detection
-
బీఎస్ఎన్ఎల్ కొత్త టెక్నాలజీ.. అక్టోబర్ నుంచి..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్పామ్ కాల్స్ కట్టడికి ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్/మెషీన్ లెర్నింగ్ ఆధారిత సాంకేతికతను త్వరలో వినియోగించనుంది. ‘ఈ టెక్నాలజీ తుది దశలో ఉంది. స్పామ్లు మిమ్మల్ని చేరుకోవడానికి ముందే వాటిని గుర్తించి, తటస్థీకరించి, తొలగించడానికి ఇది రూపొందింది’ అని ఎక్స్ వేదికగా బీఎస్ఎన్ఎల్ ట్వీట్ చేసింది.న్యూఢిల్లీలోని భారత్ మండపంలో అక్టోబర్ 15–18 మధ్య జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ఈ పరిష్కారాన్ని బీఎస్ఎన్ఎల్ పరిచయం చేయనుంది. స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్లను నిలువరించే టెక్నాలజీని ఈ నెల 25న ఎయిర్టెల్ ప్రకటించిన నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. పెరుగుతున్న అయాచిత వాణిజ్య సమాచార మార్పిడి ముప్పును అరికట్టడానికి టెల్కోలు కఠిన చర్యలు తీసుకోవాలని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
స్మార్ట్ స్కోప్: సర్వైకల్ క్యాన్సర్‌ను ముందుగానే.. కనిపెట్టొచ్చు
సర్వైకల్ క్యాన్సర్‌ను ముందుగానే పసిగట్టే సంస్థ ‘స్మార్ట్ స్కోప్’ అనే డిజిటల్ డివైజ్‌ను రూపొందించింది పుణెలోని పెరివింకిల్ టెక్నాలజీస్... మహిళలకు ఎక్కువగా వచ్చే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని పసిగట్టడంలో ‘స్మార్ట్ స్కోప్’ కీలకపాత్ర పోషిస్తోంది. యూఎస్, యూకేలలో పని చేసిన వీణా మోక్తాలి ఆమె భర్త కౌస్తుభ్ నాయక్‌లు మన దేశానికి వచ్చి పుణె కేంద్రంగా పెరివింకిల్ టెక్నాలజీకి శ్రీకారం చుట్టారు. ఈ కంపెనీ నుంచి వచ్చిన ‘స్మార్ట్ స్కోప్’ డిజిటల్ డివైజ్ సులభంగా ఉపయోగించేలా ఉంటుంది. ‘ప్రస్తుతం ఉన్న సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పద్ధతులు సమయం తీసుకుంటాయి. ఈ సౌకర్యాలు పెద్ద నగరాల్లోని సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఫలితంగా ఎక్కువమంది మహిళలు స్క్రీనింగ్ చేయించుకోలేకపోతున్నారు’ అంటుంది వీణ. ఈ నేపథ్యంలో ‘స్మార్ట్ స్కోప్’ అనేది చిన్న ప్రైవేట్ క్లినిక్, నర్సింగ్ హోమ్స్, మున్సిపల్ డిస్పెన్సరీలు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, జిల్లా ఆస్పత్రులలో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఒక బ్యాంకు మేనేజర్‌కు గ్రేడ్–2 దశలో క్యాన్సర్‌ని గుర్తించడంలో స్మార్ట్ స్కోప్ ఉపయోగపడింది. మన దేశంలోని ఆరు రాష్ట్రాలకు చెందిన లక్షమంది ఈ పరికరం సహాయంతో జాగ్రత్త పడ్డారు. ఈ డివైజ్ నిర్వహణ ఖర్చు తక్కువ కావడం కూడా మరో సానుకూల అంశం. ‘కూలి పనుల వల్ల రోజుల తరబడి ప్రయాణాలు చేసే టైమ్ గ్రామీణ మహిళలకు ఉండడం లేదు. స్మార్ట్ స్కోప్ ద్వారా ఫలితం కోసం ఎక్కువ సమయం ఎదురు చూడాల్సిన అవసరం లేదు’ అంటుంది వీణ. అంతర్జాతీయ మార్కెట్లోకి కూడా విస్తరించాలనే లక్ష్యం ఏర్పాటు చేసుకొని ఆ దిశగా వడి వడిగా అడుగులు వేస్తోంది వీణా మొక్తాలి. ఇవి చదవండి: అనిషా పదుకోన్: మహిళల మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు.. -
Shanya Gill: పన్నెండు సంవత్సరాల వయసులోనే ఫైర్–డిటెక్షన్ డివైజ్ ఆవిష్కరణ
సైన్స్ పాఠాలను కూడా చందమామ కథల్లా ఆసక్తిగా వింటుంది శణ్య గిల్. ఆ ఆసక్తి వృథా పోలేదు. చిన్నవయసులోనే ఆవిష్కర్తను చేసింది. థర్మో ఫిషర్ సైంటిఫిక్ జూనియర్ ఇన్వెంటర్స్ ఛాలెంజ్–2023లో పన్నెండు సంవత్సరాల శణ్య గిల్ తయారు చేసిన ఫైర్–డిటెక్షన్ డివైజ్ ప్రథమ స్థానంలో నిలిచింది... కాలిఫోర్నియా(యూఎస్)లో సిక్త్స్–గ్రేడ్ చదువుతుంది శణ్య. సైన్స్, సైంటిస్ట్‌లు తనకు బాగా ఇష్టం. సైన్స్‌లో కొత్త ఆవిష్కరణల గురించి తెలుసుకోవడం అంటే ఆసక్తి. శణ్య గిల్ ఇంటికి సమీపంలోని ఒక రెస్టారెంట్లో అగ్నిప్రమాదం జరిగి భారీ నష్టం సంభవించింది. ఇంటా బయటా ఈ ప్రమాదానికి సంబంధించిన రకరకాల మాటలు ఎక్కడో ఒక చోట వినేది శణ్య గిల్. అగ్ని ప్రమాదాలు నివారించడానికి ఒక పరికరం తయారు చేయాలనుకుంది. రకరకాల ప్రయోగాలు చేసింది. ఆ ప్రయోగాలు వృథా పోలేదు. కంప్యూటర్‌కు అనుసంధానించిన థర్మల్ కెమెరాను ఉపయోగించి సమర్థవంతమైన ఫైర్–డిటెక్షన్ సిస్టమ్‌ను రూపొందించింది శణ్య. శణ్య తయారు చేసిన ఫైర్–డిటెక్షన్ డివైజ్ సాధారణ సంప్రదాయ స్మోక్ డిటెక్టర్ కంటే చాలా వేగంగా పనిచేస్తుంది. నష్టం జరగకుండా అప్రమత్తం చేస్తుంది. ‘రెస్టారెంట్ అగ్నిప్రమాదం ప్రభావంతో అమ్మ రకరకాలుగా భయపడేది. కిచెన్‌లోని స్టవ్ ఆఫ్ అయిందో లేదో అమ్మ ఒకటికి రెండుసార్లు చెక్ చేసేది. ఎన్నో జాగ్రత్తలు తీసుకునేది. మరోవైపు ఎక్కడ చూసినా ఆ అగ్నిప్రమాదానికి సంబంధించే మాట్లాడుకునేవారు. ఇదంతా చూసిన తరువాత అగ్నిప్రమాదాలను నివారించే పరికరాన్ని తయారు చేయాలనుకున్నాను. నేను తయారు చేసిన ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ద్వారా ఎంతో మందిని అగ్నిప్రమాదాల బారిన పడకుండా కాపాడవచ్చు’ అంటుంది శణ్య గిల్. శణ్యకు సైన్స్‌తోపాటు ఆటలు, క్రాఫ్టింగ్, కోడింగ్ అంటే ఇష్టం. జూనియర్లకు పాఠాలు చెప్పడం అంటే ఇష్టం. బయో మెడికల్ ఇంజనీర్ కావాలనేది శణ్య గిల్ లక్ష్యం. -
కెమెరాలే మంటను డిటెక్ట్ చేసేలా..సరికొత్త ఆవిష్కరణ!
అగ్ని ప్రమాదాలను ఎంత ముందుగా పసిగట్టగలిగితే నష్టాన్ని అంతగా తగ్గించవచ్చు. స్మోక్ డిటెక్టర్ల వంటి పరికరాలు ఇందుకే వాడుతుంటాం మనం. అయితే వీటితో కొన్ని చిక్కులున్నాయి. ప్రమాదాన్ని గుర్తించి స్పందించేందుకు కొంత సమయం పడుతుంది. ఈ సమస్యను కూడా అధిగమించేలా చాలా వేగంగా మంటలు, అగ్ని ప్రమాదాలను గుర్తించేందుకు ఓ అద్భుత పరికరాన్ని భారత సంతతి విద్యార్థి ఒకరు ఆవిష్కరించారు. ఆ వినూత్న ఆవిష్కరణకు గానూ రూ. 21 లక్షల ఫ్రైజ్ మనీని గెలుపొందింది. వివరాల్లోకెళ్తే..