![Bhagyashri Borse Kaantha First Look Release](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/kt_1.jpg.webp?itok=kFpQ45zw)
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా గులాబీ రంగు చీరలో సింప్లీ సూపర్బ్‌గా కనిపించారు భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse). దుల్కర్ సల్మాన్ సరసన భాగ్యశ్రీ బోర్సే ‘కాంత’ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రంలోని పింక్ శారీలో క్యూట్‌గా ఉన్న భాగ్యశ్రీ లుక్‌ని విడుదల చేశారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
‘‘1950ల మద్రాస్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘కాంత’. అప్పటి మానవ సంబంధాలు, సామాజిక సంక్లిష్టతలను ఆవిష్కరించే చిత్రం ఇది. ఈ బహు భాషా చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జాను.
Comments
Please login to add a commentAdd a comment