ఫేస్‌బుక్‌లో రహస్య ప్రేమ! | How Does Facebook Secret Crush Work? | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో ‘సీక్రెట్‌ క్రష్‌’ ఫీచర్‌

Published Fri, Sep 6 2019 7:58 PM | Last Updated on Fri, Sep 6 2019 7:58 PM

How Does Facebook Secret Crush Work? - Sakshi

న్యూఢిల్లీ : సోషల్‌ మీడియాలో ఎంతో ప్రాచుర్యం పొందిన ‘ఫేస్‌బుక్‌’ అమెరికా వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ‘సీక్రెట్‌ క్రష్‌ (రహస్య ప్రేమ)’ పేరిట డేటింగ్‌ ఫ్లాట్‌ఫారమ్‌ను తీసుకొచ్చింది. ఈ ఫ్లాట్‌ఫామ్‌పై తమ ఇష్టాయిష్టాలను నిర్భయంగా పరస్పరం పంచుకోవచ్చు. తమ మిత్రుల మిత్రులను కూడా దీని ద్వారా పరిచయం చేయవచ్చు. వారి వివరాలను కూడా ఈ కొత్త ఫీచర్‌లో పొందుపర్చవచ్చు. దీనికి ఫేస్‌బుక్‌ యూజర్లతోపాటు ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లను, ఇన్‌స్టాగ్రామ్‌ ఫొటోలను కూడా అనుసంధానించవచ్చు.

‘టిండర్‌’ అనే డేటింగ్‌ వెబ్‌సైట్‌కు పోటీగా తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్‌ను ఫేస్‌బుక్‌ గురువారం నుంచే అమెరికా యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఇతర డేటింగ్‌ సైట్లలాగా ఒకరితో ఒకరు కనెక్ట్‌ కావడానికి పరస్పరం ‘మ్యాచ్‌’ కావాల్సిన అవసరం లేదు. ఫ్రొఫైల్‌ను లైక్‌ చేయడం ద్వారా, ఫొటోపై వాఖ్యానం చేయడం ద్వారా ‘సీక్రెట్‌ క్రష్‌’తో ఒకరికొకరు సంధానం కావచ్చు. ఈ కొత్త ఫీచర్‌లో ఒక్కరు తొమ్మిది మంది ఫేస్‌బుక్‌ లేదా ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు కనెక్ట్‌ కావచ్చు. తద్వారా వారి మిత్రులే కాకుండా మిత్రుల మిత్రుల ప్రొఫైల్స్‌ను కూడా షేర్‌ చేసుకోవచ్చు. మాట్లాడుకోవచ్చు. ఎదుటి వారు నచ్చని పక్షంలో సింపుల్‌గా ఇంటూ మార్క్‌ను క్లిక్‌ చేసి ముందుకు పోవచ్చు.

ఓ యూజర్‌కు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో నిక్షిప్తం చేసిన సమాచారం, ఫొటోలను నేరుగా ఈ ‘సీక్రెట్‌ క్రష్‌’పైకి తీసుకొచ్చి మిత్రులతో షేరు చేసుకోవచ్చు. నిజంగా డేటింగ్‌ చేయాలనుకుంటున్న వారి జాబితాను కూడా ఇందులో ‘సీక్రెట్‌’గా దాచుకోవచ్చు. ఇందులో యూజర్ల వ్యక్తీకరణ, గోప్యతను ఈ ‘సీక్రెట్‌ క్రష్‌’ సమతౌల్యం చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఫేస్‌బుక్, గూగుల్‌ లాంటి టెక్‌ దిగ్గజ సంస్థలను యూజర్ల వ్యక్తిగత గోప్యతను పరిరక్షించలేక పోతున్నాయంటూ ఇటీవల ఎక్కువగా విమర్శలు వచ్చిన విషయం తెల్సిందే. (ఇది చదవండి: 41 కోట్ల యూజర్ల వివరాలు లీక్‌)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement