వీణ శ్రీవాణి.. ఈ పేరు సోషల్ మీడియాలో సెన్సేషన్.. వీణపై స్వరాలు పలికిస్తూ ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆమె టాలెంట్‌కు లక్షల్లో అభిమానులు ఉన్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినిమా పాటలతో పాటు భక్తి గీతాలను తన వీణతో వాయించటం శ్రీవాణి ప్రత్యేకత. ఎప్పుడూ వీణతో పాటు కనిపించే ఆమె అసలు పేరు సత్యవాణి. పెళ్లయ్యాక శ్రీవాణిగా మారింది. అభిమానులు మాత్రం వీణ శ్రీవాణిగా మార్చేశారు. తాజాగా ప్రభాస్ కోసం శ్రీవాణి ఒక కానుక పంపి డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు.
తాజాగా వీణ శ్రీవాణి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో వారు పండించిన సీతాఫలాలు చూపిస్తూ.. అవన్నీ మన డార్లింగ్ ప్రభాస్‌కు పంపుతున్నట్లు చెప్పారు. తాము పండించే సీతాఫలాలు ప్రతి సంవత్సరం కోంతమందికి పంపుతామని చెప్పుకొచ్చిన ఆమె ఈ క్రమంలో ఓ స్పెషల్ వ్యక్తికి ఆ ఫలాలను పంపిస్తే ఆయన దగ్గర నుంచి ప్రభాస్ వద్దకు చేరాయని ఇలా చెప్పుకొచ్చారు. 'ప్రభాస్ గారికి నేను పంపిన సీతాఫలాలు బాగా నచ్చడంతో ఇంకొన్ని సీతాఫలాలు కావాలని కోరారు. పాన్ ఇండియా రేంజ్ స్టార్ అయిన ప్రభాస్ అడిగితే పంపించకుండా ఎవరైనా ఉండగలరా..? అందుకే ఈ బాస్కెట్‌లో ఉన్న సీతాఫలాలన్నీ ప్రభాస్ గారి కోసం పంపిస్తున్నా. ఈ ఫలాలతో పాటు నా గుర్తుగా ఆయన కోసం హ్యాండ్ మేడ్ బ్యాగ్‌ను కూడా పంపిస్తున్నాను. ఈ ఏడాదికి ఇదే చివరి పంట. మళ్లీ వచ్చే సీజన్‌లో ప్రభాస్ కోసం మరోసారి సీతాఫలాలు పంపుతాను.' అని తెలిపారు.
వీణ శ్రీవాణిగా ఆమె ఎంత పాపులరో తన భర్త ప్రముఖ జ్యోతిష్యులు అయిన వేణుస్వామి కూడా అంతే పాపులర్. వాస్తవంగా వేణుస్వామి కంటే ముందే వీణ శ్రీవాణికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. టాలీవుడ్ హీరోల పాటలను తన వీణతో ప్రత్యేకంగా హమ్ చేస్తూ వినిపించేది. అలా అందరి హీరోల అభిమానులు ఆమెను అభినందిస్తారు. పలువురి సెలబ్రిటీల జ్యోతిష్యాలు చెబుతూ వేణుస్వామి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో చాలామంది ప్రముఖలకు సంబంధించిన జ్యోతిష్య వివరాలను సోషల్ మీడియా వేదికగా ఆయన చెప్పారు.
వాటిలో ఎక్కువ శాతం ఆయన చెప్పిన విధంగానే జరగడంతో వేణుస్వామిపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. ఒక్కోసారి భారీగా ట్రోల్స్ కూడా ఎదురు కావడం జరిగింది. అయినా వాటిని ఆయన ఏ మాత్రం లెక్కచేయరు. ఈ క్రమంలోనే ఒకసారి ప్రభాస్ గురించి మాట్లాడుతూ డార్లింగ్ సినిమాలకు కొంత కాలం పాటు పెద్దగా కలెక్షన్స్ రావని చెప్పడంతో.. వేణుస్వామిపై ప్రభాస్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఆయన సతీమణి డార్లింగ్ ప్రభాస్ కోసం సీతాఫలాలు పంపడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment