
ఎస్తర్ అనిల్
ఎస్తర్ అనిల్ (‘దృశ్యం’ ఫేమ్), నైనా గంగూలీ (‘వంగవీటి’ ఫేమ్), ఈశ్వరీరావు, రోహిణి, శుభలేఖ సుధాకర్ ప్రధాన తారాగణంగా తేజ మార్ని దర్శకత్వంలో భాను సందీప్ మార్ని నిర్మించిన చిత్రం ‘జోహార్’. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘‘దర్శకుడిగా ఇది నాకు తొలి సినిమా. ఇంతకు ముందు రామ్‌గోపాల్‌వర్మ ‘వంగవీటి’ చిత్రానికి దర్శకత్వ శాఖలో, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌గారి వద్ద రచనా విభాగంలో పని చేసిన అనుభవం ఉంది. పొలిటికల్ సెటైర్ నేపథ్యంలో ఐదు పాత్రల చుట్టూ అద్భుతంగా తిరిగే ఎమోషనల్ డ్రామాయే ఈ చిత్రం. సినిమాలో మంచి కంటెంట్ ఉంది. విజయంపై నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు తేజ మార్ని. ఈ సినిమాకు ప్రియదర్శన్ స్వరకర్త.
Comments
Please login to add a commentAdd a comment