Rajnikanth
-
రజినీకాంత్ సినిమాలో విలన్ గా అమీర్ ఖాన్
-
ఒక ఫ్రేమ్ లోకి రజినీకాంత్, మమ్మూట్టి..?
-
నాని ప్లాన్ లో చిక్కుకున్న రజినీకాంత్ !
-
ఆ డైరెక్టర్ నన్ను ఏడిపించాడు: రజనీకాంత్
Rajinikanth Tears: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం అన్నాత్తే దీపావళి కానుకగా విడుదలైంది. తెలుగులో ‘పెద్దన్న’గా ప్రేక్షకుల ముందుకొచ్చి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ తమిళ్లో మాత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. ఇటీవల హూట్ యాప్ ఇంటర్యూలో రజనీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను సూపర్ స్టార్ షేర్ చేశారు. ‘విశ్వాసం’ సినిమా చూసిన తర్వాత నిర్మాత త్యాగరాజన్ని అభినందించి, శివతో మాట్లాడాలని ఆసక్తిగా ఉందని చెప్పానన్నారు రజనీ. ఈ క్రమంలో తనతో సినిమా చేయాలని ఉందని శివతో చెప్పడంట రజనీ. తనతో సినిమా అనగానే శివ.. సార్ మీతో హిట్ సినిమా తీయడం చాలా సులభమని చెప్పినట్లు తలైవా చెప్పుకొచ్చాడు. 15 రోజుల్లో పల్లెటూరు నేపథ్యంలోని స్క్రిప్ట్‌తో రావాలని రజనీకాంత్ అడగగా, శివ 12 రోజుల్లోనే పూర్తి చేసి తనకి కనిపించినట్లు చెప్పారు. తనకు కథ చెప్పడానికి రెండు గంటలకుపైగా పట్టిందని, ఆ కథ విన్న తర్వాత తనకు కన్నీళ్లు వచ్చాయని చెప్పుకొచ్చారు రజనీకాంత్. అలా ‘అన్నాత్తే’ సినిమా సెట్స్‌పైకి వెళ్లినట్లు చెప్పారు. కాగా డైరెక్టర్ శివ తొలిసారి రజనీకాంత్‌తో సినిమా చేశాడు. చదవండి: Kajal Aggarwal: భర్త కోసం అలాంటి కండీషన్లు పెడుతున్న కాజల్ -
'రజనీకాంత్ సినిమాలకు చేయాలంటే నరకంలా ఫీల్ అయ్యేవాడిని'
సూపర్ స్టార్ రజనీకాంత్, ఏ ఆర్ రెహమాన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు కలెక్షన్ల పరంగానే కాక మ్యూజికల్ హిట్స్ గా నిలిచిన సంగతి తెలిసింది. ఈ వరుసలో ముత్తు, శివాజీ, రోబో, రోబో 2.0 వున్నాయి. ఈ లెజెండరీల కాంబినేషన్లో సినిమా వస్తుందంటే చాలు మూవీ లవర్స్ కు పండగే. అయితే ఇదంతా తెరపైన మనకి కనపడేవి.కానీ దీని వెనుక చాలా వ్యయ ప్రయాసలు,కష్టాలు, దగున్నాయని అప్పటి విషయాలను గుర్తుచేసుకున్నారు ఏ ఆర్ రెహమాన్. ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన.. రజనీకాంత్ సినిమాలకు పనిచేసిన రోజులు అంత ఆహ్లాదకరంగా ఉండేవి కాదని, ఆయన సినిమాకు పనిచేయడమంటే నరకంలా భవించేవాడినని చెప్పాడు. ఇప్పట్లో కొంచెం నయం అని, అప్పట్లో రజనీకాంత్ సినిమాలకు చాలా వరకు దీపావళికి విడుదలయ్యేవి. సినిమాకు పాటలు, బీజీఎం అధిరిపోవాలని అందరూ అనేవాళ్ళు. పైగా ఆయన చిత్రాలకు చాలా తక్కువ సమయం ఉండటంతో ఒత్తిడి కూడా అధికంగా వుండేదని, ఓ రకంగా చాలా ఒత్తిడి కూడా ఉండేదని చెప్పుకొచ్చాడు రెహమాన్. -
రజనీకాంత్ ఎమోషనల్.. పునీత్ మరణాన్ని తట్టుకోలేక పోతున్నా..
చెన్నై(తమిళనాడు): పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈయన మృతికి నటుడు రజనీకాంత్ కాస్త ఆలస్యంగా సంతాపం వ్యక్తం చేశారు. అందుకు కారణం లేకపోలేదు. పునీత్‌రాజ్‌కుమార్ మరణానికి ముందు రోజే రజినీకాంత్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరా రు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రజినీకాంత్ ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలో బుధవారం సంతాపం తెలిపారు. దీని గురించి రజినీకాంత్ హూట్ యాప్‌లో మాట్లాడుతూ.. ‘‘నువ్వు లేవన్న విషయాన్నే జీరి్ణంచుకోలేకపోతున్నాను పునీత్.. రెస్ట్ ఇన్ పీస్ మై చైల్డ్’’ అని పేర్కొన్నారు. చదవండి: సుందర్‌పై అందరికి జాలి కలుగుతుంది: ఆనంద్ దేవరకొండ -
అదిరిపోయిన ‘పెద్దన్న’ ట్రైలర్.. దీపావళికి రానున్న రజనీ
సూపర్ స్టార్ రజనీకాంత్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఆయనకు ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. రజనీ సినిమా ఎప్పుడూ వస్తుందా అనుకుంటూ ఎదురుచూస్తూ ఉంటారు. అయితే శివ కుమార్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘అన్నాత్తే’. ఈ మూవీ తెలుగులో పెద్దన్నగా రానుంది. అయితే ఈ మూవీ ట్రైలర్‌ని తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. దసరా సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్ మంచి రెస్పాన్స్ పొందడమే కాకుండా మూవీపై అంచనాలు పెంచింది. కాగా తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది. అందులో..‘నువ్వు ఎవరనేది నువ్వు వేనకేసుకున్న ఆస్తిలోనో.. నీ చుట్టూ ఉన్న వాళ్లకి నీ మీద ఉన్న భయంలోనో లేదు. నువ్వు చేసే చర్యల్లోనూ.. మాట్లాడే మాటాల్లోనూ ఉంటుంది. ఇది వేదవాక్కు’ అంటూ ఆయన చెప్పిన మాస్ డైలాగులు అదిరిపోయాయి. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార, కీర్తిసురేష్, మీనా, ఖుష్బు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ మూవీ దీపావళి కానుకగా థియేటర్స్ విడుదల కానుంది. -
మామతో కలిసి ఒకేసారి అవార్డు అందుకోడం అద్భుతం: ధనుష్
తమిళ నటుడు ధనుష్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. తమిళ చిత్రం ‘అసురన్’లో ఆయన నటనకు గానూ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నాడు. అయితే అదే రోజు సూపర్ స్టార్ రజనీకాంత్‌ని దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. ఈ తరుణంలో ఇది వర్ణనాతీతమైన అనుభూతి అంటూ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు ఈ హీరో. ధనుష్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన మామ, స్టార్ రజనీతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశాడు. దానికి.. ‘‘తలైవర్’ దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్న అదే వేదికపై, అదే రోజు బెస్ట్ యాక్టర్‌గా అవార్డు అందుకోవడం వర్ణించడానికి మాటలు లేని అనుభూతి. ఇలాంటి గొప్ప బహుమతి ఇచ్చినందుకు జాతీయ అవార్డు జ్యూరీకి ధన్యవాదాలు. నాకు సపోర్టుగా నిలిచిన ప్రెస్, మీడియాకి కృతజ్ఞతలు’ అంటూ రాసుకొచ్చాడు. అలాగే ఈ నటుడు ఫ్యాన్స్ కోసం అంటూ మెడల్ పిక్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. View this post on Instagram A post shared by Dhanush (@dhanushkraja) To my fans ❤️❤️❤️❤️❤️ pic.twitter.com/USEEJLRGFR — Dhanush (@dhanushkraja) October 25, 2021 అంతేకాకుండా ధనుష్ పోస్ట్‌కంటే ముందు, ఆయన భార్య తన తండ్రి, భర్త ఉన ఫోటోని ఇన్‌స్టాలో షేర్ చేసింది. రజనీకి కూతురిగా, ధనుష్‌కి భార్యగా ఉండడం గర్వంగా ఉందని తెలిపింది. అయితే ‘భోంస్లే’ చిత్రానికి గానూ మనోజ్ బాజ్‌పేయితో కలిసి ధనుష్ ఈ అవార్డు అందుకున్నాడు. ఇప్పటివరకు ఆయన నాలుగు జాతీయ అవార్డులు గెలుచుకున్నాడు. View this post on Instagram A post shared by Aishwaryaa R Dhanush (@aishwaryaa_r_dhanush) చదవండి: టాలీవుడ్‌పై ధనుష్ స్పెషల్ ఫోకస్.. మరో ఇద్దరితో చర్చలు! -
యువకులకు రజనీకాంత్ జీవితం ఓ ప్రేరణ: ఉప రాష్ట్రపతి
‘సినిమాల్లో హింస, అశ్లీలతలవంటివి చూపించడాన్ని తగ్గించాలి. సినిమాల ప్రభావం సమాజంపై ఎక్కువగా ఉంటుంది. ప్రజల్లో బాధ్యత పెంపొందించే విధంగా సినిమాలు ఉండాలి. భారతదేశ సినీ పరిశ్రమలో ఉన్న అపారమైన నైపుణ్యానికి ఈ అవార్డులు ఓ మచ్చుతునక మాత్రమే. మరింతమంది ఔత్సాహిక యువ దర్శకులు, కళాకారులు, సాంకేతిక సిబ్బందిని చిత్రపరిశ్రమ పెద్దలు ప్రోత్సహించాలి. సినీరంగంలో అవకాశాలు వెతుక్కుంటున్న యువకులకు రజనీకాంత్ సినీ జీవితం ప్రేరణాత్మకంగా నిలుస్తుంది’ అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన 67వ జాతీయ సినిమా అవార్డుల కార్యక్రమంలో ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంతో పాటు పలువురు కళాకారులకు వెంకయ్యనాయుడు అవార్డులను ప్రదానం చేశారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ‘మహర్షి’ ఎంపిక కాగా ఆ చిత్రదర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత ‘దిల్’ రాజు అవార్డులు స్వీకరించారు. తెలుగులో ఉత్తమ సినిమాగా ఎంపి కైన ‘జెర్సీ’ అవార్డును నిర్మాత సూర్యదేవర నాగవంశీ, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, అదే సినిమాకుగాను ఎడిటర్ నవీన్ నూలి అవార్డు అందుకున్నారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ‘భోంస్లే’కి మనోజ్ బాజ్‌పాయ్, ‘అసురన్ ’ చిత్రానికి ధనుష్ ఇద్దరూ అందుకున్నారు. ‘మణికర్ణిక’, ‘పంగా’ చిత్రాలకుగాను కంగనా రనౌత్ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. నన్ను నటుడిగా తీర్చిదిద్దిన నా గురువు బాలచందర్‌గారికి ధన్యవాదాలు. నా అన్నయ్య సత్యనారాయణరావు గైక్వాడ్ నా తండ్రిలాంటివారు. గొప్ప విలువలు నేర్పించిన ఆయనకు ధన్యవాదాలు. నా మిత్రుడు, డ్రైవర్, ట్రాన్స్పోర్ట్ సహోద్యోగి రాజ్ బహుదూర్ నాలో నటుడు ఉన్నాడని గుర్తించి, నన్ను ప్రోత్సహించారు. వీరితో పాటు నా సినిమా నిర్మాతలు, దర్శకులు, సహ నటీనటులు, సాంకేతిక నిపుణులు, పంపిణీదారులు, థియేటర్ల యజమానులు, మీడియా మిత్రులు, అభిమానులు, తమిళ ప్రజలకి ఈ పురస్కారాన్ని అంకితమిస్తున్నాను. – రజనీకాంత్ మంచి చిత్రాలు తీస్తూ ఉండాలని ఈ పురస్కారం గుర్తు చేస్తూ ఉంటుంది. వినోదంతో పాటు సందేశం ఇవ్వడం సినిమాతో సాధ్యమవుతుంది. మహేశ్‌బాబు లాంటి సూపర్ స్టార్‌తో సినిమా చేసినప్పుడు మరింతమంది చూస్తారు. – వంశీ పైడిపల్లి రైతులకు నగర ప్రజలు ఏ విధంగా సాయం చేయాలనే అంశంతో ‘మహర్షి’ సినిమా తీశాం. మహేశ్ బాబు కమర్షియల్ స్టార్. ఆయనకు తగ్గట్టు సినిమాలో పాటలు, ఫైట్లతో దర్శకుడు వంశీ పైడిపల్లి చక్కటి సినిమా తీశాడు. – ‘దిల్’ రాజు ‘జెర్సీ’కి పని చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ అవార్డు రావడానికి ముఖ్యకారణం హీరో నానీ. – గౌతమ్ తిన్ననూరి – నవీన్ నూలి – సూర్యదేవర నాగవంశీ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా బాబాయి(చినబాబు), డైరెక్టర్‌కు ధన్యవాదాలు. కథను నమ్మి నటించిన నానీకి ప్రత్యేక ధన్యవాదాలు. – సూర్యదేవర నాగవంశీ ఎడిటింగ్‌లో చాలా సంవత్సరాల తర్వాత తెలుగు సినిమాకు అవార్డు రావడం సంతోషంగా ఉంది. – నవీన్ నూలి అవార్డు విజేతల వివరాలు.. ఉత్తమ చిత్రం: ‘మరక్కర్: ది అరేబియన్ కడలింటె సింహం’ (మలయాళం) ఉత్తమ నటుడు: ధనుష్ (‘అసురన్’), మనోజ్ బాజ్‌పాయ్ (‘భోంస్లే’), ఉత్తమ నటి: కంగనా రనౌత్ (మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ, పంగా) ఉత్తమ సహాయ నటుడు: విజయ్ సేతుపతి (తమిళ ‘సూపర్ డీలక్స్’) ఉత్తమ సహాయ నటి: పల్లవీ జోషి (హిందీ ‘తాష్కెంట్ ఫైల్స్’) ఉత్తమ బాల నటుడు: నాగ విశాల్ (తమిళ చిత్రం – ‘కె.డి’) ఉత్తమ దర్శకుడు: సంజయ్ పూరణ్ సింగ్ చౌహాన్ (హిందీ ‘బహత్తర్ హూరేన్ ’) ఉత్తమ వినోదాత్మక చిత్రం: ‘మహర్షి’ ఉత్తమ తెలుగు చిత్రం: ‘జెర్సీ’ ఎడిటింగ్: నవీన్ నూలి (జెర్సీ) కొరియోగ్రాఫర్: రాజుసుందరం (మహర్షి) ఉత్తమ సంగీత దర్శకుడు: డి. ఇమాన్ (తమిళ చిత్రం ‘విశ్వాసం’) ఉత్తమ గాయకుడు: బి. ప్రాక్ (హిందీ ‘కేసరి’) ఉత్తమ గాయని: సావనీ రవీంద్ర (మరాఠీ ‘బర్దో’) ఉత్తమ సినిమాటోగ్రఫీ: గిరీశ్ గంగాధరన్ (మలయాళ చిత్రం – ‘జల్లికట్టు’) ఉత్తమ యాక్షన్ డైరెక్షన్: విక్రమ్ మోర్ (కన్నడ ‘అవనే శ్రీమన్నారాయణ’) ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: సిద్ధార్థ్ ప్రియదర్శన్ (మలయాళ ‘మరక్కర్: ది అరేబియన్ ’) ఉత్తమ కాస్ట్యూమ్స్: సుజిత్ సుధాకరన్, వి. సాయి (‘మరక్కర్...’) ఉత్తమ తమిళ చిత్రం: ‘అసురన్ ’ ఉత్తమ మలయాళ చిత్రం: ‘కల్ల నోట్టమ్’ ఉత్తమ కన్నడ చిత్రం: ‘అక్షి’ ఉత్తమ హిందీ చిత్రం: ‘ఛిఛోరే’ ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం: ‘తాజ్‌మహల్’ (మరాఠీ) స్పెషల్ జ్యూరీ అవార్డు: ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’ (తమిళం) చదవండి: అరాచకంగా ‘అన్నాత్తే’ టీజర్.. వింటేజ్ రజనీ ఆన్ ది వే -
అరాచకంగా ‘అన్నాత్తే’ టీజర్.. వింటేజ్ రజనీ ఆన్ ది వే
సూపర్ స్టార్ రజనీకాంత్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాకు సంబంధించి ఏ చిన్న ఆప్డేట్ వచ్చిన ఆయన ఫ్యాన్స్‌కు పండగే. తాజాగా రజనీ నటిస్తున్న `అన్నాత్తే` చిత్ర టీజర్‌ని దసరా సందర్భంగా గురువారం సాయంత్రం విడుదల చేశారు. శివ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార, కీర్తిసురేష్, మీనా, ఖుష్బు కథానాయికలుగా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన రజనీ క్యారెక్టర్ ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ నెట్టింట హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. టీజర్లో.. రజనీ వింటేజ్ మార్క్ కనిపిస్తోంది. సినిమా యాక్షన్ ఎంటర్టైనర్గా రూపోందించినట్లు తెలుస్తుంది. ఈ ఏజ్‌లోనూ రజనీ యాక్షన్ సన్నివేశాలతో పాటు తనదైన మేనరిజం నటనతో ఇరగదీశాడనే చెప్పాలి. ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలను పెరగనున్నాయి. రజనీ ఫ్యాన్స్ కి ఈ టీజర్ విడుదల చేయడంతో దసరా ప్లస్ దీపావళి రెండు పండుగలు ఒకేసారి వచ్చినట్లు ఉంది. ‘అన్నాత్తే’ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది. దీపావలి కానుకగా సినిమాని విడుదల చేయబోతున్నారు. `దర్బార్` ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దీంతో ఈ చిత్రంపైనే రజనీ అభిమానులు ఆశ పెట్టుకున్నారు. బాక్స్‌ఫీస్ ముందు ‘అన్నాత్తే’ ఎటువంటి ఫలితం రాబోతుందంటే దీపావళి వరకు ఆగాల్సిందే మరి. చదవండి: Nandamuri Balakrishna: మాటలతో వాళ్లను ట్విస్ట్ చేస్తా.. -
తమిళ నటుడు శ్రీకాంత్ మృతి.. ప్రముఖుల నివాళి
తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు శ్రీకాంత్ (82) మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. వయసు పైబడడంతో వచ్చిన అనారోగ్య కారణాలతో మరణించిన ఆయనకి ఎంతోమంది కోలీవుడ్ స్టార్స్ సోషల్ మీడియా వేదికగా నివాళి తెలిపారు. ఆయనతో పాటు భైరవి, సాధురంగం వంటి చిత్రాలలో కలిసి పనిచేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రియమైన స్నేహితుడి మరణం చాలా బాధించిందని చెప్పాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నాడు. దిగ్గజ నటుడు కమల్ హాసన్ సైతం ఆయన మృతిపై విచారం వ్యక్తం చేశారు. కథానాయకుడు, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచిన శ్రీకాంత్‌ని బరువైన హృదయంతో సాగనంపుతున్నట్లు చెప్పుకొచ్చాడు. శ్రీకాంత్ తన చివరి ఇంటర్వ్యూలో.. రజనీకాంత్‌ని కలవాలనే కోరికను వ్యక్తం చేశారు. కానీ దురదృష్టవశాత్తు అతడి ఆశ నెరవేరలేదు. ఆయన బామా విజయం, పూవ తలైయా, ఎతిర్ నీచల్ వంటిక్లాసిక్ మూవీస్ కోలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందాడు. శివాజీ గణేషన్, ఆర్.ముత్తురామన్, శివకుమార్, కమల్ హాసన్ వంటి స్టార్స్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. చదవండి: రజనీకాంత్ ‘అన్నాత్తే’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ என்னுடைய அருமை நண்பர் திரு ஸ்ரீகாந்த் அவர்கள் மறைவு எனக்கு மிகவும் வருத்தமளிக்கிறது. அவருடைய ஆத்மா சாந்தியடையட்டும். — Rajinikanth (@rajinikanth) October 12, 2021 கதாநாயகன், வில்லன், குணச்சித்திரப் பாத்திரங்கள் என ஆல்ரவுண்ட் நடிப்புக் கலைஞராகத் திகழ்ந்த ஸ்ரீகாந்த், தீவிரமான இலக்கிய வாசகராகவும் ஜெயகாந்தனின் ஆப்த சிநேகிதராகவும் இருந்தார். இன்று தன் இயக்கங்களை நிறுத்திக்கொண்டார். இதய கனத்தோடு வழியனுப்பிவைப்போம். — Kamal Haasan (@ikamalhaasan) October 13, 2021 #RIPSrikanth sir, another veteran actor has left us. You will be fondly remembered by our Tamil people pic.twitter.com/Ynp7kaLjtT — Actor Karthi (@Karthi_Offl) October 13, 2021 -
థియేటర్ దద్దరిల్లేలా.. అన్నాత్తెలో రజనీ మోషన్ పోస్టర్
అన్నయ్య బైక్ ఎక్కారు. ఒక చేతిలో బైక్ హ్యాండిల్ బార్, ఇంకో చేతిలో కత్తి... విలన్లను చెడుగుడు ఆడటానికే వెళుతున్నారని అర్థం అవుతోంది. ‘అన్నాత్తే’లోని రజనీకాంత్ తాజా స్టిల్ ఇది. అన్నాత్తే అంటే పెద్దన్నయ్య అని అర్థం. శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్, లుక్స్ విడుదలయ్యాయి. ‘థియేటర్ దద్దరిల్లేలా..’ అంటూ ఈ రెండింటినీ రిలీజ్ చేశారు. రజనీ స్టయిలిష్ లుక్స్‌ని చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. నయనతార, కీర్తీ సురేష్, ఖుష్బూ, మీనా తదితరులు నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదల కానుంది. #AnnaattheFirstLook @rajinikanth @directorsiva #Nayanthara @KeerthyOfficial @immancomposer @khushsundar #Meena @sooriofficial @AntonyLRuben @dhilipaction @vetrivisuals#AnnaattheDeepavali pic.twitter.com/pkXGE022di — Sun Pictures (@sunpictures) September 10, 2021 -
రజనీకాంత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్.. ఒకే రోజు డబుల్ ట్రీట్
సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా విడుదల అవుతుందంటే అభిమానులకు పండుగనే చెప్పాలి. అయితే ఇటీవల రజనీ సినిమాలు పెద్దగా సక్సెస్ కావడం లేదు. దీంతో ప్రస్తుతం రజనీ నటిస్తున్న ‘అన్నాత్తే’ చిత్రంపైనే ఫ్యాన్స్ ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని శివ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా చిత్ర యూనిట్ రేపు వినాయక చవితి సందర్భంగా ఆయన అభిమానుల కోసం రెండు అప్డేట్స్ ఇస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 10న ఫస్ట్ లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. అందులో.. సినిమాలోని రజినీ ఫస్ట్ లుక్‌ని ఉదయం 11 గంటలకి రిలీజ్ చేస్తున్నట్లు, అలానే మోషన్ పోస్టర్ టీజర్‌ని సాయంత్రం 6 గంటలకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్ కూడా విడుదల చేసింది. అందులో రజనీకాంత్ వెనక్కి తిరిగి నిల్చుని ఉండగా, ఆ పక్కనే శూలాలు, భవనాలు కనిపిస్తున్నాయి. తమ అభిమాన హీరో ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్, ఖుష్బూ, నయనతార ,మీనా, ప్రకాష్‌రాజ్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ‘అన్నాత్తే’ సినిమాను దీపావళికి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. #Annaatthe thiruvizha aarambam!#AnnaattheFirstLook Tomorrow @ 11 AM | #AnnaattheMotionPoster Tomorrow @ 6 PM@rajinikanth @directorsiva #Nayanthara @KeerthyOfficial @immancomposer @khushsundar #Meena @sooriofficial @AntonyLRuben @dhilipaction @vetrivisuals #AnnaattheFLTomorrow pic.twitter.com/RTOr8SFqWE — Sun Pictures (@sunpictures) September 9, 2021 చదవండి:Saba Qama: మసీదులో నటి డ్యాన్స్ వీడియో.. షాకిచ్చిన కోర్టు, అరెస్టు వారెంట్ జారీ -
ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రాకి స్వర్ణం.. ట్రెండింగ్‌లో సూపర్‌స్టార్ రజనీ
ఈ ప్రపంచంలో ఎక్కడో జరిగే ఓ మోమెంట్ ఇంకోదానికి లింక్ అయ్యుంటుందని జూ.ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమ’తో చిత్రంలో ఈ డైలాగ్‌ని చెప్తాడు. సరిగ్గా దీనికి సరిపోయేలా ఒలంపిక్స్‌లో ఓ ఘటన జరిగిందని సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ రచ్చ చేస్తోంది. ఆ కథేంటంటే ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే. అయితే ట్విటర్లో నీరజ్ కాకుండా సూపర్ స్టార్ రజనీకాంత్ పేరుతో ట్రెండ్ ఓ పోస్ట్ ట్రెండ్ అవుతోంది. అదేంటి సూపర్ స్టార్ రజనీకాంత్‌కు, ఒలింపిక్స్ హీరో నీరజ్ చోప్రాకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? రజనీ పేరు ఎందుకు సోషల్‌మీడియాలో మారుమోగుతోంది అనుకుంటున్నారా? ఆ విషయంపై లుక్కేస్తే... వాస్తవానికి సూపర్ స్టార్ రజనీకాంత్‌కు, నీరజ్ చోప్రాకు ఏ రకంగాను సంబంధం లేదు. కాకపోతే నీరజ్ ఒలంపిక్స్‌లో గోల్డ్ కైవసం చేసుకున్న అనంతరం స్టేడియం మొత్తం నీరజ్..నీరజ్..నీరజ్... నీరజ్ అంటూ మారుమోగిన సంగతి తెలిసిందే. ఇక్కడే అసలు మ్యాటర్ దాగింది. మనం కంటిన్యూగా నీరజ్ పేరు జపిస్తూ ఉంటే నీరజ్ కాస్త రజనీగా మారుతుంది. కావాలంటే మీరు ఓ సారి ప్రయత్నించండి. అలా స్టేడియంలో నీరజ్ అని పిలిచినా రజనీలా వినపడిందంటూ నెట్టింట ఈ పోస్ట్‌లు హల్చల్ చేస్తున్నాయి. ఇక సూపర్ స్టార్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన అంతటా ఉంటారు, చివరికి ఒలింపిక్స్‌లో కూడా అనే క్యాప్షన్‌తో , నీరజ్ చోప్రా, టోక్యో ఒలింపిక్స్ 2020, నీరజ్ గోల్డ్ చోప్రా హ్యాష్‌టాగ్‌లతో దీన్ని తెగ వైరల్ చేస్తున్నారు. If you chant Neeraj Neeraj Neeraj, you will hear Rajni Rajini Rajini. Now you know the secret. Rajnikanth @rajinikanth is everywhere. Congrats #NeerajChopra #Annaatthe #46YearsOfRajinism #Olympics2021 pic.twitter.com/aftfVtidcn — Magy Manithan (@MagyMagesh1) August 7, 2021 #WeekendWisecrack#WhatsAppWonderBox f you chant Neeraj Neeraj Neeraj, you will hear Rajni Rajni Rajni. Now you know the secret. Rajnikant is everywhere.😂#NeerajChopra #Olympics2021 #SuperStar — KN Vaidyanathan (@KNVaidy) August 7, 2021 -
ఒకే వేదికపై మామ అల్లుడికి అవార్డులు
చెన్నై: మామ అల్లుళ్లు నటుడు రజినీకాంత్, ధనుష్ ఒకే వేదికపై ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకోవడానికి సిద్ధమవుతున్నారు. రజనీ, కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందే అసురన్ చిత్రంలో నటనకు, ఆయన అల్లుడు, ధనుష్ కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ప్రకటించింది. 67వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని మే 3న నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే వేదికపై రజనీకాంత్‌ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో సత్కరించనున్నారు. ఇలా ఒకే వేదికపై మామ అల్లుళ్లు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకోవడం అరుదైన విషయమే. చదవండి: ఒక అవార్డు... ఎన్నో ప్రశ్నలు! -
పార్టీ ఏర్పాటుతో 24 గంటల్లో అధికారమా?
