
నిత్యామీనన్
నటి, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా వెండితెరపైకి రాబోతున్న సినిమాల్లో ‘ది ఐరన్ లేడీ’ కూడా ఒకటి. ఇందులో జయలలితగా నిత్యామీనన్ నటించనున్నారు. దర్శకురాలు ప్రియదర్శిని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ ఏవీ రాక పోవడంతో సెట్స్‌పైకి వెళ్తుందా? అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందిస్తూ ప్రియదర్శిని ఓ లేఖను విడుదల చేశారు. ‘‘ది ఐరన్ లేడీ’ సినిమా కోసం ఎంతోమంది హీరోయిన్లను పరిశీలించి ఆరు భాషలు మాట్లాడగల, భరత నాట్యంలో ప్రావీణ్యత ఉన్న నిత్యామీనన్‌ను ఎంచుకున్నాం.
బయోపిక్‌ను తెరకె క్కించాలంటే చాలా అంశాల గురించి ఆలోచించాలి. ఇదొక చాలెంజ్ లాంటిది. ఎంతో బాధ్యత మాపై ఉంటుంది. విమర్శలు, వివాదాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అందుకే ప్రీ–ప్రొడక్షన్ కార్యక్రమాలను రాజీ పడకుండా చేస్తున్నాం’’ అన్నది ఆ లేఖ సారాంశం. ‘‘ది ఐరన్ లేడీ’ సినిమా కోసం నాకు ప్రత్యేకమైన శిక్షణ ఏం అవసరం లేదు. నాకు భరతనాట్యం వచ్చు. తమిళంలో స్పష్టంగా మాట్లాడగలను. బయోపిక్ తీయడం అంత ఈజీ కాదు’’ అన్నారు నిత్యామీనన్.
Comments
Please login to add a commentAdd a comment