ఒక్కోసారి చరిత్ర తన దారిని వెదుకుతూ వర్తమానంలోకి వచ్చేస్తుందేమో! 48 ఏళ్ల క్రితం 14 ఏళ్ల బాలిక రాసిన ఒక ఉత్తరం ఇంటి తలుపు సందుల్లో దొరికింది. అమెరికాలోని ఇలినోయిస్‌కు చెందిన తాజెవెల్ కౌంటీలో ఒక పాత ఇంటిలోని ఒక తలుపు వెనుక ఒక బాటిల్‌లో దాచివుంచిన లెటర్ ఇప్పుడు లభ్యమయ్యింది. ఈ పాత ఇంటిలో వర్క్ చేసేందుకు వచ్చిన ఒక కార్పెంటర్ ఈ లెటర్‌ను గమనించాడు. తరువాత ఇది సోషల్ మీడియాలో షేర్ కావడంతో వైరల్‌గా మారింది.
కార్పెంటర్‌కు ఎలా దొరికిందంటే..
ఫేస్‌బుక్ పోస్టులో ఉన్న వివరాల ప్రకారం డకోటా మోహ్న్ అనే ఈ కార్పెంటర్ ఇంటి మెయింటనెన్స్ చూస్తున్నాడు. ఈ నేపధ్యంలో అతని దృష్టి లివింగ్ రూమ్‌లోని తలుపు ఫ్రేమ్‌వర్క్‌పై పడింది. దానిపై ‘నోట్ 9/29/1975' అని రాసివుంది. అక్కడున్న బాణం గుర్తును ఫాలో చేయగా కలపతో చేసిన కంపార్ట్‌మెంట్‌ను అతను తెరిచాడు. అక్కడ మూసివున్న ఒక బాటిల్‌లో చేతితో రాసిన ఒక ఉత్తరం లభ్యమయ్యింది. ఈ పోస్టు క్యాప్షన్‌లో డకోటా ఇలా రాశాడు. ‘నా వడ్రంగి కెరియర్‌లో నాకు ఎన్నో అమూల్యమైనవి లభించాయి. వాటిలో ఇది అత్యుత్తుమమైనది’
జర్నల్ స్టార్‌తో మాట్లాడిన డకోటా మోహ్న్..‘మా బృందం ఆ ఇంటిలోని లివింగ్ రూమ్‌లో పనిచేస్తోంది. నేను చెత్తను తుడిచే పనిలో ఉన్నాను. అప్పుడు అక్కడి తలుపుపై ఏదో రాసివుండటాన్ని గమనించాను. దానిపై ‘నోట్’ అని ఉంది. నేను నా సెల్‌ఫోన్‌ను అక్కడ ఫోకస్ చేసి, ఫొటో తీసుకున్నాను. తరువాత ఆ బాటిల్‌లోని లెటర్ తెరిచి నోట్ చదివాను’అని తెలిపారు.
లెటర్ ఎవరు రాశారంటే..
సోషల్ మీడియాలో ఈ లెటర్ షేర్ అయిన అనంతరం ఒక మహిళ ఈ పోస్ట్ చదివారు. తాను తన 14 ఏళ్ల వయసులో ఈ లెటర్ రాశానని తెలిపారు. స్టెఫనీ హెరాన్ అనే ఈ మహిళ ఈ పోస్టుకు కామెంట్ రాస్తూ..‘ఈ లెటర్ నేనే రాశాను. నాకు నా చెల్లెలికి టైమ్ కాప్స్యూల్ అంటే చాలా ఇష్టం. ఇది అమెరికా ద్విశతాబ్దికి(1970 మధ్యకాలం) ముందునాటిది. ఆ మర్నాడే నా సోదరి జన్మించింది’ అని తెలిపారు.
ఇది కూడా చదవండి: 11 ఏళ్లకే ఎవరైనా తండ్రి కాగలరా?.. సైన్స్ ఏమి చెబుతోందంటే..
అది 48 ఏళ్ల క్రితంనాటి లెటర్.. ఎలా లభ్యమయ్యిందంటే..
Published Sun, Jul 9 2023 11:25 AM | Last Updated on Sun, Jul 9 2023 11:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment