hidden
-
Veena Srivani Latest Photos: వాగ్దేవి వరపుత్రిక శ్రీవాణి శ్రావ్యంగా మీటితే..! (ఫొటోలు)
-
8 నెలలు మాయమై.. శివరాత్రికి కనిపించే ఆలయం!
దేశంలో శివరాత్రి ఉత్సాహం నెలకొంది. శుక్రవారం జరిగే శివరాత్రి పూజలకు భక్తులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే రాజస్థాన్‌లోని బన్స్వారా జిల్లాకు చెందిన లక్షలాది మంది భక్తులకు శివరాత్రి ఎంతో ప్రత్యేకమైన పండుగ. ఎందుకంటే ఇక్కడ కొలువైన శివుడు ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే దర్శనమిచ్చి అదృశ్యమవుతాడు. దీనివెనుకగల ఆసక్తికర కథనాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బన్స్వారా జిల్లాలో మహి, అనస్ నదుల సంగమం వద్ద 200 ఏళ్ల చరిత్ర కలిగిన అద్భుత శివాలయం ఉంది. సంవత్సరంలో ఏడెనిమిది నెలల పాటు ఈ ఆలయం కనుమరుగువుతుంది. ఈ ఆలయం నాలుగు అడుగుల నీటిలో మునిగి ఉంటుంది. ఏళ్ల తరబడి ఇలా జరుగుతున్నా ఆలయానికి ఎటువంటి నష్టం వాటిల్లకపోవడం విశేషం. ఈ ఆలయం ఇలా మునిగిపోవడానికి గల కారణం గుజరాత్‌లోని కడనా డ్యామ్‌లోకి చేరిన నీరు ఈ ఆలయ ప్రాంతంలో నిలిచిపోవడం. ఇటుక, రాయి, సున్నంతో నిర్మితమైన ఈ ఆలయం సంగమేశ్వర్ మహాదేవ్ ఆలయంగా పేరొందింది. ఈ ఆలయం బన్స్వారాకు 70 కి.మీ. దూరంలో ఉంది. ఫిబ్రవరి, మార్చిలలో ఈ ప్రాంతంలో నీటి మట్టం తగ్గినప్పుడు ఆలయం కనిపిస్తుంది. శివరాత్రి సమయంలో భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకుని, శివుణ్ణి దర్శించుకుంటారు. నదుల సంగమ తీరం కావడంతో ఈ ఆలయానికి సంగమేశ్వర్ మహాదేవ్ ఆలయం అనే పేరు వచ్చింది. -
అది 48 ఏళ్ల క్రితంనాటి లెటర్.. ఎలా లభ్యమయ్యిందంటే..
ఒక్కోసారి చరిత్ర తన దారిని వెదుకుతూ వర్తమానంలోకి వచ్చేస్తుందేమో! 48 ఏళ్ల క్రితం 14 ఏళ్ల బాలిక రాసిన ఒక ఉత్తరం ఇంటి తలుపు సందుల్లో దొరికింది. అమెరికాలోని ఇలినోయిస్కు చెందిన తాజెవెల్ కౌంటీలో ఒక పాత ఇంటిలోని ఒక తలుపు వెనుక ఒక బాటిల్లో దాచివుంచిన లెటర్ ఇప్పుడు లభ్యమయ్యింది. ఈ పాత ఇంటిలో వర్క్ చేసేందుకు వచ్చిన ఒక కార్పెంటర్ ఈ లెటర్‌ను గమనించాడు. తరువాత ఇది సోషల్ మీడియాలో షేర్ కావడంతో వైరల్‌గా మారింది. కార్పెంటర్‌కు ఎలా దొరికిందంటే.. ఫేస్బుక్ పోస్టులో ఉన్న వివరాల ప్రకారం డకోటా మోహ్న్ అనే ఈ కార్పెంటర్ ఇంటి మెయింటనెన్స్ చూస్తున్నాడు. ఈ నేపధ్యంలో అతని దృష్టి లివింగ్ రూమ్‌లోని తలుపు ఫ్రేమ్‌వర్క్‌పై పడింది. దానిపై ‘నోట్ 9/29/1975' అని రాసివుంది. అక్కడున్న బాణం గుర్తును ఫాలో చేయగా కలపతో చేసిన కంపార్ట్మెంట్ను అతను తెరిచాడు. అక్కడ మూసివున్న ఒక బాటిల్లో చేతితో రాసిన ఒక ఉత్తరం లభ్యమయ్యింది. ఈ పోస్టు క్యాప్షన్‌లో డకోటా ఇలా రాశాడు. ‘నా వడ్రంగి కెరియర్లో నాకు ఎన్నో అమూల్యమైనవి లభించాయి. వాటిలో ఇది అత్యుత్తుమమైనది’ జర్నల్ స్టార్‌తో మాట్లాడిన డకోటా మోహ్న్..‘మా బృందం ఆ ఇంటిలోని లివింగ్ రూమ్‌లో పనిచేస్తోంది. నేను చెత్తను తుడిచే పనిలో ఉన్నాను. అప్పుడు అక్కడి తలుపుపై ఏదో రాసివుండటాన్ని గమనించాను. దానిపై ‘నోట్’ అని ఉంది. నేను నా సెల్‌ఫోన్‌ను అక్కడ ఫోకస్ చేసి, ఫొటో తీసుకున్నాను. తరువాత ఆ బాటిల్లోని లెటర్ తెరిచి నోట్ చదివాను’అని తెలిపారు. లెటర్ ఎవరు రాశారంటే.. సోషల్ మీడియాలో ఈ లెటర్ షేర్ అయిన అనంతరం ఒక మహిళ ఈ పోస్ట్ చదివారు. తాను తన 14 ఏళ్ల వయసులో ఈ లెటర్ రాశానని తెలిపారు. స్టెఫనీ హెరాన్ అనే ఈ మహిళ ఈ పోస్టుకు కామెంట్ రాస్తూ..‘ఈ లెటర్ నేనే రాశాను. నాకు నా చెల్లెలికి టైమ్ కాప్స్యూల్ అంటే చాలా ఇష్టం. ఇది అమెరికా ద్విశతాబ్దికి(1970 మధ్యకాలం) ముందునాటిది. ఆ మర్నాడే నా సోదరి జన్మించింది’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: 11 ఏళ్లకే ఎవరైనా తండ్రి కాగలరా?.. సైన్స్ ఏమి చెబుతోందంటే.. -
టెస్లా కారులో సీక్రెట్ ఫీచర్! ‘ఎలాన్ మోడ్’ అని పేరుపెట్టిన హ్యాకర్
టెస్లా కార్లలో ఒక రహస్య ఫీచర్ బయటపడింది. టెస్లా సాఫ్ట్వేర్ హ్యాకర్ కనుక్కున్న ఈ ఫీచర్‌కు ‘ఎలోన్ మోడ్’ అని పేరు పెట్టినట్లు ‘ది వెర్జ్’ వార్తా సంస్థ నివేదిక తెలిపింది. ఈ ఫీచర్ టెస్లా వాహనాల్లో హ్యాండ్స్ ఫ్రీ డ్రైవింగ్‌ను అనుమతిస్తుంది. @greentheonly అనే పేరుతో ట్విటర్లో ఈ రహస్య ఫీచర్ గురించి హాకర్ పేర్కొన్నారు. ‘ఎలాన్ మోడ్’ను కనుగొని, ఎనేబుల్ చేసి పరీక్షించిన హాకర్ దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీలను ట్విటర్లో షేర్ చేశారు. అయితే ఈ ఫీచర్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారం కార్ లోపల స్క్రీన్‌పై లేదు. టెస్లా పూర్తి స్వీయ డ్రైవింగ్ (ఎఫ్ఎస్డీ) అనేది బీటా స్థితిలో పరీక్ష స్థాయిలో ఉన్న అధునాతన డ్రైవర్ సహాయక వ్యవస్థ. ప్రస్తుతానికి 15 వేల డాలర్లు అదనంగా చెల్లించిన వారికి ఇది అందుబాటులో ఉంది. కానీ ఎఫ్ఎస్డీ సాఫ్ట్‌వేర్‌పై కస్టమర్ల నుంచి చాలా ఫిర్యాదులు వచ్చినట్లు గత నెలలో బయటకు పొక్కిన ఓ అంతర్గత నివేదిక ద్వారా తెలిసింది. ఉన్నట్టుండి ఆగిపోవడం, స్పీడ్ పెరిగిపోవడం వంటి లోపాలు ఉన్నట్లు కస్టమర్లు ఫిర్యాదు చేశారు. చెయ్యి వేయాల్సిన పని లేదు! టెస్లా ఆటోపైలట్ సిస్టమ్ అనేది హైవేల కోసం కంపెనీ రూపొందించిన మొదటి తరం డ్రైవర్ సహాయక వ్యవస్థ. సెల్ఫ్ డ్రైవింగ్ అయినప్పటికీ డ్రైవింగ్ సమయంలో అందులోని వ్యక్తి అప్రమత్తంగా ఉన్నారని నిర్ధారించడానికి స్టీరింగ్ వీల్‌ను అప్పుడప్పుడు తాకాల్సి ఉంటుంది. ఇలా తరచూ చేయాల్సి ఉండటంపై కస్టమర్ల నుంచి ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పటికే ఉన్న హ్యాండ్స్ ఆన్ స్టీరింగ్ కన్ఫర్మేషన్తోపాటు సెంటర్ ఇంటీరియర్ కెమెరా డ్రైవర్లు ముందుకు చూస్తున్నారా లేదా అని గమనిస్తాయి. హాకర్ ‘ఎలాన్ మోడ్’లో నిర్వహించిన 600 మైళ్ల పరీక్షలో అలాంటి ఇబ్బందులేవీ ఎదురవ్వలేదని నివేదిక పేర్కొంది. ఈ మోడ్‌లో సిస్టమ్ లేన్లను మార్చడం, హైవేపై నెమ్మదిగా డ్రైవింగ్ ముగించడం గుర్తించినట్లు హాకర్ ట్విటర్లో వివరించారు. 2017తో పోల్చితే టెస్లా సాఫ్ట్వేర్ మరింత సురక్షితమైనదని చెప్పుకొచ్చాడు. కాగా నాజ్ఫ్రీ డ్రైవింగ్ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు గత డిసెంబర్లోనే మస్క్ హింట్ ఇచ్చారు. ఇదీ చదవండి: భారత్‌లో మొదటి టెస్లా కార్ ఇతనిదే.. And also when you kill one AP node, you retain some viz now, so now you can actually see which node does what. Node A does road layout/signs Node B does moving object detection as they still display with A dead. Also viz dies at times so you get AP functionality, but empty viz pic.twitter.com/Ldfi7cCPWh — green (@greentheonly) June 17, 2023 -
ప్రపంచలోనే అత్యంత పురాతన జైళ్లు ఇవే.. వందల ఏళ్ల కిందటే నిర్మాణం
-
బల్బ్‌లలో రహస్య కెమేరాలు
-
మరుగుదొడ్డిలో కిలో బంగారం!
న్యూఢిల్లీ: విమానంలో బంగారం అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తి కస్టమ్స్ అధికారుల తనిఖీలకు భయపడి కిలో బంగారాన్ని విమానంలోని మరుగుదొడ్డిలో దాచి ఉంచాడు. విమాన సిబ్బంది చాకచక్యంగా తనిఖీలు నిర్వహించడంతో అతగాడి బండారం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. గురువారం దుబాయ్ నుంచి కొచ్చికి చేరుకున్న స్పైస్ జెట్ విమానంలో ఓ ప్రయాణికుడు అనుమానాస్పదంగా పలుమార్లు విమానంలోని మరుగుదొడ్డి(లావెటరి)కి వెళ్లడం గమనించిన విమానసిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో లావెట్రీలోని టిష్యూ పేపర్ బాక్స్ వెనుకాల పేపర్లో చుట్టి దాచి ఉంచిన కిలో బంగారు కడ్డీలను సిబ్బంది కనిపెట్టారు. బంగారాన్ని స్వాధీనం చేసుకొని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
మోనాలీసా చిత్రం వెనుక రహస్యం..!
మోనాలీసా చిత్రం వెనుక రహస్యం ఏమిటి? ఒక్కోరికీ ఒక్కోలా కనిపించే ఆ పెయింటింగ్ వెనుక దాగున్న కథను వర్ణించేందుకు శాస్త్రవేత్తలు ఒక్కోరూ ఒక్కో రకంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా రిఫ్లెక్టివ్ లైటింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఓ ఫ్రెంచ్ సైంటిస్టు ఆమె చిత్రం వెనుక కనిపించని కథను కళ్ళకు కట్టేందుకు ప్రయత్నించారు. మోనాలీసా చిత్రానికి లియోనార్డో డావిన్సీ తన కళా ప్రతిభతో ప్రాణం పోస్తే... నేటి సైంటిస్టులు డిజిటల్ శక్తితో పునర్నిర్మిస్తున్నారు. శాస్త్రవేత్త పాస్కల్ కొట్టే... మోనాలీసా చిత్రంపై షాంఘైలోని విలేకరుల సమావేశంలో మంగళవారం విశ్లేషించారు. చిత్రలేఖనానికి వెనుక భాగంలో మల్టీ లెన్స్ కెమెరా వినియోగించి లోలోపల దాగిన బహుళ రూపాలను ప్రదర్శించారు. కొన్ని ముఖ్యమైన తేడాలతో కూర్చొని ఉన్నట్లుగా దాదాపు ఒకేలా కనిపించే మరికొన్ని చిత్రాలు దీనివెనుక దాగొన్నట్లు చెప్పారు. లోపలి చిత్రంలో పక్కకు తిరిగి కూర్చొని ఉన్న ఆమె.. ప్రేక్షకులపైపు చూస్తున్నట్లుగా కనిపించడం చూపరులను ఆశ్చర్యపరుస్తుంది. సుమారు ఐదు వందల సంవత్సరాలకు పైనుంచి ఆమె చిరునవ్వు వెనుక మర్మమేమిటో తెలియక వీక్షకులు నోరెళ్ళబెడుతూనే ఉన్నారు. ఓ నిజ జీవితానికి చెందిన పెయింటింగ్ గా జనం ఆమోదించిన మోనాలీసా... ఫ్లోరెంటైన్ పట్టు వ్యాపారి భార్య అని, 16వ శతాబ్దానికి చెందిన ఇటాలియన్ మహిళ.. లిసా గెరార్దిని అని తన పరిశోధనల ద్వారా తేలినట్లు సైంటిస్టు పాస్కల్ కొట్టే చెప్తున్నారు. మోనాలిసా చిత్రాన్ని నేను పునర్నిర్మించిన అనంతరం ఆమె పోర్టరైట్ ముందు నిలబడితే పూర్తిగా భిన్నంగా కనిపిస్తుందని, మరొక స్త్రీగా ఉంటుందని అంటున్నారు. మరో పరిశోధకుడు అండ్రూ గ్రాహమ్ డిక్సన్ కూడ పాస్కల్ కొట్టే అభిప్రాయాలను ఏకీభవిస్తున్నారు. అయితే ఇతర కళా చరిత్రకారులు మాత్రం పాస్కల్ కొట్టే అన్వేషణలపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా, ఎన్ని పరిశోధనలు జరిపినా.. ప్రపంచానికి తెలిసిన మోనాలీసా నిజంగా మోనాలీసానా కాదా అన్న సంశయం మాత్రం నేటికీ తీరలేదు. -
కనబడని కొవ్వుతో మరణం!
ఢిల్లీ: మనకు పైకి కనిపించడానికి లావుగా ఉండే వారిలోనే కాకుండా అంతర్గతంగా ఏర్పడేటువంటి కొవ్వుతో చాలా ప్రమాదం పొంచి ఉందనీ, ఒక రకంగా ఇది మరణానికి దగ్గరవుతున్నట్లే అని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదర భాగంలో కొవ్వు నిల్వలు పేరుకుపోవడం వలన ప్రమాదం మరింత పెరుగుతుందంటున్నారు. చర్మం కింది భాగాలలో అంతర్గతంగా తయారయిన కొవ్వు మూలాన అనేక వ్యాధుల బారిన పడటానికి అవకాశం ఉంటుంది. హృద్రోగులలో ఈ తరహా కొలెస్ట్రాల్ ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా మనదేశంలోని స్థూలకాయుల్లో హైపర్‌టెన్షన్, థైరాయిడ్, డయాబెటిస్ తదితర వ్యాధుల బారిన పడిన వారికి ఆ వ్యాధుల మీద అవగాహన లేకపోవడం వలన తప్పకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు సైతం తీసుకోలేకపోతున్నారు. ఇది ఎక్కువ నష్టం జరగడానికి దోహదం చేస్తుందని ఒబెసిటీ రంగంలో కృషి చేస్తున్న ఇండియా కంపెనీ వీఎల్సీసీ స్థాపకురాలు వందనా మిశ్రా తెలిపారు. ప్రతి యేటా నవంబర్ 26 ను యాంటీ ఒబెసిటీ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో అస్తవ్యస్తమైన జీవన విధానం, అహారపు అలవాట్ల మూలంగా పెరుగుతున్న స్థూలకాయులు తప్పకుండా తమ బరువును తగ్గించుకోవడం దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.