feature
-
మునుపటి కాలం కాదు ఇది, కానీ..
మునుపటి కాలం కాదు ఇది. సెలవులు, తీరిక దొరకగానే ఇంటి నాలుగు గోడలకు పరిమితం కావాలనుకోవడం లేదు మహిళలు. సోలో ట్రావెలర్స్‌గా అవుట్డోర్ థ్రిల్స్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక కోణంలో చూస్తే....‘ఆహా... ఎంత మార్పు’ అనిపిస్తుంది. మరో కోణంలో చూస్తే అవుట్డోర్ అడ్వెంచర్లలో మహిళలకు సౌకర్యాలు, భద్రతాపరంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి..గత కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో మహిళా సాహస బృందాలు, సోలో ఉమెన్ ట్రావెలర్లు పెరిగారు. చాలామంది మహిళలు సెలవుల్లో ఇంటికి పరిమితం కావడానికి బదులు అవుట్డోర్ థ్రిల్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. మన దేశంలో పర్వతారోహణ, స్కీయింగ్, స్కూబా డైవింగ్, పారాగ్లైడింగ్... మొదలైన సాహస విభాగాల్లో శిక్షణను అందించే సంస్థల నుండి ప్రతి సంవత్సరం మహిళలు పెద్ద సంఖ్యలో శిక్షణ తీసుకుంటున్నారు. అయినప్పటికీ..మహిళల నేతృత్వంలోని అడ్వెంచర్ టూరిజం కంపెనీలు కొన్ని మాత్రమే ఉన్నాయి. టూరిజం ఇండస్ట్రీ ఉమెన్ ట్రావెలర్ల అవసరాలను పూర్తిగా తీర్చడం లేదు. మహిళా గైడ్లు, సహాయ సిబ్బంది కొరత గణనీయంగా ఉంది. ప్రస్తుతం కొన్ని కంపెనీలు మాత్రమే మహిళా గైడ్లను నియమించుకుంటున్నాయి. ‘గైడ్ అంటే పురుషులు మాత్రమే’ అనే భావనను పునర్నిర్వచించడమే కాకుండా మహిళా ప్రయాణికులకు భరోసాగా నిలుస్తున్నారు ఫిమేల్ గైడ్లు. మారుమూల ప్రాంతాలలో సౌకర్యవంతమైన వాతావరణానికి కృషి చేస్తున్నారు.మహిళా భద్రతా కోణంలో జెండర్ సెన్సివిటీ ట్రైనింగ్ అనేది కీలకంగా మారింది. ఈ శిక్షణ మేల్ గైడ్స్ ‘జెండర్ డైనిమిక్స్’ను అర్థం చేసుకోవడానికి మాత్రమే కాదు లైంగిక వేధింపులను నివారించడానికి సహాయపడుతుంది. భద్రత, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ఉమెన్ ట్రావెలర్స్‌కు అవసరమయ్యే ఎక్విప్మెంట్ను రూపొందించాల్సిన బాధ్యత టూరిజం కంపెనీలపై ఉంది. శానిటరీ ప్రొడక్ట్స్, మెన్స్ట్రువల్ క్రాంప్స్ కోసం పెయిన్ రిలీఫ్ మందులు, ఆరోగ్యం, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్టాండర్డ్ మెడికల్ కిట్లు అందుబాటులోకి తేవాలి. ‘సోలో ట్రావెలర్, అవుట్ డోర్ ప్రొఫెషనల్‌గా ఎన్నోసార్లు అసౌకర్యానికి గురయ్యాను. మహిళల సాహస ప్రయాణాలలో మౌలిక సదుపాయాల తక్షణ అవసరం ఉంది’ అంటుంది మౌంటెనీర్, ఎంటర్ప్రెన్యూర్ అనూష సుబ్రమణ్యియన్.ఇలా అంటున్నారు.. ఇటీవల ఒక సంస్థ సోలో ఉమెన్ ట్రావెలర్స్ గురించి నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో 29 శాతం మంది భద్రత గురించి ఆందోళన చెందారు. మరో 29 శాతం మంది శారీరక సౌకర్యం (ఫిజికల్ కంఫర్ట్), 23 శాతం మంది వెహికిల్ బ్రేక్‌డౌన్స్, 13 శాతం మంది లైంగిక వేధింపుల గురించి ఆందోళన చెందారు. ఎవరి అభిప్రాయం మాట ఎలా ఉన్నా అడ్వెంచర్ టూరిజం ఇండస్ట్రీ మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనేది అందరి నోటి నుంచి వినిపించిన మాట.ఇవి చదవండి: డ్యాన్సింగ్ సిటీ.. హిప్హాప్ స్టెప్స్.. -
వాతావరణానికనుగుణంగా.. ఉపయోగపడే కొత్త పరికరాలు ఇవే..!
ఈ ఫొటోలోని ఇంటెలిజెంట్ టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్ పొద్దుపొద్దున్నే చాలా వెరైటీలను అందిస్తుంది. స్మార్ట్ టెంపరేచర్ కంట్రోల్‌తో క్వాలిటీ మెటీరియల్‌తో రూపొందిన ఈ మేకర్లో పోచ్డ్ ఎగ్స్, గుంత పొంగనాలు, కుడుములు, పాన్ కేక్స్, గ్రిల్ ఐటమ్స్ వంటివి చాలానే రెడీ చేసుకోవచ్చు. అందుకు వీలుగా ఈ డివైస్‌తో పాటు రెండుమూడు రకాల పాన్ ప్లేట్స్ లభిస్తుంటాయి.అవసరాన్ని బట్టి వాటిని మార్చుకుంటూ ఎన్నో వెరైటీలను తయారు చేసుకోవచ్చు. ఒకవైపు గుంతలు, మరోవైపు పాన్ ప్లేట్ లేదా మొత్తం బాల్స్ పాన్, లేదంటే మొత్తం కట్లెట్స్ పాన్.. ఇలా అటాచ్డ్ గ్రిల్ ప్లేట్స్ మెషి¯Œ తో పాటు లభించడంతో దీనిపై వంట సులభమవుతుంది. ఫైర్‌ప్రూఫ్, హీట్ రెసిస్టెంట్ షెల్ హీట్ ఇన్సులేషన్‌తో తయారైన ఈ మేకర్‌ను సులభంగా క్లీన్ చేసుకోవచ్చు. అయితే అటాచ్డ్ పాన్ లేదా గ్రిల్ ప్లేట్స్‌ను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.వైఫై ఎనేబుల్డ్ కాఫీ మేకర్..ఈ స్టైలిష్ కాఫీ మేకర్‌తో వివిధ రకాల కాఫీ ప్లేవర్స్ని ఎంజాయ్ చేయవచ్చు. బ్లాక్ కాఫీ, క్యాపుచినో, లాటె, ఎస్ప్రెస్సో, రిస్ట్రెట్టో వంటి చాలా ప్లేవర్స్ ఇందులో రెడీ చేసుకోవచ్చు. అవర్స్, మినిట్స్, పవర్, టెంపరేచర్, మగ్, కప్స్ వంటి ఆప్షన్స్‌తో డివైస్ ముందు వైపు కింద డిస్ ప్లే ఉంటుంది. ఆ డిస్ప్లేలో ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. దీన్ని వైఫై సాయంతో స్మార్ట్ ఫో¯Œ కి కనెక్ట్ చేసుకుని కూడా సులభంగా వినియోగించుకోవచ్చు.6 అడ్జస్టబుల్ గ్రైండ్ సెట్టింగులతో రూపొందిన ఈ మేకర్ని యూజ్ చేసుకోవడం చాలా ఈజీ. సర్వ్ చేసుకోవడం తేలిక. అలాగే ఈ డివైస్‌కి ఎడమవైపు వాటర్ ట్యాంక్ ఉంటుంది. దానిలో నీళ్లు నింపుకుని, కుడివైపు పైభాగంలో మూత తీసి.. కాఫీ గింజలు లేదా కాఫీ పౌడర్ వేసుకుని పవర్ బటన్ నొక్కితే చాలు. టేస్టీ కాఫీ రెడీ అయిపోతుంది. ఇందులో ఒకేసారి నాలుగు నుంచి పది కప్పుల వరకూ కాఫీని రెడీ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఇందులో ఉంది.హాట్– కోల్డ్ బ్లెండర్..గ్రెయిన్, పేస్ట్, టీ, జ్యూస్, క్లీన్ అనే ఐదు ఆప్షన్స్‌తో రూపొందిన ఈ హాట్– కోల్డ్ బ్లెండర్ వినియోగదారులకు సౌకర్యవంతమైన మిక్సీలా పని చేస్తుంది. దీనిలో నూక, పిండి తయారు చేసుకోవడంతో పాటు జ్యూసులు, మిల్క్ షేక్స్ వంటివి వేగంగా రెడీ చేసుకోవచ్చు. సుమారు 25 నిమిషాల వ్యవధిలో ఫిల్టర్‌తో పని లేకుండా ఒకేసారి 2 కప్పులు సోయా పాలను సిద్ధం చేసుకోవచ్చు.దీనిలో పదునైన మిక్సింగ్ నైవ్స్ బ్లేడ్స్లా ఉంటాయి. ఈ జ్యూసర్లో 12 అవర్స్ ప్రీసెట్ ఆప్ష¯Œ తో పాటు వన్ అవర్ కీప్ వార్మర్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది ఒకరికి లేదా ఇద్దరికి అనువైనది. దీనిలో ఆటోమేటిక్ క్లీనింగ్ ఆప్షన్ ఉండటంతో. దీని వాడకం చాలా తేలికగా ఉంటుంది. పైగా ఇది తక్కువ శబ్దంతో పని చేస్తుంది. -
వాట్సప్‌లో అదిరిపోయే ఫీచర్లు.. ఫీదా అవ్వాల్సిందే
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ యూజర్లకు శుభవార్త చెప్పింది. యూజర్లను ఎప్పటికప్పుడు ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న వాట్సప్.. తాజాగా ఏఐ ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నట్లు వాట్సప్ సమాచారం అందించే ‘వీ బీటా ఇన్ఫో’ తెలిపింది. యూజర్లు ఈ ఏఐ ఫీచర్లను ఉపయోగించి వాట్సప్‌లో ఇమేజెస్‌ను ఎడిట్ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ మార్చడం,రీస్టైల్ చేయడం, ఎక్స్పాండ్ లాంటి పనులన్నీ వాట్సప్ ఇంటర్ ఫేస్ నుంచి చేయొచ్చు. వాట్సప్ పనిచేస్తున్న రెండో ఏఐ టూల్స్ సాయంతో వాట్సప్ సెర్చ్ బార్లో ఏదైనా సమాచారం గురించి తెలుసుకోవచ్చు. ఆ సమాచారం అంతా ‘మెటా ఏఐ’ అందిస్తుంది. చాట్‌జీపీటీకి పోటీగా మెసేజింగ్ యాప్‌లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి రాకముందే వాటి గురించి ఫీచర్ ట్రాకర్ వీ బీటా ఇన్ఫో అందిస్తుంది. తాజా వాట్సప్ బీటా అప్డేట్ ఏఐ- పవర్డ్ ఇమేజ్ ఫీచర్‌తో పాటు ఓపెన్ ఏఐకి చెందిన చాట్జీటీపీకి పోటీగా వాట్సప్‌లో మెటా ఏఐని రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ రెండు టెస్టింగ్ దశలో ఉండగా.. త్వరలో అందుబాటులోకి రానున్నాయి. -
వాట్సప్‌లో అందరికీ ఉపయోగపడే కొత్త ఫీచర్ వచ్చేసింది!
కోల్‌కతా కాళీఘాట్‌లో నివాసం ఉండే ఓ వ్యక్తికి అగంతకుడు ఫోన్ చేశాడు. ‘సార్.. సార్ మీకు కంగ్రాట్స్. థ్యాంక్యు..థ్యాంక్యు..ఇంతకీ విషయం ఏంటో చెప్పలేదు. ఏం లేదు సార్ మీరు గతంలో ఓ సంస్థలో పెట్టుబడి పెట్టారు కదా . ఆ సంస్థ దివాళా తీసింది. ఆ విషయం మీ క్కూడా తెలుసు. తాజాగా కోర్టు మీ పెట్టుబడిని తిరిగి ఇచ్చేయమని తీర్పిచ్చింది. కోర్టు తీర్పు ఉత్తర్వుల తాలుకూ న్యూస్ పేపర్లలో, టీవీల్లో కూడా వచ్చింది. కావాలంటే మీరే చూడండి.ఈ విషయం చెప్పాలనే మీకు ఫోన్ చేశాను. త్వరలో మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం మీ బ్యాంక్ అకౌంట్లో జమవుతుంది’ అని ఊరించాడు. కాకపోతే మీ ఆధార్ కార్డ్, బ్యాంక్ వివరాల్ని చెప్పాల్సి ఉంటుందని కోరారు. నమ్మితేనే కదా మోసం చేసేది దీంతో సదరు వ్యక్తి ముందుగా అగంతకుడికి తన వ్యక్తిగత వివరాలు ఇవ్వాలా? వద్దా? అని కాస్త సంశయించాడు. ఆ తర్వాత.. ఆ ఇస్తే ఏముందిలే మన డబ్బులు మనకు వస్తున్నాయి కదా అని మనుసులో అనుకున్నాడు. మొత్తం వివరాల్ని అందించాడు. అప్పుడే అసలు కథ మొదలైంది. వారం రోజుల తర్వాత సదరు పెట్టుబడి దారుడి అకౌంట్ నుంచి రూ.8లక్షలు మాయమయ్యాయి. పోలీసులు కొంత మొత్తాన్ని రికవరీ చేశారు. ఇదిగో ఈయన 8లక్షలు మోసపోతే గత ఏడాది వాటి విలువ వేల కోట్లకు చేరింది. వేల కోట్లకు సైబర్ నేరాలు నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ నివేదిక ప్రకారం..2023 ఆర్ధిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకు సుమారు రూ.5,574 కోట్ల సైబర్ నేరాలు జరిగాయి. 2022లో ఈ మొత్తం రూ.2,296 కోట్లుగా ఉందని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేశాయి. సైబర్ నేరాల నుంచి సంరక్షించేందుకు ఈ తరుణంలో సైబర్ నేరాల నుంచి యూజర్లను సంరక్షించేందుకు ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ మరో టూల్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సాయంతో ఆండ్రాయిడ్, ఐఫోన్ల లాక్ స్క్రీన్ నుంచి అనుమానిత ఫోన్ నెంబర్లను నేరుగా బ్లాక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తూ వాట్సప్ వెసులుబాటు కల్పిస్తుంది. బ్లాక్ చేస్తే వాటి నుంచి మీకు ఫోన్ కాల్స్, మెసేజ్‌లు రావు. మీరు కావాలనుకుంటే వాట్సప్‌కు రిపోర్ట్ చేయొచ్చు. -
గూగుల్ మ్యాప్స్ మీ పెట్రోలును ఆదా చేస్తుందా?
గూగుల్ మ్యాప్స్ ఉంటే ఎక్కడికైనా వెళ్లిరావొచ్చనే ధీమా ఉంటుంది. కొన్నిసార్లు కచ్చితమైన లోకేషన్లు చూపించకపోయినా.. మనం ఎంచుకున్న లోకేషన్ దగ్గరి వరకు వెళ్లేలా సహాయపడుతుంది. ఈ గూగుల్ మ్యాప్స్‌ను సుదూర ప్రాంతాలు, కొత్త ప్రాంతాలకు వెళుతున్నప్పుడు వెళ్లే రూట్‌తోపాటు వేగం తెలుసుకోవడానికి ఉపయోగిస్తూంటాం. అయితే గూగుల్ మ్యాప్స్ ఇకమీదట ఫ్యూయల్ పొదుపు చేయడంలోనూ సహాయపడనుంది. ప్రయాణంలో ఫ్యుయల్ పొదుపు చేయడానికి గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ‘ఫ్యుయల్ ఎఫిషియంట్ రూట్స్’ అనే పేరుతో గూగుల్ యూజర్లకు ఈ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే అమెరికా, ఐరోపా యూనియన్ దేశాలు, కెనడాల్లో వినియోగంలో ఉన్న ఈ ఫీచర్ ఇక భారత్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఈ గూగుల్ మ్యాప్స్ ఫ్యూయల్ సేవింగ్స్ ఫీచర్ ఎనేబుల్ చేస్తే.. మనం వెళ్లే రూట్లో లైవ్ ట్రాఫిక్ అప్ డేట్స్, రహదారులు, ఇంధన సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. వాహన వేగం, ఫ్యుయల్ వాడకం రెండింటిని పరిగణనలోకి తీసుకుని అందుకు అనుకూల రూట్ చూపుతుంది. అలాగే ఆ రూట్లో వెళ్లడం వల్ల ఎంత ఫ్యుయల్ ఆదా అవుతుందో తెలుపుతుంది. ఇలా సెట్ చేసుకోండి.. గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేసి ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. ‘సెట్టింగ్స్’లోకి వెళ్లి ‘నేవిగేషన్ సెట్టింగ్స్’ ఎంచుకోవాలి. కిందకు స్క్రోల్ చేస్తే అక్కడ కనిపించే ‘రూట్ ఆప్షన్’ అనే ట్యాబ్‌లో ‘ప్రిఫర్ ఫ్యుయల్ ఎఫిసెంట్ రూట్స్’ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. వాహనం ఇంజిన్, ఫ్యుయల్ టైప్‌ను ఎంచుకోవాలి. నేవిగేషన్ ట్యాబ్ లోనే టోల్ ధర, స్పీడో మీటర్ వంటి ఆప్షన్లు ఎంచుకోవచ్చు. వాహన వేగంతోపాటు మీరు వెళ్లే రూట్లో ఎంత టోల్ ఫీజు పే చేయాలో ఈ ఫీచర్ చెబుతుంది. ఇదీ చదవండి: వేలకోట్ల అప్పు తీర్చే యోచనలో అదానీ గ్రూప్.. ఎలాగంటే.. -
సీటు గ్యారంటీ! పేటీఎంలో రైలు టికెట్ బుకింగ్‌పై కొత్త ఫీచర్
న్యూఢిల్లీ: ప్రముఖ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం రైలు టికెట్ల బుకింగ్‌పై సీటు గ్యారంటీ సేవను ప్రారంభించింది. దీని వల్ల యూజర్లు పేటీఎంపై రైలు టికెట్ బుక్ చేసుకోవడం ద్వారా కన్ఫర్మ్డ్ టికెట్ పొందొచ్చని వన్97 కమ్యూనికేషన్స్ (పేటీఎం మాతృ సంస్థ) ప్రకటించింది. కన్ఫర్మ్డ్ టికెట్ కోసం ఒకటికి మించిన రైలు ఆప్షన్లను అందిస్తున్నట్టు తెలిపింది. ఇందుకోసం యూజర్లు పేటీఎం యాప్‌పై రైలు టికెట్ బుకింగ్ సమయంలో ఆల్టర్నేటివ్ స్టేషన్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ ఎంపిక చేసుకున్న రైలులో టికెట్లకు వెయిట్ లిస్ట్ చూపిస్తే, అప్పుడు ఆల్టర్నేటివ్ స్టేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇది సమీప స్టేషన్లకు ఏ రైలులో టికెట్లు అందుబాటులో ఉన్నది చూపిస్తుంది. దీనివల్ల సీటు లేదన్న ఆందోళన ఉండదని పేటీఎం తెలిపింది. -
ఐఫోన్ నుంచి కాళ్లకి వేసుకునే షూ వరకు అప్‌గ్రేడ్..ఇదేమైనా వ్యాధా?
