
ప్రేమికులు ప్రైవసీ కోసం పార్క్‌లు, సినిమా థియేటర్లను వెతుక్కుంటారు. కాసేపు అచ్చిక బుచ్చికలు, మాటా ముచ్చట కావాలంటే ఇదొక్కటే మార్గం. ఆశ్చర్యకరంగా ఇపుడు ఈ జాబితాలో ప్రైవేట్ క్యాబ్‌లు కూడా చేరాయి. అటు భార్యాభర్తలకు కూడా మనసు విప్పిమాట్లాడుకునేందుకు ఇదో బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తోంది హద్దు మీరనంతవరకు ఏదైనా బాగానే ఉంటుంది కానీ మరికొంతమంది మితి మీరుతున్నారు. తాజాగా ఒక క్యాబ్ డ్రైవర్ పెట్టిన నోటు దీనికి ఉదాహరణగా ని లుస్తోంది. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్‌అవుతోంది.
తన క్యాబ్‌లో ప్రేమికుల వ్యవహారాలతో విసిగిపోయాడో ఏమోగానీ బెంగళూరు క్యాబ్ డ్రైవర్ తన కారులో ఒక నోట్ పెట్టాడు. జంటలను నో రొమాన్స్.. దూరంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి ఒకరికొకరు దూరం పాటించాలని హెచ్చరించారు. "హెచ్చరిక!! నో రొమాన్స్.. ఇది క్యాబ్, ప్రైవేట్ ప్లేసో, OYO కాదు.. సో దయచేసి దూరంగా, కామ్‌గా ఉండండి." అంటూ ఒక నోట్ పెట్టాడు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ నవ్వులు పూయిస్తోంది. ఆలోచన రేకెత్తించింది.

డ్రైవర్ ముక్కుసూటి తనం తెగ నచ్చేసింది నెటిజనులకు. హ్హహ్హహ్హ.. పాపం ఇలాంటివి ఎన్ని చూసి ఉంటాడో అని ఒకరు, డ్రైవర్లను తలచుకుంటే జాలేస్తోంది. కొంతమంది జంటలు క్యాబ్‌లో గొడవలు పెట్టుకోవడం, కొట్టుకోవడం గురించి విన్నాను.. అని ఒకరు వ్యాఖ్యానించగా, కనీసం ఇంటికి లేదా హోటల్‌కు చేరుకునే వరకు వేచి ఉండండ్రా బాబూ మరొకరు వ్యాఖ్యానించారు. బెంగళూరులోని డ్రైవర్లు క్యాబ్‌లో ఏదైనా రొమాంటిక్ ప్లాన్‌లను పునరాలోచించుకునేలా చేసే విషయాలను చూశారు. ఇది పూర్తిగా భిన్నమైన పట్టణ జీవితం!" అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. భారతదేశ స్టార్టప్ రాజధాని బెంగళూరు నగరంలో మాత్రమే జరిగే ఇలాంటి ఉదంతాలు హైలైట్‌గా నిలుస్తాయి. ఆన్‌లైన్ మీమ్‌లకు కేంద్రంగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment