Why Rajinikanth Trending In Twitter After Neeraj Chopra Gold Medal Won - Sakshi
Sakshi News home page

Rajinikanth-Neeraj Chopra: నీరజ్‌కు స్వర్ణం.. ట్రెండింగ్‌లో సూపర్‌స్టార్‌ రజనీ

Published Mon, Aug 9 2021 12:49 PM | Last Updated on Mon, Aug 9 2021 6:22 PM

Viral: Trending Twitter If You Chant Neeraj Neeraj Will Hear Rajni - Sakshi

ఈ ప్రపంచంలో ఎక్కడో జరిగే ఓ మోమెంట్‌ ఇంకోదానికి లింక్‌ అయ్యుంటుందని జూ.ఎన్టీఆర్‌ ‘నాన్నకు ప్రేమ’తో చిత్రంలో ఈ డైలాగ్‌ని చెప్తాడు. సరిగ్గా దీనికి సరిపోయేలా ఒలంపిక్స్‌లో ఓ ఘటన జరిగిందని సోషల్‌మీడియాలో ఒక పోస్ట్‌ రచ్చ చేస్తోంది. ఆ కథేంటంటే ఒలింపిక్స్‌లో నీర‌జ్ చోప్రా గోల్డ్ మెడ‌ల్ సాధించిన సంగతి తెలిసిందే. అయితే ట్విటర్‌లో నీరజ్‌ కాకుండా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పేరుతో ట్రెండ్ ఓ పోస్ట్‌ ట్రెండ్‌ అవుతోంది.

అదేంటి సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్‌కు, ఒలింపిక్స్ హీరో నీర‌జ్ చోప్రాకు మ‌ధ్య ఉన్న సంబంధం ఏంటి? రజనీ పేరు ఎందుకు సోషల్‌మీడియాలో మారుమోగుతోంది అనుకుంటున్నారా? ఆ విషయంపై లుక్కేస్తే... వాస్తవానికి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు, నీరజ్‌ చోప్రాకు ఏ రకంగాను సంబంధం లేదు. కాకపోతే నీరజ్‌ ఒలంపిక్స్‌లో గోల్డ్‌ కైవసం చేసుకున్న అనంతరం స్టేడియం మొత్తం నీరజ్‌..నీరజ్‌..నీరజ్‌... నీరజ్‌ అంటూ మారుమోగిన సంగతి తెలిసిందే. ఇక్కడే అసలు మ్యాటర్‌ దాగింది.  మనం కంటిన్యూగా నీరజ్‌ పేరు జపిస్తూ ఉంటే నీరజ్‌ కాస్త రజనీగా మారుతుంది. కావాలంటే మీరు ఓ సారి ‍ప్రయత్నించండి.  

అలా స్టేడియంలో నీరజ్‌ అని పిలిచినా రజనీలా వినపడిందంటూ నెట్టింట ఈ పోస్ట్‌లు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇక సూపర్‌ స్టార్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన అంతటా ఉంటారు, చివరికి ఒలింపిక్స్‌లో కూడా అనే క్యాప్షన్‌తో , నీర‌జ్ చోప్రా, టోక్యో ఒలింపిక్స్ 2020, నీర‌జ్ గోల్డ్ చోప్రా హ్యాష్‌టాగ్‌ల‌తో దీన్ని తెగ వైర‌ల్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement