రజనీకాంత్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌.. ఒకే రోజు డబుల్‌ ట్రీట్‌ | Rajinikanth Annaatthe First Look And Motion Poster Out On Sep 10 | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌ ఫ్యాన్స్‌కు రేపు డబుల్‌ పండుగ !

Published Thu, Sep 9 2021 4:46 PM | Last Updated on Thu, Sep 9 2021 5:07 PM

Rajinikanth Annaatthe First Look And Motion Poster Out On Sep 10 - Sakshi

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా విడుదల అవుతుందంటే అభిమానులకు పండుగనే చెప్పాలి. అయితే ఇటీవ‌ల రజనీ సినిమాలు పెద్ద‌గా స‌క్సెస్‌ కావడం లేదు. దీంతో ప్రస్తుతం రజనీ నటిస్తున్న ‘అన్నాత్తే’ చిత్రంపైనే ఫ్యాన్స్‌ ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని శివ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా చిత్ర యూనిట్‌ రేపు వినాయక చవితి సందర్భంగా ఆయన అభిమానుల కోసం రెండు అప్‌డేట్స్ ఇస్తున్న‌ట్టు అధికారికంగా ప్ర‌క‌టించారు.

సెప్టెంబ‌ర్ 10న ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. అందులో.. సినిమాలోని రజినీ ఫస్ట్ లుక్‌ని ఉదయం 11 గంటలకి రిలీజ్ చేస్తున్నట్లు, అలానే మోషన్ పోస్టర్ టీజర్‌ని సాయంత్రం 6 గంటలకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్‌ ఒక పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేసింది. అందులో రజనీకాంత్‌ వెనక్కి తిరిగి నిల్చుని ఉండగా, ఆ పక్కనే శూలాలు, భ‌వ‌నాలు క‌నిపిస్తున్నాయి. తమ అభిమాన హీరో ఈ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ అందుకోవాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. 

ఈ చిత్రంలో కీర్తి సురేష్, ఖుష్బూ, న‌య‌న‌తార ,మీనా, ప్రకాష్‌రాజ్‌ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. ‘అన్నాత్తే’ సినిమాను దీపావ‌ళికి విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు.

చదవండి:Saba Qama: మసీదులో నటి డ్యాన్స్‌ వీడియో.. షాకిచ్చిన కోర్టు, అరెస్టు వారెంట్‌ జారీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement