వెబ్‌డెస్క్: టెక్ దిగ్గజం ఆపిల్ నుంచి మరిన్ని అప్‌డేట్స్ రానున్నాయి. ఆపిల్ సంస్థ ఉత్పత్తులైన ఐఫోన్, మాక్‌ప్యాడ్, ఐప్యాడ్ , ఐవాచ్, ఆపిల్ టీవీలకు సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్, హార్డ్‌వేర్‌లలలో ఆపిల్మార్పులు తీసుకురాబోతుంది. జూన్ 7 నుంచి 11 వరకు జరిగే వలర్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో ఆపిల్ ఈ వివరాలు వెల్లడించనుంది.
ఇంటెల్ స్థానంలో
జూన్ 7 నుంచి 11 వరకు ఐదు రోజుల పాటు వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(WWDC) జరగనుంది. కరోనా నేపథ్యంలో ఈ సారి కూడా వర్చువల్ పద్దతిలోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్ వేదికగా తమ ఉత్పత్తుల్లో తీసుకురాబోయే అప్‌డేట్స్ ఆపిల్ సంస్థ ప్రకటించనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా మ్యాక్‌ప్యాడ్‌కు సంబంధించి హార్డ్‌వేర్‌లో కీలక మార్పులు ఆపిల్ తీసుకురానుంది. ఇప్పటి వరకు ఆపిల్ మాక్‌ప్యాడ్‌లలో ఇంటెల్ ప్రాసెసర్లు ఉపయోగించగా... ఇకపై వాటి స్థానంలో ఆపిల్ స్వంతగా రూపొందించిన ప్రాసెసర్లు వినియోగిస్తారని సమాచారం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం జూన్ 7న ఆరంభమయ్యే డబ్ల్యూడబ్ల్యూడీసీలో వెల్లడికానుంది.
ఆపరేటింగ్‌లో అప్‌డేట్స్
మ్యాక్‌ప్యాడ్, ఐప్యాడ్, టీవీలకు సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్‌లో కీలక అప్‌డేట్స్‌ను ఆపిల్ ప్రకటించనుంది. ఆపిల్ ఉత్పత్తులు మరింత ప్రభావంతంగా పని చేసేలా, యూజర్ ఫ్రెండ్లీగా ఈ అప్‌డేట్స్ ఉండనున్నట్లు సమాచారం. ముఖ్యంగా మ్యాక్‌ప్యాడ్‌కి సంబంధించి ఓఎస్ 12, ఆపిల్ ఫోన్లకు సంబంధించి ఓఎస్ 15లో ఉండే కీలక ఫీచర్లను డబ్ల్యూడబ్ల్యూడీసీలో ఆపిల్ సంస్థ వెల్లడించే అవకాశం ఉంది. కరోనా కల్లోలం చుట్టుముట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో తమ వినియోగదారులకు ఆరోగ్య సమాచారం అందించేలా తన ఉత్పత్తుల్లో కొత్త ఫీచర్లు ఆపిల్ తీసుకురానున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment