Tesla Hidden Feature Elon Mode Discovered By Hacker, Says Report - Sakshi

Hidden Feature In Tesla Cars: టెస్లా కారులో సీక్రెట్‌ ఫీచర్‌! ‘ఎలాన్‌ మోడ్‌’ అని పేరుపెట్టిన హ్యాకర్‌

Jun 22 2023 2:28 PM | Updated on Jul 14 2023 8:32 PM

tesla hidden feature elon mode discovered by hacker report - Sakshi

టెస్లా కార్లలో ఒక రహస్య ఫీచర్‌ బయటపడింది. టెస్లా సాఫ్ట్‌వేర్ హ్యాకర్‌ కనుక్కున్న ఈ ఫీచర్‌కు ‘ఎలోన్ మోడ్’  అని పేరు పెట్టినట్లు ‘ది వెర్జ్’ వార్తా సంస్థ నివేదిక తెలిపింది. ఈ ఫీచర్ టెస్లా వాహనాల్లో హ్యాండ్స్ ఫ్రీ డ్రైవింగ్‌ను అనుమతిస్తుంది. 

@greentheonly అనే పేరుతో ట్విటర్‌లో ఈ రహస్య ఫీచర్‌ గురించి హాకర్‌ పేర్కొన్నారు. ‘ఎలాన్ మోడ్‌’ను కనుగొని, ఎనేబుల్‌ చేసి పరీక్షించిన  హాకర్‌ దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీలను ట్విటర్‌లో షేర్‌ చేశారు.  అయితే ఈ ఫీచర్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారం కార్‌ లోపల స్క్రీన్‌పై లేదు. 

టెస్లా పూర్తి స్వీయ డ్రైవింగ్ (ఎఫ్‌ఎస్‌డీ) అనేది బీటా స్థితిలో పరీక్ష స్థాయిలో ఉన్న అధునాతన డ్రైవర్ సహాయక వ్యవస్థ. ప్రస్తుతానికి 15 వేల డాలర్లు అదనంగా చెల్లించిన వారికి ఇది అందుబాటులో ఉంది. కానీ ఎఫ్‌ఎస్‌డీ సాఫ్ట్‌వేర్‌పై కస్టమర్ల నుంచి చాలా ఫిర్యాదులు వచ్చినట్లు గత నెలలో బయటకు పొక్కిన ఓ అంతర్గత నివేదిక ద్వారా తెలిసింది. ఉన్నట్టుండి ఆగిపోవడం, స్పీడ్‌ పెరిగిపోవడం వంటి లోపాలు ఉన్నట్లు కస్టమర్లు ఫిర్యాదు చేశారు. 

చెయ్యి వేయాల్సిన పని లేదు!
టెస్లా ఆటోపైలట్ సిస్టమ్ అనేది హైవేల కోసం కంపెనీ రూపొందించిన మొదటి తరం డ్రైవర్ సహాయక వ్యవస్థ. సెల్ఫ్‌ డ్రైవింగ్‌ అయినప్పటికీ డ్రైవింగ్‌ సమయంలో అందులోని వ్యక్తి అప్రమత్తంగా ఉన్నారని నిర్ధారించడానికి స్టీరింగ్ వీల్‌ను అప్పుడప్పుడు తాకాల్సి ఉంటుంది. ఇలా తరచూ చేయాల్సి ఉండటంపై కస్టమర్ల నుంచి ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పటికే ఉన్న హ్యాండ్స్ ఆన్ స్టీరింగ్ కన్ఫర్మేషన్‌తోపాటు సెంటర్ ఇంటీరియర్ కెమెరా డ్రైవర్లు ముందుకు చూస్తున్నారా లేదా అని గమనిస్తాయి. 

హాకర్‌ ‘ఎలాన్‌ మోడ్‌’లో నిర్వహించిన 600 మైళ్ల పరీక్షలో అలాంటి ఇబ్బందులేవీ ఎదురవ్వలేదని నివేదిక పేర్కొంది. ఈ మోడ్‌లో సిస్టమ్ లేన్‌లను మార్చడం, హైవేపై నెమ్మదిగా డ్రైవింగ్ ముగించడం గుర్తించినట్లు హాకర్‌ ట్విటర్‌లో వివరించారు. 2017తో పోల్చితే టెస్లా సాఫ్ట్‌వేర్ మరింత సురక్షితమైనదని చెప్పుకొచ్చాడు. కాగా నాజ్‌ఫ్రీ డ్రైవింగ్‌ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు గత డిసెంబర్‌లోనే మస్క్‌ హింట్‌ ఇచ్చారు.

ఇదీ చదవండి: భారత్‌లో మొదటి టెస్లా కార్‌ ఇతనిదే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement