first look release
-
మీలో ఒకడు
‘మీకు సుపరిచితుడు... మీలో ఒకడు... మీ సాగర్’ అంటూ రామ్ తాజా చిత్రం లుక్ విడుదలైంది. రామ్ పోతినేని హీరోగా మహేశ్‌బాబు .పి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి ఓ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా రామ్ చేస్తున్న సాగర్ పాత్రను పరిచయం చేసి, లుక్‌ని విడుదల చేశారు. పాత రోజుల హెయిర్ స్టయిల్, క్లీన్ షేవ్‌తో రామ్ వింటేజ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ హీరోకి ఇది 22వ సినిమా. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మధు నీలకందన్, సంగీతం: వివేక్–మెర్విన్, సీఈవో: చెర్రీ. -
టర్నింగ్ పాయింట్లా...
త్రిగుణ్ హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘టర్నింగ్ పాయింట్’. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, ఇషా చావ్లా, వర్షిణి హీరోయిన్లుగా నటించారు. కుహన్ నాయుడు దర్శకత్వంలో స్వాతి సినిమాస్ పతాకంపై సురేష్ దత్తి నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, దర్శకుడు విజయ్ కనకమేడల కలిసి విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా దర్శకుడు కుహన్ నాయుడు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో త్రిగుణ్ నటించారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో మంచి సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఆడియన్స్‌ను ఎంగేజ్ చేసేలా ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తాం’’ అన్నారు.‘‘కొత్తదనం ఆశించే ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు మా చిత్రంలో ఉన్నాయి. యూనిట్‌లోని అందరి కెరీర్స్‌కి ఓ టర్నింగ్ పాయింట్లా ఈ ‘టర్నింగ్ పాయింట్’ నిలుస్తుందన్న నమ్మకం ఉంది’’ అని తెలిపారు సురేష్ దత్తి. ఈ సినిమాకు సంగీతం: ఆర్.ఆర్. ధ్రువన్, కెమెరా: గరుడవేగ అంజి, సహ–నిర్మాతలు: నందిపాటి ఉదయభాను, జీఆర్ మీనాక్షి, ఎం. ఫణిభూషణ్ కుమార్. -
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో...
‘స్వామి రా రా (2013), కేశవ (2017)’ చిత్రాల తర్వాత హీరో నిఖిల్ సిద్ధార్థ్–దర్శకుడు సుధీర్ వర్మ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో...’. కన్నడ హీరోయిన్ రుక్మిణీ వసంత్ ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమవుతున్నారు. బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఆదివారం సుధీర్ వర్మ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి, దీపావళికి ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. హీరోయిన్ దివ్యాంశా కౌశిక్, హర్ష చెముడు కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: సన్నీ ఎమ్ఆర్. -
చిన్న కథ కాదు!
నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘35– చిన్న కథ కాదు’. ఈ చిత్రానికి నంద కిశోర్ ఈమాని దర్శకత్వం వహించారు. సురేష్ ప్రోడక్షన్స్ ఎస్. ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రోడక్షన్స్ పై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రానికి ‘35– చిన్న కథ కాదు’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్ విడుదల చేశారు.ఆగస్ట్ 15న సినిమాని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించారు. ‘‘క్లీన్ ఎంటర్టైనర్గా రూపొందిన న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా ‘35–చిన్న కథ కాదు’. స్కూల్ ఎపిసోడ్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా చక్కని వినోదంతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ఈ సినిమా సిద్ధమైంది. తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, కెమెరా నికేత్ బొమ్మి. -
వాస్తవ ఘటనల నింద
‘హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం’ చిత్రాల ఫేమ్ వరుణ్ సందేశ్ హీరోగా రూపొందిన చిత్రం ‘నింద’. ‘కాండ్రకోట మిస్టరీ’ అన్నది ఉపశీర్షిక. ఆనీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్యకుమార్, ఛత్రపతి శేఖర్ ఇతర పాత్రల్లో నటించారు. ది ఫర్వెంట్ ఇండీ ప్రోడక్షన్స్ బ్యానర్ రాజేష్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.ఈ చిత్రం నుంచి వరుణ్ సందేశ్ పాత్ర ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాత రాజేష్ జగన్నాథం మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘నింద’. ఇప్పుడు ప్రేక్షకులు రెగ్యులర్ సినిమాల కంటే కంటెంట్, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ కోవలోనే మా ‘నింద’ రూపొందింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 15న మా సినిమా టీజర్‌ను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సంతు ఓంకార్, కెమెరా: రమీజ్ నవీత్. -
మన తెలుగువాడి బయోపిక్
చూపు లేకపోయినా అంట్రప్రెన్యూర్‌గా విజయం సాధించిన మన తెలుగువాడు శ్రీకాంత్ బొల్లా బయోపిక్ ఫస్ట్‌లుక్ వైరల్ అయ్యింది. రాజ్ కుమార్ రావు శ్రీకాంత్ పాత్ర పోషిస్తున్నాడు. పుట్టుకతో అంధత్వం వెంటాడినా విజయాలు అందుకోవడానికి అది అడ్డుకాదని నిరూపించిన తెలుగు పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్లా బయోపిక్ ‘శ్రీకాంత్’ ఫస్ట్‌లుక్ విడుదలైంది. మంచి నటుడిగా పేరు గడించిన రాజ్‌కుమార్ రావు శ్రీకాంత్ పాత్రను పోషిస్తుండటం విశేషం. మచిలీపట్నంలో జన్మించిన శ్రీకాంత్ బొల్లా ఇంజినీరింగ్ చదువు విషయంలో చాలా సవాళ్లు ఎదుర్కొన్నాడు. అంధుడైన కారణాన ఐఐటీలో సీటు ΄÷ందలేకపోయాడు. అయితే పట్టుదలతో మసాచూసెట్స్ యూనివర్సిటీలో తొలి అంతర్జాతీయ అంధ విద్యార్థిగా దఖలయ్యి చదువుకున్నాడు. భారత్‌కు తిరిగి వచ్చి పారిశ్రామిక రంగంలో కీర్తి గడించాడు. బొల్లా జీవితం ఇప్పటికే ఎందరికో ఆదర్శం అయ్యింది. వెండితెర మీద ఆయన జీవితం చూసి మరెందరో స్ఫూర్తి ΄÷ందుతారు. తుషార్ హీరానందాని ఈ సినిమా దర్శకుడు. -
'ఫ్యామిలీ మ్యాన్' కాదు ఇకపై 'భయ్యాజీ'
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి హీరోగా నటిస్తున్న తాజా హిందీ చిత్రానికి ‘భయ్యాజీ’ అనే టైటిల్ ఖరారైంది. ‘సిర్ఫ్ ఏక్ బందా కఫీ హై’ (2023) సినిమా తర్వాత మనోజ్ బాజ్‌పేయి, దర్శకుడు అపూర్వ్సింగ్ కర్కీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని బాలీవుడ్ సమాచారం. కాగా ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. అలాగే ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 20న, సినిమాను మే 24న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కాగా ‘భయ్యాజీ’ చిత్రం మనోజ్ బాజ్‌పేయి కెరీర్లో వందో చిత్రం కావడం విశేషం. -
టైసన్ నాయుడి యాక్షన్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘టైసన్ నాయుడు’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమా నిర్మిస్తున్నారు. బుధవారం (జనవరి 3న) సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని ‘టైసన్ నాయుడు’గా ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. సాయి శ్రీనివాస్‌ను బాక్సింగ్ లెజెండ్ మైక్‌టైసన్ అభిమానిగా ఈ చిత్రం వీడియో గ్లింప్స్ ద్వారా పరిచయం చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యునిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘టైసన్ నాయుడు’. సాయి శ్రీనివాస్‌ను మునుపెన్నడూ చూడని మాస్, యాక్షన్ అవతార్‌లో చూపిస్తున్నారు సాగర్ కె. చంద్ర. హై బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ముఖేష్ జ్ఞానేష్, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: హరీష్ కట్టా. -
కాంతార2 ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..
-
ప్రేమలో గీతాశంకరం
ముఖేష్ గౌడ, ప్రియాంకా శర్మ జంటగా కె.దేవానంద్ నిర్మిస్తున్న ప్రేమకథా చిత్రం ‘గీతా శంకరం’. దీపావళి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ముఖేష్ గౌడ మాట్లాడుతూ– ‘‘సీరియల్స్‌లో పేరు సంపాదించుకున్నట్లే ఈ సినిమాతో వెండితెరపై కూడా మంచి పేరు తెచ్చుకుంటాననే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర లభించడం నా లక్‌గా భావిస్తున్నా’’ అన్నారు ప్రియాంకా శర్మ. ‘‘ఇరవై కథలు విన్నాం. కానీ రుద్ర చెప్పిన ఈ కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాం. ఈ నెల 14న కొత్త షెడ్యూల్ ఆరంభిస్తాం’’ అన్నారు దేవానంద్. ‘‘ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి’’ అన్నారు రుద్ర. ఈ చిత్రానికి సంగీతం: అబు, కెమెరా: ఉదయ్ ఆకుల. -
బెస్ట్ గిఫ్ట్
‘తంగలాన్’ సినిమా కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు హీరోయిన్ మాళవికా మోహనన్. విక్రమ్ హీరోగా పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ ఫిల్మ్ ‘తంగలాన్’. ఈ చిత్రంలో పార్వతి, మాళవికా మోహనన్ హీరోయిన్లు. కేజీ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శుక్రవారం (ఆగస్టు 4) మాళవికా మోహనన్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘తంగలాన్’లోని ఆమె ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘బెస్ట్ బర్త్ డే గిఫ్ట్’ అని ఈ పోస్టర్ని ఉద్దేశించి మాళవిక ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో గిరిజన యువతిగా ఆమె నటిస్తున్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలన కొనసాగుతున్నప్పుడు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ వద్ద ఆక్రమణలకు ఎదురు నిలిచిన ఓ గిరిజన తెగ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. -
హాయ్ నాన్న
నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘హాయ్ నాన్న’ అనే టైటిల్ ఖరారు చేశారు. శౌర్యువ్ దర్శకత్వంలో మోహన్ చెరుకూరి (సీవీఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ఈ చిత్రానికి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘హాయ్ నాన్న’ అని, హిందీలో ‘హాయ్ పప్పా’ అనే టైటిల్‌ను ఖరారు చేసి, ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘‘తండ్రీ–కూతురు భావోద్వేగాలతో కూడిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. యూనిక్ స్టోరీ లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రం అన్ని భాషలవారికీ కనెక్ట్ అవుతుంది. ఈ ఏడాది డిసెంబర్ 21న చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
సోషల్ టీచర్ ఇంగ్లిష్ పాఠాలు చెబితే...
హర్ష చెముడు టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘సుందరం మాస్టర్’. దివ్య శ్రీ పాద హీరోయిన్. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో రవితేజ, కుర్రు సుధీర్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను హీరో రవితేజ విడుదల చేశారు. ‘‘సోషల్ స్టడీస్ బోధించే సుందరం మాస్టర్ మిర్యాలమెట్ట అనే మారుమూల పల్లెకి ఇంగ్లిష్ టీచర్‌గా బదిలీ అవుతాడు. అక్కడున్నవారికి ఎలా ఇంగ్లిష్ బోధిస్తాడు? అనేది ప్రధాన ఇతివృత్తం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
మాస్ రత్నమాల
ఊర మాస్ రత్నమాలగా కనిపించనున్నారు అంజలి. శుక్రవారం (జూన్ 16) ఆమె పుట్టినరోజు సందర్భంగా ‘వీఎస్ 11’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో ఆమె చేస్తున్న రత్నమాల పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శ కత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ‘‘యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో రత్నమాలగా అంజలి కనిపించనున్నారు. ఆమె పాత్ర మాస్ ప్రేక్షకులను అలరిస్తుంది. విశ్వక్ సేన్ తొలిసారి ఈ చిత్రంలో క్రూరమైన పాత్రను పోషిస్తున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరా: అనిత్ మధాది, సహనిర్మాతలు: వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి. -
ప్రేమ తగ్గిపోతుందా?
అర్జున్ అంబటి, చాందిని తమిళరసన్ జంటగా వెంకటరమణ మిద్దె స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘వెడ్డింగ్ డైరీస్’. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘విడిపోవాలనుకున్న భార్యాభర్తలు తమ ప్రేమను బలపర్చుకొని వైవాహిక బంధాన్ని ఎలా కొనసాగించారు? ఆ భార్యాభర్తల నడుమ ఎలాంటి సంఘర్షణ జరిగింది? అనేది ఈ సినిమాలోని మెయిన్ పాయింట్. ‘పెళ్లి తర్వాత ప్రేమ తగ్గిపోతుందా..?’ అనేది కాన్సెప్ట్’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
నిఖిల్ స్వయంభూ
నిఖిల్ హీరోగా నటించనున్న కొత్త సినిమాకు ‘స్వయంభూ’ అనే టైటిల్ ఖరారు చేశారు. గురువారం (జూన్ 1) నిఖిల్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటించి, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మించనున్నారు. ‘‘నిఖిల్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఆగస్టులో షూటింగ్ ఆరంభిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాతలు: విజయ్ కామిశెట్టి, జీటీ ఆనంద్, సంగీతం: రవి బస్రూర్, కెమెరా: మనోజ్ పరమహంస. ఇంకా.. నిఖిల్ బర్త్ డే సందర్భంగా వేరే చిత్రాల అప్డేట్స్ కూడా వచ్చాయి. నిఖిల్‌తో ‘స్వామి రారా’, ‘కేశవ’ చిత్రాల తర్వాత దర్శకుడు సుధీర్ వర్మ మరో సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. అలాగే ‘ది ఇండియా హౌస్’ అనే మరో సినిమా కమిటయ్యారు నిఖిల్. ఇక నిఖిల్ హీరోగా నటించిన ‘స్పై’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. -
పలాసకి మించి ఆపరేషన్ రావణ్
‘‘పలాస’ నచ్చకపోతే నా కాలర్ పట్టుకోండి’ అంటూ గతంలో చెప్పాను. ఇప్పుడు అంతకు మించిన నమ్మకంతో చెబుతున్నాను. ‘పలాస’కి మించి ‘ఆపరేషన్ రావణ్’ నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. మా నాన్న వెంకట సత్య వరప్రసాద్‌గారు బాగా డైరెక్ట్ చేశారు’’ అని హీరో రక్షిత్ అట్లూరి అన్నారు. వెంకట సత్య దర్శకత్వంలో రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్ జంటగా నటించిన చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ఈ మూవీ ఫస్ట్ థ్రిల్‌ను దర్శకులు మారుతి, కల్యాణ్ కృష్ణ విడుదల చేశారు. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘ప్రసాద్‌గారు డైరెక్షన్ చేస్తా అన్నప్పుడు నవ్వుకున్నా. కానీ ట్రైలర్ చూశాక చాలా బాగుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా బాగా రావడానికి కారణం రాధికగారు’’ అన్నారు వెంకట్ సత్య. ‘‘ఆపరేషన్ రావణ్’ మంచి చిత్రం’’ అన్నారు నటి రాధిక. ఈ చిత్రానికి కెమెరా: నాని చమిడిశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీపాల్ చొళ్లేటి. -
డబుల్ ధమాకా
మంచు మనోజ్ తన పుట్టినరోజుని (మే 20) పురస్కరించు కుని రెండు సినిమాల అప్డేట్తో డబుల్ ధమాకా ఇచ్చారు. వరుణ్ కోరుకొండ దర్శకత్వంతో మనోజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘వాట్ ది ఫిష్’. మనం మనం బరంపురం అనేది ట్యాగ్ లైన్. 6ఐఎక్స్ సినిమాస్‌పై విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్నారు. మనోజ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. ఇందులో మనోజ్ విభిన్నమైన గెటప్‌లలో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శక్తికాంత్ కార్తీక్, సహనిర్మాత: వరుణ్ కోరుకొండ. ఎల్ఎస్ ప్రొడక్షన్స్‌లో... మనోజ్ హీరోగా మరో కొత్త మూవీ ప్రకటన శనివారం వచ్చింది. భాస్కర్ బంటుపల్లి డైరెక్షన్లో మమత సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్‌పై ఎం. శ్రీనివాసులు, డి. వేణుగోపాల్, ఎం. మమత, ముల్లపూడి రాజేశ్వరి ఈ సినిమాను నిర్మించనున్నారు. -
స్పిన్ మాంత్రికుడి బయోపిక్.. ఆసక్తిగా ఫస్ట్ లుక్!
క్రికెట్ ప్రపంచంలో ఎన్నో రికార్డులు సాధించిన ప్రముఖ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘800’. సోమవారం (ఏప్రిల్ 17) ముత్తయ్య పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఎంఎస్ శ్రీపతి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’లో చేసిన సలీమ్ మాలిక్ పాత్ర ద్వారా గుర్తింపు తెచ్చుకున్న మధుర్ మిట్టల్ ఈ బయోపిక్‌లో ముత్తయ్య పాత్రను పోషిస్తున్నారు. ముత్తయ్య భార్య మదిమలర్ పాత్రను మహిమా నంబియార్ చేస్తున్నారు. శ్రీపతి మాట్లాడుతూ – ‘‘కెరీర్లో 800 టెస్ట్ వికెట్స్ తీసిన ఏకైక ఆఫ్ స్పిన్నర్ బౌలర్‌గా మురళీధరన్ అరుదైన రికార్డు సాధించారు. అందుకే ఈ చిత్రానికి ‘800’నే టైటిల్‌గా పెట్టాం. మురళికి తమిళనాడులో మూలాలు ఉన్నాయి. అతని తాతలు భారతీయులు. బ్రిటిష్ వారు అక్కడి టీ తోటలలో పని చేయడానికి వారిని శ్రీలంకకు తీసుకెళ్లారు. ఇలా ముత్తయ్య మురళీధరన్‌లోని పలు కోణాలను చూపించే చిత్రం ఇది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అన్నారు. వివేక్ రంగాచారి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. -
'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' ఫస్ట్ లుక్ రిలీజ్
‘ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద’ వంటి చిత్రాల తర్వాత హీరో నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కాంబినేషన్లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. ఈ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ– ‘‘పదేళ్ల పాటు ఓ జంట మధ్య సాగే ప్రేమ ప్రయాణమే ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. 18 ఏళ్ల నుండి 28 సంవత్సరాల వయస్సు వరకు హెచ్చు తగ్గులతో సాగే వారి ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా విడుదల తేదీతో పాటు మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి. ఈ చిత్రానికి కెమెరా: సునీల్ కుమార్ నామ, సంగీతం: కళ్యాణీ మాలిక్, వివేక్ సాగర్ (కాఫీ ఫై సాంగ్), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి, అసోసియేట్ ప్రొడ్యూసర్స్: సునీల్ షా, రాజా సుబ్రమణియన్, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
సందీప్ రెడ్డి వంగ, రణ్‌బీర్ కపూర్ యానిమల్ నుంచి క్రేజీ అప్డేట్
‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ వంగ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న చిత్రం యానిమల్. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇప్పటికే కబీర్ సింగ్ చిత్రంతో బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. దీంతో సందీప్ తదుపరి చిత్రంపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ కానుకగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. టైటిల్ తగ్గట్టే ఫస్ట్‌లుక్ వైల్డ్ మలిచారు. ఈ పోస్టర్లో రణ్‌బీర్ ఒత్తయిన జట్టు, గుబురు గడ్డం, శరీర మొత్తం రక్తంతో తడిచి సిగరెట్ కాల్చుతూ కనిపించాడు. అర్జున్ రెడ్డి పోలిక కనిపిస్తున్నప్పటికీ చాక్లెట్ బాయ్ లాంటి రణ్‌బీర్‌ను వైల్డ్‌గా చూపించి అందరి దృష్టిని ఆకర్షించాడు సందీప్ వంగ. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా టీ సిరిస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. Presenting you the first look of ANIMAL. HAPPY NEW YEAR PEOPLE🙂 #RanbirKapoor #ANIMAL@AnilKapoor @thedeol @iamRashmika @tripti_dimri23 #BhushanKumar @VangaPranay @MuradKhetani #KrishanKumar @anilandbhanu @VangaPictures @Cine1Studios @TSeries @rameemusic @cowvala #ShivChanana pic.twitter.com/zrsyaXqWVx — Sandeep Reddy Vanga (@imvangasandeep) December 31, 2022 -
‘కథ వెనుక కథ’లో చాలా మంచి కథలు ఉన్నాయి
విశ్వంత్ దుద్దుంపూడి, శ్రీజిత ఘోష్, శుభశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమాకు ‘కథ వెనుక కథ’ అనే టైటిల్ ఖరారు చేశారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో సాయి స్రవంతి మూవీస్ సమర్పణలో దండమూడి బాక్సాఫీస్, సాయి స్రవంతి మూవీస్ పతాకాలపై అవనింద్ర కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నటుడు, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ మాట్లాడుతూ– ‘‘కథ వెనుక కథ మంచి కథ. దండమూడి అవనింద్ర కుమార్గారిది గోల్డెన్ హ్యాండ్. ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది’ అని అన్నారు. ‘‘కథ వెనుక కథ’లో చాలా కథలున్నాయి’’ అన్నారు సునీల్. ‘‘ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం’’ అన్నారు విశ్వంత్. ‘‘ఈ సినిమాలో మంచి ట్విస్ట్‌లు ఉన్నాయి’’ అన్నారు అవనింద్ర కుమార్. ‘‘నిర్మాత అవనింద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయిగార్ల వల్లే ఈ సినిమాను లార్జ్ స్కేల్లో చేస్తున్నాం’’ అన్నారు కృష్ణచైతన్య. -
నేను స్టూడెంట్ సార్
బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన ద్వితీయ చిత్రం ‘నేను స్టూడెంట్ సార్!’. డైరెక్టర్ తేజ శిష్యుడు రాఖీ ఉప్పలపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ‘నాంది’ వంటి హిట్ సినిమా నిర్మించిన ‘నాంది’ సతీష్ వర్మ ‘నేను స్టూడెంట్ సార్!’ని నిర్మించారు. ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘నాంది’ సతీష్ మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. దర్శకుడు కృష్ణ చైతన్య మంచి కథ అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. సముద్ర ఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ప్రమోదిని ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: అనిత్ మధాడి. -
‘మాచర్ల నియోజకవర్గం’ నుంచి కృతీ లుక్
నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతీ శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లను వేగవంతం చేసిన చిత్ర బృందం తాజాగా కృతీశెట్టి లుక్‌ను వదిలింది. ఇందులో కృతీ స్టైలిష్‌గా కాఫీ కప్ పట్టుకుని కనిపించింది. ఇందులో ఆమె స్వాతి పాత్రలో అలరించనుందట. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ ఈ చిత్రం రూపొందింది. Introducing our ‘Swathi' aka @IamKrithiShetty ❤️ One of the core persons from #MacherlaNiyojakavargam 🚩 Get Ready to fall in Love with her from August 12th😍#MNVFromAug12th pic.twitter.com/vexAUuWYOV — nithiin (@actor_nithiin) July 17, 2022 -
'మేజర్ సెల్వన్'గా ప్రముఖ డైరెక్టర్..
Gautham Menon As Major Selvan First Look Out: మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాళినీ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా, రష్మికా మందన్నా, సుమంత్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సీతారామం’. ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్ నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సీతగా మృణాళినీ ఠాకూర్, అఫ్రిన్ పాత్రలో రష్మికా మందన్నా కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి ఇదివరకు విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల 'బ్రిగేడియర్ విష్ణు శర్మ' పాత్రలో నటిస్తున్న సుమంత్ లుక్ ఆకట్టుకుంది. తాజాగా ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ పాత్రను రివీల్ చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో గౌతమ్ 'మేజర్ సెల్వన్'గా నటిస్తున్నారు. దీనికి సంబంధించిన లుక్ విడుదల కాగా, సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: అన్నదమ్ములతో డేటింగ్ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్ మొన్న ఆర్జీవీ.. ఇప్పుడు సుశాంత్.. యాంకర్‌పై ఆగ్రహం Attention Everyone! 𝐌𝐚𝐣𝐨𝐫 𝐒𝐞𝐥𝐯𝐚𝐧 is here! Here's the first look of @menongautham from #SitaRamam.https://t.co/HNfYz5h9Yy@dulQuer @mrunal0801 @hanurpudi @iamRashmika @iSumanth @Composer_Vishal @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth#SitaRamamOnAug5 pic.twitter.com/oUkrUIf6EE — Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 15, 2022