note
-
రూ.350 నోటు వస్తోందా?: ఆర్బీఐ ఏం చెప్పించిందంటే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.350, రూ.5 నోట్లను విడుదల చేస్తున్నట్లు.. కొన్ని వార్తలు, నోట్లకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ వార్తలు నిజమేనా? లేక కేవలం పుకార్లు మాత్రమేనా అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.ప్రస్తుతం రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100, రూ. 200, రూ. 500 నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రూ. 5 నోట్లు, రూ. 350 నోట్లు కేవలం పుకారు మాత్రమే అని ఆర్బీఐ వెల్లడించింది. మూడేళ్ళ క్రితం కూడా ఇలాంటి ఫొటోలే నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అవే ఇప్పుడు మరోసారి తెరమీదకు వచ్చినట్లు చెబుతున్నారు.2016 డిమోనిటైజేషన్ తరువాత పాత రూ. 500, రూ. 1000 నోట్లను ఆర్బీఐ రద్దు చేసింది. ఆ తరువాత కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టింది. కొత్త నోట్లను ప్రవేశపెట్టిన కొన్ని రోజులలోనే రూ. 200 నోట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. నల్లధనాన్ని అరికట్టడానికి ఈ కొత్త నోట్లను ప్రవేశపెట్టారు.2023లో ఆర్బీఐ పెద్ద నోట్ల ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభించింది. ప్రజలవద్ద ఉన్న రూ. 2000 నోట్లను బ్యాంకులలో ఇచ్చేయాలని ఆదేశించింది. దీంతో రెండు వేలరూపాయల నోట్లన్నీ కూడా ఆర్బీఐకు చేరుతున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద నోటు రూ. 500 మాత్రమే.భారతదేశంలో అతిపెద్ద కరెన్సీ నోటుభారతదేశంలో అతిపెద్ద కరెన్సీ నోటు ఏది అంటే.. అందరూ రూ.2000 నోటనే చెబుతారు. కానీ.. నిజానికి భారదేశంలో స్వాతంత్య్రం రాకముందే 1938లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.10000, రూ.5000 నోట్లను చలామణిలోకి తీసుకొచ్చిన విషయం చాలామందికి తెలియకపోవచ్చు.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారదేశంలో ప్రవేశపెట్టిన రూ.10,000 నోటు.. అతిపెద్ద డినామినేషన్‌గా నిలిచింది. వీటిని ఎక్కువగా వ్యాపారాలు, వ్యాపారులు అధిక-విలువ లావాదేవీల కోసం ఉపయోగించారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ వంటి వాటిని అరికట్టడానికి బ్రిటీష్ ప్రభుత్వం 1946లో వీటిని ఆరికట్టింది.ఇదీ చదవండి: 40 కోట్ల జనం.. రూ.2 లక్షల కోట్ల ఆదాయం! ఎలాగో తెలుసా?ఈ పెద్ద నోట్లు మళ్ళీ 1954లో భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రవేశించాయి. ఆ తరువాత 1978 వరకు చెలామణి అవుతూనే ఉన్నాయి. ఆ తరువాత 1978లో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్థిక అవకతవకలను పరిష్కరించడంలో భాగంగానే.. రూ.5,000 నోట్లతో పాటు రూ.10,000 నోట్లను రద్దు చేయాలని నిర్ణయించింది. -
నువ్వు లేకుండా నేను ఏదీ చేయలేను.. లవ్యూ: మృణాల్ ఠాకూర్ (ఫొటోలు)
-
దీదీ వ్యాఖ్యల్ని ఖండించిన బంగ్లాదేశ్
ఢాకా: తమ దేశ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తామని ఇటీవల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ స్పందించింది. సీఎం మమత చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారా శాఖ మంగళవారం భారత ప్రభుత్వానికి ఒక అధికారిక నోట్ పంపించింది.చదవండి: సీఎం మమత వ్యాఖ్యలపై గవర్నర్ అభ్యంతరం.. ‘నివేదిక ఇవ్వండి’‘‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మీద మాకు గౌరవం ఉంది. వారితో మేము చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాం. కానీ బంగ్లాదేశ్ ప్రజల పట్ల ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యవహారంపై మేము భారత ప్రభుత్వానికి ఒక అధికారిక నోట్ పంపుతున్నాం’’ అని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల మంత్రి హసన్ మహమూద్ తెలిపారు.నిస్సహాయులైన బంగ్లాదేశ్ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తామని ఇటీవల నిర్వహించిన ఓ ర్యాలీలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాను వ్యతిరేకిస్తూ.. విద్యార్థులు చేసిన నిరసన హింసాత్మకంగా మారింది. వారం రోజులు పాటు తీవ్రంగా జరిగిన విద్యార్థుల ఆందోళనలో వందకుపైగా నిరసనకారులు మృతి చెందారు. ఇలాంటి సమయంలో సరిహద్దు రాష్ట్రం పశ్చిమబెంగాల్ సీఎం మమత చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.చదవండి: బంగ్లా దేశీయులకు ఆశ్రయం ఇస్తాం: సీఎం మమత -
ప్యారిస్–ముంబై విమానానికి బాంబు బెదిరింపు
ముంబై: పారిస్ నుంచి 306 మందితో ముంబై బయల్దేరిన విస్తారా విమానానికి ఆదివారం బాంబు బెదిరింపు వచ్చింది. ‘బాంబు పెట్టాం’ అని రాసిన నోట్ ఎయిర్ సిక్నెస్ బ్యాగ్‌లో కనిపించింది. దాంతో ముంబైలో లాండవగానే అందరినీ హుటాహుటిన దించేసి తనిఖీలు చేపట్టారు. బాంబు సహా అనుమానాస్పద వస్తువులేవీ లేవని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
ఆత్మకూరు (ఎస్)(సూర్యాపేట): పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండల పరిధిలోని తుమ్మల పెన్‌పహాడ్ గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మల పెన్‌పహాడ్ గ్రామానికి చెందిన గుండగాని సంజయ్, అదే గ్రామానికి చెందిన సల్లగుండ్ల నాగజ్యోతి ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సంజయ్ సూర్యాపేటలో ఉంటూ వాటర్ ప్లాంట్‌లో మెకానిక్‌గా పనిచేస్తుండగా.. నాగజ్యోతి బీ–ఫార్మసీ పూర్తిచేసి హైదరాబాద్‌లోని నాగోల్ క్రాస్ రోడ్లో గల ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసుకుంటూ ఎం–ఫార్మసీ చదువుతోంది. తాను నాగజ్యోతిని ప్రేమిస్తున్న విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు గతంలోనే సంజయ్ తెలియజేయగా వారు వివాహానికి ఒప్పుకోలేదు. అయినప్పటికీ మూడేళ్లుగా వారు ప్రేమలోనే ఉన్నారు. ఇటీవల గ్రామానికి చెందిన కొందరు నాగజ్యోతి తల్లిదండ్రులకు లేనిపోని విషయాలు చెప్పడంతో ఆమెను తండ్రి మందలించాడు. ఉగాది పండుగ తర్వాత నుంచి ఆమెను ఉద్యోగం మాన్పించి ఇంటి దగ్గరే ఉంచాడు.కలిసి ఉండలేమని భావించి..తమ ప్రేమ విషయమై గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అసత్యాలు ప్రచారం చేస్తుండడంతో, ఇకపై తాము కలిసి ఉండలేమని భావించి వారిద్దరు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి సంజయ్, నాగజ్యోతి తమ తమ ఇళ్ల నుంచి బయటికి వచ్చి గ్రామ శివారులోని ఓ వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగారు. ఆదివారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లేవారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించగా.. అంత్యక్రియలు పూర్తిచేశారు.సూసైడ్ నోట్ లభ్యం..తమ ప్రేమకు అడ్డంకిగా మారి ఇబ్బందులకు గురిచేసిన గ్రామానికి చెందిన బెల్లంకొండ నారాయణ, ఆరె లతారెడ్డితో పాటు నాగజ్యోతి బంధువులైన సల్లగుండ్ల అజయ్, సల్లగుండ్ల మల్లయ్య, సల్లగుండ్ల శ్రీను, సల్లగుండ్ల ఉప్పలయ్యతో పాటు నాగజ్యోతి తండ్రి సల్లగుండ్ల శ్రీనుపై చర్యలు తీసుకోవాలని వారు సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి దుర్గమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసుకుని దర్యాçప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
పాతబస్తీలో నకిలీ నోటు కలకలం!
చంచల్‌గూడ: దేశంలో రూ.1000, రూ.500 నోట్లు రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఆర్బీఐ కొత్త రూ. 2 వేలు, రూ. 500, రూ. 200 నోట్లను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కాగా గత గురువారం పాతబస్తీలోని మాదన్నపేట కూరగాయల మార్కెట్లో నకిలీ రూ. 200 నోటు దర్శనమిచ్చింది. మార్కెట్లో ఓ వ్యాపారి వద్ద గుర్తు తెలియని వ్యక్తి ఆకు కూరలు కొనుగోలు చేసి రూ. 200 నోటు ఇచ్చి మిగతా డబ్బులు తీసుకుని జారుకున్నాడు. సదరు వ్యాపారి ఆ రూ.200 నోటును వ్యాపారం చెల్లింపుల్లో భాగంగా మరో వ్యాపారికి ఇవ్వగా నకిలీదిగా గుర్తు పట్టాడు. నోటు సైజ్ తక్కువ, పేపర్ మందం ఎక్కువగా ఉంది. కలర్లో వ్యత్యాసం ఉండటంతో పాటు నోటుపై వాటర్ మార్క్ గాంధీ బొమ్మ కూడా లేకపోవడంతో అది ఫేక్ నోటుగా నిర్ధారించుకున్నాడు. దీంతో అసలైన నోటు అని భావించిన వ్యాపారి తాను మోసపోయినట్లు గుర్తు పట్టారు. వారం క్రితం రూ. 500 నోటు ఇక్కడే ఈ ఘటనకు వారం రోజుల ముందు కూడా ఇలాగే మరో గుర్తు తెలియని వ్యక్తి రూ. 500 నకిలీ నోటు మార్చేందుకు యయత్నంచగా పసిగట్టిన వ్యాపారి సదరు వ్యక్తితో గొడవపడినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ రెండు ఘటనలను పరిశీలిస్తే నగరంలో నకిలీ రూ. 500, 200 నోట్లు చెలామణిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. పోలీసు, ఎన్ఐఏ, బ్యాంక్ అధికారులు మార్కెట్లో నకిలీ నోట్ల గుర్తింపుపై ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తే వ్యాపారులు మోసపోకుండా ఉంటారు. మార్కెట్లో పోలీసు స్టేషన్‌కు చెందిన సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటిలోని ఫుటేజీలను మాదన్నపేట పోలీసులు పరిశీలిస్తే నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టయ్యేందుకు అవకాశం లేకపోలేదు. అయితే మాదన్నపేట పోలీసులు ఈ కేసును సుమోటోగా తీసుకుంటారా లేక, బాధితులు ఫిర్యాదు ఇస్తేనే రంగంలోకి దిగుతారా అనేది వేచి చూడాలి. -
అది 48 ఏళ్ల క్రితంనాటి లెటర్.. ఎలా లభ్యమయ్యిందంటే..
ఒక్కోసారి చరిత్ర తన దారిని వెదుకుతూ వర్తమానంలోకి వచ్చేస్తుందేమో! 48 ఏళ్ల క్రితం 14 ఏళ్ల బాలిక రాసిన ఒక ఉత్తరం ఇంటి తలుపు సందుల్లో దొరికింది. అమెరికాలోని ఇలినోయిస్కు చెందిన తాజెవెల్ కౌంటీలో ఒక పాత ఇంటిలోని ఒక తలుపు వెనుక ఒక బాటిల్లో దాచివుంచిన లెటర్ ఇప్పుడు లభ్యమయ్యింది. ఈ పాత ఇంటిలో వర్క్ చేసేందుకు వచ్చిన ఒక కార్పెంటర్ ఈ లెటర్‌ను గమనించాడు. తరువాత ఇది సోషల్ మీడియాలో షేర్ కావడంతో వైరల్‌గా మారింది. కార్పెంటర్‌కు ఎలా దొరికిందంటే.. ఫేస్బుక్ పోస్టులో ఉన్న వివరాల ప్రకారం డకోటా మోహ్న్ అనే ఈ కార్పెంటర్ ఇంటి మెయింటనెన్స్ చూస్తున్నాడు. ఈ నేపధ్యంలో అతని దృష్టి లివింగ్ రూమ్‌లోని తలుపు ఫ్రేమ్‌వర్క్‌పై పడింది. దానిపై ‘నోట్ 9/29/1975' అని రాసివుంది. అక్కడున్న బాణం గుర్తును ఫాలో చేయగా కలపతో చేసిన కంపార్ట్మెంట్ను అతను తెరిచాడు. అక్కడ మూసివున్న ఒక బాటిల్లో చేతితో రాసిన ఒక ఉత్తరం లభ్యమయ్యింది. ఈ పోస్టు క్యాప్షన్‌లో డకోటా ఇలా రాశాడు. ‘నా వడ్రంగి కెరియర్లో నాకు ఎన్నో అమూల్యమైనవి లభించాయి. వాటిలో ఇది అత్యుత్తుమమైనది’ జర్నల్ స్టార్‌తో మాట్లాడిన డకోటా మోహ్న్..‘మా బృందం ఆ ఇంటిలోని లివింగ్ రూమ్‌లో పనిచేస్తోంది. నేను చెత్తను తుడిచే పనిలో ఉన్నాను. అప్పుడు అక్కడి తలుపుపై ఏదో రాసివుండటాన్ని గమనించాను. దానిపై ‘నోట్’ అని ఉంది. నేను నా సెల్‌ఫోన్‌ను అక్కడ ఫోకస్ చేసి, ఫొటో తీసుకున్నాను. తరువాత ఆ బాటిల్లోని లెటర్ తెరిచి నోట్ చదివాను’అని తెలిపారు. లెటర్ ఎవరు రాశారంటే.. సోషల్ మీడియాలో ఈ లెటర్ షేర్ అయిన అనంతరం ఒక మహిళ ఈ పోస్ట్ చదివారు. తాను తన 14 ఏళ్ల వయసులో ఈ లెటర్ రాశానని తెలిపారు. స్టెఫనీ హెరాన్ అనే ఈ మహిళ ఈ పోస్టుకు కామెంట్ రాస్తూ..‘ఈ లెటర్ నేనే రాశాను. నాకు నా చెల్లెలికి టైమ్ కాప్స్యూల్ అంటే చాలా ఇష్టం. ఇది అమెరికా ద్విశతాబ్దికి(1970 మధ్యకాలం) ముందునాటిది. ఆ మర్నాడే నా సోదరి జన్మించింది’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: 11 ఏళ్లకే ఎవరైనా తండ్రి కాగలరా?.. సైన్స్ ఏమి చెబుతోందంటే.. -
బైపాస్ చార్జింగ్: కొత్త ఫీచర్‌తో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్
భారత్‌లో ఇన్ఫినిక్స్ నోట్ 30 5జీ ( Infinix Note 30 5G) తాజాగా విడుదలైంది. 6.78 అంగుళాల 120హెడ్జ్ డిస్ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 6080 SoC, 8GB వరకు ర్యామ్‌తో కూడిన ఫీచర్-ప్యాక్డ్ స్మార్ట్‌ఫోన్ ఇది. హై రిజల్యూషన్ 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, JBL సౌండ్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో వస్తోంది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5,000mAh బ్యాటరీ, గేమింగ్ సమయంలో వేడెక్కడాన్ని తగ్గించడానికి బైపాస్ చార్జింగ్ మోడ్‌ను కలిగి ఉంది. ఇన్ఫినిక్స్ నోట్ 30 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. ఇక 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999. యాక్సిస్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్లు రూ. 1,000 తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్ అమ్మకాలు జూన్ 22వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానున్నాయి. స్పెసిఫికేషన్లు ఇన్ఫినిక్స్ నోట్ 30 5జీ ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13-ఆధారిత XOS 13 ఆపరేటింగ్ సిస్టమ్ 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 580 నిట్ల వరకు గరిష్ట బ్రయిట్నెస్తో పెద్ద 6.78అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ డిస్ప్లే ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 SoC, మాలి G57 MC2 GPU, 8GB వరకు ర్యామ్ హై-రిజల్యూషన్ 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, రెండు అదనపు సెన్సార్లు ముందు భాగంలో, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16-మెగాపిక్సెల్ కెమెరా. JBL సౌండ్‌ని అందించే డ్యూయల్ స్టీరియో స్పీకర్లు. హై-రెస్ ఆడియో సర్టిఫికేషన్ 256 జీబీ వరకు స్టోరోజ్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ఉపయోగించి విస్తరించవచ్చు. 5G, 4G, Wi-Fi, బ్లూటూత్, GPS, NFC, 3.5mm ఆడియో జాక్, USB టైప్-C పోర్ట్‌తో సహా వివిధ కనెక్టివిటీ ఆప్షన్లకు మద్దతు యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటి అనేక సెన్సార్లు. బయోమెట్రిక్ ప్రమాణీకరణ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీ. గేమర్లు నేరుగా మదర్‌బోర్డుకు చార్జ్ చేసే బైపాస్ ఛార్జింగ్ ఫీచర్. 168.51x76.51x8.45mm కొలతలు, 204.7 గ్రాముల బరువు. Time to live life in the fast lane with Note 30 5G, thanks to India's first MediaTek Dimensity 6080 Processor, a smooth 120Hz Display, up to 16GB* RAM, and 256 Storage! Sale starts 22nd June, 12PM, only on Flipkart. Click here to know more: https://t.co/6DNmOKpB2z#ChangeTheGame pic.twitter.com/HVXgXOlDtB — Infinix India (@InfinixIndia) June 14, 2023 -
సింగర్‌పై నోట్ల వర్షం.. ఎన్ని కోట్లు పడేసారో తెలుసా?
-
Delhi Lodge Murder Case: హనీ ట్రాప్‌లో భాగమే..ఐతే ఆ 'సారీ నోట్'..
ఢిల్లీలో తీవ్ర కలకలం రేపిన వ్యాపారవేత్త హత్య కేసులో పురోగతి సాధించారు పోలీసులు. ఆ కేసుకి సంబంధించి ప్రధాన నిందితురాలు 29 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె హర్యానాలోని హనీ ట్రాప్‌తో దోచుకునే ముఠాకు చెందిన మహిళ అని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..బల్జీత్ లాడ్జిలో తన గదిలో నురగలు కక్కుతూ శవమై కనిపించిన వ్యాపరవేత్త దీపక్ సేథీని హనీట్రాప్ ప్లాన్‌తోనే హత్య చేసినట్లు తెలిపారు. సదరు మహిళ పేరు ఉషా అని ఆమె నిక్కీ, అంజలి, నిఖిత వంటి మారుపేర్లతో వ్యక్తులతో స్నేహం చేసి వారిని హోటళ్లుకు తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి దోచుకునేదని చెప్పారు. ఈ ప్లాన్‌తోనే ఆ రోజు కూడా ఉషా దీపక్ సేథీని ట్రాప్ చేసి హోటల్‌ల్‌కి తీసుకువెళ్లిందన్నారు. ఐతే ఆరోజు అనుకోకుండా ఓవర్ డోస్ అవ్వడంతో అతను మృతి చెందాడని తెలిపారు. దీపక్ సేథీ(53) మార్చి 30న రాత్రి 9.30 గంటలకు ఉషతో కలిసి గెస్ట్‌హౌస్‌కి వెళ్లిందని, అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో డబ్బు, నగలతో బయటకు వచ్చినట్లు తెలిపారు. ఐతే అనుకోకుండా దీపక్ చనిపోవడంతో ఆమె విచారం వ్యక్తం చేస్తూ.. 'సారీ అంటూ నోట్' రాసిందన్నారు. అదే ఆమెను పోలీసులకు పట్టించేలా చేసిందని చెప్పారు. ఈ ఘటనలో బాధితుడిని సంప్రదించిన ఫోన్ నెంబర్లలో ప్రధాన నిందితురాలితో సహా ఉన్న కొనఇన అనుమానిత నంబర్లను కూడా గుర్తించారు పోలీసులు. నిందితురాలు ఉష నెంబర్ సంత్‌గఢ్ ప్రాంతంలో రీఛార్జ్ అవ్వడంతో ఆ లోకేషన్‌ని ట్రేస్ చేసి అక్కడికి చేరుకుని నైజరియన్ వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు. అతడి లివ్ఇన్ భాగస్వామీ మధుమిత స్నేహితురాలి నిక్కీ అలీయాస్ ఉషా అని తేలడంతోనే ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఆమె 2022లో పానిపట్‌లో నమోదైన కేసులో జైలులో ఉంది. అక్కడే మధుమితతో పరిచయం ఏర్పడిందని, ఆమె దీపక్ సేథీని ఉషకు పరిచయం చేసినట్లు తెలిపారు. విచారణలో నిందితురాలు ఉషా తనకు దీపక్ సేథీని చంపే ఉద్దేశ్యం లేదని, అందువల్లే ఆ గది నుంచి బయటకు వెళ్లే ముందు సారీ నోట్‌ని వదిలి వెళ్లినట్లు తెలిపింది. అలాగే ఆమె సేథీ నుంచి తీసుకున్న మొబైల్ ఫోన్, నగదు, డబ్బు తదితరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: బార్లో సిబ్బంది, కస్టమర్ల మధ్య వాగ్వాదం..పదిమంది అరెస్టు) -
మా చావుకు ఎవరూ కారణం కాదు..
హైదరాబాద్: ఇద్దరు కుమారుల తోటిదే లోకంగా బతికిన ఆ దంపతులు.. అనారోగ్యంతో బాధపడుతున్న ఆ చిన్నారులను చూసి తట్టుకోలేక ఈ లోకాన్నే వదిలి వెళ్లిపోయారు. పిల్లలనూ తమ వెంటే తీసుకెళ్లారు. గుండెల్ని మెలిపెట్టిన ఈ హృదయ విదారక ఘటన శనివారం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందిగూడలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. నిజామాబాద్‌కు చెందిన గాదె సతీష్ (39) సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆయనకు భార్య వేద (35), ఇద్దరు కుమారులు నిషికేత్ (9), నిహాల్ (5) ఉన్నారు. ఉద్యోగరీత్యా సతీష్ కుటుంబంతో కలిసి 2021లో నగరానికి వచ్చారు. కుషాయిగూడ పరిధిలోని కందిగూడలో ఉన్న క్రాంతి పార్క్ రాయల్ అపార్టుమెంట్లో భార్యా పిల్లలతో నివసిస్తున్నారు. కాగా.. పెద్ద కుమారుడు నిషికేత్ బ్రెయిన్ సంబంధిత వ్యాధి బారిన పడ్డాడు. చిన్న కొడుడు నిహాల్ బాల్యం నుంచే మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడు. అపార్ట్మెంట్ బయట కనిపించకపోవడంతో.. శనివారం మధ్యాహ్నం వరకు సతీష్ కుటుంబ సభ్యులు అపార్టుమెంట్ బయట కనిపించకపోవడంతో అనుమానం వచ్చి సెక్యూరిటీ సిబ్బంది ఫోన్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో పైకి వెళ్లి కిటికిలోంచి చూడగా ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారు. విషయం తెలిసిన మల్కాజిగిరి డీసీపీ జానకి పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు కుమారుల అనారోగ్యాన్ని తట్టుకోలేకనే దంపతులు సతీష్, వేద ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని భావిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ‘మా చావుకు ఎవరు కారణం కాదు’ అనే సూసైడ్ నోట్ ఘటనా స్థలంలో లభ్యమైనట్లు వారు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తులో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందన్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లారు. పోలీసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. భార్యా పిల్లలకు తాగించి.. ఆపై తానూ తాగి.. అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులకు చాలాచోట్ల వైద్యం చేయించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. పిల్లలను చూస్తూ తల్లిదండ్రులు రోజురోజుకూ మానసికంగా కుంగిపోయారు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం రాత్రి నిద్ర పోయే సమయంలో పొటాయం సైనెడ్‌ను చాయ్‌లో కలిపి ముందుగా భార్య వేదకు, ఇద్దరు పిల్లలకూ ఇచ్చి వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత సతీష్ కూడా తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
నా పెళ్లి సంబంధం చెడగొట్టారు.. యువతి సూసైడ్ నోట్ రాసి..
సాక్షి, నిర్మల్: జిల్లా కేంద్రంలోని రాంరావుబాకు చెందిన ఓ యువతి సూసైడ్ నోట్ రాసి ఇంట్లో నుండి వెళ్లి పోయిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నిర్మల్‌లోని ఓ కంప్యూటర్ సెంటర్లో యువతి ఉద్యోగం చేస్తోంది. దాని పక్కనే గల ఫోటో షాప్ యజమాని వంశీతో యువతికి పరిచయం ఏర్పడింది. అయితే గత నెల ఫిబ్రవరిలో యువతికి మరో వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరి ఎంగేజ్మెంట్ తేదీని సైతం తేదీ ఖరారు చేశారు. వంశీ దంపతులు తనకు పెళ్లి కుదిరిన అబ్బాయికి ఫోన్ చేసి తనపై తప్పుడు మాటలు చెప్పి ఎంగేజ్‌మెంట్‌ను చెడగొట్టారని సూసైడ్ నోట్లో రాసి వెళ్లిపోయింది. తాను వెళ్లిపోవడానికి కారణం వంశీ దంపతులేనని, తన కుటుంబ సభ్యులు కాదని పేర్కొంది. దీంతో యువతి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి వెళ్లిపోవడానికి కారణమైన వంశీని అదుపులోకి తీసుకున్నారు. తమ కుమార్తె ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం వంశీ దంపతులేనని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తల్లి, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. చదవండి: బాలానగర్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య -
ఆన్లైన్ షాపింగ్: లడ్డూ కావాలా నాయనా..కస్టమర్‌కి దిమ్మతిరిగిందంతే!
సాక్షి,ముంబై: ఆన్లైన్ షాకింగ్‌కు సంబంధించిన మరో విచిత్రమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆర్డర్ చేసిన వస్తువులకు బదులుగా వేర్వేరు వస్తువులను రావడం, ఖరీదైన వస్తువులకు బదులుగా చీప్ వస్తువులు, ఒక్కోసారి రాళ్లు, రప్పలు లాంటివి ఆన్లైన్ షాపింగ్‌లో తరచూ జరిగే చోద్యాలే. తాజాగా అమెజాన్‌లో తన కిష్టమైన బుక్ ఆర్డర్ చేసిన కస్టమర్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఈ విషయాన్ని యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అమెజాన్‌లో ఆన్లైన్ ద్వారా ఒక పుస్తకాన్ని ఆర్డర్ చేస్తే 'లుకింగ్ ఫర్ లడ్డూ' అనేక పిల్లల పుస్తకాన్ని డెలివరీ చేశారంటూ తన అనుభవాన్ని ట్వీట్ చేశాడు. అంతేకాదు నెగిటివ్ రివ్యూ, నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వొద్దని కూడా మొరపెట్టుకోవడం మరింత విడ్డూరంగా నిలిచింది. ఏమి జరుగుతోంది భయ్యా అంటూ @kashflyy అనే యూజర్ ఆవేదన వెలిబుచ్చారు. (వోల్వో అభిమానులకు షాకిచ్చిందిగా!) బాధితుడికి అందిన ఆ నోట్లో ఇలా ఉంది. ''ప్రియమైన కస్టమర్, క్షమాపణలు సార్, మీరు ఈ పుస్తకాన్ని ఆర్డర్ చేసారు.. మా దగ్గర స్టాక్ ఉంది, కానీ అది పాడైంది. అందుకే మీకు మరో పుస్తకాన్ని పంపుతున్నాం. ఆర్డర్‌ని క్యాన్సిల్ చేసి...దయచేసి ఆ పుస్తకాన్ని తిరిగివ్వండి. నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వకండి ప్లీజ్ ధన్యవాదాలండి.'' దీంతో నెటిజనులు విభిన్నంగా స్పందించారు. పోనీలే, ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోమని కొందరన్నారు. సారీ చెప్పి.. నోట్ పెడితే సరిపోతుందా..ఆ బుక్ వచ్చేదాకా వెయిట్ చేయొచ్చు కదా అని మరొకరు కామెంట్ చేశారు. మరోవైపు అసౌకర్యానికి క్షమాపణలు చెపుతూ అమెజాన్ హెల్ప్ ట్విటర్ హ్యాండిల్ స్పందించింది. I ordered a certain book from Amazon but they sent me this random book called looking for laddoo along with this letter like bhai what is going on 😭😭😭 pic.twitter.com/90D19KIl9k — Kashish (@kashflyy) February 21, 2023 -
ఓటుకు కోట్లు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి: ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి
-
అతని బతుకు లెక్క తప్పింది
రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి జిల్లా): అప్పుడప్పుడు ఆ చిన్నారులిద్దరూ తండ్రితో సరదాగా హోటల్‌కు వెళ్లేవారు. ఆదివారం కూడా అదే తరహాలో నాన్న వెళ్దామంటే ఆ చిన్నారులు సంబరపడిపోయారు. తనతోపాటు మృత్యుఒడికి తీసుకుపోతాడని వారికి తెలియదు. కంటికి రెప్పలా చూసుకున్న తండ్రే ప్రాణాలను చిదిమేస్తాడని అనుకోలేదు. పిడింగొయ్యి బుచ్చియ్యనగర్కు చెందిన పక్కి సత్యేంద్రకుమార్(40) ఆదివారం రాత్రి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిల్లలు రిషిత(12), హిద్విక(07)లు కూడా తండ్రితోపాటు చెరువులో విగత జీవులుగా తేలారు. ఈ ఘటన హృదయాలను కలచివేసింది. రాజమహేంద్రవరం వీఎల్‌పురం కనకదుర్గమ్మ గుడివీధిలో భార్యాపిల్లలతో ఉండేవాడు. అకౌంటెంట్‌గా జీఎస్టీలు ఫైల్ చేసేవాడు. డాన్‌బాస్కో స్కూల్లో రిషిత ఏడవ తరగతి, హిద్విక రెండవ తరగతి చదివేవారు. ఆదివారం అతని భార్య స్వాతి, తల్లిదండ్రులతో కలిసి విశాఖ వెళ్లింది. మానసికంగా తీవ్ర దిగులు చెందుతున్న సత్యేంద్రకుమార్ తనువు చాలించాలనుకుంటున్నాడని కుటుంబ సభ్యులెవరూ గుర్తించలేకపోయారు. పిల్లలంటే ఎంతో మమకారం. విడిచి ఉండలేకపోయేవాడు. తాను లేకపోతే పిల్లలేమవుతారని భావించాడో ఏమో గాని తనతోపాటు వారినీ విషాదాంతమొందించాడు. ఆదివారం సాయంత్రం హోటల్లో భోజనం పేరిట పిల్లలిద్దరినీ తీసుకెళ్లాడు. తర్వాత వీరి ఆచూకీ కనిపించలేదు. విశాఖ నుంచి తిరుగు ప్రయాణమైన భార్య స్వాతి ఫోన్ చేసినా ఎత్తలేదు. ఇంటికొచ్చి చూస్తే పిల్లలు కూడా కనిపించలేదు. దీంతో కంగారు పడి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోమవారం ఉదయం రాజవోలు చెరువులో ముందుగా కుమార్తెలిద్దరి శవాలు బయటపడ్డాయి. తర్వాత సత్యేంద్రకుమార్ విగతజీవిగా తేలాడు. చెరువులోకి దూకేముందు గట్టుపై బైక్, సెల్‌ఫోన్ విడిచి పెట్టాడు. లెటర్ రాశాడు. తానెందుకు ప్రాణాలు తీసుకుంటున్నదీ అందులో వివరించాడు. ధవళేశ్వరం, బొమ్మూరు పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్లు మంగాదేవి, విజయకుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. రైలు టిక్కెట్లు తీసి పంపించి... ఏ శుభకార్యానికి వెళ్లినా అందరం కలిసి వెళ్లే వాళ్లం.. విశాఖపట్నం శుభకార్యానికి వెళ్దామంటే ఈసారి తనకు పని ఉంది రాలేనని సత్యేంద్రకుమార్ చెప్పారని అతని భార్య స్వాతి పేర్కొంది. తనకు, అత్తమామలకు టిక్కెట్లు తీసి పంపించి ఇలా శోకం మిగిల్చారంటూ కన్నీరుమున్నీరవుతోంది. తిరిగి వెళ్లి వచ్చేసరికి అందనంత దూరానికి వెళ్లిపోయి తనను ఒంటరి దాన్ని చేసేవా బావా రోదిస్తున్న తీరు స్థానికుల గుండెల్ని పిండేసింది. అందరితోను కలివిడిగా నవ్వుతూ పలకరించే సత్యేంద్రకుమార్, ఇద్దరు కుమార్తెలు మృత్యువాతపడడాన్ని అతని సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. వీఎల్‌పురం, బుచ్చియ్యనగర్ ప్రాంతాల్లో విషాధ చాయలు అలుముకున్నాయి. కష్టాన్ని తమతో పంచుకుంటే ఇంత దారుణం జరిగేది కాదంటూ మృతుని తల్లితండ్రులు సుశీల, సత్యనారాయణ కన్నీటి పర్యంతమవుతున్నారు. పార్థివ దేహాలకు నివాళి వీఎల్‌పురంలో తండ్రీ కుమార్తెల పార్థివ దేహాలకు సోమవారం రాత్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. జరిగిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని బొమ్మూరు సీఐ విజయ్ కుమార్‌కు ఆదేశించారు. బతకాలని ఉన్నా... సత్యేంద్రకుమార్ తనతోపాటు పిల్లలనూ మృత్యుఒడికి చేర్చిన ఘటనపై ఆయన నివాస ప్రాంత వాసులకు కన్నీరు తెప్పించింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇద్దరు కుమార్తెలకు తాను చనిపోతే సమాజంలో గుర్తింపు, గౌరవం ఉండదని..అందుకే వెంట తీసుకువెళ్లినట్లు సత్యేంద్రకుమార్ సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. అకౌంట్స్ కన్సల్టెన్సీ ఆఫీసు నిర్వహించేవాడు. అనుకున్న మేర ఆదాయం రాలేదని ఆందోళన చెందేవాడు. ఆర్థికంగా ఎదిగే అవకాశం లేని దురదృష్టవంతుడ్ని అంటూ సత్యేంద్రకుమార్ లేఖలో ప్రస్తావించాడు. మరణానికి మూడొంతులు అకౌంట్స్ టెన్షనే కారణమన్నాడు. బతకాలనే ఉంది..కానీ జీవితం ఇలాగే ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నానన్నాడు. సున్నితంగా తాను ఆలోచించానని అనుకోవద్దన్నాడు. చావడానికి కూడా చాలా ధైర్యం కావాలంటూ లేఖ ముగించాడు. ఈ లేఖ అందరి హృదయాలనూ కదిలించింది. -
ఆ ఇద్దరిని కఠినంగా శిక్షించాలి అదే నా చివరి కోరిక..
తూర్పు గోదావరి: మండలంలోని నీలపల్లికి చెందిన యువతి ఐదు రోజుల క్రితం అదృశ్యమైందని, కేసు నమోదు చేసి ఆచూకీ కోసం గాలిస్తున్నామని కోరంగి ఎస్సై టి.శివకుమార్ బుధవారం తెలిపారు. ఎం.ఎస్.శర్మ దంపతుల 22 ఏళ్ల కుమార్తె ఈ నెల 13వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. ఇంటినుంచి వెళుతూ యువతి రాసిన సూసైడ్ నోట్ తల్లిదండ్రులను తీవ్రంగా కలచివేస్తోంది. ఇద్దరి యువకుల వేధింపుల వల్ల మనోవేదనకు గురై తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ నోట్లో పేర్కొంది. యానాం గోదావరిలోగాని, కోరంగి గోదావరిలో గాని దూకి తాను చనిపోతానని, తన కోసం గాలించవద్దని తెలిపింది. దీంతో యువతి తండ్రి ఆందోళన చెందుతూ యానాం, కోరంగి గోదావరి ప్రాంతాలలో తీవ్రంగా గాలించి, ఆచూకీ లభించకపోవడంతో కోరంగి పోలీసులకు 13 తేదీన ఫిర్యాదు చేశారు. కలకలం రేపుతున్న వీడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో ఒక యువకుడు ఆ యువతి ఫొటోలను తగులబెడుతూ, ఆమె చనిపోకపోతే నేనే చంపేస్తానని చెప్పడం కలకలం రేపుతోంది. ఆ యువకుడు ఎవరు, సూసైడ్ నోట్లో యువతి పేర్కొన్న ఇద్దరి పేర్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్‌నోట్‌లో గోదావరిలో దూకి చనిపోతానని పేర్కొనడం, కొంతమంది గోదావరి పరీవాహక ప్రాంతంలో యువతిని చూసినట్లుగా చెప్పడంతో గోదావరిలో విస్తృతంగా గాలించినట్లు ఎస్ఐ తెలిపారు. సూసైడ్‌నోట్‌లో పేర్కొన్న ఇద్దరినీ కఠినంగా శిక్షించాలని, అదే నా చివరి కోరిక అని యువతి పేర్కొంది. కాగా తమ కుమార్తెను ఆ ఇద్దరు యువకులే కిడ్నాప్ చేసి ఉంటారని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌కు, పోలీసు ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేసినట్లు వారు తెలిపారు. తమకు ఇద్దరు పిల్లలని మూడేళ్ల వయసులోనే కాలువలో పడి తమ కుమారుడు మృతి చెందాడని, తమకు అండగా ఉంటుందనుకున్న కుమార్తె ఈ రకంగా కనిపించకపోవడంపై కన్నీటి పర్యంతమవుతున్నారు. -
అదిరిపోయే కెమెరా, బ్యాటరీ ఫీచర్లు.. షావోమి నుంచి కొత్త ఫోన్
Xiaomi Note 11 Series Specifications: ఇండియాలో నంబర్ వన్ బ్రాండ్‌గా చెలరేగిపోతున్న షావోమి నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి రాబోతుంది. షావోమిలో సక్సెస్ఫుల్ మోడల్‌గా పేరున్న నోట్ నుంచి ఈ ఫోన్ రానుంది. షావోమిలో రెడ్మీ సిరీస్ తర్వాత ఎక్కువగా సక్సెస్ అయిన మోడల్ నోట్. వివిధ రకాల మోడళ్లను షావోమి తీసుకువచ్చినా నోట్ సిరీస్ మార్కెట్లో చెదరని ముద్ర వేసింది. అందుకే గత ఐదున్నరేళ్లుగా నోట్ సిరీస్‌ని క్రమం తప్పకుండా షావోమి కొనసాగిస్తోంది. ఈ పరంపరలో తాజాగా నోట్ 11 సిరీస్‌ని ఇండియాలోకి తేబోతున్నట్టు షావోమి ప్రకటించింది. ఫ్రిబవరిలో ఈ కామర్స్ సైట్స్‌లో ఈ ఫోన్ అమ్మకానికి రానుంది. వివిధ వేరియంట్లు, ఫీచర్లను బట్టి ఈ ఫోన్ ప్రైస్ రేంజ్ రూ.13,400ల నుంచి రూ.22,400 వరకు ఉంది. షావోమి నోట్ 11 సిరీస్ ఫీచర్లు - కెమెరా 50/104 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా (రియర్) - 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33/67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ - స్ల్పాష్ ప్రూఫ్ 53 సర్టిఫికేట్, - 90/120 హెర్జ్, అమోల్డ్ డిస్ప్లే - మీడియాటెక్ హెలియో జీ 96 చిప్ (5జీ ఫోన్‌కి స్నాప్‌డ్రాగన్ 695 చిప్) - నోట్ 11 సిరీస్‌లో నోట్ 11 ఎస్, నోట్ 11 ప్రో, నోట్11 ప్రో5జీ వేరియంట్లు ఉన్నాయి - ప్రో, ఎస్ వేరియంట్లలో హైఎండ్ ఫీచర్లు లభిస్తాయి. - 5జీ నెట్వర్క్ సపోర్ట్ చేస్తుంది - డ్యూయల్ స్పీకర్స్, 3.5 ఎంఎం ఆడియో జాక్ - 1 టీబీ వరకు మెమెరీ పెంచుకునే అవకాశం చదవండి: చైనా మొబైల్ కంపెనీలకు యాపిల్ షాక్! -
కుటుంబం ఆత్మహత్య.. సంచలనంగా మారిన సూసైడ్ నోట్
-
కుటుంబం ఆత్మహత్య కేసు.. సూసైడ్ నోట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడి పేరు?
సాక్షి, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో సూసైడ్ నోట్ సంచలనంగా మారింది. సూసైడ్ నోట్లో టీఆర్ఎస్కు చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడి పేరు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో వనమా రాఘవేందర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పాల్వంచ ఎఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ప్రస్తుతం వనమా రాఘవేందర్ పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నామని తెలిపారు. సూసైడ్ లెటర్లో రామకృష్ణ తల్లి సూర్యవతి, అక్క మాధవీ పేర్లు కూడా ఉన్నాయనీ.. ఘటనపై పూర్తి విచారణ జరుగుతుందని ఎఎస్పీ తెలిపారు. చదవండి: భార్యతో వివాహేతర సంబంధం.. భర్త, మరో ముగ్గురు కలిసి.. పాత పాల్వంచ పరిధిలోని ఒక ఇంట్లో గ్యాస్‌లీక్ చేసుకుని కుటుంబం సాముహిక ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. నాగ రామకృష్ణ, శ్రీలక్ష్మి దంపతులు. వీరికి సాహితి, సాహిత్య అనే ఇద్దరు పిల్లలు. నాగ రామకృష్ణ మీ సేవాలోఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఘటనలో దంపతులతో సహా చిన్న కూతురు సజీవ దహనమయ్యారు. మరో కూతురుని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. -
అలాంటప్పుడు.. తాళం ఎందుకేసుకున్నావయ్యా!!
ఈ దొంగ చాలా డీప్‌గా హర్ట్ అయ్యాడండీ.. పాపం!! ఎంతగా నొచ్చుకున్నాడంటే సాటి ఏ దొంగకీ ఈ పరిస్థితి దాపరించకూడదని తిరిగి వెళ్తూ.. తాను వచ్చి వెళ్లినట్లు ఆనవాళ్లు కూడా వదిలివెళ్లాడు. అసలేం జరిందంటే.. దొంగన్నాక కన్నం వేయాలి.. కన్నం వేయాలంటే కష్టపడి తాళం పగలగొట్టాలి... విలువైన ధనం, బంగారం ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టాలి.. మూడో కంటికి కనిపించకుండా ఉడాయించాలి! మామూలు కష్టం ఉండదు. కాకపోతే ఇప్పుడు మీరు తెలుసుకోబోయే దొంగ మాత్రం కొంచెం భిన్నంగా నిజాయితీ పరుడైన డిప్యూటీ కలెక్టర్ ఇంటిని దోచుకోవడానికి ఎంచుకున్నాడు. ఐతే ఎప్పటిలాగానే దొంగగారు ఇంటితాళం పగులగొట్టాడు. లోపలికి ప్రవేశించాడు. ఎంతవెతికినా ఏమీ దొరకలేదు. చిర్రెత్తిపోయిన ఆ దొంగ వెళ్తూ వెళ్తూ ఒక ఉత్తరం ఆ ఇంట్లో రాసి పెట్టి మరీ వెళ్లాడు. ఇంతకీ ఆ ఉత్తరంలో ఏముందనేగా మీ సందేహం! ‘మీ ఇంట్లో డబ్బు లేనప్పుడు తాళం వేయడం ఎందుకు కలెక్టర్?’ అని ఆ నోట్లో రాసి ఉంది. ఈ హాస్యాస్పదమైన సంఘటన మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లా, త్రిలోచన్ గౌర్లో ఉన్న డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో తాజాగా చోటుచేసుకుంది. ఈ ఇంటి సమీపంలోనే పోలీసు సూపరింటెండెంట్ ఇల్లు కూడా ఉంది. ఇంత సాహసోపేతమైన పనికి ఒడిగట్టిన దొంగ, అతను రాసిన ఉత్తరం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఐతే లోకల్ అథారిటీస్ మాత్రం దీనిని ఒక ఛాలెంజ్‌గా స్వీకరించి, ఆ ఘరానా దొంగను పట్టుకునేందుకు తీవ్రంగా వెతుకుతున్నారు. చదవండి: Lahores Heera Mandi: హీరా మండి చీకటి చరిత్ర.. ఎన్నో ఆసక్తికర విషయాలు.. -
అత్యున్నత పురస్కారం: తలైవా భావోద్వేగం
సాక్షి, చెన్నై: ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. 2020 సంవత్సరానికిగాను తనను అత్యుత్తమ పురస్కారానికి ఎంపిక చేయడంపై తలైవా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనగురువు, సోదరుడుతోపాటు సినీ పరిశ్రమలోని పెద్దా చిన్నా, కేంద్ర, రాష్ట్ర రాజకీయ నేతలతోపాటు, స్నేహితులు, అభిమానులు అందరికీ పేరు పేరునా అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. (రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు) ముఖ్యంగా తనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినందుకుగాను ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, జ్యూరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన స్నేహితుడు రాజ్ బహదూర్, తనలోని నటనా నైపుణ్యాన్ని గుర్తించిన బస్ డ్రైవర్, తన ఉన్నతికి కారణమైన సోదరుడు రావు గైక్వాడ్‌తో పాటు తనను రజనీకాంత్‌గా సినీ పరిశ్రమకు పరిచయం చేసిన గురువు కే బాలచందర్ కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు తన దర్శకులు,నిర్మాతలు, టెక్నీషియన్లు, మీడియాకు, తమిళ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఈ అవార్డు అంకితమని రజనీ ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, అలాగే ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్, తన సహ నటుడు కమల్‌హాసన్, ఇతర రాజకీయ నాయకులు, హితులు, సన్నిహితులందరికీ ఆయన స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. కాగా భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతీసంవత్సరం ఇచ్చే పురస్కారాన్ని రజనీకాంత్‌కు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. రజనీకి ఈ అవార్డును ఇవ్వాలన్న జ్యూరీ నిర్ణయాన్ని కేంద్రం ఆమోదించిందని కేంద్రమంత్రి ప్రకాష్ జవడేకర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ, ఇతర రంగ ప్రముఖుల నుంచి ఆయనకు అభినందనల వెల్లువ కురుస్తోంది. భారతీయ సినిమా పితామహుడుగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో 1963లో ఈ అవార్డును ప్రారంభించారు. అయితే దివంగత పాపులర్ నటుడు శివాజీ గణేషన్, దర్శకుడు కె.బాలచందర్ తర్వాత ఈప్రతిష్టాత్మక అవార్డును పొందిన తమిళ సినీ రంగానికి చెందిన మూడవ వ్యక్తిగా రజనీకాంత్ నిలిచారు. My heart is so full! 😊 @rajinikanth sir♥️#DadasahebPhalkeAward pic.twitter.com/YrNbq26rZM — Nivetha Thomas (@i_nivethathomas) April 1, 2021 -
సూసైడ్ నోట్ రాసి.. ఉద్యోగి శ్రీనివాస్ కనిపించకుండా పోయారు..
-
విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి సూసైడ్ నోట్ కలకలం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి సూసైడ్ నోట్ కలకలం సృష్టించింది. సూసైడ్ నోట్ రాసి.. ఉద్యోగి శ్రీనివాస్ కనిపించకుండా పోయారు. సాయంత్రం 5:49 నిమిషాలకు ఫర్నేస్‌లో దూకి అగ్నికి ఆహుతి కాబోతున్నట్లు లేఖలో పేర్కొనడంతో కార్మికులు ఆందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. గాజువాక సింహగిరి కాలనీలో నివాసముంటున్న శ్రీనివాస్.. స్టీల్ ప్లాంట్‌లోని వ్తెర్ రాడ్ మిల్ విభాగంలో టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో స్టీల్ ప్లాంట్‌ను స్ట్రేటజిక్ సేల్ ప్రకటన రావడంతో శ్రీనివాస్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కార్మికులు చేపట్టిన నిరసన దీక్షలు 35 రోజులు దాటినా కేంద్రం దిగి రాకపొవడంతో ప్లాంట్ ప్రైవేట్ పరమవుతుందని ఆందోళన చెందిన శ్రీనివాస్.. ఈ క్రమంలో రాత్రి ‘సి’ షిఫ్ట్‌కు వెళ్ళారు. అక్కడే సూస్తెడ్ నోటు రాసి అందరికీ షేర్ చేసాడు. ఆందోళన చెందిన కార్మికులు వ్తెర్ రాడ్ మిల్స్, ఫర్నేష్ ప్రాంతాల్లో ఆరా తీశారు. అదే సమయంలో పోలీసులు కూడా విచారణ ప్రారంభించారు. ప్లాంట్‌లోనే శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. చదవండి: భర్త చేష్టలతో విసుగుచెంది... బిడ్డల గొంతునులిమి చంపేశా.. నన్నెందుకు బతికించారు -
రెడ్మి నోట్ 10 స్మార్ట్ఫోన్లు వచ్చేసాయ్!
సాక్షి, ముంబై: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెడ్మి నోట్ 10 సిరీస్‌ను చైనా మొబైల్ దిగ్గజం షావోమి భారత్‌లో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా రెడ్ మీ నోట్ 10, రెడ్ మీ నోట్ 10 ప్రో, రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ఫోన్లు లాంచ్ చేసింది. రెడ్మీ నోట్ 10 సిరీస్ ఫోన్ల ధరలు రూ .11,999 , రెడ్మి నోట్ 10 ప్రో రూ .15,999 , ప్రో మాక్స్ రూ .18,999 వద్ద ప్రారంభమవుతుంది. అత్యంత ఖరీదైన 8 జీబీ ర్యామ్, 128 జీబీ వెర్షన్ వెర్షన్ రెడ్మీ నోట్ 10 ప్రో మాక్స్ వేరియంట్ ధర రూ .21,999 గా కంపెనీ నిర్ణయించింది. రెడ్మి నోట్ 10 ప్రో మాక్స్‌లో శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎం2 108 ఎంపీ, 5 ఎంపి సూపర్ మాక్రో కెమెరాలను వెనుక భాగంలో అమర్చడం ప్రధాన హైలైట్‌గా నిలిచింది. ధరలు, అమ్మకం రెడ్మి నోట్ 10 ప్రో మాక్స్: అమ్మకం మార్చి 18 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ధర రూ .18,999 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ధర రూ .19,999 8 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్‌ధర రూ .21,999 రెడ్మి నోట్ 10 ప్రో మాక్స్ ఫీచర్లు 6.67అంగుళాల డిస్ప్లే ఆండ్రాయిడ్ 11 1080x2400 పిక్సెల్స్‌రిజల్యూషన్ 732 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ 16ఎంపీ సెల్ఫీ కెమెరా 108+ 8+ 5+2 ఎంపీ రియర్ కెమెరా 5020 ఎంఏహెచ్ బ్యాటరీ రెడ్మి నోట్ 10 ప్రో: అమ్మకం మార్చి 17 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ .15,999 6 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్‌ధర రూ .16,999 8 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్‌ధర రూ .18,999 రెడ్మి నోట్ 10 ప్రో ఫీచర్లు 6.67 అంగుళాల డిస్ప్లే ఆండ్రాయిడ్ 11 732 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 64+ 8+ 5+ 2 ఎంపీ రియర్ కెమెరా 5050 ఎంఏహెచ్ బ్యాటరీ రెడ్మి నోట్ 10: అమ్మకం మార్చి 16 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ .11,999 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ .13,999 రెడ్మి నోట్ 10 ఫీచర్లు 6.43 అంగుళాల డిస్ప్లే 678 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 11 1080x2400 పిక్సెల్స్ రిజ్యలూషన్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీకెమెరా 48+8+2+2 ఎంపీ రియర్ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ -
బీజేపీ ఎమ్మెల్యే మృతి: సూసైడ్ నోట్ లభ్యం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ రే అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనలో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే మృతదేహం చొక్కా జేబులో సూసైడ్ నోట్ లభించినటట్లు పోలీసులు తెలిపారు. తన మృతికి ఇద్దరు వ్యక్తులు కారణమని, ఆ ఇద్దరు వ్యక్తులు తన మృతికి బాధ్యత వహించాలని ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ సూసైడ్ నోట్లో రాసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసును అన్ని కోణాల్లో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. (బీజేపీ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి) ఉత్తర దినాజ్‌పూర్‌లోని బిందాల్ గ్రామం సమీపంలో ఉన్న మార్కెట్లో ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ ఉరివేసుకుని మృతి చెందిన ఘటన సోమవారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి ఒంటి గంటకు ఎమ్మెల్యేను కొంత మంది వ్యక్తులు పిలిచారని, అతనిది ఆత్మ హత్య కాదని ఎవరో కావాలని హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇక ఎమ్మెల్యే మృతి హత్యా? ఆత్మహత్య? అని పలు అనుమానాలు వ్యక్తం అవుతుతున్నాయి. ఆయన మృతిపై ఇంకా స్పష్టత రాలేదు. ఎమ్మెల్యే మృతి కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ నేత రాహుల్ సిన్హా డిమాండ్ చేశారు. దేబేంద్ర నాథ్ మృతి వెనక తృణమూల్ కాంగ్రెస్ హస్తం ఉందని తీవ్రంగా ఆరోపించారు. మృతికి సంబంధించిన నిజాలు బయటకు రావడానికి సీబీఐ దర్యాప్తుకు అనుమతించాని సీఎం మమతా బెనర్జీని కోరుతున్నట్లు తెలిపారు. -
పోయిన నోటు
ఒక పెద్ద మనిషి ఓ బ్యాంకులోంచి డబ్బులు తీసుకుని డబ్బుల పెట్టెను భుజాన వేసుకుని ద్విచక్రవాహనంలో వెళ్తున్నాడు. ఆ పెట్టెలో వంద రూపాయల కట్టలు దాదాపు వంద ఉన్నాయి. అయితే మార్గమధ్యంలో గతుకుల రోడ్డుపై వెళ్తుండడంతో పెట్టె మూత కొద్దిగా తెరచుకుంది. అందులోంచి ఓ వంద రూపాయల కట్ట కింద పడిపోయింది. అది చూసుకోకుండానే అతను వేగంగా వెళ్ళిపోతున్నాడు. కిందపడిన నోట్ల కట్టలోంచి ఒక్క నోటు మాత్రం బయటికొచ్చి గాల్లో ఎగిరెళ్ళి కాస్తంత దూరంగా పడిపోయింది. ఆ నోటు పడిన పక్కగా ఒకతను నడుచుకుంటూ వచ్చాడు. అతను ఆ ఒక్క నోటూ తీసుకుని దగ్గర్లో ఉన్న ఇరానీ కేఫ్‌కి వెళ్ళాడు. ప్లేటు దోసె, ప్లేటు ఇడ్లీ తిని, ఒక కాఫీ తాగాడు. ఆ తర్వాత అక్కడికి దగ్గర్లో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళాడు. అక్కడి హుండీలో ఓ పదిరూపాయల నోటు వేసి, దేవుడికి కృతజ్ఞతగా దణ్ణం పెట్టుకున్నాడు.సంతోషంతో ఇంటికి చేరాడు.పడిపోయిన నోట్ల కట్టలో 99 అక్కడే ఉన్నాయి. ఆ దార్లో కాస్సేపటికి ఒకడు వచ్చాడు.అతను ఆ నోట్ల కట్ట తీసుకున్నాడు. వెంటనే లెక్కపెట్టాడు.వంద రూపాయల నోట్లు 99 ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ లెక్కించాడు.ఎన్నిసార్లు లెక్కించినా 99 ఉన్నాయి. బ్యాంకులో 99 నోట్లున్న కట్ట ఇవ్వరు. కనుక మిగిలిన నోటు ఆ పక్కనే ఎక్కడో పడి ఉండవచ్చని అనుకుని వెతకడం మొదలుపెట్టాడు.చాలాసేపు వెతికాడు. కానీ ఫలితం లేకపోయింది. అయినా వెతుకులాట మానలేదు. ఈ కథను చెప్పి గురువు ఫకాలున నవ్వాడు.ఒక్కనోటు దొరికిన వ్యక్తి దర్జాగా హోటల్ కు వెళ్ళి ఇడ్లీ తిన్నాడు. కాఫీ తాగాడు.కానీ 99 నోట్లు దొరికిన వ్యక్తి వాటిని ఖర్చు పెట్టుకోక మరో నోటు కోసం వెతకడం మొదలుపెట్డాడు.మనలో చాలా మంది ఈ తరహానే.లభించిన దానినో ఉన్నదానినో అనుభవించరు. దాంతో తృప్తిపడరు.లేని దానికోసం బుర్రలు పాడుచేసుకుంటారు. ఉన్నదాని పట్ల శ్రద్ధ ఉండదు. దేహం ఓ వైపు లాగుతుంటే మనసు మరోవైపు పోతుంటుంది. ఈ రెండింటి మధ్య సమన్వయం లేకుంటే ఎంతున్నా అసంతృప్తి తప్పదు.– యామిజాల జగదీశ్ -
రఫేల్ రగడ : ఎయిర్ మార్షల్ సిన్హా వివరణ
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందంలో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని నిరూపించే క్రమంలోనే రక్షణ మంత్రిత్వ శాఖ నోట్లో ఎంపిక చేసుకున్న భాగాన్ని ప్రచారంలోకి తెచ్చారని ఈ ఒప్పందంలో భారత్ తరపున సంప్రదింపులు జరిపిన ఎయిర్ మార్షల్ ఎస్పీబీ సిన్హా పేర్కొన్నారు. నోట్లో చెబుతున్న అంశాలేవీ భారత సంప్రదింపుల బృందానికి సంబంధం లేనివని ఆయన స్పష్టం చేశారు. భారత్ తరపున రఫేల్ ఒప్పందంపై ఫ్రాన్స్‌తో చర్చలు జరిపిన బృందం సభ్యులంతా ఎలాంటి విభేదాలకు తావులేకుండా ఏడుగురు సభ్యుల సంతకాలతో కూడిన తుది నివేదికను సమర్పించారని పేర్కొన్నారు. ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంలో అవినీతి నిరోధక క్లాజుకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ ఇప్పటివరకూ అమెరికా, రష్యాలతో ప్రభుత్వం-ప్రభుత్వం మధ్య ఒప్పందాలున్నాయని, ఫ్రాన్స్‌తో ఇది ఈ తరహా మూడవ ఒప్పందమని చెప్పారు. వీటిలో ఇలాంటి క్లాజ్ ఇంతవరకూ లేదని తేల్చిచెప్పారు. రఫేల్ ఒప్పందంపై పీఎంఓ ఫ్రాన్స్‌తో సమాంతర చర్చలు జరిపిందంటూ రక్షణ మంత్రిత్వ శాఖ నోట్‌ను ఓ జాతీయ పత్రిక వెల్లడించడంపై కాంగ్రెస్ సహా విపక్షాలు మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. పీఎంఓ సమీక్ష జోక్యంగా పరిగణించలేమని రఫేల్ ఒప్పందంపై అన్ని అంశాలను ప్రభుత్వం పార్లమెంట్, న్యాయస్ధానాల ముందుంచిందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ విపక్షాలకు దీటుగా బదులిచ్చారు. -
పెద్దనోటు అదృశ్యం