కాలిఫోర్నియాలో శాన్‌జోస్‌కు చెందని 12 ఏళ్ల షాన్యా గిల్ ఆమె రూపొందించిన ఫైర్ డిటెక్టర్ డివైస్ థర్మో ఫిషర్ సైంటిఫిక్ జూనియర్ ఇన్నోవేటర్స్ ఛాలెంజ్ పోటీల్లో అత్యున్నత అవార్డు థర్మో ఫిషర్ సైంటిఫిక్ ఆస్కెండ్ అవార్డును గెలుచుకుంది. తాను చూసిన ఆ ప్రమాదం షాన్యాను ఆ డివైజ్‌ను రూపొందించడానికి ప్రేరేపించింది. 2022 వేసవిలో తమ ఇంటి వెనుక ఉన్న రెస్టారెంట్ అగ్నిప్రమాదానికి గురైంది. దీంతో తన అమ్మ చాలా జాగ్రత్తగా ఉండేదని. ఇంటి నుంచి బయటకొస్తే చాలు వంటగదిలో స్టవ్ ఆఫ్ అయ్యిందో లేదో అని ఒకటికి రెండుసార్లు చెక్ చేయడం లేదా ఒక్కోసారి తననే చూడమని పదేపదే అడుగుతుండేదని చెబుతోంది షాన్యా. దీంతో ఈ సమస్యను ఎలా నివారించాలని ఆలోచిస్తుండగా.. థర్మల్ కెమెరాలు శీతకాలంలో ఇళ్లలో వేడి లేకపోవడాన్ని గుర్తించగలవని కనుగొంది. ఈ కెమెరాలే ఇళ్లలోని మంటలను త్వరితగతిన గుర్తించగలవా? అని ఆశ్చర్యపోయింది. ఆ థర్మల్ కెమరానే కాంపాక్ట్ కంప్యూటర్‌కు కనెక్ట్ చేసే ఫైర్ డిటెక్షన్ సిస్టమ్‌ను రూపొందించింది. ఆ తర్వాత వ్యక్తుల మధ్య తేడాను గుర్తించేలా ప్రోగ్రామింగ్ చేసింది. ఫలితంగా బర్న్ అయ్యే వస్తువులను ఐడెంటిఫై చేయడం మొదలు పెట్టింది షాన్యా రూపొందించిన డివైజ్. ఈ ముందస్తు హెచ్చరికతో ప్రతి ఏడాది వేలాది మంది ప్రాణాలను రక్షించగలుగుతామని చెప్పుకొచ్చింది. ఈ డివైజ్ సుమారు పది నిమిషాలన పాటు మనుషులను గుర్తించడమే కాకుడుండా వేడకి కారణమయ్యే వాటిని గుర్తించి టెక్స్ట్ సందేశాన్ని ఇచ్చేలా ప్రోగ్రామ్ చేసింది. ఈ డివైజ్ నూటికి 97 శాతం మనుషులను, ఉష్ణానికి కారణమయ్యే కారకాలను విజయవంతంగా గుర్తిస్తోంది. ఈ ఫైర్ డిటెక్షన్ ఆవిష్కరణకు గానూ శాన్యా అత్యున్నత అవార్డు తోపాటు సుమారు రూ. 21 లక్షలు ఫ్రైజ్ మనీని గెలుచుకుని అందరిచేత శెభాష్ అని ప్రసంశలందుకుంది. (చదవండి: కూతురి పెళ్లిలో స్లిమ్‌గా కనిపించాలని ఆ మాత్రలు వేసుకుంది..అంతే ఆమె..) -
థ్యాంక్స్ టూ యాపిల్ స్మార్ట్ వాచ్, లేదంటే నా ప్రాణాలు: వైరల్ స్టోరీ
యాపిల్ వాచ్‌లోని కీలక ఫీచర్ ఇప్పటివరకు చాలామంది ప్రాణాలను కాపాడింది. భయానక పరిస్థితుల నుంచి యాపిల్ వాచ్ కారణంగా బయటపడ్డానంటూ ప్రపంచవ్యాప్తంగా పలు యూజర్లు షేర్ చేసిన పలు కథనాలూ చదివాం. తాజాగా అలాంటి మరో స్టోరీ వైరల్‌గా మార్చింది. యాపిల్ వాచ్ లేకపోయి ఉంటే.. ఈ పాటికి నా ప్రాణాలు గాలి కలిసిపోయేవే అంటూ ఒక వ్యక్తి ఈ లిస్ట్‌లో చేరారు. (వాట్సాప్ యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్: ఒకేసారి 32 మందితో) కెనడాకు చెందిన వ్యక్తి అలెగ్జాండర్ లేజర్సన్ కథనం ప్రకారం యాపిల్ వాచ్ కీలకమైన సమయంలో స్పందించి అత్యవసరమైన వ్యక్తుల ఫోల్ చేయడంతో సకాలంలో వైద్యం అందింది. తద్వారా తలకు భారీ గాయమైనా ప్రాణాలతో బతికి బైటపడ్డాడు. దీనికి ఆయన యాపిల్ స్మార్ట్‌వాచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలెగ్జాండర్ ఏదో పనిచేసుకుంటూ ఉండగా నిచ్చెనపై నుండి కింద పడిపోయాడు.దీంతో అతని తలికి తీవ్ర గాయమైంది. కానీ వెంటనే యాపిల్ వాచ్ సిరీస్ 8 స్మార్ట్ వాచ్ అత్యవసర సేవల నంబరు, అతని భార్యను డయల్ చేసింది.దీంతో వెంటనే అతడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.తలపై ఏడు కుట్లు పడ్డాయని, ప్రస్తుతం కోలుకుంటున్నానని పేర్కొన్న అలెగ్జాండర్ వాచ్‌లోని టెక్నాలజీకి ధన్యవాదాలు తెలిపారు. (టాప్ డైరెక్టర్ రాజమౌళి కొత్త అవతార్: హీరోలకు షాకే!?) కాగా యాపిల్ స్మార్ట్‌వాచ్ Apple Watch 4, ఆ తరువాతి మోడల్స్ లో ఫాల్ డిటెక్షన్ ఫీచర్ యూజర్ అందుబాటులో ఉంది. ఒకవేళ యూజర్ పడిపోతే ఈ ఫీచర్ వెంటనే అలర్ట్ అవుతుంది.ఆటోమేటిక్‌గా ఎమర్జెన్సీ సర్వీస్‌లను, వ్యక్తులకు సమాచారం ఇస్తుంది. ఈ ఫీచర్ 55 ఏళ్లు పైబడిన వినియోగదారుల కోసం ఈ ఫీచర్ స్వయంచాలకంగా ఆన్ అవుతుంది. సెటింగ్స్‌లో మాన్యువల్‌గా కూడా దీన్ని సెట్ చేసుకోవచ్చు. (తొలి జీతం 5వేలే.. ఇపుడు రిచెస్ట్ యూట్యూబర్‌గా కోట్లు, ఎలా?) -
యాహూ.. అంబులెన్స్ కంటే ముందే వెళ్లా.. నా భార్యను కాపాడుకున్నా!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ గత కొన్నేళ్లుగా యూజర్ల ప్రాణాల్ని కాపాడేలా క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌తో ప్రొడక్ట్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, యాపిల్ వాచ్ సిరీస్ 8, యాపిల్ వాచ్ ఆల్ట్రాలలో ఈ లేటెస్ట్ అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఆ ఫీచరే ఓ మహిళ ప్రాణాల్ని కాపాడింది. అదెలా అంటారా? రెడ్డిట్ పోస్ట్ ప్రకారం..ఐఫోన్ 14 క్రాష్ డిటెక్షన్ ఫీచర్ భార్య రోడ్డు ప్రమాదానికి గురైందంటూ భర్తను అప్రమత్తం చేసింది. అంతేకాదు యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందో అడ్రస్ చెప్పి భర్తను అలెర్ట్ చేయడంతో అంబులెన్స్ కంటే ముందే వెళ్లి ఘటన స్థలంలో నెత్తుటి మడుగులో ఉన్న భార్యను ఆస్పత్రికి తరలించి ప్రాణం కాపాడుకున్నాడు. ఈ సందర్భంగా భర్త తనకు ఎదురైన అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. నేను ఆఫీస్ పని మీద క్లయింట్‌ను కలిసిందేకు వెళ్తున్నాను. అదే సమయంలో దుకాణం నుంచి ఇంటికి వెళ్తున్న నా భార్య ఫోన్ చేస్తే..ఆమెతో మాట్లాడుతున్నాను. అలా మాట్లాడుతుండగానే నా భార్య గట్టిగా కేకలు వేసింది. సెకన్ల వ్యవధిలో ఆమె ఫోన్ పని చేయడం ఆగిపోయింది. ఏమైందోనని కంగారుగా బయలు దేరుతుండగా అప్పుడే ఓ మెసేజ్ వచ్చింది. మీ భార్యకు యాక్సిడెంట్ అయ్యింది. ప్రమాదం ఈ ప్రాంతంలో జరిగిందంటూ అడ్రస్ సైతం ఆ మెసేజ్‌లో ఉంది. అంబులెన్స్ కంటే ముందు ఆ ప్రదేశానికి వెళ్లాను. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి నా భార్యను కాపాడుకోగలిగాను అంటూ రెడ్డిట్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. -
‘కొత్త’ ఆవిష్కర్త.. బీటెక్ చదువుతూనే..
పిఠాపురం(కాకినాడ జిల్లా): వాహనంలో వెళ్తున్నప్పుడు ముంచుకొచ్చే ప్రమాదాన్ని ముందుగా గుర్తిస్తే.. మన ప్రమేయం లేకుండానే ప్రమాదాన్ని గుర్తించి వాహనం దానంతట అదే ఆగిపోతే.. ప్రతి వాహనదారుడు ఇలాంటి పరికరాలు తన వాహనంలో ఉండాలని కోరుకుంటాడు. బీటెక్ చదువుతున్న కొత్త లోక్‌నాథ్ ఇది గుర్తించి తన మెదడుకు పదును పెట్టాడు. చిన్న వయసులోనే అద్భుత ఆవిష్కరణ చేశాడు. చదవండి: AP: ‘ఆరోగ్య’ వ్యవసాయం అదే ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్. వాహనంపై రకరకాల ఆలోచనలతో వెళుతుంటే ఎదురుగా వేగంగా వాహనాన్ని గుర్తించలేక ప్రమాదం జరగొచ్చు. లేదా ఏవైనా జంతువులు అకస్మాత్తుగా అడ్డం పడొచ్చు. తప్పించుకునే లోపే ప్రమాదం ఎదురు కావచ్చు. ఇలాంటి వాటిని అధిగమించడానికి లోక్‌నాథ్.. ఓ సెన్సార్ సిస్టమ్ రూపొందించాడు. వాహనానికి అమర్చే ఈ సెన్సార్‌కు కొంత పరిధి ఉంటుంది. అందులోకి ఏదైనా వాహనం, జంతువులు, ఇతర ప్రమాదకర అంశాలు వస్తే గుర్తిస్తుంది. వెంటనే ఆటోమేటిక్‌గా బ్రేక్ సిస్టమ్ పని చేసి, వాహనం వేగం తగ్గిపోతుంది. ఆ తర్వాత వాహనం ఆగిపోతుంది. తద్వారా ప్రాణాపాయం తప్పుతుంది. మధ్యతరగతి కుటుంబం నుంచి కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన లోక్‌నాథ్ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కొత్త సునీల్, సుజాత దంపతుల కుమారుడు. తండ్రి ఓ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో అకౌంటెంట్. ప్రస్తుతం లోక్‌నాథ్ పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ వర్సిటీలో బీటెక్ సెకండియర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. పదో తరగతిలో 10కి 10 జీపీఏ, ఇంటర్లో 90% మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. ఆవిష్కరణలకు పేటెంట్ హక్కు తన 2 ఆవిష్కరణలకు లోక్‌నాథ్ పేటెంట్ హక్కులు సాధించాడు. సుమారు 40 పోటీల్లో పాల్గొన్నాడు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఏటా నిర్వహించే స్పెషల్ ఎడ్యుకేషన్ డేటా సిస్టం అనే కార్యక్రమంలో ఆంధ్రా నుంచి తొలిసారి ఎంపికై సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నైజేషన్ పొందాడు. గుజరాత్ పారుల్ యూనివర్సిటీ నిర్వహించిన 48 గంటల ఆన్లైన్ కోడింగ్ కాంపిటీషన్ (హ్యాకథాన్)లో 3వ స్థానం, వెల్లూరు విట్ యూనివర్సిటీ నిర్వహించిన హ్యాకథాన్‌లో 2వ స్థానం సాధించాడు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి అభినందనలు అందుకున్నాడు. అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగం సాధిస్తా దేశంలోనే పెద్ద ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించడమే లక్ష్యం. నా తల్లిదండ్రులు, అక్క ప్రోత్సాహంతో మరిన్ని ప్రాజెక్టులు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. మహీంద్ర వంటి వివిధ మోటార్ వాహనాల కంపెనీల నుంచి నా ఆవిష్కరణలకు ఆహా్వనాలు అందుతున్నాయి. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు, వాహన ప్రమాదాల నివారణపై మరిన్ని ప్రయోగాలు చేస్తున్నాను. – కొత్త లోక్‌నాథ్, బీటెక్ విద్యార్థి, పిఠాపురం స్మార్ట్ వెదర్ ఫోర్కాస్టర్ లోక్‌నాథ్ మరో సాంకేతిక ఆవిష్కరణ కూడా చేశాడు. ఇంటర్నెట్లేని మారుమూల ప్రాంతాల్లో వాతావరణ మార్పులను సెల్‌ఫోన్ ద్వారా హెచ్చరించే వ్యవస్థను రూపొందించాడు. ఫోన్‌కు టెంపరేచర్, రెయిన్ సెన్సార్లు అమర్చి, ఇంటర్నెట్ అవసరం లేకుండా బ్లూటూత్ మాడ్యూల్ ద్వారా వాతావరణ మార్పులను ఆ వ్యవస్థ మనకు తెలియజేస్తుంది. సెల్ఫోన్లో వాతావరణ హెచ్చరికలు సాధారణంగా వస్తుంటాయి. కానీ, లోక్‌నాథ్ ఆవిష్కరణలో రెయిన్ గేజ్ కూడా ఉంది. దీని ద్వారా ఎంత వర్షం, ఎంత సమయం పడింది, పడుతుంది అనే వివరాలు కూడా తెలుస్తాయి. లోక్‌నాథ్ తయారు చేసిన స్మార్ట్ వెదర్ ఫోర్కాస్టర్ -
RIP Magawa: ‘చిట్టి హీరో’ అస్తమయం
మగావా.. డ్యూటీలో చాలా సిన్సియర్. రోజూ ఫీల్డ్‌లోకి దిగి ల్యాండ్మైన్లను పసిగట్టడం. వందల మంది ప్రాణాలు రక్షించడం. ఇదంతా ఇన్ ది స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్. ఇట్ ఈజ్ నాట్ ట్రాక్ రికార్డ్.. ఇట్ ఈజ్ ఆల్ టైం రికార్డ్!!. సూపర్ హీరోకి అర్హతలేంటని అడిగితే.. ఏవేవో చెప్తుంటారు కొందరు. కానీ, ఆ అర్హతలేవీ లేకుంటే?.. ఆ సూపర్ హీరో అసలు మనిషి కాకుంటే!! యస్.. మాగావా మనిషి కాదు. ఓ ఎలుక. సాధారణమైంది మాత్రం కాదు. ల్యాండ్ మైన్లను గుర్తించడంలో కఠోర శిక్షణ తీసుకుంది. తన విధి నిర్వహణలో నిబ్ధదత ప్రదర్శించిన ఈ ఎలుక.. ఈమధ్యే కన్నుమూసింది. అందుకే సోషల్ మీడియాలో అంత ఎమోషనల్ అవుతున్నారు. టాంజానియా బ్రీడ్‌కు చెందిన మగావాను కంబోడియా తీసుకొచ్చి.. ల్యాండ్మైన్లను గుర్తించడంలో శిక్షణ ఇచ్చారు. ఐదేళ్ల కాలంలో వందకి పైగా ల్యాండ్ మైన్లను గుర్తించింది. తద్వారా ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు ఈ చిట్టి హీరో. 2020లో మాగ్వా యూకేకి చెందిన ఓ ఆర్గనైజేషన్ నుంచి గోల్డ్ మెడల్ కూడా అందుకుంది మగావా. కిందటి ఏడాది జూన్‌లో విధుల నుంచి రిటైర్ అయిన ఈ ఎలుక.. చివరికి ఎనిమిదేళ్ల వయసులో ఈమధ్యే కన్నుమూసింది. ఈ విషయాన్ని దానికి శిక్షణ ఇచ్చిన APOPO అనే బెల్జియం ఎన్జీవో ప్రకటించింది. అంతర్యుద్ధంతో దశాబ్దాలపాటు నలిగిపోయిన కంబోడియా.. ల్యాండ్మైన్ల గనిగా ఒక పేరు దక్కించుకుంది. వీటి ధాటికి వందల మంది ఏటా ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. అందుకే రిస్క్ లేకుండా ఎలుకలకు ల్యాండ్మైన్లను గుర్తించే శిక్షణ ఇప్పిస్తున్నారు. కొన్ని ఆఫ్రికా దేశాల్లో ల్యాండ్మైన్లతో పాటు టీబీ రోగి శాంపిల్స్ గుర్తించేందుకు ఎలుకలను ఉపయోగిస్తున్నారు. విశేషం ఏంటంటే.. చాలా సందర్భాల్లో ఇవి విజయవంతంగా ఆపరేషన్‌ను పూర్తి చేస్తున్నాయి కూడా. అందుకే ఆ ర్యాట్హీరోలకు ఓ సలాం కొడుతూ.. RIP Magawa. -
కాస్పర్ టెస్ట్ కేక: కరోనాను గుర్తిస్తున్న జాగిలాలు
న్యూఢిల్లీ: కరోనా సోకిందో లేదో అనేది చిన్న పరీక్షతో తేలనుంది. వైద్యలు అవసరం లేకుండా మన జాగిలాలు గుర్తిస్తున్నాయి. సైన్యానికి చెందిన కుక్కలు ఎవరికి కరోనా సోకిందో.. ఎవరికీ లేదో చెబుతున్నాయి. ఈ మేరకు జాగిలాలకు సైనిక అధికారులు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో మొత్తం 3,800 నమూనాలు పరీక్షించగా వాటిలో 22 పాజిటివ్స్‌ను ఆ జాగిలాలు గుర్తు పట్టాయి. ఒక డబ్బాలోని మూత్రం (యూరిన్) శాంపిల్ వేస్తే.. దాని వాసన చూసి కరోనా పాజిటివా కాదా కుక్క చెప్పేస్తోంది. భారత సైన్యానికి చెందిన ఈ జాగిలం పేరు కాస్పర్. రెండేళ్ల వయసున్న దీని ముందు తీసుకున్న శాంపిళ్లను డబ్బాల్లో వేసి ఉంచగా వాటిలో పాజిటివ్ ఉన్న డబ్బాను ఎంచుకుంటుంది. దీంతో మిగతా డబ్బాల వారికి కరోనా సోకలేదని నిర్ధారించుకోవచ్చు. ఇంకో జాగిలం కూడా ఉంది. దాని పేరు జయ. ఏడాది వయసున్న ఈ కుక్క తన ముక్కుతో కోవిడ్ సోకిన వారి నమూనాలను గుర్తిస్తోంది. ఈ రెండు శునకాలు ఇప్పటికే 3,800 నమూనాలను పరీక్షించాయి. వీటిలో 22 పాజిటివ్‌గా తేలాయి. కొన్ని సెకన్లలోనే అవి ఫలితం ఇస్తుండడంతో అధికారులు వాటిని అభినందిస్తున్నారు. పాజిటివ్ కేసు ఉన్న శాంపిల్‌ను ఆ జాగిలాలు గుర్తించి వాటి పక్కన నిల్చుంటున్నాయి. దీంతో ఆ డబ్బాలో ఉన్న నమూనాకు సంబంధించిన వ్యక్తి కోవిడ్ సోకిందని నిర్ధారిస్తున్నారు. ఈ విధంగా జాగిలాలను వైద్యపరంగా కూడా వినియోగిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో అధికారులు మూత్రం, చెమట వాసనతో కరోనా పాజిటివ్ కేసులను గుర్తించడంపై శిక్షణ ఇస్తున్నారు. ఈవిధంగా రెండూ జాగిలాలు సిద్ధం కాగా.. మరొకటి శిక్షణ పొందుతోంది. దాని పేరు మణి. ఈ జాగిలాలను లఢక్, కశ్మీర్‌లాంటి ప్రాంతాల్లో పని చేసే జవాన్ల శాంపిళ్లను గుర్తించేందుకు వినియోగించనున్నారు. ప్రస్తుతం చండీగఢ్ క్యాంప్‌లో ఈ జాగిలాలు ఈ పని చేస్తున్నాయి. ఈ విధంగా ఇంకా 8 జాగిలాలకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి విధానం బ్రిటన్, ఫిన్లాండ్, రష్యా, ఫ్రాన్స్, యూఏఈ, జర్మనీ, లెబనన్ వంటి దేశాల్లో అమల్లోకి వచ్చింది. -
‘త్వరలో కరోనా లక్షణాలకు ఐఐటీ బ్యాండ్’
సాక్షి, చెన్నై: కరోనాను త్వరగా గుర్తించేందుకు దేశీయంగా వివిధ పరికరాలు మార్కెట్లో విడుదలవుతున్నాయి. తాజాగా కరోనా లక్షణాలను త్వరగా గుర్తించేందుకు ఐఐటీ మద్రాస్, మ్యుస్ వియర్‌బేల్స్ అనే స్టార్టప్ సంస్థ సంయుక్తంగా కరోనా లక్షణాలను గుర్తించే బ్యాండ్‌ను వచ్చే నెలల్లో మార్కెట్లోకి తేనున్నట్లు సంస్థ ప్రతినిథులు తెలిపారు. అయితే ఈ బ్యాండ్‌ను చేతి మణికట్టుకు ధరించవచ్చు. ఈ బ్యాండ్ కరోనా లక్షణాలను గుర్తించే ముఖ్యమైన వ్యక్తి శరీర ఉష్ణోగ్రత, గుండె, ఆక్సిజన్, రక్త పనితీరును బ్యాండ్ ద్వారా గుర్తించవచ్చు. ఈ బ్యాండ్‌కు రూ.3,500కు ధర నిర్ణయించారు. కాగా ఈ బ్యాండ్‌ను మొబైల్ ఫోన్, బ్లూటూత్‌లలో ధరించవచ్చు. అయితే కంటైన్మెంట్ జోన్లకు ప్రవేశించగానే ఈ బ్యాండ్‌ను ధరిస్తే ఆరోగ్య సేతు యాప్‌ను అలర్ట్ చేస్తుంది. ఈ సంవత్సరం 2లక్షల బ్యాండ్ల అమ్మకాలకు ప్రణాళిక ఉందని, రాబోయే 2022సంవత్సరానికి 10లక్షలకు పెంచనున్నారు. -
కోటిపల్లి రైల్వేలైన్‌పై పరిశీలన
నరసాపురం : నరసాపురం–కోటిపల్లి రైల్వేలైన్‌స్థల అన్వేషణ కోసం సోమవారం రెవెన్యూ, రైల్వేశాఖ అధికారులు పట్టణంలో పరిశీలన చేశారు. నరసాపురం–కోటిపల్లి రైల్వేలైన్ ఎలైన్మెంట్ ప్రకారం నరసాపురం పట్టణం నుంచి కాకుండా, చిట్టవరం గ్రామం వద్ద నుంచి వేయాల్సి ఉంది. ఈ లైన్ బహుళ ప్రయోజనకారిగా ఉండాలంటే, నరసాపురం పట్టణం మీదుగానే వేయాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో నరసాపురం పట్టణం నుంచి రైల్వేలైన్ వేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు, రైల్వేశాఖ డెప్యూటీ చీఫ్ ఇంజనీర్ కె.సూర్యనారాయణ, ఆర్అండ్బీ ఎస్ఈ ఎం.వి.నిర్మల, నరసాపురం సబ్‌కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ పర్యటించారు. రైల్వేస్టేçÙన్, పొననపల్లి, మాధవాయిపాలెం ఫెర్రీ ప్రాంతాలను పరిశీలించారు. రూట్‌మ్యాప్‌ను క్షణ్ణంగా అధ్యయనం చేశారు. అనంతరం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సాధ్యమైనంత వరకూ నరసాపురం పట్టణం నుంచే, ప్రాజెక్ట్ ఉండేలా యత్నిస్తున్నామని చెప్పారు. కలెక్టర్ ఈ విషయంలో ప్రత్యేకశ్రద్ధ చూపిస్తున్నట్టు వివరించారు. -
లభ్యం కాని ట్రిపుల్ఐటీ విద్యార్థి ఆచూకీ
రంగంలోకి రెండు పోలీసు బృందాలు నూజివీడు : నూజివీడు ట్రిపుల్ ఐటీ నుంచి వెళ్లిపోయిన ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి పువ్వల కిరణ్‌ప్రసాద్ ఆచూకి కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పట్టణ ఎస్సై బోనం ఆదిప్రసాద్ నేతృత్వంలో ఒక బృందం, స్థానిక సీసీఎస్ ఎస్సై భాస్కరరావు నేతృత్వంలో మరో బృందం పలు ప్రాంతాలకు వెళ్లి విద్యార్థి కోసం గాలిస్తున్నాయి. కిరణ్‌ప్రసాద్ తన ఫోన్‌ను ట్రిపుల్‌ఐటీలోనే వదిలివెళ్లడంతో అతని ఆచూకీ కోసం పోలీసులు కష్టపడాల్సి వస్తోంది. విజయవాడతో పాటు విద్యార్థి స్వగ్రామం కలిదిండి మండలం మూలలంకకు కూడా పోలీసులు వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి వెళ్లిపోయి రెండు రోజులైనా ఆచూకి లభ్యం కాకపోవడంతో అతని మిత్రులు, తల్లిదండ్రులు, బంధువుల ఫోన్లపై నిఘా ఉంచారు. ఒకవేళ ఎక్కడి నుంచైనా వారికి కిరణ్‌ప్రసాద్ ఫోన్ చేస్తే ముందు ఏ ప్రాంతంలో ఉన్నాడనేది తెలుస్తుందనే ఉద్ధేశ్యంతో ఈ దిశగా నిఘా ఉంచారు. ఫేస్బుక్ ఎక్కౌంట్లు, తను వదిలివెళ్లిన ఫోన్లోని వాట్సప్‌లో ఉన్న ఫోన్ నెంబర్లను కూడా పరిశీలిస్తున్నారు. ఫోన్‌ను వదిలివెళ్లిన నేపథ్యంలో ఇలా ఎందుకు చేశాడనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ట్రిపుల్‌ఐటీలో నిర్వహించిన ఆందోళనలలో తనవంతు పాత్ర పోషించిన నేపథ్యంలో యాజమాన్యం ఏమైనా చర్య తీసుకుంటుందేమోననే భయంతో ఈ విధంగా చేశాడా అని కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల ఆందోళన నిరుపేద కుటుంబానికి చెందిన కిరణ్‌ప్రసాద్ ట్రిపుల్ఐటీ నుంచి వెళ్లిపోవడంతో అతని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రెండు రోజులుగా స్థానిక పట్టణ పోలీసుస్టేషన్ వద్దకు వచ్చి తమ కుమారుడి ఆచూకి ఏమైనా లభ్యమైందా అని పోలీసులను ప్రాధేయపడుతున్నారు. కూలిపనులు చేసుకునే తాము తమ కుమారుడు ఇంజినీరింగ్ చదువుకుంటున్నాడంటే ఎంతో ఆనందపడ్డామని, ఇంతలో ఇలా జరగడమేమిటని కన్నీటిపర్వంతమవుతున్నారు. వీరితో పాటు తమ్ముడు కూడా ఆవేదన చెందుతున్నాడు. ఎక్కడున్నా తల్లి ఆరోగ్యం సరిగా లేనందున వెంటనే ఇంటికి వచ్చేయాలని తండ్రి దుర్గారావు, తమ్ముడు రాజ్‌కుమార్ ప్రాధేయపడుతున్నారు.