స్మార్ట్‌ స్కోప్‌: సర్వైకల్‌ క్యాన్సర్‌ను ముందుగానే.. కనిపెట్టొచ్చు | Smart Scope: Cervical Cancer Can Be Detected Early | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ స్కోప్‌: సర్వైకల్‌ క్యాన్సర్‌ను ముందుగానే.. కనిపెట్టొచ్చు

Published Wed, Mar 27 2024 9:46 AM | Last Updated on Wed, Mar 27 2024 11:03 AM

Smart Scope: Cervical Cancer Can Be Detected Early - Sakshi

సర్వైకల్‌ క్యాన్సర్‌ను ముందుగానే పసిగట్టే సంస్థ ‘స్మార్ట్‌ స్కోప్‌’ అనే డిజిటల్‌ డివైజ్‌ను రూపొందించింది పుణెలోని పెరివింకిల్‌ టెక్నాలజీస్‌...

మహిళలకు ఎక్కువగా వచ్చే క్యాన్సర్‌లలో సర్వైకల్‌ క్యాన్సర్‌ రెండో స్థానంలో ఉంది. ఈ క్యాన్సర్‌ ప్రమాదాన్ని పసిగట్టడంలో ‘స్మార్ట్‌ స్కోప్‌’ కీలకపాత్ర పోషిస్తోంది. యూఎస్, యూకేలలో పని చేసిన వీణా మోక్తాలి ఆమె భర్త కౌస్తుభ్‌ నాయక్‌లు మన దేశానికి వచ్చి పుణె కేంద్రంగా పెరివింకిల్‌ టెక్నాలజీకి శ్రీకారం చుట్టారు. ఈ కంపెనీ నుంచి వచ్చిన ‘స్మార్ట్‌ స్కోప్‌’ డిజిటల్‌ డివైజ్‌ సులభంగా ఉపయోగించేలా ఉంటుంది.

‘ప్రస్తుతం ఉన్న సర్వైకల్‌ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పద్ధతులు సమయం తీసుకుంటాయి. ఈ సౌకర్యాలు పెద్ద నగరాల్లోని సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఫలితంగా ఎక్కువమంది మహిళలు స్క్రీనింగ్‌ చేయించుకోలేకపోతున్నారు’ అంటుంది వీణ. ఈ నేపథ్యంలో ‘స్మార్ట్‌ స్కోప్‌’ అనేది చిన్న ప్రైవేట్‌ క్లినిక్, నర్సింగ్‌ హోమ్స్, మున్సిపల్‌ డిస్పెన్సరీలు, ప్రైమరీ హెల్త్‌ కేర్‌ సెంటర్, జిల్లా ఆస్పత్రులలో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఒక బ్యాంకు మేనేజర్‌కు గ్రేడ్‌–2 దశలో క్యాన్సర్‌ని గుర్తించడంలో స్మార్ట్‌ స్కోప్‌ ఉపయోగపడింది.

మన దేశంలోని ఆరు రాష్ట్రాలకు చెందిన లక్షమంది ఈ పరికరం సహాయంతో జాగ్రత్త పడ్డారు. ఈ డివైజ్‌ నిర్వహణ ఖర్చు తక్కువ కావడం కూడా మరో సానుకూల అంశం. ‘కూలి పనుల వల్ల రోజుల తరబడి ప్రయాణాలు చేసే టైమ్‌ గ్రామీణ మహిళలకు ఉండడం లేదు. స్మార్ట్‌ స్కోప్‌ ద్వారా ఫలితం కోసం ఎక్కువ సమయం ఎదురు చూడాల్సిన అవసరం లేదు’ అంటుంది వీణ. అంతర్జాతీయ మార్కెట్‌లోకి కూడా విస్తరించాలనే లక్ష్యం ఏర్పాటు చేసుకొని ఆ దిశగా వడి వడిగా అడుగులు వేస్తోంది వీణా మొక్తాలి.

ఇవి చదవండి: అనిషా పదుకోన్‌: మహిళల మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement