Iron Lady
-
ఉక్కు మహిళగా కంగనా
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఈ మధ్య ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలపైనే దృష్టి పెట్టారు. ఇప్పటికే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, నటి జయలలిత పాత్రలో ‘తలైవి’ సినిమాను పూర్తి చేసిన కంగన ఇప్పుడు మరో పవర్ఫుల్ పాత్రలో నటించేందుకు పచ్చజెండా ఊపారు. అది కూడా దేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా (ఐరన్ లేడీ) పేరున్న ఇందిరా గాంధీ పాత్ర చేయనున్నారు. ‘‘ఈ సినిమా ఇందిరా గాంధీ జీవిత చరిత్ర కాదు... అయితే ఆమె జీవితంలో జరిగిన ప్రధాన ఘట్టం నేపథ్యంలో ఉంటుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. భారతదేశంలో నెలకొన్న రాజకీయాలపై ఇప్పటి తరం వారికి మా సినిమా అవగాహన కల్పిస్తుంది. నా స్నేహితుడు సాయి కబీర్ (చిత్రదర్శకుడు)తో కలిసి రాజకీయ నేపథ్యం ఉన్న ఈ కథలో నటిస్తున్నందుకు హ్యాపీ. ‘మణికర్ణిక’ చిత్రబృందమే ఈ సినిమాకు కూడా పని చేస్తుంది’’ అని కంగనా రనౌత్ పేర్కొన్నారు. కాగా ఇప్పటికే కంగనపై ఫొటోషూట్ కూడా చేశారు. ఇందిరాగాంధీ లుక్‌లో కంగన బాగున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు. ఓ పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందనుందని కంగన పేర్కొన్నారు. ఇందులో లాల్‌బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ పాత్రలు కూడా ఉంటాయి. -
అందుకే ఐరన్ లేడీ చేస్తున్నా!
దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా మూడు నాలుగు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో నిత్యా మీనన్ నటిస్తున్న ‘ఐరన్ లేడీ’ ఒకటి. జయలలిత జీవితంతో మూడు నాలుగు సినిమాలు రూపొందుతున్న నేపథ్యంలో మీరు నటిస్తున్న ‘ఐరన్ లేడీ’ ప్రత్యేకత ఏంటి? ఒకే వ్యక్తి గురించి ఇన్ని సినిమాలు వస్తున్నా మీరు నటించడానికి కారణం ఏంటి? అనే ప్రశ్నలు నిత్యా మీనన్ ముందుంచితే – ‘‘నిజమే... జయలలితగారి జీవితంపై సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తున్నాయని నాకు లె లుసు. అందుకే మనం ఎందుకు చేయాలి? అనే అనుమానం నాకూ వచ్చింది. నా సందేహాన్ని ‘ఐరన్ లేడీ’ దర్శకురాలు ప్రియదర్శిని ముందుంచాను. దానికి ఆమె చెప్పిన సమాధానం నాకు చాలా సంతృప్తినిచ్చింది. ‘జయలలితగారిపై ఎవరెన్ని సినిమాలు తీసినా తీయనివ్వండి. కానీ, మనం తీసే సినిమా ఎంత గొప్పగా ఉంటుందనేదే పాయింట్. నేను జయలలితగారిని వ్యక్తిగతంగా చాలాసార్లు కలిశాను. ఆమెను దగ్గరినుంచి గమనించాను, చాలా విషయాలు మాట్లాడాను’ అన్నారు ప్రియదర్శిని. ఆమె మాటల్లో చాలా కాన్ఫిడెన్స్ కనిపించింది. మనం మంచి సినిమా చేస్తున్నాం అనే నమ్మకం కలిగింది. అందుకే ధైర్యంగా ‘ఐరన్ లేడీ’లో నటిస్తున్నాను’’ అన్నారు. -
‘ఆ సినిమాలకు’ తొలగిన అడ్డంకులు
సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న పలు చిత్రాల నిర్మాణాలకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యాయి. ప్రముఖ నటి రమ్యకృష్ణ క్వీన్‌కు, నటి కంగనా రనౌత్ తలైవికి, నిత్యా మీనన్ ది ఐరన్ లేడీ చిత్రాలకు ఆటంకాలు తొలిగిపోయాయి. వీటి నిర్మాణాలను నిర్భయంగా జరుపుకోవచ్చు. అందుకు స్వయంగా మద్రాసు హైకోర్టునే పచ్చజెండా ఊపింది. దర్శకుడు విజయ్... జయలలిత బయోపిక్‌ను తలైవి పేరుతో నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్న విషయం, అందులో జయలలిత పాత్రలో బాలీవుడ్ సంచలన నటి కంగనారనౌత్ నటిస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా మహిళా దర్శకురాలు ప్రియదర్శిని దీ ఐరన్ లేడీ పేరుతో చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో జయలలితగా నటి నిత్యామీనన్ నటించనున్న సంగతి విదితమే. ఇకపోతే దర్శకుడు గౌతమ్ మీనన్ జయలలిత జీవిత చరిత్రను నటి రమ్యకృష్ణ టైటిల్ పాత్రలో క్వీన్ అనే వెబ్ సిరీస్‌ను రూపొందించారు. కాగా వీటిని తన అనుమతి లేకుండా రూపొందించడాన్ని నిషేధించాలని జయలలిత సోదరుడి కుమార్తె దీప మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇప్పటికే ఒకసారి విచారణ జరిగింది. దీప పిటిషన్‌కు సమాధానం ఇస్తూ పిటిషన్‌ను దాఖలు చేయాల్సిందిగా దర్శకుడు గౌతమ్‌మీనన్‌కు, విజయ్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. గురువారం న్యాయమూర్తులు సెంథిల్‌కుమార్, రామమూర్తిల సమక్షంలో విచారణకు వచ్చింది. ఇరు తరఫు వాదనలు విన్న న్యాయమూర్తులు జయలలిత బయోపిక్‌ను చిత్రాలుగా తెరకెక్కించడాన్ని నిషేధించలేం అని తీర్పునిచ్చారు. అయితే దర్శక నిర్మాతలు ఇది కల్పిత సన్నివేశాలతో రూపొందించినట్లు టైటిల్ కార్డులో ప్రకటించాలని ఆదేశించారు. కాగా ఇప్పటికే పూర్తి అయిన రమ్యకృష్ణ నటించిన వెబ్ సిరీస్ క్వీన్ శనివారం నుంచి ఆన్లైన్లో ప్రసారం కానుంది. -
రాజీ పడేది లేదు
నటి, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా వెండితెరపైకి రాబోతున్న సినిమాల్లో ‘ది ఐరన్ లేడీ’ కూడా ఒకటి. ఇందులో జయలలితగా నిత్యామీనన్ నటించనున్నారు. దర్శకురాలు ప్రియదర్శిని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ఏవీ రాక పోవడంతో సెట్స్‌పైకి వెళ్తుందా? అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందిస్తూ ప్రియదర్శిని ఓ లేఖను విడుదల చేశారు. ‘‘ది ఐరన్ లేడీ’ సినిమా కోసం ఎంతోమంది హీరోయిన్లను పరిశీలించి ఆరు భాషలు మాట్లాడగల, భరత నాట్యంలో ప్రావీణ్యత ఉన్న నిత్యామీనన్‌ను ఎంచుకున్నాం. బయోపిక్‌ను తెరకె క్కించాలంటే చాలా అంశాల గురించి ఆలోచించాలి. ఇదొక చాలెంజ్ లాంటిది. ఎంతో బాధ్యత మాపై ఉంటుంది. విమర్శలు, వివాదాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అందుకే ప్రీ–ప్రొడక్షన్ కార్యక్రమాలను రాజీ పడకుండా చేస్తున్నాం’’ అన్నది ఆ లేఖ సారాంశం. ‘‘ది ఐరన్ లేడీ’ సినిమా కోసం నాకు ప్రత్యేకమైన శిక్షణ ఏం అవసరం లేదు. నాకు భరతనాట్యం వచ్చు. తమిళంలో స్పష్టంగా మాట్లాడగలను. బయోపిక్ తీయడం అంత ఈజీ కాదు’’ అన్నారు నిత్యామీనన్. -
నిత్యా మీనన్ అంతలా మారిపోయిందే..!
చేసింది కొన్ని సినిమాలే.. అయినా నటనలో మాత్రం నిత్యామీనన్ తన మార్క్‌ను చూపిస్తుంది. ఆ మధ్య సినిమాలకు కాస్త దూరంగా ఉన్నట్లు కనిపించినా.. ప్రస్తుతం మాత్రం స్పీడు పెంచేస్తోంది. అయితే అప్పట్లో నిత్యామీనన్ లావుగా ఉందని.. అందుకే సినిమా అవకాశాలు తగ్గాయని రూమర్స్ వినిపించాయి. అదే మాట నిత్యామీనన్‌ను అడిగితే.. నేను ఎలా ఉంటే వారికేంటి..నటన ముఖ్యం కదా అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం నిత్యామీనన్ పూర్తిగా జీరో సైజ్‌లోకి మారినట్టు కనిపిస్తోంది. క్రీడా నేపథ్యంలో తెరకెక్కబోతున్న చిత్రం కోసమే బరువు తగ్గిందని సమాచారం. ‘హైవే పై షూట్.. కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రకటన త్వరలో చెబుతాను’ అంటూ నిత్యా మీనన్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది. నిత్యా మీనన్ ప్రస్తుతం ప్రాణ, ఐరన్ లేడీ, బాలీవుడ్లో అక్షయ్ కుమార్ ‘మిషన్ మంగళ్’తో బిజీగా ఉంది. Highway shoots... 🔥 Announcement of a new project coming sooooon ...... 😊! pic.twitter.com/Do9raXRc7n — Nithya Menen (@MenenNithya) January 28, 2019 -
ఐరన్ లేడీ
2016 డిసెంబర్ 5... నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, తమిళ ప్రజలు ‘అమ్మ’ అని ప్రేమగా పిలిచే జయలలిత అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించిన రోజు. ఆ తర్వాత తమిళనాట రాజకీయాల్లో చాలా గందరగోళమే ఏర్పడింది. అది అప్రస్తుతం. ఈ ఏడాది జయలలిత జీవితం ఆధారంగా సుమారు నాలుగు వరకూ బయోపిక్‌లను అనౌన్స్ చేశారు తమిళ దర్శకులు. అందులో లేడీ డైరెక్టర్ ప్రియ దర్శని తెరకెక్కించనున్న ‘ది ఐరన్ లేడీ’ ఒకటి. జయలలిత రెండో వర్ధంతి సందర్భంగా ‘ది ఐరన్ లేడీ’ చిత్రం ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. నిత్యా మీనన్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాను పేపర్ టేల్స్ సంస్థ నిర్మిస్తోంది. ‘‘ఐరన్ లేడీ, అమ్మ’ జయలలితగారి రెండో వర్ధంతి సందర్భంగా ఆవిడకు నా నివాళి అర్పిస్తున్నాను’’ అని నిత్యామీనన్ పేర్కొన్నారు. -
ది ఐరన్ లేడి
మాజీ నటి, రాజకీయ నాయకురాలు, తమిళ ప్రజల ‘పురిట్చి తలైవి’ (విప్లవ నాయకురాలు) జయలలిత జీవితం ఆధారంగా తమిళంలో నాలుగు బయోపిక్స్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అందులో దర్శకురాలు ప్రియదర్శిని తెరకెక్కించబోయే ‘ఐరన్ లేడీ’ ఒకటి. ఈ సినిమాలో టైటిల్ రోల్‌ను నిత్యా మీనన్ పోషించనున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ– ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం విశేషాలను దర్శకురాలు ప్రియదర్శని పంచుకున్నారు. ‘‘జయలలితగారి పాత్ర పోషించడానికి చాలామంది హీరోయిన్ల పేర్లను పరిశీలించాం. ఫైనల్‌గా నిత్యా మీనన్ అయితే బావుంటుందని భావించాం. నిత్యా కూడా క్యారెక్టర్‌కు బాగా సూట్ అవుతున్నారు. జయలలితగారి ఆప్త మిత్రురాలు శశికళ పాత్రకు వరలక్ష్మీ శరత్‌కుమార్‌ని అనుకుంటున్నాం. మిగతా నటీనటుల పేర్లను చిత్రం ప్రారంభోత్సవం రోజు చెబుతాం’’ అన్నారు. సినిమా కథ గురించి చెబుతూ – ‘‘జయలలితగారి జీవితం మొత్తం మా సినిమాలో చూపించదలిచాం. ఆమె పుట్టినప్పటి నుంచి చివరి వరకూ (1948 నుంచి 2016 వరకూ) చిత్రకథ ఉంటుంది. సినిమాలకు, రాజకీయాలకు సమానమైన ప్రాముఖ్యతని ఇచ్చాం. ఏ ఘట్టాన్నీ పక్కన పెట్టుకోదలచుకోలేదు. జయలలితగారి అంత్యక్రియల సన్నివేశాలను కూడా చూపించనున్నాం. కానీ ఆసుపత్రిలో ఉన్న భాగాన్ని మాత్రం చూపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఆ విషయం మీద కోర్ట్‌లో కేసు నడుస్తోంది. ఇన్వెస్టిగేషన్ జరిగే సమయంలో ఏది కరెక్టో సరిగ్గా చెప్పలేం. అందుకే దాన్ని చూపించదలచుకోలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న జయలలిత జన్మదినం రోజున ఈ చిత్రం ప్రారంభిస్తాం’’ అని ప్రియదర్శిని చెప్పుకొచ్చారు. దర్శకుడు భారతీరాజా, ఏయల్ విజయ్, లింగుస్వామి కూడా జయలలిత బయోపిక్స్ అనౌన్స్ చేశారు. -
ఐరన్ లేడీ!
ఆ మధ్య జయలలిత మీద వరుసగా బయోపిక్స్ అనౌన్స్ చేసింది తమిళ ఇండస్ట్రీ. ఏయల్ విజయ్, ప్రియదర్శిని, భారతీరాజా దర్శకులు అనే వార్త వచ్చింది. ఇప్పుడు ఈ ముగ్గురిలో దర్శకురాలు ప్రియదర్శిని ఒక అడుగు ముందుకువేసి ‘ఐరన్‌లేడీ’ అంటూ టైటిల్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ బయోపిక్‌లో వరలక్ష్మీ శరత్‌కుమార్ టైటిల్ రోల్ చేస్తారని సమాచారం. వచ్చే నెలలో ఓ గ్రాండ్ ఓపెనింగ్ ఫంక్షన్ నిర్వహించి, ఆ కార్యక్రమంలో నటీనటులను అనౌన్స్ చేయాలనుకుంటున్నారట. ‘‘ఎప్పటికీ తమిళుల గుండెల్లో ఉండిపోయేటువంటి జీవితాన్ని గడిపారు జయలలితగారు. ఈ సినిమా కచ్చితంగా ఆవిడకు మంచి నివాళిలా ఉండేలా ప్లాన్ చేస్తున్నాం’’ అని ప్రియదర్శిని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న జయలలిత పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేయనున్నారు. -
లౌకికత్వం కోసం పోరాడారు
న్యూఢిల్లీ: ప్రజలను, దేశాన్ని కులమతాల పేరుతో విభజించాలనుకున్న వారికి వ్యతిరేకంగా, లౌకికవాదం కోసం దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పోరాడారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. ఇందిర శత జయంతి సందర్భంగా ఆమె సాధించిన విజయాలు, జీవన విధానంపై ఆదివారం ‘ఎ లైఫ్ ఆఫ్ కరేజ్’ పేరుతో ఢిల్లీలో చిత్రపటాల ప్రదర్శన నిర్వహించారు. అక్కడ సోనియా మాట్లాడుతూ ‘ఇందిరను కొందరు ఉక్కు మహిళగా అభివర్ణించడాన్ని నేను విన్నాను. ‘ఉక్కు’ అనేది ఆమె వ్యక్తిత్వంలో ఒక భాగం మాత్రమే. మానవత్వం, ఉదారత అనేవి ఆమెకున్న అనేక సద్గుణాలలో కొన్ని’ అని పేర్కొన్నారు. . ప్రముఖుల నివాళి... ఇందిర జయంతి సందర్భంగా ఆదివారం ప్రముఖులు నివాళులర్పించారు. ‘జయంతి సందర్భంగా ఇందిరా గాంధీని జాతి స్మరిస్తోంది’ అని రాష్ట్రపతి కోవింద్ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ఓ ట్వీట్‌తో ఇందిరకు నివాళి అర్పించారు. పార్లమెంటు సెంట్రల్ హాలులోనూ లోక్‌సభ స్పీకర్ మహాజన్, బీజేపీ నేత ఆడ్వాణీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఆజాద్æ తదితరులు నివాళులర్పించారు. ఇందిర సమాధి ‘శక్తి స్థల్’ వద్ద ప్రణబ్, మన్మోహన్, రాహుల్‌గాంధీ పుష్పగుచ్ఛాలను ఉంచి నివాళి అర్పించారు. ఇందిర దేశానికి అమ్మ అని బీజేపీ ఎంపీ, ఇందిర మనవడు వరుణ్ గాంధీ శ్లాఘించారు. మన్మోహన్‌కు శాంతి బహుమతి... ఈ ఏడాదికి ‘ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి’ బహుమతిని మాజీ ప్రధా ని మన్మోహన్ అందుకోనున్నారు. 2004 –14 మధ్య దేశాభివృద్ధికి కృషి చేసినందుకుగాను ఆయనను ఈ బహుమతికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ నేతృత్వంలోని అంతర్జాతీయ జ్యూరీ సభ్యులు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. -
జయలలిత దేశానికి రోల్ మోడల్
-
ఇరోమ్ షర్మిల గురించి ఈ విషయాలు మీకు తెలుసా!
సాయుధ బలగాల అకృత్యాలపై పోరుబాట పట్టి.. 16 ఏళ్లుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఇరోమ్ షర్మిల మహాపోరాట ప్రస్థానం మంగళవారం మరో కీలక మలుపు తీసుకుంది. ఆమె నిర్విరామ నిరాహార దీక్షను మంగళవారం విరమించారు. రాజకీయాల్లో అడుగుపెట్టాలని నిశ్చయించారు. రాజకీయాల్లోకి రావాలన్న ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఆమెను చంపేస్తామని బెదిరిస్తున్నారు కూడా.. ఆ బెదిరింపులను లక్ష్యపెట్టకుండా ముందుకుసాగుతున్న ఉక్కుమహిళ షర్మిల ప్రస్థానంలోని కీలకాంశాలివి.. మణిపూర్ ఉక్కుమహిళగా పేరొందిన ఇరోమ్ షర్మిల మధ్యతరగతి కుటుంబంలో 1972లో జన్మించారు. తొమ్మిది మంది తోబుట్టువుల్లో చివరి సంతానం ఆమె. మొదట్లో డాక్టర్ కావాలనుకున్నారు. కానీ హక్కుల కార్యకర్తగా మారి.. 'సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం (ఆఫ్సా)కు వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. సైనికులకు 'చంపే లైసెన్స్' ఇచ్చే చట్టంగా పేరొందిన ఆఫ్సాను రద్దుచేయాలని నినదించారు. ఇరోమ్ షర్మిల 28 ఏళ్ల వయస్సులో ఉండగా 2000 నవంబర్ 4న ఉక్కుసంకల్పంతో నిరాహార దీక్షకు దిగారు. అంతకు రెండురోజుల ముందు మణిపూర్ రాజధాని ఇంఫాల్ సమీపంలోని మాలోమ్‌లో సైనికుల కాల్పుల్లో పదిమంది చనిపోయారు. అందులో ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వెళుతున్న టీనేజ్ విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ ఘటనతో చలించిపోయిన షర్మిల పోరుబాటను ఎంచుకున్నారు. మణిపూర్‌లో, దేశవ్యాప్తంగా ఆఫ్సా వ్యతిరేక ఉద్యమానికి షర్మిల కేంద్రంగా మారారు. ముక్కు ద్వారా ద్రవాహారం తీసుకుంటూ ఏళ్లకు ఏళ్లు ఆమె కొనసాగించిన దీక్ష దేశమంతటికీ చేరింది. అప్పటినుంచి షర్మిల ఇంఫాల్‌లోని సజీవ సెంట్రల్ జైలులో కస్టడీలో ఉంచారు. కానీ, ఎక్కువకాలం నగరంలోని జవహర్ లాల్ నెహ్రూ వైద్య విజ్ఞాన కేంద్రంలోనే గడిపారు. ఐదుగురు వైద్యులు, 12మంది నర్సులు, ముగ్గురు మహిళా పోలీసులు.. ఇలా దాదాపు 40మంది నిత్యం ఆమెకు బలవంతంగా ముక్కు ద్వారా ద్రవాహారం, పౌష్టికాలు అందజేసేవారు. షర్మిల 2000 సంవత్సరంలో తొలిసారి అరెస్టు అయ్యారు. ఆ తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నించారన్న కారణంతో ఆమెను అరెస్టు చేయడం, విడుదల చేయడం నిత్యకృత్యంగా జరుగుతూ వచ్చింది. ఇప్పటివరకు దేశంలో ఆత్మహత్యాయత్నం నేరంగా ఉండగా.. దీనిని నేరరహితంగా ప్రతిపాదిస్తూ రూపొందించిన బిల్లును గత సోమవారం రాజ్యసభ ఆమోదించింది. ఇంకా లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంది. షర్మిల మంచి రచయిత, కవి. స్థానిక మీటిలాన్ భాషలో ఆమె రచనలు చేశారు. ఆమె రచనల్లో 12 కవితలతో కూడిన 'ఫ్రాగ్రాన్స్ ఆఫ్ పీస్' పుస్తకాన్ని తన మహా దీక్షకు ముందే రచించారు. 2006లో షర్మిల తన ఆందోళనకు దేశ రాజధాని ఢిల్లీని వేదికగా చేసుకున్నారు. జంతర్ మంతర్‌లో ఆమె, కార్యకర్తలతో కలిసి దీక్ష చేశారు. వెంటనే ఆమెను అరెస్టు చేసినప్పటికీ ఆమె నిరాహార దీక్ష ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆఫ్సాలో మార్పులు తీసుకురావాలంటూ కోరుతూ యూరోపియన్ పార్లమెంటు భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. అహింసాయుత మార్గంలో షర్మిల సాగించిన పోరాటం ఆమెకు ఎన్నో అవార్డులను తెచ్చిపెట్టింది. 2007లో గ్వాంగ్జు మానవహక్కుల పురస్కారం, ఆసియన్ మానవ హక్కుల కమిషన్ జీవితసాఫల్య పురస్కారం, 2010లో విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ శాంతి బహుమతి ఆమెకు లభించాయి. 2013లో ఆమెస్టీ ఇంటర్నేషనల్ ఆమెను 'ప్రిజనర్ ఆఫ్ కాన్షైన్స్' (ఆత్మసాక్షికి ఖైదీ)గా కీర్తించింది. ప్రజాజీవితంలోకి వచ్చిన తర్వాత షర్మిల వ్యక్తిగత జీవితం ప్రారంభమైందని చెప్పవచ్చు. 2011 మార్చిలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు డెస్మండ్ కౌటిన్హో (48) ఆమెను ఆస్పత్రిలో కలిశారు. 2009లో నుంచి వీరిద్దరూ పరస్పరం లేఖలు రాసుకుంటున్నారు. అతడు తనను ప్రేమిస్తున్నట్టు షర్మిల మీడియాకు తెలిపింది. అయితే, ఆఫ్సా వ్యతిరేక ఉద్యమం నుంచి ఆమె దారి మళ్లించేందుకే ప్రభుత్వం కౌటిన్హోను పరోక్షంగా రంగంలోకి దింపిందని అప్పట్లో అనుమానాలు వచ్చాయి. గత నెల 26న తాను దీక్షను విరమించబోతున్నట్టు ప్రకటించి షర్మిల తన మద్దతుదారులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. మంగళవారం దీక్ష విరమించి రాజకీయాల్లో చేరుతానని, పెళ్లి చేసుకుంటానని ఆమె ప్రకటించారు. -
మరోసారి అరెస్ట్ అయిన ఇరోం షర్మిల
ఇంపాల్ : మణిపూర్ హక్కుల కార్యకర్త ఇరోం చాను షర్మిల మరోసారి అరెస్ట్ అయ్యారు. మణిపూర్‌లో అమల్లో ఉన్న వివాదాస్పద సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ)పై తన పోరాటాన్ని విస్తృతం చేయడానికి ప్రయత్నిస్తున్న ఆమెను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షర్మిల ఆత్మహత్యకు యత్నిస్తున్నందున అరెస్ట్ చేసినట్లు మణిపూర్ అడిషినల్ డీజీ సంతోష్ తెలిపారు. కాగా కోర్టు ఆదేశాలతో రెండు రోజుల క్రితమే షర్మిల జైలు నుంచి విడుదలయ్యారు. అమానుష చట్టమైన ఏఎఫ్‌ఎస్‌పీఏకు వ్యతిరేకంగా ఆమె గత 14 ఏండ్లుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఇంఫాల్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ హాస్పిటల్‌లోని ఓ గదిని ప్రత్యేక జైలుగా మార్చి.. పోలీసు నిర్బంధంలో ఆమెకు ఇన్నాళ్లు ముక్కు ద్వారా ద్రవ ఆహారాన్ని అందించారు. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దుచేయాలని కోరుతూ 2000 సంవత్సరం నవంబర్‌లో ఆమె ఈ దీక్ష ప్రారంభించారు.