veena
-
ఈసారి తెలుగమ్మాయిని పరిచయం చేస్తున్నాను: వైవీఎస్ చౌదరి
‘‘నేను పరిచయం చేసిన ఎంతోమంది హీరోయిన్లు స్టార్స్‌గా వెలిగారు. అయితే ఇందులో చాలా మంది ముంబై నుంచి వచ్చిన వారే. ఈసారి మన తెలుగమ్మాయిని హీరోయిన్గా పరిచయం చేయాలని వీణా రావుని ఎంచుకున్నా. ఈ మూవీలో అతిరథ మహారథులు ఇంకెందరో ఉంటారు. అలాగే కొత్త వారికి కూడా అవకాశం ఇస్తున్నాం’’ అని డైరెక్టర్ వైవీఎస్ చౌదరి అన్నారు. దివంగత హరికృష్ణ కుమారుడు, దివంగత జానకి రామ్ (ఎన్టీఆర్ సోదరుడు) తనయుడు తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి ఇటీవల ఓ సినిమాని ప్రకటించారు. న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్‌పై యలమంచిలి గీత ఈ సినిమాని నిర్మించనున్నారు. కాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో వీణా రావు పేరుని పరిచయం చేశారు వైవీఎస్ చౌదరి. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘మహేశ్‌బాబుగారి బర్త్ డే (ఆగస్టు 9) సందర్భంగా మా సినిమా కార్యక్రమం జరుపుకోవడం హ్యాపీ. ఈ మూవీకి కీరవాణిగారు సంగీతం అందించనుండటం నా అదృష్టం. సాయి మాధవ్ బుర్రా మాటలు, చంద్రబోస్‌గారి పాటలు మహాద్భుతంగా ఉండనున్నాయి’’ అన్నారు. ‘‘వైవీఎస్ చౌదరి, కీరవాణి, చంద్రబోస్ వంటి మహామహులతో పనిచేసే అవకాశం ఇచ్చిన గీతగారికి ధన్యవాదాలు’’ అని డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా చెప్పారు. -
వయనాడ్ విపత్తు: అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి వీణా జార్జ్ కౌంటర్
తిరువనంతపురం: వయనాడులో ప్రకృతి విలయం దేశ ప్రజలు భయభ్రాంతులకు గురి చేసింది. ప్రకృతి విపత్తు కారణంగా దాదాపు 275 మంది మృతిచెందారు. ఇక, ఈ ఘటనపై ముందుగానే కేరళను హెచ్చరించామని కేంద్రం చెబుతుండగా.. తమకు ఎలాంటి అలర్ట్ ఇవ్వలేదని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. అమిత్ షా ప్రకటన ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఉందన్నారు.కాగా, పార్లమెంట్లో అమిత్ షా వ్యాఖ్యలపై మంత్రి వీణా జార్జ్ స్పందించారు. తాజాగా ఆమె మాట్లాడుతూ..‘కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేంద్రం నుంచి తమకు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు రాలేదు. కేంద్రం నుంచి వచ్చిన అన్ని సందేశాలను క్షుణ్ణంగా పరిశీలించాం. కొండచరియలు విరిగిపడటంపై ఎలాంటి అలర్ట్ ఇవ్వలేదు. కేవలం జిల్లా యంత్రాంగం ఆరెంజ్ హెచ్చరికలు ఇచ్చింది. దీని ఆధారంగా వయనాడ్ యంత్రాంగం నివారణ చర్యలను చేపట్టింది. అనేక మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది’ అని తెలిపారు.#WATCH | On Union HM Amit Shah's statement, Kerala Health Minister Veena George says, "...It is quite unfortunate that such a statement has been made. The District Disaster Management Authority has all the data. There are landslide-prone areas everywhere in Kerala..." https://t.co/ZLDRzokgnt pic.twitter.com/R90zmWKBV2— ANI (@ANI) August 1, 2024ఇదిలా ఉండగా.. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేరళ విపత్తుపై అమిత్ షా ప్రసంగించారు. ఈ సందర్బంగా అమిత్ షా..‘కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించాం. ఈ ముప్పు గురించి జులై 23నే అప్రమత్తం చేశాం. దక్షిణాది రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసి.. కేంద్రం తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేరళకు పంపింది. కానీ, కేరళ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. సకాలంలో ప్రజలను తరలించలేదు. విజయన్ ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఉంటే మరణాలు తప్పేవి. ఏది ఏమైనా రాజకీయాలకు అతీతంగా కేరళ ప్రభుత్వానికి, ప్రజలకు అండగా నిలవాల్సిన సమయం ఇది’ అంటూ కామెంట్స్ చేశారు. -
వీర బొబ్బిలి కోటలో.. వీణ బొబ్బిలి పాట
సాక్షి, అమరావతి: తెలుగునాట వీణ అంటే అంతా బొబ్బిలి వైపే చూస్తారు. అక్కడ తయారయ్యే వీణల ప్రత్యేకత అలాంటిది మరి. వీణ ధ్వని, స్పష్టత ఎక్కువగా ఉండేలా తీగలు నిర్మించడం వల్ల బొబ్బిలి వీణలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. తంజావూరు లాంటి సంప్రదాయ వీణల తయారీకి మూడు రకాల చెక్కలు వినియోగిస్తే.. బొబ్బిలి వీణలను పనస చెక్కలతో రూపొందించడం మరో ప్రత్యేకత. ఇవన్నీ కలగలిపి బొబ్బిలి వీణలకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టాయి. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ మహోత్సవంలో తెలుగు వీణాగానం అలరించింది. వీణా విద్వాంసురాలు శ్రీవాణికి దక్కిన అరుదైన గౌరవంతో మరోసారి దేశవ్యాప్తంగా బొబ్బిలి వీణపై చర్చ మొదలైంది. ఇదీ ప్రస్థానం.. 17వ శతాబ్దంలో బొబ్బిలి రాజ్య వ్యవస్థాపకుడైన పెద్దరాయుడికి కళలపై ఉన్న మక్కువ బొబ్బిలిలో వీణల తయారీకి బీజం వేసిందని చెబుతారు. తన సంస్థానంలో సిద్ధహస్తులైన ఇద్దరు వడ్రంగులను మైసూరు పంపించి.. అక్కడి వీణల తయారీ నేర్చుకోవాలని పెద్దరాయుడు సూచించారు. ఆయన సూచనలతో అక్కడికి వెళ్లి వచి్చన వారితో బొబ్బిలి వీణల తయారీ మొదలైంది. నాటి మైసూరు సంస్థానంలోని తంజావూరులో ఈ వీణల తయారీ గురించి తెలుసుకున్న సర్వసిద్ధి అచ్చెన్న బొబ్బిలి తిరిగి వచ్చాక ఇక్కడ తయారుచేసిన వీణలు మంచి ఆదరణ పొందాయి. ఆ వీణల వాయిద్యం నేర్చుకుని బొబ్బిలి రాజులు ఎంతో మురిసిపోయినట్టు చెబుతారు. ఆ తర్వాత విజయనగర ఆస్థానం సహా అనేక మంది రాజులు కూడా బొబ్బిలి వీణల కొనుగోలుకు సిద్ధం కావడంతో ఆదరణ పెరిగింది. క్రమంగా బొబ్బిలి వీణలకు దేశవ్యాప్త గుర్తింపు వచి్చంది. ఈమని శంకర శాస్త్రి వంటి ఎందరో వైణిక విద్వాంసులు బొబ్బిలి వీణలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. వీణావాదన సంగీత ద్వయం వాసా కృష్ణమూర్తి, వాసా సాంబమూర్తి 1850 ప్రాంతంలో బొబ్బిలి వీణలపైనే వాయించడం ద్వారా వాటికి వన్నెతెచ్చారు. ఇప్పటికీ 40 మంది తయారీదారులు విజయనగరం జిల్లా బొబ్బిలిలోని గొల్లపల్లి వీణల కేంద్రంలో సర్వసిద్ధి వర్గానికి చెందిన దా దాపు 40 మంది కళాకారులు వీణలను తయారు చేస్తున్నారు. ఇక్కడి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు పలు పుణ్యక్షేత్రాలకు వందల సంఖ్యలో వీణలు సరఫరా అవుతుంటాయి. లేపాక్షి సంస్థ వీణలు కొనుగోలు చేసి పర్యాటక కేంద్రాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి విక్రయిస్తోంది. దాదాపు 14 రకాల ఆకారాలతో గిఫ్ట్ వీణలను కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. నూజివీడులోనూ వీణలు తయారు చేస్తున్నారు. 120 ఏళ్లుగా వంశపారం పర్యంగా నూజివీడు వీణ ఆదరణ పొందుతోంది. అధికారిక పర్యటనలకు వచ్చే ఉన్నతాధికారులు, ప్రముఖులకు, కళాకారులకు, ప్రజా ప్రతినిధులకు జ్ఞాపికగా ఇచ్చేందుకు వీణను వినియోగిస్తున్నారు. అలా 2000 సంవత్సరంలో మన రాష్ట్రానికి వచి్చన అప్పటి అమెరికా ప్రధాని బిల్ క్లింటన్ బొబ్బిలి వీణల తయారీ గురించి తెలుసుకుని అచ్చెరువొందారు. వీణల తయారీలో ఉత్తమ వృత్తి కళాకారునిగా రాష్ట్రపతి అవార్డు అందుకున్న సర్వసిద్ది వీరన్నను వైట్‌హౌస్‌కు రావలసిందిగా ఆహా్వనించారు. ఎంతో చరిత్ర కలిగిన బొబ్బిలి వీణకు 1980లో జాతీయ అవార్డు లభించగా.. 2011లో జియోగ్రాఫికల్ గుర్తింపు లభించింది.ఎన్నో ప్రత్యేకతల సమాహారం వీణ ప్రముఖంగా కర్ణాటక సంగీత కచేరీలలో వినియోగిస్తారు. దీనిని ఉత్తరాదిన రుద్రవీణగా.. దక్షిణాదిలో సరస్వతీ వీణగా.. మధ్య భారతంలో విచిత్ర వీణగా పిలుచుకుంటారు. వీణలో ముఖ్యంగా కుండ, దండి, యాళి (పౌరాణిక జంతువు మెడ ఆకారం), సొరకాయ బుర్ర అనే భాగాలుంటాయి. వీణల్లో చాలా రకాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో తయారమ్యే సరస్వతి వీణ, మయూరీ వీణ, మీరా వీణ, డ్రాగన్ వీణ, విపంచి వీణ, శంఖం వీణ, గోటు వీణ, మధుర వీణ, మశ్చ వీణ ప్రసిద్ది చెందాయి. పనస చెట్టు కర్ర వీణసారె వీణ తయారీలో ప్రధానమైన భాగం. ఇది తేలికగా ఉండటమే కాకుండా మంచి ధ్వని పలికిస్తుంది. దృఢత్వం, మన్నిక, తేమని తట్టుకోగలగడం వల్ల దీన్ని విరివిగా వాడతారు. మైసూరు, తంజావూరు వీణలను మూడు కొయ్య ముక్కలను కలిపి తయారు చేసేవారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఏకాండీ కొయ్యముక్క (ఒకే చెక్క ప్రత్యామ్నాయ బొబ్బిలి వీణ ముక్క) తోనే వీణను తయారు చేస్తారు.గిట్టుబాటు కావడం లేదు ప్రస్తుత వీణల ధరలు గిట్టుబాటు కావడం లేదు. కలప, ఇతర ముడి సరుకుల ధరలు బాగా పెరిగాయి. వీణల ధరలు పెంచేందుకు హస్తకళల అభివృద్ధి కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం. అక్కడి నుంచి అనుమతులు వస్తే పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. – ఎస్.రామకృష్ణ, బొబ్బిలి వీణల కేంద్రం ఇన్చార్జి కలప కొరత వేధిస్తోంది వీణల తయారీకి వాడే పనస కలపకు గిరాకీ ఎక్కువగా ఉంది. పనస కలప అయితేనే వీణలు నచి్చన ఆకృతుల్లో తయారు చేసేందుకు అనువుగా ఉంటాయి. మా కళాకారులందరికీ ప్రభుత్వం కలపను సబ్సిడీపై సరఫరా చేయాలి. – పెదపాటి కిరణ్, వీణల తయారీదారుఏడాదంతా పని దొరుకుతోంది వీణల కేంద్రంలో మాకు గౌరవప్రదమైన పని ఏడాది పొడవునా దొరుకుతోంది. విశ్వవ్యాప్తమైన బొబ్బిలి వీణల కళాకారులుగా మంచి పేరు పొందడం ఆనందంగా ఉంది. – సర్వసిద్ధి చైతన్య, వీణల తయారీదారు -
అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో తెలుగు వీణ సందడి
పరాంకుశం వీణాశ్రీవాణి... ఆమె పేరులోనే సరిగమల శ్రుతి వినిపిస్తోంది. అమలాపురంలో ఓ చిన్న అగ్రహారం అమ్మాయి శ్రుతి చేసిన వీణ ఇప్పుడు అంబానీ ఇంటి వేడుకలో సరిగమలతో అలరించింది. ఆ ఆనంద క్షణాలను ఆమె సాక్షి ఫ్యామిలీతో పంచుకున్నారు. ‘‘మాది అమలాపురం జిల్లా ఇందుపల్లి అగ్రహారం. బండారులంకలోని పిచ్చుక సీతామహాలక్ష్మి గారి దగ్గర సంగీతం నేర్చు కున్నాను. ఈ రోజు ఇన్ని ప్రశంస లందుకుంటున్నానంటే ఆమె నేర్పిన సంగీత జ్ఞానమే కారణం. అంబానీ కుటుంబంలో పెళ్లి వేడుకకు వీణావాదన చేయడానికి ఆహ్వానం రావడంతో ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నా పేరు వాళ్లకు తెలిసే అవకాశమే లేదు. నేను సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడం వల్లనే నా కళను వారు గుర్తించడానికి కారణం అనుకుంటున్నాను. నీతా అంబానీ గారు చె΄్పారు అంటూ వాళ్ల మేనేజరో ఎవరో కాంటాక్ట్ చేశారు. ఏ దుస్తులు ధరించాలనే విషయం నుంచి వేడుకలో ఏ ΄ాటలు కావాలో కూడా ఆమే ఎంపిక చేశారు. నేనిచ్చిన జాబితా నుంచి ఆమె ఎంపిక చేసిన పది ΄ాటలను వీణ మీద వినిపించాను. నా చెలి రోజావే, ఉరికే చిలకా... వంటి పలు భాషల్లోకి అనువాదమై ఉన్న ΄ాటలనే ఎంచుకున్నాను. ఇదంతా పదిహేను రోజులపాటు నడిచింది. రెండు కళ్లు చాలవు!ఆడిటోరియానికి వెళ్లే దారిలో ఒక వరుస అత్తరులు, ఇత్తడి బిందెలతో గుజరాత్ సంప్రదాయ నమూనా అలంకరణ ఉంది. ఆ తర్వాత ధొలారి ధని థీమ్, ఫారెస్ట్ థీమ్, కలంకారీ థీమ్ ఓ వరుస ఉన్నాయి. శంకర్ మహదేవన్, శ్రేయాఘోషాల్, శివమణి వంటి సంగీతకారులు, గాయకుల ప్రోగ్రామ్‌లను టీవీ లైవ్ లో చూశాను. వందమంది రాజమౌళిలు, వంద మంది సంజయ్ లీలా భన్సాలీలు కలిసి సెట్టింగు వేయించారా అనిపించింది. చూడడానికి రెండు కళ్లు చాలవు. తలను 360 డిగ్రీల్లో తిప్పి చూడాల్సిందే. బారాత్ తర్వాత పెళ్లికి ముందు హై టీ టైమ్‌లో రాత్రి ఏడు నుంచి ఏడు ముప్పావు వరకు నా కచేరీ సాగింది. రాధిక మర్చంట్ కుటుంబం, అంబానీ కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతి. వాళ్లు కదలకుండా కూర్చుని, ఓ పాటను మళ్లీ అడిగి మరీ చక్కగా ఆస్వాదించడం, కళల పట్ల వారికున్న గౌరవం నాకు సంతృప్తినిచ్చింది. నాలుగు వేల అడుగులు పన్నెండవ తేదీ ఉదయం ముంబయికి వెళ్లాం. హోటల్లో రిఫ్రెష్ అయిన తర్వాత నేరుగా జియో కన్వెన్షన్ సెంటర్‌కెళ్లాం. ఆ సెంటర్ ఎంట్రన్స్ నుంచి నా ప్రదర్శన ఉన్న ఆడిటోరియంలో వేదిక వద్దకు చేరడానికి నాలుగు వేల అడుగులు పడ్డాయి. ఫోన్లో చెక్ చేసుకున్నాను కూడా. నిర్వహకులు వెంట ఉండి తీసుకెళ్లకపోతే నా వేదిక ఏదో తెలుసుకోవడంతోనే రోజు పూర్తయ్యేదేమో. నీతా అంబానీ స్వయంగా కళాకారిణి కావడంతో ఈ వేడుకలో కళాప్రదర్శనకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారనుకున్నాను. భోజనాల దగ్గర కూడా ఆర్టిస్టుల కోసమే ఒక పెద్ద హాలును కేటాయించారు. వేల రకాల వంటలు వడ్డించారని విన్నాను. కానీ నేను సలాడ్లు, కాఫీ మాత్రమే తీసుకున్నాను. పెళ్లి వేడుకలో నీతా అంబానీ ఎంత శ్రద్ధగా ప్రతి చిన్న విషయాన్నీ పట్టించుకున్నారంటే డెకరేషన్లో ఉన్న పూలను కూడా పరిశీలించి థీమ్‌కి అనుగుణంగా మార్పించారు. కొన్ని రోజులపాటు ఆమె మధ్యాహ్నం మూడు నుంచి తెల్లవారి ఆరుగంటల వరకు పని చేశారట. అయినా సరే ఆమె ముఖంలో అలసట కనిపించలేదు. గొప్ప ఆర్గనైజర్ ఆమె. వీణావాణి ఇచ్చిన వరం జనసందోహంలో నేను ఎక్కువ సేపు ఇమడలేను. నా కచేరీ పూర్తి కాగానే నన్ను బయటకు తీసుకెళ్లమని నిర్వహకులను అడిగాను. గేటు వరకు తీసుకొచ్చి వెహికల్ ఎక్కించేశారు. పదమూడవ తేదీ ఉదయం ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్‌కి వచ్చేసి హమ్మయ్య అనుకున్నాను. నాకిప్పుడు తలుచుకున్నా సరే అంతా కలలా అనిపిస్తోంది. ఆంధ్రుల ఆడపడుచుని, తెలంగాణ కోడలిని. నాకు తెలిసినంత వరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ వేడుకలో కళను ప్రదర్శించిన ఏకైక వ్యక్తిని నేనే... అనుకున్నప్పుడు గర్వంగా అనిపిస్తోంది. సరస్వతీ మాత వీణతోపాటు నాకిచ్చిన వరం ఈ అవకాశం అనుకుంటున్నాను’’ అని రెండు చేతులూ జోడించారు వీణాశ్రీవాణి తన వీణను మురిపెంగా చూసుకుంటూ.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో వీణ శ్రీవాణి సందడి
వీణ శ్రీవాణి.. ఈ పేరు సోషల్ మీడియాలో సెన్సేషన్.. వీణపై స్వరాలు పలికిస్తూ ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆమె టాలెంట్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినిమా పాటలతో పాటు భక్తి గీతాలను తన వీణతో వాయించటం శ్రీవాణి ప్రత్యేకత. తాజాగా ఆమె రిలయన్స్ గ్రూపు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. అక్కడ తన వీణ ద్వారా పెళ్లికి వచ్చిన అతిథిలను మెప్పించారు.అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలో దేశవిదేశాలకు చెందిన వ్యాపార, రాజకీయ, సినీ, క్రీడారంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్సు (బీకేసీ)లో ఉన్న జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వారి కల్యాణానికి వేదికగా నిలిచింది. అందులో వీణ శ్రీవాణి తన వీణా నైపుణ్యంతో అద్భుతంగా వాయించి మెప్పించారు.ఈ క్రమంలో అంబానీ పెళ్లి వేడుక గురించి వీణ శ్రీవాణి ఇలా చెప్పారు. 'ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు హాజరుకానున్న ఈ వేడుకులో నాకు వీణ వాయించే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. తెలుగు వారి తరుపన వెళ్లడం మరింత సంతోషాన్ని ఇచ్చింది. వారు మా కోసం ప్రేత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజీ చాలా అద్భుతంగా ఉంది. మన తెలుగు వారి సంప్రదాయాన్ని రిప్రెజెంట్ చేయాలని నేను ఎలా అయితే అనుకున్నానో అలాగే నీతా అంబానీ గారు కూడా నా డ్రస్‌ను సెలక్ట్ చేశారు. అంబానీ కుటుంబం చాలా గౌరవంగా పలకరించారు. ఎక్కడే కానీ చిన్న ఇబ్బంది కలగకుండా నన్ను చూసుకున్నారు.' అని ఆమె తెలిపింది. View this post on Instagram A post shared by Veena Srivani (satyavani Parankusham ) (@veenasrivani_official) -
Veena Srivani Latest Photos: వాగ్దేవి వరపుత్రిక శ్రీవాణి శ్రావ్యంగా మీటితే..! (ఫొటోలు)
-
మన డార్లింగ్ కోసం అంటూ.. 'ప్రభాస్'కు గిఫ్ట్ పంపిన వేణుస్వామి సతీమణి
వీణ శ్రీవాణి.. ఈ పేరు సోషల్ మీడియాలో సెన్సేషన్.. వీణపై స్వరాలు పలికిస్తూ ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆమె టాలెంట్‌కు లక్షల్లో అభిమానులు ఉన్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినిమా పాటలతో పాటు భక్తి గీతాలను తన వీణతో వాయించటం శ్రీవాణి ప్రత్యేకత. ఎప్పుడూ వీణతో పాటు కనిపించే ఆమె అసలు పేరు సత్యవాణి. పెళ్లయ్యాక శ్రీవాణిగా మారింది. అభిమానులు మాత్రం వీణ శ్రీవాణిగా మార్చేశారు. తాజాగా ప్రభాస్ కోసం శ్రీవాణి ఒక కానుక పంపి డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు. తాజాగా వీణ శ్రీవాణి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో వారు పండించిన సీతాఫలాలు చూపిస్తూ.. అవన్నీ మన డార్లింగ్ ప్రభాస్‌కు పంపుతున్నట్లు చెప్పారు. తాము పండించే సీతాఫలాలు ప్రతి సంవత్సరం కోంతమందికి పంపుతామని చెప్పుకొచ్చిన ఆమె ఈ క్రమంలో ఓ స్పెషల్ వ్యక్తికి ఆ ఫలాలను పంపిస్తే ఆయన దగ్గర నుంచి ప్రభాస్ వద్దకు చేరాయని ఇలా చెప్పుకొచ్చారు. 'ప్రభాస్ గారికి నేను పంపిన సీతాఫలాలు బాగా నచ్చడంతో ఇంకొన్ని సీతాఫలాలు కావాలని కోరారు. పాన్ ఇండియా రేంజ్ స్టార్ అయిన ప్రభాస్ అడిగితే పంపించకుండా ఎవరైనా ఉండగలరా..? అందుకే ఈ బాస్కెట్లో ఉన్న సీతాఫలాలన్నీ ప్రభాస్ గారి కోసం పంపిస్తున్నా. ఈ ఫలాలతో పాటు నా గుర్తుగా ఆయన కోసం హ్యాండ్ మేడ్ బ్యాగ్‌ను కూడా పంపిస్తున్నాను. ఈ ఏడాదికి ఇదే చివరి పంట. మళ్లీ వచ్చే సీజన్లో ప్రభాస్ కోసం మరోసారి సీతాఫలాలు పంపుతాను.' అని తెలిపారు. వీణ శ్రీవాణిగా ఆమె ఎంత పాపులరో తన భర్త ప్రముఖ జ్యోతిష్యులు అయిన వేణుస్వామి కూడా అంతే పాపులర్. వాస్తవంగా వేణుస్వామి కంటే ముందే వీణ శ్రీవాణికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. టాలీవుడ్ హీరోల పాటలను తన వీణతో ప్రత్యేకంగా హమ్ చేస్తూ వినిపించేది. అలా అందరి హీరోల అభిమానులు ఆమెను అభినందిస్తారు. పలువురి సెలబ్రిటీల జ్యోతిష్యాలు చెబుతూ వేణుస్వామి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో చాలామంది ప్రముఖలకు సంబంధించిన జ్యోతిష్య వివరాలను సోషల్ మీడియా వేదికగా ఆయన చెప్పారు. వాటిలో ఎక్కువ శాతం ఆయన చెప్పిన విధంగానే జరగడంతో వేణుస్వామిపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. ఒక్కోసారి భారీగా ట్రోల్స్ కూడా ఎదురు కావడం జరిగింది. అయినా వాటిని ఆయన ఏ మాత్రం లెక్కచేయరు. ఈ క్రమంలోనే ఒకసారి ప్రభాస్ గురించి మాట్లాడుతూ డార్లింగ్ సినిమాలకు కొంత కాలం పాటు పెద్దగా కలెక్షన్స్ రావని చెప్పడంతో.. వేణుస్వామిపై ప్రభాస్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఆయన సతీమణి డార్లింగ్ ప్రభాస్ కోసం సీతాఫలాలు పంపడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by Veena Srivani (satyavani Parankusham ) (@veenasrivani_official) -
సన్ రైజర్స్ రికార్డ్ బ్రేక్ : వీణ శ్రీవాణి మాస్ బీట్ సాంగ్ వైరల్!
ఐపీఎల్ పోరులో మరోసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ దుమ్ము రేపింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ చేసి తన రికార్డ్‌ను (287/3)తానే బ్రేక్ చేసింది. చిన్నస్వామి స్టేడియంలో హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల మోత మోగించారు. ముఖ్యంగా బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించిన హెడ్ విధ్వంసమే సృష్టించాడు. దీంతో పవర్ ప్లేలో కేవలం 7.1 ఓవర్లు ముగిసేసరికి స్కోర్ 100 పరుగులు దాటడం విశేషం. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఈ సందర్భాన్ని వీణ శ్రీవాణి కూడా సెలబ్రేట్ చేసుకుంది. సోషల్ మీడియాలో ఎ పుడూచురుగ్గా ఉంటూ తన అభిమానులను అలరించే శ్రీవాణి సన్‌రైజర్స్ విజయాన్ని స్పెషల్‌గా ఎంజాయ్ చేసింది. ఐపీఎల్ 2024 కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ రిలీజ్ చేసిన సాంగ్‌ను తన వీణతో అదరగొట్టేసింది శ్రీవాణి. తన వీణా వాయిద్యాన్ని కేవలం క్లాసిక్ మ్యూజిక్కు పరిమితం కాకుండా, మాస్ సాంగ్స్‌ను కూడా వాయిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్న శ్రీవాణి తాజాగా మాస్‌బీట్ ‘‘మేము బ్రో.. పక్కా ఇంకో రేంజ్ బ్రో’ తో ఇరగదీసింది. ఇది ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తోంది. View this post on Instagram A post shared by Veena Srivani (satyavani Parankusham ) (@veenasrivani_official) -
రీల్స్‌తో వేణు, శ్రీవాణి ‘మ్యూజిక్’ మామూలుగా లేదుగా!
ఆమె పేరుకు తగ్గట్టుగానే సంగీత సరస్వతి. అతను ఆమెకు దొరికిన తిరపతి లడ్డు. ఇపుడు వీరిద్దరూ సెలబ్రిటీ కపుల్‌గా సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇంతకీ వారెవ్వరో ఇప్పటికే అర్థమైపోయిందికదా. అవును వారే. సినీ, రాజకీయ రంగ ప్రముఖులకు జ్యోతిష్యంలో సలహాలు, సూచనలు ఇచ్చే వేణుస్వామి, యాంకర్‌గా మొదలై వీణా నైపుణ్యంతో పాపులరైన ‘వీణా శ్రీవాణి’. సోషల్ మీడియాలో ఎప్పటికపుడు అనేక పోస్ట్‌లు పెడుతూ లక్షలాది ఫాలోయర్లను సొంతం చేసుకుంది శ్రీవాణి. అనేక రకాల పాటలకు ఆమె వాయించే వీణ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలా ఇంట్రస్టింగ్ పోస్ట్‌లు, తన కచేరీలు, వీణ వీడియోలతో అభిమానులతో ఎపుడూ టచ్‌లో ఉంటుంది. తాజాగా వీరిద్దరు కశ్మీర్‌కు సమ్మర్ వెకేషన్‌కు చెక్కేశారు. దీనికి సంబంధించి రీల్స్‌ను కూడా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ ‘కింగ్ కాంగ్’ సినిమాలోఒక సీన్‌ను రీల్ చేశారు. దీంతో నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు మంచులో చిల్ అవుతూ కనిపించారు. అలాగే భారతదేశపు మినీ స్విట్జర్లాండ్ శ్రీనగర్‌లో పెహల్గాం వద్ద అందమైన లోయ సమీపంలో రోజా సినిమాలోని పాటకు వరుసగా ఇద్దరూ రీల్ చేసిన వీడియోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అంతేనా ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘మిర్చి’ సినిమాలోని ‘ఎలాంటి అమ్మాయి కావాలేంటి’ అనే డైలాగులతో భర్త వేణుస్వామితో రీల్ చేయడం ఇంట్రస్టింగ్‌గా మారింది. ఆ తరువాత టాలీవుడ్ ‘మన్మధుడు’ నాగార్జున సినిమాలోని నాగ్, బ్రహ్మీ ఫన్నీ సీన్ ను రీ క్రీయేట్ చేయడం విశేషంగా నిలిచిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Veena Srivani (satyavani Parankusham ) (@veenasrivani_official) -
స్మార్ట్ స్కోప్: సర్వైకల్ క్యాన్సర్‌ను ముందుగానే.. కనిపెట్టొచ్చు
సర్వైకల్ క్యాన్సర్‌ను ముందుగానే పసిగట్టే సంస్థ ‘స్మార్ట్ స్కోప్’ అనే డిజిటల్ డివైజ్‌ను రూపొందించింది పుణెలోని పెరివింకిల్ టెక్నాలజీస్... మహిళలకు ఎక్కువగా వచ్చే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని పసిగట్టడంలో ‘స్మార్ట్ స్కోప్’ కీలకపాత్ర పోషిస్తోంది. యూఎస్, యూకేలలో పని చేసిన వీణా మోక్తాలి ఆమె భర్త కౌస్తుభ్ నాయక్‌లు మన దేశానికి వచ్చి పుణె కేంద్రంగా పెరివింకిల్ టెక్నాలజీకి శ్రీకారం చుట్టారు. ఈ కంపెనీ నుంచి వచ్చిన ‘స్మార్ట్ స్కోప్’ డిజిటల్ డివైజ్ సులభంగా ఉపయోగించేలా ఉంటుంది. ‘ప్రస్తుతం ఉన్న సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పద్ధతులు సమయం తీసుకుంటాయి. ఈ సౌకర్యాలు పెద్ద నగరాల్లోని సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఫలితంగా ఎక్కువమంది మహిళలు స్క్రీనింగ్ చేయించుకోలేకపోతున్నారు’ అంటుంది వీణ. ఈ నేపథ్యంలో ‘స్మార్ట్ స్కోప్’ అనేది చిన్న ప్రైవేట్ క్లినిక్, నర్సింగ్ హోమ్స్, మున్సిపల్ డిస్పెన్సరీలు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, జిల్లా ఆస్పత్రులలో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఒక బ్యాంకు మేనేజర్‌కు గ్రేడ్–2 దశలో క్యాన్సర్‌ని గుర్తించడంలో స్మార్ట్ స్కోప్ ఉపయోగపడింది. మన దేశంలోని ఆరు రాష్ట్రాలకు చెందిన లక్షమంది ఈ పరికరం సహాయంతో జాగ్రత్త పడ్డారు. ఈ డివైజ్ నిర్వహణ ఖర్చు తక్కువ కావడం కూడా మరో సానుకూల అంశం. ‘కూలి పనుల వల్ల రోజుల తరబడి ప్రయాణాలు చేసే టైమ్ గ్రామీణ మహిళలకు ఉండడం లేదు. స్మార్ట్ స్కోప్ ద్వారా ఫలితం కోసం ఎక్కువ సమయం ఎదురు చూడాల్సిన అవసరం లేదు’ అంటుంది వీణ. అంతర్జాతీయ మార్కెట్లోకి కూడా విస్తరించాలనే లక్ష్యం ఏర్పాటు చేసుకొని ఆ దిశగా వడి వడిగా అడుగులు వేస్తోంది వీణా మొక్తాలి. ఇవి చదవండి: అనిషా పదుకోన్: మహిళల మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు.. -
బాధ కాదు బాట చూడాలి..
బెంగళూరుకు చెందిన వీణా అంబరీష బస్సు ప్రమాదంలో కుడి కాలిని కోల్పోయింది. ఆ తరువాత డిప్రెషన్ బారిన పడింది. ఆ చీకటి నుంచి అతి కష్టం మీద బయటపడి అర్ధంతరంగా ఆగిపోయిన చదువును కొనసాగించింది. ఆ తరువాత ఎంబీఏ చేసింది. ‘కరీ దోశ’ పేరుతో ఫుడ్ స్టాల్ ప్రారంభించి తన కాళ్ల మీద తాను నిలబడుతూ ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తోంది వీణా అంబరీష. కొన్ని సంవత్సరాల క్రితం.. భరతనాట్యం డ్యాన్సర్ అయిన వీణ తన ఆరంగేట్రం కోసం సన్నాహాలు చేసుకుంటోంది. కాలేజీకి వెళ్లడానికి రోడ్దు దాటుతున్నప్పుడు బస్సు ఢీకొట్టడంతో ప్రమాదానికి గురై కుడికాలు కోల్పోయింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన తరువాత వాకింగ్ స్టిక్‌తో నడవడం మొదలు పెట్టింది. చాలా కష్టంగా అనిపించేది. భరతనాట్య కళాకారిణిగా పేరు తెచ్చుకోవాలని ఎన్నో కలలు కన్న వీణ తనకు జరిగిన ప్రమాదాన్ని జీర్ణించుకోలేపోయింది. కలల రెక్కలు విరిగిన బాధ ఆమె కళ్లలో కన్నీరై కనిపించేది. ‘నాకు ఇలా జరిగిందేమిటి!’ అని ఒకటికి పదిసార్లు అనుకోవడం వల్ల వీణ పరిస్థితి ఎక్కడి దాకా వెళ్లిందంటే.. ‘ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో దారి లేదు’ అని బలంగా అనుకునేంతగా. అయితే వీణ తన నిర్ణయం మార్చుకోవడానికి ఒక దృశ్యం కారణం అయింది. ఆ దృశ్యం తనకు వేకప్–కాల్‌గా పనిచేసింది. ఫిజికల్ డిజేబిలిటీ సర్టిఫికెట్ తీసుకోవడానికి విక్టోరియా హాస్పిటల్‌కు వెళ్లిన వీణ అక్కడ ఒక మహిళను చూసింది. ఆమెకు రెండు కాళ్లు లేవు. ఆమె తన బిడ్డను లాలిస్తూ బువ్వ తినిపిస్తోంది. ఒక క్షణం ఆమె ముఖం వైపు చూసింది వీణ. రవ్వంత బాధ కూడా ఆమె ముఖంలో కనిపించలేదు. జీవనోత్సాహంతో ఆ ముఖం వెలిగిపోతోంది. తాను ఏవైతే పెద్ద సమస్యలు అనుకుంటుందో అవి గాలిలో దూదిపింజల్లా ఎగిరిపోయాయి. ఈ ఒక్క దృశ్యం వీణ ఆలోచనలో పూర్తిగా మార్పు తీసుకువచ్చింది. ‘ఏదో సాధించాలి’ అనే ఉత్సాహం మనసులోకి వచ్చింది. ఆగిపోయిన చదువును కొనసాగించింది. మంచి మార్కులతో పరీక్షలు పాసైంది. ఆ తరువాత ఎంబీఏ పూర్తి చేసింది. బ్యాంకులలో సేల్స్ ఆఫీసర్‌గా, ఐటీ పరిశ్రమలో సాఫ్ట్వేర్ టెస్టర్‌గా పనిచేసింది. ఒకవైపు గంటల కొద్దీ చేసే ఉద్యోగం.. మరోవైపు పిల్లల ఆలనా పాలనా కష్టమనిపించింది. ఒక సౌత్ అమెరికన్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఎడతెగకుండా జరిగే మీటింగ్‌లు, పనిభారం వల్ల కాలికి ఇన్ఫెక్షన్ వచ్చి హాస్పిటల్లో పదిహేను రోజులు ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలోనే సొంతంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది వీణ. దానికి ఫిట్నెస్ ట్రెయినర్ అయిన ఆమె భర్త ప్రోత్సాహం తోడైంది. గత సంవత్సరం బెంగళూరులో ‘కరీ దోశ’ పేరుతో దోశ స్టాల్ మొదలు పెట్టినప్పుడు ‘ఎంబీఏ చదివి ఇదేమిటీ’ అన్నట్లుగా మాట్లాడారు కొద్దిమంది. వారి మాటలేవీ పట్టించుకోలేదు వీణ. ప్రత్యేకత ఉంటేనే ఫుడ్ స్టాల్ అయినా పెద్ద వ్యాపారమైనా విజయం సాధిస్తుంది. మరి ‘కరీ దోశ’ స్పెషల్ ఏమిటి? కరీ దోశే! తమిళనాడులోని మధురై ప్రాంతంలో ‘కరీ దోశ’గా పిలిచే వేడి వేడి దోశ దానిపై ఆమ్లెట్, మటన్ కీమా చాలా ఫేమస్. కరీ దోశ బెంగళూరులో కూడా హిట్ అయింది. ఈ దోశ కోసం కస్టమర్లు పొద్దున్నే లైన్ కడతారు. స్టాల్ ప్రారంభించడానికి ముందు ‘కరీ దోశ’ రుచులలో ప్రావీణ్యం సంపాదించడానికి రెండు నెలల పాటు ఇంట్లోనే ఉంది వీణ. వంటగది తన పాఠశాలగా, ప్రయోగశాలగా మారింది. ‘కరీ దోశ’ స్టాల్ పొద్దున ఏడు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అందుబాటులో ఉంటుంది. ఇక మిగిలిన సమయమంతా ఇంట్లోనే పిల్లలతో గడుపుతుంది వీణ. చిరునవ్వే సందేశం.. బాధ లేనిది ఎవరికి? బాధ పడుతూ కూర్చోవడం కంటే దాని నుంచి బయటపడడానికి కొత్తబాట వెదకాలి. మనకంటే ఎక్కువ బాధలు పడుతున్న వారు, పెద్ద పెద్ద సమస్యల్లో ఉన్న వారు ఎంతోమంది మన చుట్టుపక్కలే ఉన్నారు. అంత కష్టంలోనూ వారి పెదవి మీద కనిపించే చిరునవ్వు మనకు సందేశాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తుంది. – వీణా అంబరీష ఇవి చదవండి: World Human Trafficking Day: ట్రాఫికింగ్ నెట్‌తో జాగ్రత్త! -
అవకాశాలను సృష్టించుకోవాలి!
‘డ్రీమ్ బిగ్, ఫాలో యువర్ పాషన్, వర్క్ హార్డ్, వర్క్ స్మార్ట్’... నాలుగు మాటలు. ఈ నాలుగు మాటలే వీణాగుండవెల్లిని విజేతగా నిలబెట్టాయి. ‘ఇలా ముందుకెళ్లమని నాకెవ్వరూ చెప్పలేదు. స్వీయశోధన తో తెలుసుకున్న సత్యాలివి. కొత్తతరానికి నేను చెప్పగలిగిన సూచన ఇది. నేను ఆచరించిన మార్గమే నా సందేశం’ అన్నారామె. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చేసిన వీణ ఆ తర్వాత యూఎస్ వెళ్లి శాంటాక్లారా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేశారు. యూఎస్‌లోని సిలికాన్ వ్యాలీ కేంద్రంగా ఇమాజియా సాఫ్ట్వేర్ కంపెనీని నిర్వహిస్తున్న వీణ ఇటీవల హైదరాబాద్‌కి వచ్చినప్పుడు సాంకేతిక రంగంలో విజయవంతమైన తన జర్నీని ఆమె ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘యూఎస్‌లో నేను కానన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, సిస్కో సిస్టమ్స్‌లో పని చేసిన తర్వాత టెక్నాలజీ రంగంలో సొంత కంపెనీ ప్రారంభించాను. ఇంటర్నెట్ మొదలైన రోజులు, అలాగే వైటూకే క్రైసిస్ ఎదురైన రోజులు కూడా. ఆ సమస్యలను అధిగమిస్తూ ఇంటర్నెట్ ఆధారిత ఫైనాన్స్ అప్లికేషన్స్ సర్వీసులందించింది మా సంస్థ. ఈ టెక్నాలజీకి భవిష్యత్తు ఉందని నమ్మాను, నా నమ్మకమే పునాదిగా ముందుకెళ్లాను. ఒక దశ తరవాత కంపెనీ కార్యకలాపా లను విస్తరించాలనే ఉద్దేశంతో వెంచర్ క్యాపిటల్ ద్వారా ఫండ్ రైజింగ్ మొదలుపెట్టాను. మా కంపెనీ సేవల పట్ల నమ్మకం కలిగినప్పటికీ పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ముందడుగు వేయలేక΄ోయారు. అందుకు కారణం మహిళను కావడమే. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను కాన్ఫిడెంట్‌గా ముందుకెళ్తున్నాను. ఆ మేరకు పెట్టుబడి పెట్టేవాళ్లలో విశ్వాసం కలిగించడం కొంచెం కష్టమైందనే చెప్పాలి. కష్టం అని వదిలిన వాళ్ల వెంట సక్సెస్ రాదు. కష్టాన్ని జయించడమే విజయానికి తొలిమెట్టు. మొత్తానికి నాకున్న సాంకేతిక పరిజ్ఞానం పట్ల విశ్వాసం కలిగిన తరవాత పెట్టుబడులు పెట్టారు. కానీ ఆ తర్వాత ‘మీ కంపెనీలో మా ప్రతినిధి సీఈవో హోదాలో ఉంటారు. మీరు టెక్నాలజీ పా ర్ట్ చూసుకోండి’ అన్నారు. ఆ షరతును అంగీకరించాల్సి వచ్చింది. కానీ ఆ ప్రయత్నం విజయవంతం కాలేదు. టాప్‌లో ఉన్న మా కంపెనీ ఒడిదొడుకులకు లోనయింది. తిరిగి టాప్‌లో నిలపడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. ముందుచూపు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వినియోగం ఇప్పుడు బాగా ఎక్కువైంది. మేము 2015లోప్రోడక్ట్ బిల్డ్ చేశాం. సాంకేతిక రంగానికి ఏఐని పరిచయం చేశామని చెప్పాలి. ఆ తర్వాత మూడేళ్లకు కృత్రిమ మేధ ఆధారిత ఆర్థిక సహకారాన్ని డిజిటల్‌గా అందించడం మొదలుపెట్టాం. మరో రెండేళ్లలో ఫైనాన్షియల్ డాక్యుమెంట్లను చదివి, ప్రాజెస్ చేయగలిగిన తొలి ఏఐ ఇంజన్‌ను తీసుకొచ్చాం. ఈ రంగంలో మేమిచ్చిన డైరెక్షన్‌ను ముందుచూపున్న కంపెనీలు అందుకున్నాయి. మేము ఏఐ ఆధారిత డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నాం. ఆర్థిక లావాదేవీలు వేగంగా జరుగుతుంటే వ్యాపా రం కూడా అంతే వేగంగా జరుగుతుంది. ఓటూసీ (ఆర్డర్ టూ కస్టమర్) ్రపా సెస్‌ని మా కంపెనీ చేస్తుంది. తొంభై దేశాల్లో, 25 భాషల్లో మా సేవలందింస్తున్నాం. భవిష్యత్తు దర్శనం విజేత కావాలంటే భవిష్యత్తును దర్శించగలగాలి. ఆలోచనను ఆచరణలో పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకూడదు. అలాగే అవకాశాలను అందిపుచ్చుకోవడమనేది పా త మాట. అవకాశాలను సృష్టించుకోవాలనేది ఈ జనరేషన్ అనుసరించాల్సిన ఫార్ములా. హెన్రీ ఫోర్డ్ ఒక ఇంజనీర్‌గా మిగిలిపోలేదు. తన ఆలోచనతో రవాణాకు యంత్రంతో నడిచే కారు అనే వాహనానికి రూపకల్పన చేసి పా రిశ్రామికవేత్త అయ్యాడు. గుర్రం మీద ప్రయాణించే కాలాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. మన ఆలోచన సమాజానికంటే ముందుండాలి. అది శతాబ్దం కావచ్చు, దశాబ్దం కావచ్చు. ఆ సమయానికి సమాజం మన ఆలోచనను స్వాగతించవచ్చు లేదా విమర్శించనూ వచ్చు. కానీ దానిని నిరూపించిన తరవాత మన వెంట నడిచి తీరుతుంది’’ అన్నారు వీణా గుండవెల్లి. ఆమె తన విజయాలనే పా ఠ్యాంశాలుగా కాలిఫోర్నియా యూనివర్సిటీలో బోధిస్తున్నారు. అల్పాదాయ వర్గాల వారికి సహాయం చేయడానికి టచ్ ఏ లైఫ్ పేరుతో ఒక ఫౌండేషన్ ద్వారా సేవలందిస్తున్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ, సామాజిక ప్రయోజనం చేకూరే స్టార్టప్‌లతో ముందుకు వచ్చే యువతకు చేయూతనిస్తున్నారు. ఈ ప్రయాణంలో ఆమెను వరించిన అవార్డుల ప్రస్తావనకు ఆమె ‘ఎన్నని చెప్పాలి, అయినా ఆ లెక్క ఇప్పుడెందుకు’ అన్నారు నవ్వుతూ. – వాకా మంజులారెడ్డి -
మోగింది వీణ... నెటిజనుల గుండెలలోనా!
పాటలలో వీణ పాటల తీయదనం వేరయా! మన తెలుగులోనైతే ‘లీలాకృష్ణా నీ లీలలు’ ‘ఈ వీణపైన పలికిన రాగం... నాలో విరిసిన అనురాగం’లాంటి ఎన్నో పాటలు గుర్తు వస్తాయి. హిందీలోనైతే ‘మేరీ వీణ తుమ్ బిన్ రోయే’ (దేఖ్ కబిర రోయా–1957)లాంటివి ఎన్నో గుర్తు వస్తాయి. ఇక అసలు విషయానికి వస్తే... వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన హిందీ సినిమా ‘బేడియా’ లోని ‘అప్నా బనా లే పియా’ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సచిన్–జిగర్ ద్వయం కంపోజ్ చేసిన ఈ పాటను కుశాల అనే మెడిసిన్ స్టూడెంట్ వీణపై అద్భుతంగా ప్లే చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వేలాది లైకులను సొంతం చేసుకుంది. ఈ వీడియో నేపథ్యంలో నెటిజనులు భారతీయ సినిమాలలోని ప్రసిద్ధ వీణ పాటలను గుర్తు తెచ్చుకున్నారు. రాగాల గురించి వివరంగా మాట్లాడుకున్నారు. కొందరు మాత్రం ‘మన సినిమాలో వీణ పాటలు బొత్తిగా కరువయ్యాయి’ అంటూ కడు విచారం వ్యక్తం చేశారు. -
బొబ్బిలి వీణ.. శిఖరాగ్ర ఆదరణ
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన 20 సభ్యదేశాల శిఖరాగ్ర సమావేశాల్లో బొబ్బిలి వీణ వైభవాన్ని చాటుకోనుంది. విశాఖలో ఈ నెల 28, 29వ తేదీల్లో జరగనున్న జీ–20 సదస్సుకు వివిధ దేశాల నుంచి హాజరయ్యే అతిథులను గౌరవించేందుకు 200 బొబ్బిలి వీణలను అధికారులు ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉన్నందున ఆయన చేతుల మీదుగా వీటిని ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే అతిథులకు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖలో ఈ నెల 3, 4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు దేశం నలుమూలల నుంచి హాజరైన పారిశ్రామిక దిగ్గజాలు, ఔత్సాహికులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బొబ్బిలి వీణలను బహూకరించారు. బొబ్బిలి పట్టణ పరిధిలోని గొల్లపల్లికి చెందిన సర్వసిద్ధి ఇంటిపేరు గల కుటుంబీకులే దశాబ్దాలుగా బొబ్బిలి వీణలను తయారుచేస్తూ వస్తున్నారు. వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ద్వారా 1994వ సంవత్సరంలో సొసైటీని ఏర్పాటు చేసింది. 2002లో బొబ్బిలి పట్ణణ పరిధిలోని గొల్లపల్లిలో వీణల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది వీణల తయారీయే ఆధారంగా ఉన్న మా కళాకారులకు టీటీడీతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సందర్భంలో 200 వీణలను తయారుచేసి అందించాం. అతిథుల కోసం మా వీణలతో కచేరీ కూడా ఏర్పాటు చేయించారు. ఈ నెలలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న మరో ప్రతిష్టాత్మక సదస్సు జీ–20 కోసం కూడా 200 వీణలకు ఆర్డర్ వచ్చింది. – సర్వసిద్ధి రామకృష్ణ, ఇన్చార్జి, బొబ్బిలి వీణల కేంద్రం -
నేను బతికే ఉన్నా, నా కుమారుడు చంపలేదు: సీనియర్ నటి
ఆస్తి కోసం సీనియర్ నటి వీణా కపూర్‌ను కన్న కొడుకే హత్య చేశాడంటూ ఇటీవల జాతీయ మీడియాలో ఓ వార్త వైరల్ అయిన విషయం తెలిసిందే కదా! తాజాగా అది అబద్ధమని, తాను బతికే ఉన్నానంటూ పోలీసుల ఎదుట ప్రత్యక్షమైంది నటి వీణా. తాను చనిపోయినట్లు పుకార్లు పుట్టించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ తన కుమారుడు అభిషేక్ చడ్డాతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై వీణా కపూర్ మాట్లాడుతూ.. 'నా కొడుకు నన్ను హత్య చేశాడన్నది పూర్తిగా అబద్ధం. అసలు నిజమేంటంటే వీణా కపూర్ పేరుతో ఉన్న మరో మహిళపై మర్డర్ జరిగింది. ఇక్కడ ఇద్దరి పేర్లు ఒకటే అయినంత మాత్రాన ఆ మరణాన్ని నాకు ఆపాదిస్తారా? నేను జుహులో కాదు, గుర్గావ్లో ఉంటున్నాను. నా కొడుకుతో కలిసి నివసిస్తున్నాను. నేను చనిపోలేదు, బతికే ఉన్నాను. దయచేసి అసత్యపు ప్రచారాన్ని నమ్మకండి. ఇప్పటికే దీనిపై మేము ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోనీలే అని కంప్లైంట్ చేయకుండా వదిలేస్తే రేపు ఇంకొకరికి కూడా ఇలాగే జరుగుతుంది. ఇప్పటికే వందల ఫోన్ కాల్స్‌తో నాకు మెంటల్ టార్చర్ అవుతుంది. షూటింగ్లో నా వర్క్‌పై ఫోకస్ చేయలేకపోతున్నాను. ఇంకెవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు' అని చెప్పుకొచ్చింది. వీణా కపూర్ తనయుడు అభిషేక్ చడ్డా మాట్లాడుతూ.. 'అమ్మను ఎందుకు చంపావని చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు. నేను తనను చంపలేదు, తను బతికే ఉంది. నేను నా తల్లిని కిరాతకంగా హత్య చేసినట్లు వార్తలు వచ్చాయి. అది చూసి నేను అస్వస్థతకు లోనయ్యాను. అసలు ఇలాంటిది నేను కలలో కూడా ఊహించలేదు. అమ్మంటే నాకెంతో ఇష్టం. దయచేసి ఇక అసత్య ప్రచారాలకు ఫుల్స్టాప్ పెట్టండి' అని కోరాడు. కాగా ముంబైలో గతవారం వీణాకపూర్(74) అనే మహిళను కన్నకొడుకు సచిన్ కపూర్ బ్యాటుతో కొట్టి చంపాడు. ఆస్తి విషయంలో తగాదా రావడంతో బేస్‌బాల్ బ్యాటుతో తల్లి తలను పగలగొట్టి తర్వాత శవాన్ని నదిలో పడేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. చదవండి: ఏం చేయాలో సరిగ్గా చెప్పి చావు.. పూరీపై హీరోయిన్ ఫైర్ ఎన్నోవారాలుగా రోహిత్‌కు అన్యాయం, చిట్టచివరకు ఒక్క ఛాన్స్ దొరికింది -
నటి దారుణ హత్య, తల్లిని కిరాతకంగా చంపిన కుమారుడు
ముంబై: ఆస్తి కోసం కన్నవాళ్లను కూడా కడతేర్చడానికి వెనకాడట్లేదు. డబ్బు పిచ్చితో పేగుబంధాన్ని మర్చిపోయి తల్లిదండ్రులనే చంపడానికి సిద్ధపడుతున్నారు. ఆస్తి కోసం ఓ ముంబైవాసి తన తల్లిని బేస్‌బాల్ బ్యాటుతో పలుమార్లు కొట్టి చంపిన ఘటన ఎంతోమందిని కలిచివేసింది. కన్న కొడుకు చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఆ తల్లి ఎవరో కాదు, సీనియర్ నటి వీణా కపూర్(74) అని తెలియడంతో సినీ ఇండస్ట్రీ షాక్‌కు గురైంది. ఆస్తి విషయంలో తగాదా రావడంతో వీణా కపూర్‌ను ఆమె కుమారుడు సచిన్ మంగళవారం నాడు హత్య చేశాడు. బేస్‌బాల్ బ్యాటుతో ఆమె తలను పగలగొట్టి, తర్వాత శవాన్ని ఓ నదిలో పడేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సచిన్‌తో పాటు అతడికి సాయం చేసిన లాలాకుమార్ మండల్‌ను అరెస్ట్ చేశారు. రూ.12 కోట్ల విలువైన ప్లాట్ విషయంలో గొడవ జరిగిందని, ఈ క్రమంలోనే వీణా కపూర్‌ను హత్య చేసినట్లు సచిన్ నేరం అంగీకరించాడు. వీణా కపూర్ మరణంపై ఆమె స్నేహితురాలు, నటి నీలూ కోహ్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అమెరికాలో ఉంటున్న వీణా కపూర్ మరో కుమారిడికి అనుమానం రావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో సచిన్ తన తల్లిని చంపినట్లు నేరాన్ని అంగీకరించాడు. ఆస్తి గొడవల వల్లే ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. వీణాకు ఇలా జరగాల్సింది కాదు. నా గుండె పగిలింది. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఎన్నో ఏళ్ల తర్వాత మీకు ఇప్పటికైనా శాంతి దొరుకుతుందని ఆశిస్తున్నాను. View this post on Instagram A post shared by Nilu Kohli (@nilukohli) చదవండి: షాకిచ్చిన బిగ్‌బాస్.. ఇనయ ఎలిమినేట్? నిర్మాతల మండలిపై సురేశ్‌బాబు సంచలన వ్యాఖ్యలు -
స్వరాల పుస్తకం
అది బెంగళూరు నగరం జయనగర్... నిత్యం సప్తస్వరాలు పలికే ఓ రాగాలయం... ఆ గాననిలయం గాయని శైలజాపంతులు నివాసం. కిత్తూరు రాణి చెన్నమ్మ పురస్కారం... ప్రసిద్ధగాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి అవార్డు... లెక్కకు మించిన సత్కారాలు... కన్నడనాట తెలుగు గాయనికి అందుతున్న గౌరవం. గాత్రసేవలో తరిస్తున్న స్వరాల పుస్తకం ఆమె. ఆమె సంగీత ప్రస్థానం... ఆమె మాటల్లోనే... ‘‘మా ఇంటికి వచ్చిన వాళ్లు ‘ఇంట్లో సప్తస్వరాలతోపాటు త్రిమూర్తులు కూడా వెలిశారు’ అనీ, ‘ఇల్లు దశావతారాలకు ప్రతిబింబంగా ఉంది’ అనీ జోకులేసేవారు. ముగ్గురు అబ్బాయిలు. ఏడుగురు అమ్మాయిల్లో నేను చిన్నదాన్ని. నాకు మా మేనత్త పోలికలతోపాటు ఆమె స్వరం కూడా వచ్చిందని గుర్తు చేసుకునే వారు నాన్న. స్కూల్లో ప్రార్థనాగీతాలు, బృందగానాలు ఇష్టంగా పాడేదాన్ని. నా ఆసక్తిని గమనించిన నాన్న నాకు, చిన్నక్క రమాదేవికి సంగీతంలో శిక్షణ ఇప్పించడానికి తనవంతుగా మంచి ప్రయత్నమే చేశారు. మా ఊరు చిత్తూరు జిల్లా బీరంగి కొత్తకోట. బెంగళూరు నుంచి మాస్టారు వారాంతాల్లో మా ఊరికి వచ్చి సంగీతం నేర్పించే ఏర్పాటు చేశారు. వెంకటేశ్ భాగవతార్ మాస్టారు ప్రతివారం రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి పాఠాలు చెప్పేవారు. కానీ ఎక్కువ కాలం కొనసాగడం కష్టమైంది. తొలుత ఏకలవ్య శిష్యరికం నేను ప్రఖ్యాత గాయని ఎమ్ ఎల్ వసంతకుమారి శిష్యురాలిని, ఏడేళ్లు ఆమె దగ్గరే ఉండి శుశ్రూష చేసి చదువుకుంటూ సంగీతం నేర్చుకున్నాను. ఆడపిల్లలు ఇంటి ఆవరణ దాటడానికి కూడా ఇష్టపడని సంప్రదాయ కుటుంబం మాది. అలాంటి రోజుల్లో అన్నయ్య నరేంద్రరావు చొరవ తీసుకుని నాన్నని ఒప్పిస్తూ ఒక్కో అడుగూ ముందుకు వేయించాడు. అక్క, నేను ఎమ్ఎల్ వసంతకుమారి గారికి ఏకలవ్య శిష్యులం. ఇంట్లో రోజూ ఆమె పాటల క్యాసెట్ పెట్టుకుని సంగీత సాధన చేసేవాళ్లం. అలాంటిది ఆ గాయని ఓ రోజు రిషివ్యాలీ స్కూల్‌కి వస్తున్నట్లు సమాచారం తెలిసి అన్నయ్య మమ్మల్ని తీసుకువెళ్లి ఆమెను చూపించాడు. అప్పుడు ఆమె దగ్గర సంగీతం నేర్చుకోగలననే ఆలోచన నా ఊహకు కూడా అందలేదు. దేవుడు సంకల్పించినట్లుగా ఆమె ఓ రోజు వైద్యం కోసం మా మేనమామ క్లినిక్‌కి వచ్చారు. అప్పుడు మా మామ ఆమెను రిక్వెస్ట్ చేయడం, ఆమె వెంటనే రిషి వ్యాలీ స్కూల్లో చేర్పించమని చెప్పడం జరిగిపోయాయి. చేరడం వరకు సులువుగానే జరిగింది. కానీ అక్కడికి వెళ్లి రావడం చాలా కష్టమయ్యేది. వారాంతాల్లో క్లాసులు. మా ఊరి నుంచి ‘అంగళ్లు’ అనే ఊరి వరకు బస్‌లో వెళ్లి, అక్కడి నుంచి మూడు కిలోమీటర్లు నడిచి రిషివ్యాలీ చేరేవాళ్లం. ఆ స్కూల్లో తెలుగు మాస్టారు రామచంద్రరావు గారు మా దూరపుబంధువు. వారింట్లో ఉండి సంగీతం నేర్చుకోవడం, సోమవారం ఉదయాన్నే బయలుదేరి మా ఊరికి రావడం. ధర్మవరం కాలేజ్‌లో ఇంటర్ చదువు... ఈ దశలో చదువు సరిగ్గా సాగలేదు. ఇదిలా ఉండగా అక్కకు పెళ్లయి బెంగుళూరుకు వెళ్లిపోయింది. ఇక నాది ఒంటరి పోరాటమే అయింది. ఇంట్లో వాళ్లు చదువు లేదా సంగీతం ఏదో ఒకటి మానిపించాలనే ఆలోచనలోకి వచ్చేశారు. అప్పుడు నేను ‘ప్రైవేట్‌గా చదువుకుంటూ సంగీతం నేర్చుకుంటాను’ అని మొండిగా పట్టుపట్టాను. అలా మా గురువుగారు వసంతకుమారి గారింటికి చేరాను. ఏడేళ్లు అక్కడే ఉండి గురు శుశ్రూష చేశాను. ఆమె శిష్యరికంలో సంగీత సాధన చేస్తూ ఆమె జతతో కచేరీల్లో పాల్గొంటూ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలో పీజీ చేశాను. వరుడి కోసం వేట మా అన్న మద్దతు అక్కడితో ఆగిపోలేదు. నాకు వరుడిని వెతికే పనిని ఒక యజ్ఞంలా చేశాడు. నా పెళ్లి నాటికి నాన్న లేరు, బాధ్యతంతా అన్నయ్య దే. సంగీతం విలువ తెలిసిన కుటుంబం అయితేనే నా సాధన కొనసాగుతుందనే ఉద్దేశ్యంతో సంగీతం వచ్చిన వరుడి కోసం గాలించాడు. అలా... బెంగళూరులో స్థిరపడిన తెలుగు కుటుంబంలో మృదంగవాద్యకారుడికిచ్చి పెళ్లి చేశారు. మా వారు రఘుపంతులుకి సొంత వ్యాపారం ఉంది. కానీ సంగీతం పట్ల ఆయనకు అపారమైన ఇష్టం, గౌరవం. అలా పెద్ద సంగీత కుటుంబంలోకి కోడలిగా వెళ్లాను. అన్నిరకాల సౌకర్యాలూ ఉన్నప్పటికీ ముగ్గురు పిల్లల పెంపకంతో నాకు సంగీత కచేరీలకు పదేళ్లు విరామం వచ్చేసింది. అప్పుడు మావారు పిల్లల పనులకు సహాయకులను నియమించుకుని సంగీత సాధనకు వెసులుబాటు చేసుకోమని సూచించారు. రాగాల పరిశోధన సంగీతం ఆహ్లాదకారకం మాత్రమే కాదు, దివ్యమైన ఔషధం కూడా. ఇది నిరూపణ అయిన వాస్తవమే, కానీ ఏ రాగంతో ఏ అనారోగ్యం నుంచి సాంత్వన కలుగుతుందోనని స్వయంగా శోధించి తెలుసుకున్నాను. బీపీ, డయాబెటిస్, ఒత్తిడి, ఊపిరితిత్తుల సమస్యల నుంచి చక్కటి ఉపశమనం లభిస్తుంది. నేచర్ క్యాంపులు పెట్టి ప్రకృతి ఒడిలో రాగాలాపన చేస్తాం. మెంటల్ హెల్త్ విభాగానికి మానసిక సమస్యలకు సాంత్వన కలిగించే మ్యూజిక్ థెరపీ ప్రాజెక్టు సిద్ధం చేసిచ్చాను. ప్రఖ్యాత వాగ్గేయకారుడు పురందరదాసు చెప్పినట్లు సంగీతజ్ఞానం ప్రతి ఇంట్లో ఉండాలనేదే నా ఆకాంక్ష. సంగీతం అనే ఔషధసేవనం చేసే వాళ్లకు అనేక అనారోగ్యాలు దూరంగా ఉంటాయి. లెక్కకు మించిన అవార్డులు అందుకున్నప్పటికీ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎంఎస్ సుబ్బులక్ష్మి అవార్డు అందుకోవడంతో నా జన్మధన్యం అయింది. సంగీతం కోసం ఇంకా ఇంకా సేవ చేయాల్సిన బాధ్యత కూడా పెరిగింది. గురుకులాన్ని ప్రారంభించాలనేది తదుపరి లక్ష్యం. నేను మొదలుపెడితే మరొకరు అందిపుచ్చుకుని కొనసాగిస్తారు’’ అన్నారు శైలజాపంతులు. సరిగమల గ్రాఫ్ సంగీతంలో జూనియర్, సీనియర్ విద్వత్తు కోర్సు చేశాను. సంగీత సాధన కోసమే ఇంట్లో ఒక గదిని కేటాయించుకుని చాలా తీవ్రంగా సాధన చేసి గ్రాఫో టెక్నాలజీకి రూపకల్పన చేశాను. నాకు డాక్టరేట్ వచ్చింది ఈ సర్వీస్‌కే. సంగీతం నేర్చుకునే వారికి సులువుగా ఉండే విధానం అది. నా మనుమరాలు నాలుగేళ్ల ‘పూర్వి’ కూడా గ్రాఫ్ చూస్తూ పాడేస్తుంది. గ్రాఫో టెక్నాలజీతో సంగీత పాఠాల పుస్తకాలు రాయడం మొదలుపెట్టాను. సంగీతం కోసం తీవ్రంగా పనిచేయాలనే నిర్ణయానికి వచ్చి 2001లో ... అత్తమామల పేర్లు, తిరుమల బాలాజీ పేరు వచ్చేటట్లు శ్రీవెంకట్ మ్యూజిక్ అకాడమీ స్థాపించాను. ఒక్క స్టూడెంట్‌తో మొదలైన అకాడమీలో ఇప్పుడు మూడు వందలకు పైగా విద్యార్థులు సంగీత సాధన చేస్తున్నారు. వాళ్లకు నేర్పించడం కోసం రోజుకు ఐదారు గంటల సేపు నేను కూడా పాడతాను. – డాక్టర్ శైలజాపంతులు, ప్రసిద్ధగాయని, బెంగళూరు – వాకా మంజులారెడ్డి ఫొటోలు : మోర్ల అనిల్ కుమార్ -
అగ్రరాజ్యపు కీలక పదవిలో వీణారెడ్డి
అగ్రరాజ్యంలో భారత సంతతికి చెందిన మరో వ్యక్తికి కీలక పదవి దక్కింది. ‘అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ’ మిషన్ డైరెక్టర్‌గా వీణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని సంస్థ ట్విటర్ పేజీ ద్వారా అధికారికంగా ప్రకటించింది. కాగా, యూఎస్ఏఐడీ(USAID) మిషన్ డైరెక్టర్‌గా ఎంపికైన తొలి ఇండియన్-అమెరికన్ వ్యక్తి వీణా రెడ్డి కావడం విశేషం. ఈ నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సందూ, వీణకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉంటే ఇంతకాలం ఆమె ఇదే ఏజెన్సీలో ఫారిన్ సర్వీస్ ఆఫీసర్‌గా పని చేశారు. కంబోడియా మిషన్ డైరెక్టర్‌గా 2017 ఆగష్టు నుంచి ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. హైతి భూకంప సమయంలో రక్షణ-అభివృద్ధి చర్యల పర్యవేక్షకురాలిగా ఆమె తన సత్తా చాటారు. Best wishes, Veena @usaid_india . #India - @USAID partnership has the potential to make a difference to the lives of people not only in 🇮🇳 & 🇺🇸, but across the 🌏! https://t.co/t3KAIeblLo — Taranjit Singh Sandhu (@SandhuTaranjitS) July 26, 2021 ఈ పదవుల కంటే ముందు వాషింగ్టన్లో అసిస్టెంట్ జనరల్ కౌన్సెల్‌గా ఆసియా దేశాల సమస్యలపై ప్రభుత్వ న్యాయసలహాదారుగా ఆమె పని చేశారు. ఇక ప్రభుత్వ సర్వీసుల కంటే ముందు న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, లండన్‌లో కార్పొరేట్ కంపెనీలకు అటార్నీగా వ్యవహరించిన అనుభవం ఆమెకు ఉంది. చికాగో నుంచి బీఏ, ఎంఏ, లా కోర్సులు పాసైన వీణారెడ్డి.. కొలంబియా యూనివర్సిటీ నుంచి ‘జురిస్ డాక్టరేట్’(జేడీ) అందుకుంది. న్యూయార్క్, కాలిఫోర్నియా బార్ అసోషియేషన్‌లో వీణకు సభ్యత్వం ఉంది. -
భార్యను పుట్టింటికి పంపి భర్త పరార్
హిమాయత్‌నగర్: ‘కరోనా సమయంలో చిన్నపిల్లలు బయట తిరగకూడదంట. ఫంక్షన్లకు రాకూడదు. బంధువుల ఫంక్షన్ ఉంది నేనూ మీ ఆయన వెళ్తాం. ఒక కొన్ని రోజులు మీ పుట్టింటికి వెళ్లు’ అని వివాహితను అత్త, భర్త నమ్మించారు. తీరా పుట్టింటి నుంచి వివాహిత తిరిగి రాగా ఇంటికి తాళం వేసి ఉంది. చుట్టు పక్కల వారిని విచారించగా చాలా కాలం నుంచి ఇంటికి తాళం వేసి ఉందని వారు సమాధానం చెప్పడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని విక్రమ్‌పురి పార్క్ వద్ద చోటు చేసుకుంది. బాధితురాలి వివరాల ప్రకారం.. ముషీరాబాద్‌కు చెందిన వీణ, నారాయణగూడకు చెందిన మహేందర్ తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి 7 సంవత్సరాల కుమార్తె ఉంది. లాక్డౌన్ ప్రారంభం కాగానే భర్త, అత్త వీణను మార్చి నెలలో పుట్టింటికి పంపారు. కాగా ఆమె ఏప్రిల్ మాసంలో నారాయణ గూడలోని మెట్టింటికి రాగా తాళం వేసి ఉంది. అప్పటి నుంచి భర్త, అత్తలు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. భర్త, అత్తయ్య ఎక్కడ ఉన్నారో తెలియదని ఎన్నిసార్లు ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా సమాధానం ఇవ్వడం లేదని తెలిపింది. నారాయణగూడలోని పక్క వారిని అడిగితే మీ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని చెబుతున్నారని వాపోయింది. ఇంట్లో తనకు సంబంధించిన బంగారం, డబ్బు, ఇతర సామగ్రి ఉన్నాయని తనకు న్యాయం చేయాలని కోరుతూ వీణ ఇంటి ముందు బైఠాయించింది. -
నేను బాగా మందేస్తా, అదేమైనా నేరమా: నటి
'మద్యపానం ఆరోగ్యానికి హానికరం' అనే కొటేషన్ వినీవినీ బోర్ కొట్టేసింది అంటోంది మళయాళీ భామ వీణ నందకుమార్. మద్యపానం హానికరం అన్నారేగాని నేరమని ఎవరూ ఎక్కాడా చెప్పలేదు. ఇక విషయానికొస్తే.. మాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న మలయాళీ భామ వీణ నందకుమార్ తన తాగుడు గురించి బాహాటంగా చెప్పేసింది. తాను ఫుల్లుగా మద్యం సేవిస్తానని అయితే తాగాక మాత్రం ఎవరినీ ఇబ్బంది పెట్టనంటూ వీణ చెప్తోంది. చదవండి: నేను తప్పు చేశా! : రకుల్ అంతేగాక ఈ అలవాటును తనకు తానుగా చేసుకున్నానని చెప్పింది. తాను తాగుతానన్న విషయాన్ని చెప్పడానికి కూడా భయపడబోనని తెలిపింది. అసలు తాగడం నేరమేమీ కాదు కదా అంటూ ప్రశ్నిస్తోంది. బీర్ తాగడం కుర్రాళ్లకు బాగా అలవాటైపోయింది. నేనూ కూడా వాళ్లలాగే.. అందులో తప్పేముందంటోంది. వీణ నందకుమార్ తాజాగా నటించిన చిత్రం 'కెట్టోయ్‌లాన్ ఎంటె మాలఖా' అనే చిత్రం హిట్ కావడంతో మూవీ ఆఫర్లు ఊపందుకున్నాయి. చదవండి: అనుష్క విషయంలో ఇదీ వదంతేనా? -
ఘాతుకం : మామ చేతిలో కోడలి హతం
కర్ణాటక, మండ్య: వివాహేతర సంబంధానికి అంగీకరించలేదనే కారణంగా వ్యక్తి కోడలిని హత్య చేసిన ఘటన ఆదివారం మండ్య తాలూకా రాగిముద్దనహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. హాసన్ జిల్లాకు చెందిన వీణ (26)కు రాగిముద్దనహళ్లి గ్రామానికి చెందిన నాగరాజు కుమారుడు అనిల్‌తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. కాగా రెండేళ్ల క్రితం నాగరాజు భార్య సావిత్రమ్మ మృతి చెందింది. అప్పటినుంచి నాగరాజు ప్రతిరోజూ కోడలు వీణను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. రోజురోజుకు వేధింపులు తీవ్రతరం కావడంతో విషయాన్ని భర్త అనిల్ దృష్టికి తీసుకెళ్లడంతో అనిల్ సైతం తండ్రి నాగరాజును పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ తీరు మార్చుకోని నాగరాజు వీణను లైంగికంగా వేధించసాగాడు. దీంతో భార్య, పిల్లలతో కలసి అనిల్ గ్రామంలోనే వేరుగా ఉండసాగాడు. దీంతో వీణపై అక్కసు పెంచుకున్న నాగరాజు కొడుకు అనిల్ ఇంటికి, దుకాణానికి వస్తూ వీణను మాటలతో చేష్టలతో వేధించసాగాడు . దీనిపై అనిల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జైలుకెళ్లిన నాగరాజు జామీనుపై విడుదలై కోడలిని మరింత వేధించసాగాడు. ఈ క్రమం లో ఆదివారం ఇంటి బయటకు వచ్చిన వీణపై తమ్ముడు మంజు సహకారంతో కత్తితో దాడి చేసిన నాగరాజు గొంతు, కడుపులో పొడిచాడు. వీణ కేకలు విన్న అనిల్, గ్రామస్థులు వెంటనే అక్కడికి వెళ్లగా అప్పటికే వీణ రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతోంది. నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నించగా నాగరాజు, మంజు వెంటనే బైకుపై తప్పించుకున్నారు. వీణను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. మండ్య పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
వాణిగా వచ్చి.. వీణగా మారి..!
అతి చిన్న వీణ మీద సంగీతం పలికించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు శ్రీవాణి. వీణను అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో పలు భారతీయ భాషలలోని పాటలతో పాటు పాశ్చాత్య సంగీతాన్ని సైతం వీణ మీద ఒలికిస్తున్నారు. తాజాగా శ్రీవాణి.. ‘బ్రీత్లెస్’ (శంకర్‌మహదేవన్) సాంగ్‌కు తన వేళ్లతో పునఃప్రతిష్ఠ చెయ్యడం సంచలనం అయింది. ఆమెపై ప్రశంసలు కురిపిస్తోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన వీణ చిట్టిబాబుగారి శిష్యురాలు పిచిక సీతామహాలక్ష్మి గారి దగ్గర.. చిన్నతనంలోనే శ్రీవాణి వీణకు అంకురార్పణ జరిగింది. శ్రీవాణి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా నందంపూడి. ‘‘మా అమ్మగారికి సంగీతం మీద ఉన్న శ్రద్ధ, అభిలాష కారణంగా నాకు వీణ నేర్పించారు. నా అసలు పేరు సత్య వాణి. సరస్వతీ కటాక్షంతో వీణ నేర్చుకున్నాక నా పేరు శ్రీవాణిగా మార్చుకున్నాన’’ని చెప్పారు శ్రీవాణి. వీణలో డిప్లొమా పూర్తి చేశారు శ్రీవాణి. ఆ తరవాత హైదరాబాద్ అబ్బాయి వేణుతో ఆమె వివాహం జరిగింది. స్కూల్లో చదువుకునే రోజుల్లోనే శ్రీవాణి ఆర్ఆర్బీ పరీక్ష రాశారు. రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. రెండు సంవత్సరాలు శిక్షణ పొందాక, ఉద్యోగం మానేసి, సంగీతం మీదే దృష్టి సారించారు. పదహారేళ్ల పాటు టీవీలో యాంకరింగ్ చేసి మానేశారు. అందుకు కారణాలు, అనంతర పరిణామాలు శ్రీవాణి మాటల్లోనే విందాం. ఎప్పుడు ఆపేస్తానా అని చూశారు! ‘ఈ పని నువ్వు చేయలేవు’ అంటే, పట్టుదలతో సాధించడం నా లక్షణం. 2014లో రెండు మూడు సంఘటనలు నా జీవితంలో నేను నిర్ణయాలు తీసుకునేలా చేశాయి. ఒక గెట్‌టుగెదర్‌లో అందరూ రకరకాల యాక్టివిటీస్ చేశాక, నేను వీణ వాయిస్తుంటే, అందరూ ‘ఎప్పుడు ఆపేస్తానా’ అన్నట్లు చూశారు. అది నా మనసుకి బాధ కలిగించింది. ఒకసారి ఒక చోట వీణ కచేరీ చేసి, చేతితో వీణ పట్టుకుని ఇంటికి వస్తుంటే, డిగ్రీ చదువుతున్న ఒక అబ్బాయి ‘ఇది గిటారేనా’ అని అడిగాడు. తెలుగునాట వీణ కనుమరుగైపోతుందేమో అనిపించింది. అమెరికాలో ఉండే మా మేనల్లుడు... లెర్నింగ్ స్టేజ్‌లో ఉన్న ఒక అమ్మాయి వాయించిన పాటను నాకు పంపి, ‘నువ్వు కూడా ఇలా వాయించాలి’ అన్నాడు. నాకు కోపం వచ్చింది. ఈ మూడు సంఘటనలు నాకు నిద్ర లేకుండా చేశాయి. ఎలాగైనా ఏదో ఒకటి సాధించాలనే పట్టుదలను పెంచాయి. కొత్త జీవితం ప్రారంభం మొట్టమొదటగా దళపతి చిత్రంలోని ‘సింగారాల... ’ పాటను వీణ మీద వాయించి, అప్లోడ్ చేసిన రెండు రోజులకే లక్షలలో వ్యూస్ వచ్చేశాయి. ఆ ఉత్సాహంతో చంద్రముఖి చిత్రంలోని ‘వారాయ్.. ’, ‘కత్తుల బల్లెము చేతబట్టి..’ అనే పెద్దపులి జానపద పాట వాయించి అప్లోడ్ చేశాను. పెద్దపులి పాట బాగా సెన్సేషన్ అయ్యింది. లక్షలలో వ్యూస్ వస్తుండటంతో తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిషు, మలయాళం.. అన్ని భాషలలోని పాపులర్ పాటలను అభిమానుల కోరిక మీద వాయించడం ప్రారంభించాను. ప్రపంచ రికార్డు కినాకు అనే వీణ తయారీదారుడు చిన్న వీణ చేసి ఇచ్చి, దాని మీద వాయించమని కోరారు. సాధన ప్రారంభించాను. వీణను శృతి చేసేటప్పుడు చేతి వేళ్లు బొబ్బలెక్కాయి. పావు గంట వాయించేటప్పటికి ముక్కోటి దేవతలు కనిపించారు. మహాగణపతిం, తందనానా (సెమీ క్లాసికల్), మాయదారి మైసమ్మ (మాస్)... వంటివి వాయించి ప్రపంచ రికార్డు సాధించాను. ఇటీవలే శంకర్ మహదేవన్ గాత్రంలో ప్రసిద్ధి చెందిన ‘బ్రెత్లెస్’ను వీణ మీద పలికించి ప్రశంసలు అందుకున్నాను. నేనేమీ విద్వాంసురాలిని కాను, చాలా చిన్న కళాకారిణిని, వీణ అంతరించిపోకూడదనే లక్ష్యంతోనే ఈ కొత్త పొంతలోనే ముందుకు వెళ్తున్నాను. పెద్ద విద్వాంసుల ముందు నేను అణుమాత్రురాలిని మాత్రమే’’ అని అన్నారు శ్రీవాణి. అంతా మంచే జరిగింది జీ బంగ్లా వారు చూపిన ఆదరణ నేటికీ మరచిపోలేను. నేను రెండోసారి ‘జీ’కి వెళ్లినప్పుడు ఆనందంగా అనిపించింది. సుకుమార్ గారి కోరిక మేరకు ‘రంగస్థలం’ చిత్రంలోని పాట వాయించాను. రామ్‌చరణ్ నా పాటలు షేర్ చేస్తున్నారు. అమెరికన్ వెబ్ సైట్ల వాళ్లు, నేను వాయించిన టైటానిక్ మ్యూజిక్‌ని విని నన్ను ‘క్వీన్ ఆఫ్ ద ఈస్ట్’ అన్నారు. నా స్థాయికి నా పేరు ఖండాంతరాలు దాటడం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. కొన్ని కొన్ని సినిమాలకు పనిచేశాను. మణిశర్మ, ఆర్పి పట్నాయక్‌లకు ఆర్సెస్ట్రాలో వాయించాను. ప్రపంచ ప్రఖ్యాత ఘట వాద్య కళాకారుడు విక్కువినాయక్రామ్ చేతుల మీదుగా వీణ లెజెండ్ పురస్కారం అందుకున్నాను. ఈ మాత్రమైనా సాధించానంటే మా వారు వేణు అందిస్తున్న సహకారమే. మాకు ఒక పాప. పుష్కరిణి. – శ్రీవాణి, వీణ కళాకారిణి, హైదరాబాద్ – సంభాషణ: వైజయంతి పురాణపండ -
సస్పెన్స్ థ్రిల్లర్: కాంగ్రెస్ నాయకురాలు అరెస్టు!
సినిమా కథను మరిపించే సస్పెన్స్ థ్రిల్లర్ చోరీ గాథ ఇది. ఓ బడా రాజకీయ నాయకుడు లక్ష రెండు లక్షలు కాదు, ఏకంగా రూ.3 కోట్ల క్యాష్‌ను తెలిసినవారింట్లో ఉంచాడు. ఆ ఇంటికి వచ్చిపోయే ఓ మహిళకు నగదు విషయం తెలిసింది. కొద్దిరోజులకే నగదుకు కాళ్లు వచ్చాయి. బాధితులు ఫిర్యాదు చేయడంతో ఆ మహిళ పోలీసుల అతిథిగా మారింది. అయితే ఆమె మామూలు వనిత కాదు, బెంగళూరులో కాంగ్రెస్ నాయకురాలు, సంఘ సేవకురాలుగా పేరున్న స్త్రీ కావడం విశేషం. బనశంకరి: రూ. 3 కోట్ల చోరీ ఆరోపణలపై మహిళా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కె.టి. వీణను బుధవారం బెంగళూరు సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె సమీప బంధువులే ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీణాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. చోరీకి గురైన నగదు తాజా శాసనసభ ఎన్నికల్లో గదగ్ నుంచి పోటీ చేసిన అనిల్ మెణసినకాయకు చెందినదని తెలిసింది. అనిల్ మెణసినకాయ తమ వద్ద ఉన్న రూ.3 కోట్ల నగదును పరిచయస్తుల ఇంట్లో ఉంచాలని స్నేహితుడు హరిప్రసాద్‌కు సూచించాడు. సోదరి ఇంట్లో నగదు దీంతో హరిప్రసాద్ బెంగళూరు రాజాజీనగరలో ఉన్న తన సహోదరి సరోజా ఇంట్లో ఆ రూ.3 కోట్ల నగదును దాచిపెట్టాడు. ఈ సమయంలో సరోజా ఇంటికి ఆమె బంధువైన కేటీ.వీణా రెండుసార్లు వచ్చివెళ్లారు. సరోజా మాటల మధ్యలో ఇంట్లో ఉన్న నగదు సంగతిని కేటీ.వీణాకు తెలిపింది. శాసనసభ ఎన్నికల ఫలితాలు మే 15 తేదీన విడుదలైన రోజున సరోజా ఇంటికి తాళం వేసుకుని బంధువులను చూడడానికి వెళ్లింది. ఈ సమయంలో కేటీ.వీణా, నటరాజ్, బాబు అనే వ్యక్తులను సరోజా ఇంటికి పంపించి నగదు చోరీకీ పాల్పడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వీణాపై అనుమానం వ్యక్తం చేస్తూ సరోజా ఇటీవల రాజాజీనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేశారు. బుధవారం సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు కేటీ.వీణా ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
మోగిన బొబ్బిలి వీణ!
బొబ్బిలి విజయనగరం : అంతర్జాతీయంగా పేరు గాంచిన బొబ్బిలి వీణల ధరలు పెరిగాయి. ఈ నెల నుంచే పెరిగిన ధరలు అమలు చేయాలని హస్త కళల అభివృద్ధి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ హస్త కళల అభివృద్ధి సంస్థ కార్యాలయం ద్వారా బొబ్బిలి వీణల కేంద్రం ఇన్చార్జికి ఉత్తర్వులు అందాయి. పెరిగిన ధరలు తక్షణం అమలు లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బొబ్బిలిలో కొన్నేళ్లుగా వీణల తయారీ కేంద్రం ఉంది. ఇక్కడ సుమారు 20 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. ఈ కేంద్రంలో ప్రొఫెషనల్ వీణలతో పాటు గిఫ్ట్ వీణలు తయారు చేస్తారు. ఇక్కడి నుంచి గిఫ్ట్ వీణలు దేశంలోని పలు ప్రాంతాలతో పాటు అమెరికా వరకూ ఆర్డర్‌పై సప్లై చేస్తుంటారు. బొబ్బిలి వీణల బహుమతి అంటే దానిని స్టేటస్‌గా భావిస్తారు. తంజావూరు కంటే మిన్నగా.. తమిళనాడులోని తంజావూరులో వీణలు తయారయినా ఇక్కడి ఆకృతులు అందరినీ ఆకర్షించేలా ఉంటాయి. కార్మికుల పనితనం, వివిధ రకాల ఆకృతులతో రూపొందించిన ఇక్కడి గిఫ్ట్ వీణలు అమెరికా మాజీ అద్యక్షుడు బిల్ క్లింటన్ తదితరుల మనసుల్ని సైతం దోచాయి. అధికారికంగా కూడా ఈ రాష్ట్రానికి వచ్చే అతిథులకు బొబ్బిలి వీణలు అందజేయడం ఓ ఆనవాయితీలా మారింది. ప్రస్తుతం ఈ వీణల ధరలు రూ.900 నుంచి రూ.4వేల వరకూ లభిస్తున్నాయి. ఏటా పలు రకాల వీణలను ఇక్కడి నుంచి ఆర్డరుపై లేపాక్షి, హస్తకళల అభివృద్ధి కేంద్రం నిర్వహించే స్టాళ్లకు ఆర్డర్‌పై విక్రయిస్తుంటారు. కార్మికులసౌకర్యార్థం.. గతంలో ఇక్కడి కార్మికులు తయారు చేసే వీణలను చూసి నేరుగా వారి వద్దే సందర్శకులు కొనుగోలు చేసే అవకాశం ఉండేది. అయితే కార్మికులు తయారు చేసిన వీణలు కొనుగోలు చేసేందుకు వచ్చే వారిపై ఆధారపడి ఉండేది. కొందరి ఉత్పత్తులు పూర్తిగా అమ్ముడైతే కొందరు వేచి చూడాల్సి వచ్చేది. కొన్ని రోజుల పాటు కొనుగోలు చేయక కార్మికులకు చేతికి సొమ్మందేది కాదు. ఈ నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం హస్త కళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వీటిని నేరుగా కొనుగోలు చేసి ఏ రోజుకారోజు కార్మికులకు చెల్లించేలా హాండీ క్రాఫ్టŠస్ సంస్థ ఏర్పాట్లు చేసింది. ఇక్కడ అచ్యుత నారాయణను ఇన్చార్జిగా నియమించింది. దీనివల్ల వీణల కేంద్రంలో ఇప్పుడు ఉత్పత్తి దారులకు వెంటనే చేతికి సొమ్మందుతోంది. ప్రకటించిన ధరల 15 శాతం అదనం ప్రస్తుతం హస్తకళల సంస్థ ప్రతిపాదించిన ధరలపై 15శాతం అదనంగా తయారీ ఖర్చులుంటాయి. ధరలు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులు ఏపీహెచ్డీసీఎల్ వైస్‌చైర్మన్, ఎండీలనుంచి వెలువడ్డాయి. ఈ నెల 6న విడుదలైన కొత్త ధరలు వెంటనే అమలులోకి వచ్చాయి. – అచ్యుతనారాయణ, ఇన్చార్జి -
వాడుకగా వేడుకకు
ఒకసారి పేరొచ్చేస్తే ఇక అదెక్కడికీ పోదు. ఆ పేరున్న చోటికే అందరూ వచ్చేస్తారు. వీణా నాగ్దాకు బాలీవుడ్ పెళ్లిళ్ల ‘మెహందీవాలా’ అనే పేరు వచ్చేసింది. ఎవరింట్లో పెళ్లి జరిగినా, పెళ్లికూతురు చేతులపై పండేది వీణ పెట్టిన గోరింటాకే. నిన్న సోనం పెళ్లి జరిగింది కదా! ఆమె చేతులకు మొన్న ‘మెహందీ ఫంక్షన్’లో గోరింటాకు పెట్టింది కూడా వీణమ్మే! గుండెల్ని మీటేలా గోరింటాకు పెట్టడంలో ఆమె ఎక్స్పర్ట్. సోనమ్ పెళ్లి మాట అటుంచండి, సోనమ్ చిన్నప్పట్నుంచి కూడా ఆమెకు మెహందీ దిద్దుతోంది ఈ మెహందీ క్వీనే. శిల్పాశెట్టి, ఆసిన్ కూడా తమ పెళ్లికి వీణ దగ్గరే గోరింటాకు పెట్టించుకున్నారు. ఏటా ‘కర్వాచాత్’కి శ్రీదేవి తప్పనిసరిగా వీణను పిలిపించుకుని తన అరిచేతుల్ని పండించుకునేవారు. పెళ్లిళ్లకే కాదు, పెద్ద పెద్ద ఈవెంట్లకు పెద్దవాళ్లు ఎవరు పిలిచినా వెళ్లి గోరింటాకు పెడుతుంటారు వీణ. సీనియర్ క్రికెటర్ వెంగ్‌సర్కార్ కూతురు పెళ్లికీ, కరిష్మా కపూర్ మెహిందీ ఫంక్షన్‌కీ, దీపికా పదుకోన్ చేతులకు ఈవిడే మెహందీని డిజైన్ చేశారు. ఇదంతా వింటున్నప్పుడు.. నిజానికి పండింది వీణ పంటే అనిపిస్తే ఆశ్చర్యం ఏమీ లేదు. పెద్దవాళ్ల చేతుల్ని అలంకరించే అవకాశం రావడం మాటలా మరి! అరిచేతులపై అదృష్టరేఖలు వీణా నాగ్దా ముప్పై ఏళ్లుగా గోరింటాకు పెడుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా గోరింటాకు పెట్టగల మెహందీ డిజైనర్‌గా ఆమె పేరున ఒక రికార్డు కూడా ఉంది! అంతే కాదు, ఓ నమ్మకం కూడా ఉంది. వీణ గోరింటాకు పెడితే అదృష్టం కలిసి వస్తుందని! అందుకే లిజ్ హర్లీ నుంచి కాజోల్ వరకు, కరిష్మ దగ్గర్నుంచి సోనమ్ వరకు ఆమె ముందు చెయ్యి చాపారు. ఆమెకు మెహందీ క్వీన్ అని పేరు పెట్టిందెవరో తెలుసా? కరణ్ జోహార్! వీణ ముంబైలోని ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టారు. టెన్త్ వరకే చదివారు. ఆర్థికంగా బాగోలేక కాదు. చదువంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేక! ఆ తర్వాత మెల్లిగా మెహందీ డిజైనర్ అయిపోయారు. బ్రైడల్, నెయిల్ పాలిష్, షేడెడ్, హీరా–మోటీ, జర్దోసీ, అరబిక్, బ్లాక్ మెహందీ, స్టోన్/సీక్వెన్స్/స్వీరోస్కీ డైమండ్ మెహిందీలు పెట్టడంలో వీణ స్పెషలిస్ట్. ఈ కళలో అప్డేట్ అవడం కోసం ఆమె విదేశాల్లో కూడా తిరిగొచ్చారు. బాలీవుడ్ బ్లాక్బస్టర్లు ఖుషీ కభీ ఘమ్, కల్ హో న హో, మేరే యార్ కీ షాదీ హై, గాడ్ తుస్సీ గ్రేట్ హో, యు మి ఔర్ హమ్, పాటియాలా హౌస్, ఏ జవానీ హై దివానీలలో కనిపించే మెహందీ వర్క్ అంతా వీణదే. ఇక వాడుకగా ఈమెతో మెహందీ పెట్టించుకునే వాళ్ల లిస్టు కాస్త పెద్దదే. డింపుల్ కపాడియా, మాధురీ దీక్షిత్, రేఖ, ట్వింకిల్ ఖన్నా, శ్వేతాబచ్చన్, రాణీ ముఖర్జీ, ఫరా ఖాన్, నేహా దుపియా, ప్రీతీ జింతా, నీతా అంబానీ, ప్రఫుల్ పటేల్ కూతురు అంజలీ పటేల్.. ఆ జాబితాలోని కొందరు సెలబ్రిటీలు.