
నిత్యా మీనన్
2016 డిసెంబర్ 5... నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, తమిళ ప్రజలు ‘అమ్మ’ అని ప్రేమగా పిలిచే జయలలిత అనారోగ్యంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించిన రోజు. ఆ తర్వాత తమిళనాట రాజకీయాల్లో చాలా గందరగోళమే ఏర్పడింది. అది అప్రస్తుతం. ఈ ఏడాది జయలలిత జీవితం ఆధారంగా సుమారు నాలుగు వరకూ బయోపిక్‌లను అనౌన్స్ చేశారు తమిళ దర్శకులు. అందులో లేడీ డైరెక్టర్ ప్రియ దర్శని తెరకెక్కించనున్న ‘ది ఐరన్ లేడీ’ ఒకటి. జయలలిత రెండో వర్ధంతి సందర్భంగా ‘ది ఐరన్ లేడీ’ చిత్రం ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. నిత్యా మీనన్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాను పేపర్ టేల్స్ సంస్థ నిర్మిస్తోంది. ‘‘ఐరన్ లేడీ, అమ్మ’ జయలలితగారి రెండో వర్ధంతి సందర్భంగా ఆవిడకు నా నివాళి అర్పిస్తున్నాను’’ అని నిత్యామీనన్ పేర్కొన్నారు.