‘మీకు సుపరిచితుడు... మీలో ఒకడు... మీ సాగర్’ అంటూ రామ్ తాజా చిత్రం లుక్ విడుదలైంది. రామ్ పోతినేని హీరోగా మహేశ్‌బాబు .పి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి ఓ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా రామ్ చేస్తున్న సాగర్ పాత్రను పరిచయం చేసి, లుక్‌ని విడుదల చేశారు. పాత రోజుల హెయిర్ స్టయిల్, క్లీన్ షేవ్‌తో రామ్ వింటేజ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ హీరోకి ఇది 22వ సినిమా. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మధు నీలకందన్, సంగీతం: వివేక్–మెర్విన్, సీఈవో: చెర్రీ.
Comments
Please login to add a commentAdd a comment