చిత్తూరు అగ్రికల్చర్: రెండు వేల నోటు ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. పాత నోట్ల రద్దు తర్వాత కనిపించిన ఈ నోటు రానురానూ అదృశ్యమవుతోంది. బ్యాంకులో నగదు విత్‌డ్రా చేసుకుంటే రూ. 100 నోట్లను మాత్రమే చేతికిస్తున్నారు. చిన్న మొత్తాల నుంచి పెద్ద మొత్తాల వరకు ఈ నోట్లనే తీసుకోవాల్సి వస్తోంది. పెద్ద నోట్లు ఇచ్చే పరిస్థితి బ్యాంకుల్లో ప్రస్తుతం లేదు. జిల్లాలో 39 బ్యాంకులకు చెందిన 618 బ్రాంచిలున్నాయి. రోజూ దాదాపు రూ. 30 కోట్ల మేరకు లావాదేవీలు జరుగుతున్నాయి. ఏటీఎంల ద్వారా మరో రూ. 10 కోట్లకు పైబడి ఖాతాదారులు తీసుకుంటున్నారు. ఏటీఎంల నుంచి తీసుకోవాలంటే పరిమితి పెట్టారు. దీంతో పెద్దమొత్తంలో నగదు కావాల్సిన ఖాతాదారులు బ్యాంకులకు వెళ్లాల్సిందే. బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో తీసుకోవాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. ఎక్కువగా వంద నోట్లే ఇస్తున్నారు. కాకుంటే రూ.200 నోట్లు ఇస్తున్నారు. దీంతో వీటిని తీసుకువెళ్లడం సమస్యగా మారింది. నోట్ల కట్టల భద్రత విషయంలోనూ ఆందోళన చెందుతున్నారు. ఆర్బీ నుంచి రూ.2 వేల నోట్ల సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్లు తెలిసింది. రూ.500 నోట్లు కూడా రావడం తగ్గిపోయింది. కొద్దో గొప్పో ఉన్నా అవి ఏటీఎంల ద్వారా మాత్రమే పొందే వీలుంది. ముద్రణ నిలిపివేత పది నెలల క్రితమే రూ.2 వేల నోట్ల ముద్రణను ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. రూ. 500 నోట్ల సరఫరాను కూడా పూర్తిగా తగ్గించినట్లు తెలిసింది. రూ.500 నోట్లు ఏటీఎంలకు పరిమితం చేసినట్లు చెబుతున్నారు. పాత నోట్ల రద్దు తర్వాత విడుదలైన రూ. 2 వేల నోట్లు నల్లకుబేరులకు వరంలా పరిణమించింది. విడుదలైన కొన్నాళ్లు మాత్రమే జనం చేతుల్లో చెలామణి అయింది. కొద్దికాలంలోనే పెద్దనోటు వాడకం తగ్గిపోయింది. సంపన్నవర్గాల చేతిలో ఇవి చిక్కుకున్నాయనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలకు నోట్ల కష్టాలు మళ్లీ దాపురించాయి. చిన్న మొత్తాలు తీసుకెళ్లాలన్నా ఇబ్బందే పెద్ద నోట్లు సరఫరా నిలిచిపోవడంతో చిన్న మొత్తాలను తీసుకెళ్లాలన్నా ఇబ్బందిగా ఉంది. బ్యాంకులో రూ. 10 వేలు డ్రా చేసినా చేతికి చిన్ననోట్ల కట్టలు అందిస్తున్నారు. దీంతో పెద్ద మొత్తంలో నగదు డ్రా చేసుకుంటే ముందస్తుగా సంచులు తీసుకెళ్లాల్సి వస్తోంది. – గురునాథరెడ్డి, కృష్ణంపల్లె ఏటీఎంలో రూ.500 మాత్రమే వస్తున్నాయి రూ. 500 నోట్లు ఏటీఎంలలో మాత్రమే వస్తున్నాయి. బ్యాంకుల్లో నగదు డ్రా చేసుకుంటే కేవలం రూ. 100 నోట్లు మాత్రమే చేతికిస్తున్నారు. పెద్ద మొత్తంలో నగదు డ్రా చేసుకున్నా రూ.2 వేల నోట్లు ఇవ్వడం లేదు. దీంతో బ్యాంకులను నుంచి నగదు తీసుకురావాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. – కారేటి గోవిందరెడ్డి, పెనుమూరు ఉన్న 2వేల నోట్లే చెలామణి అవుతున్నాయి కొత్తగా ఆర్బీఐ నుంచి రూ. 2 వేల నోట్లు రావడం లేదు. ఉన్న నోట్లే చెలామణి అవుతున్నాయి. ప్రస్తుతం 500, 200, 100 రూపాయల నోట్లు ఎక్కువగా చెలామణి అవుతున్నాయి. – లక్ష్మీ నారాయణ, జోనల్ మేనేజర్, ఇండియన్ బ్యాంక్ -
షావోమి స్మార్ట్ఫోన్లకు ఇక అది ఉండదు
షావోమి స్మార్ట్ఫోన్లకు 'నోట్' ట్యాగ్ చాలా ఫేమస్. రెడ్మి నోట్, రెడ్మి నోట్ 2, రెడ్మి నోట్ 3, రెడ్మి నోట్ 4 ఇలా పలు స్మార్ట్ఫోన్లను షావోమి మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే తాజాగా స్మార్ట్ఫోన్లకు ఉపయోగిస్తున్న ఈ 'నోట్' ట్యాగ్‌ను షావోమి తీసివేయాలని చూస్తుందట. షావోమి 'నోట్' పేరుకు స్వస్తి చెప్పబోతుందంటూ ఇప్పటికే పలు రిపోర్టులు కూడా విడుదలయ్యాయి. అంతేకాక రెడ్మి నోట్4కు సక్ససర్‌గా షావోమి రెడ్మి 5 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడం ఈ రిపోర్టులకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఎంఐ ఫోరమ్ 'సూపర్ మోడరేటర్' మిచ్002 ఈ విషయాన్ని తొలిసారి రివీల్ చేసింది. కానీ ఇప్పటి వరకు షావోమి నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రెడ్మి 5 ప్లస్‌తో పాటు రెడ్మి 5 స్మార్ట్‌ఫోన్‌ను కూడా షావోమి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు హ్యాండ్సెట్లు ఫుల్ వ్యూ డిస్ప్లే, 12 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, రెండు స్టోరేజ్ ఆప్షన్లను కలిగి ఉన్నాయి. త్వరలోనే ఈ రెండు స్మార్ట్ఫోన్లు భారత మార్కెట్లోకి కూడా రాబోతున్నాయి. రెడ్మి 5 ప్లస్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ 5.99 అంగుళాల ఫుల్ హెచ్‌డీప్లస్ డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ రెడ్మి 5 ఫీచర్లు 2జీబీ ర్యామ్, 16జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 3జీబీ ర్యామ్, 32జీబీ వెర్షన్ 5.7 అంగుళాల ఫుల్హెచ్డీ ప్లస్ స్క్రీన్ 3300 ఎంఏహెచ్ బ్యాటరీ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్ -
అరకొర ప్రింటింగ్‌తో రూ. 2వేల నోటు
కోవెలకుంట్ల: పట్టణంలోని ఆంధ్రబ్యాంకు ఏటీఎంలో మంగళవారం ఓ ఖాతాదారునికి అరకొర ప్రింటింగ్ ఉన్న రూ. 2వేల నోటు వచ్చింది. దొర్నిపాడు మండలం డబ్ల్యూ గోవిందిన్నెకు చెందిన ఇమాంఉసేన్ కోవెలకుంట్లలోని ఆంధ్రబ్యాంకు ఏటీఎం నుంచి రూ. 10వేలు డ్రా చేశాడు. ఐదు రెండు వేల నోట్లు బయటకు రాగా ఒక నోటుకు ఒక వైపు సరిగా ప్రింట్ కాని విషయాన్ని గుర్తించి అవాకయ్యాడు. ఆంధ్రబ్యాంకు మేనేజర్ గిరిధర్ దృష్టికి తీసుకెళ్లగా ఆ నోటును తిరిగి అక్కడే జమ చేయాలని ఆయన సూచించారు. -
పెద్ద నోట్ల జమ.. ఆపై విత్‌డ్రాలు
ముమ్మిడివరం పోస్టు ఆఫీసులో పోస్టల్ అసిస్టెంట్ నిర్వాకం రూ.4 లక్షలు రికవరీ... ఉద్యోగి సస్పెన్షన్ అమలాపురం టౌన్ : పెద్ద నోట్ల రద్దును కొంతమంది అక్రమార్జనలకు వినియోగించుకుంటున్నారు. ‘పెద్దల పద్దు’ల సేవలో మురిసిపోతున్న వారిపై వేసిన వలలో ఒక్కొక్కక్కరుగా చిక్కుతున్నారు. ముమ్మిడివరం సబ్ పోస్టు ఆఫీసులో సతీష్ అనే పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగిపై విచారణ చేపట్టగా రూ.4 లక్షలు పెద్ద నోట్లను తనకు తెలిసిన కొందరి పొదుపు ఖాతాల్లో డిపాజిట్ చేసి ఆనక విత్ డ్రా చేసుకున్నట్లు తేలింది. దీంతో ఉద్యోగి సతీష్‌ను సస్పెండ్ చేసి అక్రమంగా మార్చిన రూ.4 లక్షల పెద్ద నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అమలాపురం పోస్టల్ అధికారులు ముమ్మిడివరం తంతి తపాల కార్యాలయానికి వెళ్లి సదరు ఉద్యోగి అక్రమ డిపాజిట్లపై విచారణ చేపట్టారు. ఈ విషయం పది రోజుల కిందటే జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ ఉద్యోగి చనిపోయిన వారి ఇద్దరి అకౌంట్లలో ఫోర్జరీ సంతకాలతో రూ.24 వేలు వంతున వేసి డ్రా చేసుకున్నట్లు కూడా విచారణలో వెల్లడైంది. విశాఖ పోస్టల్ రీజయన్ పోస్టు మాస్టర్ జనరల్ శ్రీలక్ష్మి కోనసీమ పర్యటనకు వచ్చినప్పుడు ఆ తప్పిదం బయట పడటంతో ఆమె ఇలాంటి అక్రమాలు ఎక్కడైనా జరుగుతున్నాయామోనన్న అనుమానంతో అన్ని పోస్టు ఆఫీసుల్లో ప్రత్యేక తనిఖీలు కూడా చేయిస్తున్నారు. దీనికి పోస్టల్ విజిలెన్స్ స్క్వాడ్లు ఈ తరహా అక్రమాలపై ప్రత్యేక నిఘాతో జిల్లాలో తనిఖీలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ స్క్వాడ్ బుధవారం అమలాపురం, నగరం తదితర ప్రాంతాల్లోని పోస్టు ఆఫీసుల్లో తనిఖీలు చేశాయి. -
కధనరంగమే
పండుటాకుల పడిగాపులు పింఛన్ల కోసం బ్యాంకుల వద్ద క్యూలు తోపులాటలతో పలువురికి గాయాలు పింఛన్ లబ్ధిదారులకు రెండు ఖాతాలు నగదు ఎందులో పడిందో తెలియక అవస్థలు మిగిలినవారి పరిస్థితీ ఇదే తీరు వణికించే చలిలో పండుటాకులు పింఛన్ డబ్బుల కోసం ఇల్లు వదిలి బ్యాంకుల ముందు బారులుదీరుతున్నారు. కొండంత కష్టాన్ని సైతం లెక్కచేయకుండా గంటలతరబడి నిలబడలేక కూలబడుతున్నారు. ఐదొందలైనా చేతికి చిక్కితే మందులకు ఉపయోగించుకోవాలన్న తపన సాయంత్రమైనా అక్కడినుంచి కదలనీయడం లేదు. పడిలేచైనా పది రూపాయల డబ్బులైనా తీసుకువెళ్లలేకపోతానా అనే ఆశ అడియాశలుగానే మిగిలిపోతోంది. సాక్షి, రాజమహేంద్రవరం: తమ ఖాతాల్లో పడిన పింఛన్ నగదు తీసుకునే సరికి పండుటాకులు నరకం చూస్తున్నారు. పింఛన్ కోసం ఖాతా పుస్తకాల దుమ్ము దులిపి, బ్యాంకులవైపు అడుగులు వేస్తున్నారు. డెబిట్, రూపే కార్డులు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాంకులకు వెళ్లాల్సి వస్తోంది. నగదు కొరత కారణంగా అక్కడ భారీ క్యూలు ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే బారులుదీరుతున్నారు. పది గంటలకు బ్యాంకు తెరవగానే ఒక్కసారిగా తోపులాటలు జరుగుతున్నాయి. సోమవారం కాకినాడలోని జగన్నాథపురం ఎస్బీఐ బ్యాంకు వద్ద తోపులాట చోటుచేసుకుంది. ఉదయం నుంచి వేచిఉన్న వృద్ధులు బ్యాంకు గేటు తెరవడంతో ఒక్కసారిగా లోపలికి వెళ్లే ప్రయత్నంలో ఈ తోపులాట చోటుచేసుంది. పలువురు వృద్ధులు కిందపడడంతో గాయాలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ధవళేశ్వరం ఎస్.బి.ఐ వద్ద కిలోమీటర్ మేర క్యూలో నిలుచున్నారు. కాతేరు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రాంగణం వృద్ధులతో కిటకిటలాడింది. గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకులన్నీ పింఛన్‌దారులతో కిక్కిరిసి ఉన్నాయి. బ్యాంకు సిబ్బంది ద్వారాల వద్ద నిలుచొని విడతలవారీగా వృద్ధులను బ్యాంకులోని పంపిస్తున్నారు. పలు బ్యాంకుల వద్ద షామియానాలు లేకపోవడంతో ఎండకు పండుటాకులు సొమ్మసిల్లిపడిపోయారు. చెలామణిలో లేకపోవడంతో సమస్య జిల్లాలో 47.5 లక్షల మంది పింఛన్‌దారులున్నారు. వీరికి ప్రతి నెల రూ.52 కోట్లు పంపిణీ చేస్తున్నారు. పెద్దనోట్ల రద్దు వల్ల ప్రతి నెలా చేతికి ఇచ్చే పింఛన్ నగదు ఈ నెల నుంచి లబ్ధిదారులు బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నారు. వృద్ధులకు బ్యాంకు ఖాతాలున్నా లావాదేవీలు జరపకపోవడంతో అవి చెలామణిలో లేవు. ఇక్కడే అసలు సమస్య తలెత్తుతోంది. ఇప్పటికిప్పుడు ఖాతాను చెలామణిలో పెట్టుకుని, నగదు తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇందుకోసం గుర్తింపు కార్డుల నకళ్లు కోసం జిరాక్స్ సెంటర్‌కు, కొత్త పాస్ ఫొటో కోసం స్టూడియోలకు వెళుతున్నారు. బ్యాంకు అధికారులు తమవంతు సహాయంగా లబ్థిదారుల వద్ద ఖాతా చెలామణి అవసరమయ్యే పత్రాలు తీసుకుని వెంటనే నగదు ఇస్తున్నారు. ఇలా ఈ నెల ప్రారంభం నుంచి చేస్తున్నారు. పింఛన్ లబ్థిదారుల్లో దాదాపు 40 వేల మందికి ఖాతాలు లేవు. వీరందిరికీ ఖాతాలు ప్రారంభించాల్సి ఉంది. ప్రస్తుతం బ్యాంకులున్న పరిస్థితిలో ఇప్పటికిప్పుడు ఖాతాలు ప్రారంభించలేని పరిస్థితి. పలు బ్యాంకులు ఖాతా తెరవడానికి వస్తున్న వారి నుంచి పత్రాలు తీసుకుని 15 రోజుల తరువాత రావాల్సిందిగా సూచిస్తున్నారు. ఎప్పటికి అందేనో..? జిల్లాలో పలు బ్యాంకులకు చెందిన 756 బ్రాంచీలున్నాయి. వీటిలో అర్బన్ పరిధిలో 206, సెమీ అర్బన్‌లో 249, గ్రామీణ ప్రాంతాల్లో 302 బ్రాంచీలున్నాయి. జిల్లాలో 2011 లెక్కల ప్రకారం 1069 గ్రామ పంచాయతీలున్నాయి. అంటే ప్రతి మూడు గ్రామ పంచాయతీలకు ఒక బ్యాంకు ఉంది. జిల్లాలో ఉన్న 4.75 లక్షల పింఛన్‌దారుల్లో అధిక భాగం లబ్థిదారులు గ్రామాల్లోనే ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బ్యాంకులు చాలా చిన్నవిగా ఉంటాయి. అందులో సిబ్బంది కూడా తక్కువగా ఉంటారు. కొన్ని బ్యాంకుల్లో విత్‌డ్రాలు, జమలకు ఒకే కౌంటర్ ఉంటుంది. ఇతర లావాదేవీలు నిలిపివేసి బ్యాంకు పనివేళల్లో వృద్ధుల ఖాతాలు పరిశీలించి రోజుకు 100 మందికి పింఛన్లు ఇచ్చినా 302 బ్రాంచీలు 30,200 మందికి ఇవ్వగలవు. ఈ లెక్కన గ్రామీణ ప్రాంతాల్లోని పింఛన్ నగదు అందాలంటే దాదాపు 10 రోజుల సమయం పడుతుంది. తీవ్ర పని ఒత్తిడిలో బ్యాంకు సిబ్బంది... పెద్దనోట్ల రద్దు తర్వాత గత నెల 9వ తేదీ నుంచి బ్యాంకులు కిటకిటలాడాయి. పెద్దనోట్ల జమ, నగదు మార్పిడితో నెల మొత్తం గడిచిపోయింది.ఇప్పటికీ నగదు కొరత కారణంగా విత్‌డ్రా కోసం ప్రజలు బ్యాంకులకు పరుగెడుతున్నారు. దీంతోపాటు పింఛన్లు కూడా బ్యాంకుల నుంచి పంపిణీ చేస్తుండడంతో సిబ్బంది త్రీవమైన పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. -
స్వై...ప్ విహారం
క్యాషు పోయి... కార్డు వచ్చె... ఢామ్ ఢామ్ ఢామ్! నోటు పోయి... స్వైప్ వచ్చె... ఢామ్ ఢామ్ ఢామ్! బెంజికైనా... గంజికైనా... స్వైపేనోయ్... ఢామ్ ఢామ్ ఢామ్!! రెండు వారాల క్రితం... నవంబర్ 8వ తేదీ... రాత్రి... చెన్నైలోని ఓ పేరున్న రెస్టారెంట్లో కూర్చొన్న సురేశ్ తన ఫ్రెండ్‌తో మాట్లాడుతుండగా, టీవీలో వార్త బ్రేక్ అయింది... పెద్ద నోట్ల రద్దు అని! అర్ధరాత్రి 12 గంటలకి ఇంకా కొద్ది గంటలుంది. కాసేపయ్యాక బిల్ పే చేయడానికి ఖరీదైన రెండు వెయ్యి నోట్లు ఇచ్చిన సురేశ్‌తో, వెయిటర్ చాలా వినయంగానే చెప్పాడు... ఆ నోట్లు ఇక చెల్లవని! సర్కారు వారి కొత్త నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపబోతోందో సురేశ్‌కు ఆ క్షణం నుంచి క్రమక్రమంగా అర్థమవసాగింది. పన్నెండు రోజుల తరువాత రోజూ బ్యాంకులు, ఏ.టి.ఎం.లు, స్వైప్ మిషన్ మాత్రమే ఉన్న షాపుల చుట్టూ తిరగడాలతో... ఇప్పుడు సురేశ్ జీవితమే మారిపోయింది. ఇప్పటి దాకా వద్దనుకుంటూ వచ్చిన క్రెడిట్ కార్డుకు కొత్తగా అప్లై చేశాడు... పే టి.ఎం. లాంటి మొబైల్ వ్యాలెట్ల ద్వారా చెల్లింపులు ఎలా జరపాలో తెలుసుకుంటున్నాడు. 120 కోట్ల మంది భారతీయుల్లోని అధికశాతం సగటు భారతీయుల పరిస్థితికి సురేశ్ ఒక మచ్చుతునక. కార్డ్ ఈజ్ కింగ్! చలామణీలో ఉన్న పెద్ద నోట్లను ఉపసంహరిస్తూ, కొత్త నోట్లను ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో ఇప్పుడు ఏ బ్యాంకు చూసినా కిటకిటలాడే జనం. పాత నోట్లు మార్చుకోవడానికీ, కొత్త నోట్లు తెచ్చుకోవడానికీ గంటల కొద్దీ క్యూల్లోనే జీవితం గడిచిపోతోంది. పేపర్ మనీ నుంచి ప్లాస్టిక్ మనీ (డెబిట్ కార్డు, క్రెడిట్‌కార్డు) వైపు జనాన్ని నెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో ఇదీ ఒకటి. అందుకు తగ్గట్లే చేతిలో డబ్బులు, చిల్లర లేక ఇప్పుడు కార్డులు పట్టుకొని షాపులకూ, ఏ.టి.ఎం.లకూ వెళుతున్నవారు పెరుగుతున్నారు. పెట్రోల్ పోయించుకోవడం నుంచి ప్రతి కొనుగోలుకీ ఇప్పుడు కార్డులు స్వైప్ చేయడం, ‘పే టి.ఎమ్’ లాంటి మొబైల్ వ్యాలెట్లతో చెల్లించడం లేటెస్ట్ ట్రెండ్. ఒకప్పుడు ‘క్యాష్ ఈజ్ కింగ్’. కానీ, ఇప్పుడు మాత్రం ఇండియాలో ‘కార్డ్ ఈజ్ కింగ్’. ప్రభుత్వం దెబ్బతో ప్లాస్టిక్ మనీయే ప్రతి ఒక్కరికీ ఇప్పుడు ముద్దు అవుతోంది. ఇప్పుడంతా స్వై...ప్ విహారమే! క్యాష్ నై! నాన్-క్యాష్‌కే జై! నిన్నటి దాకా వారం వారం సంతలోనో, రైతుబజారుకో వెళ్ళి కూరలు కొనుక్కోవడం లలిత, కృష్ణకుమార్ దంపతులకు అలవాటు. కానీ, ఇప్పుడు చేతిలో ‘క్యాష్’ లేని ఈ దంపతులు ‘కార్డ్‌లు’ పట్టుకొని, స్పెన్సర్స్ వాళ్ళ ‘రిటైల్’, రిలయన్స్ వాళ్ళ ‘మోర్’ లాంటి సూపర్ మార్కెట్లలో కూరలు కొనుక్కోవాల్సి వస్తోంది. సరుకులకూ అదే పని చేయాల్సి వస్తోంది. ఇంటి నుంచి బయటకు రావడానికి వీలు లేకపోతే - ఆన్లైన్లో పచారీ సామాన్లు విక్రయించే ‘బిగ్ బాస్కెట్’ లాంటివి ఈ కరెన్సీ కష్టాల కాలంలో ఆపద్బంధువులయ్యాయి. విజయవాడ దగ్గర గ్రామం నుంచి హైదరాబాద్ వచ్చి మీడియా రంగంలో స్థిరపడ్డ 32 ఏళ్ళ కుమార్‌కు ఎప్పుడూ పచారీ కొట్టు నుంచి సరుకులు కొనుక్కోవడమే అలవాటు. కానీ, ఈ నవంబర్ మొదటి వారం నుంచి ‘కరెన్సీ కష్టాలు’ వెంటాడడంతో, ‘‘తొలిసారిగా నేను ఆండ్రాయిడ్ ఫోన్లో ‘బిగ్ బాస్కెట్’ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా. రూ. 2 వేల పైగా విలువైన నెలవారీ సరుకుల్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసి, కరెన్సీతో పని లేకుండా ఆన్లైన్లోనే వాళ్ళకు చెల్లింపు జరిపా’’ అని తన ఫోన్లో ఆ లావాదేవీ వివరాలు చూపించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ‘మొబైల్ బాస్కెట్’లో లావాదేవీలు గత నెలతో పోలిస్తే 20 నుంచి 22 శాతం పెరిగినట్లు ఆ సంస్థ అధిపతే స్వయంగా ప్రకటించారు. అన్ని చోట్లా కార్డ్ స్వైప్ మిషన్లే! ఒకప్పుడు కార్డ్ స్వైప్ మిషన్ల ద్వారా నగదు చెల్లింపులు నగరాల్లో, అదీ కొన్ని చోట్లే ఎక్కువగా కనిపించేది. కానీ, ‘పెద్ద నోట్ల కష్టా’లతో ఇప్పుడు కాలేజీ క్యాంటీన్లు, చిన్న స్థాయి వర్తకులు, టోకు వ్యాపారులు కూడా కొత్తగా కార్డ్ స్వైప్ మిషన్లు పెట్టుకుంటున్నారు. చివరకు నిన్నటి దాకా లావాదేవీలన్నీ కరెన్సీలోనే జరిగే తిరుచునాపల్లి, బొకారో, సింధుదుర్గ్, బీడ్ లాంటి చిన్నా చితకా టౌనుల్లో కూడా ఇప్పుడు ప్లాస్టిక్ మనీ లావాదేవీలకు వీలిచ్చే ఈ యంత్రాల కోసం క్యూ కడుతున్నాయి. ఇదే అదనుగా తీసుకొని ‘ఎల్.జి’ లాంటి కొన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థలైతే ఈ మిషన్లను తక్కువ వడ్డీకి, నెలసరి వాయిదాల్లో అమ్ముతామంటూ ఆఫర్లు ప్రకటించాయి. అందుకే, ఇప్పుడు పెట్రోల్ బంకుల లాంటి చోట్లే కాదు... కాస్తంత పెద్ద పాన్ షాపుల్లోనూ మిషన్లు కొత్తగా ప్రత్యక్షమవుతున్నాయి. ఇది డిజిటల్ ‘పే’ టైమ్! మారిన పరిస్థితులు, కస్టమర్లు ఖర్చుపెట్టే రీతిలో వస్తున్న మార్పులకు తగ్గట్లు మారుతున్న వినూత్న వ్యాపారులూ ఉన్నారు. చెన్నైలోని కోయంబేడు మార్కెట్లో కార్డ్ స్వైపింగ్ మిషన్ల ద్వారా కూరలకు డబ్బు చెల్లించే ఏర్పాట్లు వెలిశాయి. కేవలం కార్డులే కాదు... మొబైల్ వ్యాలెట్లతో నడుస్తున్న లావాదేవీలూ బోలెడు. ఢిల్లీలోని ‘డిజిటల్ ఛాయ్‌వాలా’ దగ్గర అయితే, 7 రూపాయల బిల్లు కూడా ఆన్లైన్లో చెల్లించే వసతి పెట్టారు. ఢిల్లీ ఆర్.కె. పురంలోని సెక్టార్ 9లో టీ స్టాల్ నడుపుతున్న రామ్ ప్రవేశ్ దగ్గరకు అక్టోబర్‌లో ‘పే టి.ఎం’ వాళ్ళు వచ్చారు. అప్పుడు ఆ వసతి వద్దన్న ఈ టీ స్టాల్ ఓనర్ పెద్ద నోట్ల రద్దు దెబ్బకి చిల్లర కటకట ఏర్పడడంతో, పిలిచి మరీ ‘పే టి.ఎం’ తీసుకున్నారు. ఆ షాపు ముందు డిజిటల్ వ్యాలెట్ ‘పే టి.ఎం’ కోసం ‘క్విక్ రెస్పాన్స్’ (క్యూ.ఆర్) కోడ్ అతికించారు. ఈ కొత్త వసతితో మొబైల్ వ్యాలెట్లు ఉన్న కాలేజీ కుర్రకారు సహా అందరూ పది రోజులుగా ఆ షాప్‌కి వెళుతున్నారు. డిజిటల్ విధానంలో చెల్లింపులకు వీలు కల్పించే స్టార్టప్‌ల సంఖ్య కూడా ఒక్కసారిగా పెరిగింది. మన దేశంలో అతి పెద్ద మొబైల్ పేమెంట్స్ కంపెనీ, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన ‘పే టి.ఎం’లో రద్దీ ఉన్నట్టుండి పెరిగింది. పెద్దనోట్ల రద్దు తర్వాత అందులో లావాదేవీల సంఖ్య ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 50 లక్షలకు చేరింది. తాజా మార్పుకు ఇదో పెద్ద నిదర్శనం. డబ్బులు దొరకడం, అందులోనూ చిల్లర దొరకడం మరీ కష్టంగా మారిపోయిన పరిస్థితుల్లో - ఇలా టెక్నాలజీ మీద పట్టున్న వర్గాలన్నీ ఇప్పుడు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డులు, పే టి.ఎం. వ్యాలెట్లే శరణ్యం అంటున్నాయి. కానీ, డబ్బు మూలుగుతున్న బడా బాబులకు ఎలాగూ కష్టం లేదు. ఈ డిజిటల్ లావాదేవీలు తెలిసిన చదువుకున్నవారికీ ఓకే. మరి, దేశంలోని 6 లక్షల పైగా గ్రామాల్లో బ్యాంకింగ్ వసతులు, ఏ.టి.ఎం.లు లేని, ఇంటర్నెట్ అంటే తెలియని సామాన్యులు, రైతులు, వృద్ధులు, బీదాబిక్కీ పరిస్థితి ఏమిటి? సర్కారు తీసుకొనే అనాలోచిత నిర్ణయాల స్వైరవిహారంలో వీళ్ళ గోడు వినేదెవ్వరు? చేతిలో డబ్బులు ఆడకపోవడంతో అందరూ ప్రత్యామ్నాయంగా ఆన్లైన్లోని అవకాశాల వైపు చూస్తున్నారు. దాంతో, పేమెంట్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవడం రెట్టింపు అయింది. కిరాణా షాపులు కూడా డిజిటల్ వ్యాలెట్ స్టార్టప్ సంస్థలతో చేతులు కలుపుతున్నాయి.‘పే టి.ఎం’, ‘మొబీ క్విక్’, ‘ఫ్రీ ఛార్జ్’ లాంటి మొబైల్ పేమెంట్ వ్యాలెట్లు, ‘చిల్లర్’ లాంటి మొబైల్ పేమెంట్ యాప్‌లకు ఆదరణ పెరుగుతోంది. ‘పే టి.ఎం’కు మొన్నటి దాకా 10 కోట్ల మంది యూజర్లు, రోజుకు 20 లక్షల లావాదేవీలే ఉండేవి. ఇప్పుడు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నవాళ్ళ సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఒకే రోజు 50 లక్షల లావాదేవీలు జరిగాయి. {పతి డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్ సంస్థా ఇప్పుడు ఆన్లైన్ కొనుగోళ్ళ కోసమే కాకుండా, ఆఫ్‌లైన్ లావాదేవీలకు కూడా జనం తమని వినియోగించేలా దృష్టి పెడుతున్నాయి. ‘ఓలా’, ‘ఉబర్’ లాంటి ట్యాక్సీ వసతుల అనుసంధాన సంస్థల్లో కూడా ఇప్పుడెక్కువగా నాన్-క్యాష్ లావాదేవీలే జరుగుతున్నాయి. ‘ఓలా’లో డిజిటల్ రీఛార్జ్‌లు కూడా 15% పెరిగాయి. కార్డుల భారతం! కోట్లలో... ► 72.8 ప్రస్తుతం మన దేశంలో ఉన్న డెబిట్ కార్డ్‌ల సంఖ్య. ► 2.7 ఇప్పుడు ఇండియాలో ఉన్న క్రెడిట్ కార్డ్‌ల సంఖ్య. ► ఈ కార్డుల్లో అత్యధిక భాగం మధ్యతరగతి, ఉన్నతాదాయ వర్గాలవే! ► దిగువ వర్గాల్లో పాస్టిక్ మనీ వాడకం చాలా అరుదు. జనాభా ఎక్కువ! ఏ.టి.ఎం.లు తక్కువ!! ► 2.2 లక్షలు ఇవాళ మన దేశంలో ఉన్న ఏ.టి.ఎం.ల సంఖ్య ► ప్రతి 10 లక్షల మందికీ అమెరికాలో అయితే 1500 ఏ.టి.ఎం.లున్నాయి. ► చైనాలో అయితే, 350 ఏ.టి.ఎం.లున్నాయి. ► కానీ, మన దేశంలో దాదాపు 130 ఏ.టి.ఎం.లే ఉన్నాయి. రాష్ట్రాల సంగతి వివరంగా చూస్తే... ► తమిళనాడు, గోవా లాంటి చోట్ల ప్రతి 2 వేల మందికీ ఒక ఏ.టి.ఎం. ఉంది. కానీ, బీహార్, ఉత్తర ప్రదేశ్ లాంటి ► చోట్ల ప్రతి 11 వేల మందికి కానీ ఒక ఏ.టి.ఎం. లేదు. కొత్త నోటు పెట్టాలంటే..! ► 30 వేలు ఇది ఇప్పటి దాకా కొత్త 2 వేల నోటుకు తగ్గట్లు ► మార్చిన ఏ.టి.ఎం.ల సంఖ్య. ► 12 వేలు ఇది ప్రతిరోజూ కొత్త నోటుకి తగ్గట్లు మారుస్తున్న ఏ.టి.ఎం.ల సంఖ్య. ► రూ. 10 వేలు ఒక్కో ఏ.టి.ఎం.ను ఇలా కొత్త నోటుకు తగ్గట్లు మార్చడానికయ్యే ఖర్చు. ► రూ. 200 + కోట్లు మొత్తం ఏ.టి.ఎం.లను ఇలా మార్చడానికి అవుతున్న ఖర్చు. - రెంటాల జయదేవ -
కొత్త నోట్ల పర్సుల సంచలనం...?
ముంబై: పెద్ద నోట్ల రద్దుతో దేశంలో కరెన్సీ సంక్షోభం ఒకవైపు కొనసాగుతుండగానే చైనా అప్పుడే రంగంలోకి దిగిపోయింది. ఆగండాగండి.. చైనా రంగంలోకి దిగిపోయింది..అంటే నకిలీ కరెన్సీతోనో.. నగదు మార్పిడికోసమో కాదు. కొత్త కరెన్సీ నోట్లకోసం ఆశగా ఎదురు చూస్తున్న భారతీయుల మనసు దోచుకునేందుకు చైనా తన మార్కెటింగ్ టెక్నిక్ ను మరోసారి బాగా వాడేసింది. దేశంలో చైనా వస్తువులను నిషేధించాలన్న వాదనలు కొనసాగుతుండగానే .. మన కొత్త రూ.500 రూ.2000 నోట్ల డిజైన్ తో పర్సులు మార్కెట్లలో దర్శనమివ్వడం ఆసక్తికరంగా మారింది. చవక వస్తువులతో దేశీయ వినియోగదారులను, మార్కెట్ ను కొల్లగొడుతున్న చైనా దేశీయ కొత్త కరెన్సీని పోలిన మహిళల వాలెట్స్ ను వినూత్నంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిందన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒక్క పక్క దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలలో నగదు కొరతతో ప్రజలు అష్ట కష్టాలుపడుతోంటే.. రూ.2000, రూ.500 నోట్లను పోలిన డిజైన్ తో వాలెట్స్ ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాదు మనం దేశం నోట్ల ముద్రణకు ఇబ్బందులు పడుతోంటే.. చైనా మాత్రం అపుడే పర్సులను రెడీ చేసిందన్న కమెంట్లు వెల్లువెత్తాయి. కాగా రూ.500 రూ.1000 నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై పలురంగాల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతుండగా... ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో పెద్దనోట్ల రద్దుపై శీతాకాల పార్లమెంట్ సమావేశాలు అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. -
నోటు పాట్లు
ఎక్కడ చూసినా రూ.500, రూ.1000 నోట్ల రద్దు పాట్లే కుదుపునకు లోనైన దైనందిన జీవనం పాలప్యాకెట్ల నుంచి మాత్రల వరకూ.. ఏం కొనాలన్నా ఇక్కట్లే పెద్ద నోట్లను తీసుకోమంటున్న వ్యాపారులు కనీస అవసరాలూ తీరక లబోదిబోమంటున్న జనం జిల్లాలో ఎవరిని కదిపినా, ఎవరి నోట విన్నా పెద్దనోట్ల రద్దు తెచ్చిన చిక్కులూ, ఇక్కట్లే. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతో పాటు అమలాపురం వంటి పట్టణాలు, గ్రామాలు, మారుమూల పలెల్లో..ఇలా జిల్లా అంతటా కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించిన రూ.500, రూ.1000 నోట్లంటేనే.. పోట్లగిత్తను చూసినట్టు బెదురుతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : నోట్ల రద్దుతో సామాన్య, మధ్యతరగతి వర్గాలకైతే దైనందిన జీవనం స్తంభించినట్టయింది. కేంద్రం మినహాయిం పునిచ్చిన పాలబూత్‌లు, మందుల షాపులలో సైతం పెద్దనోట్లు తీసుకోవడం లే దు. మంగళవారం అర్థరాత్రి వరకు వంద నోట్ల కోసం ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణలు చేసినా దొరక లేదు. తెల్లారి లేస్తే పాలప్యాకెట్ నుంచి కాయగూరలు, టీ, టిఫిన్, నిత్యావసర సరుకులు, తినుబండారాలు, రెస్టారెంట్లు, పెట్రోలు బంక్‌లు, పళ్ల దుకాణాల్లో ఎక్కడ చూసినా వంద నోటు ఉంటేనే సరుకు ఇస్తున్నారు. చేతిలో వంద నోట్లు లేక ఏమి చేయాలో దిక్కుతోచక జనం సతమతమవుతున్నారు. తమ వద్ద ఉన్న రూ.500, రూ.1000 నోట్లు బ్యాంక్‌లలో ఎప్పుడు జమ చేస్తాం, కొత్త నోట్లు ఎప్పుడు తిరిగి చేతికిస్తారు, అవసరాలు ఎప్పటికి తీరతాయని ఆందోళన చెందుతున్నారు. పెట్రోలు బంకులలో రూ.500 ఇచ్చి వంద రూపాయలకు పెట్రోలు పోయమంటే పోయడం లేదు. కావాలంటే రూ.500 పెట్రోలు పోస్తామనడంతో అందుకు సిద్ధపడ్డవారే పోయించుకున్నారు. అన్నవరం దేవస్థానంలో వ్రతాల కౌంటర్ వద్ద కూడా భక్తులకు ఇవే ఇబ్బందులు ఎదురయ్యాయి. పడిపోయిన వ్యాపారాలు నోట్ల చిక్కులతో జిల్లాలోసగానికి సగం వ్యాపారాలు పడిపోయాయి. ఇంతవరకూ వినియోగదారులు రూ.500 నోటు తీసుకువెళ్లి రూ.70 లేదా రూ.80 సరుకులు కొన్నా వ్యాపారులు తిరిగి చిల్లర ఇచ్చేవారు. ఇప్పుడు రూ.500 నోటు ఇచ్చినా అంత మొత్తానికీ సరుకులు తీసుకోమంటున్నారు. వినియోగదారుల నుంచి రూ.500 తీసుకుని అడిగిన సరుకులు ఇచ్చేస్తే ఆ నోట్లు హోల్‌సేల్ వ్యాపారికి ఇచ్చినా తీసుకోవడం లేదని వ్యాపారులంటున్నారు. వంద నోటు లేదా కొన్న సరుక్కి సరిపడా చిల్లర తెస్తేనే సరుకులు ఇస్తుండడంతో వ్యాపారాలు పడిపోయాయంటున్నారు. వంద నోట్లతో వ్యాపారం కోనసీమలోని అమలాపురం, అంబాజీపేట, కాకినాడ సహా పలు పట్టణాల్లో ఈ నోట్ల వ్యవహారాన్ని కూడా కొందరు వ్యాపారంగా మార్చేశారు. వంద నోట్లు ఉన్న వారు కమీషన్ వ్యాపారంగా సొమ్ము చేసుకుంటున్నారు. నెల, నెల, రోజువారీ వడ్డీవ్యాపారులు ఈ వ్యవహారంలో ముందున్నారు. వంద నోటుకు ప్రస్తుతం ఉన్న డిమాండ్‌ను బట్టి వెయ్యి రూపాయలకు వంద కమీషన్‌గా నిర్ణయించారు. కొందరు రూ.500 నోటు తీసుకుని రూ.450 ఇస్తున్నారు. తీసుకునే వారు రూ.50 పోతే పోయాయి ప్రస్తుతం అవసరం గట్టెక్కుతుందని సరిపెట్టుకుంటున్నారు. మందగించిన రిజిస్ట్రేషన్ లు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దశమి, ఏకాదశి రోజుల్లో సుమారు రోజుకి వెయ్యి వరకు రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. సుమారు రూ.3 కోట్లు లావాదేవీలు జరుగుతాయి. పెద్ద నోట్ల రద్దు, బ్యాంకులు సెలవు కావడం, ఏటీఎంలు పనిచేయకపోవడంతో బుధవారం రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలపోయాయి. జిల్లాలోని 32 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో సుమారు 100 నుంచి 150 రిజిస్ట్రేషన్లు మాత్రమే కాగా ఆదాయం సుమారు రూ.50 లక్షలు మాత్రమే వచ్చింది. శుభకార్యాలపైనా ప్రభావం పెద్దనోట్ల రద్దు ప్రభావం వివాహాది శుభకార్యాలపైనా కనిపించింది. కాకినాడ వినుకొండ వీధిలో గుండా వెంకటసత్యనారాయణ కుమార్తె వివాహానికని అన్నీ రూ.500 నోట్లు తెచ్చి ఇంటిలో పెట్టారు. తీరా ఇప్పుడు ఆ నోట్లు తిరిగి జమచేయాలనడంతో ఎప్పటికి తిరిగి సొమ్ములు చేతికొస్తాయా అని ఎదురుచూస్తున్నారు. కె.గంగవరం మండలం భట్లపాలికలో వడ్లపాటి వీరవెంకటసత్యనారాయణ కుమార్తె సూర్యకళకు ఈ నెల 15న వివాహం. పెళ్ళి కోసం రూ.50 వేలు అప్పు తెచ్చుకున్నారు. ఆ సొమ్మంతా రూ.500 నోట్లే. ముహూర్తం చూస్తే దగ్గరకు వచ్చేసిందని, ఏం చేయాలో పాలుపోవడం లేదని సత్యనారాయణ ఆందోళన చెందుతున్నారు. అందాలు చూసేందుకు వచ్చి అవస్థలు కోనసీమ అందాలను ఆస్వాదించేందుకు మహారాష్ట్ర నాగపూర్ యూనివర్సిటీ నుంచి నాలుగు కుటుంబాలు రాజమహేంద్రవరంలో రైలు దిగి అమలాపురంలో స్నేహితుడైన ప్రొఫెసర్ ఇంటికి వచ్చారు. ఇంతలో వారిని రూ.1000, రూ.500 నోట్ల రద్దు ఆందోళనలో పడేసింది. బుధవారం ఏటీఎంలు, బ్యాంకులు పనిచేయక, తమ వద్ద ఉన్న పెద్ద నోట్లు మారక, అవసరాలు తీరక ఆ నాలుగు కుంటుంబాలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యాయి. మారకంలో ‘నకిలీ సిరి’ మంతులు బిజీబిజీ నకిలీ కరెన్సీకి పెట్టని కోటలు జిల్లాలో చాలానే ఉన్నాయి. ప్రధానంగా రావులపాలెం, అనపర్తి, మండపేట, కాకినాడ తదిర ప్రాంతాల్లో దొంగనోట్ల వ్యాపారంలో కోట్లు గడించిన వారు అనేకులు ఉన్నారు. ఇప్పుడు అలాంటి వారు తమ వద్ద పనిచేసే ఉద్యోగుల ద్వారా డబ్బు మారకం పనిలో ఉన్నారని తెలుస్తోంది. -
నవ్వుల నోటు
అందమైన లోకం! ఈ అమ్మాయి మేఘ. మేఘా చక్రవర్తి. బెంగాలీ నటి. ఉండడం కోల్‌కతాలో. రెండేళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చింది. ఇండస్ట్రీలోకైతే వచ్చింది కానీ లైఫ్లోకే ఇంకా పూర్తిగా వచ్చినట్టు లేదు! అంటే వయసు పాతికేనని, ఇంకా పెళ్లి చేసుకోలేదనీ కాదు. లోకం పోకడ అనుభవం కాలేదని!! ఎవరైనా మనల్ని మోసం చేశారనుకోండి, ఎలా ఫీల్ అవుతాం? మోసం చేసినవాళ్ల మీద కోపం వస్తంది. మోసపోయినందుకు మన మీదా మనకు కోపం వస్తుంది. కానీ మేఘ నవ్వుకుంటోంది. తనకు జరిగిన మోసాన్ని గుర్తు చేసుకుని గుర్తు చేసుకుని మరీ చిన్న పిల్లలా నవ్వుకుంటోంది. అసలేం జరిగిందంటే.. మేఘ త్రీడేస్ బ్యాక్ పనిమీద ముంబై వచ్చింది. లేట్ నైట్ క్యాబ్ దొరక్కపోతే ఆటో ఎక్కింది. టైమ్ ఒంటి గంటైంది. ఒక్కటే ఆటోలో ఉంది. ఆమెకేం భయం వెయ్యలేదు. ఆటోవాలా సంస్కారవంతుడిలా ఉన్నాడు. అంత రాత్రప్పుడు అందమైన ముంబై లోకపు రంగుల్ని చూసుకుంటూ వెళ్తోంది మేఘ. చివరికి ఆమె దిగవలసిన చోటు వచ్చింది. దిగి, ఆటోకు డబ్బులు ఇచ్చేసింది. ఆటోవాలా ఆమెకు ఛేంజ్ ఇచ్చేశాడు. వంద నోటు, ఇంకా రెండు మూడు పదులు. తెల్లారే ఏదో అవసరమై ఆ వంద నోటు తీసింది మేఘ. అది దొంగ నోటు! చూడ్డానికి అచ్చం వందనోటులానే ఉంది కానీ, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండాల్సి చోట ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అని ఉంది. నవ్వుకుంది మేఘ. వన్ హండ్రెడ్ రుపీస్ అని ఉండాల్సిన చోట ‘వన్ హండ్రెడ్ కూపన్’ అని ఉంది. మళ్లీ నవ్వుకుంది మేఘ. ఇంకా.. ఐ ప్రామిస్టు పే.. అనే చోట ‘ఐ ప్రామిస్ టు ప్లే విత్ ద కూపన్ హండ్రెడ్’ అని, గవర్నర్ సంతకం ఉండే చోట ‘శాంతాక్లాజ్’ అని ఉంది. అన్నిటికీ నవ్వుకుంది మేఘ. ఇప్పటికీ దాన్ని దొంగనోటు అనడం లేదు. ఫేక్ నోట్ అని కూడా అనడం లేదు. మెమరబుల్ నోట్ అంటోంది. చిన్నప్పుడు లాలీపాప్‌లతో ఇలాంటివే గిఫ్ట్ ప్యాక్‌గా ఇచ్చేవారు అని గుర్తు చేసుకుంటోంది. -
రూ.500ల నోట్ల కట్టలో రూ. 100 నోటు..!
నేరేడుచర్ల : నేరేడుచర్లలోని ఎస్బీహెచ్ బ్యాంకులో రూ.500ల కట్టలో రూ.100 నోటు వచ్చింది. వివరాలు.. నేరేడుచర్ల మార్కెట్ కార్యదర్శి అమరలింగేశ్వరరావు మార్కెట్ సిబ్బంది వేతనాల కోసం స్థానిక ఎస్బీహెచ్ బ్యాంకులో రూ.3,73,475లు శనివారం డ్రా చేశాడు. అయితే అందులో రూ.500ల నోట్ల కట్టలో రూ.100ల నోటు కనిపించింది. దీంతో రామలింగేశ్వరరావు బ్యాంకు సిబ్బందిని అడగగా దురుసుగా మాట్లాడినట్లు వాపోయాడు. -
ఒక్కో స్టాల్.. ఒక్కో ప్రత్యేకత
ఒక్కో స్టాల్లో ఒక్కో ప్రత్యేకత. ఒక్కో పుస్తకం ఎన్నో అంశాల కలబోత. మొత్తంగా విజయవాడ పుస్తక మహోత్సవమే ఓ విజ్ఞాన భాండాగారంగా మారిపోయింది. ఎటుచూసినా పుస్తకాలే. ఎక్కడ విన్నా విజ్ఞానాన్ని పంచే విషయాలే. చిన్నారులు నేర్చుకునే అ..ఆ..ల నుంచి పెద్దల ఆధ్యాత్మిక పుస్తకాల వరకూ అన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏయే స్టాల్లో ఏ రకమైన పుస్తకాలు ఉన్నాయి? అనే వివరాలు మీకోసం ప్రత్యేకం.. - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి, విజయవాడ ‘నోట్’ దిస్ పాయింట్ బుక్ ఎగ్జిబిషన్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన స్టాల్ పెట్టడం ఇదే ప్రథమం. ఫైనాన్షియల్ లిటరసీ అనేది రిజర్వ్ బ్యాంకు ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగానే ‘మీ కరెన్సీ నోట్ గురించి తెలుసుకోండి..’ అనే అంశంపై ఇక్కడ ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. చిరిగిన నోట్లను వెనక్కు ఇవ్వడం ఎలా అనే విషయాలను వివరిస్తున్నారు. పెద్దపెద్ద బ్యాంకులు, సంస్థల పేర్లతో వచ్చే తప్పుడు మెయిల్స్‌ని గుర్తించడం ఎలా?, పైచదువుల కోసం విదేశాలకు వెళ్లేవారికి ఫారెన్ ఎక్స్ఛేంజ్పై అవగాహన, బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ స్కీమ్, ప్రైవేటు సంస్థల్లో అంటే నాన్‌బ్యాంకింగ్ రంగాల్లో డబ్బు పొదుపు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... వంటి ప్రధాన అంశాల గురించి ఉచితంగా బ్రోచర్లు పంచుతున్నారు. పదేళ్ల వయసు దాటిన పిల్లలు బ్యాంక్ అకౌంట్ తెరవడం ఎలా? ఏటీఎం కార్డు ఉపయోగించడం, చెక్ బుక్ వాడటం అన్నీ వివరిస్తున్నారు. ..ఈ వివరాలకు సంబంధించిన విషయాలను కామిక్ బుక్స్ రూపంలో పిల్లలకు అంటే 8, 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్నామని ఆర్బీఐ మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. తమ స్టాల్‌కు మంచి స్పందన వస్తోందన్నారు. -
డాక్టర్ సర్టిఫికెట్ ఉంటేనే..
మోడలింగ్ ప్రపంచంలో ముందుకు దూసుకుపోవాలంటే అందం, శరీర లావణ్యం ఉంటే సరిపోదని, ఆరోగ్యం కూడా ఎంతో అవసరం అని అంటున్నాయి ఫ్రాన్స్ చట్టాలు. జీరోసైస్ కోసం తిండీ తిప్పలూ మానేసి బక్క చిక్కిపోవడం అందంలోకి రాదని, మోడలింగ్ లో పాల్గోవాలంటే ఆరోగ్యకరమైన బరువు కలిగి ఉన్నట్లుగా డాక్టర్ సర్టిఫికెట్ కూడ తప్పనిసరి అంటూ ఫ్రాన్స్ కొత్త బిల్లును పాస్ చేసింది. మోడలింగ్ వృత్తిలోకి అడుగు పెట్టేవారు వారి శరీరాకృతికి తగ్గ బరువు కలిగి ఉండాలని సూచించింది. అంతేకాదు చట్టాన్ని ఉల్లంఘిస్తే ఆరు నెలల జైలు శిక్షతోపాటు 75 వేల యూరోల జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది. శరీరాకృతిని బట్టి బరువు ఉండాలంటూ పెట్టిన నిబంధనలపై గతంలో ఫ్యాషన్ ఇండస్ల్రీ... తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అయితే అప్పటినుంచీ ఆ విషయంపై చర్చలు కొనసాగుతుండగా... చివరికి శరీరాకృతిని బట్టి ఆ మోడల్ ఎంత బరువు ఉండాలి అనే విషయాన్ని డాక్టర్లే నిర్ణయించాల్సిందిగా చట్టసభ్యులు తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీలో ప్రవేశించాలంటే అందంతోపాటు ఆరోగ్యం... ఎత్తుకు తగ్గ బరువు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అతి సన్నగా ఉండి... అనోరెక్సియా, బులీమియాలకు ప్రచారం చేస్తున్నట్లుగా ఉండే కొలతలను ప్రోత్సహించడం నేరం అని, అలా చేసిన వారికి ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తామని గత బిల్లులో కూడ పొందుపరిచిన విషయం తెలిసినదే. అయితే ఫ్రాన్స్ లో సుమారు 30 నుంచి 40 వేల మంది ప్రజలు, కౌమార దశలో అనోరెక్సియా నెర్వోసా, ఈటింగ్ డిజార్డర్ వంటి వాటితో బాధపడుతున్నారు.దీంతో మరణాల రేటు కూడ తీవ్రంగా పెరుగుతోంది. ఇటువంటి అనేక కారణాలను పరిధిలోకి తీసుకున్న ప్రాన్స్ చట్టాలు ఇప్పుడు మోడల్స్ కూ డాక్టర్ సర్టిఫికెట్ అవసరమని తేల్చి చెప్పాయి. -
సూసైడ్ నోటు కలకలం
విశాఖపట్నం: గాజువాక జీవీఎంసీలో సూసైడ్ నోటు కలకలం సృష్టించింది. అసిస్టెంట్ జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మీకి సూసైడ్ నోటు ఇచ్చి ఆర్ఐ పడాలు వెళ్లిపోయింది. డిప్యూటీ కమిషనర్ వేధింపులు తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆర్ఐ అందులో పేర్కొన్నట్లు తెలిసింది. -
అక్కడనోట్లు,ఇక్కడ ఓట్లు -నయా ప్లాన్
-
పచ్చనోటు చెదిరిపోవునులే!
నోటు లేనిదే పూట గడవదు! మరి మనిషికి జీవితాన్నిస్తున్న ఆ నోటు జీవితకాలమెంత? దాని ప్రింటింగ్ ఖర్చు ఎంత? అనే ప్రశ్నలకు ఆర్టీఐ ద్వారా అర్జీ పెట్టాడో వ్యక్తి! అందుకు ఆర్బీఐ ఇచ్చిన వివరాలు ఆశ్చర్యం గొలుపుతున్నాయి. మనదేశంలో పచ్చనోటు జీవిత కాలం ఒక సంవత్సరం కంటే తక్కువ. ఇది ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే చాలా తక్కువ! దీనికి, నోటుపై పిచ్చిరాతలు రాయడం, జేబులో పెట్టినప్పుడు చెమటతో తడిసినలిగిపోవడం, పర్సులో నోట్లను అతి చిన్నవిగా మడవడం వంటి కారణాలనేకం. తెలిసో, తెలియకో చేసే ఈ పనులు ఆర్బీఐకి భారంగా పరిణమిస్తున్నాయి. 2013-14లో 13 ట్రిలియన్ల కరెన్సీ ప్రింటయితే... 11.9 ట్రిలియన్ల కరెన్సీ రిటైర్ అయింది. 13 ట్రిలియన్ల కరెన్సీ ముద్రించడానికి ఆర్బీఐ ఖర్చు చేసిన మొత్తం రూ.11,300 కోట్లు. రాష్ట్రాలకు రవాణా, పంపిణీ, భద్రత కోసం వెచ్చించే ఖర్చు ఇంకా అదనం. ప్రపంచవ్యాప్తంగా నగదు లావాదేవీలు పూర్తిగా తగ్గిపోయినా మన దేశంలో ఎక్కువస్థాయిలోనే జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో క్రెడిట్, డెబిట్ కార్డ్స్, ఎలక్ట్రానిక్ పేమెంట్స్ పెరిగినా ప్లాస్టిక్ మనీ వినియోగం పెరగాల్సి ఉంది. క్యాష్‌లెస్ ఎకానమీ దిశగా అడుగులువేస్తున్న స్వీడన్ తలసరి ఆదాయంలో బ్యాంక్ నోట్లు, కాయిన్ల రూపంలో ఉన్నది కేవలం 3 శాతమే. యూఎస్ఏ, కెనడా, సింగపూరుల్లో అధిక శాతం ఎలక్ట్రానిక్ బదిలీలే జరుగుతున్నాయి. 4.5 కోట్ల జనాభా కలిగిన కెన్యా సైతం 25 శాతం లావాదేవీలను మొబైల్ ద్వారానే జరుపుతోంది. -
రూపాయి నోటు మళ్లీ వస్తోంది..
రూపాయి నోటు చూసి ఎన్నేళ్లయ్యుంటుంది.. దశాబ్దం ముందు చూసుంటారు! రూపాయి నాణేలు వాడుకలోకి రావడంతో ఈ నోటు కనుమరుగైంది. కాగా రూపాయి నోటు సరికొత్తగా మరోసారి రాబోతోంది. 20 ఏళ్ల తర్వాత రూపాయి నోటును ముద్రించనున్నట్టు ఆర్థిక శాఖ మంత్రిత్వ వర్గాల సమాచారం. నోటుపై వాడే ఇండిగో రంగు బదులు.. గులాబీ, ఆకుపచ్చ రంగుల సమ్మేళనంతో రూపాయి నోటును ముద్రించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నోటుపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం చేయనున్నారు. కాగా మిగిలిన నోట్లపై యాధాతథంగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం చేస్తారు. రూపాయి నోటుపై 'భారత్ సర్కార్', 'గవర్నమెంట్ ఆఫ్ ఇండియా' పేర్లను ముద్రిస్తారు. అలాగే దేశంలోని 15 భాషల్లో రూపాయి విలువను నోటుపై మద్రించనున్నారు. -
పరిషత్ ప్రచారానికి తెర
సాక్షి, గుంటూరు: మలి విడత ‘స్థానిక’ ఎన్నికలకు ప్రచారం చివరిరోజు కావడంతో బుధవారం అన్ని రాజకీయ పార్టీలు హోరెత్తించాయి. బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం పరిసమాప్తం కావడంతో ఆయా పార్టీల తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులు, కార్యకర్తలు ఓటుకు నోటు, ప్రలోభాల పర్వంలో బిజీగా మారారు. పల్లెల్లో మద్యం, కాపు సారా ఏరులై పారిస్తున్నారు. ఓటర్లను మద్యం మత్తులో తేలుస్తున్నారు. రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఇంకా 24 గంటలే గడువుండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా వైఎస్సార్సీపీ, టీడీపీ నడుమే పోటీ ఉంది. ఓటుకు నోటునే నమ్ముకున్న టీడీపీ నేతలు గ్రామాల్లో ఓటర్లకు రూ.వెయ్యి వంతున పంపిణీ చేస్తున్నారు. మరో రూ.500 పోలింగ్ రోజున అందిస్తామని చెబుతున్నారు. మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. తాడేపల్లి మండలం కొలనుకొండలో టీడీపీ అభ్యర్థులు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నారని సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని పంపిణీని అడ్డుకున్నారు. ఆటోలను సీజ్ చేశారు. ఇప్పటికే ఓటమి సంకేతాలు అందుతున్న నేపథ్యంలో టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. చివరి నిమిషం వరకు ప్రలోభాల పర్వం కొనసాగించేందుకు శతవిధాలా యత్నిస్తోంది. మహిళా ఓటు బ్యాంకు వైఎస్సార్ సీపీ వైపు ఉందని అంచనా వేస్తున్న టీడీపీ నేతలు చీరెలు, ముక్కు పుడకలు, కుంకుమ భరిణలు వంటివి అందిస్తూ ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఇంటింటికీ ప్రచారం పూర్తి చేసిన వైఎస్సార్సీపీ ప్రజాదరణనే నమ్ముకున్న వైఎస్సార్సీపీ ఇంటింటి ప్రచారాన్ని పూర్తి చేసింది. గత 20 రోజులుగా పల్లెల్లో గడపగడపకు ప్రచారాన్ని నిర్వహించారు. మలి దశలో మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి, తుళ్ళూరు మండలంలో గుంటూరు పార్లమెంటు సమన్వయకర్త బాలశౌరి మండు టెండలో ప్రచారాన్ని హోరెత్తించారు. వైఎస్ పథకాల్ని గుర్తు చేస్తూ మళ్లీ వైఎస్ సువర్ణయుగం జగన్‌తోనే సాధ్యమని వివరిస్తూ ప్రచారాన్ని ముమ్మరంగా చేశారు. ప్రత్తిపాడులో ఎమ్మెల్యే మేకతోటి సుచరిత జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను తన భుజస్తంధాలపై వేసుకుని పల్లెల్లో సుడిగాలి పర్యటన చేశారు. పొన్నూరు నియోజకవర్గంలో గెలుపును పార్టీ సమన్వయకర్త రావి వెంకటరమణ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేశారు. పెదకూరపాడు, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో నరసరావుపేట పార్లమెంటు అభ్యర్ధి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ సమన్వయకర్తలు అంబటి రాంబాబు, బొల్లా బ్రహ్మనాయుడు, జంగా కృష్ణమూర్తి విస్తృత ప్రచారం నిర్వహించారు. టీడీపీ తరఫున గుంటూరు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థులు గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు మొక్కుబడి ప్రచారాన్ని నిర్వహించారు. జయదేవ్ పెదకాకానిలో రోడ్ షో నిర్వహించగా, రాయపాటి సత్తెనపల్లి నియోజకవర్గంలో కొండమోడులో పర్యటించారు. -
ఓటుకు ‘తెలుగు’ నోటు
ఓటుకు రూ.500 పంచి ఒట్టేసుకుంటున్న తెలుగుతమ్ముళ్లు పోలింగ్‌కు నాలుగురోజులకు ముందే ప్రలోభాలు పుత్తూరులో మూడు వార్డుల్లో నగదు పంపిణీ హస్తిలో నాలుగు వార్డుల్లో పంపకం పూర్తి మదనపల్లెలో ఓటర్ల ఇంటికి వస్తువులు, బియ్యం సాక్షి, చిత్తూరు: మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థులు నాలుగురోజుల ముందే ఓటర్లకు పలు రకాల తాయిలాలు అందజేస్తున్నారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచి నిఘా ఎక్కువగా ఉంటుందని భావించి నగదు పంపిణీతో ప్రలోభాలకు దిగుతున్నారు. ప్రధానంగా చిత్తూరు కార్పొరేషన్, పుత్తూరు, శ్రీకాళహస్తి మున్సిపాలిటీల్లో టీడీపీ అభ్యర్థులు రాత్రి సమయాల్లో పంపిణీ చేస్తున్నట్టు తెలిసింది. ఓటర్ల లిస్టు ఆధారంగా ఓటుకు రూ.500 ఇస్తున్నట్లు సమాచారం. మిగిలిన మున్సిపాలిటీల్లో కూడా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారని తెలుస్తోంది. పుత్తూరు పట్టణంలో వైఎస్సార్సీపీ కచ్చితంగా గెలుస్తుందనుకున్న వార్డులను వదిలేసి, మిగిలినవార్డుల్లో తెలుగుతమ్ముళ్లు డబ్బులు పంపిణీ చేసినట్లు ఆ పార్టీవర్గాలే చెబుతున్నాయి. ఓటుకు రూ.500 చొప్పున ఇస్తున్నారని వారు చెబుతున్నారు. శ్రీకాళహస్తి మున్సిపాల్టీలోని నాలుగువార్డుల్లో కూడా ఓటుకు *500 చొప్పున డబ్బులు పంచి, ఓటేస్తామని ప్రమాణం చేయించుకున్నట్టు సమాచారం. చిత్తూరు కార్పొరేషన్లో ఇప్పటికే భారీగా డబ్బులు చేతులు మారినట్టు సమాచారం. డబ్బులు పంచి ఓటర్లను ఆకట్టుకోవాలని టీడీపీ నాయకులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. శివారు డివిజన్లలో అర్ధరాత్రి నగదు పంచుతున్నట్టు తెలిసింది. పుంగనూరు మున్సిపాలిటీ, మదనపల్లె మున్సిపాలిటీలో వివిధ వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు డబ్బులతో పాటు బియ్యం కూడా అందజేసేందుకు సన్నాహాలు చేసుకున్నట్లు తెలిసింది. మదనపల్లెలో టీడీపీ అభ్యర్థికి చెందిన బియ్యం బ్యాగ్‌లను కూడా పోలీసులు పట్టుకున్నారు. పలమనేరు మున్సిపాలిటీలో టీడీపీ అభ్యర్థులు డబ్బులు కన్నా చీరలు, ముక్కుపుడకలు పంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. నగరి మున్సిపాలిటీలోనూ గాలి ముద్దుకృష్ణమనాయుడు ఇచ్చినా ఇవ్వకపోయినా తాము సొంతంగానైనా డబ్బులు పంచాల్సిందేనని తమ్ముళ్లు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా ఆరు మున్సిపాలిటీలు, చిత్తూరు కార్పొరేషన్లో అభ్యర్థులు ఓటర్లకు నోటు తాయిలం ఇచ్చేందుకు రంగంలోకి దిగేశారు.