యాపిల్ వాచ్‌లోని కీలక ఫీచర్ ఇప్పటివరకు చాలామంది ప్రాణాలను కాపాడింది. భయానక పరిస్థితుల నుంచి యాపిల్ వాచ్ కారణంగా బయటపడ్డానంటూ ప్రపంచవ్యాప్తంగా పలు యూజర్లు షేర్ చేసిన పలు కథనాలూ చదివాం. తాజాగా అలాంటి మరో స్టోరీ వైరల్‌గా మార్చింది. యాపిల్ వాచ్ లేకపోయి ఉంటే.. ఈ పాటికి నా ప్రాణాలు గాలి కలిసిపోయేవే అంటూ ఒక వ్యక్తి ఈ లిస్ట్‌లో చేరారు. (వాట్సాప్ యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్: ఒకేసారి 32 మందితో)
కెనడాకు చెందిన వ్యక్తి అలెగ్జాండర్ లేజర్సన్ కథనం ప్రకారం యాపిల్ వాచ్ కీలకమైన సమయంలో స్పందించి అత్యవసరమైన వ్యక్తుల ఫోల్ చేయడంతో సకాలంలో వైద్యం అందింది. తద్వారా తలకు భారీ గాయమైనా ప్రాణాలతో బతికి బైటపడ్డాడు. దీనికి ఆయన యాపిల్ స్మార్ట్‌వాచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
అలెగ్జాండర్ ఏదో పనిచేసుకుంటూ ఉండగా నిచ్చెనపై నుండి కింద పడిపోయాడు.దీంతో అతని తలికి తీవ్ర గాయమైంది. కానీ వెంటనే యాపిల్ వాచ్ సిరీస్ 8 స్మార్ట్ వాచ్ అత్యవసర సేవల నంబరు, అతని భార్యను డయల్ చేసింది.దీంతో వెంటనే అతడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.తలపై ఏడు కుట్లు పడ్డాయని, ప్రస్తుతం కోలుకుంటున్నానని పేర్కొన్న అలెగ్జాండర్ వాచ్‌లోని టెక్నాలజీకి ధన్యవాదాలు తెలిపారు. (టాప్ డైరెక్టర్ రాజమౌళి కొత్త అవతార్: హీరోలకు షాకే!?)
కాగా యాపిల్ స్మార్ట్‌వాచ్ Apple Watch 4, ఆ తరువాతి మోడల్స్ లో ఫాల్ డిటెక్షన్ ఫీచర్ యూజర్ అందుబాటులో ఉంది. ఒకవేళ యూజర్ పడిపోతే ఈ ఫీచర్ వెంటనే అలర్ట్ అవుతుంది.ఆటోమేటిక్‌గా ఎమర్జెన్సీ సర్వీస్‌లను, వ్యక్తులకు సమాచారం ఇస్తుంది. ఈ ఫీచర్ 55 ఏళ్లు పైబడిన వినియోగదారుల కోసం ఈ ఫీచర్ స్వయంచాలకంగా ఆన్ అవుతుంది. సెటింగ్స్‌లో మాన్యువల్‌గా కూడా దీన్ని సెట్ చేసుకోవచ్చు. (తొలి జీతం 5వేలే.. ఇపుడు రిచెస్ట్ యూట్యూబర్‌గా కోట్లు, ఎలా?)
Comments
Please login to add a commentAdd a comment