Johar
-
నేను విన్నాను నేను ఉన్నాను
-
ఆకట్టుకుంటోన్న ‘లైఫ్ ఆఫ్ జోహార్’
‘బ్యూటిఫుల్’ హీరోయిన్ నైనా గంగూలీ, ‘దృశ్యం’ ఫేమ్ ఎస్తర్ అనిల్, సీనియర్ నటి ఈశ్వరీరావు ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘జోహార్’. తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ధర్మ సూర్య పిక్చర్స్ పతాకంపై భాను సందీప్ మార్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ‘లైఫ్ ఆఫ్ జోహార్’పేరిట సినిమాకు సంబంధించిన చిన్న వీడియోను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా ప్రధానంగా ఐదు పాత్రల చుట్టూ తిరుగుతున్నట్లు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. రోహిణి, శుభలేఖ సుధాకర్, తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్రియదర్శన్ సంగీతమందించాడు. -
ఐదు పాత్రల చుట్టూ...
ఎస్తర్ అనిల్ (‘దృశ్యం’ ఫేమ్), నైనా గంగూలీ (‘వంగవీటి’ ఫేమ్), ఈశ్వరీరావు, రోహిణి, శుభలేఖ సుధాకర్ ప్రధాన తారాగణంగా తేజ మార్ని దర్శకత్వంలో భాను సందీప్ మార్ని నిర్మించిన చిత్రం ‘జోహార్’. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘‘దర్శకుడిగా ఇది నాకు తొలి సినిమా. ఇంతకు ముందు రామ్‌గోపాల్‌వర్మ ‘వంగవీటి’ చిత్రానికి దర్శకత్వ శాఖలో, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌గారి వద్ద రచనా విభాగంలో పని చేసిన అనుభవం ఉంది. పొలిటికల్ సెటైర్ నేపథ్యంలో ఐదు పాత్రల చుట్టూ అద్భుతంగా తిరిగే ఎమోషనల్ డ్రామాయే ఈ చిత్రం. సినిమాలో మంచి కంటెంట్ ఉంది. విజయంపై నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు తేజ మార్ని. ఈ సినిమాకు ప్రియదర్శన్ స్వరకర్త. -
పొలిటికల్ సెటైర్ గా ‘జోహార్’
ధర్మ సూర్య పిక్చర్స్ పతాకంపై తేజ మార్ని దర్శకత్వంలో భాను సందీప్ మార్ని నిర్మాతగా రూపొందుతోన్న ఎమోషనల్ డ్రామా ‘జోహార్’. ‘దృశ్యం’ చిత్రంలో వెంకటేశ్ కూతురిగా నటించిన ఈస్తర్ అనిల్ ఇందులో హీరోయిన్గా నటించారు. ‘వంగవీటి’ ఫేమ్ నైనా గంగూలీ మెయిన్ హీరోయిన్గా నటించారు. తనదైన నటనతో ఎన్నో చిత్రాల్లో మెప్పించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈశ్వరీరావు ఈ చిత్రానికి బ్యాక్‌బోన్‌లాంటి పాత్రలో నటించారు. రోహిణి, శుభలేఖ సుధాకర్, చైతన్యకృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సినిమా ప్రీ లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా... దర్శకుడు తేజ మార్ని మాట్లాడుతూ ‘నేను ప్రముఖ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మగారి వద్ద ‘వంగవీటి’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేశాను. అలాగే ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌గారి వద్ద రచనా విభాగంలో పనిచేశాను. డైరెక్టర్ గా నా తొలి చిత్రమిది. ‘జోహార్’ చిత్రం పొలిటికల్ సెటైర్‌గా రూపొందుతోన్న ఎమోషనల్ డ్రామా. షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమా ప్రధానంగా ఐదు పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఐదు పాత్రలు అద్భుతంగా ఆకట్టుకుంటాయి. డిఫరెంట్‌గా ఉంటాయి. వారణాసి, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ ప్రాంతాల్లో సినిమాను చిత్రీకరించాం. ‘భైరవగీత’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సిద్ధార్థ్ ఈ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేశారు. త్రిష ‘నాయకి’, ‘భైరవగీత’ చిత్రాలకు వర్క్ చేసిన జగదీశ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్యప్రసాద్ పాటలు రాశారు. ‘రాక్షసుడు’, ‘జార్జిరెడ్డి’ చిత్రాలకు పనిచేసిన గాంధీ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు’ అని అన్నారు. -
నమాజ్ వేళలు
ఫజర్ : 5.05 జొహర్ : 12.22 అస్ : 4.45 మగ్రిబ్ : 6.28 ఇషా : 7.40