సాక్షి, చెన్నై: ప్రజాకర్షణ లక్ష్యంగా గ్రామసభలకు డీఎంకే బుధవారం శ్రీకారం చుట్టింది. శ్రీపెరంబదూరు సమీపంలోని కున్నం గ్రామంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ పర్యటించారు. గ్రామాల్లో తిరుగుతూ అన్నాడీఎంకేను వ్యతిరేకిద్దాం అనే కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు.2021లో అధికారం లక్ష్యంగా వ్యూహాలకు డీఎంకే పదును పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రజలకు మరింత చేరువయ్యే రీతిలో గ్రామసభలకు నిర్ణయించారు. జనవరి 10వ తేదీ వరకు 16 వేల గ్రామాల్లో ఈ సభల నిర్వహణకు చర్యలు తీసుకున్నారు. ప్రజలతో మమేకం అయ్యే రీతిలో, అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా కరపత్రాల పంపిణీ, స్థానిక సమస్యలపై దృష్టి అంశాలను పరిగణించి బుధవారం ఈ గ్రామసభలకు శ్రీకారం చుట్టారు. డీఎంకే ముఖ్యనేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల కార్యదర్శుల నేతృత్వంలో ఆయా గ్రామాల్లో సభలు సాగాయి. ప్రజలతో కలిసి నేలపై కూర్చుని వారితో మాట్లాడడం, వారి సమస్యలను ఆలకించడం, అన్నాడీఎంకే సర్కారు వైఫల్యాలను ఎత్తి చూపించే విధంగా ఈ సభలు సాగాయి. చదవండి: రజనీకాంత్ జోష్‌కి బ్రేక్ స్టాలిన్ పర్యటన.. కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూరు సమీపంలోని కున్నంలో గ్రామసభకు స్టాలిన్ హాజరయ్యారు. ప్రజలకు మరింత చేరువయ్యే రీతిలో ఆయన పర్యటన ఆ గ్రామంలో సాగింది. గ్రామంలో నడుచుకుంటూ వీధివీధిన నడుచుకుని తిరుగుతూ కరపత్రాలను స్టాలిన్ అందజేశారు. స్టాలిన్ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావంతో అన్నా ఏళ్ల తరబడి ప్రజల కోసం శ్రమించారని గుర్తు చేశారు. అయితే, కొందరు పార్టీ ప్రకటించిన తర్వాత 24 గంటల్లో అధికారంలోకి రావాలని కలలు కంటున్నారని పరోక్షంగా దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. తానూ..రౌడీనే అన్నట్టుగా తానూ రైతు అని గొప్పలు చెప్పుకుంటు సీఎం పళనిస్వామి అదే రైతులకు ద్రోహం తలబెట్టే రీతిలో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. చదవండి: ప్రజలు మార్పు తీసుకురావాలి: కమల్ కేంద్ర వ్యవసాయ చట్టాల రూపంలో రైతులు తీవ్ర నష్టాల్ని, కష్టాల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందని, దీనిని వ్యతిరేకించకుండా మద్దతు పలుకుతున్న సీఎం పళనిస్వామి నేతృత్వంలోని ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికల నిబంధనల్లో సవరణలు చేస్తూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ డీఎంకే నేతృత్వంలో మద్రాసు హైకోర్టు బుధవారం ఓ పిటిషన్ దాఖలైంది. ఇక, పార్టీలో చేరే వారిని ఆహ్వానించే రీతిలో సభ్యత్వ నమోదుకు టోల్ ఫ్రీనంబర్‌ను డీఎంకే ప్రకటించింది. ఆ మేరకు 9171091710 నంబర్‌కు ఫోన్ చేసి తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని ప్రజలకు స్టాలిన్ పిలుపునిచ్చారు. -
తలైవా సినిమా; అదృష్టం అంటే వారిదే
ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించే చాన్స్ కోసం అన్ని ఇండస్ట్రీల వాళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ‘కాలా’ తర్వాత రజనీకాంత్ ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో, సన్ పిక్చర్స్ సంస్థ నిర్మాణంలో తెరకెక్కనున్న సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించిన నాటి నుంచి సూపర్ స్టార్‌తో జోడి కట్టే అదృష్టం ఎవరిని వరిస్తుందా అని రజనీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు. వారి ఎదురుచూపులకు సమాధానం దొరికింది. రజనీకాంత్ సరసన నటించబోయే ఆ అదృష్టం ఒకనాటి అందాల తార సిమ్రాన్‌ను వరించింది. ఇంకా పేరు ఖరారు కానీ ఈ చిత్రంలో సిమ్రాన్ రజనీతో జత కట్టనుంది. అంతే కాక ఈ సినిమాలో మరో విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా నటిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా సన్ పిక్చర్స్ సంస్థ ప్రకటించింది. దాంతో రజనీ సినిమాలో సిమ్రాన్, నవాజుద్దీన్ సిద్దఖీల అధికారిక ప్రవేశం కన్ఫామ్ అయ్యింది. సిమ్రాన్ దక్షిణాది పరిశ్రమకు సుపరిచితురాలే. ఒకప్పుడు ఈ హీరోయిన్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోలందరితో జత కట్టారు. వివాహం చేసుకున్న తర్వాత కొన్నాళ్లపాటు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ఈ మధ్యే తమిళ డైరెక్టర్ పొణరామ్ దర్శకత్వంలో శివకార్తికేయన్, సమంత ప్రధాన పాత్రలలో రూపొందుతున్న సినిమా ద్వారా సిమ్రాన్ తమిళ పరిశ్రమలో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా ఇంకా సెట్స్‌పై ఉండగానే ఇప్పుడు ఏకంగా రజనీకాంత్‌తో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా నవాజుద్దీన్ సిద్దిఖీకి ఇదే తొలి తమిళ చిత్రం. ఇంతవరకూ బాలీవుడ్‌కే పరిమితమయిన ఈ నటుడు ఇప్పుడు రజనీ సినిమాతో దక్షిణాదిలో అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం నవాజుద్దీన్ సిద్దిఖీ అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన సాక్రెడ్ గేమ్స్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించారు. ఈ వెబ్‌సిరీస్‌లో నవాజుద్దీన్ సిద్దిఖీ ముంబైకి చెందిన గ్యాంగ్‌స్టర్ గణేష్ గైతొండే పాత్రలో నటించారు. -
రజనీని ప్రశ్నించిన యువకుడు ..వైరల్ వీడియో
-
రజనీతో పొత్తుపై కమల్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు సినీ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ చుట్టూ తిరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ ఇద్దరూ రాజకీయాల్లోకి వస్తున్నామని ప్రకటించిన నాటినుంచి వీరి తదుపరి కార్యాచరణపై ఆసక్తి నెలకొంది. అటు రజనీ, ఇటు కమల్‌పై జాతీయ, ప్రాంతీయ మీడియాలు ప్రత్యేకంగా ఫోకస్ చేశాయి. ప్రస్తుతం పార్టీ ఏర్పాటు, క్యాడర్ నిర్మాణం, విధివిధానాల ఖరారు మొదలైన సన్నాహక దశల్లో ఉన్న ఈ ఇద్దరు హీరోలు త్వరలో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్ సినీరంగంలో మంచి స్నేహితులు.. సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన మొదట్లో కలిసి ప్రయాణం చేశారు. కలిసి సినిమాల్లో నటించారు. సూపర్స్టార్లుగా ఎదిగారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయాల్లోనూ వీరిద్దరి మధ్య ఆ స్నేహబంధం వెల్లివిరిస్తుందా? ఈ ఇద్దరూ కలిసి పోటీ చేసే అవకాశముందా? రజనీ-కమల్ మధ్య పొత్తు కుదురుతుందా? అంటే ఇప్పటికిప్పుడు ఇథమిత్థంగా చెప్పలేని పరిస్థితి. అయితే, రజనీతో పొత్తు పెట్టుకోవడం కుదరదని కమల్ తాజాగా సంకేతాలు ఇస్తుండటం గమనార్హం. ‘రజనీకాంత్ రాజకీయాల్లో కాషాయ రంగు ఛాయలు కనిపిస్తున్నాయి. అది మారకపోతే.. అతనితో నేను పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. మేం మంచి స్నేహితులమే కానీ రాజకీయాలు భిన్నమైనవి’ అని కమల్ ఆదివారం తేల్చేశారు. రజనీ బీజేపీ అనుకూల విధానాలు వీడకపోతే.. ఆయనతో కలిసి వెళ్లే ప్రసక్తే లేదని కమల్ స్పష్టం చేశారు. కమల్ ఈ మేరకు చేసిన సంచలన వ్యాఖ్యలు తమిళనాట రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. -
రజనీపై విరుచుకుపడ్డ శరత్‌కుమార్
సాక్షి, చెన్నై : సూపర్ స్టార్ రజనీకాంత్‌పై నటుడు శరత్ కుమార్ విరుచుకుపడ్డారు. సినిమాల విడుదల సమయంలో పబ్లిసిటీ కోసం రజనీ రాజకీయాలను వాడుకుంటున్నారని ఆరోపించారు. రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చని అన్న ఆయన.. రజనీ చెబుతున్న ఆధ్యాత్మికత, సెక్యులర్ విలువలేంటో ఎన్నికల సమయంలో తెలుస్తుందన్నారు. అప్పుడే రజనీ వెనకున్న రాజకీయ శక్తులు కూడా బయటకు వస్తాయని చెప్పారు. తమిళులు, కన్నడిగుల మధ్య కావేరి, మేగదారు సమస్యలు వచ్చినప్పుడు రజనీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రజనీకి ధైర్యం ఉంటే కర్ణాటక నుంచి ఇప్పుడు ఎన్నికల బరిలోకి దిగగలరా? అంటూ సవాల్ విసిరారు. జయలలిత, కరుణానిధిలు రాజకీయాల్లో ఉన్నప్పుడు రజనీ ఎందుకు రాజకీయ ప్రవేశం చేయలేదని ప్రశ్నించారు. యువతరానికి రాజకీయాల్లో దారి ఇవ్వండన్న విశాల్.. ఇప్పుడు ఆ విషయాన్ని కొంచెం రజనీ చెవిలో చెబుతారా? అంటూ విమర్శించారు. -
సూపర్ స్టార్ రజనీకి సీఎం షాక్!
చెన్నై: రాజకీయ అరంగేట్రంపై సంకేతాలు పంపుతున్న సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై తమిళనాడు సీఎం పళనిస్వామి సెటైర్లు విసిరారు. రాజకీయాల్లోకి రావాలనుకునే వారు ముందుగా ప్రజలకు సేవ చేయాలన్నారు. సినీ నటులు రాజకీయ ప్రకటనలు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల మనసులు గెలుచుకోకుండా ఎవరూ అందలం ఎక్కలేరని వ్యాఖ్యానించారు. ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని కూలదోయాలని జరుగుతున్న ప్రయత్నాలు ఫలించబోవన్నారు. అమ్మ ఆశీస్సులు ఉన్నంతకాలం తమ ప్రభుత్వానికి ఢోకా లేదన్నారు. దివంగత సీఎం ఎంజీ రామచంద్రన్ జయంతోత్సవాల సందర్భంగా పెరంబలూర్‌లో జరిగిన బహిరంగ సభలో పళనిస్వామి ప్రసంగించారు. -
సూపర్ స్టార్ ఇంటికి దేశాధినేత
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నివాసానికి శుక్రవారం ఓ విశిష్ట అతిథి వచ్చారు. రజనీని చూసేందుకు ఏకంగా ఓ దేశాధినేత వచ్చారు. భారత పర్యటనకు వచ్చిన మలేసియా ప్రధాని నజీబ్ రజాక్.. రజనీకాంత్‌తో సమావేశమయ్యారు. మలేసియా ప్రధాని మర్యాదపూర్వకంగా రజనీ ఇంటికి వెళ్లి కలసినట్టు సమాచారం. ఈ భేటీ అనంతరం రజనీ మీడియాతో మాట్లాడారు. కొన్నాళ్ల క్రితం మలేసియాలో ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్నానని, అప్పుడు నజీబ్ రజాక్‌ను కలవలేకపోయానని చెప్పారు. దీంతో ఇప్పుడు ఆయన తనను కలిసేందుకు వచ్చారని తెలిపారు. మలేసియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని ప్రధాని నజీబ్ తనను కోరలేదని, ఇవన్నీ ఊహాగానాలేనని అన్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా రజనీ నివాసానికి వెళ్లారు. రజనీకాంత్‌కు దేశంలోనే గాక శ్రీలంక, జపాన్, సింగపూర్, మలేసియా తదితర దేశాల్లో అభిమానులు ఉన్నారు. రజనీ సినిమాలను అక్కడ బాగా చూస్తారు. రజనీ సినిమా విడుదల రోజున విదేశాల్లో కొన్ని కంపెనీలు ఉద్యోగులకు సెలవులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో ఆయన విదేశాలకు షూటింగ్‌లకు వెళ్లినపుడు పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు కలవడంతో పాటు విందు ఏర్పాటు చేశారు. -
సూపర్‌స్టార్ చిత్రానికి ఎమీ గుడ్‌బై
సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రానికి ఇంగ్లీష్ బ్యూటీ ఎమీజాక్సన్ గుడ్‌బై చెప్పారట. ఏమిటీ షాక్ అవుతున్నారా? ఈ విషయాన్ని తనే స్వయంగా తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతే కాదు దర్శకుడు శంకర్‌కు థ్యాంక్స్ అని కూడా చెప్పుకున్నారు. కాస్త అయోమయంగా ఉంది కదూ ‘రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 2.ఓ. ఇది సూపర్‌హిట్ చిత్రం ఎందిరన్ కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్నదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి స్టార్ డైరెక్టర్ శంకర్ సృష్టికర్త అన్నది తెలిసిన విషయమే. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్లో రూపొందుతున్న చిత్రంగా నమోదు కానుంది. ఈ చిత్రంలో రజనీకు జంటగా ఎమీజాక్సన్ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్.రెహ్మాన్ భాణీలు కడుతున్నారు. పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణలు పనిచేస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక అద్భుత ట్రీట్‌గా ఉండబోతుందని చెప్పవచ్చు. 2.ఓ చిత్రం చివరి పెడ్యూల్ చిత్రీకరణలో ఉంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన తన పోర్షన్ ను నటి ఎమీజాక్సన్ ఆదివారంతో పూర్తి చేశారట. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్లో పేర్కొన్నారు. 2.ఓ చిత్రం కోసం 18 నెలలు పని చేసినట్లు, ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పించిన దర్శకుడు శంకర్‌కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్లూ ఎమీజాక్సన్ పేర్కొన్నారు. 2.ఓ చిత్రాన్ని రూ.350 కోట్ల బడ్జెట్‌తో రూపొందించనున్నట్లు మొదట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడా బడ్జెట్ రూ.400 కోట్లకు పైగా పెరిగినట్లు సమాచారం. కాగా 3డీ ఫార్మాట్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దీపావళి పండగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
'రజినీ పార్టీ లేదు.. రాజకీయాల్లోకి రావట్లేదు'
న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్ కొత్త పార్టీ ఏర్పాటు అనేది అవాస్తం అని ఆరెస్సెస్ సిద్ధాంత కర్త గురుమూర్తి స్పష్టం చేశారు. ఆయన బీజేపీతో చర్చలు జరుపుతున్నారంటూ వస్తున్న ప్రచారమంతా ఓ కట్టుకథ, అభూత కల్పన అని ఆయన కొట్టిపారేశారు. రజినీకాంత్ కొత్త పార్టీతో వస్తున్నారని, ఆమేరకు బీజేపీతో టచ్‌లో ఉన్నారని, వీరిద్దరి మధ్య ఆరెస్సెస్ సిద్ధాంత కర్త గురుమూర్తి సయోధ్య కుదురుస్తున్నారంటూ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో స్పందించి గురుమూర్తి.. మీడియాలో ఇంత నిర్లక్ష్యంగా ఎలా ప్రసారం చేస్తారో అర్థం కావడం లేదన్నారు. కొంతమంది కావాలనే పనిగట్టుకొని ఈ అబద్ధ ప్రచారం చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. అసలు రజినీ రాజకీయ ఆరంగేట్రం పూర్తిగా అవాస్తవం అని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడు రాజకీయ పరిస్థితులు చూసి రజినీకాంత్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని, ఈ నేపథ్యంలో కొత్త పార్టీతో వస్తారని తొలుత సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. పవర్ అంటే తనకు ఇష్టమని రజినీ చెప్పడం కూడా అందుకు కారణం అయింది. అదే సమయంలో గురుమూర్తి ద్వారా బీజేపీతో సయోధ్య కుదుర్చుకొని కొత్త పార్టీతో రజినీ వస్తున్నారంటూ తాజాగా వార్తలు వచ్చి ధుమారం రేపాయి. దీంతో ఆయన వివరణ ఇచ్చారు. A totally false news is circulating that Rajnikanth is joining politics on my asking. How ridiculous for the media to carry such false news! — S Gurumurthy (@sgurumurthy) 10 February 2017 -
చిన్న హీరోతో లవ్... పెద్ద హీరో టైటిల్!
చిన్న హీరోతో లవ్... పెద్ద హీరో టైటిల్ అంటే ఏంటో అర్థం కావడంలేదు కదూ. కొంచెం తికమకగా కూడా ఉంది కదూ. కన్ఫ్యూజన్లో అసలు విషయం ఏంటో తెలుసుకోవాలని మనసు తొందరపడుతోంది కదూ. మరేం లేదు... తమిళంలో ఇప్పుడిప్పుడే పైకొస్తున్న చిన్న హీరో శివకార్తికేయన్ సరసన నటించడానికి స్టార్ హీరోయిన్ నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రానికి పెద్ద హీరో రజనీకాంత్ గతంలో నటించిన ‘వేలైక్కారన్’ సినిమా టైటిల్‌ని పెట్టాలనుకుంటున్నారు. అసలు విషయం అది. ఇదిలా ఉంటే.. ఇటీవల ‘తని ఒరువన్’ వంటి సూపర్ హిట్ మూవీకి దర్శకత్వం వహించిన మోహన్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మురికివాడలకు చెందిన ఓ యువకుడి కథతో ఈ చిత్రం ఉంటుందట. -
పవర్ అంటే నాకిష్టం
తమిళసినిమా (చెన్నై): పవర్ అంటే తనకు చాలా ఇష్టమని కాని అది ఆధ్యాత్మికతతో కూడిన పవర్ అని సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నారు. శనివారం చెన్నైలో మాట్లాడుతూ ఓ కథ చెప్పారు. ‘ఒక రాజ్యంలో మంత్రి రాజ్యాన్ని వదిలేస్తాడు. ఆధ్యాత్మిక చింతనతో హిమాలయాలు తిరిగి మూడేళ్లకు తిరిగొచ్చాడు. అప్పుడు రాజు మంత్రిని ఏం సాధించావు’ అని అడగ్గా మంత్రి ‘ ఓ రాజా గతంలోఓ మీరు కూర్చున్నారు. నేను నిలబడి మీకు సమాధానం చెప్పేవాడిని. ఇప్పుడు ఆధ్యాత్మిక గురువుగా వచ్చిన నన్ను కూర్చోబెట్టి మీరు నిలబడ్డారు. ఇదే నేను సాధించింది’ అని అన్నాడు. నేను ఇష్టపడేది కూడా అలాంటి ఆధ్యాత్మిక పవర్నేనని రజనీకాంత్ వివరించారు. -
విలన్ గానే పరిపూర్ణ నటన ప్రదర్శించా..
తాను ప్రతినాయకుడిగానే పరిపూర్ణ నటనను ప్రదర్శించానని సూపర్‌స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యానించారు. యువ నటుడు విజయ్‌సేతుపతి, తమన్నా జంటగా నటించిన చిత్రం ధర్మదురై. శీనురామసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నటుడు, నిర్మాత ఆర్కే.సురేశ్ నిర్మించారు. కాగా ఈ చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ రోజుల్లో ఎంత మంచి చిత్రం అయినా రెండు వారాలు ఆడడం గగనంగా మరిదన్న విషయం తెలిసిందే. అలాంటిది ధర్మదురై చిత్రం ఇటీవల శతదినోత్సవ వేడుకను కూడా జరుపుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలిసి చిత్ర వందరోజుల జ్ఞాపికను అందించి ఆయన అభినందనలు అందుకున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ ధర్మదురై చిత్రంలో కథానాయకుడు విజయ్‌సేతుపతి, తమన్నా, రాధికాశరత్‌కుమార్, ఎంఎస్.భాస్కర్ల నటన తనను ఎంతగానో ఆకట్టుకుందని ప్రశంసించారు. అదే విధంగా దర్శకుడు శీనురామసామి తన ప్రతి చిత్రంలోనూ చక్కని సందేశం ఉండేలా కథలను తయారు చేసుకుంటున్నారని అభినందించారు. తాను విలన్ గా నటిస్తున్న సమయంలోనే సంపూర్ణ నటనను ప్రదర్శించగలిగానని, అదే విధంగా ధర్మదురై, మరుదు చిత్రాల్లో చక్కని విలనిజాన్ని ప్రదర్శించి ఈ చిత్ర నిర్మాత ఆర్కే.సురేశ్ మంచి నటుడిగానూ ఎదుగుతున్నారని ప్రశంసించారు. దర్శకుడు శీనురామసామి తన స్పందనను తెలియజేస్తూ, రజనీకాంత్ నటించిన ముల్లుం మలరుం, కాళీ వంటి చిత్రాల ప్రభావంతో తాను సినీరంగంలోకి వచ్చానన్నారు. అలాంటిది ఇవాళ రజనీకాంత్‌ను ప్రత్యక్షంగా కలుసుకోవడం, తమ చిత్ర వంద రోజుల జ్ఞాపికను ఆయనకు అందించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. -
బుక్ మై షో టాప్–10లో కబాలి
బుక్ మై షో టాప్–10లో నమోదైన చిత్రంగా సూపర్‌స్టార్ నటించిన కబాలి చిత్రం చోటు చేసుకోవడం విశేషం. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత దాన్ని అందిపుచ్చుకోవడానికి అన్ని రంగాల మాదిరిగానే సినీరంగానికి చెందిన వారు, సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య నానాటికి అధికం అవుతోందని చెప్పకతప్పదు. ఇక సినిమా టికెట్ల ఆన్ లైన్ బుకింగ్ విధానం అమల్లోకొచ్చి చాలా కాలం అయ్యింది. అలాంటి సోషల్ మాద్యమాల్లో బుక్ మై షో అగ్రగామిగా రాణిస్తోంది. సినిమా టిక్కెట్ల కోసం భారతదేశంలో అత్యధిక ప్రేక్షకులు ఉపయోగిస్తున్న సోషల్ మాద్యమం బుక్ మై షో. ఈ మద్యమం ద్వారా 2016లో అధికంగా ప్రేక్షకులు టికెట్స్ బుక్ చేసుకున్న చిత్రాల టాప్–10లో రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం నమోదు కావడం విశేషం. ఇక బాలీవుడ్ బాద్షా నటించిన ఫ్యాన్ చిత్రం 14వ స్థానానికి పరిమితమయ్యింది. అదే విధంగా రీజినల్ భాషా చిత్రాల పట్టికను తీసుకుంటే 2016లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా కబాలి రికార్డు సాధించినట్టు బుక్ మై షో కో–ఫౌండర్, డైరెక్టర్ పరిక్షిత్ దర్ పేర్కొన్నారు. ఇక తెలుగులో చిన్న చిత్రంగా తెరకెక్కి భారీ వసూళ్లను సాధించిన చిత్రంగా అఆ, మలయాళంలో పులిమురుగన్, కన్నడంలో గోది బన్న «సధర్న మై కట్టు చిత్రాలు రికార్డు సాధించినట్లు ఆయన తెలిపారు. కాగా బుక్ మై షో ద్వారా టికెట్లు కొనుగోలు చేసే వారి సంఖ్య 2016లో భారీగా పెరిగిందని, ఇది 2017లో మరింతగా పెరుగుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. -
డోంట్ వర్రీ: రజనీకాంత్
ఇటీవల చెన్నై శివార్లలో ‘2.0’ షూటింగ్ జరుగుతున్న సమయంలో హీరో రజనీకాంత్ కాలికి గాయమైన సంగతి తెలిసిందే. వెంటనే దగ్గరలోని హాస్పటల్‌కి ఆయనను తీసుకువెళ్లారు. అయితే, గంటలోనే రజనీకాంత్ సెట్‌కి తిరిగొచ్చి షూటింగ్‌కి నేను రెడీ అన్నారట! ‘‘యూనిట్ సభ్యులంతా టెన్షన్ పడుతుంటే.. ‘డోంట్ వర్రీ’ అని ధైర్యం చెప్పారు. ఆయన ప్రొఫెషనలిజం, వ్యక్తిత్వం చూసి నేను ఆశ్చర్యపోయా’’ అని హీరోయిన్ ఎమీ జాక్సన్ అన్నారు. -
'రజనీ రాజకీయాల్లోకి రారు'
చెన్నై: ఎట్టి పరిస్థితుల్లోనూ రజనీకాంత్ రాజకీయాల్లోకి రారని ఆయన సోదరుడు సత్యనారాయణ స్పష్టం చేశారు. రామేశ్వరంలోని రామనాథస్వామిని సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రజనీ రాజకీయాల్లోకి రావడం తనకు, తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని అన్నారు. రజనీ సినిమా జీవితాన్నే కొనసాగిస్తారని, ప్రస్తుతం యంతిరన్ -2 (రోబో-2) షూటింగ్లో రజనీ బిజీగా ఉన్నారని తెలిపారు. -
నా మిత్రుడు కింగ్ లా ఉన్నాడు: మోహన్ బాబు
సినీ ఇండస్ట్రీలో శత్రువులే తప్ప మిత్రులు తక్కువ ఉంటారనే మాట వింటుంటాం. కానీ కొందరు మాత్రం అందుకు అతీతం. ఏళ్ల తరబడి తమ స్నేహబంధాన్ని కొనసాగిస్తూ ముందు తరాల వారికి ఆదర్శంగా నిలుస్తారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, సూపర్ స్టార్ రజనీకాంత్‌లు అలాంటి స్నేహితులే. ప్రస్తుతం ఎవరికి వారు వ్యక్తిగత జీవితాల్లో బిజీగా ఉన్నారు. అయితే మోహన్ బాబు వీలు చేసుకుని తన చిరకాల మిత్రుడు రజనీ ఇంటికి వెళ్లి ఆయన్ను కలుసుకున్నారు. శనివారం ఇద్దరూ కలిసి విలువైన సమయాన్ని గడిపారు. తన మిత్రుడు మహారాజులా కనిపిస్తున్నాడంటూ ట్వీట్ చేసి రజనీ మీదున్న అభిమానాన్ని చాటుకున్నారు మోహన్ బాబు. అలాగే ఈ కలియుగంలో రజనీ దుర్యోధనుడైతే, తాను కర్ణుడినంటూ పేర్కొన్నారు. చాలాకాలం తర్వాత తన సోదరి లతను కలుసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. రజనీకాంత్ విజయం వెనుక ఆయన సతీమణి లత ఉందని తాను బలంగా నమ్ముతానంటూ ట్వీట్ చేశారు. వారితో కలిసి ఆత్మీయంగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. After a long time met my greatest sister Latha;without whom I strongly believe, Rajini wouldn't be where he is today pic.twitter.com/XTITPFSXHQ — Mohan Babu M (@themohanbabu) 3 September 2016 Had a good time meeting my best friend. He looks like a King! In this kaliyuga,he would be Duryodhana and I, Karna! pic.twitter.com/dHLivm87GN — Mohan Babu M (@themohanbabu) 3 September 2016 -
కబాలి చేతిలోని పుస్తకం ఏంటో తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవి నుంచి కమల హాసన్, మమ్ముట్టి, అమితాబ్ బచ్చన్ వరకు చాలామంది స్టార్ హీరోలు వాణిజ్య ప్రకటనల్లో కనిపించారు. సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఇప్పటివరకు ఒక్క ప్రకటనలో కూడా నటించలేదు. రజనీ తాజా సినిమా కబాలి విడుదల సందర్భంగా ఆయన క్రేజ్‌ను వాడుకునేందుకు కొన్ని కార్పొరేట్ కంపెనీలు పోటీపడ్డాయి. విశేషమేంటంటే.. ఎవరూ ఊహించనివిధంగా రజనీ ఓ తెలుగు రచయిత పుస్తకానికి విశేష ప్రాచుర్యం కల్పించారు. కబాలి ట్రైలర్లో రజనీ జైల్లో ఓ పుస్తకాన్ని చదువుతూ కనిపిస్తారు. ఆ పుస్తకం ఏంటో తెలుసా? తెలుగు దళిత రచయిత ప్రొఫెసర్ వైబీ సత్యనారాయణ రాసిన మై ఫాదర్ బాలయ్య (తెలుగులో మా నాయిన బాలయ్య) పుస్తకం. ఈ ఇంగ్లీష్ వర్షెన్ పుస్తకాన్ని కబాలి సినిమాలో రజనీ చదువుతున్నట్టుగా కనిపిస్తారు. కబాలి ఫీవర్‌తో ఊగిపోతున్న ప్రేక్షకులకు ఈ పుస్తకం గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపుతున్నారు. రజనీ ద్వారా ఈ పుస్తకానికి దేశవిదేశాల్లో ప్రత్యేక గుర్తింపు వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న కబాలి సినిమా మాదిరిగా ఈ పుస్తకం బెస్ట్ సెల్లర్స్‌లో ఒకటిగా నిలిచినా ఆశ్చర్యంలేదని చెబుతున్నారు. రచయిత వైబీ సత్యనారాయణ.. దళితులు ఎదుర్కొన్న వివక్ష, ఆత్మగౌరవం కోసం వారు చేసిన పోరాటం గురించి రాశారు. -
'కబాలి'కి లైన్ క్లియర్
చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా సినిమా 'కబాలి' విడుదలకు అడ్డంకులు తొలగాయి. ఈ సినిమా విడుదల కాకుండా స్టే ఇచ్చేందుకు చెన్నై హైకోర్టు నిరాకరించింది. 'లింగా' సినిమా డిస్ట్రిబ్యూటర్లు పిటిషన్ వేసిన పిటిషన్ పై న్యాయస్థానం ఈ మేరకు స్పందించింది. 'లింగా' సినిమా కారణంగా వచ్చిన నష్టాలను ఇప్పటివరకు రజనీకాంత్ చెల్లించలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. తమకు వచ్చిన నష్టాన్ని భర్తీ చేసిన తర్వాతే కబాలి' సినిమా విడుదలకు అనుమతివ్వాలని కోర్టును కోరారు. అయితే ఇందుకు హైకోర్టు నిరాకరించింది. 'కబాలి' సినిమా ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలకానుంది. రజనీకాంత్ నటించిన లింగా చిత్రం పరాజయం కావడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. భారీ నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు పరిహారం డిమాండ్ చేశారు. ఈ విషయంలో నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్, డిస్ట్రిబ్యూటర్ల మధ్య పరిష్కారం కుదరలేదు. దీంతో పరిహారం కోసం రజనీకాంత్ ఇంటి ముందు భిక్షాటన చేసి ఆందోళన కూడా చేశారు. నిరహారదీక్షలు చేపట్టారు. ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. -
కబాలి మానియాలో బిగ్ బ్రాండ్స్
విడుదలకు ముందే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి ఫీవర్ ఓ రేంజ్ లో పెరుగుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ కబాలి క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు పెద్దపెద్ బ్రాండ్లన్నీ తమదైన శైలిలో పోటీ పడుతున్నాయి. ఓ వైపు కబాలి మానియాలో రజనీ అభిమానులు మునిగి తేలుతోంటే.. మరోవైపు బిగ్ బ్రాండ్స్ కూడా సౌత్ ఇండియా సూపర్ స్టార్ పై అభిమానాన్ని, ఇటు వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. ముఖ్యంగా ఎయిర్ టెల్..అమెజాన్, క్యాడ్ బరీ ఫైవ్ స్టార్, ఎయిర్ ఆసియా, ఇమామి,షాప్ సీజె, ముత్తూట్ ఫైనాన్స్ కొన్ని ప్రత్యేక ఆఫర్లతో మార్కెట్ లోకి వస్తున్నాయి. ఇపుడు తాజాగా కబాలి క్రేజ్ ను కేరళకు చెందిన ప్రముఖ ఫైనాన్స్ సంస్థ ముతూట్ ఫిన్ కార్ప్, అమెజాన్ కూడా విరివిగా ఉపయోగించుకుంటున్నాయి.. ముత్తూట్ సంస్థ కబాలి (ఎంబోజ్ చేసిన రజనీ కాంత్ బొమ్మ) వెండి నాణేలు రిలీజ్ చేసింది. 5, 10 ,20 గ్రాములున్న వెండి నాణేలను ఈ సంస్థ మార్కెట్ లో ప్రవేశపెడుతోంది. వీటి ధర రూ.350 , రూ 700, రూ.1400 గా ఉన్నాయి. వీటిని శుక్రవారం నుంచి ఆన్ లైన్ లో బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. అయితే సినిమా రిలీజ్ అయ్యాకే తమ అన్ని బ్రాంచెస్ లో వీటి డెలివరీ ఉంటుందని ముతూట్ సంస్థ ప్రకటించింది. అలాగే ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కబాలి కీ చైన్లు, మైనపు బొమ్మలు, పోస్టర్లు, ఫోటోలను ప్రీమియం ధరల్లో ప్రవేశపెట్టింది. వీటిని రూ. 90 నుంచి రూ. 400 మధ్య అందిస్తోంది. కబాలి రిలీజ్ డే నాడు బెంగళూరు - ముంబై నగరాల నుంచి రజనీ అభిమానులను చెన్నైకు స్పెషల్ ఫ్లైట్స్ లో వచ్చి సినిమాను వీక్షించేందుకు ప్రత్యేక ప్యాకేజీలు రెడీ అయ్యాయి. ఫ్లై లైక్ ఏ సూపర్ స్టార్ అంటున్న ఎయిర్ ఆసియా, ప్రత్యేక కబాలి మెనూను కూడా అందిస్తోంది. ఫ్లైట్స్ మీద సైతం కబాలి పోస్టర్లు దర్శనమివ్వడం చూశాం. అలాగే కబాలి క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్ టెల్ ప్రత్యేకంగా సిమ్ ను విడుదల చేయడంతో పాటు రకరకాల ప్యాకేజీలు రూపొందించింది. కబాలి రిచార్జ్ ప్యాక్, సిమ్ ప్యాక్, పాపులర్ డైలాగులు, పాటలతో హలో ట్యూన్స్ ను ఆఫర్ చేస్తోంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో కబాలి ఎయిర్టెల్ సిమ్ లు విరివిగా దొరుకుతున్నాయి. వినియోగదారుల ప్రత్యేక ఎస్ఎంఎస్ చానల్ ద్వారా ఇచ్చిన సెలెక్టెడ్ మెసేజ్ లతో కాఫీ టేబుల్ బుక్ తయారు చేసి రజనీకాంత్ అందించనున్నట్టు భారతీ ఎయిర్ టెల్ (తమిళనాడు అండ్ కేరళ)సీఈవో జార్జ్ మాథెన్ ప్రకటించారు. అటు కబాలి చిత్రనిర్మాతలు కూడా ఇదే రేంజ్ లో సినిమాను ప్రచారం చేస్తున్నారు. దీంతోపాటుగా యూత్ ను టార్గట్ గా కబాలి ప్రత్యేక కప్పులు,కీ చెయిన్లు, ఫోన్ కవర్లు, టీ షర్టులు తదితర మార్కెట్లో హల్ చల్ చేస్తున్న సంగతి సరేసరి. కాగా రిలీజ్ కు ముందే ఇంత భారీ హైప్ క్రియేట్ కబాలి...ముందు ముందు ఇంకెంత సంచలనం సృష్టిస్తుందో చూడాలి.. ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. -
కానిస్టేబుల్ కుమారుడే..
ఎగిరెగిరి పడడం అందరికీ వచ్చు.. ఎదిగినా ఒదిగి ఉండటం కొందరికే తెలుసు. తెర మీద పోషించే పాత్ర ఎందరికో నచ్చుతుంది.. కానీ తెర వెనుక వ్యక్తిత్వం అందరికీ నచ్చటం గొప్ప విషయం. ఆయనో సినీ శిఖరం.. ఎల్లలు దాటిన అభిమానం ఆయన సొంతం. అయినా వినయమే ఆభరణం. ఆయనే మన సూపర్ స్టార్ రజనీకాంత్. తలైవా కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరిన సందర్భంగా.. కానిస్టేబుల్ కుమారుడే.. సామాన్య పోలీస్ కానిస్టేబుల్ అయిన రామోజీ రావ్ గైక్వాడ్, రమాబాయిల నాలుగవ సంతానం శివాజీరావ్ గైక్వాడ్. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మీద అభిమానంతో పెట్టుకున్న పేరు. ఆరేళ్లకే మహా ఆకతాయిగా ఉండే గడుగ్గాయిలా తయారయ్యాడు. క్రికెట్, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్.. అన్నిటినీ ఓ చూపు చూసేవాడు. తమ్ముడి దుందుడుకుతనం గమనించిన అన్నయ్య సరాసరి రామకృష్ణ మఠంలో చేర్పించాడు. ఇక అక్కడి నుంచి క్రమశిక్షణ గల జీవితం అలవరచుకున్నాడు శివాజీరావు. వేదాలు, సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రలాంటి విషయాలు ఆసక్తిగా అనిపించేవి. ఆ వయసులోనే ఆధ్యాత్మికత వైపు ఆకర్షితుడయ్యాడు. మఠంలో ప్రదర్శించే నాటికలలో పాత్రలు వేస్తుండేవాడు. అక్కడే నటన వైపు మనసు మళ్లింది. ప్రాథమిక విద్య అనంతరం మఠం వదిలి మరో పాఠశాలలో చేరాడు. పాఠశాల విద్య అయిపోయేంతవరకు అక్కడే చదువుకున్నాడు. ఆ సమయంలోనే ఓ సారి 'కురుక్షేత్ర' అనే నాటికలో దుర్యోధనుడి పాత్ర పోషించిన శివాజీరావుకి చెప్పుకోదగ్గ ప్రశంసలే దక్కాయి. ఆ దెబ్బతో నటించాలనే దాహం మరింత పెరిగింది. కూలీ నుంచి కండక్టర్ వరకు.. పాఠశాల నుంచి బయటకు వచ్చాక బతుకు తెరువు కోసం శివాజీ చేయనిపని లేదు. కూలి పనికి వెళ్లేవాడు, అది లేని రోజున కార్పెంటర్ అవతారం ఎత్తేవాడు.. అదీ దొరక్కపోతే మరోటి. బెంగళూరు ట్రాన్స్పోస్టు సర్వీస్‌లో బస్ కండక్టర్‌గా ఉద్యోగం దొరికే వరకు ఇదే పంథా కొనసాగింది. యుక్త వయసు.. ఉడుకు రక్తం.. కుదురుగా ఉండనిస్తుందా? ఒంట్లో ఉన్న స్టైల్ అంతా పనిలో చూపించేవాడు. ఆడుతూ పాడుతూ పని చేసేవాడు. రూపాయి బిళ్ల ఎగరేస్తే కళ్లప్పగించి చూడాల్సిందే. టిక్కెట్లను అంత స్టైల్‌గా కొట్టొచ్చని శివాజీని చూశాకే చాలామంది కండక్టర్లకు తెలిసుంటుంది. కండక్టర్ ఉద్యోగంతోపాటు కన్నడ నాటికలు కూడా నడుస్తుండేవి. యాక్టింగ్ కోర్సు చేయడానికి మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కూడా చేరాడు. కుటుంబం నుంచి తీవ్ర వ్యతిరేకత.. స్నేహితుడి నుంచి బోలెడంత ప్రోత్సాహం. అలా ఓ రోజు ఇన్స్టిట్యూట్లో ఓ నాటికలో నటిస్తుండగా తమిళ దర్శకుడు కె.బాలచందర్ కంటపడ్డాడు. త్వరగా తమిళం నేర్చుకోవోయ్ అంటూ సలహా ఇచ్చేశారు బాలచందర్. అపూర్వ రాగాంగళ్ నుంచి .. అన్నట్టే బాలచందర్ అవకాశమూ ఇచ్చారు. 'అపూర్వ రాగాంగళ్' సినిమాలో ఓ చిన్న పాత్ర ద్వారా తెరంగేట్రం చేశాడు శివాజీరావ్ గైక్వాడ్. పెద్దగా పట్టించుకోలేదు జనాలు. కన్నడంలో కొన్ని ప్రయత్నాలు.. ప్రయత్న లోపం లేదుగానీ ఫలితంలో మాత్రం లోపమే. సరిగా అప్పుడు బాలచందర్ నుంచి మరోసారి పిలుపు. 'అంతులేని కధ'లో అన్నయ్య పాత్ర. బాలచందర్ లాగే ఈసారి జనాలు కూడా పట్టేశారు. మొదట్లో చిన్న చిన్న వేషాలు, విలన్ పాత్రలు.. వెనుకడుగు వేయలేదు. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత 'చిలకమ్మ చెప్పింది' అనే తెలుగు సినిమాలో తొలిసారి ప్రధాన పాత్రలో నటించాడు. కథానాయకుడిగా అక్కడ మొదలైన ప్రయాణం 'శివాజీ' సినిమాతో ఆసియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడిగా రికార్డు సృష్టించేంత విజయవంతంగా కొనసాగింది. ఇక మధ్యలో ఎదురయ్యే ఆటుపోట్లు సర్వ సాధరణమే కదా. తలైవా సినిమా రిలీజ్ అయ్యిందంటే థియేటర్లో ఈలలు, గోలలే. 150 సినిమాల మైలురాయిని దాటేసిన రజనీ సినీ ప్రయాణం మరింత కొనసాగాలన్నది అభిమానుల ఆకాంక్ష. రజనీ తదుపరి చిత్రం రోబో 2.0 సెట్స్ మీద ఉంది. దేశవిదేశాల అభిమానం.. దేశవిదేశాల్లో అభిమానులను సంపాదించుకున్న రజనీ.. మొదటి నుంచి నిరాడంబరంగానే ఉన్నారు. సినిమాల్లో స్టైల్‌కి సెల్ఫీలా కనిపించే ఆయన.. తెర వెనుక మాత్రం మినిమమ్ మేకప్ కూడా లేకుండా సాదాసీదాగా ఉంటారు. ఆధ్యాత్మిక చింతనే ఆరోగ్య సూత్రం. ఇవ్వడంలో పెద్ద చేయి. అభిమానులు ఆపదలో ఉంటే పిలవకుండానే పలుకుతాడు. అందుకే వారి గుండెల్లో అభిమాన దేవుడయ్యాడు. భారత ప్రభుత్వం 'పద్మవిభూషణ్' తో సత్కరించిన సందర్భంగా.. -
కబాలీ మళ్లీ వాయిదా
వరుస డిజాస్టర్ల తరువాత సౌత్ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కబాలీ. ఎక్కువుగా స్టార్ డైరెక్టర్లతోనే సినిమాలు చేసే రజనీ చాలా కాలం తరువాత ఓ యువ దర్శకుడితో కలిసి పని చేస్తున్నాడు. పా రంజిత్ దర్శకత్వంలో కబాలీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో వయసైపోయిన మాజీ డాన్ పాత్రలో కనిపిస్తున్నాడు రజనీ. తన వయసుకు తగ్గ పాత్రే అయినా స్టైల్, మేనరిజమ్స్‌లో మాత్రం తన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ముందుగా సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలని భావించారు. అయితే తమిళనాట ఎలక్షన్ల వేడి కారణంగా కబాలీ వాయిదా పడింది. మే నెలాఖరున కబాలీ రిలీజ్‌కు ప్లాన్ చేశారు. అయితే మరోసారి ఈ సినిమా వాయిదా పడిందన్న వార్త ఇప్పుడు సూపర్ స్టార్ అభిమానులను కలవర పెడుతోంది. కారణాలేంటన్నది వెల్లడించకపోయినా కబాలీ సినిమాను జూన్ రెండో వారంలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. -
రజనీకి రాజకీయాల్లోకొచ్చే ఆలోచనుందా?
తమిళనాడులో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. గెలుపే ధ్యేయంగా రాజకీయ పార్టీలు పొత్తుల కోసం పావులు కదుపుతున్నాయి. మరో పక్క గెలుపు గుర్రాల కోసం కసరత్తు చేస్తున్నారు. ఈ సారి హోరాహోరీ పోరు అనివార్యం కావడంతో ఏ ఒక్క అవకాశాన్ని జారవిడుచుకోరాదని భావిస్తున్నారు. సినీ గ్లామర్‌ను వాడుకోవడానికి తహతహలాడుతున్నారు. ఇప్పటికే కొందరు నటీనటులు రాజకీయ ప్రవేశం చేసి ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి లాగాలన్న ప్రయత్నాలు చాలాకాలంగా జరుగుతున్నాయి. రజనీ కూడా దేవుడు ఆదేశిస్తే తాను పాటిస్తాను వంటి డైలాగులతో అభిమానులను ఊరిస్తూ వస్తున్నారు. బీజేపీకి రజనీ మద్దతు ఇస్తారని, ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తారని ఇటీవల వచ్చిన వార్త ఇతర పార్టీల నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే రజనీకి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఆయన సోదరుడు సత్యనారాయణ చెప్పారు. ఈ నేపథ్యంలో రజనీకి రాజకీయాల్లోకొచ్చే ఆలోచన ఉందా? లేదా? అన్నది ఎప్పటిలాగే సస్పెన్స్‌గా మారింది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు క్రిష్ణగిరి వచ్చిన సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. 'రజనీకి రాజకీయాలు వద్దు. రజనీకి తమిళనాడే అంతా. తమిళ ప్రజలు ఆయనకు ప్రాణం. తమిళనాడు, ఇక్కడి ప్రజలు బాగుండాలని దేవుణ్ని ప్రార్థిస్తుంటారు. రజనీ సంతోషంగా ఉంటే చాలు. ఆయన్ను రాజకీయాల్లోకి లాగకండి. వచ్చే శాసనసభ ఎన్నికల్లో రజనీ అభిమానులు వారికి నచ్చిన పార్టీకి ఓటు వేయచ్చు. రజనీకి రాజకీయ పార్టీ ప్రారంభించే ఆలోచన ఈ రోజు వరకూ లేదు. ఎవరు అధికారంలోకి వస్తే మంచి చేస్తారో ప్రజలకు బాగా తెలుసు' అని సత్యానారాయణ చెప్పారు. ఎన్నికల అనంతరం రజనీ చిత్రం కబాలి విడుదల అవుతుందని తెలిపారు. -
ఒకేఒక్కడు మోనగాడు
-
లింగాకి స్పూఫ్ రాబోతుందా..?
-
రజనీకాంత్ మళ్ళీ హిమలయాలకు...?
-
రజనీకాంత్‌పై మద్రాస్ హైకోర్టులో పిటిషన్
చెన్నై: రాష్ట్ర ఖజానాకు రూ.21 కోట్లు నష్టం కలిగించిన సూపర్ స్టార్ రజనీకాంత్, 'లింగా' చిత్ర నిర్మాత రాక్‌లింగ్ వెంకటేశ్‌లపై కేసు నమోదు చేయాల్సిందిగా చెన్నై పోలీస్ కమిషనర్‌ను ఆదేశించాలని శుక్రవారం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మెరైన్ పిక్చర్స్ భాగస్వామి సింగరవడివేలన్ ఈ పిటిషన్ వేశారు. రజనీ తన పలుకుబడి ఉపయోగించి 'లింగా'కు వినోదపు పన్ను మినహాయింపు ఇప్పించారని, తమిళ సంస్కృతి అభివృద్ధికి దోహదపడే చిత్రాలకు మాత్రమే వినోదపు పన్ను రాయితీ వర్తిస్తుందన్నారు. 'లింగా' చిత్రం టైటిల్ సంస్కృతంలో ఉన్నందున దీనికి రాయితీ వర్తించదన్నారు. -
రజనీ ఇంటిముందు అడుక్కుంటూ ఆందోళన..
చెన్నై: భారీ అంచనాలతో విడుదలైన రజనీకాంత్ 'లింగ' సినిమా ఊహించని రీతిలో నష్టాలను మూటకట్టుకుంది. దీంతో భారీగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన బాటపట్టారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ నిరాహారదీక్ష చేపట్టారు. నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ పదిశాతం పరిహారం చెల్లించేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ వ్యవహారంలో నష్టాన్ని అంచనా వేసేందుకు హీరో రజనీకాంత్.. తన స్నేహితుడు, డిస్ట్రిబ్యూటర్ అయిన తిరుపూర్ సుబ్రహ్మణ్యాన్ని నియమించారు. ఈ నేపథ్యంలో సుమారు రూ.35 కోట్లను చెల్లించాలని నిర్ణయం జరిగింది. అయితే ఇపుడు ఈ మొత్తాన్ని చెల్లించేందుకు నిర్మాత వెంకటేష్ నిరాకరిస్తున్నాడని డిస్ట్రిబ్యూటర్ సింగర్ వడివేలన్ ఆరోపిస్తున్నారు. అందుకే డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు అందరూ కలిసి హీరో రజనీకాంత్ ఇంటిముందు అడుక్కుంటూ ఆందోళన చేసేందుకు సిద్ధపడుతున్నామని తెలిపారు. తమను ఈ స్థితికి నెట్టింది నిర్మాతలేనని ఇంతకు మించి తమకు వేరే గత్యంతరం లేదని పంపిణీదారులు, థియేటర్ యజమానులు వాపోతున్నారు. మరోవైపు ఇరోస్ ఇంటర్నేషనల్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'లింగ' సినిమా వందకోట్లకు అమ్ముడు బోయిందని, తమకు డబ్బులు చెల్లించడంలో ప్రొడ్యూసర్ వెంకటేష్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటో అర్థం కావడంలేదంటూ వడివేలన్ విమర్శించారు. తాము అడుగుతున్న నష్టపరిహారం రజనీకాంత్‌కు చెల్లించిన దానికంటే చాలా తక్కువే ఉంటుందంటున్నారు. ఇప్పటికైనా తమకు రావాల్సిన నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. రజనీకాంత్ ఇంటిముందు నుంచి అడుక్కుంటూ సాగే తమ ఆందోళన మంగళవారం మొదలు పెట్టబోతున్నట్టుగా తెలిపారు. -
'లింగా'లో డైలాగులు తొలగించాలని ధర్నా
హైదరాబాద్: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన లింగా సినిమాపై ఓ కుల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లింగా సినిమాలో భట్రాజులను కించ పరిచేలా డైలాగులు ఉన్నాయని వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. పశ్చమ గోదావరి జిల్లా చింతలపూడిలో లింగా చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ వద్ద సోమవారం ఆ కుల సంఘం నాయకులు ధర్నా చేశారు. భట్రాజు కుల సంఘం నాయకులు ఇదే విషయంపై ఆదివారం హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రజనీకాంత్ నటించిన లింగా చిత్రం తమిళంలో పాటు తెలుగులో కూడా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా, టాలీవుడ్ భామ అనుష్క శెట్టి నటించారు. -
రజనీకాంత్ 'లింగా' సినిమాపై ఫిర్యాదు
హైదరాబాద్: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం 'లింగా'పై వివాదం ఏర్పడింది. లింగా సినిమాలో తమ కులస్థులను కించపరిచేలా డైలాగులు ఉన్నాయంటూ బట్రాజు కుల సంఘం నాయకులు ఆరోపించారు. ఈ సినిమాపై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రజనీకాంత్ నటించిన లింగా చిత్రం తమిళంలో పాటు తెలుగులో కూడా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా, టాలీవుడ్ భామ అనుష్క శెట్టి నటించారు. -
'కమల్, రజనీ రాజకీయాల్లోకి రావొద్దు'
ఎరోడ్: రాజకీయాల్లోకి రావొద్దని అగ్రహీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ లను తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ కోరారు. రాజకీయ కార్యకలాపాల్లో బందీ కావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 'రాజకీయాల్లోకి రావొద్దని సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్‌హాసన్ లను కోరుతున్నా' అని ఇళంగోవన్ పేర్కొన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ విజ్ఞప్తి చేశారు. రాజకీయాలంటే తనకు భయం లేదని రజనీకాంత్ ప్రకటించిన మరుసటి రోజే ఇళంగోవన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానంటూ 'లింగా' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో రజనీకాంత్ ప్రకటించారు. కాగా, రజనీకాంత్‌ను చేర్చుకునేందుకు బీజేపీతోపాటు ఇటీవల కాంగ్రెస్ నుంచి తప్పుకున్న జీకే వాసన్ కూడా ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి. బీజేపీ ఇచ్చిన ఆఫర్ ను ఆయన వదులుకున్నట్టు ప్రచారం జరిగింది. -
'లింగా' టీజర్ : రజనీ స్టైల్‌గా నడిచొస్తే..!
-
శంకర్ మనసు రోబో 2 వైపు మళ్లింది!
-
సినిమా పోయినా.. పార్టీ చేసుకున్నారు!!
-
డిగ్రీ ఉంది కానీ.. ఉద్యోగమే లేదు!
-
కరుణానిధితో రజనీకాంత్ భేటీ
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధితో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ భేటీ అయ్యారు. ఆదివారం కరుణానిధి నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. అనంతరం రజనీ కాంత్ మాట్లాడుతూ మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పారు. కాగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే చిత్తుగా ఓడిపోగా, ముఖ్యమంత్రి జయలలిత సారథ్యంలోని అన్నా డీఎంకే ఘనవిజయం సాధించింది. ఎన్నికల ముందు నరేంద్ర మోడీ చెన్నై వచ్చి రజనీకాంత్ ఇంటికి వెళ్లి కలిశారు. ప్రధాని కావాలన్న మోడీ కోరిక నెరవేరాలని రజనీ అన్నారు. ఈ నేపథ్యంలో రజనీ కరుణానిధితో భేటీ కావడం ప్రాధాన్యత ఏర్పడింది. -
మోడీ ప్రమాణానికి రజనీ దూరం!
చెన్నై: నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరుకావడం లేదని ఆయన సన్నిహితులు వెల్లడించారు. సోమవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో జరిగే ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలంటూ రజనీకాంత్ కు మోడీ ఆహ్వానించారు. చెన్నై నగరంలో లేకపోవడం కారణంగానే మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరుకావడం లేదని సన్నిహితులు వెల్లడించారు. మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సను ఆహ్వానించడంపై తమిళనాడులో దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే .గత రాత్రి తమిళ విద్యార్ధులు పెద్ద ఎత్తున రజనీకాంత్ ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. దాంతో మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రజనీ హాజరుకాకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రాజపక్స ఆహ్వనంపై డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలతోపాటు అన్ని రాజకీయపార్టీలు, సంస్థలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలకు ముందు పోయెస్ గార్డెన్ లో రజనీకాంత్ ను నరేంద్రమోడీ కలిసి మద్దతు కోరిన సంగతి తెలిసిందే. -
'ఆ' వివాదమే రజనీ సినిమా కథా వస్తువా!
-
నేనొక్కసారి ట్విట్టర్లోకొస్తే..
-
రజనీకాంత్ 'విక్రమసింహ' ట్రైలర్
-
మోడీని కలవరపెడుతున్న 'ఆ ఒక్క విషయం'
-
పంచెకట్టులో ఆకట్టుకున్న మోడీ
రజనీతో మోడీ భేటీ చెన్నైలో రజనీ ఇంటికి వెళ్లి అరగంటపాటు సమావేశం పంచెకట్టులో ఆకట్టుకున్న మోడీ తమ భేటీ మర్యాదపూర్వకమేనన్న సూపర్ స్టార్ సాక్షి, చెన్నై: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆదివారం సాయంత్రం చెన్నైలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను పోయెస్ గార్డెన్‌లోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. తమిళుల సంప్రదాయ పంచెకట్టులో వచ్చి అందరినీ ఆకట్టుకున్న మోడీని రజనీకాంత్ సాదరంగా తన ఇంట్లోకి ఆహ్వానించారు. సుమారు 30 నిమిషాలపాటు వారిద్దరూ సమావేశమయ్యారు. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించిన బీజేపీ నేతృత్వంలోని ఆరు పార్టీల కూటమి తరఫున ప్రచారంలో పాల్గొనేందుకు చెన్నై వచ్చిన సందర్భంగా రజనీని మోడీ కలుసుకున్నారు. భేటీ అనంతరం మోడీతో కలిసి చిరునవ్వులు చిందిస్తూ వెలుపలకు వచ్చిన రజనీ మీడియాతో మాట్లాడుతూ తమ భేటీ మర్యాదపూర్వకమేనని, దీనికి రాజకీయ ప్రాధాన్యత లేదని రజనీ స్పష్టం చేశారు. గతంలో తాను ఆస్పత్రిపాలైనప్పుడు మోడీ తనను పరామర్శించారని గుర్తుచేసుకున్నారు. చెన్నై వచ్చినప్పుడు తన ఇంటికి తేనీరు సేవించేందుకు రావాల్సిందిగా ఆహ్వానించానని, ఆ ఆహ్వానం మేరకే మోడీ తన ఇంటికి వచ్చారన్నారు. మోడీ పాలనాదక్షుడు...ఆయన కోరిక నెరవేరాలి ‘‘మోడీ సమర్థ పాలనాదక్షుడు, దృఢ నాయకుడని అందరికీ తెలుసు. నేను ఆయన శ్రేయోభిలాషి. ఆయన నా శ్రేయోభిలాషి. ఆయనకు భవిష్యత్తులో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. దేవుడు ఎల్లప్పుడూ ఆయన వెంట ఉండాలని ప్రార్థిస్తున్నా. ఆయన ఎప్పుడు, ఏం జరగాలనుకుంటున్నారో అది జరగాలని కోరుకుంటున్నా’’ అని పరోక్షంగా ప్రధాని కావాలనే మోడీ కోరిక నెరవేరాలని రజనీ ఆకాంక్షించారు. అనంతరం మోడీ మాట్లాడుతూ రజనీకాంత్ తనకు మంచి స్నేహితుడని, తమిళ నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని రజనీకి శుభాకాంక్షలు తెలిపినట్లు చెప్పారు. రజనీతో దిగిన ఫొటోను మోడీ ‘ట్విట్టర్’లో పోస్టు చేశారు. కాగా, అనంతరం చెన్నైలోని మీనంబాక్కంలో జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ అన్నాడీఎంకే, డీఎంకే లలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పరస్పరం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతూ ప్రజలను విస్మరిస్తున్నాయని దుయ్యబట్టారు. రీ కౌంటింగ్ మంత్రి ఓటమి భయంతోనే ఈసారి ఎన్నికల నుంచి తప్పుకున్నారంటూ కేంద్ర మంత్రి చిదంబరాన్ని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. -
'రాజకీయ చదరంగం' ఎంతటి వారినైనా...
-
తిరుమలలో రజనీకాంత్ ఫ్యాన్స్ హల్చల్
తిరుమల: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు బుధవారం పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో హల్చల్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలకు విరుద్ధంగా రజనీకాంత్ ఫొటోలతో కూడిన టీ షర్టులు ధరించి వచ్చారు. అభిమానులు రజనీ బ్యానర్లతో నడక దారి గుండా తిరుమలకు చేరుకున్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు ఎవరూ ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీసింది. రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కోచడయాన్ విజయవంతం కావాలని కాంక్షిస్తూ అభిమానులు తిరుమల యాత్రకు వచ్చారు. -
'రజనీకాంత్ నాకు మంచి స్నేహితుడు'
చెన్నై: ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ తనకు మంచి స్నేహితుడని డీఎంకే అధినేత కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే అళగిరి అన్నారు. శుక్రవారం రజనీకాంత్ నివాసంలో ఆయనను అళగిరి కలిశారు. భేటీ అనంతరం అళగిరి మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడు దయానిధి అళగిరి సినిమా కార్యక్రమానికి రావాలని రజనీకాంత్‌ను ఆహ్వానించినట్లు తెలిపారు. వ్యక్తిగత విషయాలను చర్చించామని, తమ భేటీలో ఎలాంటి రాజకీయ అంశాలు లేవని అళగిరి స్పష్టం చేశారు. కాగా డీఎంకే తనకు ఎంపీ టిక్కెట్ నిరాకరించిన నేపథ్యంలో అళగిరి సొంతంగా కొత్త పార్టీ పెడుతున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిశారు. అయితే రానున్న ఎన్నికల్లో కీలకపాత్ర పోషిస్తానని చెప్పిన ఆయన, ఎటువంటి పాత్ర పోషిస్తాననేది ఇప్పుడే వెల్లడించబోనని అన్నారు. తన మద్దతుదారులతో మాట్లాడిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుంటానని చెప్పారు. -
రజనీ చూపు ఏవైపు
రాష్ట్రంలో పార్టీల గె లుపు ఓటములను ప్రభావితం చేయగల సత్తా ఉన్న సూపర్‌స్టార్ రజనీకాంత్ ఈ సారి ఎన్నికల్లో ఏ పార్టీవైపు మొగ్గుచూపుతారో అనే అంశం తాజాగా తెరపైకి వచ్చింది. రజనీ అభిమానులు చెన్నై, సేలం జిల్లాలో మంగళవారం సమావేశమై అభిప్రాయ సేకరణ జరపడం సర్వత్రా చర్చనీయాంశమైంది. చెన్నై, సాక్షి ప్రతినిధి:ఎన్నికల్లో గెలుపునకు ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోని రాజకీయ పార్టీలు సినీ నటులను సైతం ముగ్గులోకి దింపడం పరిపాటే. ఇందులో జాతీయ పార్టీలకు మినహాయింపు కాదు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అమితాబ్‌బచ్చన్ తదితరులను, బీజేపీ శత్రుఘ్నసిన్హ వంటి తెరవేల్పులను రాజకీయ తెరపైకి తెచ్చింది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో సైతం సినీనటులు చక్రం తిప్పారు. అందునా తమిళనాడులో రాజకీయ సినీరంగాలు అన్నాదురై హయాంలోనే దాదాపు ఒక్కటైపోగా మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్, శివాజీ గణేశన్, ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలిత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సినిపరిశ్రమతో అనుబంధం ఉన్నవారే. ఎంజీఆర్ తరువాత అంతటి ప్రజాభిమానం, అనుచరగణం ఉన్న సూపర్‌స్టార్ రజనీకాంత్ అనుగ్రహం కోసం పార్టీలు ఎదురుచూస్తుంటాయి. 1996లో డీఎంకే, కాంగ్రెస్ కూటమికి రజనీ మద్దతు పలికారు. ఆ తరువాత ఎన్నికల్లో రజనీ బీజేపీకి ఓటువేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచిపాలన అందించే పార్టీకి ఓటు వేయాల్సిందిగా పిలుపునిచ్చారు. బీజేపీ పాకులాట రాబోయే ఎన్నికల్లో రజనీకాంత్ మద్దతు పొందాలని భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రయత్నాలు చేస్తోంది. రజనీకి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ సన్నిహితుడు కావడం అవకాశంగా తీసుకున్న రాష్ట్ర నాయకులు సద్వినియోగం చేసుకోవాలని ఆశపడుతున్నారు. బీజేపీ జాతీయ నేత ఇల గణేశన్ ఎలాగైనా రజనీ మద్దతు పొందాలని డిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నారు. ఇటీవల చెన్నైకి మోడీ వచ్చినపుడు ఇద్దరినీ కలపాలని ప్రయత్నం చేశారు. గత మూడు నెలలుగా ఎవరెన్ని ప్రకటనలు చేస్తున్నా రజనీమాత్రం నోరుమెదపడం లేదు. అభిప్రాయ సేకరణలో అభిమానులు రాబోయే ఎన్నికల్లో అభిమానులు ఎటువైపు మొగ్గుచూపుతున్నారో తెలుసుకునేందుకు రజనీకాంత్ అభిమాన సంఘాల నేతలు మంగళవారం చెన్నై రాయపేటలోని ఒక హోటల్లో సమావేశమయ్యూరు. సేలంలోనూ సమావేశం నిర్వహించారు. ప్రతి అభిమానిని వేర్వేరుగా తీసుకెళ్లి అభిప్రాయాలను రికార్డు చేశారు. కేంద్రంలో సమర్థవంతమైన సుస్థిరపాలన రావాలని, ధరలు తగ్గుముఖం పట్టాలని, విద్యుత్ కోతలు లేని పాలన కావాలని, ఆర్దిక పరిపుష్టి కలగాలని అభిమానులు కోరుకుంటున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఇవన్నీ సమకూర్చగల పార్టీకి రజనీ అభిమానులు ఓటేస్తారని తెలిపారు. అభిప్రాయసేకరణ పూర్తయిన తరువాత నివేదికను రజనీకాంత్‌కు సమర్పిస్తామని, తుది నిర్ణయం ఆయన తీసుకుంటారని నిర్వాహకులు వివరించారు. -
‘పెదరాయుడు’ విషయంలోనూ ఇలాగే జరిగింది...
40 ఏళ్ల సినీ ప్రస్థానం.. 500 పైచిలుకు సినిమాలు.. భిన్నమైన పాత్రలు.. నిర్మాతగా 50కి పైన సినిమాలు. ఇంకా రాజకీయవేత్తగా, విద్యా సంస్థల అధినేతగా పలు రంగాల్లో బహుముఖ ప్రజ్ఞ. నిజంగా మోహన్‌బాబు ట్రాక్ రికార్డ్ చూస్తే ఆయన రూటే సెపరేట్ అనిపిస్తుంది. క్రమశిక్షణ, పట్టుదల, కార్యదీక్ష... ఈ మూడింటి వల్లే ఇంత సాధించగలిగానంటారు మోహన్‌బాబు. చాలా విరామం తర్వాత ఆయన హీరోగా నటించిన చిత్రం ‘పాండవులు పాండవులు తుమ్మెద’. శ్రీవాస్ దర్శకత్వంలో మంచు విష్ణు, మనోజ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సంద ర్భంగా హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు మోహన్‌బాబు. ఏ ఒక్కరి వంశమూ తక్కువ కాదు: హీరోగా నటించి చాలాకాలం అయ్యింది. అందుకే ‘రావణ’ సినిమా చేయాలనుకున్నా. అయితే... అది వంద కోట్ల ప్రాజెక్ట్. కాస్త టైమ్ పడుతుంది. అందుకే... ఈ లోపు ఏదైనా మంచి పాత్ర దొరికితే చేద్దాం అనుకుంటున్న టైమ్‌లో... ఈ కథ విన్నాను. బాగా నచ్చింది. నా నుంచి ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. ఈ సినిమాలో నాతో పాటు నలుగురు హీరోలుంటారు. ఆ నలుగురిలో నా కుమారులు విష్ణు, మనోజ్‌లు ఉండటంతో చాలామంది ‘మంచు వంశం’ అని మాట్లాడుతున్నారు. వంశం, వంశపారంపర్యం లాంటి మాటలు నాకస్సలు ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కరి వంశం గొప్పదే. ఏ ఒక్కరి వంశం తక్కువది కాదు. ఇక్కడ గొప్పవాళ్లు ఎవరూ ఉండరు. దేవుడొక్కడే గొప్పవాడు. ‘కులం’ అనే రెండక్షరాలను వినడానికి కూడా ఇష్టపడను. ‘మనుషులంతా ఒక్కటే’ అని చెప్పిన అన్న ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని బలంగా విశ్వసిస్తా. టూరిస్ట్ గైడ్ నాయుడిగా: ‘ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో స్ట్రాంగ్.. వెనక్కి తీసుకోవడంలో వీక్’ అనేది ఇందులో నా డైలాగ్. నా పాత్ర స్వభావానికి అద్దం పట్టే డైలాగ్ ఇది. ఈ సినిమాలో నా పాత్ర పేరు ‘టూరిస్ట్‌గైడ్ నాయుడు’. రెండు రకాల షేడ్స్ ఉన్న ఈ తరహా పాత్రను నేనెప్పుడూ చేయలేదు. చాలా రోజుల తర్వాత మంచి డైలాగులు చెప్పే ఛాన్స్ ఈ పాత్రతో నాకు దక్కింది. ప్రేక్షకుల్ని చప్పట్లు కొట్టించేలా నా డైలాగులుంటాయి. ‘జీవితం ఓ పుస్తకం లాంటిది. మొదటి పేజీలో పుట్టుకని, చివరి పేజీలో మరణాన్ని రాసిపెట్టాడు దేవుడు. మధ్యలో పేజీలన్నీ ఖాళీ. అందులో నువ్వు ఏది రాసుకుంటే అదే జీవితం’ అని ఓ సందర్భంలో అంటా. నాకు బాగా నచ్చిన డైలాగ్ ఇది. భార్యాభర్తల అనుబంధంపై ‘పెదరాయుడు’లో ఓ డైలాగ్ చెప్పాను. అంతటి గొప్ప డైలాగ్ ఇందులోనూ ఉంది. కొన్ని డైలాగుల్లో వినిపించే తాత్వికత ప్రేక్షకుల్ని ఆలోచింపజేస్తుంది. ఎన్టీఆర్ అంత పేరు తెచ్చుకుంటాడు మనోజ్: ‘పాండవులు పాండవులు తుమ్మెద’ అనే టైటిల్ ఈ సినిమాకు ఎందుకు పెట్టామో ఇప్పుడే రివీల్ చేయలేను. ఇందులో మనోజ్ ఆడవేషం వేసిన సంగతి తెలిసిందే. ‘నర్తనశాల’లో అన్నగారు చేసిన బృహన్నల పాత్ర ఆయనకు ఎంత పేరు తెచ్చిందో.. ఇందులోని ఆడ వేషం మనోజ్‌కి అంత పేరు తెస్తుంది. మనోజ్ నా బిడ్డ అని ఈ మాట చెప్పడంలేదు. సినిమా చూస్తే మీరూ ఏకీభవిస్తారు. ద్వితీయార్ధమంతా తన భుజస్కందాలపై మోసాడు మనోజ్. ఇది ‘గోల్మాల్-3’ కాదు: రవి అనే వ్యక్తి దగ్గర ఈ కథ కొన్నాం. తర్వాతే తెలిసింది.. ఈ కథకు బాలీవుడ్ ‘గోల్మాల్-3’కి సంబంధం ఉందని. అతణ్ణి అడిగితే.. ‘వాళ్లే నా కథను కాపీ కొట్టారు’ అన్నాడు. అందుకే... కోన వెంకట్, గోపీమోహన్, బి.వి.ఎస్.రవి కలిసి కథలో కొన్ని మార్పులు చేశారు. ఈ విషయంలో నేను చెప్పేదొక్కటే.. ‘గోల్మాల్-3’ చిత్రానికీ మా సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. మళ్లీ చరిత్ర పునరావృతం అవుతుంది: 30 కోట్లు వెచ్చించి ఈ సినిమా తీశాం. కానీ బయ్యర్లు పాతిక కోట్లకే సినిమాను అడిగారు. అందుకే సొంతంగా విడుదల చేస్తున్నాను. ‘పెదరాయుడు’ విషయంలోనూ ఇలాగే జరిగింది. అప్పుడు కూడా సాహసం చేసి సొంతంగా విడుదల చేశాను. ఆ సినిమా చరిత్ర సృష్టించింది. మళ్లీ ఆ చరిత్ర ఈ సినిమా విషయంలో పునరావృతం అవుతుందని నా నమ్మకం. దేనికైనా రెడీ, దూసుకెళ్తా చిత్రాల కంటే అత్యధిక థియేటర్లలో సినిమాను విడుదల చేస్తాం. ప్రభాస్ అంటే ఇష్టం: నేటి హీరోల్లో ఎవరి స్టైల్ వారిది. అందరిలో ప్రభాస్ అంటే ఇష్టం. మేమిద్దరం ‘బావ.. బావ’ అని పిలుచు కుంటాం. -
సూపర్‌గా స్టార్లంతా కలిశారు!
అక్కడ రజనీకాంత్ సూపర్‌స్టార్ కాదు...చిరంజీవి కేంద్రమంత్రి కాదు... బాలకృష్ణ టాప్ హీరో కాదు...అక్కడికొచ్చిన హీరోలు, హీరోయిన్లు అందరూ తమ హోదాల్ని, ఇమేజ్లని పక్కనపెట్టేసి ఓ కొత్త ప్రపంచంలోకి ఎంటరయినట్టుగా ఎంజాయ్ చేశారు. జనవరి 18... చెన్నైలోని ఇంజంబ్బాకం ఈస్టుకోస్ట్‌లోని మోహన్‌లాల్ గెస్ట్ హౌస్... చీకటి ముసురుకునే వేళ ఆకాశంలోంచి తారలు ఊడిపడ్డట్టుగా దక్షిణాదిలోని నాలుగు భాషలకు చెందిన ఈ అగ్రతారలంతా ఒక్కమారుగా అక్కడికి చేరుకున్నారు.కరచాలనాలు, కౌగిలింతలు, బోలెడన్ని కబుర్లు, తీపిగుర్తులతో అందరూ నాస్టాల్జిక్ మూడ్‌లోకి వెళ్లిపోయారు.గత నాలుగేళ్ల నుంచీ బ్రేక్ లేకుండా ఈ స్టార్స్ గెట్ టు గెదర్ జరగడం విశేషం! అసలీ గెట్ టు గెదర్‌కి శ్రీకారం ఎలా జరిగిందంటే... 2009లో చెన్నైలో ఓ పెళ్లి వేడుకలో... చిరంజీవి, సత్యరాజ్, రాధిక, సుహాసిని, సుమలత, లిజి... తదితర తారలు పాల్గొన్నారు. అందరూ కలిసి చాన్నాళ్లయ్యిందేమో జోకులు పేల్చుకుని, సరదాగా ఎంజాయ్ చేశారు. ఏడాదికోసారైనా ఇలా అందరం కలుసుకుంటే ఎంత బాగుంటుంది? అనే ఆలోచన లిజీకి వచ్చింది. తన ఆలోచనను ఇతర నాయికలకు చెప్పడం, వారు ఆమోదించడం జరిగింది. ఇక, అందాల తారలు తమ ఆలోచనను రజనీకాంత్, విష్ణువర్ధన్లాంటి వారికి చెప్పడం, వారు కూడా ఏడాదికోసారి కలుద్దామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అప్పుడు ఆరంభమైంది ఈ ‘ఎయిటీస్ రీ యూనియన్ క్లబ్’. మొదటి రెండేళ్లు... తారలందరూ కలసి, చెన్నయ్‌లో పండగ చేసుకున్నారు. మూడో సంవత్సరం మాత్రం హైదరాబాద్‌లో చిరంజీవి ఇంట్లో కలుసుకున్నారు. ఆ మరుసటి ఏడాది బెంగళూరులో అంబరీష్, సుమలతల ఆతిథ్యం అందుకున్నారు. ఈ నెల 18న మోహన్‌లాల్ ఇంట్లో ఈ తారల కలయిక జరిగింది. మేజిక్, డాన్స్, జోక్స్ అంటూ.. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఖుష్బూ, జయశ్రీ ఓ క్విజ్ షో నిర్వహించగా, రేవతి, పూర్ణిమా భాగ్యరాజ్ సరైన సమాధానాలు చెప్పి, బహుమతులు పొందారు. ఈ పార్టీలో పాల్గొన్న నాయికలు మోహన్‌లాల్‌కు బహుమతులిచ్చారు. రంగు రంగుల పూలదండలు మెడలో వేసుకుని అందరూ సందడి చేశారు. అందరూ కలిసి ఫొటోలు దిగారు. వచ్చే ఏడాది జనవరిలో మళ్లీ కలవాలని నిర్ణయించుకున్నారు. మరో ఏడాది వరకు ఈ మధురానుభూతులను నెమరు వేసుకుంటామని కొంతమంది తారలు తమ ట్విట్టర్లో పేర్కొన్నారు. వచ్చే ఏడాది మీటింగ్ ప్లేస్ ఎక్కడ? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా తారల ఈ రీ యూనియన్ ఆలోచన మాత్రం చాలా బాగుందనే చెప్పాలి. అందరూ తమ తమ హోదాలను మర్చిపోయి, ఆట పాటలతో రీచార్జ్ అయ్యారు. ఈ రీ యూనియన్‌లో పాల్గొన్న తారల్లో రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, అర్జున్, సుమన్, సీనియర్ నరేష్, భాను చందర్, అంబరీష్, మోహన్‌లాల్, జయరామ్, రమేష్ అరవింద్, సుహాసిని, రాధిక, సరిత, సుమలత, లిజి, రాధ, అంబికా, నదియా, రేవతి, ఖుష్బూ, పూర్ణిమ భాగ్యరాజ్, రమ్యకృష్ణ తదితరులు ఉన్నారు. -
శంకర్ దర్శకత్వంలో మళ్లీ రజనీ
ఎందిరన్ కాంబినేషన్ రిపీట్ కానుందా? అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. సూపర్‌స్టార్ రజనీకాంత్, శంకర్ హాట్రిక్కు సిద్ధం అవుతున్నారు. వీరి కలయికలో శివాజీ, ఎందిరన్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. స్టార్ డెరైక్టర్ శంకర్, రజనీకాంత్‌ను శివాజీ చిత్రంలో పవర్ఫుల్ పాత్రలో చూపించి సక్సెస్ అయ్యారు. ఎందిరన్ చిత్రంలో రజనీ మరో ముఖం, ఆదిముఖం అయిన విలన్ ముఖాన్ని ఆవిష్కరించి శభాష్ అనిపించుకున్నారు. ఇప్పుడు మూడవసారి రజనీకి దర్శకత్వం చేయడానికి శంకర్ సిద్ధం అవుతున్నట్లు సమాచారం. రజనీ యాక్షన్ లేని చిత్రం చేయాలనడంతో దానికి తగినట్లుగా శంకర్ కథ తయారు చేస్తున్నారట. ప్రస్తుతం విక్రమ్ హీరోగా ఐ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో శంకర్ మహాబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తరువాత ఆయన తెరకెక్కించేది రజనీ చిత్రమేనని సమాచారం. -
రవి రాఘవేంద్ర కుమార్తె వెడ్డింగ్ కి విచ్చేసిన స్టార్స్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సతీమణి లత సోదరుడు, తమిళ నటుడు రవి రాఘవేంద్ర కుమార్తె వివాహం వైభవంగా జరిగింది. ఈ వివాహానికి సినీతారలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రజనీకాంత్ కుటుంబ సమేతంగా విచ్చేసి వధూవరుల్ని ఆశీర్వదించారు. ప్రభు, ధనుష్, అనుష్క తదితర ప్రముఖులు వివాహానికి హాజరైన వారిలో ఉన్నారు. -
ఆ మూడు రోజుల్లోనే ఆయనేంటో తెలుసుకున్నా!
‘‘నాకు అభినందనలంటే అసహ్యం. అందుకే ఎవరైనా నన్ను అభినందించినప్పుడు నా మొహాన్ని అదోలా పెట్టుకుంటా’’ అంటున్నారు దీపికా పదుకొనె. ఆమెకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ డింపుల్ బ్యూటీని అభినందించేవారి శాతం ఎక్కువే ఉంటుంది. ఇటీవల విడుదలైన ‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’లో దీపికా నటనకు బోల్డన్ని ప్రశంసలు లభించాయి. కొంతమందైతే.. గ్లామరస్ రోల్స్ మాత్రమే కాకుండా.. ఇలాంటివి కూడా చేయండని సలహా ఇచ్చారట. ఈ విషయం గురించి దీపికా స్పందిస్తూ- ‘‘గ్లామరస్ రోల్సే కదా అని చాలామంది తీసిపారేస్తుంటారు. కానీ, ఒక్క విషయం అందరూ తెలుసుకోవాలి. ఏ పాత్రైనా సరే కెమెరా ముందు సమర్థవంతంగా నటించకపోతే పండదు. అందుకే నేను గ్లామరస్, డీ-గ్లామర్ రోల్స్ రెంటికీ ప్రాధాన్యం ఇస్తాను’’ అని చెప్పారు. రజనీకాంత్ సరసన ఆమె నటించిన ‘కోచడయాన్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం గురించి దీపికా చెబుతూ - ‘‘రజనీసార్ కాంబినేషన్లో నేను షూటింగ్ చేసింది మూడు రోజులే. కానీ ఆ మూడు రోజుల్లోనే ఆయనేంటో తెలుసుకున్నా. స్టార్ హీరో అనే ఫీలింగ్ ఏమాత్రం లేదాయనకు. చాలా నిరాడంబరంగా ఉంటారు. ఎన్నో సక్సెస్‌లు చవి చూసినా, మొదటి సినిమా చేసినంత ఎగ్జయిట్‌మెంట్‌తో నటిస్తారు. లొకేషన్లో అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. తప్పకుండా ఆయన్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. ‘కోచడయాన్’ విడుదలకు సిద్ధమవుతోందంటే నాకు ఎగ్జయిట్మెంట్ పెరిగిపోతోంది. ఈ చిత్రం అందర్నీ మంచి అనుభూతికి గురి చేస్తుంది’’ అన్నారు. -
కోచడయాన్ ఓ సవాల్
ఇరవైఆరేళ్ల కెరీర్.. మూడువందల సినిమాలు. బాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా ట్రాక్ రికార్డ్ ఇది. ఉత్తమ డిజైనర్‌గా నాలుగు జాతీయ అవార్డులు, పలు అంతర్జాతీయ అవార్డులు దక్కించుకున్నారామె. పలు భారీ బడ్జెట్ చిత్రాల్లో ఎంతోమంది స్టార్స్‌కు కాస్ట్యూమ్స్ డిజైన్స్ చేశారు. ఎంతమందికి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసినా ‘కోచడయాన్’లో రజనీకాంత్‌కి డిజైన్ చేయడం ఓ సవాల్‌గా తీసుకున్నానని నీతా పేర్కొన్నారు. ఈ చిత్రంలోని ప్రధాన తారాగణానికి ఆమే డిజైన్ చేశారు. రాజుల కాలం నాటి సినిమా కావడంతో దుస్తుల పరంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సి రావడం సహజం. అందుకే కాస్ట్యూమ్స్ డిజైన్ చేసే ముందు స్కెచ్ గీసుకున్నారు నీతు. ఒక్కో పాత్రకు 150 రకాల స్కెచ్‌లు గీసి, వాటిలోంచి 20 నుంచి 25 కాస్ట్యూమ్స్‌ని సెలక్ట్ చేసుకుని, వాటిని డిజైన్ చేశారు. కేవలం స్కెచ్ వర్క్‌కే ఎనిమిది నెలలు పట్టిందని సమాచారం. ముఖ్యంగా పోరాట యోధుడిగా రజనీ గెటప్‌కి మాత్రమే 25 స్కెచ్‌లు వేశారట. ఈ చిత్రానికి పని చేయడం పట్ల నీతూ తన మనోభావాలను చెబుతూ -‘‘ఈ చిత్రం నా కెరీర్‌కి ఓ మైలు రాయి అని చెప్పొచ్చు. దానికి రెండు కారణాలున్నాయి. ఒకటి... ఈ సినిమా మోషన్ కాప్చర్ టెక్నాలజీ విధానంతో రూపొందినది కావడం. మరొకటి.. రజనీకాంత్‌కి డిజైన్ చేయడం. ఈ స్క్రిప్ట్ మొత్తం చదివిన తర్వాత కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం అంత సులువు కాదనిపించింది. నా కెరీర్లో ఈ సినిమాకి ప్రత్యేక స్థానం ఉంటుంది’’ అన్నారు. రజనీ తనయ సౌందర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. -
'కొచ్చడయాన్ నా కెరీర్ లోనే మైలురాయి'
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కొచ్చడయాన్ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆయన కూతురు సౌందర్య రజనీకాంత్ రూపొందిస్తున్నారు. భారత దేశంలోనే తొలిసారిగా ఫోటో రియలిస్టిక్ ఫెర్ఫార్మెన్స్ క్యాప్చర్ టెక్నాలజిని ఈ చిత్రం కోసం వాడుకుంటున్నారు. అయితే కొచ్చడయాన్ చిత్రంలో రజనీకాంత్ లుక్ ను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీతా లూలా రూపొందించారు. ఆయుధాలు ధరించిన రజనీ లుక్ అభిమానులపై అత్యంత ప్రభావం చూపడమే కాకుండా.. గొప్ప అంచనాలను కూడా పెంచింది. అభిమానుల్లో గొప్ప అంచనాల్ని పెంచడం రజనీ లుక్ వెనుక నీతా ఎనలేని కృషి జరిపిందని చిత్ర యూనిట్ సభ్యుల అభిప్రాయం. రజనీ ధరించిన క్యాస్టూమ్స్, ఆయుధాలకు విశేష ప్రాచుర్యం లభించింది. ఇటీవల నీతా ఓ ఇంటర్య్యూలో 'కొచ్చడయాన్ కు పనిచేయడం గొప్ప అవకాశం. అంతేకాక తన కెరీర్ లో కొచ్చడయాన్ ఓ మైలురాయిగా నిలుస్తుంది. పోటో రియలిస్టిక్ మోషన్ టెక్నాలజీతో పనిచేయడం గొప్ప అనుభూతిని ఇచ్చింది' అని నీతా లూలా తెలిపారు. -
రజనీకి రాజకీయ ఆహ్వానం
సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ ఆహ్వానం రజనీ అభిమానుల్లో ఆనందం నింపుతోంది. తలైవా...వా అన్న నినాదం ఊపందుకుంటోంది. సాక్షి, చెన్నై: దక్షిణ భారత సినీ వినీలాకాశంలో తిరుగులేని కథానాయకుడిగా పేరు పొందారు రజనీకాంత్. ఆయన రాజకీయ ప్రవేశంపై చాలా కాలంగా ఉత్కంఠ నెలకొంది. గతంలో రజనీకాంత్ ఇచ్చిన ఓ సంకేతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయూంశమైంది. రాజకీయ సంకేతంగా ఆయన గళం విప్పడం అభిమానుల్లో ఉత్తేజం నింపింది. తర్వాత విడుదలైన చిత్రాల్లో రాజకీయ డైలాగులు పేలడంతో రజనీ రాజకీయ ప్రవేశంపై చర్చ తీవ్రమైంది. రాజకీయాల్లోకి ఎప్పుడు రావాలో, ఎలా రావాలో, రావాల్సిన సమయంలో వస్తా అంటూ ఆయన పేల్చిన డైలాగులు అభిమానుల్ని ఉర్రూతలూగించాయి. రజనీ రాజకీయ అరంగేట్రం చేయాల్సిందేనన్న నినాదంలో అభిమానులు ఉద్యమించారు. రజనీ మాత్రం మౌనం వహించారు. రానురాను అభిమానుల చర్యలు శ్రుతి మించడంతో సూపర్‌స్టార్ మౌనం వీడారు. అభిమానుల్ని బుజ్జగించారు. దేవుడు ఆదేశిస్తే ఈ రజనీ పాటిస్తాడు అని మెళిక పెట్టి అందరి నోళ్లు మూయించారు. కొంత కాలం రజనీ రాజకీయ ప్రవేశ చర్చ తెర మరుగైంది. కథానాయకుడు, రోబో చిత్రాలతో ఆయన బిజీ అయ్యారు. రాణా మొదలైనా రజనీ అనారోగ్య కారణాలతో ఆగింది. ప్రస్తుతం కోచ్చడయాన్( విక్రమసింహా)పై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ తరపు ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరు ప్రకటించడం రజనీని ఇరకాటంలో పెడుతోంది. మోడీతో రజనీకి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు, అందువల్లే గతంలో ఆయన రాజకీయ సంకేతం ఇచ్చినట్లు ఓ ప్రచారం ఉంది. రాజకీయూల్లోకి రా మోడీ ప్రధాని అభ్యర్థితత్వం ఖరారు కావడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ శనివారం పెదవి విప్పారు. రజనీకాంత్ ఇప్పుడైనా సరైన నిర్ణయం తీసుకోవాలని సూచిస్తూ రాజకీయాల్లో రా..కథానాయకుడా అన్న పిలుపుతో కూడిన సంకేతం ఇచ్చారు. ఇది వినడానికి బాగానే ఉన్నా రజనీకి మాత్రం సంకట పరిస్థితుల్ని సృష్టించడం ఖాయం. రజనీ రాజకీయ ప్రవేశం గురించి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులు సందు దొరికితే చాలు జెండాలు చేత పట్టేస్తున్నారు. రాధాకృష్ణన్ పిలుపును రజనీ అభిమానులు స్వాగతిస్తున్నారు. కొత్త పార్టీ లక్ష్యంగా, రాజకీయ ప్రవేశం చేయడం ధ్యేయంగా తమ కథానాయకుడి మీద ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు అద్దం పట్టే రీతిలో ఆదివారం తిరుచెందూరులోని సుబ్రమణ్య స్వామి ఆలయంలో రజనీ అభిమానులు హోమం, పూజలు నిర్వహించారు. -
34ఏళ్ల తర్వాత అందమైన అనుభవం!
కెరీర్ ప్రారంభంలో రజనీకాంత్, కమల్‌హాసన్ పలు చిత్రాల్లో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇద్దరికీ ఓ ఇమేజ్ ఏర్పడ్డాక కలిసి నటించడం మానేశారు. దానికి కారణం ఇద్దరూ బిజీగా ఉండటం, వారి ఇమేజ్‌కి తగ్గ కథలు కుదరకపోవడం అని చెప్పొచ్చు. మళ్లీ ఈ ఇద్దరూ కలిసి నటిస్తే బావుంటుందని చాలామంది ఆశిస్తున్నారు. అది జరుగుతుందో లేదో కానీ ఈ కాంబినేషన్ మాత్రం త్వరలో తెరపై కనిపించబోతోంది. ప్రముఖ దర్శకులు కె.బాలచందర్ దర్శకత్వంలో కమల్, రజనీ నటించిన ‘నినైత్తాలే ఇనిక్కుమ్’(1979) చిత్రాన్ని డిజిటల్‌కి మార్చి విడుదల చేయబోతున్నారు. ఓ ప్రముఖ తమిళ టీవీ చానల్ ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోంది. ఇటీవలే ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే అప్పట్లో తెలుగులో ఈ చిత్రం ‘అందమైన అనుభవం’గా రూపొందింది. ఇప్పుడు కూడా ఈ డిజిటల్ వెర్షన్ తెలుగులో విడుదల అయ్యే అవకాశం లేకపోలేదు. -
కేక పుట్టిస్తున్న రజనీ
‘రోబో’ వచ్చి మూడేళ్లవుతోంది. ఇంతవరకూ రజనీకాంత్ సినిమా రాలేదు. దక్షిణాది ప్రేక్షకులు, ముఖ్యంగా రజనీ అభిమానులు తమ అభిమాన కథానాయకుణ్ణి వెండితెరపై చూడాలని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆ లోటు తీర్చడానికే ‘కోచ్చడయాన్’ వస్తోంది. హాలీవుడ్ చిత్రం ‘అవతార్’ తరహాలో మోషన్ కాప్చరింగ్ టెక్నాలజీతో, త్రీడీ ఫార్మాట్లో ఈ సినిమా తయారవుతోంది. ఇండియాలో ఈ పరిజ్ఞానం ఉపయోగించుకున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. రజనీ చిన్న కూతురు సౌందర్య అశ్విన్ దర్శకురాలు కావడం మరో విశేషం. బాలీవుడ్ క్రేజీ బ్యూటీ దీపికాపదుకునే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రం విడుదల కోసం యావత్ భారతదేశ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘కోచ్చడయాన్’ చిత్ర ప్రచార చిత్రాన్ని వినాయకచవితి సందర్భంగా సోమవారం ఇంటర్నెట్లో విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రాన్ని 12 గంటల్లో నాలుగు లక్షల మంది అభిమానులు వీక్షించడం విశేషం. రజనీకాంత్ రాజు గెటప్‌లో గుర్రపుబండితో స్వారీ చేయడం, పోరుభూమిలో శత్రువులను చీల్చి చెండాడడం, స్టైలిష్‌గా స్టెప్పులు వేయడం వంటి సన్నివేశాలు అభిమానులను కేరింతలు కొట్టిస్తున్నాయి. ‘కోచ్చడయాన్’ చిత్రాన్ని రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. తెలుగులో ‘విక్రమసింహా’ పేరుతో శ్రీ లక్ష్మీ గణపతి సంస్థ విడుదల చేయనుంది.