న్యూఢిల్లీ: ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్‌తో చేసుకున్న ఒప్పందానికి వ్యతిరేకంగా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఫ్యూచర్ గ్రూప్ న్యూఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. రేపు ఆ పిటిషన్ విచారణకు రానున్నది. ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్, ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన అప్పీలును మార్చి 22న చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జస్మీత్ సింగ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించనుంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా కిశోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ సింగపూర్ ఆర్బిట్రేటర్ ఆదేశాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందని, ఈ ఒప్పందంపై తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించినట్లు జస్టిస్ జెఆర్ మిధా ధర్మాసనం పేర్కొంది. అయితే, సింగిల్ బెంచ్ ఆదేశాల ప్రభావం ప్రస్తుతం ‘నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్సీఎల్టీ)’ ముందు పిటిషన్‌పై ఉండబోదని ఫ్యూచర్ గ్రూప్ పేర్కొనడం గమనార్హం.
ఫ్యూచర్ గ్రూపుకు సంబంధించిన బియానీ, ఇతరుల ఆస్తులను అటాచ్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఫ్యూచర్ గ్రూప్ ఈ కేసుకు సంబంధించి లేవనెత్తిన అభ్యంతరాలన్నింటినీ తోసిపుచ్చుతూ ఫ్యూచర్ గ్రూప్ సంస్థ డైరెక్టర్లపై రూ. 20 లక్షల ‘కాస్ట్’ను విధించింది. ఢిల్లీ కేటగిరీలో సీనియర్ సిటిజన్లు, పేదలకు వ్యాక్సినేషన్ వినియోగించే విధంగా రెండు వారాల్లో రూ.20 లక్షల కాస్ట్ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయక నిధిలో డిపాజిట్ చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. రిలయన్స్‌తో గ్రూప్‌తో కుదిరిన రూ.24,713 కోట్ల విక్రయ ఒప్పందం అమలు విషయంలో ముందుకు వెళ్లొద్దని ఢిల్లీ హైకోర్టు మార్చి 18న కిశోర్ బియానీ నేతృత్వంలోని రిటైల్ జెయింట్ ఫ్యూచర్ గ్రూప్‌ను ఆదేశించింది. ఈ విషయంలో ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment