాపులర్ అయిన సంతోష్ వర్కీ ఓ యూట్యూబర్. సినిమాల రివ్యూస్ చెప్పడంలో మలయాళంలో గుర్తింపు పొందాడు. చదవండి: ఆ వ్యక్తి ఆరేళ్లుగా వేధించాడు.. నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్ -
ఇక యాక్టింగ్‌కి బ్రేక్.. అందుకే అంటున్న స్టార్ హీరోయిన్
'అలా మొదలైంది' సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ నిత్యా మీనన్. ఇక్కడ ఆమె చేసినవి కొన్ని సినిమాలే అయినా తనదైన నటన, అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొంతకాలంగా ఆమె తమిళం, మలయాళం చిత్రాలతో బిజీ ఆయిపోయింది. దీంతో కొంతకాలం తెలుగులో కనిపించని నిత్యా ఇటీవల భీమ్లా నాయక్ చిత్రంతో పాటు ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’ అలరించింది. అంవతేకాదు ప్రముఖ సింగింగ్ షోకు జడ్జీగా వ్యవహిరించింది. చదవండి: చివరిగా ఎప్పుడు బెడ్ షేర్ చేసుకున్నావ్.. నీళ్లు నమిలిన విజయ్ ఈ క్రమంలో ఆమె తెలుగులో మరిన్ని సినిమాలు చేస్తుందని ఆశించిన ఫ్యాన్స్‌కు తాజాగా షాకిచ్చింది ఆమె. ఇక తాను సినిమాలకు, నటనకు బ్రేక్ తీసుకుంటున్నానంటూ చెప్పుకొచ్చంది. కాగా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ ముచ్చటించిన నిత్యా ఈ సందర్భంగా తాను యాక్టింగ్ బ్రేక్ తీసుకుంటున్నాని తెలిపింది. అయితే ఇది తాత్కాలికం వరకే అని కూడా స్పష్టం చేసింది. ఏడాదిగా సినిమా, వెబ్ సిరీస్‌లు, షోలో క్షణం తీరిక లేకుండా ఉన్నానని, ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. అయితే ఈ బ్రేక్ పెళ్లి కోసం కాదని కూడా క్లారిటీ ఇచ్చింది. చదవండి: నయన్‌ను కించపరిచిన ప్రముఖ నిర్మాత.. ఏకిపారేస్తున్న ఫ్యాన్స్ అంతేకాదు ఈ సందర్భంగా తన పెళ్లి పుకార్లను కూడా ఖండించింది. కాగా ఇప్పటి వరకు దూరంగా ఉన్న నిత్యా.. ఇటీవల తన పెళ్లంటూ వార్తలు గుప్పమన్నాయి. ప్రముఖ మలయాళ స్టార్ యాక్టర్‌తో తన పెళ్లంటూ ఇటీవల రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే 24 గంటల్లోనే తన పెళ్లి పుకార్లకు చెక్ పెట్టింది ఆమె. ప్రస్తుతం తాను కెరీర్‌పైనే ఫోకస్ పెట్టానని, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం నిత్యా.. తను కమిట్ అయిన సినిమాల షూటింగ్స్‌ను పూర్తి చేసి బ్రేక్ తీసుకుంది. తన సినిమాలన్ని వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) -
పెళ్లి వార్తలపై స్పందించిన నిత్యా మీనన్
తన పెళ్లి వార్తలపై నిత్యా మీనన్ స్పందించింది. తాజాగా ఓ మలయాళ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో తన పెళ్లంటూ వస్తున్న వార్తలపై ఆమెకు ప్రశ్న ఎదురైంది. దీనిపై నిత్యా స్పందిస్తూ.. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘నిన్నటి నుంచి నా పెళ్లి అంటూ తెగ వార్తలు వస్తున్నాయి. అసలు అందులో ఏమాత్రం నిజం లేదు. ఇలాంటి పుకార్లు ఎలా సృష్టిస్తారో అర్థం కావడం లేదని’ స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను పూర్తిగా కెరీర్‌పైనే దృష్టి పెట్టానని, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని పేర్కొంది. చదవండి: ఆయన కోసమే నగ్నంగా నటించా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ కాగా నిత్యా మీనన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందని, మాలీవుడ్ స్టార్ యాక్టర్‌తో ఆమె ఏడడుగులు వేయబోతుందంటూ నిన్నటి నుంచి పలు మలయాళ వెబ్‌సైట్స్, యూట్యూబ్ చానల్లో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం నిత్యా మీనన్ వెబ్ సిరీస్, సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల భీమ్లా నాయక్‌తో అలరించిన ఆమె తాజాగా మోడ్రన్ లవ్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైంలో స్ట్రీమింగ్ అవుతోంది. వీటితో పాటు తాజాగా ఆమె నటించి మలయాళ చిత్రం 19(1)(a) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలకు రెడీ అవుతోంది. త్వరలోనే దీని రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. తమిళంలో హీరో ధనుష్‌తో నటించిన ‘చిరు చిత్రంబళం’ త్వరలో విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఆమె మరో చిత్రం ‘ఆరం తిరుకల్పన’ ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. -
త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న నిత్యా మీనన్?
'అలా మొదలైంది' సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ నిత్యా మీనన్. ఇక్కడ ఆమె చేసినవి కొన్ని సినిమాలే అయినా తనదైన నటన, అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఏ భాషలో నటించిన తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుందామె. అంతేకాదు పలు సినిమాల్లో పాటలు కూడా పాడింది. తన మల్టీ టాలెంట్‌తో పరిశ్రమలో తనకంటూ ప్రత్యక స్థానం సంపాదించుకుంది ఈ బ్యూటీ. బాల నటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన నిత్యాపై ఇప్పటి వరకు ఎలాంటి రూమర్లు వినిపించలేదు. చదవండి: Actress Kalayani Divorce: ఆ భయంతోనే కల్యాణి విడాకులు అడిగింది..: సూర్య కిరణ్ హీరోయిన్ అంటే ఆ హీరోతో డేటింగ్ అని, ఈ నటుడితో సహాజీవనం వంటి వార్తలు వినిపించడం సర్వాసాధారణం. కానీ తనపై ఒక్క పుకారు కూడా రాకుండా ఇండస్ట్రీలో రాణించడమంటే అది కొద్ది మందికే సాధ్యమవుతుంది. అందులో నిత్యా ఒకరని చెప్పాలి. ఇదిలా ఉంటే తాజాగా నిత్యా పెళ్లికి సంబంధించి రకరకాల పుకార్లు ప్రస్తుతం నెట్టిం చక్కర్లు కొడుతున్నాయి. మూడు పదుల వయసులో ఉన్న నిత్యా మీనన్ ప్రస్తుతం పెళ్లి రెడీ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆమె పెళ్లి చేసుకోబోయేది చిత్ర పరిశ్రమలోని వ్యక్తే నని, అతడు ఓ స్టార్ యాక్టర్ అని వినికిడి. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. సదరు హీరోకు, నిత్యాకు కొంతకాలంగా మంచి సాన్నిహిత్యం ఉందని, త్వరలోనే అతడితో ఏడడుగులు వేయబోతుందంటూ మలయాళ వెబ్సైట్లలో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు. కాగా ఇటీవల భీమ్లానాయక్ చిత్రంతో అలరించిన నిత్యా మీనన్ రీసెంట్గా ‘మోడ్రన్ లవ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అమెజాన్ ప్రైం వీడియోస్‌లో జూలై 8న విడుదలై ఈ సిరీస్ పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ఇందులో తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది నిత్యా. -
యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన నిత్యా మీనన్
'అలా మొదలైంది' సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన మలయాళ ముద్దుగుమ్మ నిత్యా మీనన్. చేసినవి కొన్ని సినిమాలే అయినా అందం, నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న నిత్యా మీనన్ రీసెంట్గా భీమ్లా నాయక్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓ షోకు జడ్జిగానూ వ్యవహరిస్తోంది. ఇప్పుడీ మల్టీ ట్యాలెంటెడ్ హీరోయిన్ తాజాగా సొంతంగా యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది. నిత్య అన్ఫిల్టర్డ్’(Nithya Unfiltered)పేరుతో యూట్యూబ్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. తన 12ఏళ్ల సినీ కెరీర్‌కి సంబంధించిన విషయాలను ఫస్ట్ వీడియోలో షేర్ చేస్తూ తన వ్యక్తిగత,వృత్తిపరమైన జీవిత విశేషాలపై మరిన్ని వీడియోలతో త్వరలోనే మీ ముందుకు రాబోతున్నానంటూ పేర్కొంది. ఇక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన కాసేపటికే వేలమంది ఫాలోవర్లు వచ్చి చేరారు. -
‘గమనం’మూవీ రివ్యూ
టైటిల్ : గమనం నటీనటులు : శ్రియ సరన్, నిత్యామీనన్, ప్రియాంక జవాల్కర్ , శివ కందుకూరి, బిత్తిరి సత్తి తదితరులు నిర్మాణ సంస్థ: క్రియా ఫిలిం కార్పొరేషన్, కాళీ ప్రొడక్షన్స్ నిర్మాత : రమేష్ కరుటూరి, వెంకీ పుషడపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ దర్శకత్వం: సుజనా రావు సంగీతం : ఇళయరాజా సినిమాటోగ్రఫీ : జ్ఞానశేఖర్ వి.ఎస్ విడుదల తేది : డిసెంబర్ 10, 2021 ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించిన శ్రియ సరన్.. చాలా రోజులుగా సినిమాలకు గ్యాప్ ఇస్తూ వస్తోంది. కెరీర్‌ని పక్కన పెట్టి పెళ్లి, పిల్లలు.. ఇలా వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తుంది. చాలా గ్యాప్ తర్వాత ఆమె ‘గమనం’అనే విభిన్న చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(డిసెంబర్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గమనం’మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘గమనం’కథేంటంటే..? సామాజికంగా వెనుకబడిన ముగ్గురి జీవితాల చుట్టూ తిరిగే కథే ‘గమనం’. ఇది హైదరాబాద్ మహానగరంలో మూడు ఏరియాల్లో జరిగే కథ. కలమ(శ్రియ సరన్) ఓ దివ్యంగురాలు. వినికిడి లోపంతో బాధపడుతుంది. ఆమెకు ఓ చిన్న పాప ఉంటుంది. తనకు వినికిడి లోపం ఉందని... భర్త కూడా వదిలేస్తాడు. దాంతో నిస్సహాయురాలిగా ఓ బస్తీలో జీవిస్తూ ఉంటుంది. టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. మరోవైపు అలీ(శివ కందుకూరి) తల్లిదండ్రులను కోల్పోయి.. తాత, నానమ్మలతో కలిసి ఉంటాడు. క్రికెటర్‌గా రాణించాలని, పట్టుదలతో ప్రాక్టీసు చేస్తుంటాడు. అతన్ని ఇంటిపక్కనే ఉండే జరా(ప్రియాంక జవాల్కర్) ప్రేమిస్తుంది. ముస్లిం కుటుంబానికి చెందిన వీరిద్దరి ప్రేమను పెద్దలు ఒప్పుకోరు. దీంతో జరా అలీ కోసం ఇంట్లో నుంచి పారిపోయి వస్తుంది. ఇంకోవైపు బస్తీలోని ఓ మురికి కాలువ పక్కన ఉండే ఇద్దరు వీధి బాలురు.. చిత్తు కాగితాలు ఏరుకొని జీవనం సాగిస్తుంటారు. వీరిలో ఒకరికి తన పుట్టిన రోజు వేడుకని జరుపుకోవాలని కోరిక పుడుతుంది. కేక్ కోసం డబ్బును జమ చేయాలని డిసైడ్ అవుతారు. చిత్తు కాగితాలు అమ్ముకోగా కొద్దిగా డబ్బు వస్తుంది. అది సరిపోవడం లేదని మట్టి వినాయకుల విగ్రహాలను అమ్మడం స్టార్ట్ చేస్తారు. ఇలా ఈ మూడు పాత్రలు నగరంలో కురిసిన భారీ వర్షాలకు వరదల్లో చిక్కుకుంటారు. ఆ వరదల్లో నుంచి వీళ్ళు ఎలా బయట పడ్డారు? భారీ వర్షాల కారణంగా కమల జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అలీ క్రికెటర్ అయ్యాడా లేదా? అలీ, జరా పెళ్లి జరిగిందా? కేక్ కట్ చేసి గ్రాండ్‌గా పుట్టిన రోజు వేడుకను సెలెబ్రేట్ చేసుకోవాలనే వీధి బాలుర ఆశయం నెరవేరిందా? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే? వినికిడి లోపం ఉన్న దివ్యాంగురాలు కమల పాత్రలో శ్రియ ఒదిగిపోయింది. ఇప్పటి వరకు తన గ్లామర్ తోనే ఆడియన్స్ ని అలరించిన శ్రియా.. ఈ మూవీతో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో చాలా బాగా నటించింది. క్రికెటర్ అవ్వాలని ఆశ పడే ముస్లిం యువకుడు అలీ పాత్రలో శివ కందుకూరి మెప్పించాడు. క్లైమాక్స్‌లో వరదల్లో చిక్కుకున్న చిన్నారులను కాపాడే సీన్స్ లో ఆకట్టుకున్నాడు. అలీని గాఢంగా ప్రేమించే ముస్లిం యువతి జరాగా ప్రియాంక జవాల్కర్ మెప్పించింది. వీధి బాలురుగా నటించిన ఇద్దరు చిన్నారులు అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. రోడ్డు మీద బొమ్మలు అమ్ముకునే పాత్రలో బిత్తిరి సత్తి, అతిథి పాత్రలో నిత్యామీనన్‌లతో పాటు మిగిలిన నటీ, నటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? ఆశయాలు, ఆశలు, ప్రేమ, పేదరికం, ఆకలి, మోసం, పరువు ఇలా మనిషిలోని అనేక భావోద్వేగాల సమాహారమే ‘గమనం’. మూడు భిన్న నేపధ్యాలను ఒక కథగా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకురాలు సుజనా రావు. భర్త చేతిలో మోసపోయి... నిరాదరణకు గురైన ఓ దివ్యంగురాలు... ఆటతోనే తన కెరీర్ ను ఉన్నత శిఖరాలకు చేర్చుకోవాలనే ఓ పట్టుదల ఉన్న యువకుడు.. పేదరికంలో మగ్గిపోయే ఇద్దరు వీధి బాలలు.. ఈ ముగ్గురి చుట్టే కథంతా తిరుగుతుంది. తొలి ప్రయత్నంగానే ఇలాంటి కథ ప్రేక్షకులను అందించాలనే దర్శకురాలి ఆలోచనను మనం అభినందించాల్సిందే. అయితే ఆమె ఎంచుకున్న మూల కథ బాగున్నా.. దాన్ని తెరపై చూపించడంలో మాత్రం కాస్త తడబడ్డారు. కొన్ని సన్నివేశాల్లో అనుభవ లేమి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ హైదరాబాద్ లాంటి మహానగరంలో పేదల జీవితాలు ఎలా ఉంటాయో కళ్ళకు కట్టినట్లు చూపించారు. అలాగే భారీ వర్షాలు వస్తే బస్తీల్లో పేదల బతుకు ఎలా ఛిద్రం అవుతుందో బాగా చూపించారు. స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా లేకపోవడం, కథంతా నెమ్మదిగా సాగడం సినిమాకు మైనస్. ఇళయారాజా నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్. ఈ మూవీలో ఒకటే సిట్యువేషనల్ సాంగ్ ఉంది. అది పర్వాలేదు. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు సినిమాకి తగినట్లుగా ఉన్నాయి. ఈ సినిమాకు ప్రశంసలు ఉంటాయి కానీ కమర్షియల్‌గా విజయం సాధించడం కష్టమనే చెప్పాలి. -
నిత్య మీనన్ స్మైలీ ఫోటోస్
-
భీమ్లా నాయక్: కొత్త స్టిల్ అదిరిందిగా!
