
‘హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం’ చిత్రాల ఫేమ్ వరుణ్ సందేశ్ హీరోగా రూపొందిన చిత్రం ‘నింద’. ‘కాండ్రకోట మిస్టరీ’ అన్నది ఉపశీర్షిక. ఆనీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్యకుమార్, ఛత్రపతి శేఖర్ ఇతర పాత్రల్లో నటించారు. ది ఫర్వెంట్ ఇండీ ప్రోడక్షన్స్ బ్యానర్ రాజేష్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.
ఈ చిత్రం నుంచి వరుణ్ సందేశ్ పాత్ర ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాత రాజేష్ జగన్నాథం మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘నింద’. ఇప్పుడు ప్రేక్షకులు రెగ్యులర్ సినిమాల కంటే కంటెంట్, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ కోవలోనే మా ‘నింద’ రూపొందింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 15న మా సినిమా టీజర్‌ను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సంతు ఓంకార్, కెమెరా: రమీజ్ నవీత్.
Comments
Please login to add a commentAdd a comment