ఇటీవల యువత గాడ్జెట్ల వ్యామోహం ఓ రేంజ్లో ఉంది. మార్కెట్లోకి ఏ కొత్త ఫీచర్ వచ్చినా క్షణం కూడా ఆగరు. రిలీజ్ చేస్తున్న డేట్ ఇవ్వంగానే కొనేసేందుకు రెడీ. ఇంట్లో తల్లింద్రండ్రుల వద్ద డబ్బు ఉందా లేదా అనేది మేటర్ కాదు. ఆరు నూరైనా..కేవలం ఆ కొత్త ఫీచర్ మనం వద్ద ఉండాల్సిందే అన్నంతగా ఉన్నారు యువత. ఇది అసలు మంచిదేనా?..ఒకవేళ్ల అలా కొత్త టెక్నాలజీ కొత్త ఫ్యాషన్‌కి అప్‌గ్రేడ్ కాకపోతే ఏదో పెద్ద నష్టం జరిగనట్టు లేదా భయానక అవమానం జరిగిన రేంజ్లో యువత ఇచ్చే బిల్డప్ మాములుగా ఉండదు. ఏంటిదీ? దీని వల్ల ఏం వస్తుంది? ఎవరికీ లాభం? నిజానికి యువత ముఖ్యంగా కాలేజ్‌కి వెళ్లే టీనేజ్‌ల దగ్గర నుంచి ఉద్యోగాలు చేస్తున్న పెద్దవాళ్ల వరకు అందరికి అప్‌గ్రేడ్ అనే జబ్బు పట్టుకుంది. మార్కెట్లోకి వచ్చే కొత్త ఫీచర్ లేదా టెక్నాలజీకి అప్‌గ్రేడ్ అయిపోవాల్సిందే!. లేదంటే ఓర్నీ..! ఎక్కడ ఉన్నవురా? అంటూ ఎగతాళి. పైగా నిన్న మొన్నటి టెక్నాలజీని కూడా తాతాల కాలం నాటిది అంటూ తేలిగ్గా తీసిపడేస్తాం. ఇలా ధరించే దుస్తులు దగ్గర నుంచి కాలికి వేసుకునే చెప్పుల వరకు మార్కెట్లోకి వచ్చే ప్రతీ కొత్త బ్రాండ్లతో అప్‌గ్రేడ్ అవ్వడం నాగరికత లేక ఓ గొప్ప ట్రెండ్‌గా ఫీలవుతున్నారా? అంటే..ఇక్కడ ఇలా అప్‌గ్రేడ్ పేరుతో మార్కెట్లోకి వచ్చే ప్రతిది కొంటున్న యువతకు కూడా ఇలా ఎందుకు అనేది వారికే స్పష్టత లేదు. కానీ ఓ ఆందోళనకరమైన విషవృక్షంలా మనుషుల్లో ఈ విధానం విజృంభిస్తుంది. మన పక్కోడు ఆ కొత్త టెక్నాలజీకి వెళ్లపోయినంత మాత్రనా వాడు ఏదో సాధించినట్లు కాదు. ముందు మనం దేన్ని ఎంతవరకు కొనాలి. దేనికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి అనే ధోరణిని మర్చిపోయేలా మాయాజాలం సృష్టిస్తున్నాయి ఈ కార్పొరేట్ కంపెనీలు. ఉదహారణకి ఐఫోన్ పరంగా చూస్తే 4జీ నుంచి 5జీ అప్‌గ్రేడ్ అవ్వాలని నీ వద్ద ఉన్న ఫోర్జీ ఫోన్‌ని వదిలేసి కొత్తదానికి వెళ్లాల్సినంత పనిలేదు. మహా అయితే వీడియో లేదా స్టోరేజ్‌కి సంబంధించి కాస్త బెటర్ ఫీచర్ ఉండొచ్చు. దానికోసం ఇలా వేలవేలకు వేలు దుబారా చేయడం సరియైనది కాదు. ఇక్కడ ఉన్న చిన్న లాజిక్‌ని మర్చిపోతున్నాం. మనం ఓ ఫోన్ లేదా ఏ వస్తువైన కొనుక్కుంటున్నాం. దానికి కంపెనీ ఇన్ని ఏళ్లు అని వ్యారెంటీ ఇచ్చేది. మనం కొనుక్కుని వెళ్లిపోతే వాడివద్దకు మళ్లా కస్టమర్లు రారు. వాళ్ల బ్రాండ్‌ని మర్చిపోతారు. నిరంతరం కస్టమర్లతో టచ్‌లో ఉండేలా తన బ్రాండ్‌ని ప్రమోట్ చేసుకునే దృష్ట్యా కంపెనీలు చేసే ఇంద్రజాలం ఇది. దీన్ని గమనించక మన జేబులు గుల్లచేసుకుంటూ అప్‌గ్రేడ్ అంటూ మార్కెట్లోకి వచ్చే ప్రతి కొత్త బ్రాండ్‌ని కొనేస్తున్నాం. అప్పటి వరకు మనతో ఉన్న వాటిని పక్కన పడేస్తున్నాం. కొందరి యువతలో ఇదొక మానసిక రుగ్మతలా తయారయ్యిందని మానసిక నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు కొత్త టెక్నాలజీకి చెందిన వస్తువు లేదా మార్కెట్లోకి వచ్చిన ట్రెండీ ఫ్యాషన్ తన వద్ద లేనంత మాత్రన ఆత్మనూన్యతకు గురయ్యిపోతున్నారు. మనుషులకు వారి భావాలకు వాల్యూ ఇవ్వండి. నిజానికి అదేమీ స్టాటస్ కాదు. అది అందరూ గమనించాలి. తల్లిదండ్రులు ఇలాంటి ధోరణి గల పిల్లలను గమనించి కౌన్సిలింగ్ ఇప్పించడం లేదా మీరే చొరవ తీసుకుని ఫ్రెండ్లీగా మాట్లాడి సరైన గాఢీలో పెట్టాలి లేదంటే ఆ మోజులో జీవితాలు అల్లకల్లోలం అయిపోతాయి. ఎందుకంటే ప్రతీది కొనేయ్యలేం. అలాగే ప్రతి అప్‌గ్రేడ్‌ని ప్రతిసారి అందుకోవడం సర్వత్రా సాధ్యం కాదు. ముందు యువత సానుకూల దృక్పథంతో ఈ వస్తువు లేదా దుస్తులు కొనడం వల్ల ఎవరికీ లాభం, దీన్ని ఎందుకు మార్కెట్లో సొమ్ము చేసుకునేలా ఎందుకు ప్రచారం చేస్తారు అనే దానిపై దృష్టిపెట్టండి. మీ పరిజ్ఞానం ఇలాంటి చిన్న చితక వస్తువులకు బానిసైపోకూడదు. ఏదైనా మనకు ఉపయోగపడేది, మన స్థాయికి, ఉన్న పరిస్థితులకు అనుగుణమైనవి మన వద్ద ఉంటే చాలు. ఈ పిచ్చి విధానం మీ ఉనికిని, మీ వైఖరిని కోల్పోయేలా చేస్తుంది. నువ్వు కొత్త టెక్నాలజీకి అడాప్ట్ అవ్వడం కాదు. టెక్నాలజీనే నువ్వు సృష్టించగలిగే దిశగా నాలెడ్జ్‌ని పెంచుకునేలా అడుగులు వేస్తే మీ భవిష్యత్తు బంగారు పూలబాట అవుతుందని అంటున్నారు మానసికి నిపుణులు. (చదవండి: తినదగిన ప్లేట్లు! ఔను! భోజనం చేసి పారేయకుండా..) -
‘ఎక్స్’లో మార్పులు.. యూజర్లకు భారీ షాక్!
ట్విటర్ (ఎక్స్) అధినేత ఎలాన్ మస్క్ యూజర్లకు షాకిచ్చారు. ఎక్స్ ఫ్లాట్ ఫామ్ నుంచి అకౌంట్లను బ్లాక్ చేసే ‘బ్లాక్’ ఆప్షన్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ‘టెస్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీ’ ఎక్స్ అకౌంట్ యూజర్ ‘బ్లాక్ అండ్ మ్యూట్’ ఈ రెండింటిలో మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తారంటూ ప్రశ్నించిన సందర్భంగా ఎలాన్ మస్క్ పైవిధంగా స్పందించారు. బ్లాక్ ఆప్షన్ డిలీట్ చేస్తున్నట్లు తెలిపిన మస్క్.. యూజర్లు ఇతర అకౌంట్ల నుంచి ఏదైనా సమస్యలు తలెత్తితే మ్యూట్ అనే ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చని అన్నారు. ఇక తాము డిలీట్ చేసిన బ్లాక్ అనే ఫీచర్ వల్ల పెద్ద ఉపయోగం లేదనే అభిప్రాయాన్ని మస్క్ వ్యక్తం చేశారు. కానీ, ఎవరైతే మన అకౌంట్లను మ్యూట్ చేశారో వాళ్లు వారి ఎక్స్ అకౌంట్లో ఏ పోస్ట్‌లు పెడుతున్నారో, ఎన్ని కామెంట్స్, ట్వీట్లు, రీట్విట్లు ఎవరు చేస్తున్నారో తెలుసుకోవచ్చు. డైరెక్ట్‌గా మెసేజ్ చేయొచ్చు. ఇలా డైరెక్ట్ మెసేజ్‌లు చేస్తే వాటిని బ్లాక్ చేసుకోవచ్చు. ఆ పోస్ట్‌లను తన స్నేహితులకు పంపుకోవచ్చు. డైరెక్ట్‌గా మెసేజ్ కూడా చేసే అవకాశం ఉందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. మరోవైపు, సోషల్ మీడియాలో బ్లాక్ అనే ఆప్షన్ యూజర్ల భద్రత విషయంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడీ ఈ ఫీచర్‌ను తొలగించడంపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మస్క్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఆన్లైన్లో వేధింపులు ఎక్కువయ్యే అవకాశం ఉందని ఎక్స్ వినియోగదారులు ఆరోపిస్తున్నారు. చదవండి👉ఎదురుచూపులకు ఫుల్స్టాప్.. జియో ఫైనాన్స్ లిస్టింగ్ ఎప్పటినుంచంటే? -
భద్రతా ఫీచర్లకే అధిక ప్రాధాన్యత
ముంబై: కార్ల కొనుగోలు విషయంలో కస్టమర్లు భద్రతా ఫీచర్లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్కోడా ఆటో ఇండియా, ఎన్ఐక్యూ బేసెస్ సర్వే వెల్లడించింది. ముఖ్యంగా క్రాష్ రేటింగ్‌లు, ఎయిర్ బ్యాగుల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటారని తెలిపింది. జనాదరణ పొందిన ఫీచర్లలో ఇంధన సామర్థ్యం మూడో స్థానంలో ఉంది. భారత్‌లో కార్లకు భద్రతా రేటింగ్ తప్పనిసరిగా ఉండాలని 10 మందిలో 9 మంది కస్టమర్లు అభిప్రాయపడ్డారు. ‘అధిక రేటింగ్ మోడళ్లు కలిగిన తొలి 3 బ్రాండ్లలో స్కోడా ఒకటి. గ్లోబల్ ఎన్సీఏపీ పరీక్షలో స్లావియా, కుషాక్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందాయి. భద్రత మాకు తొలి ప్రాధాన్యత’ అని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పీటర్ సోలాక్ తెలిపారు. -
థ్యాంక్స్ టూ యాపిల్ స్మార్ట్ వాచ్, లేదంటే నా ప్రాణాలు: వైరల్ స్టోరీ
యాపిల్ వాచ్‌లోని కీలక ఫీచర్ ఇప్పటివరకు చాలామంది ప్రాణాలను కాపాడింది. భయానక పరిస్థితుల నుంచి యాపిల్ వాచ్ కారణంగా బయటపడ్డానంటూ ప్రపంచవ్యాప్తంగా పలు యూజర్లు షేర్ చేసిన పలు కథనాలూ చదివాం. తాజాగా అలాంటి మరో స్టోరీ వైరల్‌గా మార్చింది. యాపిల్ వాచ్ లేకపోయి ఉంటే.. ఈ పాటికి నా ప్రాణాలు గాలి కలిసిపోయేవే అంటూ ఒక వ్యక్తి ఈ లిస్ట్‌లో చేరారు. (వాట్సాప్ యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్: ఒకేసారి 32 మందితో) కెనడాకు చెందిన వ్యక్తి అలెగ్జాండర్ లేజర్సన్ కథనం ప్రకారం యాపిల్ వాచ్ కీలకమైన సమయంలో స్పందించి అత్యవసరమైన వ్యక్తుల ఫోల్ చేయడంతో సకాలంలో వైద్యం అందింది. తద్వారా తలకు భారీ గాయమైనా ప్రాణాలతో బతికి బైటపడ్డాడు. దీనికి ఆయన యాపిల్ స్మార్ట్‌వాచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలెగ్జాండర్ ఏదో పనిచేసుకుంటూ ఉండగా నిచ్చెనపై నుండి కింద పడిపోయాడు.దీంతో అతని తలికి తీవ్ర గాయమైంది. కానీ వెంటనే యాపిల్ వాచ్ సిరీస్ 8 స్మార్ట్ వాచ్ అత్యవసర సేవల నంబరు, అతని భార్యను డయల్ చేసింది.దీంతో వెంటనే అతడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.తలపై ఏడు కుట్లు పడ్డాయని, ప్రస్తుతం కోలుకుంటున్నానని పేర్కొన్న అలెగ్జాండర్ వాచ్‌లోని టెక్నాలజీకి ధన్యవాదాలు తెలిపారు. (టాప్ డైరెక్టర్ రాజమౌళి కొత్త అవతార్: హీరోలకు షాకే!?) కాగా యాపిల్ స్మార్ట్‌వాచ్ Apple Watch 4, ఆ తరువాతి మోడల్స్ లో ఫాల్ డిటెక్షన్ ఫీచర్ యూజర్ అందుబాటులో ఉంది. ఒకవేళ యూజర్ పడిపోతే ఈ ఫీచర్ వెంటనే అలర్ట్ అవుతుంది.ఆటోమేటిక్‌గా ఎమర్జెన్సీ సర్వీస్‌లను, వ్యక్తులకు సమాచారం ఇస్తుంది. ఈ ఫీచర్ 55 ఏళ్లు పైబడిన వినియోగదారుల కోసం ఈ ఫీచర్ స్వయంచాలకంగా ఆన్ అవుతుంది. సెటింగ్స్‌లో మాన్యువల్‌గా కూడా దీన్ని సెట్ చేసుకోవచ్చు. (తొలి జీతం 5వేలే.. ఇపుడు రిచెస్ట్ యూట్యూబర్‌గా కోట్లు, ఎలా?) -
టెస్లా కారులో సీక్రెట్ ఫీచర్! ‘ఎలాన్ మోడ్’ అని పేరుపెట్టిన హ్యాకర్
టెస్లా కార్లలో ఒక రహస్య ఫీచర్ బయటపడింది. టెస్లా సాఫ్ట్వేర్ హ్యాకర్ కనుక్కున్న ఈ ఫీచర్‌కు ‘ఎలోన్ మోడ్’ అని పేరు పెట్టినట్లు ‘ది వెర్జ్’ వార్తా సంస్థ నివేదిక తెలిపింది. ఈ ఫీచర్ టెస్లా వాహనాల్లో హ్యాండ్స్ ఫ్రీ డ్రైవింగ్‌ను అనుమతిస్తుంది. @greentheonly అనే పేరుతో ట్విటర్లో ఈ రహస్య ఫీచర్ గురించి హాకర్ పేర్కొన్నారు. ‘ఎలాన్ మోడ్’ను కనుగొని, ఎనేబుల్ చేసి పరీక్షించిన హాకర్ దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీలను ట్విటర్లో షేర్ చేశారు. అయితే ఈ ఫీచర్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారం కార్ లోపల స్క్రీన్‌పై లేదు. టెస్లా పూర్తి స్వీయ డ్రైవింగ్ (ఎఫ్ఎస్డీ) అనేది బీటా స్థితిలో పరీక్ష స్థాయిలో ఉన్న అధునాతన డ్రైవర్ సహాయక వ్యవస్థ. ప్రస్తుతానికి 15 వేల డాలర్లు అదనంగా చెల్లించిన వారికి ఇది అందుబాటులో ఉంది. కానీ ఎఫ్ఎస్డీ సాఫ్ట్‌వేర్‌పై కస్టమర్ల నుంచి చాలా ఫిర్యాదులు వచ్చినట్లు గత నెలలో బయటకు పొక్కిన ఓ అంతర్గత నివేదిక ద్వారా తెలిసింది. ఉన్నట్టుండి ఆగిపోవడం, స్పీడ్ పెరిగిపోవడం వంటి లోపాలు ఉన్నట్లు కస్టమర్లు ఫిర్యాదు చేశారు. చెయ్యి వేయాల్సిన పని లేదు! టెస్లా ఆటోపైలట్ సిస్టమ్ అనేది హైవేల కోసం కంపెనీ రూపొందించిన మొదటి తరం డ్రైవర్ సహాయక వ్యవస్థ. సెల్ఫ్ డ్రైవింగ్ అయినప్పటికీ డ్రైవింగ్ సమయంలో అందులోని వ్యక్తి అప్రమత్తంగా ఉన్నారని నిర్ధారించడానికి స్టీరింగ్ వీల్‌ను అప్పుడప్పుడు తాకాల్సి ఉంటుంది. ఇలా తరచూ చేయాల్సి ఉండటంపై కస్టమర్ల నుంచి ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పటికే ఉన్న హ్యాండ్స్ ఆన్ స్టీరింగ్ కన్ఫర్మేషన్తోపాటు సెంటర్ ఇంటీరియర్ కెమెరా డ్రైవర్లు ముందుకు చూస్తున్నారా లేదా అని గమనిస్తాయి. హాకర్ ‘ఎలాన్ మోడ్’లో నిర్వహించిన 600 మైళ్ల పరీక్షలో అలాంటి ఇబ్బందులేవీ ఎదురవ్వలేదని నివేదిక పేర్కొంది. ఈ మోడ్‌లో సిస్టమ్ లేన్లను మార్చడం, హైవేపై నెమ్మదిగా డ్రైవింగ్ ముగించడం గుర్తించినట్లు హాకర్ ట్విటర్లో వివరించారు. 2017తో పోల్చితే టెస్లా సాఫ్ట్వేర్ మరింత సురక్షితమైనదని చెప్పుకొచ్చాడు. కాగా నాజ్ఫ్రీ డ్రైవింగ్ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు గత డిసెంబర్లోనే మస్క్ హింట్ ఇచ్చారు. ఇదీ చదవండి: భారత్‌లో మొదటి టెస్లా కార్ ఇతనిదే.. And also when you kill one AP node, you retain some viz now, so now you can actually see which node does what. Node A does road layout/signs Node B does moving object detection as they still display with A dead. Also viz dies at times so you get AP functionality, but empty viz pic.twitter.com/Ldfi7cCPWh — green (@greentheonly) June 17, 2023 -
సూపర్ ఆఫర్.. డబ్బులు లేకుండా ఓయో రూమ్!
హాస్పిటాలిటీ టెక్నాలజీ కంపెనీ ఓయో (OYO) భారతీయ ప్రయాణికులకు అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. స్టే నౌ పే లేటర్ (SNPL) సౌకర్యాన్ని కల్పించింది. సాధారణంగా ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసే కస్టమర్లకు ఈ-కామర్స్ వెబ్సైట్లు, రిటైల్ షాపులు ఇలాంటి బై నౌ పే లేటర్ ఆఫర్లను అందిస్తుంటాయి. ఆఫర్ వివరాలు SNPL సౌకర్యం కింద కస్టమర్లకు రూ. 5,000 వరకు క్రెడిట్ పరిమితిని అందిస్తారు. 15 రోజుల బస తర్వాత మొత్తాన్ని సెటిల్ చేయాలి. ఈ ఫీచర్ కోసం క్రెడిట్ ఆధారిత చెల్లింపుల సేవ అయిన Simplతో ఓయో భాగస్వామ్యం కలిగి ఉంది. ఓయో యాప్ హోమ్ స్క్రీన్‌పై ఈ ఫీచర్‌ని యాక్సెస్ చేయవచ్చు లేదా చెల్లింపు మోడ్ ఎంపిక సమయంలో Simplని ఎంచుకోండి. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో iOS యూజర్లకు అందుబాటులోకి రానుంది. తరచూ ప్రయాణాలు చేసేవారికి ఈ SNPL ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుందని ఓయో గ్లోబల్ సీవోవో, చీఫ్ టెక్నాలజీ & ప్రోడక్ట్ ఆఫీసర్ అభినవ్ సిన్హా చెప్పారు. Simpl ద్వారా హోటల్ బుకింగ్ చేసుకునే కస్టమర్లకు 65 శాతం వరకు తగ్గింపుతోపాటు రూ. 50 క్యాష్‌బ్యాక్‌ను లభిస్తుంది. అయితే Simpl యాప్‌లో చెల్లింపును 15 రోజులకు మించి ఆలస్యం చేస్తే, మీ బిల్లు మొత్తాన్ని బట్టి వడ్డీ, రూ. 250 వరకు ఆలస్య రుసుముతోపాటు జీఎస్టీని విధిస్తుంది. ఇదీ చదవండి: Ritesh Agarwal: ఆ పని చేసినందుకు రూ.20 టిప్పు ఇచ్చారు: తొలినాళ్లను గుర్తు చేసుకున్న ఓయో ఫౌండర్ -
వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్.. గూగుల్ మీట్ తరహాలో
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా వీడియో కాల్స్ చేసే సమయంలో యూజర్లు వినియోగార్ధం స్క్రీన్ షేరింగ్ ఫీచర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. జూమ్, గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ తరహాలో వీడియో కాల్స్ చేస్తున్నప్పుడు స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు వాట్సాప్ సైతం అదే తరహాలో ‘స్క్రీన్ షేరింగ్’ ఆప్షన్ తెచ్చేందుకు నిమగ్నమైంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌పై బీటా టెస్టర్లకు అందుబాటులో ఉందని, త్వరలో అందరికి పూర్తిస్థాయిలో వినియోగించేలా విడుదల కానుందని వాబీటా ఇన్ఫో వెల్లడించింది. ఇక, స్క్రీన్ ఫీచర్ ముఖ్య ఉద్దేశం..యూజర్లు వీడియో కాల్ మాట్లాడే సమయంలో అదే కాల్‌ను ఇతరులకు షేర్ చేసేలా డెవెలప్ చేస్తోంది. స్క్రీన్ కింద కొత్తగా స్క్రీన్ షేరింగ్ బటన్ అందిస్తున్నది. ఈ బటన్ క్లిక్ చేస్తే సరి.. మీ ఫోన్ లో చేసేది ప్రతిదీ రికార్డు అవుతుంది. అవతలి వ్యక్తికి కూడా షేర్ అవుతుంది. అయితే ఇలా వీడియో కాలింగ్ రికార్డు చేయడానికి యూజర్ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. -
Oppo F23 5G కొత్త ఫీచర్స్ ఇవే
-
వినతుల వెల్లువ.. వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్!
న్యూఢిల్లీ: వాట్సాప్ ఓ అనుకూల సదుపాయాన్ని తన యూజర్ల కోసం రూపొందించింది. ఒకటికి మించిన ఫోన్లలో ఒక్కటే వాట్సాప్ ఖాతాను ఉపయోగించుకోవచ్చని ప్రకటించింది. అంతర్జాతీయంగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు, రానున్న వారాల్లో ప్రతి ఒక్కరికీ ఇది వినియోగంలోకి వస్తుందని పేర్కొంది. ఈ ఫీచర్ కావాలంటూ వాట్సాప్ యూజర్లలో ఎక్కువ మంది నుంచి వినతులు రావడంతో దీన్ని రూపొందించినట్టు సంస్థ తెలపింది. వాట్సాప్‌ను వెబ్ బ్రౌజర్‌కు కనెక్ట్ చేసిన మాదిరే, ఒకటికి మించిన ఫోన్లలోనూ అనుసంధానించడం ద్వారా కొత్త ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇలా ఒకే ఖాతా అనుసంధానమై ఉన్న ఏ ఫోన్లో అయినా చాట్, మీడియా, కాల్స్ సేవలు వాడుకోవచ్చని వాట్సాప్ తెలిపింది. ఒకవేళ ప్రైమరీ ఫోన్ (మొదట ఇన్స్టాల్ చేసుకున్న)లో వాట్సాప్ చాలా కాలంగా యాక్టివ్‌గా లేకపోతే, అప్పుడు ఆ అకౌంట్ కనెక్ట్ అయి ఉన్న ఇతర ఫోన్లలోనూ దానంతట అదే లాగవుట్ అవుతుందని పేర్కొంది. సైనవుట్ చేయాల్సిన అవసరం లేకుండా, ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్‌కు ‘నౌ స్విచ్’ను ఎంపిక చేసుకోవచ్చని వాట్సాప్ తెలిపింది. -
ట్రూకాలర్‌లో అదిరిపోయే ఫీచర్..
స్మార్ట్ ఫోన్ కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ (Truecaller) కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత ఎస్సెమ్మెస్ రక్షణ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మోసపూరిత మెసేజ్‌లపై అవగాహన లేని యూజర్లకు ఈ రక్షణ ఫీచర్ ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. ట్రూకాలర్ అంచనా ప్రకారం 100 మిలియన్లకుపైగా యూజర్లు ఆ యాప్‌ని ఉపయోగిస్తున్నారు. వారు గత మూడు నెలల్లో కనీసం ఒక మోసపూరిత ఎస్సెమ్మెస్ అందుకున్నారు. ఈ మోసపూరిత ఎస్సెమ్మెస్‌లు ప్రధానంగా విద్యుత్ బిల్లు చెల్లింపులు, బ్యాంకులు, ఉద్యోగ ఆఫర్లు, కేవైసీ సంబంధిత, లోన్లు, ఛారిటీ, లాటరీ వంటి అంశాలకు సంబంధించినవి వస్తున్నాయి. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! ట్రూకాలర్ ప్రవేశపెట్టిన ఈ ఎస్సెమ్మెస్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ ఫీచర్ ఫోన్లకు వచ్చే మోసపూరిత సందేశాలను తెలివిగా గుర్తించగలదు. యూజర్ రిపోర్ట్లు లేకుండానే ట్రూకాలర్స్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఫ్రాడ్ ఎస్సెమ్మెస్‌లను గుర్తిస్తుంది. కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే.. ట్రూకాలర్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ ఫీచర్ ప్రస్తుతం భారతదేశంలోని ఆండ్రాయిడ్ వినియోగదారులందరికీ ఉచితంగా అందుబాటులో ఉంది. యూజర్ ఫోన్‌కు మోసపూరిత ఎస్సెమ్మెస్ వచ్చినప్పుడు కొత్త ఫీచర్ ఆధారంగా ట్రూకాలర్ యాప్ ఎరుపు రంగు నోటిఫికేషన్ చూపుతుంది. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది. ఈ నోటిఫికేషన్ మాన్యువల్‌గా తీసేసే వరకు స్క్రీన్‌పై ఉంటుంది. ఒకవేళ యాజర్ పొరపాటున ఆ ఫ్రాడ్ మెసేజ్‌ను ఓపెన్ చేసినా అందులోని లింక్‌లను ట్రూకాలర్ డిసేబుల్ చేస్తుంది. అయితే ఆ మెసేజ్ సురక్షితమే అని యూజర్ స్పష్టంగా గుర్తించినట్లయితే మాత్రమే ఆ ఎస్సెమ్మెస్‌ను యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇదీ చదవండి: దేశంలో తొలి లిథియం బ్యాటరీ ప్లాంటు షురూ -
వాట్సాప్ అప్డేట్: ఫొటోలు, వీడియోలకు సంబంధించిన సరికొత్త ఫీచర్!
ఆసక్తికరమైన మరో కొత్త అప్డేట్పై వాట్సాప్ కసరత్తు చేస్తోంది. ఇదివరకే ఫార్వార్డ్ చేసిన ఫొటోలు, వీడియోలకు వివరణను జోడించే ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇటీవల గూగుల్ ప్లే ద్వారా బీటా వర్షన్ అప్డేట్ను విడుదల చేసింది. ఈ అప్డేట్ను ఇన్స్టాల్ చేసిన కొంతమంది టెస్టర్లకు ఇప్పటికే కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ఫార్వార్డ్ చేసిన ఫొటోలు, వీడియోలు, GIFలు, డాక్యుమెంట్లకు వివరణలను జోడించేందుకు వీలు కల్పిస్తోంది. (Isha Ambani: లగ్జరీ ఇంట్లో పార్టీ ఇచ్చిన ఇషా అంబానీ.. వీడియో, ఫొటోలు వైరల్!) అయితే స్టేటస్ అప్డేట్లను వీక్షించడం, వీడియోలను డౌన్లోడ్ చేయడంలో ఇబ్బందులు వస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ తదుపరి అప్డేట్తో ఈ సమస్యలను పరిష్కరిస్తుందని భావిస్తున్నారు. ఫార్వార్డ్ చేసిన ఫొటోలు, వీడియోలు, GIFలు, డాక్యుమెంట్లకు మరింత సమాచారాన్ని జోడించాలనుకునే యూజర్లకు కొత్త ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. (నిలిచిపోయిన నెట్‌ఫ్లిక్స్.. సబ్స్క్రయిబర్ల పరేషాన్) వాట్సాప్ తాజా అప్డేట్ ద్వారా ఫార్వార్డ్ చేసిన ఫొటోలకు ఇదివరకే ఉన్న క్యాప్షన్‌ను తొలగించి సొంత క్యాప్షన్ జోడించవచ్చే అవకాశం ఉంది. ఇలా సొంత వివరణతో ఫార్వార్డ్ చేసినప్పుడు అది అసలైనది కాదని మాత్రం గ్రహీతలకు తెలిసిపోతుంది. ఈ ఫీచర్ మరింత మంది యూజర్లకు అందుబాటులోకి వచ్చినప్పుడు దాని ప్రయోజనం గురించి మరింత బాగా తెలుస్తుంది. ఫార్వార్డ్ చేసిన ఫొటోలు, వీడియోలు, GIFలు, డాక్యుమెంట్లకు సందర్భం, ఇతర వివరాలను జోడించడం ద్వారా గ్రహీతలు వాటి గురించి మరింత ఎక్కువగా తెలుసుకునేందుకు అవకాశం కలుగుతుంది. (Dulquer Salmaan: రూ.3 కోట్లు పెట్టి దుల్కర్ సల్మాన్ కొన్న కొత్త కారు ఏంటో తెలుసా?) -
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: ఇక ఆ అవసరమే లేదు!
సాక్షి, ముంబై: రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తన వినియోగ దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆన్‌లైన టికెంట్ బుకింగ్ పద్ధతిని మరింత సులువు చేయనుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ వాయిస్ సెంట్రిక్ ఈ-టికెటింగ్ ఫీచర్‌ను త్వరలోనే ఐఆర్సీటీసీ ప్రవేశపెట్టనుంది. తాజా నివేదికల ప్రకారం తొలి దశ టెస్టింగ్ విజయవంతమైంది. ఏఐ ఆధారిత చాట్‌బాట్ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఇకపై ఐఆర్సీటీసీ లాగిన్ కావడానికి ఐడీ, పాస్వర్డ్, ఓటీపీలతో పనిలేకుండానే, కేవలం వాయిస్ ద్వారా రైలు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. టికెట్ బుక్ చేసుకునేటప్పుడు వివరాలు ఇవ్వడానికి బదులుగా, Actually అని చెబితే సరిపోతుంది. దీని కోసం కొన్ని అవసరమైన మార్పులతో AskDisha (డిజిటల్ ఇంటరాక్షన్ టు సీక్ హెల్ప్ ఏనీటైం)పరీక్షిస్తోంది. తొలి దశ పరీక్షలు విజయవంతం కావడంతో మలి దశ టెస్టింగ్‌ను మరింత వేగవంతం చేయనుంది. ఈ ఫీచర్‌ను వచ్చే 3 నెలల్లోనే కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. దీని ద్వారా ఐఆర్సీటీసీ బ్యాకెండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్మెరుగ వుతుందని భావిస్తున్నారు. ఆస్క్ దిశ 2.0 ఫీచర్ రైలు ప్రయాణానికి సంబంధించి కస్టమర్లకు ప్రశ్నలకు సమాధానాలిస్తుంది. వీటిని హిందీ లేదా ఇంగ్లిష్‌లో ప్రశ్నలు అడగవచ్చు. ఇంగ్లిష్‌లో అయితే ‘యాక్చువల్లీ’ అనే పదంతో చాటింగ్‌ను స్టార్ట్ చేయాలి. ఈ ఫీచర్ ద్వారా కస్టమర్ తన టిక్కెట్‌ను రద్దు చేసుకోవచ్చు. రద్దు చేసిన టికెట్ల నగదు రీఫండ్ స్థితిని, పీఎన్‌ఎర్ స్టేటస్‌ను కూడా చూడవచ్చు.అంతేకాదు ప్రయాణికులు బోర్డింగ్ లేదా డెస్టినేషన్ స్టేషన్‌ని కూడా మార్చుకోవచ్చు. రైలు టికెట్లను ప్రివ్యూ, ప్రింట్, షేర్ చేయవచ్చని తెలుస్తోంది. నిజానికి ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగం గత ఏడాది మార్చిలోనే ఈ ఫీచర్ గురించి ట్విటర్లో పోస్ట్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలను కూడా వెబ్సైట్లో పొందుపర్చింది. -
WhatsApp: వాట్సాప్‌లో కెప్ట్ మెసేజ్ ఫీచర్
ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ‘కెప్ట్ మెసేజ్’ అనే కొత్త ఫీచర్‌ని పరీక్షిస్తోంది. దీనితో డిజపీయరింగ్ మెసేజ్‌లను సేవ్ చేయవచ్చు. చాట్లకు సంబంధించి మరింత కంట్రోల్‌కు యూజర్లకు ఉపకరించే ఫీచర్ ఇది. 2021లో స్నాప్‌చాట్... మొదలైన వాటి స్ఫూర్తితో వాట్సాప్ ‘డిజప్పియరింగ్ మెసేజ్’ ఫీచర్‌ను ప్రవేశ పెట్టింది. ఎవరికైనా మెసేజ్ పంపినప్పుడు నిర్ణీతమైన కాలవ్యవధి తరువాత మెసేజ్ దానికదే డిలీట్ అయిపోతుంది. మళ్లీ దాన్ని చూడడం కుదరదు. అయితే ‘కెప్ట్ మెసేజ్’ టూల్ డిజప్పియరింగ్ చాట్‌లో కూడా మెసేజ్‌లను ప్రిజర్వ్ చేస్తుంది. (క్లిక్ చేయండి: ఇన్‌స్టాలో డిలీట్ చేసిన కంటెంట్‌ను రీస్టోర్ చేసుకోవడానికి...) -
చూస్తే వావ్ అనాల్సిందే, అదిరిపోనున్న వాట్సాప్ కొత్త ఫీచర్!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ ఇంటర్ఫేస్, గోప్యతను మెరుగుపరచడానికి అనేక కొత్త ఫీచర్లపై పనిచేస్తోంది. మెటా యాజమాన్యంలోని యాప్ గత సంవత్సరం యాండ్రాయిడ్ నుంచి ఐఓఎస్‌కి బదిలీ ఫీచర్‌ను విడుదల చేసింది. ఎప్పటికప్పుడు వాట్సాప్‌ను అప్డేట్ చేస్తూ యూజర్లు అందించే సేవలు విషయంలో ఏ మాత్రం రాజీలేకుండా దూసుకుపోతోంది ఈ సంస్థ. ఇటీవల గూగుల్ డ్రైవ్( Google drive)పై ఆధారపడటాన్ని తొలగించే మరొక బదిలీ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది.. యూజర్ల కోసం త్వరలో ఈ కొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ఫీచర్ ఇది వినియోగదారులు వాట్సాప్ (WhatsApp) డేటాను చాట్ హిస్టరీతో సహా ఆండ్రాయిడ్ నుంచి ఆండ్రాయిడ్‌కి ట్రాన్స్ఫర్ చేసేందుకు అనుమతిస్తుంది. యూజర్లు ఇప్పటి వరకు గూగుల్ డిస్క్ బ్యాకప్‌ని ఉపయోగించి వారి డేటాను బదిలీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొత్త అప్డేట్ థర్డ్-పార్టీ యాప్‌లపై ఆధారపడటాన్ని తొలగించనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలపింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా యూజర్లు తమ ఛాట్ హిస్టరీని ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. చదవండి: సామన్యులకు అలర్ట్: కొత్తగా మారిన రూల్స్ తెలుసుకోవడం తప్పనిసరి! -
WhatsAp: వాట్సాప్‌లో ఈ ఫీచర్ గురించి తెలుసా?
ఒక వ్యక్తికి లేదా ఒక గ్రూప్‌కు పంపాల్సిన మెసేజ్‌ను అనుకోకుండానో, పరధ్యానంలోనో వేరొకరికి పంపే సందర్భాలు వాట్సాప్ యూజర్లకు ఎదురవుతుంటాయి. ఈ హడావిడిలో ‘డిలిట్ ఫర్ ఎవ్రీ వన్’ క్లిక్ చేయడానికి బదులుగా ‘డిలిట్ ఫర్ మీ’ క్లిక్ చేసే సందర్భాలు కూడా ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాట్సాప్ ‘రివర్స్ యాక్షన్’ కోసం ‘యాక్సిడెంటల్ డిలిట్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా, మెసేజ్ డిలిట్ చేసిన తరువాత ‘మెసేజ్ డిలిటెడ్ ఫర్ మీ’ మెసేజ్‌తో చిన్న డైలాగ్బాక్స్ కనిపిస్తుంది. ఈ డైలాగ్‌బాక్స్‌లో చిన్న ‘అన్డూ’ బటన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే డిలిట్ చేసిన మెసేజ్ మళ్లీ కనిపిస్తుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్స్‌కు అందుబాటులో ఉంటుంది. (క్లిక్ చేయండి: ఇన్‌స్టాగ్రామ్‌లో 2022 రీక్యాప్.. రీల్స్ ట్యాబ్‌లోకి వెళ్లి..) -
వావ్..వాట్సాప్‌లో అదిరిపోయే సూపర్ ఫీచర్లు..అవేంటో తెలుసా?
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మార్కెట్లో కాంపిటీటర్లకు గట్టి పోటీ ఇస్తూ యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో అప్లికేషన్‌ను అప్డేట్ చేస్తూ వస్తోంది. తాజాగా ‘కమ్యూనిటీస్’ అనే ఫీచర్‌ను వాట్సాప్ సంస్థ వరల్డ్ వైడ్‌గా ఎనేబుల్ చేసింది. ఇదే విషయాన్ని మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించారు. గతంలో వాట్సాప్ గ్రూప్‌ల నిర్వహణ కష్టంగా మారడంతో.. మార్క్ జుకర్ బర్గ్ కమ్యూనిటీస్ ఫీచర్‌పై వర్క్ చేశారు. కొద్ది నెలల క్రితం బీటా వెర్షన్లో విజయ వంతంగా ట్రయల్స్ నిర్వహించి..గురువారం రియల్ టైం యూజర్లు వినియోగించేలా మార్కెట్‌కు పరిచయం చేశారు. కమ్యూనికేట్ ఫీచర్ వాట్సాప్‌లో ఫ్యామిలీ, కాలేజీ, ఆఫీస్ ఇలా అనేక గ్రూప్‌లు ఉండేవి. అయితే ఇప్పుడు ఫ్యామిలీ గ్రూప్‌లో ఎన్ని గ్రూప్‌లు ఉంటే అన్నీ గ్రూప్‌లో ఒకే గ్రూప్ కింద యాడ్ చేసుకోవచ్చు. అలా గ్రూప్‌లో యాడ్ చేసుకొని.. ఆ గ్రూప్‌కు ఒక నేమ్ సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్యామిలీలో ఫ్యామిలీ గ్రూప్‌లు, కాలేజీ గ్రూప్‌లో కాలేజీ గ్రూప్‌లు.. ఇలా డివైడ్ అయిపోతాయి. అలా గ్రూపుల్ని డివైజ్ చేయడం వల్ల వాట్సాప్ వినియోగం సులభతరం అవుతుందని మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. ఈ కమ్యూనికేట్ ఫీచర్‌తో పాటు గ్రూప్ చాట్‌లో పోల్స్ క్రియేట్ చేయడం, ఒకే సారి 32 మంది సభ్యులకు గ్రూప్ వీడియో కాల్ చేయడం, గ్రూప్ వీడియో కాల్లో పాల్గొనే సభ్యుల సంఖ్యను డబుల్ చేసిపనట్లు వాట్సాప్ ప్రతినిధులు తెలిపారు. గ్రూప్‌లో సభ్యుల సంఖ్య ఎంతంటే వాట్సాప్ గతంలో గ్రూప్ సభ్యుల సంఖ్య 512 మంది వరకు చేరే సౌకర్యం ఉంది. తాజాగా ఆ సభ్యుల సంఖ్య 1,024కి పెంచింది. తద్వారా వ్యాపార వేత్తలు వారి క్లయింట్లకు పెద్ద సంఖ్యలో మెసేజ్ సెండ్ చేయడంతో పాటు వ్యాపార కార్యకలాపాల్ని మరింత వృద్ధి చేసుకోవచ్చు. గతేడాది 256 మంది సభ్యుల నుంచి 512కి పెంచింది. కాగా వాట్సాప్ కాంపిటీటర్ టెలిగ్రాంలో సుమారు 2లక్షల మంది సభ్యులు చేరవచ్చు. కానీ వాట్సాప్ తరహాలో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ తరహాలో సెక్యూర్ లేదని టెక్ నిపుణులు చెబుతున్నారు. -
ఇన్స్టాగ్రామ్ యూజర్లకు అదిరిపోయే ఫీచర్లు..ఇక పండగే!
సాక్షి, ముంబై: మెటా యాజమాన్యంలోని ఫోటో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ఇన్స్టాగ్రామ్ యూజర్లకోసం మరో చక్కటి వెసులుబాటును కల్పిస్తోంది. ఇకపై రీల్స్‌ను ఫేస్బుక్లో పోస్ట్ చేయడం మరింత సులువు కానుంది. అంతేనా ఈ క్రమంలో వీడియో క్రియేటర్లు కోసం ఏకంగా మూడు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఇన్స్టాగ్రామ్ నుండి ఫేస్‌బుక్‌కి క్రాస్-పోస్టింగ్‌తో సహా రీల్స్‌కు కొత్త ఫీచర్లు, అప్డేట్లను విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. యూజర్ల అభిరుచులకు అనుగుణంగా అప్డేటెడ్ ఫీచర్లతో ఆకట్టుకుంటున్న ఇన్‌స్టా ప్రస్తుత ట్రెండ్‌ను క్యాష్ చేసుకుంటోంది. ముఖ్యంగా ఇన్‌స్టా రీల్స్‌కు వస్తున్న భారీ క్రేజ్ నేపథ్యంలో నేరుగా ఇన్స్టాగ్రామ్ నుంచి ఫేస్‌బుక్‌కు రీల్స్‌ను క్రాస్ పోస్టింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. దీంతోపాటు స్టోరీస్‌లో పాపులరైన ‘యాడ్ యువర్స్ స్టిక్కర్’ ఫీచర్‌ను రీల్స్‌లోనూ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక మూడవదిగా ఎఫ్బీలో రీల్స్ రీచ్, యావరేజ్ వ్యూస్ టైం, టోటల్ వ్యూస్టైంను తెలుసుకునే అవకాశం కూడా యూజర్లకు కలగనుంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్లను త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. (ప్రత్యేక డిపాజిట్ స్కీమ్: లక్ష డిపాజిట్ చేస్తే దాదాపు లక్షా 28 వేలు!) మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ఫోటో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ హెడ్ ఆడమ్ మొస్సేరి కొత్త రీల్స్ అప్డేట్స్ను ప్రకటించారు. స్టోరీస్‌లో పాపులర్ అయిన యాడ్ యువర్స్ స్టిక్కర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో పోస్టింగ్ కోసం రీల్స్ ఫీచర్ అప్డేట్ వస్తోందని మొస్సేరి వెల్లడించారు. అలాగే యాడ్ యువర్స్ స్టిక్కర్, ఐజీ-ఎఫ్బీ క్రాస్ పోస్టింగ్, ఎఫ్బీ రీల్స్ ఇన్సైట్స్ అనే మూడు ఫీచర్లు అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. 📣 Reels Updates 📣 We’re launching a few new Reels features to make it fun and easy for people to find + share more entertaining content: - ‘Add Yours’ Sticker - IG-to-FB Crossposting - FB Reels Insights Have a favorite? Let me know 👇🏼 pic.twitter.com/RwjnRu5om2 — Adam Mosseri (@mosseri) August 16, 2022 -
ఈ కొత్త వాట్సాప్ ఫీచర్ గురించి మీకు తెలుసా?
వాట్సాప్ యూజర్లకు శుభవార్త. సెక్యూరీటీ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్న వాట్సాప్ త్వరలో లాగిన్ అప్రూవల్ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సందర్భానుసారం మనం ఉపయోగించే కంప్యూటర్లో జీమెయిల్ అకౌంట్‌ను ఓపెన్ చేస్తుంటాం. అలా కాకుండా కొత్త కంప్యూటర్లలో జీమెయిల్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తే..జీమెయిల్ ఓపెన్ చేసేది మీరేనా? కాదా అంటూ మన ఫోన్లకు అలెర్ట్ మెసేజ్ వస్తుంది. ఇదే తరహాలో ఇన్‌స్ట్రాగ్రామ్‌లో సైతం లాగిన్ అప్రూవల్ అడుగుతుంది. త్వరలో వాట్సాప్ సైతం ఈ తరహా సెక్యూరిటీ ఫీచర్‌ను ఎనేబుల్ చేయనుంది. యూజర్లు పొరపాటున కొత్త డివైజ్ నుంచి వాట్సాప్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తే.. వెంటనే మనకు సదరు వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేసేది ఎవరని ప్రశ్నిస్తూ ఓ మెసేజ్ పంపుతుంది. ఆ మేసేజ్‌కు మీరు రిప్లయి ఇస్తేనే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. వాట్సాప్ బ్లాగ్ వీ బీటా ఇన్ఫో ప్రకారం..ఎవరైనా “ఎవరైనా మీ వాట్సాప్ అకౌంట్లో లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మీరు అందుకు అంగీకరించాల్సి ఉంటుంది. అంతేకాదు 6 అంకెల ఓటీపీని షేర్ చేస్తే.. ఆ నెంబర్‌ను తప్పుగా ఎంటర్ చేస్తే చివరకు లాగిన్ అయ్యే అవకాశాన్ని కోల్పోవచ్చు. అదనంగా, మీ వాట్సాప్ అకౌంట్‌ను మీకు తెలియకుండా ఎవరైనా లాగిన్ అయేందుకు ప్రయత్నిస్తే.. ఆఫోన్ వివరాలు, టైంతో పాటు ఇతర సమాచారం పొందవచ్చని పేర్కొంది. -
టిక్‌టాక్ పోటీగా ఫేస్బుక్.. సరికొత్త ఫీచర్‌తో
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్.. తన కాంపిటీటర్ టిక్ టాక్‌కు చెక్ పెట్టేలా కొత్త కొత్త ఫీచర్లను అప్డేట్ చేస్తుంది. ఇప్పటికే టిక్ టాక్ తరహాలో షార్ట్ వీడియోలు వీక్షించడంతో పాటు ఇన్స్టాగ్రాం పోస్ట్‌లు సైతం ఫేస్బుక్లో కన్వర్ట్ అయ్యేలా డిజైన్ చేసింది. అయితే తాజాగా ఫేస్బుక్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. 'ఫీడ్'అనే పేరుతో ఫేస్బుక్ కొత్త ఫీచర్‌ను ఎనేబుల్ చేస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూజర్లు కోరిన విధంగా మోస్ట్ రిక్వెస్టెడ్ ఫీచర్ 'ఫీడ్' ఫీచర్‌ను డెవలప్ చేశాం. ఈ ఫీచర్ సాయంతో ఫ్రెండ్స్, గ్రూప్స్, పేజెస్‌లో అప్డేట్ అయ్యే లేటెస్ట్ పోస్ట్‌లను వీక్షించవచ్చు. స్నేహితులు ఏం పోస్ట్ చేస్తున్నారో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు అది నెరవేరబోతుందని అన్నారు. త్వరలో డెస్క్ టాప్ ప్రస్తుతం ఫీడ్ ఫీచర్ స్మార్ట్ ఫోన్లలో వీక్షించ వచ్చని పేస్బుక్ తన పోస్ట్‌లో తెలిపింది. మరికొన్ని వారాల్లో డెస్క్ టాప్ వెర్షన్లో సైతం ఈ ఫీచర్ సాయంతో లేటెస్ట్ పోస్ట్‌లను చూడొచ్చని ఫేస్బుక్ పేర్కొంది. యూజర్లకు మరింత ఆసక్తిగా యూజర్లకు లేటెస్ట్ సోషల్ మీడియా కంటెంట్‌ను అందించాలనే లక్ష్యంతో గత కొన్నేళ్లుగా అల్గారిథమ్‌ను అభివృద్ధి చేస్తుంది. తాజా ఎనేబుల్ చేసిన కొత్త ఫీచర్ సైతం అందులో భాగమేనని ఫేస్బుక్ తెలిపింది. తద్వారా యూజర్లు రీల్స్ క్రియేట్ చేయడం, వారి కనెక్షన్లు ఫీడ్‌లో ఎలాంటి పోస్ట్‌లు ఉన్నాయో చూడొచ్చు. కొత్త యూజర్లను అట్రాక్ట్ చేసేందుకు ఉపయోగపడుతుందని ఫేస్బుక్ భావిస్తోంది.