సాక్షి, హైదరాబాద్: మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘భీమ్లా నాయక్’ కు సంబంధించి ఒక ఫోటో వైరలవుతోంది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం షూటింగ్ తరువాత పవన్, రానా ఫోటోను ‘అన్‌వైండింగ్ ఆఫ్ ది కెమెరా’ అంటూ చిత్ర యూనిట్ ఫ్యాన్స్ కోసం విడుదల చేసింది. ఛాతీ మీద గాయంతో నులకమంచం మీద పవన్ పడుకుని ఉంటే.. రఫ్ లుక్‌లో రానా ఎడ్లబండి మీద వయ్యారంగా పడుకున్న స్టిల్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. పవర్ వెర్సెస్ బీస్ట్ అని కమెంట్ చేస్తున్నారు. అలసిపోయి, షూటింగ్ దుస్తుల్లోనే అలా సేద తీరుతున్న దృశ్యాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. సినిమా క్లైమాక్స్ చిత్రీకరణలో భాగంగా ఈ ఫోటోను క్లిక్ చేస్తున్నట్టు ఫ్యాన్స్ భావిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో వచ్చే ఏడాది సంక్రాంతికి రానున్న 'భీమ్లా నాయక్' సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపుదిద్దు కుంటోంది. పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. కాగా ఈ సినిమా టైటిల్ సాంగ్,టీజర్‌కు భారీ క్రేజ్ రాగా, ఇక నిత్యమీనన్ 'అంత ఇష్టం ఏందయ్యా' అంటూ సాగే సెకండ్ సాంగ్ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీకి స్క్రీన్ ప్లే త్రివిక్రమ్, నిర్మాత నాగ వంశి. పవన్ జోడీగా నిత్యా, రానాకి భార్యగా నటి సంయుక్త మీనన్ కనిపించనున్నారు. Unwinding off the camera #BheemlaNayak & #DanielShekar ♥️💥@pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @dop007 @NavinNooli @vamsi84 @adityamusic pic.twitter.com/JfPeOq21ai — Sithara Entertainments (@SitharaEnts) October 21, 2021 -
పవన్ కల్యాణ్ భార్యగా నిత్యామీనన్! పోస్టర్ రిలీజ్
పవన్‌కల్యాణ్ రానా ప్రధాన పాత్రల్లో 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ అందిస్తుండగా, సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిని నిజం చేస్తూ.. 'నిత్యామీనన్ అబోర్డ్' అంటూ చిత్రబృందం పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో నిత్యామీనన్ చీరకట్టు, మంగళసూత్రంతో కనిపించడంతో ఆమె పవన్‌కు భార్యగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఇక పవన్‌కల్యాణ్ ఈ సినిమాలో భీమ్లా నాయక్‌గా కనిపించనున్నారు. మరోవైపు రానాకు జోడీగా ఐశ్వర్య రాజేశ్ నటించనుందని, త్వరలోనే ఆమె షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 12గా ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో సముద్రఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. We are extremely delighted to welcome an exceptional & proficient talent @menennithya on board for our #ProductionNo12 ⭐#BheemlaNayak Power Star @PawanKalyan @RanaDaggubati #Trivikram @MusicThaman @saagar_chandrak @dop007 @vamsi84 @NavinNooli pic.twitter.com/xxfRx8znFZ — Sithara Entertainments (@SitharaEnts) July 30, 2021 -
1979 లోభూమి నాశనం అవుతుందన్నారు..అసలేం జరిగిందంటే..
సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘స్కైలాబ్’. విశ్వక్ కందెరావ్ దర్శకత్వంలో డా. రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ పతాకాలపై పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను హీరోయిన్ తమన్నా విడుదల చేశారు. ‘‘1979లో సాగే పీరియాడికల్ మూవీ ఇది. అమెరికా స్పేస్ స్టేషన్ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేషన్ స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని అప్పట్లో వార్తలు రావడంతో అసలేం జరగబోతుందోనని అందరూ ఎదురుచూశారు. ఆ సమయంలో కరీంనగర్ జిల్లా బండ లింగపల్లిలో ఉండే గౌరి, ఆనంద్, రామారావుల జీవితాల్లో స్కైలాబ్ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాలను వినోదాత్మకంగా చూపిస్తున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సహనిర్మాత: నిత్యామీనన్, కెమెరా: ఆదిత్య జవ్వాది, సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి. -
పవన్‌తో జోడీ: సాయి పల్లవికి బదులు నిత్యా మీనన్?!
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న మలయాళ చిత్రం రీమేక్ ‘అయ్యప్పనమ్ కోషియం’కు ఎట్టకేలకు హీరోయిన్ కుదిరింది. ఈ చిత్రానికి నిత్యామీనన్‌ను ఎంపిక చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మేకర్స్ మొదట సాయి పల్లవిని అనుకున్నా తన డేట్స్ కుదరక పోవడంతో సెట్ కాలేదు. తరువాత వారు నిత్యా మీనన్‌ను అడగ్గా , ఆమె ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిత్యా సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ తన డేట్స్ సర్దుబాటు , అగ్రిమెంట్ మీద సంతకం లాంటి పనులు ఇంకా పూర్తి చేయాల్సి ఉంది, కనుక దీని పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతా అనుకున్నట్లు జరిగి ఈ చిత్రంలో నిత్య నటిస్తే ఆమెకు టాలీవుడ్లో ఇది ఒక పెద్ద కంబ్యాక్ చిత్రం అని చెప్పచ్చు. ఎందుకంటే తను తెలుగులో సన్ ఆఫ్ సత్యమూర్తి (2015) తరువాత పెద్ద చిత్రాలకు సంతకం చేయలేదు. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లో నటిస్తూ బిజీగా ఉంది. కాగా సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న అయ్యప్పనమ్ కోషియమ్ రీమేక్‌లో హీరో రానా నటిస్తుండగా, ఆమె సరసన కోలివుడ్ నటి ఐశ్వర్య రాజేష్‌ను మరో హీరోయిన్గా ఎంపిక చేశారు. ( చదవండి : దర్శకుడిగా మారిన మోహన్ లాల్ ) -
అలా మొదలైంది అంత హిట్టవ్వాలి
అశోక్ సెల్వన్ హీరోగా, నిత్యామీనన్, రీతూవర్మ హీరోయిన్లుగా అని ఐ.వి.శశి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నిన్నిలా నిన్నిలా’. బాపినీడు.బి సమర్పణలో బీవీఎస్ఎన్. ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న జీ ప్లెక్స్‌లో విడుదలవుతోంది. అని ఐ.వి.శశి మాట్లాడుతూ– ‘‘స్నేహితులందరూ కలిసి చేసిన సినిమా ఇది. సినిమా చూస్తున్నంతసేపూ చిరునవ్వుతో ఉంటారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నాజర్‌గారు, నిత్యామీనన్, అశోక్ సెల్వన్‌తో నటించడం హ్యాపీ’’ అన్నారు రీతూవర్మ. ‘‘నా ‘అలా మొదలైంది’ ఎంత బాగా హిట్ అయ్యిందో ‘నిన్నిలా నిన్నిలా’ కూడా అంత బాగా హిట్ కావాలి’’ అన్నారు నిత్యామీనన్. ‘‘లవ్ అండ్ ఎమోషన్‌గా తెరకెక్కిన చిత్రం ‘నిన్నిలా నిన్నిలా’’ అన్నారు బీవీఎస్ఎన్. ప్రసాద్. అశోక్ సెల్వన్, సినిమాటోగ్రాఫర్ దివాకర్ మణి, మ్యూజిక్ డైరెక్టర్ రాజేశ్ మురుగేశన్ మాట్లాడారు. -
ఆ ఆలోచనైతే ఉంది..కానీ..
నటిగా, గాయనిగా నిత్యామీనన్‌కి ఫుల్ మార్క్స్ ఎప్పుడో వేశారు ప్రేక్షకులు. తనలో ఓ డైరెక్టర్ కూడా ఉన్నారు అని నిత్యా మీనన్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఓ సినిమాను డైరెక్ట్ చేస్తానని కూడా అన్నారామె. అయితే ‘మీ దర్శకత్వంలో సినిమాను ఎప్పుడు చూడొచ్చు’ అని నిత్యాను అడిగితే ఇలా సమాధానమిచ్చారు–‘‘దర్శకత్వం చేయాలనే ఆలోచన నా మనసులో ఎప్పటి నుంచో ఉంది. కానీ ఎప్పుడు చేయాలో నిర్ణయించుకోలేదు. ఇందుకు ఎటువంటి ప్లాన్ వేసుకోలేదు. ప్రస్తుతం నేను చేయాల్సిన పాత్రలు చాలా ఉన్నాయి. ఇంకా విభిన్నమైన కథల ద్వారా, పాత్రల ద్వారా ప్రేక్షకులను పలకరించాలి’’ అన్నారు నిత్య. ప్రస్తుతం ‘19 (1) (ఎ)’ అనే మలయాళ చిత్రం, తెలుగులో సత్య దేవ్‌తో ‘స్కై ల్యాబ్’ సినిమా చేస్తున్నారు నిత్యా. -
అందులో భాగమవ్వడం సంతోషంగా ఉంది : నిత్య
‘నిత్యా మీనన్ సినిమాల్లో విభిన్నత ఉంటుంది. విభిన్నమైన సినిమాల్లో నిత్యా మీనన్ ఉంటుంది’ అనేలాంటి ఇమేజ్ ఏర్పరచుకున్నారు నిత్యా మీనన్. ఇప్పుడు తాజాగా మరో విభిన్నమైన సినిమా చేశాను అంటున్నారామె. నిత్యా మీనన్, విజయ్ సేతుపతి ముఖ్యపాత్రల్లో మలయాళంలో తెరకెక్కుతున్న చిత్రం ‘19 1a’. ఇందువీయస్ ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా మారారు. మలయాళంలో విజయ్ సేతుపతి నటిస్తున్న రెండవ చిత్రమిది. నవంబర్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఇటీవలే ఈ సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమా గురించి నిత్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కథాంశం రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కుల గుర్తు చేస్తుంది. ఈ కథలో భాగమవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ కథను మీ అందరికీ త్వరగా చూపించాలనుంది’ అన్నారు. ఇది కాకుండా తెలుగులో ‘నిన్నిలా నిన్నిలా’ అనే సినిమా చేస్తున్నారు. -
నిత్యవసంతం
-
థ్రిల్ అవుతారు
నిత్యామీనన్ ఏదైనా ప్రాజెక్ట్‌లో భాగమైతే ఆటోమేటిక్‌గా ఆ సినిమా మీద ఆసక్తి పెరగడం ఖాయం. అందుకు కారణం ఆమె ఎంపిక చేసుకునే కథలు, చేసే పాత్రలు వినూత్నంగా ఉండటమే. తాజాగా మలయాళంలో ఓ ప్రాజెక్ట్ ఓకే చేశారామె. విజయ్ సేతుపతి, నిత్యామీనన్ జంటగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందు వీయస్ అనే నూతన దర్శకురాలు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది మొదట్లోనే ఈ సినిమా ప్రారంభం కావాల్సింది. కోవిడ్ వల్ల చిత్రీకరణ ప్రారంభం ఆలస్యం అయింది. తాజాగా కేరళలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించనున్నారు. నిత్యామీనన్ మాట్లాడుతూ – ‘‘కథ వినగానే ఈ సినిమా నా టేస్ట్‌కి కరెక్ట్‌గా సరిపోయేది అనిపించింది. నాకు చాలా ఇష్టమైన స్టయిల్లో ఈ సినిమా కథ సాగుతుంది. మా పాత్రలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఓ సాధారణ అమ్మాయి జీవితంలో జరిగిన అనూహ్య సంఘటనలతో ఈ కథ ఉంటుంది. ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారు’’ అన్నారు. ముందుగా ఇన్డోర్ సన్నివేశాలు చిత్రీకరించి, తర్వాత అవుట్ డోర్ సన్నివేశాలు తీస్తారని తెలిసింది. -
విజయ్ సేతుపతికి జంటగా నిత్యా మీనన్
తిరువనంతపురం: తమిళ స్టార్ విజయ్ సేతుపతి, హీరోయిన్ నిత్యామీనన్ జంటగా ఓ మలయాళ సినిమా రూపొందబోతుంది. ఇప్పటికే మార్కోని మథాయ్‌తో మాలీవుడ్లోకి అడుగుపెట్టిన విజయ్‌కు మలయాళంలో ఇది రెండో సినిమా. ఆంటో జోసెఫ్ నిర్మించనున్న ఈ చిత్రంతో వీఎస్ ఇందూ దర్మకురాలిగా పరిచయం కానున్నారు. అయితే గతేడాదే ఈ సినిమాకు విజయ్ సేతుపతి, నిత్యా మీనన్‌ను చిత్ర యూనిట్ సంప్రదించగా ఇద్దరూ ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. కానీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది చివరి నాటికి సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్దంగా ఉంది. చదవండి: త్వరలో పెళ్లి.. రూ.18 వేలే ఉన్నాయి కోవిడ్ కారణంగా ప్రభుత్వ ఆంక్షలకు లోబడి తక్కువ సిబ్బందితో కేరళలో ముందుగా షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఇదిలా ఉండగా ఇందూ వీఎస్ ఇంతకుముందు జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్ర నిర్మాత సలీం అహ్మద్‌తో కలిసి కుంజనంతంతే కడా, అమీంటే మకాన్ అబూ, పతేమారి వంటి చిత్రాల్లో పనిచేశారు. ఇది ఆమెకు మొదటి మలయాళ చిత్రం కానుంది. అదే విధంగా విజయ్ నటించిన హిట్ మూవీ ‘96’కు సంగీతం సమకూర్చిన గోవింద్ వసంత ఈ సినిమాకు కూడా సంగీత దర్శకుడిగా పనిచేయనున్నారు. మనీష్ మాధవన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు. చదవండి: వివాదంలో విజయ్ సేతుపతి చిత్రం ప్రస్తుతం విజయ్ సేతుపతి శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 800 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది. సేతుపతిపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #షేమ్ఆన్ విజయ్‌సేతుపతి అంటూ ట్విటర్లో ట్రెండింగ్ ప్రారంభించారు. శ్రీలంక ప్రభుత్వం చారిత్రాత్మకంగా తమ దేశంలోని తమిళులను అణచివేస్తున్నది. జాతి ఆధారంగా వివక్ష చూపించే దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్ పాత్రలో మీరు నటిస్తారా అని, ఇదేనా తమిళ ప్రేక్షకుల పట్ల మీరు చూపే కృతజ్ఞత అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నిత్యామీనన్ కోలాంబి అనే మలయాళ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు అరుంధతి దర్శకత్వం వహిస్తున్నారు. చదవండి: కరోనా జీవితం పోరాటంగా మారింది -
కరోనా జీవితం పోరాటంగా మారింది
సినిమా: జీవితం పోరాటంగా మారిందని నటి నిత్యామీనన్ పేర్కొంది. మాతృభాష మలయాళంతో పాటు తమిళం, తెలుగు, హిందీ ఇతర భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా నటిగా పేరు తెచ్చుకున్న కేరళ కుట్టి నిత్యామీనన్. పాత్ర నచ్చితే అది ఎలాంటిదైనా న్యాయం చేయడానికి తన వంతు కృషి చేసే ఈబ్యూటీ ఇటీవల నటనకు ప్రాధాన్యత ఉన్న కథా చిత్రాలనే అంగీకరిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో జయలలిత జీవిత చరిత్రతో తెరకెక్కనున్న ది ఐరన్ లేడీ చిత్రంలో టైటిల్ పాత్రలో నటించడానికి సిద్ధమవుతోంది. ఈ పాత్ర కోసం నిత్యామీనన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు పేర్కొంది. కాగా ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఇంటికి పరిమితమైన నిత్యామీనన్ ఒక భేటీలో పేర్కొంటూ నిజ జీవితాన్ని సినిమాను తను ఎప్పుడూ ఒకేలా చూడనని చెప్పింది. షూటింగ్‌కి వెళితే అది పూర్తవగానే అక్కడితోనే మరచిపోతాం అని ఇంటి వరకు ఆ ప్రస్తానం తీసుకురానని చెప్పింది. అదేవిధంగా షూటింగ్లో పాల్గొంటే నిజ జీవితం గురించి మరచిపోతాం అని చెప్పింది. వ్యక్తిగత కష్టనష్టాలను షూటింగ్ దరిదాపులకుకూడా తీసుకురానని చెప్పింది. ఒక్కోసారి తాము ధరించిన పాత్రలు మనసును విపరీతంగా హత్తుకుంటాయని అంది. ప్రస్తుతం లాక్డౌన్ అమలులో ఉండడంతో అందరూ ఇంటిలోనే కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడిందని ఈ సమయంలో మన గురించి మనం తెలుసుకోవడానికి మనల్ని మనమే విమర్శించడానికి ఉపయోగించుకోవాలని చెప్పింది. ఆ విధంగా తనలోని కొరత ఏమిటన్నది ఈ సమయంలో తెలుసుకున్నానని చెప్పింది. ఇకపోతే కరోనా జీవితం పోరాటంగా మారిందని పేర్కొంది. -
అలా నటించేందుకు నిత్య ఎలా అంగీకరించిందో..
నటి నిత్యామీనన్ మరోసారి వార్తల్లో నానుతోంది. సంచలనాలకు మారుపేరు ఈ మలయాళీ బ్యూటీ. ఎవరేమనుకున్నా తనకెంటీ అనే మనస్తత్వం కలిగిన నిత్యామీనన్ తనకు నచ్చింది చేసేస్తుంది ఈ అమ్మడు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ వంటి భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా పేరు తెచ్చుకుంది. ఇటీవల బాగా బరువు పెరిగిందంటూ అభిమానుల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నా తన శరీరం తన ఇష్టం. తాను ఎలా ఉంటే నీకు ఎందుకు అని గడసరిగా సమాధానం ఇస్తోంది. ఇటీవల సైకో చిత్రంలో నటించిన నిత్య ఆ తర్వాత తమిళంలో ఒక చిత్రం కూడా కమిట్ కాలేదు. ( కొడుకు కోసమేనా.. ) ఆ మధ్య దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రతో తెరకెక్కనున్న ది ఐరన్ లేడీ చిత్రంలో టైటిల్ పాత్రలో నటించనున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి. ఆ చిత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు అన్నది గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో నిత్యామీనన్ బ్రీత్ ఇన్ టు ద షాడోస్ అనే హిందీ చిత్రంలో పట్టించింది. ఆ చిత్రం ఇటీవల ఓటీటీలో విడుదలై హల్చల్ చేస్తోంది. విశేషమేంటంటే ఇందులో నటి నిత్యామీనన్ లెస్బియన్‌గా నటించింది. మరో యువతితో ఈమె నటించిన లిప్ లాక్ సన్నివేశాలు వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అలాంటి సన్నివేశాల్లో నటించడానికి నిత్య ఎలా అంగీకరించిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కుర్రకారు మాత్రం ఆ దృశ్యాలను ఎంజాయ్ చేస్తున్నారు. కాగా ఇలాంటి సన్నివేశాల్లో నటించడం నిత్యకు కొత్తేమి కాదు. ఇంతకుముందు కూడా ఆ అనే చిత్రంలో లెస్బియన్‌గా నటించింది. కాగా బ్రీత్ ఇన్ టు ద షాడోస్ చిత్రాన్ని ప్రైమ్ వీడియోలో చూస్తూ కుర్రకారు ఎంజాయ్ చేస్తున్నారు. దక్షిణాదిలో ఇలాంటివి అరుదే గానీ బాలీవుడ్లో ఇలాంటివి సర్వసాధారణం. ఏదేమైనా నిత్యామీనన్ వివాదాస్పద పాత్రలో నటించడంతో చిత్రానికి మంచి ప్రచారం లభిస్తోంది. మొత్తం మీద అలా మరోసారి నటి నిత్యామీనన్ వార్తల్లో నానుతోంది. ( అందుకే ‘పుష్ప’ నుంచి తప్పుకున్నా : విజయ్ ) -
చిన్న మార్పు
నిత్యామీనన్ మల్టీటాలెంటెడ్. బాగా యాక్ట్ చేయగలరు. మలయాళీ అయినా అచ్చ తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పుకోగలరు. సినిమాల్లో పాటలు పాడగలరు. ఇప్పుడు తనలోని గాయనిపై మరింత దృష్టి పెట్టారు. గాయనిగా నిత్యామీనన్ తన తొలి ఆల్బమ్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ మ్యూజిక్ ఆల్బమ్‌కి లండన్ మ్యూజిక్ కంపోజర్ సౌమిక్ దత్తా సంగీతాన్ని సమకూర్చగా నిత్యామీనన్ పాడనున్నారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలియజేశారామె. ‘‘సరికొత్త ప్రాజెక్ట్ తయారవుతోంది. కెరీర్లో చిన్న మార్పు రాబోతోంది. నా తొలి మ్యూజిక్ సింగిల్ త్వరలో విడుదల కాబోతోంది. అందరికీ త్వరగా వినిపించేయాలనే ఆతురుతతో ఉన్నాను’’ అన్నారు. ప్రస్తుతం జయలలిత బయోపిక్ ‘ది ఐరన్ లేడీ’, తెలుగులో సత్యదేవ్‌తో ఓ సినిమా చేస్తున్నారు నిత్యామీనన్. -
ఎల్సా పాత్రతో నాకు పోలికలున్నాయి
‘‘ఫ్రోజెన్’ సినిమా చూసిన నా ఫ్రెండ్ ఒకామె ’ఆ సినిమా చూసినప్పుడు నువ్వే గుర్తొచ్చావు’ అని చెప్పింది. నాకూ ఎల్సా పాత్రకు పర్సనాలిటీ విషయంలో ఎక్కడో పోలికలున్నాయని సినిమా చూశాక అనిపించింది’’ అని నటి నిత్యామీనన్ అన్నారు. డిస్నీ సంస్థ అందిస్తున్న తాజా యానిమేషన్చిత్రం ‘ఫ్రోజెన్ 2’. ఎల్సా, అన్న అనే అక్కా చెల్లెళ్ల కథ ఇది. నవంబర్ 22న ఈ సినిమా తెలుగులో విడుదలకానుంది. తెలుగు వెర్షన్లో ఎల్సా పాత్రకు నిత్యామీనన్, ఎల్సా చిన్ననాటి పాత్రకు మహేశ్ బాబు కుమార్తె సితార డబ్బింగ్ చెప్పారు. ఈ సందర్భంగా నిత్యామీనన్ మాట్లాడుతూ– ‘‘ఎల్సా పాత్రతో చాలా కనెక్ట్ అయ్యాను. అందుకే.. ‘ఫ్రోజెన్ 2’లో ఎల్సాకు డబ్బింగ్ చెప్పమనగానే ఓకే అన్నాను. మరోసారి డబ్బింగ్ చెప్పమని అడిగినా చెబుతాను (నవ్వుతూ)’’ అన్నారు. ‘‘డబ్బింగ్ చెప్పడం చాలా సరదాగా అనిపించింది. నాన్న సర్ప్రైజ్గా ఫీలయ్యారు. నా ఫేవరెట్ కార్టూన్ పాత్ర ఎల్సానే’’ అని సితార అన్నారు. ‘‘సితారతో డబ్బింగ్ చెప్పించమని డిస్నీ శివప్రసాద్‌గారు మహేశ్‌ని, నన్ను కన్విన్స్ చేశారు. సితార ఎలా డబ్బింగ్ చెబుతుందో అనుకున్నాను.. బాగా చెప్పింది. 3 ఏళ్ల నుంచి ఎల్సా పాత్రకు తను పెద్ద ఫ్యాన్. సితారను సినిమాల్లోకి తీసుకురావాలని ఇదేం స్ట్రాటజీ కాదు. గౌతమ్, సితార కెరీర్‌ని ఇంకా ఏం ప్లాన్ చేయలేదు. వాళ్లు ఏం ఎంచుకున్నా సపోర్టివ్‌గా నిలబడతాం’’అన్నారు నమ్రతా శిరోద్కర్. ‘‘2013లో ‘ఫ్రోజెన్’ చిత్రం రిలీజ్ అయింది. యానిమేషన్ సినిమాల కలెక్షన్లలో టాప్‌గా నిలిచింది’’ అన్నారు డిస్నీ ప్రతినిధి విక్రమ్ దుగ్గల్. -
చెల్లెలి కోసం...
డిస్నీ సంస్థ నుంచి వస్తున్న తాజా హాలీవుడ్ యానిమేషన్ చిత్రం ‘ఫ్రోజెన్ 2’. భారతదేశంలోని ప్రాంతీయ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ప్రాంతీయ భాషల్లో ఆయా ప్రాంతానికి చెందిన స్టార్స్‌తో ఈ సినిమాలోని పాత్రలకు డబ్బింగ్ చెప్పించి సినిమాను ప్రమోట్ చేస్తోంది డిస్నీ సంస్థ. అన్నా, ఎల్సా అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ల చుట్టూ ‘ఫ్రోజెన్ 2’ కథ తిరుగుతుంది. అన్నా, ఎల్సా పాత్రలకు హిందీలో ప్రియాంకా చోప్రా, పరిణీతీ చోప్రా డబ్బింగ్ చెప్పారు. తెలుగులో చెల్లెలి పాత్ర ఎల్సాకు నిత్యా మీనన్ డబ్బింగ్ చెప్పారు. నిత్యా మాట్లాడుతూ – ‘‘ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పడం సంతోషంగా అనిపించింది. ఈ సినిమా స్క్రిప్ట్ నాకు చాలా నచ్చింది. అమ్మాయిలకు సంబంధించి ఈ సినిమాలో మంచి సందేశం ఉంది. డిస్నీ సంస్థతో పని చేయడం కల నెరవేరినట్టుంది’’ అన్నారు. ‘ఫ్రోజన్ 2’ ఈ నెల 22న విడుదల కానుంది. కేరళలో పుట్టి పెరిగిన నిత్యా మీనన్ తెలుగు మాట్లాడగలరు. ‘అలా మొదలైంది, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, 24’ సినిమాల్లో పాటలు కూడా పాడారామె. అలాగే తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటారు. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాకి అయితే తన పాత్రతో పాటు మరో హీరోయిన్ ఇషా తల్వార్ పాత్రకు కూడా నిత్యా మీననే డబ్బింగ్ చెప్పడం విశేషం. -
అమ్మ లక్షణాలు ఆమెలో ఉన్నాయి
సినిమా: అమ్మ లక్షణాలు సహజంగానే ఆమెలో ఉన్నాయి అని మహిళా దర్శకురాలు ప్రియదర్శిని అన్నారు. ఈమె ఎవరి గురించి చెబుతున్నారో ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. అవును దర్శకురాలు ప్రియదర్శిని చెబుతున్నది నటి నిత్యామీనన్ గురించే. నవ దర్శకురాలైన ప్రియదర్శిని దివంగత ముఖ్యమంత్రి, ప్రఖ్యాత నటీమణి జయలలిత బయోపిక్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో జయలలిత పాత్రకు నటి నిత్యామీనన్‌ను ఎంపిక చేసుకున్న సంగతి విదితమే. దీనికి ది ఐరన్ లేడీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఇదంతా జరిగి చాలా రోజులైంది. దీంతో ఈ చిత్రంపై రకరకాల ప్రచారం జరుగుతోంది. దీంతో దర్శకురాలు ప్రియదర్శిని స్పందిస్తూ శనివారం సాయంత్రం మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో ది ఐరన్‌లేడీ చిత్రం గురించి పలువురు పలు విధాలుగా ప్రశ్నిస్తున్నారు. వారందరికి వాస్తవాలను తెలియజేయాలని భావించాను. ఈ చిత్రం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పరిపూర్ణ జీవితాన్ని ఆవిష్కరిస్తుంది. నిజ జీవిత అంశాలను పూర్తిగా చర్చించిన తరువాతనే జయలలిత పాత్రలో నటి నిత్యామీనన్ సరిగ్గా నప్పుతారని ఆమెను ఆ పాత్రకు ఎంపిక చేశాం, జయలలితలోని సహజమైన లక్షణాలన్నీ నిత్యామీనన్‌లో ఉన్నాయి. పురట్చి తలైవి అమ్మ మాదిరిగానే నిత్యామీనన్ ఆరు భాషల్లో సరళంగా మాట్లాడగలరు. తను చిన్నతనంలోనే భరతనాట్యం, క్రీడలు పరిచయం కలిగి ఉన్నారు. అంతే కాదు సంగీతంలోనూ ప్రతిభ కలిగిన నటి. జీవిత చరిత్రను తెరకెక్కించడం సవాలే. అదేవిధంగా బయోపిక్‌లతో పలు సమస్యలు, చర్చలు, విమర్శలు ఉన్నా, అమ్మ జీవిత చరిత్రను యథార్థంగా ఎలాంటి మార్పులు చేయకుండా తెరపై ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ కథను తెరకెక్కించడంలో దర్శకురాలిగా సవాళ్లు అధికమే. ప్రజలు అంగీకరించేలా, అలరించేలా ఒక మంచి చిత్రాన్ని రూపొందించే బాధ్యతను తీసుకున్నాం. సర్ రిచర్డ్ ఆటంబరో గాంధీ బయోపిక్‌ను తెరకెక్కించడానికి 18 ఏళ్ల సమయాన్ని ఖర్చు చేశారు. ఒక ఉన్నతమైన చిత్రాన్ని రూపొందించడానికి అంత సమయం అవసరం అవుతుందన్న విషయంలో మేమూ దృఢంగా ఉన్నాం. ఈ చిత్రంలో సగం విజయం సరైన కథాపాత్రలను ఎంపిక చేయడంలోనే ఉంది. ఈ విషయంలో రాజీకి చోటు ఉండదు. అలా కాంప్రమైజ్ అయితే మీరు కచ్చితంగా అంగీకరించరన్నది మాకు తెలుసు.అందుకే యథార్థం మీరకుండా పూర్తి స్వేచ్ఛతో ఈ చిత్రాన్ని మీ ముందుంచాలని భావించాం, చిత్రంలో మూడు ప్రధాన పాత్రలు పోషించనున్న నటీనటుల కాల్షీట్స్ కోసం వేచి ఉన్నాం. ఈ విషయాన్ని మీ ముందుంచడం సంతోషంగా ఉంది. ఈ ఆదరణతో అసాధ్యాన్ని సాధ్యం చేస్తాం. అని ది ఐరన్ లేడీ చిత్ర రూపకల్పనకు పూనుకున్న నవ దర్శకురాలు ప్రియదర్శిని పేర్కొన్నారు. -
రాజీ పడేది లేదు
నటి, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా వెండితెరపైకి రాబోతున్న సినిమాల్లో ‘ది ఐరన్ లేడీ’ కూడా ఒకటి. ఇందులో జయలలితగా నిత్యామీనన్ నటించనున్నారు. దర్శకురాలు ప్రియదర్శిని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ఏవీ రాక పోవడంతో సెట్స్‌పైకి వెళ్తుందా? అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందిస్తూ ప్రియదర్శిని ఓ లేఖను విడుదల చేశారు. ‘‘ది ఐరన్ లేడీ’ సినిమా కోసం ఎంతోమంది హీరోయిన్లను పరిశీలించి ఆరు భాషలు మాట్లాడగల, భరత నాట్యంలో ప్రావీణ్యత ఉన్న నిత్యామీనన్‌ను ఎంచుకున్నాం. బయోపిక్‌ను తెరకె క్కించాలంటే చాలా అంశాల గురించి ఆలోచించాలి. ఇదొక చాలెంజ్ లాంటిది. ఎంతో బాధ్యత మాపై ఉంటుంది. విమర్శలు, వివాదాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అందుకే ప్రీ–ప్రొడక్షన్ కార్యక్రమాలను రాజీ పడకుండా చేస్తున్నాం’’ అన్నది ఆ లేఖ సారాంశం. ‘‘ది ఐరన్ లేడీ’ సినిమా కోసం నాకు ప్రత్యేకమైన శిక్షణ ఏం అవసరం లేదు. నాకు భరతనాట్యం వచ్చు. తమిళంలో స్పష్టంగా మాట్లాడగలను. బయోపిక్ తీయడం అంత ఈజీ కాదు’’ అన్నారు నిత్యామీనన్. -
ఇక సహించేది లేదు! వీడియోలో నిత్యామీనన్
సినిమా: ఇన్నాళ్లు పట్టించుకోలేదు. ఇకపై సహించేది లేదు అని మండిపడుతోంది నటి నిత్యామీనన్. ఇంతకీ ఈ మలయాళీ భామకు అంతగా కట్టలు తెచ్చుకునేంత కోపం రావడానికి కారణం ఏమైఉంటుంది? ఇప్పటి వరకూ మలయాళం, తమిళం, తెలుగు భాషల్లోనే నటిస్తూ వచ్చిన ఈ అమ్మడు కొత్తగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. నిత్యామీనన్ నటించిన తొలి హిందీ చిత్రం మిషన్ మంగళ్ శుక్రవారం తెరపైకి వచ్చింది. అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రంలో విద్యాబాలన్ నటించారు. ఇక నటి నిత్యామీనన్ విషయానికి వస్తే కేరళలో వరదముప్పుతో ఆ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నటుడు సూర్య, కార్తీ కూడా కేరళ, కర్ణాటక ప్రజలను ఆదుకునేలా రూ.10 లక్షలు అందించారు. ఇలాంటి సమయంలో నటి నిత్యామీనన్ సామాజిక మాధ్యమాల్లో తన చిత్రాల ఫొటోలను, వాటి వివరాలను పోస్ట్ చేసుకుంటుందేగానీ ప్రజల వెతల గురించి ఒక్క మాటను కూడా పేర్కొనలేదంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అదే నిత్యామీనన్‌కు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. తన గురించి జరుగుతున్న ప్రచారానికి బదులిచ్చేలా ఒక వీడియోను విడుదల చేసింది. అందులో సాధారణంగా ఇలాంటి ట్రోలింగ్‌లను పట్టించుకోను. అయితే ఇకపై ఇలాంటి అసత్య ప్రచారాలను సహించేది లేదు. నేను సామాజికమాధ్యమాల్లో పొందుపరచనంతమాత్రాన, ఎలాంటి సహాయం చేయలేదని అర్థం కాదు అని నిత్యామీనన్ పేర్కొంది. అయితే ఇప్పటికీ తను చేసిన సహాయం ఏమిటో చెప్పని సంచలన నటి. త్వరలో ప్రారంభం కానున్న జయలలిత బయోపిక్ ది ఐరన్ లేడీ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతోంది. జయలలిత పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.అందుకోసం చాలా కసరత్తులు చేస్తోందట. ఇకపోతే మిషన్ మంగళ్ చిత్రం ఈ అమ్మడి బాలీవుడ్ భవిష్యత్‌ను ఎలా నిర్ణయిస్తుందో చూడాలి. View this post on Instagram People are, and life is, much more than what some narrow minds and some ignorant eyes can see. A post shared by Nithya Menen (@nithyamenen) on Aug 11, 2019 at 7:39am PDT -
సెకనుకు 1,000 కప్పుల కాఫీ..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ లేబుల్ ఇన్స్టాంట్ కాఫీ తయారీలో ఉన్న ప్రపంచ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ భారత్‌పై ఫోకస్ చేసింది. దేశీయ మార్కెట్‌కు అనుగుణంగా ఇన్స్టాంట్ కాఫీ, ఫిల్టర్ కాఫీ, కాఫీ ప్రీమిక్స్ శ్రేణిలో నూతన ఉత్పాదనలను విడుదల చేసింది. రూ.1తో మొదలుకుని విభిన్న ప్యాక్‌లలో వీటిని ప్రవేశపెట్టింది. దక్షిణాదిన పెద్ద ఎత్తున విస్తరించిన తర్వాత 2021 నాటికి దేశవ్యాప్తంగా అడుగుపెడతామని సీసీఎల్ ప్రొడక్టŠస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘భారత్‌లో కాఫీ వినియోగంలో దక్షిణాది రాష్ట్రాల వాటా 75%. కంపెనీ సొంత బ్రాండ్.. కాంటినెంటల్ కాఫీ ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. సంస్థ ఆదాయంలో భారత్ వాటా 7 శాతమే. రెండేళ్లలో దీనిని రెండింతలకు తీసుకువెళతాం’ అని వివరించారు. సినీ నటి నిత్యా మీనన్‌ను కాంటినెంటల్ కాఫీ బ్రాండ్ ప్రచారకర్తగా నియమించారు. నూతన ఉత్పత్తులతో మోహన్ కృష్ణ, శ్రీశాంత్, రాజేంద్ర ప్రసాద్, ప్రవీణ్ (ఎడమ నుంచి కుడికి). కాఫీ రుచులు 1,000కి పైమాటే.. సీసీఎల్ ప్రస్తుతం 90 దేశాల్లోని కంపెనీలకు 250కిపైగా బ్రాండ్లలో ప్రాసెస్డ్ కాఫీని సరఫరా చేస్తోంది. రెండు మూడేళ్లలో మరో 10 దేశాల్లో అడుగు పెట్టడం ద్వారా 100 మార్కును దాటాలన్నది లక్ష్యమని కంపెనీ ఎండీ చల్లా శ్రీశాంత్ తెలిపారు. 1,000కిపైగా రుచుల్లో కాఫీని తయారు చేయగల సామర్థ్యం సంస్థకు ఉందన్నారు. సీసీఎల్ తయారు చేసిన కాఫీతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు 1,000 కప్పుల కాఫీ వినియోగం అవుతోందని చెప్పారు. దశాబ్దాలపాటు సంస్థకు ఉన్న అనుభవం, ప్రపంచ కాఫీ రంగంలో సాధించిన విజయంతో ఇక భారత వినియోగదార్లకు చేరువ అవుతామని సంస్థ డైరెక్టర్ బి.మోహన్ కృష్ణ తెలిపారు. పోటీ కంపెనీల కంటే దీటుగా ఉత్పత్తులను తయారు చేశామన్నారు. ప్రచారంలో భాగంగా ప్రతి నెల ఒక లక్ష కప్పుల కాఫీని కస్టమర్లకు ఉచితంగా అందించనున్నట్టు చెప్పారు. ఇప్పటికే 50,000 ఔట్లెట్లకు చేరువయ్యామని, డిసెంబరుకల్లా ఒక లక్ష స్టోర్లలో కాంటినెంటల్ కాఫీ లభ్యమవుతుందని ఆయన వివరించారు. రూ.140 కోట్ల పెట్టుబడి..: కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 35,000 టన్నులు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా దుగ్గిరాలతోపాటు స్విట్జర్లాండ్, వియత్నాంలో ప్లాంట్లున్నాయి. చిత్తూరు జిల్లాలోని సెజ్‌లో నెలకొల్పిన ప్లాంటులో ఇటీవలే ఉత్పత్తి ప్రారంభమైంది. సెజ్ కోసం రూ.350 కోట్లు వెచ్చించినట్టు సీసీఎల్ సీఈవో ప్రవీణ్ జైపూరియార్ వెల్లడించారు. వియత్నాం ప్లాంటు సామర్థ్యం పెంపు, చిత్తూరు కేంద్రంలో ప్యాకేజింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.140 కోట్లు పెట్టుబడి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక టర్నోవరులో ఏటా 15–20% వృద్ధి ఆశిస్తున్నట్టు సీసీఎల్ సీవోవో కేవీఎల్ఎన్ శర్మ తెలిపారు. సీసీఎల్‌కు భారత్‌లో 1,000, విదేశాల్లో 250 మంది ఉద్యోగులున్నారని చెప్పారు. -
వారం రోజులపాటు ఆశ్రమంలో
సినిమా: ఆశ్రమంలో గడిపొచ్చానని చెప్పింది నటి నిత్యామీనన్. ఏంటీ ఈ భామ ఆధ్యాత్మిక మార్గం పట్టిందా. అని అండిగేయకండి. తనకు నచ్చింది చేసే అరుదైన నటి నిత్యామీనన్. సినిమాలైనా తనకు నచ్చితే చిన్న పాత్రను చేయడానికైనా సిద్ధం అంటుంది. అలా అతిథి పాత్రల్లో నటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇటీవల బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన నిత్యామీనన్ నటించిన మిషన్ మంగళ్ త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇందులోనూ ఇద్దరు ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించింది. ఇక కోలీవుడ్‌లో జయలలిత బయోపిక్‌గా తెరకెక్కనున్న ది ఐరన్ లేడీ చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది. అదేవిధంగా సైకో అనే చిత్రంతో పాటు ఒక మలయాళ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది. అలాంటి నిత్యామీనన్ ఒక ఇంటర్వ్యూలో వారం రోజులపాటు ఆశ్రమంలో గడిపినట్లు చెప్పింది. అలా ఎందుకు గడపాల్సి వచ్చిందన్నది చెప్పలేదు గానీ అక్కడ మతం గురించి నేర్చుకోలేదు గానీ, నా గురించి నేను తెలుసుకున్నానని చెప్పింది. పాఠాలు నేర్పడానికి చాలా కళాశాలలు ఉన్నాయి. మనుషులైన మన గురించి ఏ కళాశాలల్లోనూ చెప్పడం లేదు అని అంది. ఇకపోతే నటిగా తన గురించి చెప్పాలంటే తాను నటించే పాత్రల కోసం ముందుగా ఎలాంటి శిక్షణ తీసుకోనని చెప్పింది. ఇంకా చెప్పాలంటే ఎలాంటి పాత్రనైనా కష్టపడి నటించను. షూటింగ్ స్పాట్‌కు వెళ్లిన తరువాత అక్కడ యూనిట్ వాళ్లు ఇచ్చిన దుస్తులు ధరించగానే నిత్యామీనన్ అన్న విషయాన్ని మరిచి ఆయా పాత్రలుగా మారిపోతానని చెప్పింది. సాధారణంగా తాను నటించాల్సిన సీన్ పేపర్లను, సంభాషణలను చివరి నిమిషంలోనే ఇస్తుంటారు. కొందరైతే ఉదయాన్నే ఇస్తారని చెప్పింది. అయితే చిత్ర కథను విన్నప్పుడే తన పాత్ర మదిలో నిలిచిపోతుందదని చెప్పింది. దాంతో పాత్రలో ఒదిగిపోతానని అంది. ఒక్కో సమయంలో సన్నివేశాలను దర్శకులు మారుస్తుంటారంది. అప్పుడు తాను ముందు చెప్పిన సన్నివేశాలు లేవే అని తాను అడిగితే వారు ఆశ్చర్యపోతుంటారని చెప్పింది. ప్రస్తుతం ది ఐరన్ లేడీ చిత్రంలో నటించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు నిత్యామీనన్ పేర్కొంది. -
కాస్ట్యూమ్ పడితే చాలు
‘‘నేను మెథడ్ యాక్టర్‌ని కాదు. స్పాంటేనియస్ యాక్టర్‌ని. నిజం చెప్పాలంటే పాత్ర కోసం పెద్దగా ప్రిపేర్ అవ్వను’’ అన్నారు నిత్యా మీనన్. ఏదైనా పాత్రను చేయడానికి ఎలా ప్రిపేర్ అవుతారు అనే ప్రశ్నకు నిత్యామీనన్ స్పందిస్తూ – ‘‘కేస్ స్టడీ చేసేవి, బయోపిక్ అయితే తప్ప మిగతా పాత్రలకు అంత కష్టపడాల్సిన పని లేదు. ఒక్కసారి కాస్ట్యూమ్ నా ఒంటిమీద పడితే పాత్రలోకి వెళ్లిపోతాను. ‘మనం నిత్యామీనన్’ అనే విషయాన్ని పక్కన పెట్టేస్తాను. ఆ పాత్ర మూడ్‌లోకి మారిపోతాను. మన ఇండస్ట్రీలో చాలాసార్లు స్క్రిప్ట్‌ను చివరి నిమిషంలో ఇస్తుంటారు. కొన్నిసార్లు షూటింగ్ జరిగే రోజు ఉదయమే స్క్రిప్ట్ ఇచ్చేవాళ్లు. కథ తొలిసారి వింటున్నప్పుడే పాత్ర నాకు గుర్తుండిపోతుంది. ఆ పాత్రకు నేను ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతాను. స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఆ డైలాగ్ ఉందని చెప్పారు. షూట్ చేయడం లేదేంటి? అని దర్శకుడిని అడుగుతుంటాను కూడా. వాళ్లు చాలాసార్లు షాక్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి’’ అన్నారు. -
గిల్టీ కియారా..
ఎంటర్టైన్మెంట్ అనేది ఒక పెద్ద సాలెగూడు.యూజువలీ దాన్ని ప్రేక్షకులను పడేయడానికి వాడతారు.ప్రేక్షకులు పడాలంటే సూపర్ హీరోలు ఉండాలిగా.ఇప్పుడు హీరోయిన్లే వెబ్‌లో సూపర్ హీరోలు. గతంలో సినిమాలు చూడాలంటే టెంట్ హాల్స్‌కు వెళ్లాల్సి వచ్చేది. తర్వాత థియేటర్లు వచ్చాయి. ఆపై టీవీల్లో సినిమాలు చూశాం. కంప్యూటర్లలో చూస్తున్నాం. ఇప్పుడు అరచేతిలోనే సినిమా ఉంది. సెల్ఫోన్లో సినిమాలు చూస్తున్నాం. సెల్ఫోన్లో చూడ్డం కోసమే తీసే సినిమాలూ తయారవుతున్నాయి. వెబ్ సిరీస్, వెబ్ మూవీస్ ఎంటర్ బటన్ దూరంలో ఉన్నాయి. సినిమా స్టార్స్ వీటిలో యాక్ట్ చేసి మరింత స్టార్డమ్ పొందుతున్నారు. సెల్‌ఫోన్ సూపర్‌స్టార్స్ వీరు. ప్రతి ఇంట్లో కనీసం రెండు స్మార్ట్ ఫోన్లు ఉంటున్న రోజులు ఇవి. వినోదానికి సినిమాయే గతి అనే రోజులు మెల్లిగా తగ్గిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వెబ్ సిరీస్‌లు, యూ ట్యూబ్స్ చానెల్స్‌లోని వినోదాత్మక సరుకు పట్ల ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో సినిమా స్టార్లు ఈ ప్లాట్‌ఫామ్స్ మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం వచ్చింది. బాలీవుడ్లో మొదలైన వెబ్ సిరీస్‌ల గాలి మెల్లిగా సౌత్‌కు కూడా వీస్తోంది. ముందుగా వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తున్న దక్షిణాది హీరోయిన్లను చూద్దాం. ఇవి తెలుగు సిరీస్‌లు హీరోయిన్ నిహారిక డిజిటల్ ఫ్లాట్‌పామ్ ఊపును ముందుగానే పసిగట్టి ఎప్పుడో ‘ముద్దపప్పు ఆవకాయ్’ ‘నాన్న కూచి’ వంటి వెబ్ సిరీస్‌ల్లో నటించారు. ఇప్పుడు కూడా ఓ వెబ్ సిరీస్‌తో బిజీగా ఉన్నారట. కేవలం నటించడమే కాదు వెబ్‌సిరీస్‌లను ప్రొడ్యూస్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారట నిహారిక. అలాగే తానూ ఓ వెబ్ సిరీస్‌ను ప్రొడ్యూస్ చేస్తున్నట్లు హీరో మంచు విష్ణు అనౌన్స్ చేశారు. ఇక ఇండియన్ సినిమాకి గర్వకారణమైన ‘బాహుబలి’ కూడా వెబ్‌లోకి రానుంది. దర్శకులు దేవా కట్టా, ప్రవీణ్ సత్తారు ‘బాహుబలి’ని డిజిటల్ ప్లాట్ఫామ్లో చూపించడానికి సన్నాహాలు చేస్తున్నారు. హీరో సందీప్ కిషన్ కూడా ‘ది ఫ్యామిలీ మ్యాన్’ పేరుతె ఓ వెబ్ సిరీస్ చేశారు. అయితే హిందీలో తీసిన ఈ సిరీస్ తెలుగు, తమిళ భాషల్లో అనువాదమవుతోంది. అప్పుడప్పుడూ వెండితెర మీద కనిపిస్తున్న అమల ఇటీవల ‘హై ప్రిస్టెస్’ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఇందులో వరలక్ష్మీ శరత్‌కుమార్ కూడా నటించారు. మంచు లక్ష్మీ నటించిన ‘మిసెస్ సుబ్బలక్ష్మీ’ అనే వెబ్ సిరీస్ గురించి ప్రస్తావించాలి. హీరో రానా రెండేళ్ల క్రితమే ‘సోషల్’ అనే వెబ్ సీరిస్‌లో నటించారన్నది మర్చిపోకూడని విషయం. జగపతిబాబు ఆ మధ్య ‘గ్యాంగ్‌స్టార్స్’ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఇంకా నవదీప్, తేజస్వి వంటి వారు కూడా వెబ్ సిరీస్‌ల్లో మెరిసిన వారే. ఇటీవల జేడీ చక్రవర్తి ‘ఏ’ వెబ్ సిరీస్‌ను తీస్తున్నట్లు చెప్పారు. తెలుగులోని కొన్ని అగ్ర నిర్మాణ సంస్థలు కూడా వెబ్ సిరీస్‌ల ద్వారా ఆడియన్స్‌కు మరింత దగ్గరవ్వాలనే ఆలోచనలో ఉన్నాయని తెలిసింది. బాలీవుడ్ హీరోలు చాలా జోరుగా వెబ్ సిరీస్ చేస్తున్నారు. అక్షయ్‌కుమార్ ‘ది ఎండ్’ అనే యాక్షన్ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నారు. అర్జున్ రాంపాల్ (ది ఫైనల్ కాల్), జాకీ ష్రాఫ్ (క్రిమినల్ జస్టిస్), ఇమ్రాన్ హష్మి (బ్రాడ్ ఆఫ్ బ్లెడ్), హ్యూమా ఖరేషీ (లేలా) ఈ ఏడాది వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు. సైఫ్ అలీఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ (సేక్రెడ్ గేమ్స్), కల్కి కోచిలెన్ (స్మోక్) సిరీస్‌తో ఇప్పటికే పేరు గడించారు. నిమ్రత్ కౌర్, రాధికా ఆప్టే, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, వివేక్ ఒబెరాయ్, రిచా చద్దా, అంగద్ బేడీ, రాజ్‌కుమార్ రావు, జూహీ చావ్లా.. ప్రస్తుతానికి ఈ వెబ్ ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో ఉన్న ఇతర బాలీవుడ్ నటులుగా చెప్పుకోవచ్చు. ఈ జాబితా వచ్చే ఏడాదికి మరింత పెరగవచ్చనడంలో సందేహం లేదు. తమిళంలో ప్రసిద్ధ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా పలువురు ప్రముఖ దర్శకులు సినిమాలు తీయాలనుకున్నారు. ఈ జాబితాలో ఇటీవల మణిరత్నం పేరు కూడా చేరింది. ఆయన ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారని కోలీవుడ్ టాక్. మరోవైపు రజనీకాంత్ కుమార్తె సౌందర్యా రజనీకాంత్ ఈ నవల ఆధారంగా ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. సూరియ ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ హాలిడే ఒక అమ్మాయి, ముగ్గురు అబ్బాయిలు ఓ హాలిడే ట్రిప్‌కు వెళ్లారు. ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇంతలో అనుకోని సంఘటనలు. అంతే! వారి ఆనందం అంతా ఆవిరైపోయింది. ఆ సంఘటనల సమాహారంతోనే ‘హాలిడే’ అనే వెబ్‌సిరీస్ తెరకెక్కుతోంది. ‘హార్ట్ ఎటాక్’(2014) సినిమాలో గ్లామరస్‌గా కనిపించి కుర్రకారు గుండెలపై ఎటాక్ చేసిన అదా శర్మ ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం మారిషస్‌లో షూటింగ్ జరుగుతోంది. ఇటీవల ట్రైలర్ విడుదల అయ్యింది. ఈ వెబ్ సిరీస్ కోసమే డిఫరెంట్ హెయిర్ స్టైల్‌ను చేయించుకున్నారు అదా. వెబ్‌సిరీస్‌లో నటించడం అదాకు ఇదే తొలిసారి. ఇక సినిమాల విషయానికి వసస్తే ఇటీవల విడుదలైన ‘కల్కి’లో నటించారు. అటు ‘కమాండో 3’, ‘మెన్ టు మెన్’, ‘బైపాస్ రోడ్’ సినిమాల్లో నటిస్తూ బాలీవుడ్‌లోనూ బిజీగా ఉన్నారు అదా. నిత్యా ఊపిరి భిన్నమైన పాత్రలు చేసే హీరోయిన్స్ జాబితాలో నిత్యామీనన్ ముందు వరసలో ఉంటారు. ‘అ!’ సినిమాలో నిత్యా లెస్బియన్‌గా నటించడం ఒక ఉదాహరణ. సౌత్‌లో తనకంటూ స్పెషల్ బ్రాండ్‌ను సంపాదించుకున్న మలయాళ సుందరి ఇప్పుడు సెల్‌ఫోన్ ఆడియన్స్‌కు కూడా దగ్గర కావడానికి ‘బ్రీత్’ సెకండ్ సీజన్ వెబ్ సీరిస్‌కు ఊ కొట్టారు. ఈ సెకండ్ సీజన్లో నిత్యామీనన్ వంతు షూటింగ్ కూడా పూర్తయింది. నిత్యాకు ఇదే ఫస్ట్ వెబ్ సిరీస్. మయాంక్ శర్మ దర్శకత్వం వహించిన ‘బ్రీత్ 2’లో అభిషేక్ బచ్చన్, అమిత్ సాద్, శ్యామి ఖేర్ ముఖ్యపాత్రల్లో నటించారు. ప్రముఖ బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌కు కూడా ఇదే తొలి వెబ్‌సిరీస్. ‘బ్రీత్’ ఫస్ట్ సీజన్లో మాధవన్ నటించారు. ఈ ఏడాది హిందీ తెరకూ పరిచయం కానున్నారు నిత్యామీనన్. ఆమె నటించిన హిందీ చిత్రం మిషన్ మంగళ్’ ఆగస్టు 15న విడుదల కానుంది. వెబ్ మణి ‘పెళ్లైన కొత్తలో’ (2006), ‘యమదొంగ’ (2007), ‘గోలీమార్’ (2010) చిత్రాలలో నటించి ఒకప్పుడు దక్షిణాదిలో బిజీ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న ప్రియమణి ఇప్పుడు డిజిటల్లో బిజీ కావాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్‌లో నటించడం కూడా మొదలుపెట్టారు. ఇందులో ప్రియమణితో కలిసి బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ నటిస్తున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకులు. మనోజ్ బాజ్‌పాయ్‌కి కూడా ఇదే తొలి వె»Œ æసిరీస్. గిల్టీ కియారా ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన కియారా అద్వానీని తెలుగు ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోలేరు. ఇప్పటికే బాలీవుడ్లో క్రేజ్ సంపాదించుకున్న కియారా గత ఏడాది ‘లస్ట్ స్టోరీస్’లో నటించి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇప్పుడు ‘గిల్టీ’ అనే మరో వెబ్ ఫిల్మ్‌కి సైన్ చేశారు కియారా. రుచి నరైన్ దర్శకత్వం వహిస్తున్నారు. సిటీకి కొత్తగా వచ్చిన ఓ పల్లెటూరి అమ్మాయికి కాలేజీలో ఎదురైన చేదు అనుభవాల నేపథ్యంలో ఈ వెబ్ ఫిల్మ్ తెరకెక్కుతోంది. కరిష్మా మెంటల్ హుడ్ 1990లలో బాలీవుడ్లో అగ్ర కథానాయికగా వెలిగిన కరిష్మా కపూర్ 2013 తర్వాత హీరోయిన్గా చేయలేదు. కొన్ని సినిమాల్లో మాత్రం అతి«థి పాత్రలు చేశారు. కానీ ఒక ఫుల్ లెంగ్త్ రోల్ చేయాలనే ఆకలితో ఆమె తిరిగి కెమెరా ముందకు వచ్చారు. ‘మెంటల్ హుడ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఇందులో కరిష్మా వంతు షూటింగ్ కూడా పూర్తయింది. ముంబైలోని ఓ సాధారణ గృహిణి తన ముగ్గురు పిల్లల అలనాపాలనా చూడటానికి ఓ తల్లిగా మానసికంగా ఎన్ని సమస్యలను ఎదుర్కొంటుంది అనే అంశాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు.– ముసిమి శివాంజినేయులు -
నాకలా ఉండటమే ఇష్టం : నిత్యామీనన్
చెన్నై : నాకలా ఉండటమే ఇష్టం అంటోంది నటి నిత్యామీనన్. ఇతర హీరోయిన్లకంటే ఈ అమ్మడు కాస్త భిన్నమని చెప్పకతప్పదు. ఎవరో ఏదో అంటారని కాకుండా తనకు అనిపించింది చేసేసే నటి నిత్యామీనన్. విమర్శలను అస్సలు పట్టించుకోని నటి ఈ అమ్మడు. ఆ మధ్య కాస్త లావెక్కింది. దానిపై కొందరు కామెంట్స్ చేస్తే, తానెలా ఉండాలో తనకు బాగా తెలుసని, తన గురించి ఆలోచించడం మానేసి ఎవరి పని వారు చేసుకోవడం మంచిదని చురకలు వేసింది. ఆ మధ్య అవకాశాలు సన్నగిల్లాయనే ప్రచారం జరిగింది. ఇప్పుడు మళ్లీ చేతి నిండా చిత్రాలతో బిజీ అయిపోయింది. హిందీతో సహా పలు భాషల్లో. తమిళంలో సైకో అనే చిత్రంలో నటిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లో నటించే అవకాశం వరించింది. వీటితో పాటు మాతృభాషలో రెండు చిత్రాలు, హిందీలో మిషన్ మంగళ్ అనే చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా చాలా సన్నబడి కొత్తఅందాలను సంతరించుకుంది. ఇంతకుముందు బొద్దుగా తయారయ్యిందని సెటైర్లు వేసిన వారే ఇప్పుడు వావ్ నిత్యా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల మీడియాకు పలు విషయాలను పంచుకుంది. అవేంటో చూసేద్దామా! నటీనటులను అభిమానులు చూసే కోణం వేరు, మమ్మల్ని మేము చేసుకునే కోణం వేరు అని చెప్పింది. ముఖ్యంగా ఒక ప్రముఖ నటిననే భావన తనకు ఉండదని చెప్పింది. తనను తాను ఒక సాధారణ మహిళగానే అనుకుంటానని అంది. షూటింగ్ లేని సమయాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు తన ఆలోచనలు సగటు మహిళ మాదిరిగానే ఉంటాయని పేర్కొంది. షూటింగ్ కారణంగా అలసిపోవడం సహజం అని, అలాంటి సమయంలో తనకు శక్తినిచ్చేది ప్రకృతినేనని చెప్పింది. -
మనతో మనం కనెక్ట్ అవ్వాలి
‘ఆర్టిస్టులను ప్రేక్షకులు చూసే కోణం వేరు, మమ్మల్ని మేము చూసుకునే కోణం వేరు. అందరికీ నేను నటి నిత్యా మీనన్‌ని కావచ్చు. కానీ నాకు కాదు’’ అంటారు నిత్యా మీనన్. షూటింగ్ లేని రోజు లేదా ఒంటరిగా ఉన్న సమయాల్లో ఈ బ్యూటీ ఏం చేస్తారో తెలుసా? ఆ విషయం గురించి నిత్యామీనన్ మాట్లాడుతూ – ‘‘నటిగా నా మీద ప్రేక్షకులకు కొన్ని అంచనాలు, అభిప్రాయాలు ఉండొచ్చు. అవన్నీ బయట నుంచి చూస్తూ ఏర్పరుచుకున్నవి. నా వరకూ నేను నటి నిత్యను కాదు. నార్మల్‌గా నాలాగే ఉండాలనుకుంటాను. నాతో నేను క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తుంటాను. షూటింగ్ చేస్తున్న సమయంలో చాలా అలసిపోతాం. కోల్పోయిన శక్తినంతా ఖాళీ సమయాల్లో తిరిగి సంపాదించుకుంటాను. సెల్‌ఫోన్ బ్యాటరీలు రీచార్జ్ చేసుకున్నట్టే ఇది కూడా (నవ్వుతూ). మనతో మనం కనెక్ట్ అయితేనే నేచర్‌తో కనెక్ట్ అవగలం. నా శక్తినంతా నేచర్ నుంచి తెచ్చుకుంటాను. కేవలం శక్తి మాత్రమే కాదు నా ఇన్స్పిరేషన్ కూడా నేచరే’’ అన్నారు. -
భలే ప్లాన్
గాల్లో బెలూన్లు ఎగరేసి ఎంజాయ్ చేస్తున్నారు నిత్యామీనన్. ‘బ్రీత్’ వెబ్ సిరీస్ సీజన్ 2 షూటింగ్ పూర్తికావడమే ఈ ఆనందానికి కారణం. ‘‘బ్రీత్’ షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశాం. ఒకరినొకరం బాగా మిస్ అవబోతున్నాం అని చెప్పడానికి బాధగా ఉంది. ఇప్పటివరకు యాక్టింగ్‌లో నా బెస్ట్ టైమ్ ఇదేనని భావిస్తున్నాను’’ అన్నారు నిత్యా. ‘బ్రీత్’ సెకండ్ సీజన్లో అభిషేక్ బచ్చన్ నటించారు. ఫస్ట్ సీజన్లో మాధవన్ నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. అన్నట్లు .. ఇంకో విషయం ఏంటంటే వెబ్‌సిరీస్‌లో నిత్యా నటించడం ఇదే తొలిసారి. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌వైపు మళ్లిన నిత్యాకు చేతిలో సినిమాలు లేవనుకుంటే మాత్రం పొరపాటే. ‘మిషన్ మంగళ్’ సినిమాతో ఈ ఏడాదే బాలీవుడ్ డోర్ కొట్టిన ఈ బ్యూటీ సౌత్‌లోనూ మస్త్ బిజీగా ఉన్నారు. తమిళంలో సైకో, ది ఐరన్‌లేడీ (జయలలిత బయోపిక్) సినిమాలతో పాటు కొన్ని మలయాళ చిత్రాలు చేస్తున్నారు. అలాగే మరికొన్ని వెబ్ సిరీస్‌లో నటించడానికి కథలు వింటున్నారట. ఇలా సినిమాలు, డిజిటల్ సెక్టార్‌ని బ్యాలెన్స్ చేస్తూ కెరీర్‌ను భలేగా ప్లాన్ చేసుకుంటున్నారు నిత్యామీనన్. -
నిత్యా.. నిజమేనా
‘ఆర్ఆర్ఆర్’లో ఎప్పటికప్పుడు స్టార్స్‌ను యాడ్ చేస్తూ ప్రాజెక్ట్‌ను మరింత ఎగై్జటింగ్‌గా మారుస్తున్నారు దర్శకుడు రాజమౌళి. ‘ఆర్ఆర్ఆర్’కు లేటెస్ట్గా నిత్యా మీనన్ కూడా జాయిన్ అవనున్నారట. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్). చరణ్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తున్నారు. తమిళ నటుడు సముద్రఖని, బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్రలు చేస్తున్నారు. తాజాగా ఓ కీలక పాత్ర కోసం నిత్యా మీనన్ పేరుని పరిశీలిస్తున్నారట చిత్రబృందం. ప్రస్తుతం ఆమెతో చర్చలు కూడా నడుస్తున్నాయని చిత్రబృందానికి సంబంధించిన విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మరి నిత్య పాత్ర గెస్ట్ రోల్లా ఉంటుందా? ఎన్టీఆర్‌కు జోడీగా నటిస్తారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ‘జనతా గ్యారేజ్’లో ఎన్టీఆర్, నిత్యా జంటగా నటించారు. మరి మళ్లీ జంటగా కనిపిస్తారా? వేచి చూడాలి. నిజానికి ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్ నటించాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్‌లో లేరు. చరణ్‌కు గాయం కారణంగా ప్రస్తుతం షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన చిత్రబృందం త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమెరా: సెంథిల్ కుమార్. -
‘ఆర్ఆర్ఆర్’లో నిత్య!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ భారీ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడిగా నటిస్తున్న డైసీ ఎడ్గర్ జోన్స్ కుటుంబ కారణాల వల్ల ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో మరో హీరోయిన్ను వెతికే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. అదే సమయంలో సౌత్ స్టార్ హీరోయిన్ నిత్యమీనన్‌కు రాజమౌళి నుంచి పిలుపు వచ్చినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే హైదరాబాద్‌లో నిత్యకు లుక్ టెస్ట్ నిర్వహించనున్నారట. మరి నిత్య నటించబోయేది ఎన్టీఆర్ జోడిగానేనా లేక మరో పాత్రా అన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ గాయం కారణంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. త్వరలోనే షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. -
తమ్ముడండి బాబూ!
ఒక్క ఫొటో ఎన్నో అర్థాలు చెబుతుంది. చూసే కళ్లను బట్టి అర్థాలు మారిపోతుంటాయి. ఇటీవల నిత్యా మీనన్ బయటపెట్టిన ఒక ఫొటో చాలామందికి ఒకే అర్థం చెప్పింది. ‘అయ్యో.. నా గుండె పగిలిపోయింది, అతనంటే చాలా అసూయగా ఉంది, ఈ ఫొటో చూసి తట్టుకోలేకపోతున్నాను’ అంటూ నిత్యా అభిమానులు తెగ బాధపడిపోయారు. ఓ కుర్రాణ్ణి నిత్యా హత్తుకున్న ఫొటో చూసి, అభిమానులు ఈ విధంగా స్పందించారు. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటో అదే. ఇంతకీ ఫొటోలో ఉన్న అబ్బాయి ఎవరు? నిత్యాకీ, అతనికీ లింక్ ఏంటీ? అంటే.. ఈ ఇద్దరి పరిచయం ఇప్పటి కాదట. ధ్యానం నేర్పించే ‘ఓ అండ్ ఓ అకాడమీ’, ‘వన్ నెస్ యూనివర్శిటీ’ స్కూల్స్‌లో ఇతగాడితో నిత్యాకు పరిచయం అయిందట. హాలీవుడ్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తున్న ఈ కుర్రాడి పేరు ఆలివర్ కాల్హాన్. అప్పుడప్పుడూ ఇద్దరూ కలుసుకుంటుంటారు. ఇటీవల కలిసినప్పుడు ఇలా ఆత్మీయంగా హత్తుకున్న ఫొటోను ‘ఫ్రెండ్షిప్, లవ్ అండ్ హ్యాపీనెస్’ అంటూ నిత్యామీనన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఫొటో చూసి చాలామంది తికమకపడ్డారు. నిత్యా, ఆలివర్ లవ్‌లో ఉన్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. ‘‘మీరనుకుంటున్నట్లు ఏమీ లేదు. తను నాకు మంచి స్నేహితుడు. చెప్పాలంటే చిన్న తమ్ముడిలాంటివాడు’’ అని నిత్యా పేర్కొనడంతో.. ‘హమ్మయ్య.. కమిట్ అయిపోయారనుకున్నాం. క్లారిఫికేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్’ అని కొందరు ఫాలోయర్లు సంబరపడిపోయారు. -
స్క్రీన్ టెస్ట్
ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి. ఏ నోట విన్నా రాజకీయమే. రచ్చబండ మీద, పొలం గట్ల దగ్గర అక్కడా ఇక్కడా అనే తేడా లేదు. ఎక్కడ చూసినా రాజకీయాలే. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. సినిమా సీన్లలో ఉండే రాజకీయాలను కథ నిర్ణయిస్తుంది. ఒకప్పుడు సినిమా, రాజకీయాలు రెండూ రెండు భిన్న కోణాలు. ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలు కలిసే ప్రయాణం చేస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదేమో. సినిమాల్లో రాజకీయాలు కాదు, రాజకీయాల్లో సినిమా స్టార్స్ గురించి ఈ వారం స్పెషల్ క్విజ్. 1. సినిమా వాళ్లల్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్‌కు (యం.పి) ఎన్నికైన మొట్టమొదటి తెలుగు నటుడు ఇతను. కాంగ్రెస్ పార్టీ తరపున ఒంగోలు నుంచి గెలుపొందిన ఈ నటుడు ఎవరో తెలుసా? ఎ) చిత్తూరు నాగయ్య బి) కాంతారావు సి) కొంగర జగ్గయ్య డి) యస్వీ రంగారావు 2. 1989లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన నటుడెవరో కనుక్కుందామా? ఎ) కృష్ణ బి) శోభన్‌బాబు సి) హరనాథ్ డి) శరత్‌బాబు 3. ప్రముఖ నటుడు చిరంజీవి 2008లో ‘ప్రజారాజ్యం’ పార్టీని స్థాపించారు. ఆ పార్టీకి ఎన్నికల కమిషన్ కేటాయించిన గుర్తు ఏంటో కనుక్కోండి? ఎ) రైలు బి) కారు సి) విమానం డి) స్కూటర్ 4. 2009 ఎలక్షన్స్‌లో వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ తరపున యం.ఎల్.ఏ గా గెలిచిన సినీ నటి ఎవరో తెలుసా? ( సికింద్రాబాద్ నియోజకవర్గం) ఎ) కుష్బూ బి) నగ్మా సి) సుహాసిని డి) జయసుధ 5. నటి రోజా వైయస్ఆర్ సీపీ తరపున పోటీ చేసి యం.ఎల్.ఏగా గెలుపొందారు. ఆమె ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారో తెలుసా? ఎ) నగరి బి) చిత్తూరు సి) పీలేరు డి) తిరుపతి 6. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి పార్లమెంటేరియన్‌గా గెలుపొందిన నటి? ఎ) హేమమాలిని బి) జయప్రద సి) జయబాధురి డి) రేఖ 7. ఈయన ప్రముఖ సినిమా రచయిత. తమిళనాట రాజకీయాల్లో చాలా కీలక పాత్రను పోషించారు. ఎవరా రచయిత? ఎ) కరుణానిధి బి) యం.జీ.ఆర్ సి) స్టాలిన్ డి) నెపోలియన్ 8. నటి రాధిక భర్త శరత్‌కుమార్. అనేక తెలుగు సినిమాల్లో కూడా నటించారు. తమిళ రాజకీయల్లో క్రియాశీలక వ్యక్తి. 2007లో ఆయన తన సొంత పొలిటికల్ పార్టీని స్థాపించారు. ఆ పార్టీ పేరేంటి? ఎ) హిందూ మక్కళ్ కట్చి బి) కొంగునాడు మున్నేట్ర కళగం సి) తమిళ్ మానిల కాంగ్రెస్ డి) ఆల్ ఇండియా సమత్తువ మక్కళ్ కట్చి 9. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గ యం.ఎల్.ఏగా గెలుపొందిన తెలుగు సినీ ప్రముఖుడెవరో కనుక్కోండి? ఎ) మురళీమోహన్ బి) ఏవీయస్ సి) అలీ డి) కోట శ్రీనివాసరావు 10. 1995వ సంవత్సరం నుంచి 6 సంవత్సరాలు రాజ్యసభలో పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగిన తెలుగు నటుడెవరు? ఎ) చిరంజీవి బి) మోహన్‌బాబు సి) బాలకృష్ణ డి) ఏయన్నార్ 11. 2019 కర్ణాటక ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాను అని ఈ మధ్యే ప్రకటించిన నటుడెవరో కనుక్కోండి? ఎ) సాయికుమార్ బి) ప్రకాశ్ రాజ్ సి) అయ్యప్ప.పి.శర్మ డి) యశ్ 12. 1998లో భారతీయ జనతా పార్టీలో చేరి, మెదక్ నియోజక వర్గం నుంచి యం.పీ గా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎవరా నటి? ఎ) శారద బి) కవిత సి) విజయశాంతి డి) విజయనిర్మల 13. ప్రముఖ నటి సౌందర్య ప్రచారానికి వెళ్తూ ప్రమాదవశాత్తు హెలికాప్టర్ కుప్పకూలి మరణించారు. ఆమె ఏ సంవత్సరంలో మరణించారు? ఎ) 2000 బి) 2001 సి) 2002 డి) 2004 14. ఈ నటుడు 2017లో కర్ణాటకలోని ఓ పార్టీలో చేరారు. ఐదు నెలల తర్వాత ఆ పార్టీకి తిలోదకాలిచ్చి ప్రజాకీయ అనే సొంత పార్టీని ప్రారంభించారు. ఎవరా నటుడు? ఎ)ఉపేంద్ర బి) పునీత్ రాజ్‌కుమార్ సి) సుదీప్ డి) శివ రాజ్‌కుమార్ 15. 2006లో కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా నియమితులైన దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) దాసరి నారాయణరావు బి) కె.రాఘవేంద్ర రావు సి) దిలీప్ కుమార్ డి) రాజేష్‌ఖన్నా 16. ‘మక్కళ్ నీది మయం’ అనే పొలిటికల్ పార్టీని స్థాపించిన తమిళ నటుడు ఎవరు? ఎ) కమల్‌హాసన్ బి) రజనీకాంత్ సి) విశాల్ డి) విజయ్‌కాంత్ 17. ఈయన ప్రముఖ నటుడు. యం.ఎల్.ఏ గా రెండుసార్లు గెలుపొందారు. రెండుసార్లు ఓడిపోయారు. ఆ నటుడెవరు? ఎ) సుమన్ బి) పోసాని కృష్ణమురళీ సి) బాబుమోహన్ డి) విజయ్ చందర్ 18. 1999లో పదమూడవ లోక్‌సభకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బాపట్ల నుంచి యంపీగా పోటీ చేసి గెలుపొందిన తెలుగు నిర్మాత ఎవరు? ఎ) సి.అశ్వనీదత్ బి) మాగంటి బాబు సి) జి.ఆదిశేషగిరిరావు డి) డి.రామానాయుడు 19. కాకినాడ నుంచి పోటీచేసి 12వ లోక్‌సభలో అడుగుపెట్టిన ప్రముఖ నటుడు ఎవరు? ఎ) కృష్ణ బి) మురళీమోహన్ సి) కైకాల సత్యనారాయణ డి) కృష్ణంరాజు 20. తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత తమిళ ప్రజల గుండెల్లో నిలిచారు. ఆమె మరణానంతరం ఆమెపై 3 బయోపిక్‌లు నిర్మితమవుతున్నాయి. అందులో ఓ చిత్రంలో జయలలిత పాత్రలో నటిస్తున్న నటి ఎవరో తెలుసా? ఎ) నిత్యామీనన్ బి) అనుష్క సి) హన్సిక డి) త్రిష మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (సి) 2) (ఎ) 3) (ఎ) 4) (డి) 5) (ఎ) 6) (బి) 7) (ఎ) 8) (డి) 9) (డి) 10) (బి) 11) (బి) 12) (సి) 13) (డి) 14) (ఎ) 15) (ఎ) 16) (ఎ) 17) (సి) 18) (డి) 19) (డి) 20) (ఎ) నిర్వహణ: శివ మల్లాల -
థ్రిల్లింగ్ ఎంట్రీ
ఫీచర్ ఫిల్మ్స్‌తో పాటుగా డిజిటల్ షోలు కూడా పోటీ పడుతున్నాయి. యాక్టర్స్ కూడా ఫీచర్‌ని, డిజిటల్‌ని వేరు చేయడం లేదు. ఏది వీలుంటే అందులో నటించడానికి అస్సలు సంకోచించడం లేదు. తాజాగా నిత్యామీనన్ కూడా డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. అమేజాన్ రూపొందిస్తున్న ‘బ్రీత్’ సీజన్ 2లో లీడ్ రోల్లో కనిపించనున్నారామె. అభిషేక్ బచ్చన్ హీరోగా నటించనున్నారు. ఈ విషయం గురించి నిత్య మాట్లాడుతూ– ‘‘బ్రీత్’ నా తొలి డిజిటల్ షో. ఇలాంటి థ్రిల్లింగ్ సిరీస్ ద్వారా ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆర్టిస్ట్‌లకు ఇలాంటి సిరీస్‌లు చాలా ఫర్పెక్ట్ అనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఎపిసోడ్ ఎపిసోడ్‌కి చాలా సమయం ఉంటుంది. ప్రతి పాత్రను లోతుగా ఆవిష్కరించవచ్చు. డిజిటల్ సిరీస్‌లో కంటెంట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు కూడా’’ అని పేర్కొన్నారామె. -
సైంటిస్ట్ వర్ష
ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) మార్స్ మిషన్ విజయవంతం కావడానికి కృషి చేసిన మహిళా శాస్త్రవేత్తల గురించి హిందీలో రూపొందుతున్న సినిమా ‘మిషన్ మంగళ్’. అక్షయ్ కుమార్, విద్యా బాలన్, తాప్సీ, నిత్యా మీనన్, సోనాక్షీ సిన్హా, కీర్తి కుల్హారీ ముఖ్య తారలుగా నటిస్తున్నారు. ఇందులో సైంటిస్ట్ వర్షా పిళ్లై పాత్రలో నిత్యా మీనన్ కనిపిస్తారు.‘‘మిషన్ మంగళ్’ సినిమా షూట్లో చివరి రోజు పాల్గొంటున్నాను’’అని ఆదివారం పేర్కొన్నారు నిత్యా మీనన్. జగన్ శక్తి దర్శకుడు. నిత్యా మీనన్‌కు హిందీలో తొలి చిత్రమిది. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. -
చక్కనమ్మ చిక్కింది
చక్కనమ్మ చిక్కినా అందమే అన్నది నానుడి. మరీ ముఖ్యంగా హీరోయిన్లు బొద్దుగా ఉన్నా సరే.. జీరో సైజ్ అంటూ చిక్కినా సరే.. ప్రేక్షకులు మాత్రం అభిమానించకుండా ఉండలేరు. కెరీర్ తొలినాళ్లలో సన్నగా ఉన్న మలయాళ బ్యూటీ నిత్యామీనన్ ఆ తర్వాత బొద్దుగా తయారయ్యారు. ‘మనం బొద్దుగా ఉన్నామా? సన్నగా ఉన్నామా? అన్నది ముఖ్యం కాదు. నటన ముఖ్యం. మన పాత్రలకి న్యాయం చేస్తున్నామా? లేదా? అన్నదే చూడాలి’ అంటూ నిత్యామీనన్ ఆ మద్య పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఈ మలయాళ బ్యూటీకి తెలుగులో ఆఫర్లేవీ లేకున్నా తమిళ్, హిందీ చిత్రాలతో బిజీగానే ఉన్నారు. తాజాగా ఓ కొత్త సినిమా అంగీకరించినట్లు ఉన్నారు. ‘హైవే పై షూట్.. కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు త్వరలో చెబుతాను’ అంటూ నిత్యామీనన్ సోమవారం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ ఫొటో చూసి బొద్దుగా ఉన్న నిత్య సన్నబడి మునుపటిలా నాజూకుగా ఉన్నారంటున్నారు ఆమె అభిమానులు. -
నిత్యా మీనన్ అంతలా మారిపోయిందే..!
చేసింది కొన్ని సినిమాలే.. అయినా నటనలో మాత్రం నిత్యామీనన్ తన మార్క్‌ను చూపిస్తుంది. ఆ మధ్య సినిమాలకు కాస్త దూరంగా ఉన్నట్లు కనిపించినా.. ప్రస్తుతం మాత్రం స్పీడు పెంచేస్తోంది. అయితే అప్పట్లో నిత్యామీనన్ లావుగా ఉందని.. అందుకే సినిమా అవకాశాలు తగ్గాయని రూమర్స్ వినిపించాయి. అదే మాట నిత్యామీనన్‌ను అడిగితే.. నేను ఎలా ఉంటే వారికేంటి..నటన ముఖ్యం కదా అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం నిత్యామీనన్ పూర్తిగా జీరో సైజ్‌లోకి మారినట్టు కనిపిస్తోంది. క్రీడా నేపథ్యంలో తెరకెక్కబోతున్న చిత్రం కోసమే బరువు తగ్గిందని సమాచారం. ‘హైవే పై షూట్.. కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రకటన త్వరలో చెబుతాను’ అంటూ నిత్యా మీనన్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది. నిత్యా మీనన్ ప్రస్తుతం ప్రాణ, ఐరన్ లేడీ, బాలీవుడ్లో అక్షయ్ కుమార్ ‘మిషన్ మంగళ్’తో బిజీగా ఉంది. Highway shoots... 🔥 Announcement of a new project coming sooooon ...... 😊! pic.twitter.com/Do9raXRc7n — Nithya Menen (@MenenNithya) January 28, 2019 -
స్క్రీన్ టెస్ట్
సినిమా డైలాగ్ అనగానే యన్టీఆర్ నటించిన ‘దానవీర శూర కర్ణ’ చిత్రంలో ‘ఆచార్య దేవా’ ఏమంటివీ.. ఏమంటివీ ... అనే డైలాగ్ ఇప్పటికీ గుర్తొస్తుంది. 40 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా మాటలు ఇప్పటికీ వినిపిస్తున్నాయంటే డైలాగ్‌కి ఉన్న పవర్ అది. 2018లో విడుదలైన చిత్రాల్లోని పలు ఫేమస్ డైలాగ్‌లు ఈ వారం క్విజ్.... 1. ‘‘ప్రతిభ ఇంటిపట్టునుంటే... ప్రపంచానికి పుట్టగతులుండవు’’ ఈ డైలాగ్ ‘మహానటి’ చిత్రంలోనిది. చిత్రంలో ఈ డైలాగ్ పలికిన నటుడెవరో తెలుసా? ఎ) మోహన్‌బాబు బి) ప్రకాశ్ రాజ్ సి) దుల్కర్ సల్మాన్ డి) నరేశ్ 2. ‘ఇట్స్ షో టైమ్’ అనే డైలాగ్‌తో హల్చల్ చేసిన ప్రముఖ హీరో ఎవరో కనుక్కోండి. ఈ డైలాగ్ ఉన్న సినిమా 2019 ఆగస్టులో విడుదలవుతుంది? ఎ) మహేశ్‌బాబు బి) వెంకటేశ్ సి) ప్రభాస్ డి) రానా 3. ‘‘వయొలెన్స్ మా డీఎన్ఏ కాదు.. మా మీద పడ్డ అత్యవసర పరిస్థితి...’ అనే డైలాగ్ చెప్పిన హీరో ఎవరో తెలుసా? (చిన్న క్లూ:ఈ డైలాగ్ రైటర్ త్రివిక్రమ్) ఎ) యన్టీఆర్ బి) బాలకృష్ణ సి) నాగార్జున డి) వెంకటేశ్ 4. ‘‘ఇంకోసారి అమ్మాయిలు, ఆంటీలు, ఫిగర్లు అని తిరిగావంటే.. యాసిడ్ పోసేస్తా’’ అనే ఫేమస్ డైలాగ్‌ను విజయ్ దేవరకొండతో చెప్పిన హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి? ఎ) ప్రియాంక జవాల్కర్ బి) మెహరీన్ సి) షాలినీ పాండే డి) రష్మికా మండన్నా 5. ‘‘క్యారెక్టర్ వదిలేయడమంటే ప్రాణాలు వదిలేయడమే, చావురాక ముందు చచ్చిపోవటమే’’ ఈ డైలాగ్ చెప్పిన ప్రముఖ హీరో ఎవరో తెలుసా? (చిన్న క్లూ: ఈ డైలాగ్‌ను రాసింది వక్కంతం వంశీ) ఎ) నాని బి) విజయ్ దేవరకొండ సి) కల్యాణ్ రామ్ డి) అల్లు అర్జున్ 6. ‘‘యూనిఫామ్‌లో ఉంటే గన్‌లో ఆరే బుల్లెట్లు, యూనిఫామ్ తీసేస్తే దీనమ్మ రాయితో చంపుతానో, రాడ్‌తో చంపుతానో నాకే తెలియదు’’ ఈ డైలాగ్ చెప్పిన ప్రముఖ హీరో ఎవరో కనుక్కోండి? (ఈ చిత్రానికి విక్రమ్ సిరికొండ దర్శకుడు) ఎ) బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బి) రవితేజ సి) నాగచైతన్య డి) గోపీచంద్ 7. ‘‘ఆడోళ్లు భలే కఠినాత్ములు...’ ఈ డైలాగ్‌ను ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలో హీరో నాని చెప్తాడు. ఈ డైలాగ్ రైటర్ ఎవరు? ఎ) వక్కంతం వంశీ బి) మేర్లపాక గాంధీ సి) పెంచల్ దాస్ డి) ఆకుల శివ 8. ‘వియ్ ఆర్ లివింగ్ ఇన్ ఏ సొసైటీ... ప్రతి ఒక్కరికీ బరువు, బాధ్యత ఉండాలి...’ అనే సోషల్ మెసేజ్ డైలాగ్ ఏ సినిమాలోనిదో కనిపెట్టండి? ఎ) నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా బి) భరత్ అనే నేను సి) టచ్ చేసి చూడు డి) కవచం 9. ‘చేపలకి కూడా కన్నీళ్లుంటాయి బాస్... నీళ్లల్లో ఉంటాం కదా కనిపించవు అంతే’ ఈ డైలాగ్‌ను హీరో నాని ‘అ!’ చిత్రంలోని చేప పాత్ర ద్వారా చెప్పారు. ఈ చిత్రంలో కృష్ణవేణి పాత్రలో నటించిన నటి ఎవరో కనిపెట్టండి? ఎ) తమన్నా బి) కాజల్ అగర్వాల్ సి) నిత్యామీనన్ డి) రెజీనా 10. ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రంలో హీరో నితిన్ చెప్పిన ‘‘వర్షాకాలంలో కలుసుకున్న మేము, శీతాకాలంలో ప్రేమించుకొని, వేసవికాలంలో విడిపోయాము’’ డైలాగ్ రాసిందెవరో తెలుసా?(ఈ చిత్రానికి ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ఓ నిర్మాత) ఎ) చైతన్యకృష్ణ బి) సత్యానంద్ సి) త్రివిక్రమ్ డి) యం.రత్నం 11. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘మహానటి’. ఈ చిత్రానికి మాటల రచయిత ఎవరో తెలుసా? ఎ) కోన వెంకట్ బి) అబ్బూరి రవి సి) నాగ్ అశ్విన్ డి) బుర్రా సాయిమాధవ్ 12. ‘‘సల్మాన్‌ఖాన్ జిందాబాద్, షారుక్æఖాన్ జిందాబాద్, ఆమిర్ ఖాన్ జిందాబాద్, అబ్దుల్ కలాం జిందాబాద్, ఇన్సాన్ జిందాబాద్, మొహబ్బత్ జిందాబాద్, మేరీ మెహబూబా జిందాబాద్’’ ఈ డైలాగ్ ‘మెహబూబా’ చిత్రంలోనిది. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఆకాష్ పూరి. డైలాగ్ రైటర్ ఎవరో చెప్పుకోండి? ఎ) పూరి జగన్నాథ్ బి) భాస్కరభట్ల సి) కందికొండ డి) వనమాలి 13 ‘‘కాలేజీలో ఉన్న ప్రతివాడికి రాఖీ కడతా, వాడికి తప్ప... బికాజ్ ఐ లవ్ హిమ్’’ అని హీరోయిన్ రాశీ ఖన్నా ఏ హీరో గురించి అంటుందో కనిపెట్టండి? ఎ) వరుణ్ తేజ్ బి) సాయిధరమ్ తేజ్ సి) సందీప్ కిషన్ డి) నాగౖచైతన్య 14. ‘‘ఏయ్ లేవయ్యా లే.. ఏంటి ఫాలో చేస్తున్నావా అని హీరోయిన్ అంటే... ఆ మీకు తెలిసిపోయిందా. అయినా మీరు ఇలా దగ్గరికొచ్చి మాట్లాడటం ఏం బాలేదండి...’’ అని హీరో శర్వానంద్ ఏ హీరోయిన్ని ఉద్దేశించి అంటాడో కనుక్కోండి? ఎ) లావణ్యా త్రిపాఠి బి) అనుపమా పరమేశ్వరన్ సి) సాయి పల్లవి డి) నిత్యామీనన్ 15. ‘‘అబద్ధాలు చెబితే అమ్మాయిలు పుడతారో లేదో తెలియదు కానీ, అబద్ధాలు చెబితే అమ్మాయిలు కచ్చితంగా పడతారు...’ ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరో తెలుసా? ఎ) రామ్ బి) అఖిల్ సి) రాహుల్ రవీంద్రన్ డి) నవీన్ చంద్ర 16. ‘‘ఫణీంద్ర భూపతి నాయుడు.. నువ్వు భయపడాల్సింది మేకను చంపిన సింహాల గుంపును చూసి కాదు, సింహాల మందకు ఎదురు తిరిగిన మేక గురించి’’ అనే డైలాగ్ ‘రంగస్థలం’ చిత్రంలోనిది. ఫణీంద్ర నాయుడుగా నటించింది ఎవరు? ఎ) ఆది పినిశెట్టి బి) రాజీవ్ కనకాల సి) ‘జబర్దస్త్’ మహేశ్ డి) జగపతిబాబు 17. ‘‘అమ్మాయిలతో ప్రాబ్లమ్ ఇదేరా, మనం వాళ్లను చూసినా వాళ్లు మనల్ని చూసినా డిస్ట్రబ్ అయ్యేది మనమేరా’’ ఈ డైలాగ్ ‘శ్రీనివాస కల్యాణం’ చిత్రంలోనిది. డైలాగ్ రైటర్ ఎవరో తెలుసా? ఎ) ప్రసన్నకుమార్ బెజవాడ బి) విజయేంద్ర ప్రసాద్ సి) పోసాని కృష్ణమురళి డి) వేగేశ్న సతీశ్ 18. ‘‘సినిమా, సాహిత్యం బతికే ఉంటాయి. అంతే.. అని నరేశ్ అంటే, సాహిత్యం అన్నావ్ ఓకే, సినిమా...’ అని సుధీర్‌బాబు అనే డైలాగ్ ‘సమ్మోహనం’ చిత్రం లోనిది. డైలాగ్ రైటర్ ఎవరో తెలుసా? ఎ) ఇంద్రగంటి మోహనకృష్ణ బి) తనికెళ్ల భరణి సి) శ్రీనివాస్ అవసరాల డి) జనార ్ధన మహర్షి 19. ‘ఎవడు పడితే వాడు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డా.. భాగమతి అడ్డా’’ అనే డైలాగ్ ‘భాగమతి ’ చిత్రంలోనిది. అనుష్క టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాణ సంస్థ ఏది? ఎ) గీతా ఆర్ట్స్ బి) వైజయంతీ మూవీస్ సి) యూవీ క్రియేషన్స్ డి) సురేశ్ ప్రొడక్షన్స్ 20. ‘‘నేలటిక్కెట్టుగాళ్లతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు’’ అనే డైలాగ్ ‘నేలటిక్కెట్టు’ చిత్రంలో హీరో రవితేజ చెబుతారు. ఈ చిత్రదర్శకుడెవరో తెలుసా? ఎ) వీఐ ఆనంద్ బి) కల్యాణ్ కృష్ణ సి) వీవీ వినాయక్ డి) శ్రీను వైట్ల మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి )2) సి 3) ఎ 4) డి 5) డి 6) బి 7) బి 8) బి9) సి 10) ఎ 11) డి 12) ఎ 13) ఎ 14) సి 15) ఎ 16) డి 17) డి 18) ఎ 19) సి 20) బి నిర్వహణ: శివ మల్లాల