
చేసింది కొన్ని సినిమాలే.. అయినా నటనలో మాత్రం నిత్యామీనన్ తన మార్క్‌ను చూపిస్తుంది. ఆ మధ్య సినిమాలకు కాస్త దూరంగా ఉన్నట్లు కనిపించినా.. ప్రస్తుతం మాత్రం స్పీడు పెంచేస్తోంది. అయితే అప్పట్లో నిత్యామీనన్ లావుగా ఉందని.. అందుకే సినిమా అవకాశాలు తగ్గాయని రూమర్స్ వినిపించాయి.
అదే మాట నిత్యామీనన్‌ను అడిగితే.. నేను ఎలా ఉంటే వారికేంటి..నటన ముఖ్యం కదా అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం నిత్యామీనన్ పూర్తిగా జీరో సైజ్‌లోకి మారినట్టు కనిపిస్తోంది. క్రీడా నేపథ్యంలో తెరకెక్కబోతున్న చిత్రం కోసమే బరువు తగ్గిందని సమాచారం. ‘హైవే పై షూట్.. కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రకటన త్వరలో చెబుతాను’ అంటూ నిత్యా మీనన్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది. నిత్యా మీనన్ ప్రస్తుతం ప్రాణ, ఐరన్ లేడీ, బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ ‘మిషన్ మంగళ్’తో బిజీగా ఉంది.
Highway shoots... 🔥
— Nithya Menen (@MenenNithya) January 28, 2019
Announcement of a new project coming sooooon ...... 😊! pic.twitter.com/Do9raXRc7n
Comments
Please login to add a commentAdd a comment